
స్వదేశంలో బంగ్లాదేశ్‌తో జరిగే టెస్టు సిరీస్‌కు దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును ప్రకటించింది. అయితే ఐపీఎల్ 15వ సీజన్ కారణంగా రబడా, మార్క్రామ్, రాస్సీ వాన్ డెర్ డస్సెన్ వంటి స్టార్ స్టార్ ఆటగాళ్లు దూరమయ్యారు. దీంతో యువ ఆటగాడు ఖయా జోండో దక్షిణాఫ్రికా తరుపున టెస్టులో అరంగేట్రం చేయనున్నాడు.
దక్షిణాఫ్రికా తరపున ఆరు వన్డేలు ఆడిన జోండో.. 146 పరుగులు సాధించాడు. అయితే దక్షిణాఫ్రికా ప్రకటించిన జట్టులో కెప్టెన్ ఎల్గర్, బావుమా, కేశవ్ మహారాజ్ తప్ప సీనియర్ ఆటగాళ్లు ఎవరూ లేరు. మార్చి 31 నుంచి డర్బన్ వేదికగా దక్షిణాఫ్రికా- బంగ్లాదేశ్ తొలి టెస్టు ప్రారంభం కానుంది. అదే విధంగా మార్చి 26 నుంచి ఐపీఎల్-2022 ప్రారంభం కానుంది.
దక్షిణాఫ్రికా జట్టు: డీన్ ఎల్గర్ (కెప్టెన్), టెంబా బావుమా, డారిన్ డుపావిల్లోన్, సరెల్ ఎర్వీ, సైమన్ హార్మర్, కేశవ్ మహరాజ్, వియాన్ ముల్డర్, డువాన్ ఒలివర్, కీగన్ పీటర్‌సన్, ర్యాన్ రికెల్టన్, లూథో సిపమ్లా, గ్లెంటన్ స్టౌర్‌మాన్, కైల్ వెర్రెయిన్స్, లిజాడ్ విలియొండోమ్స్.
Comments
Please login to add a commentAdd a comment