ట్రినిడాడ్ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో సౌతాఫ్రికా స్టార్ పేసర్ కగిసో రబాడ నిప్పులు చేరిగాడు. తొలి ఇన్నింగ్స్‌లో 18 ఓవర్లు బౌలింగ్ చేసిన రబాడ.. మూడు కీలక వికెట్లు పడగొట్టి విండీస్‌ను దెబ్బ తీశాడు.
అతడితో పాటు మహారాజ్ 4 వికెట్ల పడగొట్టడంతో ఆతిథ్య కరేబియన్ జట్టు మొదటి ఇన్నింగ్స్‌లో 233 పరుగులకే కుప్పకూలింది. దీంతో ప్రోటీస్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 124 పరుగుల ఆధిక్యం లభించింది. విండీస్ బ్యాటర్లలో కీసీ కార్తీ(42) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అంతకుముందు దక్షిణాఫ్రికా తమ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 357 పరుగులకు ఆలౌటైంది.
రబాడ అరుదైన ఘనత..
ఇక ఈ మ్యాచ్‌లో కగిసో రబాడ అరుదైన ఘనత సాధించాడు. టెస్టుల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన ఆరో సఫారీ బౌలర్‌గా రబడ రికార్డులకెక్కాడు. విండీస్ బ్యాటర్ కావెం హాడ్జ్‌ను ఔట్ చేసిన రబాడ.. ఈ అరుదైన ఫీట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.
ఇప్పటివరకు 63 టెస్టులు ఆడిన రబాడ 294 వికెట్లు పడగొట్టాడు. ఇంతకుముందు ఈ రికార్డు ప్రోటీస్ క్రికెట్ దిగ్గజం జాక్వెస్ కల్లిస్ (291) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో కల్లిస్‌ను రబాడ అధిగమించాడు. ఇక ఈ జాబితాలో దక్షిణాఫ్రికా పేస్ గన్ డేల్ స్టెయిన్ 439 వికెట్లతో అగ్రస్ధానంలో ఉన్నాడు. ఆ తర్వాతి స్ధానాల్లో షాన్ పొలాక్(421), ఎన్తిని(390) ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment