కగిసో రబడ
సాక్షి, స్పోర్ట్స్ : దక్షిణాఫ్రికా పేసర్ కగిసో రబడ రఫ్పాడించాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో ఏకంగా 6 వికెట్లతో ఆసీస్ పతనాన్ని శాసించాడు. తొలి ఇన్నింగ్స్‌ల్లోనే 5 వికెట్లతో అదరగొట్టిన రబడ.. తాజా ప్రదర్శనతో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఒక టెస్టు మ్యాచ్‌లో ఎక్కువ సార్లు 10 వికెట్లు పడగొట్టిన మూడో సఫారీ బౌలర్‌గా రికార్డు నమోదు చేశాడు. ఇప్పటి వరకు రబడ నాలుగు సార్లు ఈ ఘనతను సాధించిగా స్టెయిన్(5), ఎన్తినీ(4)లు తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. కేవలం 28 టెస్టుల్లోనే రబడ ఈ ఘనతను సాధించడం విశేషం.
రబడ బంతితో రఫ్పాడించడంతో పర్యాటక జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 239 పరుగులకే కుప్పకూలింది. దీంతో దక్షిణాఫ్రికాకు 101 పరుగుల స్వల్ప లక్ష్యం నమోదైంది. ఇక 180/5 ఓవర్‌నైట్ స్కోర్‌తో నాలుగోరోజు ఆటను ప్రారంభించిన ఆసీస్ మరో 59 పరుగులకే మిగిలిన ఐదు వికెట్లు కోల్పోయింది. ఇక సఫారీ తొలి ఇన్నింగ్స్‌లో డివిలియర్స్ సెంచరీతో రాణించడంతో ఆతిథ్య జట్టుకు 139 పరుగుల ఆధిక్యం లభించిన విషయం తెలిసిందే. 101 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగి దక్షిణాఫ్రికా లంచ్ సమయానికి ఓ వికెట్ కోల్పోయి 22 పరుగులు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment