స్మిత్‌తో రబడ వాగ్వాదం
సాక్షి, స్పోర్ట్స్ : ఆస్ట్రేలియా-దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో ఆటగాళ్ల మధ్య స్లెడ్జింగ్ తారస్థాయికి చేరింది. తొలి టెస్టులో వార్నర్, డికాక్‌ల మధ్య వాగ్వాదం చోటుచేసుకోగా రెండో టెస్టులో కగిసో రబడా-స్మిత్ మధ్య గొడవ చోటుచేసుకుంది. ప్రస్తుతం ఈ గొడవకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.
దీంతో రబడపై రెండు మ్యాచ్‌ల నిషేదం పడే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే గతంలో అతిగా ప్రవర్తించడంతో రబడాకు 5 డీమెరిట్ పాయింట్స్ వచ్చాయి. మరో మూడు పాయింట్లు చేరితో ఖచ్చితంగా రెండు మ్యాచ్‌ల నిషేదం ఎదుర్కోనున్నాడు.
అసలేం జరిగిందంటే..
రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా కెప్టెన్ స్మిత్(25) రబడ వేసిన 51.6వ బంతికి ఎల్బీడబ్ల్యూగా అవుటయ్యాడు. అయితే సహనం కోల్పోయిన రబడా స్మిత్‌కు ఎదురుగా వెళ్తూ భుజంతో డీకోట్టి పెవిలియన్ వైపు వెళ్లూ అంటూ సూచించాడు. ఇది వివాదానికి దారి తీసింది. ఈ ఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని మ్యాచ్ రిఫరీ ప్రకటించాడు. అయితే ఈ మ్యాచ్‌లో రబడ ఐదు వికెట్లతో చెలరేగి ఆసీస్ పతనాన్ని శాసించాడు. రబడపై నిషేదం విదిస్తే దక్షిణాఫ్రికాకు గట్టి ఎదురదెబ్బ తగలనుంది.
తొలి టెస్టులో క్రీడాస్పూర్తికి విరుద్దంగా ప్రవర్తించిన వార్నర్, నాథన్ లియోన్‌లకు మ్యాచ్ ఫీజులో కోత విధించారు. డ్రెస్సింగ్ రూంకు వెళ్తుండగా డికాక్‌తో గొడవ పెట్టుకున్న వార్నర్‌కు 75 శాతం మ్యాచ్ ఫీజు కోతతో పాటు మూడు డీమెరిట్ పాయింట్స్ విధించారు. డివిలియర్స్ రనౌట్ అనంతరం అతనిపైకి బాల్ విసిరిన లియోన్‌కు 15 శాతం ఫీజుకోత విధించారు. ఇక ఆటగాళ్ల ప్రవర్తనపై మాజీ ఆటగాళ్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇది క్రీడాస్పూర్తికి విరుద్దమని అభిప్రాయపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment