Dean Elgar
-
విరాట్ కోహ్లి నాపై ఉమ్మేశాడు.. రెండేళ్ల తర్వాత: సౌతాఫ్రికా మాజీ కెప్టెన్
టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లిని ఉద్దేశించి దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ డీన్ ఎల్గర్ ఓ పోడ్కాస్ట్లో సంచలన వ్యాఖ్యలు చేశాడు. తన మొదటి భారత పర్యటనలో విరాట్ కోహ్లి తనపై ఉమ్మివేసాడని ఎల్గర్ ఆరోపించాడు. ఆ సంఘటన జరిగిన రెండు ఏళ్ల తర్వాత కోహ్లి తనకు క్షమాపణలు చెప్పాడని ఎల్గర్ తెలిపాడు. కాగా ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌కు విడ్కోలు పలికిన ఎల్గర్.. 2015 తొలిసారి టెస్టు క్రికెట్ ఆడేందుకు భారత పర్యటనకు వచ్చాడు. సరిగ్గా అదే సమయంలో విరాట్ కోహ్లి టీమిండియా ఫుల్‌టైమ్ టెస్టు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు. "అది భారత్‌లో నా తొలి పర్యటన. మొదటి టెస్టులో నేను బ్యాటింగ్‌కు వచ్చాను. విరాట్ కోహ్లిని ప్రత్యక్షంగా చూడటం కూడా అదే తొలి సారి. అక్కడ పిచ్‌ను చూస్తే నాకు నవ్వు వచ్చింది. ఆ వికెట్‌పై ఆడటం నాకు పెద్ద సవాలుగా మారింది. టర్నింగ్ వికెట్‌పై అశ్విన్, జడేజాను ఎదుర్కొవడం కష్టంగా మారింది. అంతేకాకుండా వారిద్దరూ నన్ను స్లెడ్జ్ చేయడం మొదలు పెట్టారు. ఈ సమయంలో కోహ్లి నాపై ఉమ్మివేశాడు. వెంటనే నా బాషలో ఓ అసభ్య పదజాలం వాడి బ్యాట్‌తో కొడతానని అన్నాను. నేను మాట్లాడిన బాష కోహ్లి అర్ధమైంది అనుకునున్నాను. ఎందుకంటే అప్పటికే అతడు ఐపీఎల్లో ఏబీ డివిలియర్స్‌తో కలిసి ఆర్సీబీ తరపున ఆడుతున్నాడు. నేను బూతు పదం వాడిన తర్వాత కోహ్లి కూడా అదే పదాన్ని వాడి నన్ను తిట్టడం మొదలు పెట్టాడు. అతడు అరుస్తునే ఉంటాడని పట్టించుకోవడం మానేసాను. ఎందుకంటే మేము భారత్‌లో ఉన్నాము కాబట్టి వెనక్కి తగ్గాలని నిర్ణయించుకున్నాను. ఈ సంఘటన గురించి తెలుసుకున్న తర్వాత ఎబి డివిలియర్స్ సైతం కోహ్లిని ప్రశ్నించాడు. అనంతరం రేండేళ్ల తర్వాత భారత జట్టు దక్షిణాఫ్రికా పర్యటనకు వచ్చినప్పుడు కోహ్లి నాకు ఫోన్ చేశాడు. ఈ సిరీస్ ముగిసిన తర్వాత మనిద్దరం కలిసి డ్రింక్ చేద్దామా? నేను ప్రవర్తించిన తీరు పట్ల క్షమాపణలు చెప్పాలనుకుంటున్నానని అన్నాడు. నేను అందుకు అంగీకరించాను. ఆ సిరీస్ అయిపోగానే ఇద్దరం పార్టీ చేసుకున్నాం. వేకువజామున 3 గంటల వరకు మేమిద్దరం డ్రింక్ చేస్తునే ఉన్నామని'బాంటర్ విత్ బాయ్స్' అనే ఈ పోడ్ కాస్ట్లో ఎల్గర్ పేర్కొన్నాడు. -
చరిత్రకెక్కిన విజయంతో సఫారీ టూర్ ముగింపు
తగ్గేదేలే... సినిమా డైలాగ్‌లా ఉంది సఫారీలో భారత పర్యటన తీరు! తొలి టెస్టును ఆతిథ్య జట్టు మూడు రోజుల్లోనే ముగిస్తే... రెండో టెస్టును టీమిండియా రెండు రోజుల్లోనే ఖతం చేసింది. మొదటి మ్యాచ్ ముగియగానే అందరూ ‘భారత్ సొంతగడ్డపై పులి... విదేశాల్లో పిల్లి’ అని నిట్టూర్చారు. ఇప్పుడదే విమర్శకులు ‘ఔరా’ అని విస్తుపోయేలా మన పేస్ పేట్రేగిపోయింది. అచ్చిరాని కేప్‌టౌన్‌లో కేక పెట్టింది. క్రీజులోకి దిగిన బ్యాటర్ల గుండెల్లో గుబులు రేపింది. ఇన్నేళ్లుగా ఏ వేదికపై గెలవలేకపోయామో అక్కడే చరిత్రకెక్కే గెలుపుతో భారత్ మళ్లీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. కేప్‌టౌన్: క్రికెట్‌నే శ్వాసించే భారత అభిమానులకు ఈ కొత్త సంవత్సరం కిక్ ఇచ్చే గిఫ్ట్‌ను టీమిండియా ఇచ్చింది. ఆఖరి రెండో టెస్టులో 7 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాను చిత్తు చేసింది. మొత్తం సఫారీ పర్యటనలో మూడు ఫార్మాట్ల సిరీస్‌ను సాధికారంగా ముగించింది. గత డిసెంబర్లో టి20 సిరీస్‌తో ఈ పర్యటన మొదలైంది. టి20 సిరీస్‌ను 1–1తో సమం చేసుకున్న టీమిండియా... వన్డే సిరీస్‌ను 2–1తో కైవసం చేసుకుంది. తాజాగా టెస్టు సిరీస్‌ను 1–1తో సమంగా ముగించింది. తద్వారా ఏ ఒక్క సిరీస్‌లోనూ తగ్గలేదు సరికదా... పైపెచ్చు వన్డేలతో ఒకమెట్టుపైనే నిలిచింది. అలా మొదలై... ఇలా కుదేలైంది! తొలిరోజే 23 వికెట్లతో ఆసక్తికర పేస్ డ్రామాకు తెరలేపిన మ్యాచ్... రెండో రోజు అదే పేస్ పదునుకు తెరపడేలా చేసింది. ఓవర్‌నైట్ స్కోరు 62/3తో గురువారం రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన దక్షిణాఫ్రికా 36.5 ఓవర్లలో 176 పరుగులకే కుప్పకూలింది. ఇంత తక్కువ జట్టు స్కోరులోనూ మార్క్రమ్ (103 బంతుల్లో 106; 17 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీ హైలైట్ కాగా... తొలి ఇన్నింగ్స్‌ను సిరాజ్ కూల్చితే... రెండో ఇన్నింగ్స్‌లో ఆ పని బుమ్రా (6/61) చేశాడు. 98 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం వల్ల భారత్ లక్ష్యం 79 పరుగులతో మరింత చిన్నదైంది. దీన్ని టీమిండియా 12 ఓవర్లలోనే మూడు వికెట్లు కోల్పోయి 80 పరుగులతో చకచకా ఛేదించింది. ఒకడి పోరాటం... మరొకడి పేస్ ప్రతాపం టెస్టుల్లో ఆటంటే ఐదు రోజులు. నాలుగు ఇన్నింగ్స్‌లు... 15 సెషన్లు... 450 ఓవర్లు... 40 వికెట్లు... అంటే అందదూ (బ్యాటింగ్) డబుల్ యాక్షన్ చేయాల్సిందే! అన్ని రోజులు శ్రమించినా... ప్రతి సెషన్లోనూ చెమటోడ్చినా చాలా టెస్టుల్లో (డ్రాలతో) ఫలితమే రాదు! కేప్‌టౌన్‌లో మాత్రం పేస్ పదునుకు, భారత్ పట్టుదలకు ఒక వంతు (ఐదు సెషన్లలోపే)లోనే, రెండు రోజులు పూర్తవకముందే భారత్ జయభేరి మోగించింది. తొలి సెషన్లో దక్షిణాఫ్రికా ఓవర్‌నైట్ బ్యాటర్ మార్క్రమ్ వన్డేను తలపించే ఆటతీరుతో చకచకా పరుగులు సాధించాడు. మరోవైపు బుమ్రా... బెడింగ్హమ్ (11), కైల్ వెరిన్ (9)లను పడగొట్టడంలో సఫలమయ్యాడు. దీని వల్ల జట్టు స్కోరు వంద పరుగుల్లోపే సగం (85/5) వికెట్లను కోల్పోగా, మార్క్రమ్ ఫిఫ్టీ కూడా పూర్తయ్యింది. పిచ్ సంగతి, బుమ్రా పేస్ నిప్పులు వెంటనే అర్థమైపోవడంతో మార్క్రమ్ ధనాధన్ బౌండరీలతో సెంచరీ సాధించాడు. కానీ ఈలోపే బుమ్రా కూడా జాన్సెన్ (11), కేశవ్ మహరాజ్ (3) వికెట్లను చేజిక్కించుకున్నాడు. మార్క్రమ్ పోరాటానికి సిరాజ్ బౌలింగ్‌లో చుక్కెదురవగా... మిగతా టెయిలెండర్లు లంచ్‌లోపే అవుటయ్యారు. ఇక రెండో సెషన్లో లక్ష్యఛేదనకు దిగిన భారత్ రెండో ఇన్నింగ్స్‌లో క్రీజులోకి దిగిన వారంతా వేగంగా బ్యాటింగ్ చేశారు. యశస్వి జైస్వాల్ (23 బంతుల్లో 28; 6 ఫోర్లు), గిల్ (11 బంతుల్లో 10; 2 ఫోర్లు), కోహ్లి (11 బంతుల్లో 12; 2 ఫోర్లు) అవుట్‌కాగా, కెపె్టన్ రోహిత్ (16 నాటౌట్; 2 ఫోర్లు), శ్రేయస్ అయ్యర్ (4 నాటౌట్; 1 ఫోర్) అజేయంగా ముగించారు. సిరాజ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ మ్యాచ్’ అవార్డు లభించగా... ‘ప్లేయర్ అఫ్ ద సిరీస్’ పురస్కారాన్ని ఎల్గర్, బుమ్రా సంయుక్తంగా గెల్చుకున్నారు. స్కోరు వివరాలు దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్: 55 ఆలౌట్; భారత్ తొలి ఇన్నింగ్స్: 153 ఆలౌట్; దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్: మార్క్రమ్ (సి) రోహిత్ శర్మ (బి) సిరాజ్ 106; ఎల్గర్ (సి) కోహ్లి (బి) ముకేశ్ 12; జోర్జి (సి) రాహుల్ (బి) ముకేశ్ 1; స్టబ్స్ (సి) రాహుల్ (బి) బుమ్రా 1; బెడింగమ్ (సి) రాహుల్ (బి) బుమ్రా 11; వెరిన్ (సి) సిరాజ్ (బి) బుమ్రా 9; జాన్సెన్ (సి అండ్ బి) బుమ్రా 11; కేశవ్ మహరాజ్ (సి) అయ్యర్ (బి) బుమ్రా 3; రబడ (సి) రోహిత్ శర్మ (బి) ప్రసిధ్ కృష్ణ 2; బర్గర్ (నాటౌట్) 6; ఎన్గిడి (సి) యశస్వి (బి) బుమ్రా 8; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (36.5 ఓవర్లలో ఆలౌట్) 176. వికెట్ల పతనం: 1–37, 2–41, 3–45, 4–66, 5–85, 6–103, 7–111, 8–162, 9–162, 10–176. బౌలింగ్: బుమ్రా 13.5–0–61–6, సిరాజ్ 9–3–31–1, ముకేశ్ కుమార్ 10–2–56–2, ప్రసిధ్ కృష్ణ 4–1–27–1. భారత్ రెండో ఇన్నింగ్స్: యశస్వి జైస్వాల్ (సి) స్టబ్స్ (బి) బర్గర్ 28; రోహిత్ శర్మ (నాటౌట్) 16; శుబ్‌మన్ గిల్ (బి) రబడ 10; కోహ్లి (సి) వెరిన్ (బి) జాన్సెన్ 12; శ్రేయస్ అయ్యర్ (నాటౌట్) 4; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (12 ఓవర్లలో మూడు వికెట్లకు) 80. వికెట్ల పతనం: 1–44, 2–57, 3–75. బౌలింగ్: రబడ 6–0–33–1, బర్గర్ 4–0–29–1, జాన్సెన్ 2–0–15–1. -
IND VS SA 2nd Test: అలా జరగడం దురదృష్టకరం: రోహిత్ శర్మ
కేప్‌టౌన్‌లో జరిగిన రెండో టెస్ట్‌లో టీమిండియా.. సౌతాఫ్రికాను 7 వికెట్ల తేడాతో చిత్తు చేసి రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో సమం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా.. సిరాజ్ (6/15) విశ్వరూపం ప్రదర్శించడంతో 55 పరుగులకే (తొలి ఇన్నింగ్స్‌లో) కుప్పకూలింది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్.. ఓ దశలో భారీ స్కోర్ చేసేలా కనిపించినప్పటికీ, సఫారీ పేసర్లు ఒక్కసారిగా విరుచుకుపడటంతో 153 పరుగులకే పరిమితమైంది. టీమిండియా తమ చివరి ఆరు వికెట్లు ఒకే స్కోర్ వద్ద కోల్పోయి భారీ స్కోర్ చేయలేకపోవడమే కాకుండా ఓ అనవసరమైన చెత్త రికార్డును మూటగట్టుకుంది. ఆ తర్వాత సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌతాఫ్రికాను మార్క్రమ్ (106) చిరస్మరణీయ శతకంతో ఆదుకునే ప్రయత్నం చేశాడు. అయితే ఈసారి బుమ్రా (6/60) సఫారీలను దెబ్బకొట్టాడు. ఫలితంగా ఆ జట్టు 176 పరుగులకే పరిమితమై, టీమిండియా ముందు 79 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని మాత్రమే ఉంచగలిగింది. ఈ లక్ష్యాన్ని భారత్ ఆడుతూపాడుతూ ఛేదించి, సిరీస్ కోల్పోయే ప్రమాదం నుంచి తప్పించుకుంది. మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ ఇలా అన్నాడు. ఇదో గొప్ప విజయం. తొలి టెస్ట్‌లో చేసిన తప్పిదాల నుంచి గుణపాఠం నేర్చుకున్నాం. మా బౌలర్లు అద్బుతంగా రాణించారు. ముందుగా అనుకున్న ప్రణాళిక ప్రకారం ఆడాం. ఫలితం సాధించాం. బ్యాటర్లు కూడా తమవంతు ప్రయత్నం చేశారు. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించడం మా విజయావకాశాలను మెరుగుపర్చింది. తొలి ఇన్నింగ్స్‌లో ఒకే స్కోర్ వద్ద చివరి ఆరు వికెట్లు కోల్పోవడం దురదృష్టకరం. సిరాజ్ గురించి మాట్లాడుతూ.. ఆ స్పెల్ చాలా ప్రత్యేకం. ఎప్పుడోకాని ఇలాంటివి చూడలేము. బుమ్రా కూడా అద్బుతంగా బౌలింగ్ చేశాడు. సాధారణంగా బౌలింగ్ చేయాలని అనుకున్నాం. మిగతా పని పిచ్ చూసుకుంటుందని ఊహించాం. అదే జరిగింది. క్రెడిట్ మొత్తం పేసర్లకే దక్కుతుంది. సౌతాఫ్రికాకు ఎప్పుడు వచ్చినా పరిస్థితులు ఛాలెంజింగ్‌గా ఉంటాయి. ఇక్కడ గత నాలుగైదు సంవత్సరాల్లో మేము అత్యుత్తమ విజిటింగ్ జట్టుగా మారాం. ఇక్కడే కాదు ఓవర్సీస్ మొత్తంలో గత కొద్దికాలంగా మేము చాలా మెరుగయ్యాం. సిరీస్ గెలుచుంటే బాగుండేది. సౌతాఫ్రికా అత్యుత్తమ జట్టు. వారు మాకెప్పుడూ ఛాలెంజే. అందుకే మేము ఇక్కడ సిరీస్ (టెస్ట్) గెలవలేకపోతున్నాం. ఎల్గర్ గురించి మాట్లాడుతూ.. క్రికెట్ సౌతాఫ్రికాకు చాలా ముఖ్యమైన ఆటగాడు. కెరీర్ ఆధ్యాంతం జట్టు ఉన్నతికి తోడ్పడ్డాడు. ఇలా కొద్దిమంది మాత్రమే ఉంటారు. ఈ మ్యాచ్‌లో ఎల్గర్‌ను త్వరగా ఔట్ చేయడం గురించి ముందే మాట్లాడుకున్నాం. ఎల్గర్ ఇలాంటి కెరీర్ కలిగి ఉండటం అభినందనీయం. ప్రతిసారీ ఇలాంటి ఆటగాడిని చూడలేము. అద్భుతమైన కెరీర్. అతని భవిష్యత్తుకు శుభాకాంక్షలు అంటూ హిట్‌మ్యాన్ ముగించాడు. -
అదే మా కొంపముంచింది.. మార్క్రమ్ బ్యాటింగ్ తీరు అత్యద్భుతం: సౌతాఫ్రికా కెప్టెన్
కేప్‌టౌన్ వేదికగా టీమిండియాతో జరిగిన రెండో టెస్ట్‌లో సౌతాఫ్రికా 7 వికెట్ల తేడాతో చిత్తైన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఇరు జట్ల పేసర్లు అద్భుతంగా బౌలింగ్ చేసినప్పటికీ.. అంతిమంగా భారత పేసర్లదే పైచేయిగా నిలిచింది. సిరాజ్ (6/15) విశ్వరూపం ప్రదర్శించడంతో తొలి ఇన్నింగ్స్‌లో 55 పరుగులకే కుప్పకూలిన సౌతాఫ్రికా.. ఆతర్వాత భారత్‌ను 153 పరుగులకే పరిమితం చేసి తిరిగి మ్యాచ్‌లోకి వచ్చింది. అనంతరం మార్క్రమ్ కఠినమైన పిచ్‌పై నమ్మశక్యంకాని రీతిలో బ్యాటింగ్ విన్యాసాలు ప్రదర్శించి టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే మరపురాని ఇన్నింగ్స్ (106) ఆడాడు. మార్క్రమ్ రెచ్చిపోతుండటంతో ఓ సమయంలో సౌతాఫ్రికా మ్యాచ్‌పై పట్టు సాధించేలా కనిపించింది. అయితే బుమ్రా (6/60) మరో ఎండ్‌లో ఎవరినీ కుదురుకోనీయకపోవడంతో సౌతాఫ్రికా సెకెండ్ ఇన్నింగ్స్‌కు 176 పరుగుల వద్ద తెర పడింది. ఫలితంగా దక్షిణాఫ్రికా టీమిండియా ముందు స్వల్ప లక్ష్యాన్ని (79) ఉంచింది. ఈ లక్ష్యాన్ని భారత్ ఆడుతూపాడుతూ ఛేదించి, రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో సమంగా ముగించింది. కెరీర్లో చివరి టెస్ట్ ఆడుతున్న దక్షిణాఫ్రికా తాత్కాలిక కెప్టెన్ డీన్ ఎల్గర్ మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ ఇలా అన్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో చావుదెబ్బ (55 పరుగులకు ఆలౌట్) తినడం మా విజయావకాశాలను దెబ్బతీసింది. మార్క్రమ్ చిరస్మరణీయ శతకంతో తిరిగి మమ్మల్ని మ్యాచ్‌లోకి తెచ్చాడు. భారత పేసర్లు పరిస్థితులను సద్వినియోగం చేసుకుని అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఈ ఓటమిని జీర్జించుకోవడం కాస్త కఠినమే. 2-0 తేడాతో సిరీస్‌ను గెలిచుంటే బాగుండేది. అయినా పర్లేదు. గెలుపు కోసం మా వంతు పోరాటం చేశాం. మా కుర్రాళ్ల ప్రదర్శన పట్ల గర్వంగా ఉంది. సిరీస్ ఆధ్యాంతం పేసర్లు బౌలింగ్ చేసిన తీరు.. ఈ మ్యాచ్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో మార్క్రమ్ బ్యాటింగ్ చేసిన తీరు అత్యద్భుతం. ఈ పిచ్‌పై ఫలితం అందరి ఊహలకు విరుద్దంగా వచ్చింది. దురదృష్టవశాత్తూ మేమే బాధితులమయ్యాము. ఈ ఫలితం ఓ గుణపాఠం లాంటిది. టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకోవడంపై స్పందిస్తూ.. రోహిత్ శర్మ సైతం అదే పని చేసేవాడు. అంతిమంగా చూస్తే తొలి రోజు తొలి సెషనే మా కొంపముంచిందని ఎల్గర్ అన్నాడు. -
భారత్-సౌతాఫ్రికా రెండో టెస్ట్ విశేషాలు, రికార్డులు..
కేప్‌టౌన్ వేదికగా భారత్-సౌతాఫ్రికా జట్ల మధ్య జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్ పలు రికార్డులకు వేదికైంది. ఈ మ్యాచ్‌లో భారత్.. 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో సమం చేసుకుంది. దీనికి ముందు సెంచూరియన్ వేదికగా జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో సౌతాఫ్రికా ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. కేప్‌టౌన్ టెస్ట్ రికార్డులు.. 2024లో తొలి టెస్ట్ కేవలం ఒకటిన్నర రోజుల్లో ముగిసింది (నాలుగున్నర సెషన్లు) భారత్.. సౌతాఫ్రికాను కేప్‌టౌన్‌లో తొలిసారి ఓడించింది కేప్‌టౌన్‌లో టెస్ట్ మ్యాచ్ గెలిచిన తొలి ఏషియన్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ రికార్డు కేప్‌టౌన్‌లో టెస్ట్ మ్యాచ్ గెలిచిన తొలి ఏషియన్ జట్టుగా భారత్ రికార్డు ధోని తర్వాత సౌతాఫ్రికా గడ్డపై టెస్ట్ సిరీస్‌ను డ్రా చేసుకున్న రెండో కెప్టెన్‌గా హిట్‌మ్యాన్ రికార్డు అంతర్జాతీయ క్రికెట్లోకి రీఎంట్రీ తర్వాత టెస్ట్‌ల్లో సౌతాఫ్రికా అత్యల్ప స్కోర్ (55, తొలి ఇన్నింగ్స్) టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఓ జట్టు (భారత్) పరుగులేమీ (153 పరుగుల వద్ద) చేయకుండా తమ చివరి ఆరు వికెట్లు కోల్పోవడం ఇదే తొలిసారి. 2024లో తొలి సెంచరీ చేసిన ఆటగాడిగా మార్క్రమ్ రికార్డు టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా (బంతుల పరంగా) ముగిసిన టెస్ట్ మ్యాచ్ (642 బంతుల్లో) టెస్టు క్రికెట్ చరిత్రలోనే తొలి రోజు అత్యధిక వికెట్లు (23) పడిన రెండో మ్యాచ్‌గా రికార్డు. మ్యాచ్ విశేషాలు.. సిరాజ్ చెలరేగడంతో (6/15) తొలి ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికా 55 పరుగులకే కుప్పకూలింది ఒకే స్కోర్ వద్ద (153, తొలి ఇన్నింగ్స్) టీమిండియా చివరి ఆరు వికెట్లు కోల్పోయింది. కెరీర్లో తొమ్మిదో ఐదు వికెట్ల ప్రదర్శనతో (6/61) సౌతాఫ్రికా నడ్డివిరిచిన బుమ్రా సౌతాఫ్రికా తరఫున టెస్ట్‌ల్లో అత్యంత వేగవంతమైన ఆరో సెంచరీ (99 బంతుల్లో) చేసిన మార్క్రమ్ సౌతాఫ్రికా తరఫున ఓ పూర్తయిన టెస్ట్ ఇన్నింగ్స్‌లో అత్యధిక శాతం (60.22) పరుగులు చేసిన ఆటగాడిగా మార్క్రమ్ రికార్డు సౌతాఫ్రికా తాత్కలిక కెప్టెన్ డీన్ ఎల్గర్ టెస్ట్ కెరీర్ ముగిసింది ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్-సిరాజ్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్- డీన్ ఎల్గర్, బుమ్రా స్కోర్ వివరాలు.. సౌతాఫ్రికా- 55 (వెర్రిన్ 15, సిరాజ్ 6/15), 176 (మార్క్రమ్ 106, బుమ్రా 6/61) భారత్- 153 (కోహ్లి 46, ఎంగిడి 3/30), 80/3 (జైస్వాల్ 28, జన్సెన్ 1/15) 7 వికెట్ల తేడాతో భారత్ విజయం -
చరిత్ర తిరగరాసిన భారత్-సౌతాఫ్రికా రెండో టెస్ట్ మ్యాచ్
కేప్‌టౌన్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్ పలు రికార్డులను కొల్లగొట్టింది. కేవలం ఒకటిన్నర రోజుల్లోనే (నాలుగున్నర సెషన్లు) ముగిసిన ఈ మ్యాచ్.. టెస్ట్ క్రికెట్ చరిత్రలో బంతుల పరంగా అత్యంత వేగంగా ముగిసిన మ్యాచ్‌గా రికార్డు సృష్టించింది. ఈ మ్యాచ్ కేవలం 642 బంతుల్లోనే ముగియగా.. గత రికార్డు 656 బంతులుగా ఉండింది. 1932లో ఆస్ట్రేలియా-సౌతాఫ్రికా మధ్య మెల్బోర్న్లో జరిగిన మ్యాచ్ ఈ మ్యాచ్‌కు ముందు వరకు టెస్ట్‌ల్లో బంతుల పరంగా అత్యంత వేగంగా ముగిసిన మ్యాచ్‌గా ఉండింది. ఈ జాబితాలో వెస్టిండీస్-ఇంగ్లండ్ మధ్య 1935లో జరిగిన మ్యాచ్ మూడో స్థానంలో (672 బంతుల్లో) ఉండగా.. ఇంగ్లండ్-ఆస్ట్రేలియా మధ్య 1888లో జరిగిన మ్యాచ్ నాలుగో స్థానంలో (788), ఇంగ్లండ్-ఆస్ట్రేలియా మధ్య 1888లో జరిగిన మ్యాచ్ (లార్డ్స్) ఐదో స్థానంలో (792) ఉన్నాయి. ఇదిలా ఉంటే, కేప్‌టౌన్ టెస్ట్‌లో పేసర్లు విజృంభించడంతో టీమిండియా చారిత్రక విజయం సాధించింది. 79 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత్ 3 వికెట్లు కోల్పోయి ఛేదించి, 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఫలితంగా రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ 1-1తో సమంగా ముగిసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా.. సిరాజ్ (9-3-15-6) విజృంభణ ధాటికి తొలి ఇన్నింగ్స్‌లో 55 పరుగులకు కుప్పకూలగా... భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 153 పరుగులకు పరిమితమైంది. అనంతరం బుమ్రా (6/61) చెలరేగడంతో సౌతాఫ్రికా సెకెండ్ ఇన్నింగ్స్‌లో 176 పరుగులకు ఆలౌటై, భారత్ ముందు 79 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది. ఈ టార్గెట్‌ను భారత్ ఆడుతూ పాడుతూ ఛేదించింది. -
చెలరేగిన పేసర్లు.. సౌతాఫ్రికాపై టీమిండియా చారిత్రక విజయం
South Africa Vs India 2nd Test 2024 Day 2 Updates- కేప్‌టౌన్: చెలరేగిన పేసర్లు.. సౌతాఫ్రికాపై టీమిండియా చారిత్రక విజయం కేప్‌టౌన్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన రెండో టెస్ట్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో పేసర్లు విజృంభించడంతో టీమిండియా చారిత్రక విజయం సాధించింది. 79 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత్ 3 వికెట్లు కోల్పోయి ఛేదించి, 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఫలితంగా రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ 1-1తో సమంగా ముగిసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా.. సిరాజ్ (9-3-15-6) విజృంభణ ధాటికి తొలి ఇన్నింగ్స్‌లో 55 పరుగులకు కుప్పకూలగా... భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 153 పరుగులకు పరిమితమైంది. అనంతరం బుమ్రా (6/61) చెలరేగడంతో సౌతాఫ్రికా సెకెండ్ ఇన్నింగ్స్‌లో 176 పరుగులకు ఆలౌటై, భారత్ ముందు 79 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది. ఈ టార్గెట్‌ను భారత్ ఆడుతూ పాడుతూ ఛేదించింది. స్కోర్ వివరాలు.. సౌతాఫ్రికా- 55 (వెర్రిన్ 15, సిరాజ్ 6/15), 176 (మార్క్రమ్ 106, బుమ్రా 6/61) భారత్- 153 (కోహ్లి 46, ఎంగిడి 3/30), 80/3 (జైస్వాల్ 28, జన్సెన్ 1/15) 7 వికెట్ల తేడాతో భారత్ విజయం మూడో వికెట్ కోల్పోయిన టీమిండియా.. కోహ్లి ఔట్ 75 పరుగుల వద్ద టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. జన్సెన్ బౌలింగ్‌లో కోహ్లి (12) ఔటయ్యాడు. భారత్ లక్ష్యానికి ఇంకా నాలుగు పరుగుల దూరంలో ఉంది. రెండో వికెట్ కోల్పోయిన టీమిండియా.. గిల్ ఔట్ 57 పరుగుల వద్ద టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. రబాడ బౌలింగ్‌లో శుభ్‌మన్ గిల్ (10) ఔటయ్యాడు. భారత్ గెలుపుకు ఇంకా 22 పరుగుల దూరంలో ఉంది. తొలి వికెట్ కోల్పోయిన భారత్.. జైస్వాల్ ఔట్ 44 పరుగుల వద్ద టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. బర్గర్ బౌలింగ్‌లో జైస్వాల్ (28) ఔటయ్యాడు.భారత్.. దక్షిణాఫ్రికా గడ్డపై చారిత్రక గెలుపుకు ఇంకా 35 పరుగుల దూరంలో ఉంది. దూకుడుగా ఆడుతున్న జైస్వాల్.. లక్ష్యంగా దిశగా దూసుకుపోతున్న టీమిండియా 79 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో టీమిండియా దూకుడుగా ఆడుతుంది. ముఖ్యంగా యశస్వి జైస్వాల్ టీ20 తరహాలో విరుచుకుపడుతున్నాడు. అతను కేవలం 21 బంతుల్లో 5 ఫోర్ల సాయంతో 24 పరుగులు చేశాడు. రోహిత్ 6 పరుగులతో అతని జతగా క్రీజ్‌లో ఉన్నాడు. 5 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 35/0గా ఉంది. 176 పరుగులకు ఆలౌటైన సౌతాఫ్రికా.. టీమిండియా టార్గెట్ ఎంతంటే..? సౌతాఫ్రికా సెకెండ్ ఇన్నింగ్స్ 176 పరుగుల వద్ద ముగిసింది. మార్క్రమ్ అద్భుతమైన సెంచరీ సాధించిన అనంతరం సౌతాఫ్రికా వెంటవెంటనే వికెట్లు కోల్పోయి ఆలౌటైంది. ఆఖరి వికెట్ (ఎంగిడి (8)) కూడా బుమ్రాకే దక్కింది. దీంతో బుమ్రా ఖాతాలో ఆరు వికెట్లు చేరాయి. తొలి ఇన్నింగ్స్‌లో రెండు, ఈ ఇన్నింగ్స్‌లో ఆరు కలుపుకుని బుమ్రా ఖాతాలో మొత్తంగా ఎనిమిది వికెట్లు పడ్డాయి. బుమ్రాతో పాటు ముకేశ్ 2, సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ తలో వికెట్ దక్కించుకున్నారు. టీమిండియా టార్గెట్ 79 పరుగులుగా ఉంది. మ్యాచ్‌కు లంచ్ విరామం ప్రకటించారు. భారత పేసర్ల విజృంభణ.. తొమ్మిదో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా 32.1: ప్రసిద్ కృష్ణ బౌలింగ్‌లో రోహిత్‌కు క్యాచ్ ఇచ్చి తొమ్మిదో వికెట్‌గా వెనుదిరిగిన రబడ(2) ఎనిమిదో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా 31.4: సిరాజ్ బౌలింగ్‌లో సెంచరీ హీరో మార్క్రమ్ అవుట్ సెంచరీ పూర్తి చేసిన మార్క్రమ్.. 60 పరుగుల ఆధిక్యంలో సౌతాఫ్రికా ఓపెనర్‌గా బరిలోకి దిగిన మార్క్రమ్ అత్యంత కఠినమైన పిచ్‌పై అద్బుత సెంచరీతో (99 బంతుల్లో 102 నాటౌట్; 16 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగాడు. టెస్ట్‌ల్లో సౌతాఫ్రికా తరఫున ఇది ఆరో వేగవంతమైన సెంచరీ కూడా కావడం విశేషం. ఐదేసిన బుమ్రా.. పట్టుబిగించిన టీమిండియా 3 వికెట్ల నష్టానికి 62 పరుగుల స్కోర్ వద్ద రెండో రోజు ఆటను ప్రారంభించిన సౌతాఫ్రికా.. బుమ్రా ధాటికి తొలి సెషన్లోనే మరో 4 వికెట్లు కోల్పోయింది. మొత్తంగా బుమ్రా ఈ ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లతో (5/59) చెలరేగడంతో సౌతాఫ్రికా 30 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. ప్రస్తుతం ఆ జట్టు 60 పరుగుల ఆధిక్యంలో ఉంది. మార్క్రమ్ (102 నాటౌట్) అద్భుత శతకంతో ఒంటరిపోరాటం చేస్తున్నాడు. అతనికి జతగా రబాడ (2) క్రీజ్‌లో ఉన్నాడు. భారత బౌలర్లలో ముకేశ్ కుమార్ 2 వికెట్లు పడగొట్టాడు. సౌతాఫ్రికా వర్సెస్ ఇండియా రెండో టెస్టు తుదిజట్లు సౌతాఫ్రికా డీన్ ఎల్గర్ (కెప్టెన్), ఐడెన్ మార్క్రమ్, టోనీ డి జోర్జీ, ట్రిస్టన్ స్టబ్స్, డేవిడ్ బెడింగ్హామ్, కైల్ వెర్రెన్నె(వికెట్ కీపర్), మార్కో జాన్సెన్, కేశవ్ మహారాజ్, కగిసో రబాడ, నండ్రే బర్గర్, లుంగి ఎంగిడి. టీమిండియా రోహిత్ శర్మ(కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ, ముకేష్ కుమార్. -
ఇటువంటి పిచ్‌ను నా కెరీర్లో చూడలేదు: సౌతాఫ్రికా కెప్టెన్
కేప్‌టౌన్ వేదికగా భారత్-దక్షిణాఫ్రికా మధ్య ప్రారంభమైన రెండో టెస్టు మొదటి రోజు వికెట్ల వర్షం కురిసింది. ఇరు జట్ల పేసర్ల చెలరేగడంతో ఏకంగా మొదటి రోజు 23 వికెట్లు నేలకూలాయి. మొదటి ఇన్నింగ్స్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా కేవలం 55 పరుగులకే కుప్పకూలగా.. అనంతరం టీమిండియా కూడా 153 పరుగులకే చాపచుట్టేసింది. భారత బౌలర్లలో పేసర్ మహ్మద్ సిరాజ్ 6 వికెట్లతో విజృంభించాడు. సఫారీ బౌలర్లలో బర్గర్, రబాడ, ఎంగిడీ తలా మూడు వికెట్లు పడగొట్టారు. ఇక కెరీర్లో చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్న డీన్ ఎల్గర్.. ఈ టెస్టు రెండు ఇన్నింగ్స్‌లలోనూ దారుణంగా విఫలమయ్యాడు. తొలి టెస్టులో సెంచరీతో చెలరేగిన ఎల్గర్ రెండో టెస్టులో మాత్రం 4 పరుగులు మాత్రమే చేశాడు. ఇక తొలి రోజు ఆట అనంతరం స్టార్‌స్పోర్ట్స్‌తో మాట్లాడిన ఎల్గర్ కేప్‌టౌన్ పిచ్ పరిస్థితి గురించి వివరించాడు. సెషన్ కొనసాగుతన్నకొద్దీ వికెట్ పరిస్థితి మారిపోయిందని ఎల్గర్ చెప్పుకొచ్చాడు. "సాధారణంగా న్యూలాండ్స్ పిచ్ కొంచెం స్లోగా ఉంటుంది. బ్యాటర్ కాస్త సమయం వెచ్చిస్తే క్రీజులో నిలదొక్కకోవచ్చు. అందుకే తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాను. కానీ ఈ మ్యాచ్‌లో సెషన్ కొనసాగుతున్న కొద్దీ బంతి గతిలో మార్పు కన్పించింది. అంతేకాకుండా బౌన్స్ కూడా చాలా ఎక్కవైంది. దీంతో బ్యాటర్లు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొన్నాను. అయితే పిచ్‌ను దగ్గరనుంచి చూస్తే బాగానే ఉన్నట్లు అన్పిస్తోంది. గతంలో ఎప్పుడూ ఈ వేదికలో ఇలా జరగలేదు. డొమాస్టిక్ క్రికెట్లో కూడా ఇప్పటివరకు ఇంత చెత్త గణాంకాలు నమోదు కాలేదు. ఇటువంటి పిచ్‌ను ఇప్పటివరకు నా కెరీర్లో చూడలేదు" స్టార్ స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎల్గర్ పేర్కొన్నాడు. కాగా తొలి రోజు ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 62 పరుగులు చేసింది. చదవండి: Ind Vs SA: రెండో టెస్టులో విజయం భారత్‌దే.. ఎందుకంటే?: టీమిండియా దిగ్గజం -
చివరి మ్యాచ్ ఆడిన ఎల్గర్..
-
Ind Vs SA: ‘రెండో టెస్టులో టీమిండియాదే విజయం.. ఎందుకంటే?’
Ind Vs SA 2nd Test: సౌతాఫ్రికాతో రెండో టెస్టులో టీమిండియా కచ్చితంగా విజయం సాధిస్తుందని భారత క్రికెట్ దిగ్గజం సునిల్ గావస్కర్ ధీమా వ్యక్తం చేశాడు. తొలి రోజే ప్రొటిస్ జట్టు కీలక వికెట్లు కోల్పోయింది కాబట్టి భారత్ గెలుపు సాధ్యమవుతుందని పేర్కొన్నాడు. టీమిండియా పేసర్లు మరోసారి విజృంభించి సౌతాఫ్రికాను తక్కువ స్కోరుకే కట్టడి చేసి శుభారంభం అందిస్తే.. బ్యాటర్లు విజయ లాంఛనం పూర్తి చేయగలరని గావస్కర్ అంచనా వేశాడు. కాగా సెంచూరియన్ వేదికగా బాక్సింగ్ డే టెస్టులో ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో ఘోర పరాజయం చవిచూసిన రోహిత్ సేన.. రెండో మ్యాచ్‌లో గెలిచి ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది. సఫారీ గడ్డపై తొలిసారి సిరీస్ గెలిచే అవకాశాన్ని ఆదిలోనే చేజార్చుకున్న టీమిండియా.. కేప్‌టౌన్‌లో గెలిచి కనీసం డ్రా చేసుకోవాలనే పట్టుదలతో ఉంది. ఇందులో భాగంగా బుధవారం మొదలైన టెస్టులో టాస్ ఓడి తొలుత బౌలింగ్ చేసిన భారత్.. అనూహ్య రీతిలో సౌతాఫ్రికాను 55 పరుగులకే ఆలౌట్ చేసింది. 36 పరుగుల ఆధిక్యంలో టీమిండియా ఆ తర్వాత 153 పరుగుల వద్ద తమ తొలి ఇన్నింగ్స్ ముగించింది. అనంతరం మళ్లీ బౌలింగ్ చేసిన టీమిండియాకు మూడు వికెట్లు దక్కాయి. డీన్ ఎల్గర్ రూపంలో కీలక బ్యాటర్‌ను అవుట్ చేయగలిగింది. ఈ క్రమంలో తొలి రోజు ఆట ముగిసే సరికి సౌతాఫ్రికా 17 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 62 పరుగులు చేయగా.. టీమిండియాకు 36 పరుగుల ఆధిక్యం దక్కింది. రోహిత్ సేనదే విజయం.. ఎందుకంటే ఈ నేపథ్యంలో సునిల్ గావస్కర్ స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ.. ‘‘ఇప్పటికే సౌతాఫ్రికా మూడు వికెట్లు కోల్పోయింది. భారత్ ఇంకా ఆధిక్యంలోనే కొనసాగుతోంది. కాబట్టి మ్యాచ్ టీమిండియా చేజారిపోతుందని నేను అనుకోవడం లేదు. సౌతాఫ్రికా బ్యాటింగ్ ఆర్డర్లో మిగిలిన ఆటగాళ్లంతా కలిసి 150- 200 పరుగులు చేయడం మాత్రం కష్టమే. కాబట్టి భారత్‌కు విజయావకాశాలు ఎక్కువే. ఇన్నింగ్స్ తేడాతో విజయం దక్కకపోయినా.. మెరుగైన స్థితిలోనే ఉంటుంది’’ అని అభిప్రాయపడ్డాడు. చదవండి: Ind vs SA: అస్సలు ఊహించలేదు.. వాళ్లిద్దరి సహకారం వల్లే సాధ్యమైంది: ‘సిక్సర్’ సిరాజ్ -
చివరి మ్యాచ్ ఆడిన ఎల్గర్.. అభిమానుల మనసు గెలుచుకున్న కోహ్లి!
కేప్‌టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి క్రీడాస్పూర్తిని చాటుకున్నాడు. తన చర్యతో అభిమానుల మనసును గెలుచుకున్నాడు. తన కెరీర్లో చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్న దక్షిణాఫ్రికా స్టాండింగ్ కెప్టెన్ డీన్ ఎల్గర్‌కు కోహ్లి ఘనమైన విడ్కోలు పలికాడు. ఏం జరిగిందంటే..? ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించేందుకు చివరిసారిగా ఎల్గర్ మైదానంలో అడుగుపెట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 4 పరుగులు మాత్రమే చేసిన ఎల్గర్.. రెండో ఇన్నింగ్స్‌లో కూడా కేవలం 12 పరుగులే చేశాడు. సెకెండ్ ఇన్నింగ్స్ 11 ఓవర్ వేసిన ముఖేష్ కుమార్ బౌలింగ్‌లో రెండో బంతిని ఎల్గర్ డిఫెన్స్ ఆడటానికి ప్రయత్నించాడు. అయితే బంతి ఎడ్జ్‌తీసుకుని ఫస్ట్ స్లిప్ దిశగా వెళ్లింది. అక్కడ వున్న విరాట్ కోహ్లి ఈజీగా క్యాచ్‌ను అందుకున్నాడు. క్యాచ్‌ను పట్టిన వెంటనే కోహ్లి ఎటువంటి సెలబ్రేషన్స్ జరపుకోకుండా పరిగెత్తుకుంటూ ఎల్గర్ వద్దకు వెళ్లి అతడని అలింగనం చేసకున్నాడు. అంతేకాకుండా స్టాండింగ్ ఓవేషన్ ఇవ్వాలని డ్రెస్సింగ్ రూమ్‌తో ప్రేక్షకులకు సూచించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కోహ్లి చేసిన పనికి నెటిజన్లు ఫిదా అయిపోయారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలి రోజే ఏకంగా 23 వికెట్లు నేలకూలాయి. దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 55 పరుగులకే కుప్పకూలగా.. టీమిండియా 153 పరుగులకు ఆలౌటైంది. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా తమ రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 62 పరుగులు చేసింది. చదవండి: Ind vs SA: అస్సలు ఊహించలేదు.. వాళ్లిద్దరి సహకారం వల్లే సాధ్యమైంది: ‘సిక్సర్’ సిరాజ్ #MukeshKumar's nibbler gets #DeanElgar on his final test! Will #TeamIndia keep racking up wickets before the day's play? Tune in to #SAvIND 2nd Test LIVE NOW | Star Sports Network#Cricket pic.twitter.com/qftk1SpI8D — Star Sports (@StarSportsIndia) January 3, 2024 -
Ind Vs SA 2nd Test: సిరాజ్ 6తో మొదలై 23తో ముగిసె...
ఒకే రోజు 23 వికెట్లు... ఎన్ని మలుపులు... ఎన్ని అనూహ్యాలు... భారత్ టాస్ ఓడగానే వెనుకబడిపోయినట్లు అనిపించింది...కానీ మొహమ్మద్ సిరాజ్ అద్భుత బౌలింగ్ ఆటను మార్చేసింది...అతని పదునైన అవుట్స్వింగర్లను తట్టుకోలేక దక్షిణాఫ్రికా కుప్పకూలింది... పునరాగమనం తర్వాత అతి తక్కువ స్కోరుకు ఆలౌటైంది...అనంతరం భారత్ వేగంగా పరుగులు సాధించి ముందంజ వేసింది...ఆధిక్యం దాదాపు వందకు చేరింది... కానీ ఇంతలో మరో అడ్డంకి ...ఒక్క పరుగు చేయకుండా చివరి 6 వికెట్లు చేజార్చుకొని టీమిండియా కాస్త డీలాపడింది. కానీ రెండో ఇన్నింగ్స్‌లో మళ్లీ మన బౌలింగ్ చెలరేగి ప్రత్యర్థిని ఆత్మరక్షణలోకి నెట్టింది. మొత్తంగా చూస్తే మొదటి రోజు మనదే పైచేయి కాగా...రెండో రోజు సఫారీలను కట్టడి చేస్తే టెస్టు భారత్ ఖాతాలో చేరినట్లే! కేప్‌టౌన్: భారత్, దక్షిణాఫ్రికా రెండో టెస్టు తొలి రోజు ఆట ఆసక్తికర మలుపులతో సాగి టెస్టు క్రికెట్ మజాను పంచింది. బుధవారం టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా తమ తొలి ఇన్నింగ్స్‌లో 23.2 ఓవర్లలో 55 పరుగులకే కుప్పకూలింది. ఇద్దరు మాత్రమే రెండంకెల స్కోరు చేయగలిగారు. మొహమ్మద్ సిరాజ్ (6/15) తన అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేశాడు. అనంతరం భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 34.5 ఓవర్లలో 153 పరుగులకే ఆలౌటైంది. కోహ్లి (46), రోహిత్ (39), శుబ్‌మన్ గిల్ (36) మినహా అంతా విఫలమయ్యారు. జట్టులో ఏడుగురు ఆటగాళ్లు ‘సున్నా’కే పరిమితమయ్యాడు. ఆ తర్వాత ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా తమ రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు కోల్పోయి 62 పరుగులు చేసింది. ప్రస్తుతం ఆ జట్టు ఇంకా 36 పరుగులు వెనుకబడి ఉంది. టపటపా... మ్యాచ్‌కు ముందు రోజు అంచనా వేసినట్లుగానే ఆరంభంలో పేస్ బౌలర్లకు పిచ్ అద్భుతంగా అనుకూలించడంతో దక్షిణాఫ్రికా బ్యాటర్లు పూర్తిగా చేతులెత్తేశారు. సిరాజ్ తన రెండో ఓవర్ రెండో బంతికి మార్క్రమ్ (0)ను అవుట్ చేయడంతో సఫారీల పతనం ప్రారంభమైంది. గత మ్యాచ్ స్టార్, కెరీర్లో చివరి టెస్టు ఆడుతున్న ఎల్గర్ (2) కూడా సిరాజ్ బంతికే బౌల్డ్ అయి నిరాశగా వెనుదిరిగాడు. స్టబ్స్ (3)ను వెనక్కి పంపి బుమ్రా కూడా జత కలిశాడు. జోర్జి (2)ని కూడా పెవిలియన్ పంపించిన సిరాజ్, ఆ తర్వాత ఒకే ఓవర్లో బెడింగామ్ (12), జాన్సెన్ (0)ల పని పట్టి ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. ఆ తర్వాతి చివరి 4 వికెట్లు తీసేందుకు భారత్‌కు ఎక్కువ సమయం పట్టలేదు. అదే వరుస... యశస్వి జైస్వాల్ (0) ఆరంభంలోనే వెనుదిరిగినా రోహిత్, గిల్ కలిసి చకచకా పరుగులు రాబట్టారు. దాంతో పదో ఓవర్లోనే భారత్ ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే వీరిద్దరిని తక్కువ వ్యవధిలోనే పెవిలియన్‌కు పంపించిన బర్గర్...శ్రేయస్ (0)ను కూడా అవుట్ చేశాడు. అయితే కోహ్లి చక్కటి షాట్లతో స్కోరును వేగంగా నడిపించాడు. మరో వైపు బాగా ఇబ్బంది పడిన రాహుల్ (8) తాను ఎదుర్కొన్న 22వ బంతికి గానీ తొలి పరుగు తీయలేకపోయాడు. ఒక దశలో స్కోరు 153/4 వద్ద నిలిచింది. అయితే తర్వాతి 11 బంతులు భారత్‌ను బాగా దెబ్బ తీశాయి. ఈ 11 బంతుల్లో ఒక్క పరుగు కూడా తీయకుండా జట్టు 6 వికెట్లు కోల్పోవడంతో అదే స్కోరు వద్ద టీమ్ ఆలౌట్ అయింది. స్కోరు వివరాలు: దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్: మార్క్రమ్ (సి) యశస్వి (బి) సిరాజ్ 2; ఎల్గర్ (బి) సిరాజ్ 4; జోర్జి (సి) రాహుల్ (బి) సిరాజ్ 2; స్టబ్స్ (సి) రోహిత్ (బి) బుమ్రా 3; బెడింగామ్ (సి) యశస్వి (బి) సిరాజ్ 12; వెరీన్ (సి) గిల్ (బి) సిరాజ్ 15; జాన్సెన్ (సి) రాహుల్ (బి) సిరాజ్ 0; మహరాజ్ (సి) బుమ్రా (బి) ముకేశ్ 3; రబాడ (సి) శ్రేయస్ (బి) ముకేశ్ 5; బర్గర్ (సి) యశస్వి (బి) బుమ్రా 4; ఎన్గిడి (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (23.2 ఓవర్లలో ఆలౌట్) 55. వికెట్ల పతనం: 1–5, 2–8, 3–11, 4–15, 5–34, 6–34, 7–45, 8–46, 9–55, 10–55. బౌలింగ్: బుమ్రా 8–1–25–2, సిరాజ్ 9–3–15–6, ప్రసిధ్ 4–1–10–0, ముకేశ్ 2.2–2–0–2. భారత్ తొలి ఇన్నింగ్స్: యశస్వి (బి) రబడ 0; రోహిత్ (సి) జాన్సెన్ (బి) బర్గర్ 39; గిల్ (సి) జాన్సెన్ (బి) బర్గర్ 36; కోహ్లి (సి) మార్క్రమ్ (బి) రబడ 46; శ్రేయస్ (సి) వెరీన్ (బి) బర్గర్ 0; రాహుల్ (సి) వెరీన్ (బి) ఎన్గిడి 8; జడేజా (సి) జాన్సెన్ (బి) ఎన్గిడి 0; బుమ్రా (సి) జాన్సెన్ (బి) ఎన్గిడి 0; సిరాజ్ (రనౌట్) 0; ప్రసిధ్ (సి) మార్క్రమ్ (బి) రబడ 0; ముకేశ్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 24; మొత్తం (34.5 ఓవర్లలో ఆలౌట్) 153. వికెట్ల పతనం: 1–17, 2–72, 3–105, 4–110, 5–153, 6–153, 7–153, 8–153, 9–153, 10–153. బౌలింగ్: రబడ 11.5–2–38–3, ఎన్గిడి 6–1–30–3, బర్గర్ 8–2–42–3, జాన్సెన్ 9–2–29–0. దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్: మార్క్రమ్ (నాటౌట్) 36; ఎల్గర్ (సి) కోహ్లి (బి) ముకేశ్ 12; జోర్జి (సి) రాహుల్ (బి) ముకేశ్ 1; స్టబ్స్ (సి) రాహుల్ (బి) బుమ్రా 1; బెడింగ్హామ్ (నాటౌట్) 7; మొత్తం (17 ఓవర్లలో 3 వికెట్లకు) 62. వికెట్ల పతనం: 1–37, 2–41, 3–45. బౌలింగ్: బుమ్రా 6–0–25–1, సిరాజ్ 5–2–11–0, ముకేశ్ 6–2–25–2. -
IND VS SA 2nd Test: తొలి రోజే 23 వికెట్లు.. ఇంకా ఆధిక్యంలోనే టీమిండియా
South Africa Vs India 2nd Test 2024 Day 1 Updates- కేప్‌టౌన్: తొలి రోజే 23 వికెట్లు.. ఇంకా ఆధిక్యంలోనే టీమిండియా రెండో టెస్ట్‌లో తొలి రోజే 23 వికెట్లు నేలకూలాయి. ఇరు జట్లు తొలి ఇన్నింగ్స్‌ల్లో ఆలౌటయ్యాక, సౌతాఫ్రికా సెకెండ్ ఇన్నింగ్స్ కొనసాగిస్తుంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 55 పరుగులకే కుప్పకూలగా.. టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 153 పరుగులకు ఆలౌటైంది. అనంతరం సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌతాఫ్రికా తొలి రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 62 పరుగులు చేసింది. సౌతాఫ్రికా భారత తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ఇంకా 36 పరుగులు వెనుకపడి ఉంది. మూడో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా 45 పరుగుల వద్ద సౌతాఫ్రికా మూడో వికెట్ కోల్పోయింది. బుమ్రా బౌలింగ్‌లో ట్రిస్టన్ స్టబ్స్ (1) ఔటయ్యాడు. ఇదే రోజు తొలి ఇన్నింగ్స్‌లో కూడా బుమ్రానే స్టబ్స్‌ను ఔట్ చేశాడు. 16 ఓవర్ల తర్వాత సౌతాఫ్రికా స్కోర్ 49/3గా ఉంది. సౌతాఫ్రికా భారత తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ఇంకా 49 పరుగులు వెనుకపడి ఉంది. సెకెండ్ ఇన్నింగ్స్‌లో సెకెండ్ వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా రెండో టెస్ట్ తొలి రోజు ఇరు జట్ల పేసర్లు అత్యద్భుతాలు చేస్తున్నారు. ఇరు జట్ల పేసర్ల ధాటికి ఇప్పటికే 22 వికెట్లు నేలకూలాయి. తాజాగా సౌతాఫ్రికా సెకెండ్ ఇన్నింగ్స్‌లో సెకెండ్ వికెట్ కోల్పోయింది. ముకేశ్ కుమార్ బౌలింగ్‌లో జార్జీ (1) ఔటయ్యాడు. 13 ఓవర్ల తర్వాత సౌతాఫ్రికా స్కోర్ 42/2గా ఉంది. భారత తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు సౌతాఫ్రికా ఇంకా 56 పరుగులు వెనుకపడి ఉంది. మార్క్రమ్ (25), ట్రిస్టన్ స్టబ్స్ (0) క్రీజ్‌లో ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా 37 పరుగుల వద్ద సౌతాఫ్రికా తమ సెకెండ్ ఇన్నింగ్స్‌లో తొలి వికెట్ కోల్పోయింది. ముకేశ్ కుమార్ బౌలింగ్‌లో ఎల్గర్ (12) ఔటయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌కు విరుద్దంగా ఆడుతున్న సౌతాఫ్రికా 55 పరుగులకే తొలి ఇన్నింగ్స్‌లో కుప్పకూలిన సౌతాఫ్రికా.. ఆతర్వాత టీమిండియాను 153 పరుగులకు ఆలౌట్ చేసి తమ సెకెండ్ ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. అయితే సఫారీలు తమ సెకెండ్ను తొలి ఇన్నింగ్స్‌లో ఆడినట్లు ఆడట్లేదు. ఆ జట్టు ఓపెనర్లు చాలా జాగ్రత్తగా వికెట్లు పడకుండా ఆడుతున్నారు. 10 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్ 37/0గా ఉంది. సౌతాఫ్రికా భారత తొలి ఇన్నింగ్స్ స్కోర్‌ను ఇంకా 61 పరుగులు వెనకపడి ఉంది. ఒకే స్కోర్ వద్ద ఆరు వికెట్లు కోల్పోయిన టీమిండియా 153 పరుగుల వద్ద టీమిండియా ఏకంగా ఆరు వికెట్లు కోల్పోయి, అదే స్కోర్ వద్ద ఆలౌటైంది. 34వ ఓవర్లో ఎంగిడి పరుగులేమీ ఇవ్వకుండా మూడు వికెట్లు పడగొట్టగా.. ఆ మరుసటి ఓవర్లోనే రబాడ.. కోహ్లి (46), ప్రసిద్ద్ (0)లను పెవిలియన్‌కు పంపాడు. అదే ఓవర్లో, అదే స్కోర్ వద్ద (153) సిరాజ్ (0) కూడా రనౌటయ్యాడు. ఒకే ఓవర్లో 3 వికెట్లు తీసిన ఎంగిడి.. టీమిండియా 153/7 లుంగి ఎంగిడి ఒక్క ఓవర్లో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. భారత ఇన్నింగ్స్ 34వ ఓవర్లో ఎంగిడి ఏకంగా మూడు వికెట్లు పడగొట్టాడు. రాహుల్ (8), జడేజా (0), బుమ్రా (0) ఐదు బంతుల వ్యవధిలో ఔటయ్యారు. కోహ్లి (46), సిరాజ్ క్రీజ్‌లో ఉన్నారు. టీ విరామం.. టీమిండియా స్కోర్ 111/4 తొలి రోజు టీ విరామం సమయానికి టీమిండియా స్కోర్ 111/4గా ఉంది. విరాట్ కోహ్లి (20), కేఎల్ రాహుల్ (0) క్రీజ్‌లో ఉన్నారు. నాలుగో వికెట్ కోల్పోయిన భారత్ 110 పరుగుల వద్ద టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. నండ్రే బర్గర్ బౌలింగ్‌లో శ్రేయస్ అయ్యర్ (0) ఔటయ్యాడు. మూడో వికెట్ కోల్పోయిన టీమిండియా 105 పరుగుల వద్ద టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. నండ్రే బర్గర్ బౌలింగ్‌లో శుభ్‌మన్ గిల్ (36) ఔటయ్యాడు. విరాట్ కోహ్లి (16), శ్రేయస్ అయ్యర్ క్రీజ్‌లో ఉన్నారు. రెండో వికెట్ కోల్పోయిన టీమిండియా 39 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రోహిత శర్మ ఔటయ్యాడు. నండ్రే బర్గర్ బౌలింగ్‌లో జన్సెన్కు క్యాచ్ ఇచ్చి హిట్‌మ్యాన్ పెవిలియన్‌కు చేరాడు. 16 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 90/2గా ఉంది. శుభ్‌మన్ గిల్ (24), విరాట్ కోహ్లి (1) క్రీజ్‌లో ఉన్నారు. ఆధిక్యంలోకి వచ్చిన టీమిండియా 10: సౌతాఫ్రికాతో రెండో టెస్టులో టీమిండియా ఆధిక్యంలోకి వచ్చింది. కేప్‌టౌన్ వేదికగా ఆతిథ్య జట్టును 55 పరుగులకే ఆలౌట్ చేసిన భారత్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన తొలి పది ఓవర్లలోనే లీడ్ సంపాదించింది. ఆరంభంలోనే ఓపెనర్ యశస్వి జైస్వాల్ వికెట్ కోల్పోయినా.. మరో ఓపెనర్, కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుతంగా ఆడుతున్నాడు. ఈ నేపథ్యంలో పది ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టానికి 58 పరుగులు సాధించిన టీమిండియా మూడు పరుగుల స్వల్ప ఆధిక్యంలో నిలిచింది. రోహిత్ శర్మ 37 బంతుల్లో 38 పరుగులు సాధించి జోరు మీదున్నాడు. మరో ఎండ్‌లో శుబ్‌మన్ గిల్ ఆరు పరుగులతో ఆడుతున్నాడు. తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా సిరాజ్ (9-3-15-6), ముకేశ్ కుమార్ (2.2-2-0-2), బుమ్రా (8-1-25-2) నిప్పులు చెరగడంతో సౌతాఫ్రికాను తొలి ఇన్నింగ్స్‌లో 55 పరుగులకే ఆలౌట్ చేసిన టీమిండియా.. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించి 17 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. రబాడ బౌలింగ్ యశస్వి జైస్వాల్ (0) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 3 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 20/1గా ఉంది. ఎంగిడి వేసిన రెండో ఓవర్లో మూడు బౌండరీలు బాది రోహిత్ శర్మ జోరుమీదున్నాడు. సౌతాఫ్రికా వర్సెస్ ఇండియా రెండో టెస్టు తుదిజట్లు సౌతాఫ్రికా డీన్ ఎల్గర్ (కెప్టెన్), ఐడెన్ మార్క్రమ్, టోనీ డి జోర్జీ, ట్రిస్టన్ స్టబ్స్, డేవిడ్ బెడింగ్హామ్, కైల్ వెర్రెన్నె(వికెట్ కీపర్), మార్కో జాన్సెన్, కేశవ్ మహారాజ్, కగిసో రబాడ, నండ్రే బర్గర్, లుంగి ఎంగిడి. టీమిండియా రోహిత్ శర్మ(కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ, ముకేష్ కుమార్. -
అన్‌స్టాపబుల్ సిరాజ్: అద్భుత ప్రదర్శన.. టెస్టుల్లో ఇదే తొలిసారి
South Africa vs India, 2nd Test: కేప్‌టౌన్ వేదికగా సౌతాఫ్రికాతో రెండో టెస్టులో టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ దుమ్ములేపాడు. ఆరంభంలోనే ప్రొటిస్ ఓపెనర్లను పెవిలియన్‌కు పంపి ఆతిథ్య జట్టుకు షాకిచ్చాడు. తొలుత ఐడెన్ మార్క్రమ్(2)ను అవుట్ చేసిన ఈ హైదరాబాదీ స్పీడ్‌స్టర్.. అనంతరం కెప్టెన్ డీన్ ఎల్గర్ రూపంలో బిగ్ వికెట్ పడగొట్టాడు. కీలక వికెట్ కూల్చి.. పతనానికి నాంది పలికి గంటకు 134 కిలోమీటర్ల వేగంతో బంతిని విసిరి అద్భుత రీతిలో ఎల్గర్‌ను బౌల్డ్ చేశాడు. అవుట్‌సైడ్ ఆఫ్ దిశగా సిరాజ్ సంధించిన బంతిని తప్పుగా అంచనా వేసిన ఎల్గర్(4) షాట్ ఆడేందుకు విఫలయత్నం చేసి వికెట్ పారేసుకున్నాడు. తాను అవుటైన తీరును నమ్మలేక నిరాశగా మైదానాన్ని వీడాడు. కాగా గత మ్యాచ్‌లో అద్భుత సెంచరీతో రాణించిన డీన్ ఎల్గర్ సౌతాఫ్రికాకు భారీ విజయం అందించడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే, ఈ మ్యాచ్‌లో తెంబా బవుమా స్థానంలో.. అది కూడా తన కెరీర్లో ఆడుతున్న ఆఖరి టెస్టులో కెప్టెన్‌గా బరిలోకి దిగిన అతడిని సిరాజ్ ఇలా కోలుకోలేని దెబ్బకొట్టాడు. Knocked ‘em overrrr! _ ‘ | | /#MohammedSiraj has every reason to celebrate, as he cleverly sets up #DeanElgar and gets the big fish! 💥 Tune-in to #SAvIND 2nd Test LIVE NOW | Star Sports Network#Cricket pic.twitter.com/EGX6XxZsSu — Star Sports (@StarSportsIndia) January 3, 2024 సిరాజ్ దెబ్బకు టాపార్డర్ కకావికలం దీంతో ఆరంభంలోనే సౌతాఫ్రికా రెండు కీలక వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత జస్ప్రీత్ బుమ్రా ట్రిస్టన్ స్టబ్స్‌ను 3 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔట్ చేయగా.. టోనీ డీ జోర్జీ(2) రూపంలో సిరాజ్ మళ్లీ తన వికెట్ల ఖాతా తిరిగి తెరిచాడు. ఈ రైటార్మ్ పేసర్ దెబ్బకు సౌతాఫ్రికా టాపార్డర్ మొత్తం కలిపి కేవలం ఎనిమిది పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇక జోర్జీ వికెట్ తీసుకున్న తర్వాత ఆకాశమే హద్దుగా చెలరేగిన సిరాజ్.. 15.2 ఓవర్ వద్ద డేవిడ్ బెడింగ్హాం(12), అదే ఓవర్లో ఐదో బంతికి మార్కో జాన్సెన్(0) వికెట్లు కూడా పడగొట్టాడు. తద్వారా కేప్‌టౌన్ టెస్టులో ఐదు వికెట్ హాల్ నమోదు చేశాడు. టెస్టుల్లో తొలి 6 వికెట్ హాల్ అంతటితో సిరాజ్ విధ్వంసం ఆగిపోలేదు. 17.5 ఓవర్ వద్ద వెరెనె(15) రూపంలో ఆరో వికెట్ దక్కించుకున్నాడు ఈ ఫాస్ట్‌బౌలర్. తద్వారా టెస్టుల్లో టీమిండియా తరఫున తన మొదటి 6 వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. ఇప్పటికే ఆసియా కప్-2023 ఫైనల్ సందర్భంగా శ్రీలంకతో మ్యాచ్‌లో ఆరు వికెట్లు తీసి వన్డేల్లో ఈ ఘనత సాధించాడు. 55 పరుగులకే కుప్పకూలిన సౌతాఫ్రికా ఇక సిరాజ్ తర్వాత వికెట్లు పడగొట్టే బాధ్యత తీసుకున్న ముకేశ్ కుమార్ కేశవ్ మహరాజ్(3)ను అవుట్ చేయగా.. బుమ్రా.. నండ్రీ బర్గర్(4)ను పెవిలియన్‌కు పంపాడు. ఇక 23.2 ఓవర్ వద్ద కగిసో రబడ(5)ను పెవిలియన్‌కు పంపి ముకేశ్ కుమార్ సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌కు ముగింపు పలికాడు. ఇలా భారత పేసర్ల ధాటికి సౌతాఫ్రికా 55 పరుగులకే ఆలౌట్ అయింది. ఆరు వికెట్లతో చెలరేగిన సిరాజ్‌పై సహచర ఆటగాళ్లతో పాటు అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. చదవండి: T20 WC 2024: రోహిత్, కోహ్లి విషయంలో బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అగార్కర్ కీలక నిర్ణయం! Pacy wickets with bounce on offer! Pitches in #SouthAfrica pose a different challenge, but former #TeamIndia batting coach #SanjayBangar delivers a masterclass on how best to deal with this test. Tune-in to #SAvIND 2nd Test LIVE NOW | Star Sports Network#Cricket pic.twitter.com/FYPOC19Kfn — Star Sports (@StarSportsIndia) January 3, 2024 -
ఆరు వికెట్లతో చెలరేగిన సిరాజ్: 55 పరుగులకే సౌతాఫ్రికా ఆలౌట్
South Africa Vs India 2nd Test 2024 Day 1 Updates- కేప్‌టౌన్: రెండో టెస్టులో భారత పేసర్ల విజృంభణతో సౌతాఫ్రికా 55 పరుగులకే కుప్పకూలింది. బుధవారం నాటి మ్యాచ్‌లో తొలి రోజు ఆట తొలి సెషన్లో 23.2 ఓవర్లలోనే ఆలౌట్ అయి తొలి ఇన్నింగ్స్ ముగించింది. ప్రొటిస్ బ్యాటర్లలో వికెట్ కీపర్ కైల్ వెరెనె 15 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవడం విశేషం. టీమిండియా బౌలర్లలో మహ్మద్ సిరాజ్ అత్యధికంగా ఆరు వికెట్లు తీయగా.. బుమ్రాకు రెండు, ముకేశ్ కుమార్‌కు రెండు వికెట్లు దక్కాయి. మరో పేసర్ ప్రసిద్ కృష్ణ 4 ఓవర్ల బౌలింగ్‌లో పది పరుగులు మాత్రమే ఇచ్చి పొదుపుగానే బౌలింగ్ చేశాడు. Double breakthrough for #TeamIndia!@mdsirajofficial is breathing 🔥 this morning & bags a -fer in just his 8th over! A sensational spell leaves #SouthAfrica reeling! Tune in to #SAvIND 2nd Test LIVE NOW | Star Sports Network#Cricket pic.twitter.com/hpzR8g9wLH — Star Sports (@StarSportsIndia) January 3, 2024 22.6: తొమ్మిదో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా బుమ్రా బౌలింగ్‌లో యశస్వి జైస్వాల్‌కు క్యాచ్ ఇచ్చి నండ్రే బర్గర్(4) పెవిలియన్ చేరాడు. స్కోరు: 55-9(23) 21: హాఫ్ సెంచరీ మార్కు అందుకున్న సౌతాఫ్రికా.. స్కోరు: 50-8 ఎనిమిదో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా 19.6: ముకేశ్ కుమార్ బౌలింగ్‌లో బుమ్రాకు క్యాచ్ ఇచ్చి ఔటైన కేశవ్ మహరాజ్(3). సౌతాఫ్రికా స్కోరు: 46-8(20) 17.5: ఏడో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా సిరాజ్ బౌలింగ్‌లో శుబ్‌మన్ గిల్‌కు క్యాచ్ ఇచ్చి వెరెనె (15) ఔటయ్యాడు. అతడి రూపంలో సౌతాఫ్రికా ఏడో వికెట్ కోల్పోయింది. సిరాజ్ ఖాతాలో ఆరో వికెట్ చేరింది. సౌతాఫ్రికా స్కోరు: 45-7(18). రబడ, కేశవ్ మహరాజ్ క్రీజులో ఉన్నారు. 15.5: తిరుగులేని సిరాజ్.. ఆరో వికెట్ డౌన్ టీమిండియా పేసర్ సిరాజ్ ఒకే ఓవర్లో రెండు వికెట్లతో సత్తా చాటాడు. పదహారో ఓవర్ రెండో బంతికి బెడింగ్హాం(12)ను పెవిలియన్‌కు పంపిన ఈ హైదరాబాదీ బౌలర్.. ఐదో బంతికి మార్కో జాన్సెన్(0) రూపంలో మరో వికెట్ దక్కించుకున్నాడు. మొత్తంగా ఇప్పటి వరకు ఐదు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. కేశవ్ మహరాజ్, వెరెనె క్రీజులో ఉన్నారు. సౌతాఫ్రికా స్కోరు: 34-6(16) మరోసారి మ్యాజిక్ చేసిన సిరాజ్ 15.2: కేప్‌టౌన్ టెస్టులో టీమిండియా స్పీడ్‌స్టర్ మహ్మద్ సిరాజ్ ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. ఇప్పటికే మార్క్రమ్, ఎల్గర్, జోర్జి రూపంలో మూడు వికెట్లు తీసిన తాజాగా నాలుగో వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. మంచి లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేసి డేవిడ్ బెడింగ్హాంను ఔట్ చేశాడు. తద్వారా సౌతాఫ్రికా ఐదో వికెట్ కోల్పోయింది. ఇక అంతకు ముందు బుమ్రా ట్రిస్టన్ స్టబ్స్‌ను అవుట్ చేసిన విషయం తెలిసిందే. 11 ఓవర్లు ముగిసే సరికి సౌతాఫ్రికా స్కోరు: 23-4 బెడింగ్హామ్ 8, వెరెనె సున్నా పరుగులతో క్రీజులో ఉన్నారు. నిప్పులు చెరుగుతున్న సిరాజ్.. 15 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన సౌతాఫ్రికా హైదరాబాదీ పేసర్ మహమ్మద్ సిరాజ్ నిప్పులు చెరుగుతున్నాడు. అతడి ధాటికి సౌతాఫ్రికా 15 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. 15 పరుగుల వద్ద డి జార్జీ (2) ఔటయ్యాడు. నాలుగు వికెట్లు కోల్పోయిన సౌతాఫ్రికా 9.2: సిరాజ్బౌలింగ్లో 2 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద టోనీ డీ జోర్జీ ఔట్ 8.3: బుమ్రా బౌలింగ్‌లో మూడో వికెట్‌గా వెనుదిరిగిన ట్రిస్టన్ స్టబ్స్ ►రెండో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా.. కెప్టెన్ ఔట్ ►సౌతాఫ్రికాతో రెండో టెస్టులో భారత్ బౌలర్ సిరాజ్ నిప్పులు చెరుగుతున్నాడు. ►ఇన్నింగ్స్ ఐదో ఓవర్లో సౌతాఫ్రికా కెప్టెన్ డీన్ ఎల్గర్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. మొదటి మ్యాచ్‌లో సెంచరీలో రాణించిన ఎల్గర్ ఈ ఇన్నింగ్స్‌లో 4(15) పరుగులు చేసి ఔటయ్యాడు. తొలి వికెట్ డౌన్ ►ఫస్ట్ వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా.. ►సిరాజ్ వేసిన రెండో ఓవర్లో మార్క్రమ్2(10) ఔట్ ►టీమిండియాతో రెండో టెస్టులో టాస్ గెలిచిన సౌతాఫ్రికా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. తెంబా బవుమా గాయం కారణంగా దూరమైన నేపథ్యంలో అతడి స్థానంలో డీన్ ఎల్గర్ సౌతాఫ్రికా కెప్టెన్‌గా బరిలోకి దిగాడు. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకోవడమే తమ లక్ష్యమని టాస్ సందర్భంగా పేర్కొన్నాడు. ఎల్గర్‌కు ఆఖరి టెస్టు పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలిస్తుంది కాబట్టే తొలుత బ్యాట్‌తో రంగంలోకి దిగాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించాడు. తొలి టెస్టులో గెలిచాం కాబట్టి కేప్‌టౌన్‌లో తాము ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా ఆడగలమని ఎల్గర్ పేర్కొన్నాడు. గాయాల కారణంగా జట్టుకు దూరమైన బవుమా స్థానంలో ట్రిస్టన్ స్టబ్స్, గెరాల్డ్ కోయెట్జీ స్థానంలో లుంగి ఎంగిడిని రెండో టెస్టులో ఆడిస్తున్నట్లు ఎల్గర్ తెలిపాడు. కాగా వెటరన్ ఓపెనర్ డీన్ ఎల్గర్ కెరీర్లో ఇదే ఆఖరి టెస్టు కావడం విశేషం. అశ్విన్, శార్దూల్ అవుట్ ఇక ఇప్పటికే బాక్సింగ్ డే టెస్టులో ఓటమి పాలైన రోహిత్ సేన.. రెండో మ్యాచ్‌లో రెండు మార్పులతో బరిలోకి దిగింది. స్పిన్ ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ స్థానంలో రవీంద్ర జడేజా, పేసర్ శార్దూల్ ఠాకూర్ స్థానంలో ముకేశ్ కుమార్ తుదిజట్టులో చోటు దక్కించుకున్నారు. సౌతాఫ్రికా వర్సెస్ ఇండియా రెండో టెస్టు తుదిజట్లు ఇవే సౌతాఫ్రికా ప్లేయింగ్ ఎలెవన్ డీన్ ఎల్గర్ (కెప్టెన్), ఐడెన్ మార్క్రమ్, టోనీ డి జోర్జీ, ట్రిస్టన్ స్టబ్స్, డేవిడ్ బెడింగ్హామ్, కైల్ వెర్రెన్నె(వికెట్ కీపర్), మార్కో జాన్సెన్, కేశవ్ మహారాజ్, కగిసో రబాడ, నండ్రే బర్గర్, లుంగి ఎంగిడి. టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ రోహిత్ శర్మ(కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ, ముకేష్ కుమార్. చదవండి: T20 WC 2024: రోహిత్, కోహ్లి విషయంలో బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అగార్కర్ కీలక నిర్ణయం! -
ప్రొటిస్ బ్యాటింగ్ ఆర్డర్ బలహీనం: భారత్ గెలవాలంటే అదొక్కటే మార్గం
South Africa vs India, 2nd Test : సౌతాఫ్రికాతో రెండో టెస్టులో టీమిండియా గెలుపు అవకాశాలపై భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గత మ్యాచ్ సెంచరీ హీరో డీన్ ఎల్గర్‌ను తొందరగా అవుట్ చేస్తే రోహిత్ సేన పని సులువు అవుతుందని పేర్కొన్నాడు. కేప్‌టౌన్‌లో ఎల్గర్ కేవలం బ్యాటర్‌గా మాత్రమే కాకుండా కెప్టెన్‌గానూ బరిలోకి దిగుతున్న కారణంగా అతడిపై సహజంగానే ఒత్తిడి ఉంటుందన్న ఈ మాజీ ఓపెనర్.. టీమిండియా బౌలర్లు దీనిని తమకు అనుకూలంగా మార్చుకోవాలని సూచించాడు. ఎల్గర్‌ను పెవిలియన్‌కు పంపితే సౌతాఫ్రికా బ్యాటింగ్ ఆర్డర్‌ను కుప్పకూల్చడం కష్టమేమీ కాబోదని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. కేప్‌టౌన్‌లో అంత ఈజీ కాదు కాగా సౌతాఫ్రికాతో రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా బాక్సింగ్ డే టెస్టులో ఓడిన టీమిండియా కేప్‌టౌన్‌లో గెలిచి సిరీస్ సమం చేయాలని భావిస్తోంది. అయితే, సీమర్లకు స్వర్గధామమైన న్యూల్యాండ్స్ పిచ్‌పై ఆతిథ్య జట్టు బౌలర్లు మరోసారి చెలరేగడం ఖాయంగా కనిపిస్తోంది. ఇలాంటి తరుణంలో రోహిత్ సేన ఎలాంటి ప్రణాళికలు అమలు చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. కెప్టెన్ కాబట్టి ఒత్తిడి సహజం ఈ నేపథ్యంలో ఆకాశ్ చోప్రా కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘డీన్ ఎల్గర్ కెరీర్లో ఇది ఆఖరి టెస్టు. తెంబా బవుమా జట్టుతో లేడు కాబట్టి ఎల్గర్ కెప్టెన్‌గా వ్యవహరించబోతున్నాడు. ఇప్పుడు తన దృష్టి మొత్తం కేవలం రన్స్ తీయడం కాకుండా.. ట్రోఫీ గెలవడం పైనే ఉందని ఇప్పటికే ఎల్గర్ స్పష్టం చేశాడు. కాబట్టి అతడిపై ఒత్తిడి ఉండటం సహజం. నా దృష్టిలో అయితే.. సౌతాఫ్రికా బ్యాటింగ్ ఆర్డర్ బలహీనంగానే ఉంది. డీన్ ఎల్గర్ బ్యాటింగ్ కూడా సాధారణంగానే ఉంది. అయితే, అతడిని అవుట్ చేయడం అంత తేలికేమీ కాదు. ఒక్కసారి ఎల్గర్‌ను పెవిలియన్‌కు పంపితే మాత్రం మిగతా బ్యాటర్లు కూడా క్యూ కట్టడం ఖాయం’’ అని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. కేశవ్ మహరాజ్‌ను ఆడిస్తారు! అదే విధంగా.. పేసర్ గెరాల్డ్ కోయెట్జీ గాయపడటం సౌతాఫ్రికాకు ఎదురుదెబ్బేనన్న ఆకాశ్ చోప్రా.. అతడి స్థానంలో లుంగీ ఎంగిడీ జట్టులోకి వచ్చే అవకాశం లేదన్నాడు. ఎంగిడి దాదాపు ఏడాది కాలంగా ఫస్ట్ క్లాస్ క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు కాబట్టి మేనేజ్మెంట్ అతడి వైపు మొగ్గు చూపకపోవచ్చని అభిప్రాయపడ్డాడు. స్పిన్నర్ కేశవ్ మహరాజ్‌ను రెండో టెస్టులో ఆడించే అవకాశాలు ఉన్నాయని ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు. చదవండి: T20 WC 2024: రోహిత్, కోహ్లి విషయంలో బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అగార్కర్ కీలక నిర్ణయం! -
భారత్‌తో రెండో టెస్టు.. కెరీర్లో ఇదే చివరి మ్యాచ్! కెప్టెన్‌గా బరిలోకి
కేప్‌టౌన్: అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌కు దక్షిణాఫ్రికా ఓపెనర్ డీన్ ఎల్గర్ సారథిగా వీడ్కోలు పలకనున్నాడు. భారత్‌తో సిరీస్‌కు ముందే మాజీ కెప్టెన్ ఎల్గర్ రిటైర్మెంట్ నిర్ణయం తీసుకున్నాడు. తొలి టెస్టులో అతని భారీ సెంచరీతోనే సఫారీ ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో భారత్‌పై గెలిచింది. ఎల్గర్ 287 బంతుల్లో 28 ఫోర్లతో 185 పరుగులు చేశాడు. అయితే ఈ మ్యాచ్ మొదటి రోజునే గాయపడ్డ రెగ్యులర్ కెప్టెన్ తెంబా బవుమా జనవరి 3 నుంచి జరిగే రెండో టెస్టుకు దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో ఎల్గర్‌ను దక్షిణాఫ్రికా బోర్డు అతని కెరీర్లో ఆఖరి మ్యాచ్ కోసం కెప్టెన్‌గా బరిలోకి దింపుతోంది. చదవండి: IND Vs SA: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. 146 ఏళ్ల క్రికెట్ హిస్టరీలోనే తొలి ఆటగాడిగా! -
IND Vs SA: గెలుపు జోష్‌లో ఉన్న సౌతాఫ్రికాకు బిగ్ షాక్..
టీమిండియాతో తొలి టెస్టులో విజయం సాధించిన జోష్‌లో ఉన్న దక్షిణాఫ్రికాకు బిగ్ షాక్ తగిలింది. కేప్‌టౌన్ వేదికగా భారత్‌తో జరగనున్న రెండో టెస్టుకు ఆ జట్టు కెప్టెన్ టెంబా బావుమా గాయం కారణంగా దూరమయ్యాడు. బావుమా ప్రస్తుతం తొడ కండరాల గాయంతో బాధపడుతున్నాడు. సెంచూరియన్ వేదికగా జరిగిన మొదటి టెస్టులో తొలి రోజు ఆట సందర్భంగా ఫీల్డింగ్ చేస్తుండగా బావుమా గాయపడ్డాడు. దీంతో అతడు తొలి టెస్టుల్లో తిరిగి మైదానంలో అడుగుపెట్టలేదు. అయితే అతడి గాయం కొంచెం తీవ్రమైనది కావడంతో రెండో టెస్టుకు దూరమయ్యాడు. ఈ విషయాన్ని దక్షిణాఫ్రికా హెడ్ కోచ్ షుక్రి కాన్రాడ్ దృవీకరించారు. ఇక రెండో టెస్టులో తన కెరీర్లో చివరి మ్యాచ్ ఆడుతున్న డీన్ ఎల్గర్ ప్రోటీస్ జట్టును నడిపించనున్నాడు. అదే విధంగా బావుమా స్ధానంలో జైబుర్ హంజా జట్టులోకి వచ్చాడు. "బావుమా ప్రస్తుతం పూర్తి ఫిట్నెస్తో లేడు. కానీ తొలి టెస్టులో అవసరమైతే తాను బ్యాటింగ్ చేయడానికి సిద్దమయ్యాడు. అతడు ప్రస్తుతం మా వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నాడు. బావుమా గాయం నుంచి కోలుకోవడానికి మరో రెండు వారాల సమయం పట్టే అవకాశముంది. ఈ క్రమంలో టెంబా కేప్ టౌన్ టెస్టుకు దూరంగా ఉండనున్నాడు. యువ ఆటగాడు జుబేర్ హంజా అతడి స్ధానాన్ని భర్తీ చేయనున్నాడని" ఈఎస్పీఎన్తో షుక్రి పేర్కొన్నాడు. కాగా జనవరి 3 నుంచి కేప్‌టౌన్ వేదికగా రెండో టెస్టు ప్రారంభం కానుంది. చదవండి: #Rohit Sharma: అందుకే ఓడిపోయాం.. ప్రధాన కారణాలు అవే! అతడు అద్భుతం -
అందుకే ఓడిపోయాం.. అతడు మాత్రం అద్భుతం: రోహిత్ శర్మ
Ind Vs SA 1st Test 2023- Rohit Sharma Comments On Loss: సౌతాఫ్రికాతో తొలి టెస్టులో ఓటమిపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. బ్యాటింగ్ వైఫల్యం కారణంగానే పరాజయం పాలైనట్లు పేర్కొన్నాడు. పరిస్థితులకు అనుగుణంగా తాము ఆడలేకపోయామని విచారం వ్యక్తం చేశాడు. అయితే, తొలి ఇన్నింగ్స్‌లో కేఎల్ రాహుల్ అసాధారణ పోరాటం చేశాడని.. అయినప్పటికీ తిరిగి పుంజుకునే అవకాశాన్ని తాము సద్వినియోగం చేసుకోలేకపోయామని రోహిత్ వాపోయాడు. కాగా సఫారీ గడ్డపై తొలి టెస్టు సిరీస్ విజయమే లక్ష్యంగా బరిలోకి దిగిన రోహిత్ సేనకు ఆతిథ్య జట్టు గట్టి షాకిచ్చింది. టీమిండియా ఘోర పరాజయం సెంచూరియన్‌లో జరిగిన బాక్సింగ్ డే టెస్టులో ఏకంగా ఇన్నింగ్స్ మీద 32 పరుగుల తేడాతో గెలుపు నమోదు చేసి 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. దీంతో రెండు మ్యాచ్‌ల సిరీస్ గెలవాలన్న టీమిండియా ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. ఈ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ ఓటమికి గల కారణాలు విశ్లేషించాడు. ఈ మేరకు.. ‘‘గెలుపు దిశగా మా ఆట తీరు సాగలేదు. కేఎల్ తొలి ఇన్నింగ్స్‌లో అద్భుతంగా బ్యాటింగ్ చేసి మాకు అవకాశాలు సృష్టించాడు. మా బ్యాటింగ్ చెత్తగా సాగింది కానీ మేము వాటిని ఉపయోగించుకోలేకపోయాం. ఈరోజు మా బ్యాటింగ్ చెత్తగా సాగింది. టెస్టు మ్యాచ్ గెలవాలంటే ఆటగాళ్లంతా సమిష్టిగా రాణించాలి. కానీ ఈరోజు మేము అది చేయలేకపోయాం. ఇక్కడికి వచ్చే ముందే ఎవరు ఎలాంటి పాత్ర పోషించాలన్న విషయం మీద అందరు ఆటగాళ్లకు అవగాహన ఉంది. ప్రత్యర్థి జట్టు బౌలర్లు మా బ్యాటర్లకు అనుక్షణం సవాల్ విసిరారు. అందుకే ఓడిపోయాం అయితే, మేము వారిపై పైచేయి సాధించలేకపోయాం. ఇది బౌండరీ స్కోరింగ్ గ్రౌండ్. సౌతాఫ్రికా బ్యాటర్లు బ్యాటింగ్ చేసినపుడు వారు అనేకసార్లు ఫోర్లు బాదారు. కానీ మేము అలా చేయలేకపోయాం. అందుకే ఓటమిని మూటగట్టుకున్నాం. ప్రత్యర్థి జట్టు బలాబలాలను సరిగ్గా అంచనా వేయలేకపోయాం. ఏదేమైనా మూడు రోజుల్లోనే మ్యాచ్ ముగిసేందుకు మేము ఆస్కారం ఇవ్వడం ఏమాత్రం ఆహ్వానించదగ్గ విషయం కాదు. రెండు ఇన్నింగ్స్‌లోనూ మా బ్యాటింగ్ వైఫల్యం కొట్టొచ్చినట్లు కనబడింది. మా బౌలర్లలో చాలా మందికి ఇదే తొలిసారి మా బౌలర్లలో చాలా మంది ఇప్పుడే మొదటిసారిగా సౌతాఫ్రికా పర్యటనకు వచ్చారు. అయినా, ఓటమికి సాకులు వెదకాలనుకోవడం లేదు. మళ్లీ తిరిగి పుంజుకుని తదుపరి మ్యాచ్ మీద దృష్టి పెడతాం’’ అని రోహిత్ శర్మ తెలిపాడు. కాగా ఈ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో కేఎల్ రాహుల్ సెంచరీ(101) సాధించాడు. రెండో ఇన్నింగ్స్‌లో అతడు నాలుగు పరుగులకే పెవిలియన్ చేరాడు. ఇక మరో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి తొలి ఇన్నింగ్స్‌లో 38 పరుగులు చేయగా.. రెండో ఇన్నింగ్స్‌లో 76 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇక కెప్టెన్, ఓపెనర్ రోహిత్ శర్మ రెండు ఇన్నింగ్స్‌లోనూ పూర్తిగా విఫలమయ్యాడు. తొలుత 5 పరుగులకే పరిమితమైన అతడు.. గురువారం నాటి ఆటలో డకౌట్‌గా వెనుదిరిగాడు. సౌతాఫ్రికా వర్సెస్ టీమిండియా తొలి టెస్టు స్కోర్లు: ►టాస్: సౌతాఫ్రికా- తొలుత బౌలింగ్ ►టీమిండియా తొలి ఇన్నింగ్స్: 245 ఆలౌట్ ►సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్: 408 ఆలౌట్.. 163 పరుగుల ఆధిక్యం ►టీమిండియా రెండో ఇన్నింగ్స్: 131 ఆలౌట్ ►ఇన్నింగ్స్ మీద 32 పరుగుల తేడాతో సౌతాఫ్రికా విజయం ►ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ డీన్ ఎల్గర్(185 పరుగులు) ►ఇరు జట్ల మధ్య రెండో టెస్టు: జనవరి 3 నుంచి ఆరంభం. చదవండి: Ind W vs Aus W: ‘టీమిండియాకు మరో నయా ఫినిషర్’.. దుమ్ములేపిన ఆల్‌రౌండర్.. కానీ -
Ind Vs SA: టీమిండియా ఆలౌట్.. సౌతాఫ్రికా ఘన విజయం
South Africa Vs India 1st Test Day 3 Updates: సౌతాఫ్రికా ఘన విజయం 34.1: మార్కో జాన్సెన్ బౌలింగ్‌లో విరాట్ కోహ్లి(76) రూపంలో టీమిండియా పదో వికెట్ కోల్పోయింది. మూడో రోజు ఆటలో భాగంగా రెండో ఇన్నింగ్స్‌లో 34.1 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసిన భారత్.. 131 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో సౌతాఫ్రికా ఏకంగా ఇన్నింగ్స్ మీద 32 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ముందంజ వేసింది. సఫారీ గడ్డపై టెస్టు సిరీస్ గెలవాలన్న రోహిత్ సేన కల ఇప్పటికి కలగానే మిగిలిపోయింది. ప్రొటిస్ పేసర్లలో నండ్రీ బర్గర్ నాలుగు వికెట్లతో చెలరేగి టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించగా.. రబడ రెండు వికెట్లు, మార్కో జాన్సెన్ మూడు వికెట్లు పడగొట్టారు. బుమ్రా రనౌట్‌లో ఎల్గర్, రబడ భాగమయ్యారు. అంతకు ముందు సౌతాఫ్రికా 408 పరుగులకు తొలి ఇన్నింగ్స్‌ను ముగించింది. డీన్ ఎల్గర్ సెంచరీ(185)తో రాణించగా.. బెడింగ్హామ్(56), మార్కో జాన్సెన్(84- నాటౌట్) అర్ధ శతకాలతో మెరిశారు. తొమ్మిదో వికెట్ కోల్పోయిన టీమిండియా 31.5: సిరాజ్ రూపంలో టీమిండియా తొమ్మిదో వికెట్ కోల్పోయింది. ప్రసిద్ కృష్ణ క్రీజులోకి వచ్చాడు. స్కోరు: 121/9 (31.5). కోహ్లి 67 పరుగులతో ఆడుతున్నాడు. 31.3: ఫోర్ బాదిన సిరాజ్ బుమ్రా రనౌట్.. ఎనిమిదో వికెట్ డౌన్ 30.2: రబడ బౌలింగ్‌లో కోహ్లి పరుగుకు యత్నించగా.. సమన్వయ లోపం కారణంగా బుమ్రా రనౌట్ అయ్యాడు. దీంతో టీమిండియా ఎనిమిదో వికెట్ కోల్పోయింది. సిరాజ్ క్రీజులోకి వచ్చాడు. స్కోరు: 117/8 (30.5) ఏడో వికెట్ కోల్పోయిన భారత్ 28.3: రబడ బౌలింగ్‌లో ఏడో వికెట్‌గా వెనుదిరిగిన శార్దూల్ ఠాకూర్(2). జస్ప్రీత్ బుమ్రా క్రీజులోకి వచ్చాడు. భారత్ స్కోరు: 105/7 (28.3) నెమ్మదిగా ఆరంభించి.. దూకుడు పెంచిన కోహ్లి కఠినమైన సెంచూరియన్ పిచ్‌పై నెమ్మదిగా ఇన్నింగ్స్ ఆరంభించిన కోహ్లి.. తర్వాత దూకుడు పెంచాడు. వరుసగా వికెట్లు పడుతున్న తరుణంలో ఆచితూచి ఆడిన ఈ రన్‌మెషీన్.. వీలు చిక్కినప్పుడల్లా బంతిని బౌండరీకి తరలిస్తూ 50 పరుగుల మార్కు అందుకున్నాడు. 61 బంతుల్లో హాఫ్ సెంచరీ(53) పూర్తి చేసుకున్నాడు. వచ్చీ రాగానే అశ్విన్‌ను పెవిలియన్‌కు పంపిన బర్గర్ 25.6: నండ్రే బర్గర్ ఒకే ఓవర్లో రెండు వికెట్లు పడగొట్టాడు. తొలుత రాహుల్‌ను అవుట్ చేసిన ఈ యంగ్ పేసర్.. అతడి స్థానంలో వచ్చిన అశూను కూడా పెవిలియన్‌కు పంపాడు. బెడింగ్హామ్కు క్యాచ్ ఇచ్చి అశ్విన్ డకౌట్‌గా వెనుదిరిగాడు. స్కోరు: 96-6(26). శార్దూల్ ఠాకూర్ క్రీజులోకి వచ్చాడు. ఐదో వికెట్ కోల్పోయిన టీమిండియా 25.5: కేఎల్ రాహుల్(4) రూపంలో టీమిండియా ఐదో వికెట్ కోల్పోయింది. నండ్రే బర్గర్ బౌలింగ్‌లో మార్క్రమ్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అశ్విన్ క్రీజులోకి వచ్చాడు. స్కోరు: 96/5 (25.5). అర్ధ శతకానికి చేరువైన కోహ్లి 20.6: కోయెట్జీ బౌలింగ్‌లో ఫోర్ బాదిన కోహ్లి. అర్ధ శతకానికి ఆరు పరుగుల దూరంలో ఉన్న రన్‌మెషీన్. 19 ఓవర్లలో భారత్ స్కోరు: 78-4 కోహ్లి 34, రాహుల్ 0 పరుగులతో క్రీజులో ఉన్నారు. నాలుగో వికెట్ కోల్పోయి టీమిండియా 17.5: శ్రేయస్ అయ్యర్ రూపంలో టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. మార్కో జాన్సెన్ అద్భుత బంతితో అయ్యర్(6)ను బౌల్డ్ చేశాడు. గత ఇన్నింగ్స్ సెంచరీ హీరో కేఎల్ రాహుల్ క్రీజులోకి వచ్చాడు. స్కోరు: 72/4 (17.5). మూడో సెషన్ మొదలు 17 ఓవర్లలో టీమిండియా స్కోరు: 65-3 ఈసారి అయ్యర్ క్యాచ్ వదిలేశారు 15.5: మార్కో జాన్సెన్ బౌలింగ్‌లో శ్రేయస్ అయ్యర్ ఇచ్చిన క్యాచ్‌ను థర్డ్ స్లిప్‌లో బౌలింగ్ చేస్తున్న కీగన్ పీటర్సన్ వదిలేశాడు. టీ బ్రేక్ సమయానికి టీమిండియా 16 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 62 పరుగులు చేసింది. సౌతాఫ్రికా కంటే 101 పరుగులు వెనుబడి ఉంది. కోహ్లి 18, అయ్యర్ ఆరు పరుగులతో క్రీజులో ఉన్నారు. మూడో వికెట్ కోల్పోయిన టీమిండియా 13.6: మార్కో జాన్సెన్ బౌలింగ్‌లో గిల్(26) బౌల్డ్. స్కోరు: 52-3(14). కోహ్లి 14, శ్రేయస్ అయ్యర్ 0 పరుగులతో క్రీజులో ఉన్నారు. 12 ఓవర్లలో టీమిండియా స్కోరు: 39/2 గిల్- కోహ్లి మధ్య 26 పరుగుల భాగస్వామ్యం. కోహ్లి 8, గిల్ 17 పరుగులతో క్రీజులో ఉన్నారు. 11.5: జాన్సెన్ బౌలింగ్‌లో ముల్దర్ క్యాచ్ డ్రాప్ చేయడంతో కోహ్లికి లైఫ్ లభించింది. ►11.1: మార్కో జాన్సెన్ బౌలింగ్‌లో ఫోర్ బాది ఖాతా తెరిచిన కోహ్లి 8 ఓవర్లలో టీమిండియా స్కోరు: 19/2 ఇంకా ఖాతా తెరవని కోహ్లి.. 13 పరుగులతో క్రీజులో ఉన్న గిల్ రెండో వికెట్ కోల్పోయిన భారత్ 5.3: నండ్రే బర్గర్ బౌలింగ్‌లో యశస్వి జైశ్వాల్(5) అవుట్. టీమిండియా స్కోరు: 13/2 (5.3). విరాట్ కోహ్లి క్రీజులోకి వచ్చాడు. తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా 2.5: రబడ బౌలింగ్‌లో రోహిత్ శర్మ అవుట్. 8 బంతులు ఎదుర్కొని సున్నా స్కోరుకు పెవిలియన్ చేరిన టీమిండియా కెప్టెన్. క్రీజులోకి వచ్చిన వన్‌డౌన్‌బ్యాటర్ శుబ్‌మన్ గిల్. ఆధిక్యం ఎంతంటే టీమిండియాతో తొలి టెస్టులో సౌతాఫ్రికా 408 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్ ముగించింది. తద్వారా 163 పరుగుల ఆధిక్యం సాధించింది. తొమ్మిదో వికెట్ డౌన్.. బవుమా ఆబ్సెంట్ హర్ట్ 108.4: బుమ్రా బౌలింగ్‌లో నండ్రే బర్గర్ బౌల్డ్(0). దీంతో సౌతాఫ్రికా తొమ్మిదో వికెట్ కోల్పోయింది. ఇదిలా ఉంటే.. మొదటి రోజు ఆటలో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో కెప్టెన్ తెంబా బవుమా గాయపడ్డ విషయం తెలిసిందే. దీంతో అతడు బ్యాటింగ్‌కు అందుబాటులో లేకపోవడంతో.. 408 పరుగుల వద్ద సౌతాఫ్రికా ఆలౌట్ అయినట్లు అంపైర్లు ప్రకటించారు. 107 ఓవర్లు ముగిసే సరికి సౌతాఫ్రికా స్కోరు: 407/8. 162 పరుగుల ఆధిక్యం 400 వందల పరుగుల మార్కు అందుకున్న సౌతాఫ్రికా 102.5: బుమ్రా బౌలింగ్‌లో మార్కో జాన్సెన్ ఫోర్ బాదడంతో సౌతాఫ్రికా స్కోరు 400 దాటేసింది. ఎనిమిదో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా 100.5: లంచ్ బ్రేక్ తర్వాత తిరిగి మైదానంలో అడుగుపెట్టిన టీమిండియాకు తొలి ఓవర్లోనే వికెట్ లభించింది. బుమ్రా బౌలింగ్‌లో కగిసో రబడ(1) బౌల్డ్ అయ్యాడు. అతడి రూపంలో సౌతాఫ్రికా ఎనిమిదో వికెట్ కోల్పోయింది. నండ్రీ బర్గర్ క్రీజులోకి వచ్చాడు. 101.5 ఓవర్లలో సౌతాఫ్రికా స్కోరు 396/8. టీమిండియా కంటే 151 పరుగుల ఆధిక్యంలో ఉంది. లంచ్ బ్రేక్ టీమిండియాతో తొలి టెస్టులో మూడో రోజు ఆటలో భాగంగా భోజన విరామ సమయానికి సౌతాఫ్రికా పటిష్ట స్థితిలో నిలిచింది. 100 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 392 పరుగులు చేసింది. భారత్ కంటే 147 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ఇక గురువారం నాటి ఆటలో లంచ్ బ్రేక్ వరకు ఎల్గర్ రూపంలో శార్దూల్ ఠాకూర్, గెరాల్డ్ కోయెట్జీ రూపంలో అశ్విన్ ఈ మ్యాచ్‌లో తమ తొలి వికెట్ తీసుకున్నారు. ఏడో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా 99.1: అశ్విన్ బౌలింగ్‌లో సిరాజ్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరిన గెరాల్డ్ కోయెట్జీ(19). అతడి రూపంలో సౌతాఫ్రికా ఏడో వికెట్ కోల్పోయింది. ఎట్టకేలకు ఎల్గర్ అవుట్ 94.5: శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగిన సౌతాఫ్రికా ఓపెనర్ డీన్ ఎల్గర్. దీంతో సౌతాఫ్రికా ఆరో వికెట్ కోల్పోయింది. అద్భుత సెంచరీతో చెలరేగి సౌతాఫ్రికాను భారీ స్కోరు దిశగా నడిపిస్తున్న ఎల్గర్ ఇన్నింగ్స్‌కు తెరపడటంతో టీమిండియాకు కాస్త ఊరట లభించింది. కాగా డీన్ ఎల్గర్ 185 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటయ్యాడు. గెరాల్డ్ కోయెట్జీ క్రీజులోకి వచ్చాడు. మార్కో జాన్సెన్ 60 పరుగులతో క్రీజులో ఉన్నాడు. 96 ఓవర్లు ముగిసే సరికి సౌతాఫ్రికా స్కోరు: 366/6. 94.3: టెస్టుల్లో మార్కో జాన్సెన్ అత్యధిక స్కోరు 100 పరుగులకు పైగా ఆధిక్యంలో సౌతాఫ్రికా 89.5: వంద పరుగుల భాగస్వామ్యం పూర్తి చేసుకున్న ఎల్గర్, జాన్సెన్. ఓవర్ ముగిసేసరికి ఎల్గర్ 179, జాన్సెన్ 55 పరుగులతో క్రీజులో ఉన్నారు. 89.2: అశ్విన్ బౌలింగ్‌లో మార్కో జాన్సెన్ ఫోర్ బాదడంతో సౌతాఫ్రికా 103 పరుగుల ఆధిక్యంలోకి వెళ్లింది. జాన్సెన్ హాఫ్ సెంచరీ 87.6: సిరాజ్ బౌలింగ్‌లో ఫోర్ బాది అర్ధ శతకం పూర్తి చేసుకున్న మార్కో జాన్సెన్ 78 పరుగుల ఆధిక్యంలో సౌతాఫ్రికా గత పది ఓవర్లలో 45 పరుగులు సాధించింది సౌతాఫ్రికా. ఎల్గర్- జాన్సెన్ 74 పరుగుల మెరుగైన భాగస్వామ్యంతో ముందుకు సాగుతున్నారు. 84వ ఓవర్ పూర్తయ్యేసరికి ఆతిథ్య జట్టు 78 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఇక రెండో రోజు భారత బౌలర్లలో పేసర్లు సిరాజ్, బుమ్రాకు రెండు వికెట్లు దక్కగా.. ప్రసిద్ కృష్ణ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్న విషయం తెలిసిందే. స్కోరు: 323/5 (84) 300 పరుగుల మార్కును అందుకున్న సౌతాఫ్రికా 79వ ఓవర్: తొలి టెస్టులో టీమిండియాపై సౌతాఫ్రికా ఆధిక్యాన్ని పెంచుకుంటూ పోతోంది. 256/5 ఓవర్ నైట్ స్కోరుతో మూడో రోజు ఆటను మొదలుపెట్టిన ప్రొటిస్ జట్టు 79వ ఓవర్ ఆఖరి బంతికి మూడు వందల పరుగుల మార్కును అందుకుంది. సెంచరీ వీరుడు, ఓపెనింగ్ బ్యాటర్ డీన్ ఎల్గర్ గురువారం ఆరంభం నుంచి నిలకడగా ఆడుతూ భారత బౌలర్ల సహనానికి పరీక్ష పెడుతున్నాడు. మరో ఎండ్‌లో మార్కో జాన్సెన్ కూడా చక్కటి సహకారం అందిస్తూ 26 పరుగులు పూర్తి చేసుకున్నాడు. రెండో రోజు హైలైట్స్: ►బాక్సింగ్ డే టెస్టులో శతక్కొట్టిన రాహుల్. ►ఓవర్‌నైట్ స్కోరు 208/8తో తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన టీమిండియా 245 పరుగులకు టీమిండియా ఆలౌట్. ►సౌతాఫ్రికా ఓపెనర్ డీన్ ఎల్గర్ అజేయ సెంచరీ -140 (211 బంతుల్లో). ►అరంగేట్ర బ్యాటర్ బెడింగ్హాం అర్ధ శతకం. ►రెండో రోజు ఆట ముగిసే సరికి సౌతాఫ్రికా స్కోరు: 256-5(66 ఓవర్లలో). ►ఎల్గర్‌తో కలిసి 3 పరుగులతో క్రీజులో ఉన్న మార్కో జాన్సెన్. ►సౌతాఫ్రికాకు 11 పరుగుల స్వల్ప ఆధిక్యం. బాక్సింగ్ డే టెస్టు: సౌతాఫ్రికా వర్సెస్ భారత్ తుదిజట్లు: టీమిండియా రోహిత్ శర్మ(కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ. సౌతాఫ్రికా డీన్ ఎల్గర్, ఐడెన్ మార్క్రమ్, టోనీ డి జోర్జీ, తెంబా బవుమా (కెప్టెన్), కీగన్ పీటర్సన్, డేవిడ్ బెడింగ్హామ్, కైల్ వెరైన్(వికెట్ కీపర్), మార్కో జాన్సెన్, గెరాల్డ్ కోయెట్జీ, కగిసో రబాడ, నండ్రే బర్గర్. -
ఎల్గర్ అజేయ సెంచరీతో...
‘బాక్సింగ్ డే’ టెస్టుపై దక్షిణాఫ్రికా ఆధిక్యం కనబరుస్తోంది. రెండో రోజు ఆటలో భారత్‌ను తొలి ఇన్నింగ్స్‌లో 245 పరుగులకు ఆలౌట్ చేసిన సఫారీ బ్యాటింగ్‌లోనూ సత్తా చాటుకుంది. దక్షిణాఫ్రికా ఆరంభానికి సిరాజ్ తూట్లు పొడిచినప్పటికీ ఓపెనర్ డీన్ ఎల్గర్ (అజేయ) శతకంతో సాఫీగా సాగిపోయింది. రెండు పటిష్టమైన భాగస్వామ్యాలతో సఫారీ తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యం సంపాదించేందుకు ఎల్గర్ కీలకపాత్ర పోషించాడు. సెంచూరియన్: ఓవర్‌నైట్ బ్యాటర్ కేఎల్ రాహుల్ సెంచరీ మినహా తొలి టెస్టులో రెండో రోజంతా దక్షిణాఫ్రికా హవానే నడిచింది. ఓపెనర్ ఎల్గర్ చక్కని సెంచరీతో సఫారీ భారీ స్కోరుపై కన్నేసింది. తద్వారా దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యాన్ని పెంచుకునేందుకు పట్టుబిగిస్తోంది. బుధవారం రెండో రోజు ఆటలో తొలుత భారత్ తొలి ఇన్నింగ్స్ 67.4 ఓవర్లలో 245 పరుగుల వద్ద ముగిసింది. రాహుల్ (137 బంతుల్లో 101; 14 ఫోర్లు, 4 సిక్స్‌లు) టెస్టుల్లో ఎనిమిదో శతకం సాధించాడు. మొదటి రోజే రబడ 5 వికెట్లు తీయగా, రెండో రోజు మిగిలిన రెండు వికెట్లలో కొయెట్జీ (1/74), బర్గర్ (3/50) చెరొకటి తీశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన దక్షిణాఫ్రికా వెలుతురు మందగించి ఆట నిలిచే సమయానికి 66 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 256 పరుగులు చేసి 11 పరుగుల ఆధిక్యం దక్కించుకుంది. ఎల్గర్ (140 బ్యాటింగ్; 23 ఫోర్లు), జాన్సెన్ (3 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. బుమ్రా, సిరాజ్ చెరో 2 వికెట్లు పడగొట్టాడు. శతకం పూర్తయ్యాక ఆలౌట్! వర్షం, గ్రౌండ్ తడి ఆరడానికి సమయం పట్టడంతో రెండో రోజు కూడా ఆట ఆలస్యంగానే మొదలైంది. ఓవర్‌నైట్ స్కోరు 208/8తో తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన భారత్ తొలి సెషన్లో 8.4 ఓవర్లు మాత్రమే ఆడగలిగింది. ఓవర్‌నైట్ బ్యాటర్లు రాహుల్, సిరాజ్ (5) తొమ్మిదో వికెట్‌కు 47 పరుగులు జోడించారు. రాహుల్ సెంచరీకి చేరువయ్యాక కొయెట్టీ 65వ ఓవర్ తొలి బంతికి సిరాజ్‌ను అవుట్ చేశాడు. అదే ఓవర్ ఆఖరి బంతికి భారీ సిక్సర్‌తో రాహుల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కాసేపటికే బర్గర్ అతన్ని బౌల్డ్ చేయడంతో 245 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్‌కు తెరపడింది. సిరాజ్ దెబ్బ తీసినా... దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ ఆరంభంలోనే సిరాజ్ దెబ్బకొట్టాడు. ఓపెనర్ మార్క్రమ్ (5) కీపర్ క్యాచ్‌తో వెనుదిరిగేలా చేశాడు. అయితే భారత శిబిరానికి ఈ ఆనందం తర్వాత శ్రమించక తప్పలేదు. క్రీజులో ఉన్న మరో ఓపెనర్ ఎల్గర్‌కు జతయిన టోనీ డి జార్జి (62 బంతుల్లో 28; 5 ఫోర్లు) భారత బౌలర్లను తేలిగ్గా ఎదుర్కొన్నారు. 49/1 స్కోరువద్ద తొలి సెషన్ ముగియగా... రెండో సెషన్లోనూ ఈ జోడీ భారత బౌలింగ్ దళాన్ని కష్టపెట్టింది. ఎల్గర్ అర్ధసెంచరీ పూర్తి చేసుకోగా... సఫారీ స్కోరు వంద దాటింది. ఈ దశలో బుమ్రా వైవిధ్యమైన బంతులతో రెండు కీలక వికెట్లను పడగొట్టి టీమిండియాను ఊరడించాడు. రెండో వికెట్‌కు 93 పరుగులు జోడించాక జార్జిని, తన మరుసటి ఓవర్లో పీటర్సన్ (2)ను పెవిలియన్ చేర్చాడు. 113 పరుగుల వద్ద 3 వికెట్లను కోల్పోయి ఆత్మరక్షణలో పడింది. అయితే క్రీజులో పాతుకుపోయిన ఎల్గర్‌కు బడింగ్హామ్ చక్కని సహకారం ఇవ్వడంతో మరో భారీ భాగస్వామ్యం దక్షిణాఫ్రికాను నిలబెట్టింది. ఎల్గర్ శతకాన్ని పూర్తి చేసుకోగా... టీ విరామం (194/3) వరకు మరో వికెట్ పడకుండా జాగ్రత్తపడ్డారు. ఆఖరి సెషన్లోనూ ఎల్గర్–బడింగ్హామ్ జోడీ భారత బౌలర్లకు పరీక్షపెట్టింది. ఈ క్రమంలో బడింగ్హామ్ ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. నాలుగో వికెట్‌కు 131 పరుగులు జోడించాక సిరాజ్ ఓవర్లో బడింగ్హామ్ (56; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) నిష్క్రమించాడు. వెరిన్ (4)ను ప్రసిధ్ అవుట్ చేశాడు. తర్వాత కాసేపటికే బ్యాడ్‌లైట్‌తో ఆటను నిలిపివేశారు. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: యశస్వి (సి) వెరిన్ (బి) బర్గర్ 17; రోహిత్ (సి) బర్గర్ (బి) రబడ 5; శుబ్‌మన్ (సి) వెరిన్ (బి) బర్గర్ 2; కోహ్లి (సి) వెరిన్ (బి) రబడ 38; అయ్యర్ (బి) రబడ 31; రాహుల్ (బి) బర్గర్ 101; అశ్విన్ (సి) సబ్–ముల్డర్ (బి) రబడ 8; శార్దుల్ (సి) ఎల్గర్ (బి) రబడ 24; బుమ్రా (బి) జాన్సెన్ 1; సిరాజ్ (సి) వెరిన్ (బి) కొయెట్జీ 5; ప్రసిధ్ కృష్ణ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (67.4 ఓవర్లలో ఆలౌట్) 245. వికెట్ల పతనం: 1–13, 2–23, 3–24, 4–92, 5–107, 6–121, 7–164, 8–191, 9–238, 10–245. బౌలింగ్: రబడ 20–4–59–5, మార్కొ జాన్సెన్ 16–2–52–1, బర్గర్ 15.4–4–50–3, కొయెట్జీ 16–1–74–1. దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్: మార్క్రమ్ (సి) రాహుల్ (బి) సిరాజ్ 5; ఎల్గర్ (బ్యాటింగ్) 140; టోని జార్జి (సి) యశస్వి (బి) బుమ్రా 28; పీటర్సన్ (బి) బుమ్రా 2; బెడింగ్హమ్ (బి) సిరాజ్ 56; వెరిన్ (సి)రాహుల్ (బి) ప్రసిధ్‌కృష్ణ 4; జాన్సెన్ (బ్యాటింగ్) 3; ఎక్స్‌ట్రాలు 18; మొత్తం (66 ఓవర్లలో 5 వికెట్లకు) 256. వికెట్ల పతనం: 1–11, 2–104, 3–113, 4–244, 5–249. బౌలింగ్: బుమ్రా 16–3–48–2, సిరాజ్ 15–0–63–2, శార్దుల్ 12–2–57–0, ప్రసిధ్‌కృష్ణ 15–2–61–1, అశ్విన్ 8–3–19–0. -
IND Vs SA: కేఎల్ రాహుల్, ఎల్గర్ సెంచరీలు! రెండో రోజు హైలైట్స్ ఇవే
South Africa vs India, 1st Test Day 2 Update: టీమిండియాతో తొలి టెస్టులో దక్షిణాఫ్రికా స్వల్ప ఆధిక్యంలో నిలిచింది. రెండో రోజు ఆట ముగిసే సరికి పదకొండు పరుగుల లీడ్‌లో ఉంది. కఠినమైన సెంచూరియన్ పిచ్‌పై వెటనర్ ఓపెనర్ డీన్ ఎల్గర్ అద్భుత సెంచరీతో చెలరేగడంతో.. ప్రొటిస్ జట్టు టీమిండియాపై పైచేయి సాధించింది. బాక్సింగ్ డే టెస్టులో రోహిత్ సేన 208/8 ఓవర్‌నైట్ స్కోరుతో బుధవారం నాటి ఆటను ఆరంభించింది. కేఎల్ రాహుల్ సెంచరీ(101) పూర్తి చేసుకోగా.. 245 పరుగులకు ఆలౌట్ అయింది. సౌతాఫ్రికా పేసర్ కగిసో రబడ ఏకంగా ఐదు వికెట్లు దక్కించుకోగా.. అరంగేట్ర ఫాస్ట్‌బౌలర్ నండ్రీ బర్గర్ మూడు, గెరాల్డ్ కోయెట్జీ, మార్కో జాన్సెన్ ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. ఈ క్రమంలో బరిలోకి దిగిన సౌతాఫ్రికా ఆదిలోనే ఓపెనర్ ఐడెన్ మార్క్రమ్ వికెట్ కోల్పోయింది. టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో 5 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అతడు నిష్క్రమించాడు. అయితే, మరో ఓపెనర్ డీన్ ఎల్గర్, యువ బ్యాటర్ టోనీ డీ జోర్జితో కలిసి మెరుగైన స్కోరుకు పునాది వేశాడు. అయితే, జస్ప్రీత్ బుమ్రా అద్భుత బౌలింగ్‌తో తొలుత టోనీని 28 పరుగులకు.. ఆ తర్వాత అతడి స్థానంలో వచ్చిన కీగాన్ పీటర్సన్ 2 పరుగులకే వెనక్కి పంపాడు. దీంతో సౌతాఫ్రికా మరో రెండు రెండు వికెట్లు కోల్పోయింది. ఇలాంటి దశలో ఎల్గర్‌కు జతకలిసిన అరంగేట్ర బ్యాటర్ డేవిడ్ బెడింగ్హామ్ మరో ఎండ్ నుంచి సహకారం అందించాడు. ఈ క్రమంలో ఎల్గర్.. 42.1 ఓవర్ వద్ద శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో ఫోర్ బాది వంద పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఎల్గర్‌తో చక్కగా సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగిన బెడింగ్హామ్ అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. అయితే, 60.1వ ఓవర్ వద్ద సిరాజ్ అద్భుత బంతితో బౌల్డ్ చేయడంతో అతడి ఇన్నింగ్స్ ముగిసిపోయింది. ఎల్గర్- బెడింగ్హామ్ 131 పరుగుల భారీ భాగస్వామ్యానికి తెరపడింది. దీంతో రోహిత్ సేనకు కాస్త ఊరట లభించగా.. ఆ మరుసటి రెండో ఓవర్లో అరంగేట్ర బౌలర్ ప్రసిద్ కృష్ణ వికెట్ తీసి జట్టులో ఉత్సాహాన్ని నింపాడు. 61.5వ ఓవర్ వద్ద వెరైన్‌ను అవుట్ చేసి అంతర్జాతీయ టెస్టుల్లో తొలి వికెట్‌ను ఖాతాలో వేసుకున్నాడు. వెరైన్ రూపంలో ఐదో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా డ్రింక్స్ బ్రేక్(64వ ఓవర్) సమయానికి 254 పరుగులు సాధించింది. ఈ క్రమంలో సెంచరీ వీరుడు ఎల్గర్‌కు జతైన మార్కో జాన్సెస్ వికెట్ పడకుండా జాగ్రత్త పడగా.. ఎల్గర్ సైతం ఆచితూచి ఆడాడు. అయితే, సౌతాఫ్రికా ఇన్నింగ్స్ 66వ ఓవర్ వద్ద వెలుతురు లేమి కారణంగా అంపైర్లు ఆటను కాసేపు నిలిపివేశారు. ఆ తర్వాత రెండో రోజు ఆటను ముగిస్తున్నట్లు ప్రకటించారు. అప్పటికి సౌతాఫ్రికా పదకొండు పరుగుల ఆధిక్యంలో నిలిచింది. చేతిలో ఇంకా ఐదు వికెట్లు ఉన్నాయి. డీన్ ఎల్గర్ 140, జాన్సెన్ మూడు పరుగులతో క్రీజులో ఉన్నారు. మొత్తానికి రెండో రోజు ఆటలోనూ సౌతాఫ్రికా టీమిండియాపై ఇలా ఆధిపత్యం చాటుకుంది. -
Ind vs SA: సెంచరీతో చెలరేగిన ఎల్గర్.. తొమ్మిదేళ్ల రికార్డు బ్రేక్!
South Africa vs India, 1st Test Day 2: టీమిండియాతో తొలి టెస్టులో సౌతాఫ్రికా బ్యాటర్ డీన్ ఎల్గర్ సెంచరీతో చెలరేగాడు. కఠినమైన పిచ్‌పై వికెట్ పడకుండా జాగ్రత్త పడుతూనే.. అద్భుత ఇన్నింగ్స్‌తో భారత బౌలర్లకు కొరకరానికొయ్యగా తయారయ్యాడు. ఫేర్వెల్ సిరీస్‌లో 140 బంతుల్లోనే వంద పరుగుల మార్కు అందుకుని తన కెరీర్లో మూడో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేశాడు. కాగా సెంచూరియన్ వేదికగా సౌతాఫ్రికా- టీమిండియా మధ్య మంగళవారం బాక్సిండే టెస్టు మొదలైంది. టాస్ గెలిచిన ఆతిథ్య ప్రొటిస్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో.. 208/8 ఓవర్‌నైట్ స్కోరుతో బుధవారం నాటి ఆటను ఆరంభించిన టీమిండియా.. 245 పరుగులకు ఆలౌట్ అయింది. వికెట్లు పడిన ఆనందం నిలవనీయకుండా ఈ క్రమంలో బరిలోకి దిగిన సౌతాఫ్రికాను భారత పేసర్ మహ్మద్ సిరాజ్ ఆదిలోనే దెబ్బకొట్టాడు. ఓపెనర్ ఐడెన్ మార్క్రమ్ను 5 పరుగులకే పెవిలియన్‌కు పంపాడు. అయితే, ఎల్గర్ ఆ సంతోషాన్ని మరీ ఎక్కువ సేపు నిలవనీయలేదు. యువ ప్లేయర్ టోనీ డీ జోర్జితో కలిసి నిలకడగా ఆడుతూ స్కోరు బోర్డును ముందుకు నడిపాడు. కానీ జస్ప్రీత్ బుమ్రా దెబ్బకు టోనీ 28, కీగాన్ పీటర్సన్ 2 పరుగులకు అవుట్ కాగా... సౌతాఫ్రికా మరో రెండు రెండు వికెట్లు కోల్పోయింది. ఫేర్వెల్ సిరీస్‌లో సెంచరీ ఈ క్రమంలో నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన అరంగేట్ర బ్యాటర్ డేవిడ్ బెడింగ్హామ్తో చక్కగా సమన్వయం చేసుకుంటూ ఎల్గర్ ముందుకు సాగాడు. నెమ్మది నెమ్మదిగా స్కోరు పెంచుకుంటూ 42.1 ఓవర్ వద్ద భారత పేసర్ శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో ఫోర్ బాది శతకం పూర్తి చేసుకున్నాడు. టెస్టుల్లో ఎల్గర్‌కు ఇది 14వ శతకం. పటిష్ట టీమిండియాతో సిరీస్ తర్వాత తను రిటైర్ అవుతున్న క్రమంలో సెంచరీ బాదడంతో ఈ వెటరన్ ఓపెనర్ సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి. ఇక ఎల్గర్ సెంచరీ సెలబ్రేషన్స్ చేసుకుంటున్న సమయంలో స్లిప్స్‌లో ఫీల్డింగ్ చేస్తున్న భారత స్టార్ విరాట్ కోహ్లి చప్పట్లతో అతడిని అభినందించడం విశేషం. తొమ్మిదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత.. సొంతగడ్డపై టీమిండియాతో టెస్టు సిరీస్‌లో సౌతాఫ్రికా బ్యాటర్లు సెంచరీ చేసి తొమ్మిదేళ్లకు పైగానే అయింది. ఎల్గర్ తాజా మ్యాచ్‌లో శతకం బాదడం ద్వారా ఆ రికార్డును బ్రేక్ చేశాడు. స్వదేశంలో 2014 తర్వాత భారత్‌పై సెంచరీ సాధించిన సౌతాఫ్రికా తొలి బ్యాటర్‌గా నిలిచాడు. ఈ నేపథ్యంలో కఠిన పిచ్‌పై ఈ మేరకు అద్భుత ఇన్నింగ్స్ ఆడిన డీన్ ఎల్గర్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇక టీ విరామ సమయానికి సౌతాఫ్రికా 49 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసి పటిష్ట స్థితిలో నిలిచింది. ఎల్గర్ 115, బెడింగ్హాం 32 పరుగులతో క్రీజులో ఉన్నారు. చదవండి: Virat Kohli: ఓసారి మా అక్క నన్ను బాగా కొట్టింది.. రూ. 50 నోటు చూడగానే చించేసి! 8️⃣4️⃣ Test Matches 5️⃣1️⃣4️⃣6️⃣ Runs 2️⃣3️⃣ Fifties 1️⃣3️⃣ Tons Dean Elgar's last dance gets underway as he steps to the crease at SuperSport Park 🇿🇦#ThankYouDean #WozaNawe#BePartOfIt pic.twitter.com/m3FQNj4K9v — Proteas Men (@ProteasMenCSA) December 27, 2023 -
IND vs SA: ముగిసిన రెండో రోజు ఆట.. సౌతాఫ్రికాదే పైచేయి!
South Africa vs India, 1st Test Day 2 Updates: వెలుతురు లేమి కారణంగా ఆటను ముగిస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. ఈ క్రమంలో రెండో రోజు ఆట ముగిసే సరికి పదకొండు పరుగుల స్వల్ప ఆధిక్యంతో టీమిండియాపై సౌతాఫ్రికా పైచేయి సాధించింది. 66: వెలుతురు లేమి కారణంగా ఆటకు అంతరాయం వెలుతురు లేమి కారణంగా ఆటను నిలిపివేసే సమయానికి సౌతాఫ్రికా 66 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 256 పరుగులు చేసి పదకొండు పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ఎల్గర్ 140, మార్కో జాన్సెన్ మూడు పరుగులతో క్రీజులో ఉన్నారు. టీమిండియా పేసర్లలో బుమ్రాకు రెండు, సిరాజ్‌కు రెండు, ప్రసిద్ కృష్ణకు ఒక వికెట్ దక్కాయి. ఐదో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా ప్రసిద్ కృష్ణ బౌలింగ్‌లో ఐదో వికెట్‌గా వెనుదిరిగిన వెరైన్. వికెట్ కీపర్ రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. స్కోరు: 249/5 (61.5) 60.4: ఆధిక్యంలోకి వచ్చిన సౌతాఫ్రికా సిరాజ్ బౌలింగ్‌లో వెరైన్ ఫోర్ బాదడంతో ఆతిథ్య సౌతాఫ్రికా ఆధిక్యంలోకి వచ్చింది. నాలుగో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా 60.1: సిరాజ్ బౌలింగ్‌లో బెడింగ్హాం(56) బౌల్డ్. దీంతో సౌతాఫ్రికా నాలుగో వికెట్ కోల్పోగా.. సెంచరీ వీరుడు ఎల్గర్‌తో కలిసి 131 పరుగుల పటిష్ట భాగస్వామ్యానికి తెరపడింది. స్కోరు: 244/4 (60.1). బెడింగ్హాం అర్ధ శతకం 57.6: ప్రసిద్ కృష్ణ బౌలింగ్‌లో సింగిల్ తీసి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న సౌతాఫ్రికా అరంగేట్రం బ్యాటర్ బెడింగ్హాం. టీ బ్రేక్ సమయానికి టీ విరామ సమయానికి సౌతాఫ్రికా 49 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. ఎల్గర్ 115, బెడింగ్హాం 32 పరుగులతో క్రీజులో ఉన్నారు. 42.1: డీన్ ఎల్గర్ సెంచరీ శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో ఫోర్ బాది వంద పరుగులు పూర్తి చేసుకున్న సౌతాఫ్రికా ఓపెనర్ డీన్ ఎల్గర్. టెస్టుల్లో అతడికి ఇది 14వ సెంచరీ. టీమిండియాతో సిరీస్ తర్వాత రిటైర్ కానున్న ఎల్గర్. 32 ఓవర్లలో సౌతాఫ్రికా స్కోరు: 125/3 ఎల్గర్ 76, డేవిడ్ బెగిడింగ్హాం ఆరు పరుగులతో క్రీజులో ఉన్నారు. 30.2: మూడో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా బుమ్రా బౌలింగ్‌లో కీగాన్ పీటర్సన్ బౌల్డ్ అయ్యాడు. రెండు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్ చేరాడు. రెండో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా 28.6: బుమ్రా బౌలింగ్‌లో టోనీ డి జోర్జి(28) యశస్వి జైస్వాల్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. దీంతో సౌతాఫ్రికా రెండో వికెట్ కోల్పోయింది. సౌతాఫ్రికా స్కోరు: 104-2(28). ఎల్గర్, కీగాన్ పీటర్సన్ క్రీజులో ఉన్నారు. 28: వంద పరుగుల మార్కు అందుకున్న సౌతాఫ్రికా ఎల్గర్ 65, టోనీ 24 పరుగులతో క్రీజులో ఉన్నారు. స్కోరు: 100-1 ఎల్గర్ అర్ధ శతకం.. స్కోరు: 91-1(24) 22.6: శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో సింగిల్ తీసి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న ఎల్గర్. అర్ధ శతకానికి చేరువైన ఎల్గర్ లంచ్ బ్రేక్ తర్వాత సౌతాఫ్రికా బ్యాటర్లు కాస్త వేగం పెంచారు. 22 ఓవర్లు ముగిసే సరికి ఎల్గర్ 45, టోని 23 పరుగులతో క్రీజులో ఉన్నారు. 49-1@ లంచ్‌బ్రేక్ భోజన విరామ సమయానికి సౌతాఫ్రికా 16 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 49 పరుగులు చేసింది. టీమిండియా కంటే 196 పరుగులు వెనుకబడి ఉంది. ప్రస్తుతం డీన్ ఎల్గర్ 29, టోని 12 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇక సిరాజ్ బౌలింగ్‌లో మార్క్రమ్ తొలి వికెట్‌గా వెనుదిరిగిన విషయ తెలిసిందే. ఈ క్రమంలో ఎల్గర్, టోనీ ఆచితూచి ఆడుతున్నారు. పది ఓవర్లలో సౌతాఫ్రికా స్కోరు: 33/1 7 ఓవర్లు ముగిసే సరికి సౌతాఫ్రికా స్కోరు: 22-1 ఎల్గర్ 10, టోని 5 పరుగులతో క్రీజులో ఉన్నారు. 3.5: తొలి వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా టీమిండియా పేసర్ సిరాజ్బౌలింగ్లో మార్క్రమ్ వికెట్ కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు. ఐదు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు. స్కోరు: 11-1(4). డీన్ ఎల్గర్, టోనీ క్రీజులో ఉన్నారు. భారత్ 245 పరుగులకు ఆలౌట్ సెంచూరియన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మొదటి టెస్టులో టీమిండియా తొలి ఇన్నింగ్స్ ముగిసింది. మొదటి ఇన్నింగ్స్‌లో 245 పరుగులకు భారత్ ఆలౌటైంది. 208/8 ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియా.. అదనంగా 37 పరుగులు చేసి ఆలౌటైంది. భారత బ్యాటర్లలో కేఎల్ రాహుల్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. కష్టమైన పరిస్థితుల్లో రాహుల్ తన క్లాస్‌ను చూపించాడు. టెయిలాండర్లతో కలిసి భారత్‌కు గౌరవప్రదమైన స్కోర్‌ను అందించాడు. రాహుల్ 137 బంతుల్లో 14 ఫోర్లు, 4 సిక్స్‌లతో 101 పరుగులు చేశాడు. రాహుల్‌తో పాటు విరాట్ కోహ్లి(38), శ్రేయస్ అయ్యర్(31) పరుగులతో రాణించాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో రబాడ ఐదు వికెట్లతో చెలరేగగా.. డెబ్యూ ఆటగాడు బర్గర్ 3 వికెట్లతో అదరగొట్టాడు. కేఎల్ రాహుల్ సెంచరీ.. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. 133 బంతుల్లో 14 ఫోర్లు, 4 సిక్స్‌లతో తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. దక్షిణాఫ్రికా గడ్డపై రాహుల్‌కు ఇది రెండో సెంచరీ కావడం విశేషం. రాహుల్ ప్రస్తుతం 101 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నాడు. క్రీజులో రాహుల్‌తో పాటు ప్రసిద్ద్ కృష్ణ ఉన్నాడు. తొమ్మిదో వికెట్ డౌన్.. 238 పరుగుల వద్ద టీమిండియా తొమ్మిదో వికెట్ కోల్పోయింది. 5 పరుగులు చేసిన సిరాజ్.. కోయట్జీ బౌలింగ్‌లో ఔటయ్యాడు. దూకుడుగా ఆడుతున్న రాహుల్.. రెండో రోజు ఆట ప్రారంభం నుంచే టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ దూకుడుగా ఆడుతున్నాడు. 63 ఓవర్లు ముగిసే సరికి భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్ల నష్టానికి 223 పరుగులు చేసింది. క్రీజులో రాహుల్(80), సిరాజ్(5) పరుగులతో ఉన్నారు. రెండో రోజు ఆట ప్రారంభం.. సెంచూరియన్ వేదికగా భారత్-దక్షిణాఫ్రికా తొలి టెస్టు రెండు రోజు ఆట ప్రారంభమైంది. క్రీజులో కేఎల్ రాహుల్(70), మహ్మద్ సిరాజ్ ఉన్నారు. వర్షం కారణంగా 30 నిమిషాల ఆలస్యంగా ఆట ఆరంభమైంది. కాగా తొలి రోజు టీమిండియా 8 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. -
టీమిండియాతో సిరీస్: టెస్టులకు సౌతాఫ్రికా ఓపెనర్ వీడ్కోలు
Dean Elgar Retirement: సౌతాఫ్రికా వెటరన్ ఓపెనర్ డీన్ ఎల్గర్ కీలక ప్రకటన చేశాడు. టీమిండియాతో సిరీస్ తర్వాత తాను టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలకనున్నట్లు తెలిపాడు. సొంతగడ్డపై ఆడనున్న రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ తన కెరీర్లో చివరిదని పేర్కొన్నాడు. ఈ మేరకు.. ‘‘క్రికెట్ ఆడాలన్నది నా కల. అయితే, దేశానికి ప్రాతినిథ్యం వహించే అవకాశం రావడం అన్నింటికంటే అత్యుత్తమైన విషయం. నా ఆశయాలను నెరవేర్చుకునే క్రమంలో 12 ఏళ్ల పాటు అంతర్జాతీయ క్రికెట్ ఆడటం ఎంతో గర్వంగా ఉంది. నాకిష్టమైన స్టేడియంలోనే.. ఇదొక అసాధారణ ప్రయాణం. ఇలాంటి అవకాశం దక్కడం నిజంగా నా అదృష్టం. సొంతగడ్డపై టీమిండియాతో సిరీస్ నా కెరీర్లో చివరిది కానుంది. అందమైన, అద్భుతమైన ఆట నుంచి రిటైర్ అవ్వాలని నిర్ణయించుకున్నాను. కేప్‌టౌన్‌లో నా చివరి టెస్టు మ్యాచ్ ఆడనున్నాను. ప్రపంచంలోకెల్లా నా అభిమాన స్టేడియం అది. అక్కడే నేను న్యూజిలాండ్‌తో మ్యాచ్ సందర్భంగా తొలిసారి టెస్టుల్లో పరుగు నమోదు చేశాను. అక్కడే నా చివరి పరుగు కూడా తీయాలనుకుంటున్నాను’’ అని డీన్ ఎల్గర్ భావోద్వేగపూరిత ప్రకటన చేశాడు. అందరికీ ధన్యవాదాలు తన ప్రయాణంలో అండగా నిలిచిన తల్లిదండ్రులు, సోదరుడు, జీవిత భాగస్వామి నికోల్, స్పాన్సర్స్, క్రికెట్ సౌతాఫ్రికా.. అన్నింటికీ మించి తనను ఇన్నాళ్లుగా ప్రోత్సహిస్తున్న అభిమానులకు ఎల్గర్ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపాడు. కాగా 2012లో సౌతాఫ్రికా తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ సందర్భంగా అరంగేట్రం చేసిన ఈ లెఫ్టాండ్ బ్యాటర్.. అదే ఏడాది ఆస్ట్రేలియాతో మ్యాచ్ సందర్భంగా టెస్టుల్లో ఎంట్రీ ఇచ్చాడు. అయితే, పరిమిత ఓవర్ల క్రికెట్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన ఎల్గర్ కెరీర్లో కేవలం 8 అంతర్జాతీయ వన్డేలు ఆడి.. 104 పరుగులు చేశాడు. ఇక ఇప్పటి వరకు మొత్తంగా 84 టెస్టులు ఆడి 5146 పరుగులు సాధించాడు. టెస్టుల్లో ఎల్గర్ అత్యధిక స్కోరు 199. సౌతాఫ్రికా తరఫున పలు చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడిన 36 ఏళ్ల డీన్ ఎల్గర్.. పలు మ్యాచ్‌లలో కెప్టెన్‌గానూ వ్యవహరించాడు. చదవండి: విరాట్ కోహ్లి 3.O.. 2023లో ఎన్నో ఘనతలు! కానీ అదొక్కటే -
దక్షిణాఫ్రికా టెస్టు కెప్టెన్‌గా బవుమా.. టీ20లకు గుడ్‌బై!
దక్షిణాఫ్రికా టెస్టు కెప్టెన్ డీన్ ఎల్గర్‌పై వేటు పడింది. తమ జట్టు కెప్టెన్సీ బాధ్యతలు నుంచి ఎల్గర్‌ను దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు తప్పించింది. అతడి స్థానంలో పరిమిత ఓవర్ల క్రికెట్లో సారథ్య బాధ్యతలు నిర్వహిస్తున్న టెంబా బవుమాను దక్షిణాఫ్రికా క్రికెట్ నియమించింది. అయితే దక్షిణాఫ్రికా కొత్త టెస్టు సారథిగా బాధ్యతలు చేపట్టనున్న బవుమా.. టీ20 కెప్టెన్సీ మాత్రం గుడ్‌బై చెప్పనున్నాడు. అతడు కేవలం టెస్టులు, వన్డేలకు మాత్రమే సారథిగా వ్యవహరించనున్నాడు. అదే విధంగా టీ20ల్లో ప్రోటీస్ కెప్టెన్‌గా మార్క్రమ్ ఎంపికయ్యే ఛాన్స్ ఉంది. కాగా రెడ్‌బాల్ క్రికెట్లో సఫారీ జట్టు కెప్టెన్ అయిన తొలి నల్ల జాతీయుడిగా బవుమా రికార్డు సృష్టించనున్నాడు. ఇక ఎల్గర్ విషయానికి వస్తే.. ఇప్పటివరకు 17 టెస్టుల్లో జట్టుకు నాయకత్వం వహించాడు. 17 మ్యాచ్‌ల్లో 9 విజయాలు, 7 ఓటములు, ఒకడ్రా ఉన్నాయి. అయితే వరుసగా ఇంగ్లండ్ ఆస్ట్రేలియా సిరీస్‌లలో దక్షిణాఫ్రికా ఓటమి పాలవ్వడంతో ప్రోటీస్ సెలక్టర్లు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సిరీస్‌లలో మాత్రం ఎల్గర్ కెప్టెన్‌గా, బ్యాటర్‌గా ఆకట్టుకోలేదు. తన స్థాయికి తగ్గట్టు రాణించడం విఫలమయ్యాడు. కాగా స్వదేశంలో వెస్టిండీస్ టెస్టు సిరీస్‌కు జట్టును ప్రకటించిన దక్షిణాఫ్రికా సెలక్షన్ కమిటీ.. ఈ కీలక మార్పు చేసింది. ఫిబ్రవరి 28 నుంచి సెంచూరియన్ వేదికగా దక్షిణాఫ్రికా-వెస్టిండీస్ మధ్య తొలి టెస్టు ప్రారంభం కానుంది. విండీస్‌తో టెస్టులకు ప్రోటీస్ జట్టు: టెంబా బావుమా (కెప్టెన్), గెరాల్డ్ కోయెట్జీ, టోనీ డి జోర్జి, డీన్ ఎల్గర్, సైమన్ హార్మర్, మార్కో జాన్సెన్, హెన్రిచ్ క్లాసెన్, కేశవ్ మహరాజ్, ఐడెన్ మార్క్రామ్, వియాన్ ముల్డర్, సెనురాన్ ముత్తుసామి, అన్రిచ్ నోర్ట్జే, కీగన్ పీటర్సన్, కగిసో రబాడ,ర్యాన్ రికెల్టన్ చదవండి: IPL 2023: మూడేళ్ల తర్వాత హోంగ్రౌండ్లో.. ఎస్ఆర్హెచ్ షెడ్యూల్ ఇదే Introducing the new #Proteas Test captain - Temba Bavuma 💪 He remains captain of the ODI side while he has opted to relinquish the captaincy of the T20I side. #BePartOfIt pic.twitter.com/WgsbHhEgss — Proteas Men (@ProteasMenCSA) February 17, 2023 -
విజయానికి 13 వికెట్ల దూరంలో.. అసాధ్యం మాత్రం కాదు..!
సిడ్నీ: ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లో దక్షిణాఫ్రికా పేలవ బ్యాటింగ్ ప్రదర్శన కొనసాగింది. మూడో టెస్టు నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 149 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన సఫారీ టీమ్.. ఆఖరి రోజు లంచ్ విరామం సమయానికి 7 వికెట్ల నష్టానికి 244 పరుగులు చేసింది. ఖాయా జోండో (39), తెంబా బవుమా (35) ఓ మోస్తరుగా రాణించగా.. సిమోన్ హార్మర్ (45 నాటౌట్), కేశవ్ మహారాజ్ (49 నాటౌట్) అద్భుతమైన పోరాటపటిమ కనబరుస్తున్నారు. ప్రస్తుతం దక్షిణాఫ్రికా మరో 231 పరుగులు వెనుకబడి ఉంది. ప్రస్తుత సమీకరణల ప్రకారం ఆసీస్ ఆధిపత్యం కనిపిస్తున్నా.. మ్యాచ్ ‘డ్రా’గా ముగిసే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరో రెండు సెషన్ల ఆటలో ఆసీస్ బౌలర్లు మరో 13 వికెట్లు నేలకూల్చగలిగితే.. మ్యాచ్‌తో పాటు సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసే అవకాశం ఉంటుంది. అయితే ఇది అంత సులువు కాదు. కాగా, ఈ మ్యాచ్‌లో ఆసీస్ 475/4 స్కోర్ వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసిన విషయం తెలిసిందే. వరుణుడి ఆటంకం, వెలుతురు లేమి సమస్యల కారణంగా తొలి రోజు 47 ఓవర్ల ఆటకు కోత పడగా, రెండో రోజు 14 ఓవర్ల ఆట సాధ్యపడలేదు. ఇక మూడో రోజు ఆట వర్షం కారణంగా పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. నాలుగో రోజు కూడా వర్షం కారణంగా తొలి సెషన్ మొత్తం రద్దైంది. ఈ నేపథ్యంలో మ్యాచ్‌లో ఎలాగైనా ఫలితం రాబట్టాలని ఆసీస్ కెప్టెన్ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేశాడు. ఈ క్రమంతో ఉస్మాన్ ఖ్వాజా (195 నాటౌట్) డబుల్ సెంచరీ పూర్తి చేసే అవకాశం ఉన్నా ఆసీస్ కెప్టెన్ సాహసోపేత నిర్ణయం తీసుకుని అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఆసీస్ ఇన్నింగ్స్‌లో ఖ్వాజాతో పాటు స్టీవ్ స్మిత్ (104) సెంచరీలు చేయగా.. లబూషేన్ (79), ట్రవిస్ హెడ్ (70) అర్ధసెంచరీలు సాధించారు. ఇదిలా ఉంటే, 3 మ్యాచ్‌ల ఈ టెస్ట్ సిరీస్‌ను ఆసీస్ ఇదివరకే 2-0 తేడాతో కైవసం చేసుకుంది. -
Aus Vs SA: ఆసీస్ భారీ స్కోరు.. చతికిల పడ్డ ప్రొటిస్! మరోసారి..
Australia vs South Africa, 2nd Test Day 3 Highlights: ఆస్ట్రేలియాలో సౌతాఫ్రికా పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ రేసులో నిలిచేందుకు కీలకమైన సిరీస్‌లో ఇప్పటికే తొలి మ్యాచ్‌లో ఓడింది ప్రొటిస్. మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా బ్రిస్బేన్ మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఆతిథ్య ఆసీస్ చేతిలో ఓడిన సౌతాఫ్రికా.. రెండో టెస్టులోనూ పెద్దగా ప్రభావం చూపలేకపోతోంది. మెల్బోర్న్ మ్యాచ్‌లో మూడో రోజు ఆట ముగిసే సరికి 371 పరుగుల వెనుకబడి ఉంది. కాగా సోమవారం ఆరంభమైన ఈ టెస్టులో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన ప్రొటిస్‌ను ఆల్‌రౌండర్‌ను కామెరాన్ గ్రీన్ దెబ్బకొట్టాడు. 10.4 ఓవర్లలో 27 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు కూల్చాడు. 189కే ఆలౌట్ ఈ క్రమంలో 189 పరుగులకు ఆలౌట్ అయిన సౌతాఫ్రికా.. బౌలింగ్‌లోనూ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఓపెనర్ డేవిడ్ వార్నర్ (200), స్టీవ్ స్మిత్(85) అద్భుత ఇన్నింగ్స్ ఆడగా.. ట్రవిస్ హెడ్(51), గ్రీన్(51- నాటౌట్) రాణించారు. ఇక అలెక్స్ క్యారీ టెస్టు కెరీర్లో తొలి సెంచరీ(111)తో మెరిశాడు. ఈ క్రమంలో మూడో రోజు ఆటలో 8 వికెట్ల నష్టానికి 575 పరుగులు చేసిన ఆస్ట్రేలియా 575 పరుగుల వద్ద తమ తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. ప్రొటిస్ బౌలర్లలో రబడకు రెండు, నోర్జేకు మూడు వికెట్లు దక్కగా.. లుంగి ఎంగిడి, మార్కో జాన్సెన్ తలా ఓ వికెట్ తీశారు. కెప్టెన్ మరోసారి విఫలం ఈ నేపథ్యంలో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన సౌతాఫ్రికాకు శుభారంభం లభించలేదు. ప్రొటిస్ కెప్టెన్, ఓపెనింగ్ బ్యాటర్ డీన్ ఎల్గర్ మరోసారి విఫలమయ్యాడు. ఆసీస్ సారథి ప్యాట్ కమిన్స్ బౌలింగ్‌లో డకౌట్‌గా వెనుదిరిగాడు. ఇక మూడో రోజు ఆట ముగిసే సరికి వికెట్ నష్టానికి సౌతాఫ్రికా 17 పరుగులు చేసింది. ఓపెనర్ సారెల్ ఎర్వీ(7), థీనిస్ డి బ్రూయిన్ (6) క్రీజులో ఉన్నారు. కాగా ఎల్గర్ తొలి ఇన్నింగ్స్‌లో 26 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రనౌట్ అయ్యాడు. మూడో రోజు ఆట ముగిసే సరికి స్కోర్లు: ఆస్ట్రేలియా- 575/8 d సౌతాఫ్రికా- 189 & 15/1 (7) చదవండి: Ind Vs SL T20 Series: సెంచరీ బాదినా కనబడదా? నువ్వు ఐర్లాండ్ వెళ్లి ఆడుకో! ఇక్కడుంటే.. Devon Conway: కాన్వే అరుదైన రికార్డు! తొలి కివీస్ బ్యాటర్‌గా.. కానీ అదొక్కటే మిస్! Nothing sweeter than getting your opposition skipper... for a duck! #OhWhatAFeeling #AUSvSA | @Toyota_Aus pic.twitter.com/KdTEdLZNFq — cricket.com.au (@cricketcomau) December 28, 2022 -
AUS Vs SA 1st Test: ఉగ్రరూపం దాల్చిన పేసర్లు.. రెండు రోజుల్లోనే ఖేల్ ఖతం
గబ్బా వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్ట్‌లో ఆతిధ్య ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఫలితంగా 3 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఈ మ్యాచ్‌లో ఇరు జట్ల పేస్ బౌలర్లు నిప్పులు చెరిగినప్పటికీ.. సఫారీలతో పోలిస్తే ఆస్ట్రేలియా కాస్త మెరుగ్గా బ్యాటింగ్ చేయడంతో విజయం సాధించగలిగింది. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో ట్రవిస్ హెడ్ (96 బంతుల్లో 92; 13 ఫోర్లు, సిక్స్) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి ఆసీస్ గెలుపులో కీలకపాత్ర పోషించాడు. ఆట తొలి రోజు 15 వికెట్లు నేలకూలిన ఈ టెస్ట్ మ్యాచ్‌లో రెండో రోజు ఏకంగా 19 వికెట్లు పడ్డాయి. దీంతో ఈ మ్యాచ్ కేవలం రెండు రోజుల్లోనే ముగిసింది. ఓవర్‌నైట్ స్కోర్ 145/5 వద్ద రెండో రోజు ఆటను కొనసాగించిన ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో మరో 73 పరుగులు జోడించి 218 పరుగుల వద్ద ఆలౌటైంది. ట్రవిస్ హెడ్ 8 పరుగుల తేడాతో సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. సఫారీ బౌలర్లలో రబాడ 4 వికెట్లు పడగొట్టగా.. జన్సెన్ 3, నోర్జే 2, ఎంగిడి ఓ వికెట్ దక్కించుకున్నారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌతాఫ్రికా.. పాట్ కమిన్స్ (5/42), మిచెల్ స్టార్క్ (2/26), స్కాట్ బోలాండ్ (2/14), నాథన్ లయోన్ (1/17) ధాటికి 99 పరుగులకే కుప్పకూలింది. 34 పరుగుల నామమాత్రపు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆసీస్‌ను సఫారీ ఏస్ పేసర్ రబాడ వణికించాడు. 4 ఓవర్లలో కేవలం 13 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. ఓపెనర్లు ఉస్మాన్ ఖ్వాజా (2), డేవిడ్ వార్నర్ (3), స్టీవ్ స్మిత్ (6), ట్రవిస్ హెడ్ (0) సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమైప్పటికీ 19 పరుగులు ఎక్స్‌ట్రాల రూపంలో రావడంతో ఆసీస్ గెలుపొందింది. అంతకుముందు సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 152 పరుగులకే ఆలౌటైన విషయం తెలిసిందే. సఫారీ ఇన్నింగ్స్‌లో వికెట్‌కీపర్ వెర్రిన్ (64) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించాడు. -
ఆసీస్‌తో టెస్టు సిరీస్.. జట్టును ప్రకటించిన దక్షిణాఫ్రికా! స్టార్ బ్యాటర్ రీ ఎంట్రీ
ఆస్ట్రేలియాతో జరగనున్న మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు 16 మంది సభ్యులతో కూడిన తమ జట్టును దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు సోమవారం ప్రకటించింది. ఈ జట్టుకు డీన్ ఎల్గర్ సారథ్యం వహించనున్నాడు. కాగా ఆసీస్ సిరీస్‌కు ఆ జట్టు స్టార్ బ్యాటర్ మార్క్రమ్ను ప్రోటీస్ సెలక్టర్లు ఎంపిక చేయకపోవడం గమనార్హం. అదే విధంగా ఈ సిరీస్‌కు కీగన్ పీటర్సన్ కూడా గాయం కారణంగా దూరమయ్యాడు. ఇక గాయం కారణంగా టీ20 ప్రపంచకప్‌కు దూరమైన ప్రోటీస్ కీలక ఆటగాడు రాస్సీ వాన్ డెర్ డుసెన్ తిరిగి జట్టులోకి వచ్చాడు. అదే విధంగా గత కొంత కాలంగా జట్టుకు దూరంగా ఉంటున్న బ్యాటర్ డి బ్రుయిన్కు తిరిగి చోటు దక్కింది. డి బ్రుయిన్ చివరిసారిగా 2019లో దక్షిణాఫ్రికా తరపున టెస్టుల్లో ఆడాడు. మరోవైపు యువ ఫాస్ట్ బౌలర్ గెరాల్డ్ కోయెట్జీ దక్షిణాఫ్రికా తరపున అరంగేట్రం చేయనున్నాడు. ఇక డిసెంబర్ 17న బ్రిస్బేన్ వేదికగా జరగనున్న తొలి టెస్టుతో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. కాగా టెంబా బావుమా సారథ్యంలో ప్రోటీస్ జట్టు టీ20 ప్రపంచకప్-2022లో గ్రూపు దశలోనే ఇంటిముఖం పట్టిన సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియా సిరీస్‌కు దక్షిణాఫ్రికా జట్టు: డీన్ ఎల్గర్ (కెప్టెన్), టెంబా బావుమా, గెరాల్డ్ కోయెట్జీ, థ్యూనిస్ డి బ్రుయిన్, సరెల్ ఎర్వీ, సైమన్ హర్మర్, మార్కో జాన్సెన్, హెన్రిచ్ క్లాసెన్, కేశవ్ మహరాజ్, లుంగి ఎన్గిడి, అన్రిచ్ నార్ట్జే, కగిసో రబడ, గ్లెంటన్ స్టౌర్మాన్, కెన్ డ్యూస్లీ వెర్నీ, కె. , ఖయా జోండో -
దక్షిణఫ్రికాతో మూడో టెస్టు.. విజయం దిశగా ఇంగ్లండ్!
లండన్: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న చివరిదైన మూడో టెస్టులో ఇంగ్లండ్ విజయానికి చేరువైంది. మ్యాచ్ నాలుగో రోజు 130 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 17 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 97 పరుగులు సాధించింది. ఓపెనర్లు అలెక్స్ లీస్ (32 బ్యాటింగ్), జాక్ క్రాలీ (57 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. నేడు మరో 33 పరుగులు చేస్తే ఇంగ్లండ్ గెలుస్తుంది. అంతే కాకుండా మూడు టెస్టుల సిరీస్‌ను 2–1తో సొంతం చేసుకుంటుంది. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 154/7తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లండ్ మరో నాలుగు పరుగులు జోడించి 158 పరుగులవద్ద ఆలౌటైంది. 40 పరుగులతో వెనుకబడి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన దక్షిణాఫ్రికా 169 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ బౌలర్లు బ్రాడ్ (3/45), స్టోక్స్ (3/39), అండర్సన్ (2/37), ఒలీ రాబిన్సన్ (2/40) రాణించారు. చదవండి: Asia Cup 2022 Final: అలా అయితే రాజపక్స 70 పరుగులకు విలువే ఉండేది కాదు! కానీ..: పాక్ మాజీ కెప్టెన్ -
నిప్పులు చెరిగిన పేసర్లు.. ఒకే రోజు 17 వికెట్లు
లండన్: ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా మధ్య మూడో టెస్టును బౌలర్లు శాసిస్తున్నారు. రెండు రోజులు ఆలస్యంగా మొదలైన మూడో టెస్టులో ఒక్క మూడో రోజు ఆటలోనే 17 వికెట్లు కూలాయి. మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 36.2 ఓవర్లలో 118 పరుగులకే ఆలౌటైంది. జాన్సెన్ (30; 4 ఫోర్లు), జొండో (23; 1 ఫోర్, 1 సిక్స్) కాసేపు ఆడారు. మిగిలిన వారిని రాబిన్సన్ (5/49), స్టువర్ట్ బ్రాడ్ (4/41) జంటగా పడగొట్టేశారు. తర్వాత తొలి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఇంగ్లండ్ ఆట నిలిచే సమయానికి 33.4 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. ఒలీ పోప్ (67; 13 ఫోర్లు) రాణించడంతో ప్రస్తుతం ఇంగ్లండ్ 36 పరుగుల ఆధిక్యంలోనే ఉంది. జాన్సెన్ 4, రబడ 2 వికెట్లు తీశాడు. తొలి రోజు ఆట వర్షార్పణం కాగా... రెండో రోజు క్వీన్ ఎలిజబెత్–2 మృతికి సంతాప సూచకంగా ఆటను రద్దు చేశారు. మూడో రోజు ఉదయం ఇరు జట్ల ఆటగాళ్లు బ్రిటన్ రాణికి నివాళులు అర్పించాకే ఆట మొదలైంది. -
చెలరేగిన ఇంగ్లండ్ బౌలర్లు.. సౌతాఫ్రికా 151 ఆలౌట్
సౌతాఫ్రికాతో తొలి టెస్టులో ఇన్నింగ్స్ తేడాతో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న ఇంగ్లండ్ గురువారం ప్రారంభమైన రెండో టెస్టులో మాత్రం అదరగొట్టింది. ఇంగ్లండ్ పేసర్లు చెలరేగడంతో దక్షిణాఫ్రికా తమ తొలి ఇన్నింగ్స్‌లో 151 పరుగులకే ఆలౌటైంది. ప్రొటీస్ బ్యాటర్లలో కగిసో రబడా 36 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవడం విశేషం. వెరిన్నే, కీగన్ పీటర్సన్ తలా 21 పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో జేమ్స్ అండర్సన్, స్టువర్ట్ బ్రాడ్ చెరో మూడు వికెట్లు తీయగా.. కెప్టెన్ బెన్‌స్టోక్స్ 2 వికెట్లు, ఓలి రాబిన్సన్, జాక్ లీచ్ చెరొక వికెట్ తీశారు. ఇదే మ్యాచ్‌లో ఇంగ్లండ్ వెటరన్ స్టార్ బౌలర్ జేమ్స్ అండర్సన్ టెస్టుల్లో మరో అరుదైన ఘనత సాధించాడు. స్వదేశంలో వంద టెస్టులు పూర్తి చేసుకున్న తొలి క్రికెటర్‌గా జేమ్స్ అండర్స్‌న్ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. అండర్సన్ తర్వాతి స్థానంలో టీమిండియా దిగ్గజం మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్(స్వదేశంలో 94 టెస్టులు) రెండో స్థానంలో ఉండగా.. ఆసీస్ దిగ్గజం రికీ పాంటింగ్(స్వదేశంలో 92 టెస్టులు) మూడో స్థానంలో.. ఇక నాలుగో స్థానంలో ఇంగ్లండ్ సీనియర్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్(స్వదేశంలో 91 టెస్టులు) ఉన్నాడు. చదవండి: Asia Cup 2022: పాక్ క్రికెటర్‌పై పుజారా ప్రశంసల వర్షం James Anderson: జేమ్స్ అండర్సన్ అరుదైన ఘనత.. తొలి క్రికెటర్‌గా ప్రపంచ రికార్డు -
ఇంగ్లండ్ జట్టుకు ఘోర పరాభవం.. 19 ఏళ్ల తర్వాత తొలి సారిగా!
లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టులో దక్షిణాఫ్రికా ఘన విజయం సాధించింది. ఇన్నింగ్స్ 12 పరుగుల తేడాతో ప్రోటీస్ జయభేరి మోగించింది. తద్వారా మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 తేడాతో దక్షిణాఫ్రికా ఆధిక్యంలో నిలిచింది. ఓవర్‌నైట్ స్కోర్ 289/7తో మూడో రోజు ఆటను ప్రారంభించిన దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 326 పరుగులకు ఆలౌటైంది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో ప్రోటీస్‌కు 161 పరుగల లీడ్ లభించింది. సౌతాఫ్రికా బ్యాటర్లలో సారెల్ ఎర్వీ (73) అర్ధ సెంచరీ చేయగా, ఎల్గర్ (47), కేశవ్ మహరాజ్ (41) పరుగులతో రాణించారు. అనంతరం 161 పరుగులతో వెనుకబడి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ 149 పరుగులకే ఆలౌట్ అయి ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. ఇక అంతకుముందు రబడా ఐదు వికెట్లతో చేలరేగడంతో ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 165 పరుగులకే కుప్పకూలింది. కాగా లార్డ్స్‌లో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ తేడాతో ఓడిపోవడం 19 ఏళ్ల తర్వాత ఇదే తొలి సారి . అంతకుముందు 2003లో కూడా దక్షిణాఫ్రికాపై ఇన్నింగ్స్ 92 పరుగుల తేడాతో ఇంగ్లండ్ ఓటమి పాలైంది. 🚨 RESULT | SOUTH AFRICA WIN BY AN INNINGS AND 12 RUNS An exceptional performance from start to finish by the entire team‼️ The bowlers sealing the victory by skittling England for 149 in the second innings to take a 1-0 lead in the 3-match series 👌#ENGvSA #BePartOfIt pic.twitter.com/WJd1eJ8P86 — Cricket South Africa (@OfficialCSA) August 19, 2022 చదవండి:ENG-W vs IND-W: ఇంగ్లండ్ కెప్టెన్‌కు సర్జరీ.. భారత్‌తో సిరీస్‌కు దూరం! -
పాపం ప్రోటీస్ కెప్టెన్.. దురదృష్టం వెంటాడితే ఇలాగే ఉంటుంది!
లార్డ్స్ వేదికగా జరుగుతున్న ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో దక్షిణాఫ్రికా పట్టు బిగిస్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో 326 పరుగులకు ఆలౌటైన ప్రోటిస్.. 161 పరుగుల లీడ్ సాధించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన ఇంగ్లండ్ 93 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అంతకుముందు దక్షిణాఫ్రికా బౌలర్లు చేలరేగడంతో తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 165 పరుగులకే కుప్పకూలింది. ఇక ఇది ఇలా ఉండగా.. తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా కెప్టెన్ డీన్ ఎల్గర్ దురదృష్టకర రీతిలో ఔటయ్యాడు. 47 పరుగులతో నిలకడగా ఆడుతున్న ఎల్గర్‌ను లైన్ లంగ్త్ బాల్‌తో జేమ్స్ అండర్సన్ బోల్తా కొట్టించాడు. ప్రోటిస్ ఇన్నింగ్స్ 23 ఓవర్లో జేమ్స్ అండర్సన్ వేసిన బంతిని ఎల్గర్ లెగ్ సైడ్ డిఫెన్స్ చేసే ప్రయత్నం చేశాడు. అయితే బంతి నేరుగా తన థై ప్యాడ్‌కు తగిలి వికెట్ల వైపు దూసుకెళ్లింది. ఎల్గర్ బంతిని ఆపే ప్రయ్నతం చేసినా అప్పటికే అది వికెట్లను గీరాటేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఈ వీడియో చూసిన అభిమానులు దురదృష్టమంటే ఎల్గర్దే అంటూ కామెంట్లు చేస్తున్నారు. A much-needed wicket! 💪 Live clips: https://t.co/2nFwGblL1E 🏴 #ENGvSA 🇿🇦 | #RedforRuth pic.twitter.com/Y4LqxanBX1 — England Cricket (@englandcricket) August 18, 2022 చదవండి: Asia Cup 2022 Ind Vs Pak: ‘భారత్‌తో మ్యాచ్‌లో కచ్చితంగా పాకిస్తాన్‌దే విజయం! ఎందుకంటే.. మాకు’! -
నిప్పులు చెరిగిన సఫారీ పేసర్లు.. పేక మేడలా కూలిన ఇంగ్లీష్ బ్యాటర్లు
లండన్: దక్షిణాఫ్రికాతో బుధవారం (ఆగస్ట్ 17) మొదలైన తొలి టెస్టులో ఇంగ్లండ్ జట్టు తడబడింది. లార్డ్స్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించడంతో తొలి రోజు 32 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్లు కోల్పోయి 116 పరుగులు సాధించింది. ఒలీ పోప్ (61; 4 ఫోర్లు) అజేయ అర్ధ సెంచరీతో రాణించి ఇంగ్లండ్ పాలిట ఆపద్భాందవుడయ్యాడు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో పోప్‌తో పాటు కెప్టెన్ స్టోక్స్ (20) మాత్రమే రెండంకెల స్కోర్ చేశాడు. ఆట ముగిసే సమయానికి పోప్‌కు జతగా బ్రాడ్ (0) క్రీజ్‌లో ఉన్నాడు. నిప్పులు చెరిగిన పేసర్లు.. పిచ్ పేసర్లకు అనుకూలిస్తుందని అంచనా వేసిన దక్షిణాఫ్రికా కెప్టెన్ డీన్ ఎల్గర్.. టాస్ గెలిచాక ఏమాత్రం సంకోచించకుండా తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. సఫారీ పేసర్లు కెప్టెన్ నమ్మకాన్ని నిలబెడుతూ.. ఆట ఆరంభం నుంచే చెలరేగిపోయారు. 3వ ఓవర్లోనే ఓపెనర్ అలెక్స్ లీస్ (5)ను, ఆ తర్వాత 9వ ఓవర్లో మరో ఓపెనర్ జాక్ క్రాలే (9) రబాడ పెవిలియన్‌కు పంపాడు. ఆతర్వాత మరింత రెచ్చిపోయిన పేసర్లు నిప్పులు చెరిగే బంతులతో ఇంగ్లీష్ బ్యాటర్లపై విరుచుకుపడ్డారు. జో రూట్ (8)ను మార్కో జన్సెన్.. బెయిర్‌స్టో (0), బెన్ ఫోక్స్ (6), స్టోక్స్ (20)లను నోర్జే అద్భుతమైన బంతులతో పెవిలియన్‌కు సాగనంపారు. ముఖ్యంగా భీకరమైన ఫామ్‌లో ఉన్న బెయిర్‌స్టోను నోర్జే క్లీన్ బౌల్డ్ చేసిన వైనం తొలి రోజు మొత్తానికే హైలైట్‌గా నిలిచింది. Anrich Arno Nortje -
మూడు ఫార్మాట్లకు ముగ్గురు వేర్వేరు కెప్టెన్లు.. గుజరాత్ ప్లేయర్‌కు బంపర్ ఆఫర్
South Africa Tour Of England: జులై 19 నుంచి దాదాపు మూడు నెలల పాటు ఇంగ్లండ్, ఐర్లాండ్‌లలో పర్యటించనున్న దక్షిణాఫ్రికా జట్లను (మూడు ఫార్మాట్ల జట్లు) క్రికెట్ సౌతాఫ్రికా మంగళవారం ప్రకటించింది. వచ్చే నెల నుంచి సౌతాఫ్రికా ఈ రెండు దేశాలతో మూడు ఫార్మాట్లలో సిరీస్‌లు ఆడనుంది. జులై 19 నుంచి 31 వరకు ఇంగ్లండ్‌తో 3 వన్డేలు, 3 టీ20లు ఆడనున్న సపారీ టీమ్.. మధ్యలో ఆగస్ట్ 3, 5 తేదీల్లో ఐర్లాండ్‌తో రెండు టీ20లు, ఆతర్వాత ఆగస్ట్ 17-సెప్టెంబర్ 12 వరకు ఇంగ్లండ్‌తో మూడు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది. ఈ సుదీర్ఘ పర్యటనల కోసం క్రికెట్ సౌతాఫ్రికా మూడు ఫార్మాట్లకు మూడు వేర్వేరు జట్లతో పాటు ముగ్గురు వేర్వేరు కెప్టెన్లను ప్రకటించింది. ఇటీవల టీమిండియాతో ముగిసిన టీ20 సిరీస్‌లో గాయపడిన వైట్‌బాల్ కెప్టెన్ టెంబా బవుమా మూడు జట్లలో స్థానం కోల్పోగా.. గుజరాత్ టైటాన్స్ (ఐపీఎల్) ఆటగాడు డేవిడ్ మిల్లర్, భారత సంతతి ఆటగాడు కేశవ్ మహారాజ్‌లు బంపర్ ఆఫర్లు కొట్టేశారు. టెస్ట్‌ల్లో డీన్ ఎల్గర్‌ను కెప్టెన్‌గా కొనసాగించిన సీఎస్ఏ.. వన్డేల్లో కేశవ్ మహారాజ్‌ను, టీ20ల్లో డేవిడ్ మిల్లర్‌ను కెప్టెన్లుగా నియమించింది. South Africa announced Test, ODI, and T20I squads for the upcoming England tour.#SkyFair #ENGvsSA #SouthAfrica #England #DavidMiller #Cricket #T20I #TestCricket #ODI #CricketTwitter pic.twitter.com/CQrxXoOwVc — SkyFair (@officialskyfair) June 29, 2022 ఇంగ్లండ్, ఐర్లాండ్ దేశాల్లో సౌతాఫ్రికా పర్యటన వివరాలు.. జులై 19 : ఇంగ్లాండ్ తో తొలి వన్డే జులై 22 : రెండో వన్డే జులై 24 : మూడో వన్డే జులై 27 : తొలి టీ20 జులై 28 : రెండో టీ20 జులై 31 : మూడో టీ20 ఆగస్టు 3 : ఐర్లాండ్ తో తొలి టీ20 ఆగస్టు 5 : రెండో టీ20 ఆగస్టు 17-21 : ఇంగ్లాండ్ తో తొలి టెస్టు ఆగస్టు 25-29 : రెండో టెస్టు సెప్టెంబర్ 8-12 : మూడో టెస్టు చదవండి: విరాట్ కోహ్లి రికార్డు బద్దలు కొట్టిన బాబర్ ఆజమ్ -
'వాళ్లు మళ్లీ జట్టుకు ఎంపికవుతారో లేదో తెలియదు'
దక్షిణాఫ్రికా పలువురు స్టార్ ఆటగాళ్లు బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌తో కన్నా ఐపీఎల్-2022లో ఆడటానికి ప్రాధాన్యం ఇచ్చిన సంగతి తెలిసిందే. బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్ ఆరంభానికి ముందు కగిసో రబాడ , లుంగీ ఎన్గిడి, మార్కో జెన్సన్, ఐడెన్ మార్క్రామ్, రాసి వాన్ డెర్ డుస్సెన్ ఐపీఎల్-2022లో పాల్గొన్నారు. కాగా ఈ తమ జట్టు ఆటగాళ్లు తీసుకున్న నిర్ణయం పట్ల దక్షిణాఫ్రికా టెస్టు కెప్టెన్ ఆదినుంచే ఆసంతృప్తి వ్యక్తం చేస్తున్నాడు. అదే విధంగా ఆ జట్టు కోచ్ మార్క్ బౌచర్ తమ ఆటగాళ్లు తీసుకున్న నిర్ణయం పట్ల సంతృప్తిగా లేనట్లు తెలుస్తోంది. అయితే తమ జట్టును కాదని క్యాష్ రిచ్ లీగ్‌లో పాల్గొనడానికి వెళ్ళిన ఆటగాళ్ళపై చర్యలు తీసుకువడానికి దక్షిణాఫ్రికా క్రికెట్ సిద్దమైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఐపీఎల్లో ఆడుతున్న ప్రోటీస్ ఆటగాళ్లు తమ స్థానాలను జట్టులో కోల్పోయే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా తాజాగా దక్షిణాఫ్రికా కెప్టెన్ డీన్ ఎల్గర్ చేసిన వాఖ్యలు.. ఈ వార్తలకు మరింత ఆజ్యం పోసినట్టైంది. బంగ్లాదేశ్‌తో రెండో టెస్ట్ అనంతరం విలేకరుల సమావేశంలో ఎల్గర్ మాట్లాడాడు. ఆ క్రమంలో ఐపీఎల్లో పాల్గోన్న ఆటగాళ్లపై ఎటువంటి చర్యలు తీసుకుంటారు అని ప్రశ్నించగా.. దానికి బదులుగా "దక్షిణాఫ్రికా తరఫున ఆడేందుకు వీరు మళ్లీ జట్టుకు ఎంపిక అవుతారో లేదో నాకు తెలియదు. అది ఇప్పుడు నా చేతుల్లో లేదు అని ఎల్గర్ పేర్కొన్నాడు. ఇక బంగ్లాదేశ్‌తో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌ను దక్షిణాఫ్రికా క్లీన్ స్వీప్ చేసింది. చదవండి: IPL 2022: 'అది కోహ్లి బ్యాటింగ్ కాదు.. అతడిలో పవర్ తగ్గింది' -
ఒకవైపు ఐపీఎల్.. జట్టును ప్రకటించిన దక్షిణాఫ్రికా.. స్టార్ ఆటగాళ్లు లేకుండానే!
స్వదేశంలో బంగ్లాదేశ్‌తో జరిగే టెస్టు సిరీస్‌కు దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును ప్రకటించింది. అయితే ఐపీఎల్ 15వ సీజన్ కారణంగా రబడా, మార్క్రామ్, రాస్సీ వాన్ డెర్ డస్సెన్ వంటి స్టార్ స్టార్ ఆటగాళ్లు దూరమయ్యారు. దీంతో యువ ఆటగాడు ఖయా జోండో దక్షిణాఫ్రికా తరుపున టెస్టులో అరంగేట్రం చేయనున్నాడు. దక్షిణాఫ్రికా తరపున ఆరు వన్డేలు ఆడిన జోండో.. 146 పరుగులు సాధించాడు. అయితే దక్షిణాఫ్రికా ప్రకటించిన జట్టులో కెప్టెన్ ఎల్గర్, బావుమా, కేశవ్ మహారాజ్ తప్ప సీనియర్ ఆటగాళ్లు ఎవరూ లేరు. మార్చి 31 నుంచి డర్బన్ వేదికగా దక్షిణాఫ్రికా- బంగ్లాదేశ్ తొలి టెస్టు ప్రారంభం కానుంది. అదే విధంగా మార్చి 26 నుంచి ఐపీఎల్-2022 ప్రారంభం కానుంది. దక్షిణాఫ్రికా జట్టు: డీన్ ఎల్గర్ (కెప్టెన్), టెంబా బావుమా, డారిన్ డుపావిల్లోన్, సరెల్ ఎర్వీ, సైమన్ హార్మర్, కేశవ్ మహరాజ్, వియాన్ ముల్డర్, డువాన్ ఒలివర్, కీగన్ పీటర్సన్, ర్యాన్ రికెల్టన్, లూథో సిపమ్లా, గ్లెంటన్ స్టౌర్మాన్, కైల్ వెర్రెయిన్స్, లిజాడ్ విలియొండోమ్స్. -
'దేశం వైపా... ఐపీఎల్ వైపా?'.. విధేయత చూపించాల్సిన సమయం
రెండు దశాబ్దాల కిందట చూసుకుంటే క్రికెటర్లు దేశానికి ప్రాతినిధ్యం వహించడం గొప్పగా భావించేవాళ్లు. సెంచరీలైనా.. వికెట్లు అయినా.. గౌరవమైనా.. చీత్కారాలైనా ఏవీ చూసుకున్నా ఇందులోనే లభించేవి. దేశం తరపున ఆడి మ్యాచ్ గెలిచామంటే మనం గెలిచాము అన్నంతగా క్రికెట్ అభిమానులు పండగ చేసుకునేవారు. ఒక ఆటగాడు ఫామ్ కోల్పోతే ఏ కౌంటీ క్రికెట్‌కో.. లేక దేశవాలీ టోర్నీల్లో రాణించి తిరిగి జట్టులోకి వచ్చేవారు. ఇప్పటికి ఇలాంటివి జరుగుతున్నప్పటికి బాగా తగ్గిపోయిందనే చెప్పొచ్చు. ముఖ్యంగా ఐపీఎల్, బిగ్‌బాష్ లాంటి ప్రైవేట్ లీగ్స్ వచ్చిన తర్వాత ఆటగాళ్లు దేశానికంటే డబ్బులకే ఎక్కువ ప్రాధాన్యమిస్తూ వచ్చారు. వెస్టిండీస్ జట్టు ఇందుకు ఉదాహరణ. ఒకప్పుడు వెస్టిండీస్ అంటే అరవీర భయంకరులు గుర్తుచ్చేవారు. రెండుసార్లు ప్రపంచకప్ విజేతలైన వెస్టిండీస్ ఇప్పుడు మాత్రం సాధారణ జట్టులా మారిపోయింది. కారణం ఇలాంటి ప్రైవేట్ లీగ్స్. ఇప్పుడు చూసుకుంటే విండీస్ క్రికెటర్లు లీగ్ క్రికెట్లోనే ఎక్కువగా కనిపిస్తున్నారు. ఎందుకంటే వారికి డబ్బులు ముఖ్యం. తాజాగా దక్షిణాఫ్రికా టెస్టు కెప్టెన్ డీన్ ఎల్గర్ తన జట్టు సహచరులను ఐపీఎల్ కంటే దేశానికి తొలి ప్రాధాన్యత ఇవ్వాలని అడగడం ఆసక్తిని సంతరించుకుంది. ఐపీఎల్ ఈనెల 26న ప్రారంభం కానుండగా... దక్షిణాఫ్రికా జట్టు అదే సమయంలో స్వదేశంలో బంగ్లాదేశ్‌తో మూడు వన్డేలు, రెండు టెస్లులు ఆడాల్సి ఉంది. ఆర్థికంగా భారీ మొత్తం అందుకునే ఐపీఎల్‌కు కాకుండా దేశం తరఫున ఆడేందుకే తొలి ప్రాధాన్యత ఇవ్వాలని దక్షిణాఫ్రికా క్రికెటర్లను టెస్టు జట్టు కెప్టెన్ డీన్ ఎల్గర్ కోరుతున్నాడు. మొత్తం 11 మంది దక్షిణాఫ్రికా క్రికెటర్లకు ప్రస్తుత ఐపీఎల్‌తో కాంట్రాక్ట్ ఉండగా ఇందులో 10 మంది సఫారీ టెస్టు, వన్డే జట్లలో రెగ్యులర్ సభ్యులు. ‘దక్షిణాఫ్రికాకు ఆడటం వల్లే మీకు ఐపీఎల్ అవకాశం వచ్చిన విషయం మరచిపోవద్దు. వారు విధేయత చూపించుకోవాల్సిన సమయమిది. అవసరమైతే వారితో మాట్లాడి సరైన నిర్ణయం తీసుకునేలా ప్రయత్నిస్తాను’ అని ఎల్గర్ అన్నాడు. చదవండి: IPL 2022: డు ప్లెసిస్‌కు భారీ షాక్.. ఆర్సీబీ కెప్టెన్‌గా దినేష్ కార్తీక్! PAK vs AUS: వైరల్‌గా మారిన పాక్ క్రికెటర్ చర్య.. ఏం జరిగింది -
న్యూజిలాండ్‌తో రెండో టెస్టు.. దక్షిణాఫ్రికాకు భారీ షాక్!
న్యూజిలాండ్‌తో రెండో టెస్టుకు మందు దక్షిణాఫ్రికాకు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్దార్ పేసర్ లుంగీ ఎంగిడీ వెన్ను నొప్పి కారణంగా రెండో టెస్ట్‌కు దూరమయ్యాడు. తొలి టెస్టుకు దూరమైన ఎంగిడి.. రెండో టెస్టుకు గాయం నుంచి కోలుకుంటాడాని టీమ్ మేనేజ్మెంట్ భావించింది. అయితే గాయం నుంచి కోలుకోపోవడంతో ఎంగిడి జట్టు నుంచి తప్పుకున్నట్లు ప్రోటిస్ కెప్టెన్ ఎల్గర్ తెలిపాడు. తొలి టెస్టుకు ముందు అతడు పూర్తిగా బౌలింగ్ చేయలేకపోయాడు. రెండో టెస్టుకు కోలుకుంటాడని భావించాం. అయితే అతడు ఇంకా పూర్తిగా కోలుకోలేదు. అతడు మాతో ప్రాక్టీస్‌లో కూడా పాల్గోనడంలేదు. అతడు జట్టుకు దూరం కావడం మాకు పెద్ద ఎదురు దెబ్బ. ఎందుకుంటే మా బౌలింగ్ లైనప్‌లో అతడు చాలా కీలకం అని ఎల్గర్ పేర్కొన్నాడు. మరో వైపు స్టార్ బౌలర్ అన్రిచ్ నార్ట్జే కూడా కీవిస్ పర్యటనకు దూరమైన సంగతి తెలిసిందే. ఇక తొలి టెస్టులో ఘోర పరాజయం పొందిన దక్షిణాఫ్రికా తిరిగి పుంజుకోవాలని భావిస్తోంది. ఫిబ్రవరి 25న దక్షిణాఫ్రికా- న్యూజిలాండ్ మధ్య రెండో టెస్ట్ ప్రారంభం కానుంది. చదవండి: Ajinkya Rahane : 'ఏంటి రహానే మరి మారవా.. మళ్లీ డకౌట్ అయ్యావా' -
NZ Vs SA 1st Test: దక్షిణాఫ్రికాకు ఘోర పరాభవం.. కివీస్ అద్భుత విజయం
South Africa Tour Of New Zealand 2022- క్రైస్ట్‌చర్చ్: వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్‌లో భాగంగా దక్షిణాఫ్రికాతో తొలి టెస్టులో న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది. ఇన్నింగ్స్ 276 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 తేడాతో ముందంజలో నిలిచింది. శుక్రవారం మొదట కివీస్ తొలి ఇన్నింగ్స్‌లో 117.5 ఓవర్లలో 482 పరుగుల వద్ద ఆలౌటైన విషయం తెలిసిందే. హెన్రీ నికోల్స్ (105; 11 ఫోర్లు) శతక్కొట్టాడు. ఇక 387 పరుగులతో వెనుకబడి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన దక్షిణాఫ్రికా రెండో రోజు ఆట ముగిసే సమయానికి 34 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఈ క్రమంలో మూడో రోజు ఆటలో భాగంగా 111 పరుగులకే ఆలౌట్ అయి ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. ఇక అంతకు ముందు కివీస్ బౌలర్ మ్యాట్ హెన్రీ చెలరేగడంతో 95 పరుగులకే ప్రొటిస్ జట్టు తొలి ఇన్నింగ్స్‌కు తెరపడిన విషయం విదితమే. ఈ మ్యాచ్‌లో మొత్తంగా హెన్రీ9 వికెట్లు(7,2) పడగొట్టాడు. న్యూజిలాండ్ విజయంలో కీలక పాత్ర పోషించి తద్వారా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఇక ఈ మ్యాచ్‌లో ప్రొటిస్ కెప్టెన్ డీన్ ఎల్గర్ కేవలం ఒకే ఒక్క పరుగు చేయగా.. కివీస్ సారథిగా వ్యవహరించిన టామ్ లాథమ్ 15 పరుగులు సాధించాడు. బ్యాటర్‌గా ఆకట్టుకోకపోయినా కెప్టెన్‌గా ఘన విజయం అందుకున్నాడు. కాగా రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ నిమిత్తం సౌతాఫ్రికా న్యూజిలాండ్‌లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. స్కోర్లు: న్యూజిలాండ్- 482 దక్షిణాఫ్రికా- 95 & 111 చదవండి: Mohammed Siraj- Virat Kohli: కోహ్లి టోలీచౌకీకి వచ్చాడోచ్..! నా జీవితంలోనే బెస్ట్ సర్ప్రైజ్.. భయ్యాను చూడగానే గట్టిగా హగ్ చేసుకున్నా! Delivering the perfect start to Day 3! @Matthenry014 with our @ANZ_NZ Play of the Day at Hagley Oval. #NZvSA pic.twitter.com/n4ojSRjX7t — BLACKCAPS (@BLACKCAPS) February 19, 2022 -
జట్టును ప్రకటించిన దక్షిణాఫ్రికా.. ఏడేళ్ల తర్వాత బౌలర్ రీ ఎంట్రీ
న్యూజిలాండ్‌తో త్వరలో జరగనున్న టెస్ట్ సిరీస్ కోసం దక్షిణాఫ్రికా 17 మంది సభ్యులతో కూడిన జట్టును బుధవారం ప్రకటించింది. కాగా స్పిన్నర్ సైమన్ హార్మర్ దాదాపు ఏడేళ్ల తర్వాత సౌత్ఆఫ్రికా క్రికెట్ తరుపున పునరాగామనం చేయనున్నాడు. 2015లో ప్రోటీస్ జట్టుకు హర్మర్ చివరిగా ఆడిన హర్మర్.. దక్షిణాఫ్రికా క్రికెట్‌ను విడిచిపెట్టి, 2017లో ఇంగ్లండ్ కౌంటీ జట్టు ఎసెక్స్‌తో కోల్పాక్ ఒప్పందం కుదుర్చుకున్నాడు. కేశవ్ మహారాజ్‌కు బ్యాక్అప్గా హర్మర్ను సౌత్ఆఫ్రికా క్రికెట్ ఎంపిక చేసింది. అతడి ఫస్ట్-క్లాస్ కేరిర్‌లో 700కి పైగా వికెట్లు పడగొట్టాడు. 2014లో టెస్ట్ క్రికెట్లో అరంగట్రేం చేసిన హర్మర్ 20 వికెట్లు పడగొట్టాడు. ఇక హర్మర్తో పాటు వెస్టిండీస్, భారత్‌తో సిరీస్‌లకు దూరమైన పేసర్ లూథో సిపమ్లా కూడా తిరిగి జట్టులోకి వచ్చాడు. ఇక ఈ జట్టుకు డీన్ ఎల్గర్ సారథ్యం వహించునున్నాడు. కాగా భారత్‌తో మూడు టెస్టుల సిరీస్‌ను 2-0తేడాతో దక్షిణాఫ్రికా కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. కోల్పాక్ ఒప్పందం అంటే.. యూరోపియన్ యూనియాన్తో ఒప్పందం కుదుర్చుకున్న దేశాలకు చెందిన ఆటగాళ్లు విదేశీ ఆటగాడిగా పరిగణించకుండా ఈయూ దేశాల్లో ఏదైనా క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొనవచ్చని కోల్పాక్ ఒప్పందం పేర్కొంది. న్యూజిలాండ్ పర్యటనకు దక్షిణాఫ్రికా జట్టు: డీన్ ఎల్గర్ (కెప్టెన్), టెంబా బావుమా, సారెల్ ఎర్వీ, సైమన్ హార్మర్, మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్, ఐడెన్ మార్క్రామ్, వియాన్ ముల్డర్, లుంగి ఎన్గిడి, డువాన్ ఒలివియర్, కీగన్ పీటర్సన్, కగిసో రబాడ, రెయాన్ రికిల్టన్, లూథో సిపమ్లా, గ్లెంటన్ స్టౌర్మాన్, రాస్సీ వాన్ డెర్ డుస్సెన్, కైల్ వెర్రెయిన్ -
నిషేధం గండం నుంచి గట్టెక్కిన కోహ్లి అండ్ కో..!
కేప్‌టౌన్ టెస్ట్‌లో దక్షిణాఫ్రికా కెప్టెన్ డీన్ ఎల్గర్ డీఆర్ఎస్ కాల్ వివాదంలో టీమిండియా క్రికెటర్లు విరాట్ కోహ్లి, అశ్విన్, కేఎల్ రాహుల్‌లకు ఊరట లభించినట్లు తెలుస్తుంది. మూడో టెస్ట్ మూడో రోజు ఆటలో టీమిండియా నిర్ధేశించిన 212 పరుగల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 60 పరుగుల వద్ద ఎల్గర్‌ను ఫీల్డ్ అంపైర్ ఎల్బీడబ్ల్యూ ఔట్‌గా ప్రకటించడం, ఆ వెంటనే థర్డ్ అంపైర్ జోక్యం చేసుకుని నాటౌట్‌గా ప్రకటించడంతో వివాదం మొదలైంది. ఈ విషయమై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసిన కోహ్లి అండ్ కో(అశ్విన్, కేఎల్ రాహుల్).. దక్షిణాఫ్రికా, బాల్ ట్రాకింగ్ టెక్నాలజీని తప్పుగా వాడి టెస్ట్ సిరీస్‌ను కాపాడుకోవాలని ప్రయత్నిస్తోందంటూ బహిరంగంగా ఆరోపించడంతో పాటు స్టంప్ మైక్ దగ్గరికి వచ్చి థర్డ్ అంపైర్‌పై అసహనం వ్యక్తం చేశారు. మ్యాచ్ గెలవాలనుకుంటే సరైన పద్ధతులు ఎంచుకుంటే బెటర్ అని అశ్విన్ అనగా, మా పదకొండు మందిని ఔట్ చేసేందుకు దేశమంతా కలిసి ఆడుతున్నట్టుందని రాహుల్ కామెంట్ చేశాడు. ఇదే సందర్భంగా కోహ్లి.. అందరూ చూస్తుండగా స్టంప్ మైక్ దగ్గరకు వచ్చి.. కేవలం ప్రత్యర్థి జట్టు మీదే కాదు, మీ జట్టు మీద కూడా దృష్టి సారించండి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. థర్డ్ అంపైర్‌ను ఉద్ధేశించి ఈ వ్యాఖ్యలు చేసినందుకు గాను ఐసీసీ ప్రవర్తన నియమావళి 2.8 ప్రకారం కోహ్లి అండ్ కో పై ఓ మ్యాచ్ నిషేధం లేదా భారీ జరిమానా పడే అవకాశం ఉందని అంతా భావించారు. అయితే, ఈ విషయాన్ని మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ సీరియస్‌గా తీసుకోకపోవడంతో కోహ్లి అతని సహచరులు నిషేధం ముప్పు నుంచి తప్పించుకున్నారు. మరోసారి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదని కోహ్లి అండ్ కో ను ఐసీసీ మందలించినట్లు తెలుస్తోంది. చదవండి: దక్షిణాఫ్రికా చేతిలో పరాభవాన్ని ఎదుర్కొన్న టీమిండియాకు మరో షాక్.. -
Ind Vs Sa: కోహ్లి ప్రవర్తన సంతోషాన్నిచ్చింది... మాకు మేలు జరిగింది: ఎల్గర్
India Vs Sa 3rd Test- Dean Elgar Comments: మూడో టెస్టులో తన డీఆర్ఎస్ కాల్ సందర్భంగా చోటుచేసుకున్న వివాదంపై దక్షిణాఫ్రికా కెప్టెన్ డీన్ ఎల్గర్ స్పందించాడు. టీమిండియా సారథి విరాట్ కోహ్లి సహా క్రికెటర్లు వ్యవహరించిన తీరు తమకే ప్రయోజనం చేకూర్చిందని పేర్కొన్నాడు. నిజానికి ఆ ఘటన జరగడం తనకు సంతోషాన్నిచ్చిందన్నాడు. కాగా కేప్‌టౌన్ టెస్టులో విజయంతో దక్షిణాఫ్రికా సిరీస్‌ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో సఫారీ గడ్డపై టెస్టు సిరీస్ గెలవాలన్న టీమిండియా ఆశలు నీరుగారిపోయాయి. ఇక ఆఖరి టెస్టు మూడో రోజు నుంచే సఫారీల చేతుల్లోకి వెళ్తున్న నేపథ్యంలో కోహ్లి బృందం మైదానంలో వ్యవహరించిన తీరు వివాదానికి దారి తీసిన సంగతి తెలిసిందే. ప్రొటిస్ సారథి డీన్ ఎల్గర్ డీఆర్ఎస్ కాల్‌తో తప్పించుకోవడంతో సహనం కోల్పోయిన కోహ్లి స్టంప్స్ మైకు వద్దకు వెళ్లి మాట్లాడటం విమర్శలకు తావిచ్చింది. క్రీడావర్గాల్లో చర్చనీయాంశమైన ఈ విషయం గురించి ఎల్గర్ స్పందిస్తూ... ఒత్తిడిలో ఏం చేస్తున్నారో వాళ్లకు అర్థం కాలేదంటూ భారత జట్టు తీరుపై వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫోతో అతడు మాట్లాడుతూ... ‘‘వాళ్లు(టీమిండియా) అనుకున్నట్లుగా ఆట సాగలేదు. తీవ్ర ఒత్తిడికి గురయ్యారు. అదే మాకు కలిసి వచ్చింది. భావోద్వేగాలకు లోనై అసలు ఆటను మర్చిపోయారు. అలా జరగడం నిజంగా మాకు కలిసి వచ్చింది. ఏదేమైనా ఆ ఘటన మాకు మేలు చేసినందుకు చాలా సంతోషంగా ఉంది’’ అని వ్యాఖ్యానించాడు. కాగా డీన్ ఎల్గర్‌కు డీఆర్ఎస్ కాల్ నేపథ్యంలో కోహ్లి స్టంప్స్ మైకు వద్దకు వెళ్లి... ‘‘ఎప్పుడూ మా పైనే దృష్టి పెట్టకండి. మీ వాళ్లపై కూడా కాస్త ఫోకస్ చేయండి’’అంటూ ప్రసారకర్తలను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఈ క్రమంలో క్రీడా ప్రముఖులు అతడి తీరును తప్పుపడుతున్నారు. ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ మైకేల్ వాన్ అయితే ఏకంగా కోహ్లిపై నిషేధం విధించాలని ఐసీసీకి విజ్ఞప్తి చేశాడు. చదవండి: Ind Vs Sa: కోహ్లికి భారీ జరిమానా విధించాలి.. నిషేధించాలి! ఐసీసీకి ఇదే నా విజ్ఞప్తి pic.twitter.com/HtZwoo9Lm7 — Bleh (@rishabh2209420) January 13, 2022 -
Ind Vs Sa: కోహ్లికి భారీ జరిమానా విధించాలి.. నిషేధించాలి కూడా!
టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లిపై విమర్శల పర్వం కొనసాగుతోంది. దక్షిణాఫ్రికాతో మూడో టెస్టులో మూడో రోజు ఆట సందర్భంగా కోహ్లి వ్యవహరించిన తీరుపై మాజీ క్రికెటర్లు మండిపడుతున్నారు. కాగా ప్రొటిస్ కెప్టెన్ డీన్ ఎల్గర్ డీఆర్ఎస్ కాల్ విషయంపై టీమిండియా ఆటగాళ్లు.. ముఖ్యంగా కోహ్లి స్టంప్స్ మైకు దగ్గరకు వెళ్లి ప్రసారకర్తలను ఉద్దేశించి మాట్లాడిన తీరు వివాదానికి దారి తీసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ ఇప్పటికే కోహ్లిది చెత్త ప్రవర్తన అంటూ విమర్శించాడు. ఇక ఈ విషయంపై స్పందించిన ఇంగ్లండ్ మాజీ క్రికెటర్, కామెంటేటర్ మైకేల్ వాన్ కోహ్లికి భారీ జరిమానా వేయాలని.. లేదంటే నిషేధం విధించాలని ఐసీసీకి సూచించాడు. ప్రతి ఒక్కరు భావోద్వేగాలు ప్రదర్శించడం సహజమని.. అయితే నాయకుడు ఇలా చేయడం సరికాదన్నాడు. ఈ విషయంలో ఐసీసీ వెంటనే చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశాడు. దక్షిణాఫ్రికా మాజీ బ్యాటర్ డారిల్.. భారత కెప్టెన్ చర్యలు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని, అతడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశాడు. ఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం ఆడం గిల్‌క్రిస్ట్ సైతం టీమిండియా సారథి తీరుపై పెదవి విరిచాడు. ప్రతి విషయంలోనూ ఓ హద్దు ఉంటుందని... అది దాటితే తప్పును ఉపేక్షించాల్సిన అవసరం లేదని గిల్‌క్రిస్ట్ అభిప్రాయపడ్డాడు. షేన్ వార్న్ మాట్లాడుతూ... ‘‘అంతర్జాతీయ జట్టు కెప్టెన్ ఇలా వ్యవహరిస్తాడని నేను అనుకోను. ఒక్కోసారి అసహనం హద్దు దాటుతుంది. నిజమే.. అయితే పదే పదే ఇలా చేయడం సరికాదు. ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకోవాలి. సహించాల్సిన అవసరం లేదు’’ అని చెప్పుకొచ్చాడు. ఇక దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌లో భాగంగా టీమిండియా ఆటలో వైఫల్యం కంటే కూడా ఇలాంటి వాగ్యుద్దాలు, గొడవలతోనే ఎక్కువ అప్రదిష్టను మూటగట్టుకుందనడంలో ఎలాంటి సందేహం లేదు. చదవండి: View this post on Instagram A post shared by Fox Cricket (@foxcricket) pic.twitter.com/HtZwoo9Lm7 — Bleh (@rishabh2209420) January 13, 2022 -
Ind Vs Sa: టీమిండియా ఓటమికి ప్రధాన కారణం అదే.. అందుకే ఎనిమిదోసారి కూడా..
దక్షిణాఫ్రికా గడ్డపై మూడు దశాబ్దాల గెలుపు కల నెరవేరలేదు... ఎనిమిదో ప్రయత్నంలోనూ టీమిండియా సిరీస్ సాధించడంలో విఫలమైంది. పైగా తొలి టెస్టు నెగ్గి జోరు మీదున్న జట్టు ఆ తర్వాత అనూహ్యంగా రెండు పరాజయాలతో సిరీస్ ఓటమిని మూటగట్టుకుంది. గత కొన్నేళ్లుగా జట్టు అద్భుత ప్రదర్శనలు...ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లలో మన ఆట తీరు చూసిన తర్వాత బలహీనంగా కనిపిస్తున్న సఫారీ టీమ్‌ను ఓడించడం సులువనే సందేశంతో ఫేవరెట్‌గా కనిపించిన జట్టు చివరకు చేతులెత్తేసింది. బౌలర్లు అంచనాలకు తగిన రీతిలో సత్తా చాటినా... బ్యాటింగ్ వైఫల్యం భారత్‌ను దెబ్బ తీసింది. అదే ఓటమికి ప్రధాన కారణం అని చెప్పవచ్చు. మరో వైపు స్టార్లు ఎవరూ లేకపోయినా సమష్టి తత్వంతో సఫారీ టీమ్ చిరస్మరణీయ విజయాన్ని సొంతం చేసుకుంది. సెంచూరియన్‌లో ఓడినా కుంగిపోకుండా పైకి లేచిన సఫారీ బృందం పట్టుదల, పోరాటస్ఫూర్తితో భారత్‌కు షాక్ ఇచ్చింది. చేతిలో 8 వికెట్లతో 111 పరుగులు చేయాల్సిన స్థితిలో నాలుగో రోజు ఆటలో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 33.5 ఓవర్లలో ఆ పనిని పూర్తి చేసింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒకే వికెట్ తీయగలిగిన భారత బృందం చివరకు నిరాశతో సిరీస్‌ను ముగించింది. Ind Vs Sa 3rd test: భారత్‌తో జరిగిన మూడో టెస్టులో దక్షిణాఫ్రికా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 212 పరుగుల లక్ష్యాన్ని అందుకునే క్రమంలో 101/2 స్కోరుతో ఆట కొనసాగించిన ఆతిథ్య జట్టు 63.3 ఓవర్లలో 3 వికెట్లకు 212 పరుగులు సాధించింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ కీగన్ పీటర్సన్ (113 బంతుల్లో 82; 10 ఫోర్లు) చక్కటి ఇన్నింగ్స్ ఆడగా...వాన్ డర్ డసెన్ (95 బంతుల్లో 41 నాటౌట్; 3 ఫోర్లు), తెంబా బవుమా (58 బంతుల్లో 32 నాటౌట్; 5 ఫోర్లు) నాలుగో వికెట్‌కు అభేద్యంగా 57 పరుగులు జత చేసి జట్టును గెలిపించారు. తాజా ఫలితంతో మూడు టెస్టుల సిరీస్‌ను 2–1తో సొంతం చేసుకున్న సఫారీ టీమ్ ‘ఫ్రీడమ్ ట్రోఫీ’ని సగర్వంగా అందుకుంది. బౌలర్ల ఆధిపత్యం సాగిన సిరీస్‌లో 3 అర్ధ సెంచరీలతో 276 పరుగులు చేసిన కీగన్ పీటర్సన్ ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’గా కూడా నిలిచాడు. ఇరు జట్ల మధ్య ఈ నెల 19నుంచి వన్డే సిరీస్ జరుగుతుంది. అలవోకగా లక్ష్యానికి... నాలుగో రోజు విజయాన్ని అందుకోవడంలో దక్షిణాఫ్రికాకు పెద్దగా ఇబ్బంది ఎదురు కాలేదు. పీటర్సన్ బాధ్యత తీసుకొని ముందుండి నడిపించగా... వాన్ డర్ డసెన్, బవుమా కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. 65 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న పీటర్సన్, ఆ తర్వాతా చక్కటి షాట్లు కొట్టాడు. 12 పరుగుల వద్ద డసెన్ క్యాచ్ అవుట్ కోసం అప్పీల్ చేసిన భారత్ ‘రివ్యూ’ కోరినా లాభం లేకపోయింది. ఆ తర్వాత 59 పరుగుల వద్ద బుమ్రా బౌలింగ్‌లో పీటర్సన్ ఇచ్చిన సునాయాస క్యాచ్‌ను మొదటి స్లిప్‌లో పుజారా వదిలేయడం కూడా సఫారీలకు కలిసొచ్చింది. ఎట్టకేలకు 54 పరుగుల మూడో వికెట్ భాగస్వామ్యం తర్వాత శార్దుల్ వేసిన బంతిని వికెట్లపైకి ఆడుకొని పీటర్సన్ నిష్క్రమించాడు. అయితే డసన్, బవుమా ఆ తర్వాత చక్కటి సమన్వయంతో ఆడుతూ మరో అర్ధ సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 21 పరుగుల వద్ద శార్దుల్ బౌలింగ్‌లో డసెస్ ‘ఎల్బీ’ కోసం కూడా భారత్ రివ్యూ కోరినా...అంపైర్స్ కాల్‌తో బ్యాటర్ బతికిపోయాడు. లంచ్ సమయానికి స్కోరు 170 పరుగులకు చేరింది. విరామం తర్వాత భారత్ మరో వికెట్ తీయడంలో విఫలం కాగా, మిగిలిన 41 పరుగులు చేసేందుకు దక్షిణాఫ్రికాకు 8.3 ఓవర్లు సరిపోయాయి. అశ్విన్ బౌలింగ్‌లో స్క్వేర్ లెగ్ దిశగా ఫోర్ కొట్టి బవుమా చేసిన విజయనాదంతో సిరీస్ సఫారీల సొంతమైంది. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్ 223; దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ 210; భారత్ రెండో ఇన్నింగ్స్ 198; దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్: మార్క్రమ్ (సి) రాహుల్ (బి) షమీ 16; ఎల్గర్ (సి) పంత్ (బి) బుమ్రా 30; పీటర్సన్ (బి) శార్దుల్ 82; వాన్ డర్ డసెన్ (నాటౌట్) 41; బవుమా (నాటౌట్) 32; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (63.3 ఓవర్లలో 3 వికెట్లకు) 212. వికెట్ల పతనం: 1–23, 2–101, 3–155. బౌలింగ్: బుమ్రా 17–5–54–1, షమీ 15–3–41–1, ఉమేశ్ 9–0–36–0, శార్దుల్ 11–3–22–1, అశ్విన్ 11.3–1–51–0. చదవండి: IND Vs SA 3rd Test: విరాట్ కోహ్లిపై నిషేధం పడే అవకాశం..! The #Proteas bowling attack producing when it matters most💚 🇿🇦 Day three highlights: https://t.co/SSbyoUVZSF#SAvIND #FreedomTestSeries #BePartOfIt | @Betway_India pic.twitter.com/xEA1xSuuHj — Cricket South Africa (@OfficialCSA) January 14, 2022 Lungi Ngidi producing the goods with three game changing wickets✅ #SAvIND #FreedomTestSeries #BePartOfIt | @Betway_India | @JohnnieWalkerSA pic.twitter.com/BDoD3z25nT — Cricket South Africa (@OfficialCSA) January 13, 2022 -
IND Vs SA 3rd Test: విరాట్ కోహ్లిపై నిషేధం..?
కేప్‌టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్ట్ మూడో రోజు ఆటలో థర్డ్ అంపైర్ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన కెప్టెన్ విరాట్ కోహ్లిపై నిషేధం పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్ సందర్భంగా డీన్ ఎల్గర్ ఎల్బీడబ్ల్యూ అప్పీల్‌పై థర్డ్ అంపైర్ నిర్ణయం వివాదాస్పదమైంది. ఫీల్డ్ అంపైర్ ఔట్ ఇచ్చినప్పటికీ.. బాల్ ట్రాకింగ్‌లో బంతి వికెట్లపై నుంచి వెళ్తుందనే కారణంగా థర్డ్ అంపైర్ నాటౌట్‌గా తేల్చాడు. ఈ సంబంధిత అధికారులతో పాటు ఫీల్డ్ అంపైర్ సైతం ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాడు. అనంతరం థర్డ్ అంపైర్ నిర్ణయంపై అసహనం వ్యక్తం చేసిన కోహ్లి.. స్టంప్స్ మైక్ దగ్గరకు వెళ్లి నోరుపారేసుకున్నాడు. కోహ్లితో పాటు అశ్విన్, కేఎల్ రాహుల్ సైతం మైక్ వద్ద తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. అయితే అంపైర్‌ను ఉద్దేశించి కోహ్లి చేసిన వ్యాఖ్యలు చాలా ఘాటుగా ఉండటంతో ఐసీసీ చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఐసీసీ ప్రవర్తన నియమావళి 2.8 ప్రకారం కోహ్లిపై ఓ మ్యాచ్‌లో నిషేధం పడే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. కాగా, డీన్ ఎల్గర్ డీఆర్ఎస్ కాల్ అనంతరం కోహ్లి స్టంప్స్ మైక్ దగ్గరకు వెళ్లి.. ''కేవలం ప్రత్యర్థి జట్టు మీదే కాదు, మీ జట్టు మీద దృష్టి సారించండి. అందరిపైనా ఫోకస్ పెట్టండి'' అని సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే, 212 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 101/2 స్కోర్ వద్ద నాలుగో రోజు ఆటను ప్రారంభించింది. ఓవర్ నైట్ బ్యాటర్ కీగన్ పీటర్సన్ 82 పరుగుల వద్ద ఔటయ్యాడు. పీటర్సన్ ఔటయ్యే సమయానికి స్కోర్ 155/3గా ఉంది. క్రీజ్‌లో వాన్ డెర్ డస్సెన్(18), బావుమా ఉన్నారు. దక్షిణాఫ్రికా.. తమ లక్ష్యానికి మరో 57 పరుగుల దూరంలో ఉంది. చదవండి: Ind Vs Sa: కోహ్లి మరీ ఇంత చెత్తగా ప్రవర్తిస్తావా.. అసలేం అనుకుంటున్నావు? -
IND vs SA 3rd Test: టీమిండియాకు భంగపాటు.. 7 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా ఘన విజయం
IND vs SA 3rd Test Day-4 Updates : టీమిండియాకు భంగపాటు.. 7 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా ఘన విజయం 5:13 PM: దక్షిణాఫ్రికా గడ్డపై తొలి సిరీస్ విజయాన్ని సాధించి చరిత్ర సృష్టింద్దామనుకున్న టీమిండియాకు భంగపాటు ఎదురైంది. నిర్ణయాత్మక మూడో టెస్ట్‌లో దక్షిణాఫ్రికా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, 3 మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1తేడాతో కైవసం చేసుకుంది. టీమిండియా నిర్ధేశించిన 212 పరుగుల లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా జట్టు కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి సునాయాసంగా ఛేదించింది. కీగన్ పీటర్సన్(82) సమయోచితమైన బ్యాటింగ్‌తో దక్షిణాఫ్రికాను విజయపు అంచులదాకా తీసుకెళ్లగా.. డస్సెన్(41 నాటౌట్), బవుమా(32 నాటౌట్) జట్టును విజయతీరాలకు చేర్చారు. టీమిండియా బౌలర్లలో బుమ్రా, షమీ, శార్ధూల్‌లు తలో వికెట్ పడగొట్టారు. అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 223, రెండో ఇన్నింగ్స్‌లో 198 పరుగులకు ఆలౌట్ కాగా, దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 210 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. తొలి టెస్ట్‌లో భారత్ ఘన విజయం సాధించి 1-0 ఆధిక్యంలో నిలువగా, ఆతర్వాత దక్షిణాఫ్రికా వరుసగా రెండు, మూడు టెస్ట్‌లు గెలిచి సిరీస్‌ను చేజిక్కించుకుంది. సీనియర్ల గైర్హాజరీలో సఫారీ జట్టు అద్భుతంగా రాణించి, టీమిండియాపై చారిత్రక సిరీస్ విజయాన్ని నమోదు చేసింది. మూడో వికెట్ కోల్పోయిన దక్షిణాఫ్రికా లక్ష్యానికి మరో 57 పరుగుల దూరంలో ఉండగా దక్షిణాఫ్రికా మూడో వికెట్ కోల్పోయింది. సెట్ బ్యాటర్ కీగన్ పీటర్సన్(82) శార్ధూల్ ఠాకూర్ క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో దక్షిణాఫ్రికా 155 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. క్రీజ్‌లో వాన్ డెర్ డస్సెన్(18), బవుమా ఉన్నారు. కీగన్ పీటర్సన్ అద్భుతంగా ఆడుతున్నాడు. 106 బంతుల్లో 74 పరుగులు పూర్తి చేసుకున్నాడు. మరో ఎండ్‌లో డసెన్ అతడికి సహకారం అందిస్తున్నాడు. మరోవైపు టీమిండియా క్యాచ్‌లు జారవిడుస్తూ మ్యాచ్‌ను చేజార్చుకుంటోంది. స్కోరు: 148/2. విజయానికి 64 పరుగులు అవసరం. 2: 36 PM: షమీ బౌలింగ్‌లో 37వ ఓవర్ తొలి బంతికి డసెన్ షాట్ ఆడటానికి ప్రయత్నించి విఫలమై క్యాచ్ ఇచ్చాడు. ఈ క్రమంలో బంతి బ్యాట్‌ను తాకినట్లు భావించిన కెప్టెన్ కోహ్లి ఆఖరి నిమిషంలో రివ్యూకు వెళ్లాడు. కానీ అక్కడ నిరాశే ఎదురైంది. దీంతో కోహ్లి మరోసారి అసహనానికి లోనయ్యాడు. 2: 30 PM: నిలకడగా ఆడుతున్న దక్షిణాఫ్రికా కీగన్ పీటర్సన్ 53 పరుగులు, డసెన్ 11 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇంకో 92 పరుగులు సాధిస్తే విజయం ఆతిథ్య జట్టు సొంతమవుతుంది. 2: 08 PM: దక్షిణాఫ్రికా- టీమిండియా మధ్య జరుగుతున్న నిర్ణయాత్మక మూడో టెస్టు నాలుగో రోజు ఆట ఆరంభమైంది. సిరీస్ విజయంపై కన్నేసిన ఆతిథ్య ప్రొటిస్ జట్టు 101/2 ఓవర్ నైట్ స్కోరుతో ఆట మొదలెట్టింది. కీగన్ పీటర్సన్ అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. ప్రస్తుతం డసెన్, పీటర్సన్ క్రీజులో ఉన్నారు. స్కోరు: 106/2. కాగా మొదటి ఇన్నింగ్స్‌లో కూడా పీటర్సన్ అర్ధ శతకంతో రాణించిన సంగతి తెలిసిందే. భారత్ తొలి ఇన్నింగ్స్: 223 ఆలౌట్ రెండో ఇన్నింగ్స్: 198 ఆలౌట్ దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్: 210 ఆలౌట్ తుది జట్లు: భారత్: కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, ఛతేశ్వర్ పుజారా, అజింక్య రహానే, విరాట్ కోహ్లి(కెప్టెన్), రిషభ్ పంత్(వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, ఉమేశ్ యాదవ్ దక్షిణాఫ్రికా: డీన్ ఎల్గర్(కెప్టెన్), ఎయిడెన్ మార్కరమ్, కీగన్ పీటర్సన్, రసే వాన్ డెర్ డసెన్, తెంబా బవుమా, కైలీ వెరెనె(వికెట్ కీపర్), మార్కో జాన్సెన్, కగిసో రబడ, కేశవ్ మహరాజ్, డువానే ఒలివర్, లుంగి ఎంగిడి. A well crafted half-century from Keegan Petersen🤝 Day two highlights: https://t.co/cm0Rg0OPio#SAvIND #FreedomTestSeries #BePartOfIt | @Betway_India pic.twitter.com/izKdGUmSEn — Cricket South Africa (@OfficialCSA) January 13, 2022 -
Ind Vs Sa: కోహ్లి మరీ ఇంత చెత్తగా ప్రవర్తిస్తావా.. అసలేం అనుకుంటున్నావు?
Ind Vs Sa 3rd test- Virat Kohli- Elgar DRS Call Row: టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ భారత టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లిపై మండిపడ్డాడు. మరీ ఇంత చెత్తగా ప్రవర్తించడం ఏమిటని ప్రశ్నించాడు. ఇలా చేయడం ద్వారా యువ ఆటగాళ్లకు ఏం సందేశం ఇస్తున్నావంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాడు. కాగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టులో గెలిచి చరిత్ర సృష్టించాలన్న కోహ్లి సేనకు కఠిన సవాలు ఎదురైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మూడో రోజు ఆటలో భాగంగా ప్రొటిస్ కెప్టెన్ డీన్ ఎల్గర్ డీఆర్ఎస్ కాల్, అందుకు కోహ్లి బృందం స్పందించిన తీరు ఎంతటి వివాదాస్పదంగా మారిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా కోహ్లి స్టంప్స్ మైక్ దగ్గరకు వెళ్లి.. ‘‘కేవలం ప్రత్యర్థి జట్టు మీదే కాదు. ముందు మీ జట్టు మీద దృష్టి సారించండి. అందరిపైనా ఫోకస్ పెట్టండి’’ అని వ్యాఖ్యానించడం విమర్శలకు తావిచ్చింది. ఈ నేపథ్యంలో స్టార్ స్పోర్ట్స్‌తో మాట్లాడిన గౌతం గంభీర్... ‘‘కోహ్లికి ఏమాత్రం పరిణతి లేదు. భారత జట్టు కెప్టెన్ స్టంప్స్ మైక్ వద్దకు వెళ్లి ఇలా చెప్పడం నిజంగా చెత్త విషయం. ఇలా చేయడం ద్వారా యువ క్రికెటర్లకు నువ్వు అస్సలు ఆదర్శవంతుడివి కాలేవు’’ అంటూ కోహ్లి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇక దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు షాన్ పొలాక్ ఈ వివాదంపై స్పందిస్తూ.. వికెట్ తీయాలన్న కసితో ఉన్న టీమిండియాకు ఎల్గర్ డీఆర్ఎస్ కాల్‌తో తప్పించుకోవడం మింగుడుపడలేదని.. అందుకే ఆటగాళ్లు తీవ్ర నిరాశకు గురయ్యారని పేర్కొన్నాడు. ఏదేమైనా ప్రసారకర్తలను ఉద్దేశించి అలా మాట్లాడటం సరికాదన్నాడు. కాగా నాలుగో రోజు ఆటలో భారత బౌలర్లు 8 వికెట్లు పడగొడితేనే విజయం సాధ్యపడుతుంది. చదవండి: Virat Kohli Vs Dean Elgar: సైలెంట్‌గా ఉంటానా డీన్.. 3 ఏళ్ల క్రితం ఏం చేశావో తెలుసు.. కోహ్లి మాటలు వైరల్ pic.twitter.com/00dPXQv8sK — Addicric (@addicric) January 13, 2022 pic.twitter.com/HtZwoo9Lm7 — Bleh (@rishabh2209420) January 13, 2022 -
Ind Vs Sa: సైలెంట్‌గా ఉంటానా.. 3 ఏళ్ల క్రితం ఏం చేశావో తెలుసు.. కోహ్లి మాటలు వైరల్
Ind Vs Sa 3rd Test- Virat Kohli Slammed Dean Elgar Goes Viral: దక్షిణాఫ్రికాతో మూడో టెస్టు మూడో రోజు ఆటలో భాగంగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి వ్యవహరించిన తీరుకు సంబంధించిన మరో వీడియో వైరల్ అవుతోంది. ప్రొటిస్ కెప్టెన్ డీన్ ఎల్గర్‌ను ఉద్దేశించి కోహ్లి అన్న మాటలు స్టంప్ మైకులో రికార్డయ్యాయి. ‘‘నేను చూస్తూ ఊరుకుంటానని నువ్వు అనుకుంటున్నావా’’ అంటూ కోహ్లి ఎల్గర్‌ను స్లెడ్జ్ చేయడం క్రీడా వర్గాల్లో చర్చనీయాంశమైంది. కాగా వాండరర్స్ టెస్టులో గెలుపొంది.. సఫారీ గడ్డపై చరిత్ర సృష్టించాలన్న టీమిండియా ఆశలపై ఎల్గర్ నీళ్లు చల్లిన సంగతి తెలిసిందే. అద్భుతమైన ఇన్నింగ్స్‌తో జట్టును గెలిపించి.. 1-1తో సిరీస్‌ను సమం చేశాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. దీంతో మూడో టెస్టు ఇరు జట్లకు మరింత కీలకంగా మారింది. ఈ క్రమంలో భారత జట్టు బ్యాటర్ల పేలవ ప్రదర్శన కొనసాగడంతో.. ఇప్పుడు భారమంతా బౌలర్లపైనే పడింది. శుక్రవారం నాటి నాలుగో రోజు ఆటలో ఎనిమిది వికెట్లు పడగొడితేనే భారత్ మ్యాచ్ గెలవగలదు. అయితే, మూడో రోజు పీటర్సన్, ఎల్గర్ మెరుగైన భాగస్వామ్యం నమోదు చేసి ప్రొటిస్‌కు శుభారంభం అందించారు. ఈ క్రమంలో అశ్విన్ బౌలింగ్‌లో ఎల్గర్ రివ్యూకు వెళ్లడం.. ఆ తర్వాత బుమ్రా బౌలింగ్‌లో అవుట్ కావడం వంటి పరిణామాల నేపథ్యంలో కోహ్లి వ్యవహరించిన తీరు క్రికెట్ ప్రపంచాన్ని ఆకర్షించింది. కాగా తొలుత ఎల్గర్ డీఆర్ఎస్ కాల్‌తో తప్పించుకోవడంతో కోహ్లి పూర్తిగా సహనం కోల్పోయాడు. ఆ తర్వాత బుమ్రా బౌలింగ్‌లో ఆచితూచి ఆడటంతో.. ‘‘అస్సలు నమ్మలేకపోతున్నా... గత మ్యాచ్‌లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన వ్యక్తి.. జస్ప్రీత్ నుంచి తప్పించుకుంటున్నాడు. 13 ఏళ్లుగా ఇదే చేస్తున్నావు డీన్... నన్ను సైలెంట్‌గా ఉంచగలనని నువ్వు అనుకుంటున్నావా? 2018లో జొహన్నస్‌బర్గ్ టెస్టు రద్దు కావాలని కోరుకున్నది ఎవరో మా అందరికీ తెలుసు’’ అని తీవ్ర స్థాయిలో విమర్శించాడు. కాగా మూడేళ్ల క్రితం టీమిండియా దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా... వాండరర్స్ టెస్టులో 63 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించిన తర్వాత.. ఈ మ్యాచ్‌ను రద్దు చేసి ఉంటే బాగుండేదని ఎల్గర్ వ్యాఖ్యానించాడు. ఇప్పుడు అదే విషయాన్ని ప్రస్తావిస్తూ కోహ్లి ఎల్గర్‌ను స్లెడ్జ్ చేశాడు. ఇక ఎల్గర్ రివ్యూ విషయంలో కోహ్లి, అశ్విన్, కేఎల్ రాహుల్ అన్న మాటలు కూడా రికార్డైన సంగతి తెలిసిందే. చదవండి: Ind Vs Sa 3rd Test- Virat Kohli: వాళ్లిద్దరు బాగా ఆడారు.. అందుకే కోహ్లి అలా చేశాడు: దక్షిణాఫ్రికా బౌలర్ GOLD pic.twitter.com/2OGy2EKqvp — Benaam Baadshah (@BenaamBaadshah4) January 14, 2022 -
Ind Vs Sa 3rd Test: మా వాళ్లు సూపర్.. అందుకే కోహ్లి అలా చేశాడు: ప్రొటిస్ బౌలర్
Ind Vs Sa 3rd Test- Elgar DRS Call- Kohli Reaction Viral: దక్షిణాఫ్రికాతో మూడో టెస్టులో భాగంగా విరాట్ కోహ్లి బృందం వ్యవహరించిన తీరుపై ప్రొటిస్ బౌలర్ లుంగి ఎంగిడి స్పందించాడు. ఒత్తిడిని తట్టుకోలేకే అసహనం ప్రదర్శించారని వ్యాఖ్యానించాడు. అసలేం జరిగిందంటే... దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ 21వ ఓవర్లో అశ్విన్ బౌలింగ్‌లో బంతి కెప్టెన్ డీన్ ఎల్గర్ ప్యాడ్లను తాకుతూ ఆఫ్‌స్టంప్ దిశగా కీపర్ పంత్ చేతుల్లో పడింది. అశ్విన్ అప్పీల్‌కు వెళ్లగా.. ఫీల్డ్ అంపైర్ అవుట్ ఇచ్చాడు. కానీ.. ఎల్గర్ మాత్రం రివ్యూకు వెళ్లాడు. ‘బాల్ ట్రాకింగ్’ను ప్రసారకర్తలు తప్పుగా చూపించడంతో.. ఫీల్డ్ ఎంపైర్ ఎల్గర్‌ను నాటౌట్‌గా ప్రకటించడం జరిగాయి. దీంతో టీమిండియా కెప్టెన్ కోహ్లి సహా అశ్విన్, కేఎల్ రాహుల్ ప్రసారకర్తల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. కోహ్లి అయితే.. స్టంప్స్ వద్ద నిలబడి ‘ఎప్పుడూ మా మీదే దృష్టి పెడితే ఎలా. మీ జట్టును కూడా కాస్త చూసుకోండి’ అంటూ సెటైర్లు వేశాడు. ఇక ఆ తర్వాత రివ్యూ ద్వారానే భారత్‌కు బుమ్రా బౌలింగ్‌లో ఎల్గర్ వికెట్ దక్కడం విశేషం. ఈ విషయంపై స్పందించిన ఎంగిడి.. ‘‘ఎల్గర్, పీటర్సన్ మెరుగైన భాగస్వామ్యం నమోదు చేశారు. ఈ ద్వయాన్ని విడదీయాలని వాళ్లు(టీమిండియా) ఎంతగానో ప్రయత్నించారు. కానీ.. అది కష్టతరంగా మారింది. దాంతో వాళ్లు అసహనానికి గురయ్యారు. అయినా ఒక్కొక్కరి భావోద్వేగాలు ఒక్కోలా ఉంటాయి. అసహనం, విసుగు వంటి ఉద్వేగాలను ప్రదర్శించడం సహజమే. అంతేగానీ, ఎవరు కూడా ఉద్దేశపూర్వంగా అలా చేయరు. నిజానికి టీమిండియా ఒత్తిడిలో ఉంది. మైదానంలో వారు వ్యవహరించిన తీరే ఇందుకు నిదర్శనం’’ అని వ్యాఖ్యానించాడు. కాగా ఆఖరిదైన మూడో టెస్టులో గెలిస్తేనే టీమిండియా సఫారీ గడ్డపై టెస్టు సిరీస్ గెలవాలన్న చిరకాల కోరిక నెరవేరుతుంది. కానీ.. ప్రొటిస్ జట్టు బలంగా నిలబడి.. మన ఆశలపై నీళ్లు చల్లేలా అద్భుత ప్రదర్శన కనబరుస్తోంది. నాలుగో రోజు ఆటలో మన బౌలర్లు ఎంత త్వరగా ఎనిమిది వికెట్లు పడగొడుతారన్న అంశంపైనే మన విజయం ఆధారపడి ఉంది. లేదంటే మరోసారి రిక్తహస్తాలతో వెనుదిరగాల్సిందే. ఈ నేపథ్యంలో కోహ్లి సేన కాస్త ఒత్తిడికి గురవడం సహజమే! చదవండి: అదే తీరు.. ఈసారి పంత్‌తో పెట్టుకున్నాడు pic.twitter.com/00dPXQv8sK — Addicric (@addicric) January 13, 2022 pic.twitter.com/HtZwoo9Lm7 — Bleh (@rishabh2209420) January 13, 2022 Lungi Ngidi producing the goods with three game changing wickets✅ #SAvIND #FreedomTestSeries #BePartOfIt | @Betway_India | @JohnnieWalkerSA pic.twitter.com/BDoD3z25nT — Cricket South Africa (@OfficialCSA) January 13, 2022 -
తక్కువ వ్యవధిలో తప్పును పునరావృతం చేయనివాడే గొప్పగా ఎదుగుతాడు! శెభాష్ పంత్!
Ind Vs Sa 3rd Test India Need 8 Wickets To Win: భారత్, దక్షిణాఫ్రికా టెస్టు సిరీస్‌లో ఉత్కంఠభరిత ముగింపునకు రంగం సిద్ధమైంది...212 పరుగులంటే సాధారణ విజయలక్ష్యమే...ఇప్పటికే 101 పరుగులు చేసి సఫారీ జట్టు విజయానికి మరో 111 పరుగుల దూరంలో నిలిచింది. కానీ గురువారం ఒక దశలో విజయంపై ఆశలు వదిలేసినట్లు కనిపించిన భారత్ చివరి బంతికి ఎల్గర్ వికెట్ తీసి కొత్తగా ఆశలు రేపింది. స్వల్ప స్కోర్ల ఈ మ్యాచ్‌లో మరోసారి జట్టును గెలిపించాల్సిన బాధ్యత బౌలర్లపైనే పడింది. నాలుగో రోజు మిగతా ఎనిమిది వికెట్లు తీసి టీమిండియా తొలి సారి దక్షిణాఫ్రికాలో సిరీస్ నెగ్గాలనే కలను నిజం చేసుకుంటుందా... మిగిలిన పరుగులను సఫారీ టీమ్ సాధిస్తుందా చూడాలి. తక్కువ వ్యవధిలో తప్పును పునరావృతం చేయనివాడే గొప్పగా ఎదుగుతాడు, పంత్ తొందరగా నేర్చుకుంటాడు...మ్యాచ్‌కు ముందు రిషభ్ పంత్ గురించి కోహ్లి చేసిన వ్యాఖ్య ఇది. నిజంగానే పంత్ ఎంతో నేర్చుకున్నాడు. తన సహజమైన దూకుడును కొనసాగిస్తూనే పరిస్థితులకు అనుగుణంగా పూర్తి సంయమనంతో అతను బ్యాటింగ్ చేశాడు. సహచరులంతా విఫలమైన చోట తానొక్కడే ‘శభాష్’ అనిపించేలా అద్భుత ఇన్నింగ్స్‌తో చిరస్మరణీయ సెంచరీ సాధించాడు. భారత్ ఈ మాత్రం పోటీనిచ్చే స్థితికి చేరిందంటే అది పంత్ చలవే. కేప్‌టౌన్: హోరాహోరీగా సాగిన టెస్టు సిరీస్ విజేతను తేల్చే సమయం వచ్చేసింది. 212 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేస్తున్న దక్షిణాఫ్రికా గురువారం ఆట ముగిసే సమయానికి తమ రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్ల నష్టానికి 101 పరుగులు చేసింది. డీన్ ఎల్గర్ (30), మార్క్రమ్ (16) అవుట్ కాగా...కీగన్ పీటర్సన్ (61 బంతుల్లో 48 బ్యాటింగ్; 7 ఫోర్లు) చక్కటి ఆటతీరుతో పట్టుదలగా నిలిచాడు. షమీ, బుమ్రా చెరో వికెట్ తీశారు. అంతకు ముందు ఓవర్‌నైట్ స్కోరు 57/2తో ఆట కొనసాగించిన భారత్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 198 పరుగులకే ఆలౌటైంది. రిషభ్ పంత్ (139 బంతుల్లో 100 నాటౌట్; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) అజేయ శతకం సాధించాడు. శభాష్ పంత్... రెండో రోజు రెండో బంతికే పుజారా (9)ను జాన్సెన్ అవుట్ చేయగా, తర్వాతి ఓవర్లోనే రహానే (1)ను రబడ పెవిలియన్ పంపించాడు. ఈ స్థితిలో కోహ్లి (143 బంతుల్లో 29; 4 ఫోర్లు), పంత్ కలిసి పరిస్థితిని చక్కదిద్దారు. కోహ్లి చాలా జాగ్రత్తగా ఆడుతూ వికెట్ కాపాడుకునేందుకు ప్రాధాన్యతనివ్వగా, మరో ఎండ్‌లో పంత్ తనదైన శైలిలో దూకుడు ప్రదర్శించాడు. సఫారీ బౌలర్లందరినీ సమర్థంగా ఎదుర్కొన్న అతను 58 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే మూడో వికెట్‌కు పంత్‌తో 94 పరుగులు జోడించిన తర్వాత మార్క్రమ్ అద్భుత క్యాచ్‌కు కోహ్లి వెనుదిరిగాడు. ఇందులో పంత్ చేసినవి 71 పరుగులు కాగా, కోహ్లి 15 పరుగులు మాత్రమే చేయడం విశేషం. ఆ తర్వాత పంత్‌కు లోయర్ ఆర్డర్నుంచి సహకారం కరవైంది. తర్వాతి ఐదుగురు బ్యాటర్లు కలిపి 14 పరుగులే చేశారు! పరిస్థితిని గమనించిన పంత్ తానే చొరవ తీసుకొని వేగంగా ఆడుతూ శతకం దిశగా దూసుకుపోయాడు. 88 వద్ద కేశవ్ మహరాజ్, 94 వద్ద బవుమా కష్టసాధ్యమైన క్యాచ్‌లు వదిలేయడంతో బతికిపోయిన పంత్, తర్వాతి ఓవర్లోనే సింగిల్ తీసి 133 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. స్కోరు వివరాలు: భారత్ తొలి ఇన్నింగ్స్ 223; దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ 210; భారత్ రెండో ఇన్నింగ్స్: రాహుల్ (సి) మార్క్రమ్ (బి) జాన్సెన్ 10; మయాంక్ (సి) ఎల్గర్ (బి) రబడ 7; పుజారా (సి) పీటర్సన్ (బి) జాన్సెన్ 9; కోహ్లి (సి) మార్క్రమ్ (బి) ఎన్గిడి 29; రహానే (సి) ఎల్గర్ (బి) రబడ 1; పంత్ (నాటౌట్) 100; అశ్విన్ (సి) జాన్సెన్ (బి) ఎన్గిడి 7; శార్దుల్ (సి) వెరీన్ (బి) ఎన్గిడి 5; ఉమేశ్ (సి) వెరీన్ (బి) రబడ 0; షమీ (సి) వాన్ డర్ డసెన్ (బి) జాన్సెన్ 0; బుమ్రా (సి) బవుమా (బి) జాన్సెన్ 2; ఎక్స్‌ట్రాలు 28; మొత్తం (67.3 ఓవర్లలో ఆలౌట్) 198. వికెట్ల పతనం: 1–20, 2–24, 3–57, 4–58, 5–152, 6–162, 7–170, 8–180, 9–189, 10–198. బౌలింగ్: రబడ 17–5–53–3, ఒలీవియర్ 10–1–38–0, జాన్సెన్ 19.3–6–36–4, ఎన్గిడి 14–5–21–3, కేశవ్ మహరాజ్ 7–1–33–0. Lungi Ngidi producing the goods with three game changing wickets✅ #SAvIND #FreedomTestSeries #BePartOfIt | @Betway_India | @JohnnieWalkerSA pic.twitter.com/BDoD3z25nT — Cricket South Africa (@OfficialCSA) January 13, 2022 దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్ 101/2. చదవండి: Virat Kohli: ఓడిపోతున్నామనే బాధ.. కోహ్లి అసహనం -
ఓడిపోతున్నామనే బాధ.. కోహ్లి అసహనం
Virat Kohli Shows Frustration.. సౌతాఫ్రికాతో మూడో టెస్టులో విరాట్ కోహ్లి అసహనం వ్యక్తం చేయడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విషయంలోకి వెళితే.. ప్రొటీస్ ఇన్నింగ్స్ 21వ ఓవర్ అశ్విన్ వేశాడు. ఆ ఓవర్ నాలుగో బంతిని డీన్ ఎల్గర్ ఆడగా.. బంతి ప్యాడ్లను తాకుతూ ఆఫ్‌స్టంప్ దిశగా కీపర్ పంత్ చేతుల్లో పడింది. వెంటనే అశ్విన్ అప్పీల్‌కు వెళ్లగా.. ఫీల్డ్ అంపైర్ ఎరాస్మస్ ఔట్ ఇచ్చాడు. దీంతో టీమిండియా ఆటగాళ్లు సంబరాల్లో మునిగిపోయారు. చదవండి: Jasprit Bumrah Vs Marco Jansen: బుమ్రాతో వైరం.. ఫలితం అనుభవించాడు అయితే ఎల్గర్ తాను ఔట్ కాదన్న డౌట్‌తో రివ్యూకు వెళ్లాడు. రీప్లే చూస్తే బంతి పిచ్‌పై పడటం, లైన్‌పై దాని ప్రభావం అన్నీ బ్యాటర్‌కు వ్యతిరేకంగా ఉన్నాయి. బంతి దిశను చూసినా నేరుగా మిడిల్ స్టంప్ వద్ద బ్యాటర్ ప్యాడ్‌కు తగులుతున్నట్లుగా కనిపించింది. ఇక తాను అవుట్ అనుకుంటూ ఎల్గర్ నిష్క్రమించేందుకు కూడా సిద్ధమయ్యాడు. అయితే అనూహ్యంగా ‘బాల్ ట్రాకర్’ బంతి వికెట్ల పైనుంచి వెళుతున్నట్లుగా చూపించింది. దాంతో ఎరాస్మస్ కూడా ‘ఇదెలా సాధ్యం’ అంటూ వ్యాఖ్యానిస్తూ ఎల్గర్‌ను నాటౌట్‌గా ప్రకటించాడు. దీంతో టీమిండియా ఆటగాళ్లు షాక్ తిన్నారు. ముఖ్యంగా కోహ్లి ఎల్గర్ ఔట్ కాదని తేలడంతో.. కోపంలో గ్రౌండ్ టర్ఫ్‌ను కోపంతో తన్నడం కెమెరాలకు చిక్కింది. అశ్విన్ వేసిన బంతి ఎక్స్ట్రా బౌన్స్ కావడంతో బంతి స్టంప్స్‌ను మిస్ అయినట్లు ట్రాకింగ్‌లో కనిపించింది. దాంతో కెప్టెన్ సహా టీమ్ సభ్యులంతా ఒకరి తర్వాత ఒకరు ‘బాల్ ట్రాకింగ్’ను తప్పుగా చూపించిన ప్రసారకర్తలపై (సూపర్ స్పోర్ట్స్) స్టంప్స్మైక్ ద్వారా తమ మాటలతో విరుచుకు పడ్డారు. ‘సూపర్ స్పోర్ట్స్... మీరు గెలిచేందుకు ఇంతకంటే మెరుగైన పద్ధతులు చూసుకోండి’ అంటూ అశ్విన్ అనగా.. కేఎల్ రాహుల్ కూడా ‘11 మంది ప్రత్యర్థిగా దేశం మొత్తం ఆడుతోంది’ అనేశాడు. మయాంక్ కూడా ‘మీరు ఆటకు చెడ్డ పేరు తెస్తున్నారు’ అంటూ వ్యాఖ్యానించాడు. ఇక కోహ్లి సహజంగానే మైదానంలో తన ఆగ్రహావేశాలు ప్రదర్శించాడు. అతని చర్యను కూడా రీప్లేలో చూపడంతో కోపం తెచ్చుకున్న కోహ్లి స్టంప్స్ వద్ద నిలబడి ‘ఎప్పుడూ మాపైనే దృష్టి పెడితే ఎలా. మీ టీమ్‌ను కూడా చూసుకోండి’ అన్నాడు. ఆ తర్వాత మరో సారి ఎల్గర్ అవుట్ కోసం బుమ్రా అప్పీల్ చేయగా...‘వద్దులే. ఈ సారి భుజాలపైనుంచి బంతి పోతోంది అంటారేమో’ అంటూ కోహ్లి వ్యంగ్యంగా వ్యాఖ్యానించాడు. చివరకు రివ్యూ ద్వారానే భారత్‌కు ఎల్గర్ వికెట్ దక్కడం విశేషం. ఎల్గర్ లెగ్‌సైడ్ వైపు ఆడగా పంత్ క్యాచ్ అందుకొని అప్పీల్ చేశాడు. అంపైర్ నాటౌట్‌గా ఇచ్చినా రివ్యూలో ఫలితం భారత్‌కు అనుకూలంగా వచ్చింది. అయితే గొడవ తర్వాత ఏకాగ్రత కోల్పోయిన టీమిండియా 8.5 ఓవర్లలోనే 41 పరుగులు సమర్పించుకుంది. అయితే ఇదే ఎల్గర్ సౌతాఫ్రికా జోహన్నెస్‌బర్గ్ టెస్టును గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. ముఖ్యంగా ఆ మ్యాచ్‌లో రెండో ఇన్నింగ్స్‌లో నాలుగు పరుగులు తేడాతో సెంచరీకి దూరమైనప్పటికి.. 96 నాటౌట్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో మెరిసిన సంగతి తెలిసిందే. ఇక దక్షిణాఫ్రికా విజయానికి 111 పరుగుల దూరంలో ఉంది. నాలుగో రోజు ఆటలో టీమిండియా బౌలర్లు విజృంభించడంపైనే విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. అంతకముందు టీమిండియా రెండో ఇన్నింగ్స్ 198 పరుగులకు ఆలౌట్ అయింది. పంత్ సెంచరీతో ఆకట్టుకోగా.. కోహ్లి 29 పరుగులు చేశాడు. చదవండి: పంత్ వీరోచిత సెంచరీ.. దక్షిణాఫ్రికా గడ్డపై పలు రికార్డులు pic.twitter.com/00dPXQv8sK — Addicric (@addicric) January 13, 2022 pic.twitter.com/HtZwoo9Lm7 — Bleh (@rishabh2209420) January 13, 2022 pic.twitter.com/6XiQdNSj9X — Bleh (@rishabh2209420) January 13, 2022 -
IND vs SA 3rd Test: టార్గెట్ 212.. దక్షిణాఫ్రికా 101/2
IND vs SA 3rd Test- Day 3 Updates: 9:30 PM: టార్గెట్ 212.. దక్షిణాఫ్రికా 101/2 212 పరుగుల ఛేదనకు దిగిన దక్షిణాఫ్రికా మూడో రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 101 పరుగులు చేసింది. మూడో రోజు ఆఖరి బంతికి ఎల్గర్(30) ఔటయ్యాడు. బుమ్రా బౌలింగ్‌లో పంత్ క్యాచ్‌కు ఇచ్చి ఎల్గర్ వెనుదిరిగాడు. క్రీజ్‌లో కీగన్ పీటర్సన్(48) ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా గెలవాలంటే మరో 111 పరుగులు అవసరం కాగా, టీమిండియా 8 వికెట్లు పడగొడితే మ్యాచ్‌తో పాటు సిరీస్‌ను సొంతం చేసుకుంటుంది. కాగా, టీమిండియా సెకెండ్ ఇన్నింగ్స్ 198 పరుగుల వద్ద ముగిసింది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని కలుపుకుని భారత్ 212 పరుగుల లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా ముందుంచింది. రిషబ్ పంత్ వీరోచిత సెంచరీ(100 నాటౌట్)తో జట్టును ఆదుకున్నాడు. భారత ఇన్నింగ్స్‌లో కేఎల్ రాహుల్(10), కోహ్లి(29), పంత్ మినహా ఎవ్వరూ రెండంకెల స్కోర్ కూడా చేయలేకపోయారు. సఫారీ బౌలర్లలో జన్సెన్ 4, రబాడ, ఎంగిడి తలో 3 వికెట్లు పడగొట్టారు. అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 223 పరుగులు, దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 210 పరుగులు చేసిన విషయం తెలిసిందే. 7:40 PM: టార్గెట్ 212.. తొలి వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా టీమిండియా నిర్ధేశించిన 212 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో దక్షిణాఫ్రికాకు ఆదిలోనే షాక్ తగిలింది. 16 పరుగులు చేసిన మార్క్రమ్.. షమీ బౌలింగ్‌లో రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఫలితంగా దక్షిణాఫ్రికా 23 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. క్రీజ్‌లో డీన్ ఎల్గర్(3), పీటర్సన్ ఉన్నారు. ఈ మ్యాచ్ గెలవాలంటే దక్షిణాఫ్రికాకు మరో 189 పరుగులు, టీమిండియాకైతే 9 వికెట్లు కావాలి. ముగిసిన భారత ఇన్నింగ్స్.. దక్షిణాఫ్రికా టార్గెట్ 212 6: 50 PM: జన్సెన్ బౌలింగ్‌లో బవుమాకు క్యాచ్ ఇచ్చి బుమ్రా(2) ఔట్ కావడంతో టీమిండియా సెకెండ్ ఇన్నింగ్స్ 198 పరుగుల వద్ద ముగిసింది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని కలుపుకుని భారత్ 212 పరుగుల లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా ముందుంచింది. రిషబ్ పంత్ వీరోచిత సెంచరీ(100 నాటౌట్)తో జట్టును ఆదుకున్నాడు. భారత ఇన్నింగ్స్‌లో కేఎల్ రాహుల్(10), కోహ్లి(29), పంత్ మినహా ఎవ్వరూ రెండంకెల స్కోర్ కూడా చేయలేకపోయారు. సఫారీ బౌలర్లలో జన్సెన్ 4, రబాడ, ఎంగిడి తలో 3 వికెట్లు పడగొట్టారు. అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 223 పరుగులు, దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 210 పరుగులు చేసిన విషయం తెలిసిందే. 6:32 PM: షమీ ఔట్.. టీమిండియా తొమ్మిదో వికెట్ డౌన్ మార్కో జన్సెన్ బౌలింగ్‌లో 189 పరుగుల వద్ద మహ్మద్ షమీ డకౌటయ్యాడు. ఫలితంగా టీమిండియా తొమ్మిదో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం టీమిండియా 212 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. క్రీజ్‌లో పంత్(94), బుమ్రా ఉన్నారు. 6:05 PM: ఎనిమిదో వికెట్ కోల్పోయిన భారత్.. ఉమేశ్ డకౌట్ టీమిండియా ఎనిమిదో వికెట్ కోల్పోయింది. 180 పరుగుల వద్ద రబాడ బౌలింగ్‌లో వికెట్‌కీపర్ వెర్రిన్‌కు సునాయాసమైన క్యాచ్ ఇచ్చి ఉమేశ్ యాదవ్(0) ఔటయ్యాడు. ప్రస్తుతం టీమిండియా 193 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. క్రీజ్‌లో పంత్(87), షమీ ఉన్నారు. 5:50 PM: ఏడో వికెట్ కోల్పోయిన భారత్ 170 పరుగుల స్కోర్ వద్ద భారత్ ఏడో వికెట్ కోల్పోయింది. ఎంగిడి బౌలింగ్‌లో వికెట్ కీపర్ వెర్రిన్‌కు క్యాచ్ ఇచ్చి శార్ధూల్ ఠాకూర్(5) ఔటయ్యాడు. ప్రస్తుతం టీమిండియా 183 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. క్రీజ్‌లో పంత్(77), ఉమేశ్ యాదవ్ ఉన్నారు. 5:28 PM: అశ్విన్(7) ఔట్.. టీమిండియా ఆరో వికెట్ డౌన్ 162 పరుగుల వద్ద టీమిండియా ఆరో వికెట్ కోల్పోయింది. ఎంగిడి బౌలింగ్‌లో జన్సెన్కు క్యాచ్ ఇచ్చి అశ్విన్(7) వెనుదిరిగాడు. ప్రస్తుతం టీమిండియా 175 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. క్రీజ్‌లో పంత్(74), శార్ధూల్ ఠాకూర్ ఉన్నారు. 5:08 PM: ఐదో వికెట్ కోల్పోయిన టీమిండియా లంచ్ విరామం తర్వాత టీమిండియాకు మరో షాక్ తగిలింది. నిలకడగా ఆడుతున్న జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి(143 బంతుల్లో 29; 4 ఫోర్లు) లూజ్ షాట్ ఆడి వికెట్ సమర్పించుకున్నాడు. ఎంగిడి బౌలింగ్‌లో మార్క్రమ్ సెకెండ్ స్లిప్‌లో సునాయాసమైన క్యాచ్ అందుకున్నాడు. ఫలితంగా టీమిండియా 152 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది. క్రీజ్‌లో పంత్(71), అశ్విన్ ఉన్నారు. ప్రస్తుతం టీమిండియా 165 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. 2: 20 PM: నాలుగో వికెట్ కోల్పోయిన భారత్ రబడ బౌలింగ్‌లో డీన్ ఎల్గర్‌కు క్యాచ్ ఇచ్చి అజింక్య రహానే పెవిలియన్ చేరాడు. కోహ్లి, పంత్ క్రీజులో ఉన్నారు. 2: 07 PM: మూడో వికెట్ కోల్పోయిన టీమిండియా దక్షిణాఫ్రికాతో మూడో రోజు ఆటలో భాగంగా భారత జట్టు ఆదిలోనే కీలక వికెట్ కోల్పోయింది. మార్కో జాన్సెన్ బౌలింగ్‌లో పుజారా మూడో వికెట్‌గా వెనుదిరిగాడు. కీగన్ పీటర్సన్ అద్భుతమైన క్యాచ్ అందుకోవడంతో 9 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు. కోహ్లి, రహానే క్రీజులో ఉన్నారు. ప్రస్తుత స్కోరు: 58/3. 2: 00 PM: దక్షిణాఫ్రికా- టీమిండియా మధ్య ఆఖరి టెస్టులో భాగంగా మూడో రోజు ఆట ఆరంభమైంది. 57/2 ఓవర్ నైట్ స్కోరుతో భారత్ ఆట మొదలుపెట్టింది. కెప్టెన్ విరాట్ కోహ్లి 14, పుజారా 9 పరుగులతో క్రీజులో ఉన్నారు. భారత్ తొలి ఇన్నింగ్స్: 223 ఆలౌట్ దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్: 210 ఆలౌట్ తుది జట్లు: భారత్: కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, ఛతేశ్వర్ పుజారా, అజింక్య రహానే, విరాట్ కోహ్లి(కెప్టెన్), రిషభ్ పంత్(వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, ఉమేశ్ యాదవ్ సౌతాఫ్రికా: డీన్ ఎల్గర్(కెప్టెన్), ఎయిడెన్ మార్కరమ్, కీగన్ పీటర్సన్, రసే వాన్ డెర్ డసెన్, తెంబా బవుమా, కైలీ వెరెనె(వికెట్ కీపర్), మార్కో జాన్సెన్, కగిసో రబడ, కేశవ్ మహరాజ్, డువానే ఒలివర్, లుంగి ఎంగిడి. చదవండి: Jasprit Bumrah Vs Marco Jansen: బుమ్రాతో వైరం.. ఫలితం అనుభవించాడు -
ICC Test Rankings: దూసుకొచ్చిన ప్రొటిస్ కెప్టెన్.. టీమిండియా నుంచి అతడొక్కడే!
ICC Test Rankings: వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ 2021-23లో భాగంగా పలు టెస్టు సిరీస్‌లు జరుగుతున్న తరుణంలో ఐసీసీ తాజా ర్యాంకింగ్స్ ప్రకటించింది. బ్యాటింగ్ విభాగంలో ఆస్ట్రేలియా ఆటగాడు మార్నస్ లబుషేన్ 924 పాయింట్లతో అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ఇక ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ సైతం రెండో ర్యాంకును కాపాడుకోగా... న్యూజిలాండ్ సారథి కేన్ విలియమ్సన్ ఒక స్థానం దిగజారాడు. నాలుగో ర్యాంకుకు పడిపోయాడు. ఆసీస్ మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ మూడో స్థానానికి ఎగబాకి విలియమ్సన్ స్థానాన్ని ఆక్రమించాడు. ఇదిలా టీమిండియా బ్యాటర్లలో పరిమిత ఓవర్ల కెప్టెన్ రోహిత్ శర్మ(781), టెస్టు సారథి విరాట్ కోహ్లి(740) మాత్రమే టాప్-10లో చోటు దక్కించుకున్నారు. వరుసగా 5, 8 స్థానాల్లో నిలిచారు. ఇక టీమిండియాతో సిరీస్‌లో భాగంగా రెండో టెస్టులో అద్భుత ఇన్నింగ్స్ ఆడిన దక్షిణాఫ్రికా కెప్టెన్ డీన్ ఎల్గర్ ఏకంగా నాలుగు స్థానాలు మెరుగుపరుచుకుని పదో ర్యాంకు సాధించాడు. బౌలింగ్ విభాగంలో... టీమిండియా నుంచి అశ్విన్ ఒక్కడే.. ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ బౌలింగ్ విభాగంలో ఆసీస కెప్టెన్ ప్యాట్ కమిన్స్ 895 పాయింట్లతో మొదటి ర్యాంకును కాపాడుకోగా... టీమిండియా సీనియర్ స్పిన్నర్ అశ్విన్ 861 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక బంగ్లాదేశ్‌తో స్వదేశంలో జరిగిన టెస్టు సిరీస్‌లో అద్భుతంగా ఆడిన కివీస్ బౌలర్ కైలీ జెమీషన్ ఏకంగా 8 స్థానాలు ఎగబాకి మూడో ర్యాంకు దక్కించుకున్నాడు. షాహిన్ ఆఫ్రిది, కగిసో రబడ, జేమ్స్ ఆండర్సన్, టిమ్ సౌథీ, జోష్ హాజిల్‌వుడ్, నీల్ వాగ్నర్, హసన్ అలీ మొదటి పది స్థానాల్లో చోటు దక్కించుకున్నారు. భారత్ తరఫున అశ్విన్ మినహా ఒక్కరు కూడా టాప్-10లో లేకపోవడం గమనార్హం. చదవండి: IPL 2022: అతడు వేలంలోకి వస్తే రికార్డులు బద్దలు కావాల్సిందే.. 🔼 Steve Smith overtakes Kane Williamson 🔼 Kyle Jamieson launches into third spot The latest @MRFWorldwide ICC Men’s Test Player Rankings 👇 Full list: https://t.co/0D6kbTluOW pic.twitter.com/vXD07fPoES — ICC (@ICC) January 12, 2022 -
IND vs SA 3rd Test: రెండో రోజు ముగిసిన ఆట.. 70 పరుగుల లీడ్‌లో టీమిండియా
Ind Vs Sa 3rd Test Updates 9:32 PM: రెండో రోజు ముగిసిన ఆట.. 70 పరుగుల లీడ్‌లో టీమిండియా రెండో ఇన్నింగ్స్ ఆరంభంలోనే ఓపెనర్ల వికెట్లు కోల్పోయి కష్టాల్లో చిక్కుకున్న టీమిండియాను కెప్టెన్ కోహ్లి, పుజారా ఆదుకున్నారు. వీరిద్దరు మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడి రెండో రోజు ఆటను 57/2 స్కోర్ వద్ద ముగించారు. కోహ్లి 14 పరుగులు, పుజారా 9 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. మయాంక్(7)ను రబాడ, కేఎల్ రాహుల్(10)ను జన్సెన్ పెవిలియన్‌కు పంపారు. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకుని ప్రస్తుతం టీమిండియా 70 పరుగుల లీడ్‌లో కొనసాగుతుంది. అంతకుముందు బుమ్రా ఐదు వికెట్లతో చెలరేగడంతో సఫారీ జట్టు 210 పరుగులకే ఆలౌటైంది. 8:46 PM: టీమిండియాకు వరుస షాక్‌లు.. 4 పరుగుల వ్యవధిలో ఓపెనర్లు ఔట్ తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికాను 210 పరుగులకు కట్టడి చేసిన ఆనందం టీమిండియాకు ఎంతో సేపు నిలువలేదు. రెండో ఇన్నింగ్స్ ఆరంభంలోనే నాలుగు పరుగుల వ్యవధిలో ఇద్దరు ఓపెనర్లు పెవిలియన్‌కు చేరారు. 5వ ఓవర్లో రబాడ్ బౌలింగ్‌లో ఎల్గర్‌కు క్యాచ్ ఇచ్చి మయాంక్(7) ఔట్ కాగా, ఆరో ఓవర్లో జన్సెన్ బౌలింగ్‌లో మార్క్రమ్కు క్యాచ్ ఇచ్చి కేఎల్ రాహుల్(10) పెవిలియన్‌కు చేరాడు. ఫలితంగా టీమిండియా 24 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో చిక్కుకుంది. ప్రస్తుతం టీమిండియా 37 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. క్రీజ్‌లో పుజారా, కోహ్లి ఉన్నారు. 8:11 PM: ఐదేసిన బుమ్రా.. దక్షిణాఫ్రికా 210 ఆలౌట్ టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా 5 వికెట్లతో విజృంభించడంతో దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 210 పరుగులకు ఆలౌటైంది. ఎంగిడి 3 పరుగులు చేసి బుమ్రా బౌలింగ్‌లో అశ్విన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరగడంతో దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ ముగిసింది. బుమ్రా(5/42)తో పాటు ఉమేశ్ యాదవ్(2/64), షమీ(2/39), శార్ధూల్ ఠాకూర్(1/37) రాణించారు. ఫలితంగా టీమిండియాకు 13 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌లో కీగన్ పీటర్సన్(72) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. 7:45 PM: రబాడ(14) ఔట్.. తొమ్మిదో వికెట్ కోల్పోయిన దక్షిణాఫ్రికా 200 పరుగుల వద్ద దక్షిణాఫ్రికా తొమ్మిదో వికెట్ కోల్పోయింది. శార్ధూల్ ఠాకూర్ బౌలింగ్‌లో బుమ్రాకు క్యాచ్ ఇచ్చి రబాడ(15) ఔటయ్యాడు. క్రీజ్‌లో ఒలీవియర్(4), ఎంగిడి ఉన్నారు. దక్షిణాఫ్రికా ప్రస్తుతం 23 పరుగులు వెనుకపడి ఉంది. 6: 50 PM: ఏడో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా మార్కో జాన్సెన్ను బుమ్రా బౌల్డ్ చేశాడు. టీ బ్రేక్ సమయానికి టీమిండియా శిబిరంలో జోష్ నింపాడు. ఇక కొరకరాని కొయ్యగా తయారైన పీటర్సన్ 70 పరుగులతో క్రీజులో ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో బుమ్రా ఇప్పటి వరకు 3 వికెట్లు పడగొట్టగా.. ఉమేశ్ యాదవ్, షమీ చెరో రెండు వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు. ప్రొటిస్ ప్రస్తుత స్కోరు: 176/7 (62.2). భారత్ కంటే 47 పరుగులు వెనుకబడి ఉంది. 6: 12 PM: టీమిండియా బౌలర్ షమీ మరోసారి ఆకట్టుకున్నాడు. క్రీజులోకి వచ్చీ రాగానే వెరెనెను అవుట్ చేశాడు. పంత్ అద్భుత క్యాచ్ అందుకోవడంతో ప్రొటిస్ ఆరో వికెట్ కోల్పోయింది. స్కోరు: 160/6 (56). 6: 07 PM: పీటర్సన్, బవుమా భాగస్వామ్యాన్ని షమీ విడగొట్టాడు. కీలక వికెట్ పడగొట్టాడు. అద్భుతమైన బంతితో అతడిని ఊరించి పెవిలియన్‌కు పంపాడు. 28 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కోహ్లికి క్యాచ్ ఇచ్చి బవుమా వెనుదిరిగాడు. దీంతో దక్షిణాఫ్రికా ఐదో వికెట్ కోల్పోయింది. కాగా ఈ క్యాచ్‌తో కోహ్లి టెస్టుల్లో 100 క్యాచ్‌లు పూర్తి చేసుకున్నాడు. వెరెనె, పీటర్సన్ క్రీజులో ఉన్నారు. స్కోరు: 159/6 (55.4). 5: 30 PM: ►ప్రొటిస్ బ్యాటర్ కీగన్ పీటర్సన్ నిలకడగా ఆడుతున్నాడు. ఆచితూచి ఆడుతూనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 8 ఫోర్లు బాది 53 పరుగులతో క్రీజులో ఉన్నాడు. అతడికి తోడుగా తెంబా బవుమా మరో ఎండ్‌లో సహకారం అందిస్తున్నాడు. ఇప్పటి వరకు 22 బంతులు ఎదుర్కొన్న బవుమా 15 పరుగులు చేశాడు. ఇందులో రెండు ఫోర్లు ఉన్నాయి. ►5: 05 PM: నాలుగో వికెట్ కోల్పోయిన దక్షిణాఫ్రికా. ఉమేశ్ యాదవ్ బౌలింగ్‌లో కోహ్లికి క్యాచ్ ఇచ్చి డసెన్ పెవిలియన్ చేరాడు. తెంబా బవుమా, పీటర్సన్ క్రీజులో ఉన్నారు. 4: 03 PM: ►లంచ్ బ్రేక్ సమయానికి దక్షిణాఫ్రికా స్కోరు: 100/3 (35). 3: 47 PM: ►ప్రొటిస్ బ్యాటర్ కీగన్ పీటర్సన్ ఆచితూచి ఆడుతూనే వీలు చిక్కినప్పుడల్లా బంతిని బౌండరీకి తరలిస్తున్నాడు. 88 బంతులు ఎదుర్కొన్న అతడు 6 ఫోర్ల సాయంతో 33 పరుగులు పూర్తి చేసుకున్నాడు. పీటర్సన్‌తో డసెన్ 13 పరుగులతో క్రీజులో ఉన్నాడు. ప్రస్తుత స్కోరు: 91/3 (32). భారత బౌలర్లలో బుమ్రాకు రెండు, ఉమేశ్ యాదవ్‌కు ఒక వికెట్ దక్కాయి. ►3: 07 PM: దక్షిణాఫ్రికా ప్రస్తుత స్కోరు: 54/3 (21.4) . భారత్ కంటే 167 పరుగులు వెనకబడి ఉంది. ►3: 00 PM: మూడో వికెట్ కోల్పోయిన దక్షిణాఫ్రికా. కేశవ్ మహరాజ్‌ను ఉమేశ్ యాదవ్ బౌల్డ్ చేశాడు. డసెన్, పీటర్సన్ క్రీజులో ఉన్నారు. ►2: 05 PM: దక్షిణాఫ్రికా రెండో వికెట్ కోల్పోయింది. రెండో రోజు ఆట ఆరంభమైన కాసేపటికే బుమ్రా అద్భుత బంతితో మార్కరమ్‌ను బౌల్డ్ చేశాడు. కీగన్ పీటర్సన్ క్రీజులోకి వచ్చాడు. 2: 00 PM: దక్షిణాఫ్రికా- టీమిండియా మధ్య కేప్‌టౌన్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టు రెండో రోజు ఆట ఆరంభమైంది. దక్షిణాఫ్రికా- టీమిండియా మధ్య కేప్‌టౌన్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టు రెండో రోజు ఆట ఆరంభమైంది. మార్క్రమ్ (8 బ్యాటింగ్), కేశవ్ మహరాజ్ (6 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నారు. ప్రొటిస్ బ్యాటర్లు ఎయిడెన్ మార్కరమ్ 8, కేశవ్ మహరాజ్ 6 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇక తొలి రోజు ఆట ముగిసే సరికి దక్షిణాఫ్రికా ఒక వికెట్ నష్టానికి 17 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. కెప్టెన్ డీన్ ఎల్గర్ (3)ను బుమ్రా బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. అంతకుముందు టీమిండియా 223 పరుగులకు ఆలౌట్ అయింది. ►తుది జట్లు: భారత్: కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, ఛతేశ్వర్ పుజారా, అజింక్య రహానే, విరాట్ కోహ్లి(కెప్టెన్), రిషభ్ పంత్(వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, ఉమేశ్ యాదవ్ సౌతాఫ్రికా: డీన్ ఎల్గర్(కెప్టెన్), ఎయిడెన్ మార్కరమ్, కీగన్ పీటర్సన్, రసే వాన్ డెర్ డసెన్, తెంబా బవుమా, కైలీ వెరెనె(వికెట్ కీపర్), మార్కో జాన్సెన్, కగిసో రబడ, కేశవ్ మహరాజ్, డువానే ఒలివర్, లుంగి ఎంగిడి. చదవండి: SA vs IND: జస్ప్రీత్ బుమ్రా 142.3 స్పీడ్.. పాపం ప్రొటిస్ కెప్టెన్.. వీడియో వైరల్! Kagiso Rabada well and truly enjoyed his 50th Test cap for the #Proteas🤩 Day one full highlights: https://t.co/IfnLVkYlH0#SAvIND #FreedomTestSeries #BePartOfIt | @Betway_India pic.twitter.com/G2t8387kyj — Cricket South Africa (@OfficialCSA) January 12, 2022 -
జస్ప్రీత్ బుమ్రా 142.3 స్పీడ్.. పాపం ప్రొటిస్ కెప్టెన్.. వీడియో వైరల్!
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 223 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే. ఇక తొలి ఇన్నింగ్స్‌ను ఆరంభించిన ప్రొటీస్ జట్టు.. కెప్టెన్ డీన్ ఎల్గర్ వికెట్‌ను ఆదిలోనే కోల్పోయింది. ఓ అద్భుతమైన డెలివరీతో బుమ్రా.. ఎల్గర్‌ని పెవిలియన్‌కు పంపాడు. ఇన్నింగ్స్ ఐదో ఓవర్లో బుమ్రా వేసిన లెంగ్త్ డెలివరీకి ఎల్గర్ అడ్డంగా దొరికిపోయాడు. బుమ్రా వేసిన లెంగ్త్ డెలివరీను ఎల్గర్ ఢిపెన్స్ ఆడటానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో బంతి ఎడ్జ్ తీసుకుని స్లిప్‌లో ఉన్న పుజారా చేతికి వెళ్లింది. దీంతో పూర్తి నిరాశతో ఎల్గర్ వెనుదిరిగాడు. అంతకముందు కెప్టెన్ కోహ్లి(79) ఓంటరి పోరాటం చేయడంతో 223 పరుగుల గౌరవప్రదమైన స్కోర్‌ను భారత్ చేయగల్గింది. సఫారీ బౌలర్లలో రబాడ 4, మార్కో జన్సెన్ 3, ఒలీవియర్, ఎంగిడి, కేశవ్ మహారాజ్ తలో వికెట్ సాధించారు. ఇక తొలి రోజు ఆటముగిసే సమయానికి వికెట్ నష్టానికి దక్షిణాఫ్రికా 17 పరుగులు చేసింది. క్రీజ్‌లో మార్క్రమ్(8), కేశవ్ మహారాజ్(6) ఉన్నారు. pic.twitter.com/mpeykpNAuU — Sunaina Gosh (@Sunainagosh7) January 11, 2022 చదవండి: SA vs IND: కోహ్లి షాడో బ్యాటింగ్ ప్రాక్టీస్.. వెంటనే మయాంక్ ఔటయ్యాడు.. వీడియో వైరల్ -
Ind Vs Sa 3rd Test: నేటి నుంచి భారత్, సౌతాఫ్రికా మూడో టెస్ట్
-
Ind Vs Sa 3rd Test: టెస్టు మ్యాచ్‌కు సరిగ్గా సరిపోయే పిచ్.. టాస్ గెలిస్తే..
Ind Vs Sa Test Series 2021-22: దక్షిణాఫ్రికా గడ్డపై ఏడు పర్యటనల్లో ఒక్కసారి కూడా టెస్టు సిరీస్ గెలవలేకపోయిన భారత జట్టు ఈ సారి సిరీస్ విజయమే లక్ష్యంగా అక్కడ అడుగుపెట్టింది. సెంచూరియన్ విక్టరీతో దానికి బాటలు వేసుకున్నా... జొహన్నెస్‌బర్గ్‌లో ఆతిథ్య జట్టు పోరాటంతో లెక్క సమమైంది. ఇప్పుడు మరో అవకాశం మన ముంగిట నిలిచింది. గత మ్యాచ్‌లో ఓడినా ఇప్పటికీ ప్రత్యర్థితో పోలిస్తే టీమిండియా పటిష్టంగా కనిపిస్తోంది. అయితే, సొంత మైదానంలో సిరీస్ చేజార్చుకోరాదనే పట్టుదల, గత మ్యాచ్ విజయం ఇచ్చిన స్ఫూర్తి సఫారీ టీమ్‌లో కూడా ఉత్సాహం పెంచాయి. న్యూలాండ్స్ మైదానంలో భారత్ గతంలో ఎన్నడూ గెలవకపోయినా...కొత్త చరిత్ర సృష్టించడం ఈ జట్టుకు కొత్త కాదు. ఇక పిచ్, వాతావరణం కేప్‌టౌన్‌లోని న్యూలాండ్స్ మైదానంలో దక్షిణాఫ్రికా- టీమిండియా మధ్య మూడో టెస్టు జరుగనుంది. ఒక టెస్టు మ్యాచ్‌కు సరిగ్గా సరిపోయే పిచ్ అని విశ్లేషకుల అంచనా. ఆరంభంలో పేసర్లు ప్రభావం చూపించడంతో పాటు బౌన్స్ కారణంగా బ్యాట్స్‌మెన్ కూడా బాగా పరుగులు సాధించే అవకాశం ఉంది. మ్యాచ్ సాగుతున్న కొద్దీ పొడిబారి స్పిన్నర్లకు అనుకూలిస్తుంది. టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ ఎంచుకోవడం ఖాయం. మంచి వాతావరణం, వర్షం సూచన లేదు. టీమిండియా రికార్డు న్యూలాండ్స్ మైదానంలో భారత్ 5 టెస్టులు ఆడింది. 3 మ్యాచ్‌లలో ఓడి 2 ‘డ్రా’గా ముగించింది. భారత తుది జట్టు అంచనా: కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, ఛతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి(కెప్టెన్), అజింక్య రహానే, రిషభ్ పంత్(వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, ఉమేశ్ యాదవ్. చదవండి: IPL 2022: కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్! 🔊 🔊 🔛 Practice 🔛 𝐈𝐧 𝐭𝐡𝐞 𝐳𝐨𝐧𝐞 - 𝐂𝐚𝐩𝐭𝐚𝐢𝐧 𝐊𝐨𝐡𝐥𝐢.👌 👌#TeamIndia | #SAvIND | @imVkohli pic.twitter.com/ChFOPzTT6q — BCCI (@BCCI) January 10, 2022 -
Ind Vs Sa: మాకు అశ్విన్ ఉన్నాడు.. జడేజాను మిస్సవడం లేదు: కోహ్లి
Virat Kohli Comments Ahead 3rd Test Against South Africa: సఫారీ గడ్డపై చరిత్ర సృష్టించాలన్న టీమిండియా సుదీర్ఘ నిరీక్షణకు తెరపడాలంటే కోహ్లి ఆఖరి టెస్టులో కచ్చితంగా గెలిచి తీరాల్సిందే. కేప్‌టౌన్‌లో జరిగే ఆఖరి టెస్టులో దక్షిణాఫ్రికాను ఓడిస్తేనే టెస్టు సిరీస్ విజయం సొంతమవుతుంది. అయితే, అక్కడి పిచ్ తమకే అనుకూలిస్తుందంటూ ప్రొటిస్ జట్టు కెప్టెన్ డీన్ ఎల్గర్ ఇప్పటికే భారత బ్యాటర్లకు హెచ్చరికలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ‘పేస్’ మా డియరెస్ట్ ఫ్రెండ్ అని వ్యాఖ్యానించాడు. ఈ నేపథ్యంలో సోమవారం మీడియాతో ముచ్చటించిన టీమిండియా సారథి విరాట్ కోహ్లి తమకు అత్యుత్తమ పేసర్లు ఉన్నారంటూ కౌంటర్ ఇచ్చాడు. ‘‘నేను పగ్గాలు చేపట్టినపుడు టెస్టు ర్యాంకింగ్స్‌లో ఏడో స్థానంలో ఉన్నాం. గత నాలుగేళ్లలో నెంబర్ వన్ జట్టుగా ఎదిగాం. విజయాలకు నేను బాట వేశాను. ప్రతిరోజూ సరికొత్త వ్యూహాలతో.. ప్రతి మ్యాచ్‌కు వేర్వేరు ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నాం. మాకు మంచి పేస్ బౌలర్లు ఉన్నారు. ఎవరిని ఆడించాలన్న విషయమే మాకొక తలనొప్పి. నిజంగా ఇది మాకు గర్వకారణమనే చెప్పాలి. టెస్టుల్లో మా పేసర్ల ప్రదర్శన గురించి ఎంత చెప్పినా తక్కువే’’ అని కోహ్లి వ్యాఖ్యానించాడు. కాగా జనవరి 11 నుంచి టీమిండియా- దక్షిణాఫ్రికా మధ్య నిర్ణయాత్మక ఆఖరి టెస్టు జరుగనుంది. దక్షిణాఫ్రికాతో మూడో టెస్టు: కోహ్లి ప్రెస్ మీట్ హైలెట్స్: ►మహ్మద్ సిరాజ్ ఇంకా గాయం నుంచి కోలుకోలేదు. అతడి స్థానాన్ని ఎవరితో భర్తీ చేయాలన్న అంశం గురించి చర్చిస్తున్నాం. ►మాకు అశ్విన్ ఉన్నాడు కదా. జడేజాను అస్సలు మిస్సవడం లేదు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా అశ్విన్ అద్భుతంగా రాణించగలడు. ►మిడిలార్డర్లో వైఫల్యం నిజమే. జట్టులో మార్పులు చేయాల్సిందే. కానీ బలవంతంగా ఎవరినీ తప్పించకూడదు. పుజారా, రహానే రెండో టెస్టులో ఆడిన ఇన్నింగ్స్ వెలకట్టలేనిది. గతంలో కూడా ఎన్నోసార్లు విజయాల్లో కీలక పాత్ర పోషించారు. ఆస్ట్రేలియాలో అద్భుతంగా ఆడారు. ►నా ఫామ్ గురించి ఆందోళన చెందాల్సిన పనిలేదు. విమర్శలను నేను పట్టించుకోను. కొత్తగా నేను నిరూపించుకోవాల్సింది ఏమీలేదు. నేను పూర్తి ఫిట్‌గా ఉన్నాను. మూడో టెస్టుకు అందుబాటులో ఉంటాను. ►ప్రతిఒక్కరు తప్పులు చేస్తారు. పంత్ కూడా అంతే. అయితే, తన తప్పులను సరిదిద్దుకుని పంత్ మెరుగ్గా రాణించగలడు. చదవండి: Ind Vs Sa 3rd Test: టీమిండియాకు ప్రొటిస్ కెప్టెన్ హెచ్చరికలు..మాతోనే ‘ఆట’లా..! Virat Kohli: రాహుల్ కెప్టెన్సీపై కోహ్లి వ్యాఖ్యలు... నేను కొత్తగా నిరూపించుకోవాల్సింది ఏమీలేదు! -
Ind Vs Sa: టీమిండియా మాతోనే ‘ఆట’లా.. అంత ఈజీ కాదు!
Ind Vs Sa Test Series 2021-22: సఫారీ గడ్డపై టెస్టు సిరీస్ గెలిచి చరిత్ర సృష్టించాలని టీమిండియా భావిస్తుంటే... భారత్‌పై స్వదేశంలో తమ జైత్రయాత్రకు సంబంధించిన రికార్డును కొనసాగించాలని ప్రొటిస్ జట్టు పట్టుదలగా ఉంది. ఈ క్రమంలో కేప్‌టౌన్ వేదికగా జనవరి 11 నుంచి ప్రారంభం కానున్న మూడో టెస్టు ఇరు జట్లకు కీలకంగా మారింది. ఇప్పటికే 1-1తో సమంగా ఉన్న సిరీస్‌లో చావో రేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి మూడో టెస్టుకు అందుబాటులోకి రావడం ఖాయంగా కనిపిస్తుండగా... భారత్‌కు లక్కీ గ్రౌండ్‌గా భావించిన వాండరర్స్‌లో విజయంతో దక్షిణాఫ్రికా సారథి డీన్ ఎల్గర్ రెట్టించిన ఉత్సాహంతో కేప్‌టౌన్‌లో ‘వార్’కు సిద్ధమవుతున్నాడు. కాగా జొహన్నస్‌బర్గ్ వేదికగా సాగిన రెండో టెస్టులో డీన్ ఎల్గర్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో జట్టును గెలిపించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. అంతేగాక ప్రొటిస్ బౌలర్లు కూడా ఫుల్ ఫామ్‌లోకి వచ్చారు. ఈ క్రమంలో మూడో టెస్టుకు ముందు ఎల్గర్ మాట్లాడుతూ... ‘‘మూడో టెస్టు మాకు అత్యంత ముఖ్యమైనది. జొహన్నస్‌బర్గ్‌లో ఆడినట్లుగానే.. కేప్‌టౌన్‌లోనూ ఆడినట్లయితే కచ్చితంగా విజయం మాదే. నిజానికి కేప్‌టౌన్‌లో ‘పేస్’ మా డియరెస్ట్ ఫ్రెండ్’’ అని పిచ్ ఎలా ఉండబోతోందన్న అంశం గురించి హింట్ ఇచ్చాడు. హోరాహోరీ తప్పదని, తమ బౌలర్లను ఎదుర్కోవడం అంత తేలికకాదని పరోక్షంగా టీమిండియా బ్యాటర్లకు హెచ్చరికలు జారీ చేశాడు. చదవండి: IPL- 2022: ఐపీఎల్‌పై బీసీసీఐ కీలక ప్రకటన! It’s not about how many times you get knocked down, but how many times you get back up💪 Catch the full highlights right here ➡️ https://t.co/jVZ2TXmdRr#SAvIND #FreedomTestSeries #BetwayTestSeries #BePartOfIt pic.twitter.com/E5IbV3vhhw — Cricket South Africa (@OfficialCSA) January 7, 2022 -
Ind Vs Sa: నువ్వు తోపు అనుకోకు.. అలా చేశావో నిన్ను మించినోడు లేడని చెప్పాను.. అంతే
Dean Elgar Comments: కగిసో రబడ... ప్రొటిస్ జట్టులో ప్రధాన బౌలర్.. జొహన్నస్‌బర్గ్ టెస్టులో టీమిండియాపై దక్షిణాఫ్రికా విజయంలో కీలక పాత్ర పోషించాడు. ముఖ్యంగా రెండో ఇన్నింగ్స్‌లో అద్భుతంగా రాణించాడు. ఫామ్‌లోకి వచ్చి నిలకడగా బ్యాటింగ్ చేస్తూ... అర్ధ సెంచరీలు పూర్తి చేసుకున్న భారత బ్యాటర్లు అజింక్య రహానే, ఛతేశ్వర్ పుజారాను రబడ అవుట్ చేశాడు. 100కు పైగా పరుగుల భాగస్వామ్యాలు నమోదు చేసిన ఈ జంటను, ఆ తర్వాత రిషభ్ పంత్‌ను పెవిలియన్‌కు పంపి భారత జట్టును కోలుకోలేని దెబ్బ కొట్టాడు. ఈ మ్యాచ్‌లో మొత్తంగా 6 వికెట్లు తన ఖాతాలో వేసుకుని సత్తా చాటాడు. బౌలర్ల అద్భుత ప్రదర్శనకు తోడు కెప్టెన్ డీన్ ఎల్గర్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకోవడంతో జొహన్నస్‌బర్గ్ టెస్టులో విజయం దక్షిణాఫ్రికా సొంతమైంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం ఎల్గర్ మాట్లాడుతూ.. తనకు, రబడకు మధ్య మ్యాచ్‌కు ముందు జరిగిన సంభాషణ గురించి ప్రస్తావించాడు. డీన్ ఎల్గర్(PC: CSA) ‘‘కేజీ దగ్గరకు వెళ్లి అతడితో మాట్లాడాను. మన గ్రూపులో నీ పట్ల అందరికీ గౌరవం, అభిమానం ఉంది. నువ్వు నీ గురించి ఎక్కువగా ఊహించుకుంటున్నావని నేను అనుకోను. బాగా బౌలింగ్ చేస్తున్నావనే అతి విశ్వాసంతో ఉంటావని భావించను. నీ శక్తి సామర్థ్యాలు నాకు తెలుసు. ఎప్పుడైతే కేజీ తన ప్రతిభకు తగ్గట్లు రాణిస్తాడో... అప్పుడు తనను మించినోడు ఉండడు’’ అని చెప్పాను. తనపై ఈ మాటలు ప్రభావం చూపాయి. బాగా ఆలోచించి ఉంటాడు. మరుసటి రోజు పక్కా ప్రణాళికతో వచ్చి ప్రత్యర్థి జట్టుకు చుక్కలు చూపించాడు’’ అని ఎల్గర్ చెప్పుకొచ్చాడు. ఒక్కోసారి రబడ రిలాక్స్ అవుతాడు.. అలాంటి సమయంలో తనను మోటివేట్ చేయాల్సి ఉంటుందని సరాదాగా వ్యాఖ్యానించాడు. నిన్ను నువ్వు తోపు అనుకోకు అంటూ తన మాటలతో రబడలో కసి పెరిగేలా చేసిట్లు పరోక్షంగా వెల్లడించాడు. కాగా రెండో టెస్టులో విజయంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-1తో టీమిండియాతో సమానంగా నిలిచింది ప్రొటిస్. దీంతో జనవరి 11 నుంచి ఆరంభమయ్యే మూడో టెస్టు ఇరు జట్లకు కీలకంగా మారింది. చదవండి: టీమిండియాకు భారీ షాక్.. మూడో టెస్ట్‌కు స్టార్ బౌలర్ దూరం! Kagiso Rabada produced a fiery spell to remove both set batsmen early on Day 3 🔥 Watch the full highlights here 📲 https://t.co/QyWr8FjPcu#SAvIND #FreedomTestSeries #BePartOfIt pic.twitter.com/aWg74V5LLQ — Cricket South Africa (@OfficialCSA) January 6, 2022 -
ఎల్గర్ మళ్లీ ఆ తప్పు చేయలేదు.. టీమిండియాకు చేజారిపోయింది!
Ind Vs Sa 2nd Test 2022: మూడేళ్ల క్రితం... భారత్‌తో ఇదే మైదానంలో చివరి టెస్టు. 241 పరుగుల లక్ష్య ఛేదనలో దక్షిణాఫ్రికా స్కోరు ఒక దశలో 124/1...అయితే 177 పరుగులకే కుప్పకూలిన సఫారీ టీమ్ చివరకు 63 పరుగులతో ఓడింది... నాడు డీన్ ఎల్గర్ 86 పరుగులతో అజేయంగా నిలిచినా జట్టును గెలిపించలేకపోయాడు. ఈ సారి అదే వాండరర్స్‌లో దాదాపు అదే లక్ష్యాన్ని అందుకునే క్రమంలో ఎల్గర్ మళ్లీ ఆ తప్పు చేయలేదు. నాటి ఇన్నింగ్స్‌ను కొనసాగింపుగానా అన్నట్లు కెప్టెన్ హోదాలో ఎల్గర్ కఠినమైన పిచ్‌పై మరింత పట్టుదలగా నిలబడ్డాడు. సహచర బ్యాటర్లు అండగా నిలవడంతో 96 పరుగుల అజేయ ఇన్నింగ్స్‌తో తన జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు. భారత బౌలర్లు ఆశించిన స్థాయిలో రెండో ఇన్నింగ్స్‌లో ప్రభావం చూపలేదని అనిపిస్తున్నా... మొత్తంగా చూస్తే జట్టు బ్యాటింగ్ వైఫల్యమే ఈ పరాజయానికి కారణమనేది వాస్తవం. జొహన్నెస్‌బర్గ్: భారత్, దక్షిణాఫ్రికా మధ్య టెస్టు సిరీస్ తుది ఫలితం మూడో టెస్టుకు చేరింది. గురువారం ముగిసిన రెండో టెస్టులో దక్షిణాఫ్రికా 7 వికెట్ల తేడాతో భారత్‌పై ఘన విజయం సాధించి సిరీస్‌ను 1–1తో సమం చేసింది. వాండరర్స్ మైదానంలో టీమిండియాకు ఇదే తొలి ఓటమి. 240 పరుగుల లక్ష్యఛేదనలో విజయం కోసం మరో 122 పరుగులు చేయాల్సిన స్థితిలో నాలుగో రోజు ఆట కొనసాగించిన దక్షిణాఫ్రికా 3 వికెట్ల నష్టానికి 243 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ డీన్ ఎల్గర్ (188 బంతుల్లో 96 నాటౌట్; 10 ఫోర్లు) అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన కనబర్చగా...వాన్ డర్ డసెన్ (40), తెంబా బవుమా (23 నాటౌట్) అండగా నిలిచారు. మూడో టెస్టు ఈ నెల 11నుంచి కేప్‌టౌన్‌లో జరుగుతుంది. వర్షం ఆలస్యం చేసినా... ఓవర్‌నైట్ స్కోరు 118/2తో మైదానంలోకి దిగేందుకు దక్షిణాఫ్రికా సిద్ధం కాగా, వాన ఆ అవకాశం ఇవ్వలేదు. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో ముందు తొలి సెషన్ రద్దు కాగా, ఆపై లంచ్ తర్వాతి సెషన్లో ఆటకు అవకాశం లేకుండా పోయింది. ఆపై వర్షం తగ్గాక మైదానం సిద్ధమైంది. పిచ్‌ను పరిశీంచిన అంపైర్లు కనీసం 34 ఓవర్ల ఆట జరిగే అవకాశం ఉందని తేల్చారు. చివరకు దక్షిణాఫ్రికా 27.4 ఓవర్లలోనే మ్యాచ్‌ను గెలుచుకుంది. ఎల్గర్, వాన్ డర్ డసెన్ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో స్వేచ్ఛగా బ్యాటింగ్ చేశారు. మన బౌలర్లు అప్పుడప్పుడు అద్భుతమైన బంతులు వేసినా... పట్టుదలగా నిలిచిన సఫారీ బ్యాటర్లు వాటికి లొంగలేదు. ఎల్గర్, డసెన్ మూడో వికెట్‌కు 82 పరుగులు జోడించి విజయానికి బాటలు వేశారు. ఎట్టకేలకు డసెన్‌ను అవుట్ చేసి షమీ కాస్త ఆశలు రేపాడు. అయితే తర్వాత వచ్చిన బవుమా కూడా తగ్గలేదు. ‘సున్నా’ వద్ద తన బౌలింగ్‌లోనే శార్దుల్ క్యాచ్ వదిలేయడంతో బతికిపోయిన బవుమా తర్వాత ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. అశ్విన్ బౌలింగ్‌లో లెగ్‌సైడ్ దిశగా ఆడి ఎల్గర్ బౌండరీ కొట్టడంతో దక్షిణాఫ్రికా గెలుపు పూర్తయింది. స్కోరు వివరాలు: భారత్ తొలి ఇన్నింగ్స్ 202; దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ 229; భారత్ రెండో ఇన్నింగ్స్ 266; దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్: మార్క్రమ్ (ఎల్బీ) (బి) శార్దుల్ 31; ఎల్గర్ (నాటౌట్) 96; కీగన్ పీటర్సన్ (ఎల్బీ) (బి) అశ్విన్ 28; వాన్ డర్ డసెన్ (సి) పుజారా (బి) షమీ 40; బవుమా (నాటౌట్) 23; ఎక్స్‌ట్రాలు 25; మొత్తం (67.4 ఓవర్లలో 3 వికెట్లకు) 243. వికెట్ల పతనం: 1–47, 2–93, 3–175. బౌలింగ్: బుమ్రా 17–2– 70–0, షమీ 17–3–55–1, శార్దుల్ 16–2–47–1, సిరాజ్ 6–0–37–0, అశ్విన్ 11.4–2–26–1. -
జబర్దస్త్ కెప్టెన్ ఎల్గర్.. కేవలం తన గురించే: పంత్ కామెంట్స్ వైరల్
సఫారీ గడ్డ మీద టెస్టు సిరీస్ విజయం సాధించాలనే తపనతో టీమిండియా.. సెంచూరియన్ పరాభవానికి బదులు తీర్చుకోవాలనే కసితో దక్షిణాఫ్రికా.. వెరసి వాండరర్స్ వేదికగా మొదలైన రెండో టెస్టు పోటాపోటీగా సాగుతోంది. అదే స్థాయిలో మైదానంలో ఆటగాళ్ల మధ్య వాగ్వాదాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రొటిస్ ఆటగాడు డసెన్, భారత తాత్కాలిక కెప్టెన్ కేఎల్ రాహుల్ అవుటైన తీరుపై పెద్ద రాద్దాంతమే జరిగిన సంగతి తెలిసిందే. ఇక మూడో రోజు ఆటలో భాగంగా బుమ్రాకు.. దక్షిణాఫ్రికా బౌలర్ మార్కో జాన్సెన్కు మధ్య మాటల యుద్ధం నడించింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్‌కు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో భాగంగా 28వ ఓవర్లో అశ్విన్ వేసిన బంతికి ప్రొటిస్ బ్యాటర్ కీగన్ పీటర్సన్ ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. దీంతో అశూతో పాటు పంత్ బిగ్గరగా అప్పీలు చేయగా.. అంపైర్ అవుట్ ఇచ్చాడు. అయితే, డీఆర్ఎస్కు వెళ్లాలా లేదా అన్న అంశంపై మరో ఎండ్‌లో ఉన్న ప్రొటిస్ కెప్టెన్ డీన్ ఎల్గర్ తర్జనభర్జన పడ్డాడు. రివ్యూకు వెళ్లాలా వద్దా అన్న అంశం గురించి పీటర్సన్‌తో చర్చించాడు. ఇంతలోనే డీఆర్ఎస్ మీటర్ టైమ్ అయిపోయింది. ఈ నేపథ్యంలో పంత్ ఎల్గర్‌ను తన మాటలతో కవ్వించాడు. ‘‘జబర్దస్త్ కెప్టెన్.. కేవలం తన గురించి మాత్రమే ఆలోచిస్తాడు’’ అంటూ కామెంట్ చేయగా.. ఆ వీడియో వైరల్ అవుతోంది. ఇక ఆట విషయానికొస్తే ఇంకో ఎనిమిది వికెట్లు పడగొడితే విజయం భారత్‌ను వరిస్తుంది.. అదే 122 పరుగులు చేస్తే గెలుపు ప్రొటిస్ జట్టు సొంతమవుతుంది. కాగా నాలుగో రోజు ఆటకు వర్షం కారణంగా ఆటంకం ఏర్పడింది. చదవండి: Ashes: రెండేళ్ల తర్వాత రీ ఎంట్రీ... సెంచరీతో సత్తా చాటాడు.. భావోద్వేగం.. వైరల్ I loved the way rishab pant said this during the match when petersen got out😅😂🤣😂😂😂🤣😂😂 pic.twitter.com/vqeEIlT3xG — Charan Donekal (@CDonekal) January 5, 2022 -
Ind Vs Sa 2nd Test: వరుణుడు కూడా కాపాడలేకపోయాడు.. రెండో టెస్ట్‌లో టీమిండియా ఓటమి
Ind Vs Sa 2nd Test Day 4 Updates: వరుణుడు కూడా కాపాడలేకపోయాడు.. రెండో టెస్ట్‌లో టీమిండియా ఓటమి 9: 23 PM: చేతిలో 8 వికెట్లు, 122 పరుగుల లక్ష్యంతో నాలుగో రోజు బరిలోకి దిగిన దక్షిణాఫ్రికాకు వరుణుడు స్వాగతం పలికాడు. దీంతో తొలి రెండు సెషన్ల ఆట పూర్తిగా రద్దైంది. మూడో సెషన్ సమయానికి వర్షం ఆగిపోవడంతో ఆట ప్రారంభమైంది. సెషన్ ఆరంభంలోనే డెస్సన్(40) వికెట్ తీసిన షమీ టీమిండియా శిబిరంలో ఆశలు రెకెత్తించాడు. అయితే, కెప్టెన్ డీన్ ఎల్గర్(96), బవుమా(23) సహకారంతో దక్షిణాఫ్రికాకు అద్భుత విజయాన్ని అందించాడు. ఫలితంగా దక్షిణాఫ్రికా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మరోవైపు, ఎలాగైనా ఈ టెస్ట్‌లో గెలిచి సఫారీ గడ్డపై చరిత్ర సృష్టిద్దామనుకున్న టీమిండియా ఆశలు అడియాశలు అయ్యాయి. స్కోర్ వివరాలు: భారత్ తొలి ఇన్నింగ్స్: 202 ఆలౌట్ రెండో ఇన్నింగ్స్: 266 ఆలౌట్ దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్: 229 ఆలౌట్ రెండో ఇన్నింగ్స్: 243/3 మూడో వికెట్ కోల్పోయిన దక్షిణాఫ్రికా.. లక్ష్యానికి మరో 65 పరుగుల దూరంలో 8: 19 PM: 122 పరుగుల లక్ష్యంతో నాలుగో రోజు బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా.. మూడో సెషన్లో ఆఖర్లో మూడో వికెట్ కోల్పోయింది. షమీ బౌలింగ్‌లో పుజారాకు క్యాచ్ ఇచ్చి డస్సెన్(40) ఔటయ్యాడు. ఆతిధ్య జట్టు లక్ష్యానికి మరో 65 పరుగుల దూరంలో ఉంది. ప్రస్తుతం దక్షిణాఫ్రికా స్కోర్ 175/3. క్రీజ్‌లో ఎల్గర్(59), బవుమా ఉన్నారు. 7: 11 PM: వరుణుడు కరుణించడంతో నాలుగో రోజు ఆట ఎట్టకేలకు మొదలైంది. 122 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సఫారీ జట్టు.. బుమ్రా వేసిన తొలి ఓవర్లో 2 పరుగులు సాధించింది. ఈ మ్యాచ్ టీమిండియా గెలవాలంటే 8 వికెట్లు, సఫారీ జట్టు విజయం సాధించాలంటే మరో 120 పరుగులు సాధించాల్సి ఉంది. క్రీజ్‌లో ఎల్గర్(46), డస్సెన్(11) ఉన్నారు. 4: 22 PM: జొహన్నస్‌బర్గ్‌లో వాతావరణాన్ని గమనిస్తే ఈరోజు ఆట ఆరంభమయ్యే పరిస్థితి కనబడటం లేదు. వర్షం కురుస్తూనే ఉంది. దీంతో నాలుగో రోజు ఆట రద్దయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 3: 38 PM: వరణుడు కరుణించడం లేదు. వర్షం కారణంగా టీమిండియా- దక్షిణాఫ్రికా మొదలు కావాల్సిన నాలుగో రోజు ఆట ఆలస్యమవుతోంది. ఒక్క బంతి కూడా పడకుండానే జట్లు లంచ్ బ్రేక్‌కు వెళ్లాయి. 1: 30 PM: భారత్- దక్షిణాఫ్రికా రెండో టెస్ట్‌లో భాగంగా నాలుగో రోజు ఆటకు వరుణుడు ఆటంకం కలిగించాడు. చిరుజల్లులు పడుతుండటంతో మ్యాచ్ ఆలస్యం కానుంది. ఇక మూడో రోజు ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా 2 వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది. కెప్టెన్ డీన్ ఎల్గర్(46) డసెన్ (11) క్రీజ్‌లో ఉన్నారు. భారత్ ఈ మ్యాచ్‌లో గెలిచి సఫారీ గడ్డపై సిరీస్ విజయం సాధించాలంటే ఎనిమిది వికెట్లు పడగొట్టాల్సి ఉంది. వాండరర్స్ టెస్టు టీమిండియా తొలి ఇన్నింగ్స్: 202 ఆలౌట్ రెండో ఇన్నింగ్స్: 266 ఆలౌట్ దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్: 229 ఆలౌట్ తుది జట్లు: భారత్: కేఎల్ రాహుల్(కెప్టెన్), మయాంక్ అగర్వాల్, ఛతేశ్వర్ పుజారా, అజింక్య రహానే, హనుమ విహారి, రిషభ్ పంత్(వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ సౌతాఫ్రికా: డీన్ ఎల్గర్(కెప్టెన్), ఎయిడెన్ మార్కరమ్, కీగన్ పీటర్సన్, రసే వాన్ డెర్ డసెన్, తెంబా బవుమా, కైలీ వెరెనె(వికెట్ కీపర్), మార్కో జాన్సెన్, కగిసో రబడ, కేశవ్ మహరాజ్, డువానే ఒలివర్, లుంగి ఎంగిడి. చదవండి: IPL 2022: ఆర్సీబీ కెప్టెన్‌గా డేవిడ్ వార్నర్! -
Ind vs Sa: కేఎల్ రాహుల్ అవుటైన తీరుపై వివాదం... కెప్టెన్ల మధ్య వాగ్వాదం.. వైరల్!
KL Rahul Dean Elgar involved In Heated Exchange Day 2: దక్షిణాఫ్రికా- టీమిండియా మధ్య రెండో టెస్టు రెండో రోజు ఆటలో భాగంగా ఇరు జట్ల కెప్టెన్ల మధ్య స్వల్ప వివాదం చెలరేగింది. భారత తాత్కాలిక కెప్టెన్ కేఎల్ రాహుల్ మైదానాన్ని వీడుతున్న సమయంలో ప్రొటిస్ సారథి డీన్ ఎల్గర్‌తో వాగ్వాదానికి దిగినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అసలేం జరిగిందంటే... రెండో రోజు ఆటలో భాగంగా ఏడో ఓవర్లో మార్కో జాన్సెన్ వేసిన బంతిని షాట్ ఆడేందుకు రాహుల్ ప్రయత్నించాడు. కానీ.. అంచనా తప్పడంతో బ్యాట్ అంచును తాకిన బంతి ఎయిడెన్ మార్కరమ్(సెకండ్ స్లిప్) చేతుల్లో పడింది. దీంతో ఆతిథ్య జట్టు ఆటగాళ్లు సంబరాలు చేసుకున్నారు. అయితే, మార్కరమ్ క్యాచ్ అందుకునే ముందు బంతి నేలను తాకిందని భావించిన రాహుల్ మైదానాన్ని వీడేందుకు ఇష్టపడలేదు. దీంతో అంపైర్లు మరోసారి చెక్ చేశారు. రివ్యూలో భాగంగా థర్డ్ ఎంపైర్ 2-డీ కెమెరాలో పరిశీలించగా ముందు నుంచి చూసినపుడు బంతి కింద మార్కరమ్ వేళ్లు ఉన్నట్లు కనిపించింది. దీంతో నిరాశ చెందిన రాహుల్.. సీరియస్‌గా మైదానం నుంచి నిష్క్రమించాడు. ఆ సమయంలోనే ఎల్గర్‌తో చిన్నపాటి గొడవ జరిగినట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న దృశ్యాల ద్వారా తెలుస్తోంది. మరో విషయం ఏమిటంటే... రెండో రోజు ఆటలో భాగంగానే శార్దూల్ వేసిన బంతికి ప్రొటిస్ ఆటగాడు డసెన్ అవుటైన తీరుపై ఇదే తరహాలో వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. చదవండి: Rassie van der Dussen Dismissal: శార్దూల్ బౌలింగ్‌లో ప్రొటిస్ ఆటగాడు అవుట్.. వివాదం! జరిగింది ఇదీ! శార్దుల్ ఠాకూర్ బౌలింగ్‌లో డసెన్ బ్యాట్‌కు తగిలిన బంతిని కీపర్ రిషభ్ పంత్ అందు కొని అప్పీల్ చేశాడు. అంపైర్ ఎరాస్మస్ అవుట్‌గా ప్రకటించడంతో డసెన్ నిష్క్రమించాడు. ముుందునుంచి రీప్లే చూస్తే పంత్ క్యాచ్ అందుకునే ముందు బంతి నేలకు తాకినట్లుగా కనిపిస్తుండగా... భిన్నమైన కోణాల్లో రీప్లేలు చూసినప్పుడు మాత్రం దీనిపై స్పష్టత రాలేదు. క్యాచ్ పట్టగానే బ్యాటర్ నడిచిపోగా ... ఇటు ఫీల్డ్ అంపైర్ అవుట్‌గా ప్రకటించేశాడు. విరామ సమయంలో దీనిపై తీవ్ర చర్చ జరిగింది. కెప్టెన్ ఎల్గర్, మేనేజర్ మసుబెలెలె మ్యాచ్ రిఫరీ వద్దకు వెళ్లి మాట్లాడారు. డసెన్‌ను వెనక్కి పిలిపించే అంశంపై మాట్లాడారా లేదా అనేది తెలియకున్నా, నిబంధనల ప్రకారమైతే అది సాధ్యమయ్యేది కాదు. చదవండి: WTC 2021-23 Points Table: టాప్-5లోకి బంగ్లాదేశ్... టీమిండియా ఎన్నో స్థానంలో ఉందంటే! pic.twitter.com/KOpRoFaH8r — Maqbool (@im_maqbool) January 5, 2022 -
Ind Vs Sa: మూడో రోజు ముగిసిన ఆట..
Ind Vs Sa 2nd Wanderers Test: Day 3 Updates మూడో రోజు ముగిసిన ఆట.. లక్ష్యం దిశగా సాగుతున్న దక్షిణాఫ్రికా 240 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా.. మూడో రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసి లక్ష్యం దిశగా సాగుతుంది. కెప్టెన్ డీన్ ఎల్గర్(46 నాటౌట్) బాధ్యతాయుతంగా ఆడుతూ జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. అతనికి తోడుగా వాన్ డర్ డస్సెన్(11) క్రీజ్‌లో ఉన్నాడు. రేపటి ఆటలో సఫారీ జట్టు మరో 122 పరుగులు చేస్తే మ్యాచ్ గెలవడంతో పాటు సిరీస్ ఆశలను కూడా సజీవంగా ఉంచుకోగలుగుతుంది. మరోవైపు టీమిండియాకు సైతం చరిత్ర సృష్టించేందుకు అవకాశాలు లేకపోలేదు. నాలుగో రోజు భారత బౌలర్లు మరో ఎనిమిది వికెట్లు పడగొడితే మ్యాచ్‌తో పాటు సిరీస్ కూడా వశమవుతుంది. రెండో వికెట్ కోల్పోయిన దక్షిణాఫ్రికా లక్ష్యం దిశగా సాగుతున్న దక్షిణాఫ్రికాకు టీమిండియా స్పిన్నర్ అశ్విన్ అడ్డుకట్ట వేశాడు. 93 పరుగుల వద్ద కీగన్ పీటర్సన్(28)ను ఎల్బీడబ్లూ చేయడంతో ఆ జట్టు రెండో వికెట్ కోల్పోయింది. ఈ క్రమంలో అశ్విన్ ఓ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. వాండరర్స్ మైదానంలో కుంబ్లే తర్వాత వికెట్ తీసిన తొలి స్పిన్నర్‌గా రికార్డుల్లోకెక్కాడు. 28 ఓవర్ల తర్వాత దక్షిణాఫ్రికా స్కోర్ 93/2. క్రీజ్‌లో ఎల్గర్(32), వాన్ డర్ డస్సెన్ ఉన్నారు. టార్గెట్ 240.. దక్షిణాఫ్రికా 66/1 7: 16 PM: 240 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సౌతాఫ్రికా.. మార్క్రమ్(31) వికెట్‌ను మాత్రమే కోల్పోయి నిలకడగా ఆడుతుంది. మార్క్రమ్ను శార్ధూల్ ఎల్బీడబ్ల్యూ చేశాడు. 17 ఓవర్ల తర్వాత దక్షిణాఫ్రికా స్కోర్ 66/1. క్రీజ్‌లో ఎల్గర్(21), కీగన్ పీటర్సన్(13) ఉన్నారు. దక్షిణాఫ్రికా టార్గెట్ 240 5: 30 PM: ఇన్నింగ్స్ ఆఖర్లో హనుమ విహారి(40 నాటౌట్) రాణించడంతో టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో 266 పరుగులకు ఆలౌటైంది. ఫలితంగా దక్షిణాఫ్రికాకు 240 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించగలిగింది. సఫారీ బౌలర్లలో జన్సెన్, రబాడ, ఎంగిడి తలో మూడు వికెట్లు పడగొట్టగా ఒలీవియర్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. అంతకుముందు టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 202 పరుగులు చేయగా.. దక్షిణాఫ్రికా 229 పరుగులకు ఆలౌటైంది. 218 పరుగుల ఆధిక్యంలో టీమిండియా.. తొమ్మిదో వికెట్ డౌన్ 5: 11 PM: 245 పరుగుల వద్ద టీమిండియా తొమ్మిదో వికెట్ కోల్పోయింది. ఎంగిడి బౌలింగ్‌లో బుమ్రా 7 పరుగులు చేసి జన్సెన్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. బుమ్రా ఔటైన అనంతరం టీమిండియా 218 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. ఎనిమిదో వికెట్ కోల్పోయిన టీమిండియా 4: 49 PM: జన్సెన్ టీమిండియాను మరో దెబ్బ కొట్టాడు. వరుస ఓవర్లలో వికెట్లు పడగొట్టి టీమిండియా భారీ స్కోర్ ఆశలకు గండి కొట్టాడు. వెర్రిన్ క్యాచ్ పట్టడంతో షమీ.. సున్నా పరుగులకే ఔటయ్యాడు. ఫలితంగా టీమిండియా 228 పరుగుల వద్ద ఎనిమిదో వికెట్ కోల్పోయింది. క్రీజ్‌లో విహారి (12), బుమ్రా ఉన్నారు. శార్ధూల్ ఔట్.. ఏడో వికెట్ కోల్పోయిన టీమిండియా 4: 38 PM: బౌలింగ్‌లో ఏడు వికెట్లు పడగొట్టి సఫారీలను గడగడలాడించిన శార్ధూల్ ఠాకూర్.. బ్యాటింగ్‌లోనూ రాణించాడు. కేవలం 24 బంతుల్లోనే 5 ఫోర్లు, సిక్స్ సాయంతో 28 పరుగులు స్కోర్ చేశాడు. అనంతరం జన్సెన్ బౌలింగ్‌లో కేశవ్ మహారాజ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఫలితంగా టీమిండియా 225 పరుగుల వద్ద ఏడో వికెట్ కోల్పోయింది. క్రీజ్‌లో విహారి(10), షమీ ఉన్నారు. 3: 27 PM: మూడో రోజు తొలి సెషన్ ఆరంభంలోనే మూడు కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన భారత్‌కు లంచ్‌కు ముందు మరో షాక్ తగిలింది. ఎంగిడి బౌలింగ్‌లో వెర్రిన్‌కు క్యాచ్ ఇచ్చి అశ్విన్(16) ఔటయ్యాడు. ఫలితంగా టీమిండియా 184 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయింది. లంచ్ విరామం సమయానికి టీమిండియా 161 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుండగా.. విహారి(6), శార్ధూల్ ఠాకూర్(4) క్రీజ్‌లో ఉన్నారు. 3: 07 PM: రిషభ్ పంత్ రూపంలో టీమిండియా ఐదో వికెట్ కోల్పోయింది. రబడ బౌలింగ్‌లో వెరెనెకు క్యాచ్ ఇచ్చి పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. 2: 50 PM: నాలుగో వికెట్ కోల్పోయిన టీమిండియా రబడ ఫుల్ జోష్‌లో ఉన్నాడు. వరుస విరామాల్లో వికెట్లు తీస్తూ టీమిండియాను దెబ్బకొట్టాడు. కాగా ఫామ్‌లోకి వచ్చి అర్ధ సెంచరీలు బాదిన భారత సీనియర్ ఆటగాళ్లు రహానే, పుజారాను పెవిలియన్‌కు పంపాడు. 02: 42 PM: అజింక్య రహానే రూపంలో భారత్ మూడో వికెట్ కోల్పోయింది. కగిసో రబడ బౌలింగ్‌లో వికెట్ కీపర్ వెరెనెకు క్యాచ్ ఇచ్చి రహానే 58 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు. హనుమ విహారి క్రీజులోకి వచ్చాడు. టీమిండియా స్కోరు: 155/3. ఆధిక్యం 128 పరుగులు. 2: 30 PM: అజింక్య రహానే కూడా అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. ప్రస్తుతం టీమిండియా స్కోరు: 149/2. కాగా పుజారా, రహానే కలిసి 100 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. ప్రస్తుతం 122 పరుగుల ఆధిక్యం. 2: 15 PM: తొలి ఇన్నింగ్స్‌లో విఫలమైన నయా వాల్ పుజారా రెండో ఇన్నింగ్స్‌లో అర్ధ సెంచరీతో మెరిశాడు. 62 బంతుల్లో 50 పరుగులు పూర్తి చేసుకున్నాడు. 2: 08 PM: టీమిండియా ప్రస్తుత స్కోరు: 134/2. అజింక్య రహానే(42), పుజారా(48) అర్ధ సెంచరీకి చేరువలో ఉన్నారు. భారత్ ప్రస్తుతం 107 పరుగుల ఆధిక్యంలో ఉంది. 1: 30 PM: టీమిండియా- దక్షిణాఫ్రికా మధ్య వాండరర్స్ వేదికగా రెండో టెస్టులో భాగంగా మూడో రోజు ఆట ఆరంభమైంది. 85/2 ఓవర్‌నైట్ స్కోరుతో భారత జట్టు ఆట మొదలుపెట్టింది. అజింక్య రహానే 11, ఛతేశ్వర్ పుజారా 35 పరుగులతో క్రీజులో ఉన్నారు. భారత్ ప్రస్తుతం 58 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఇక రెండో రోజు ఆట ముగిసే సమయానికి ప్రొటిస్ జట్టును 229 పరుగులకు టీమిండియా ఆలౌట్ చేసింది. తుది జట్లు: భారత్: కేఎల్ రాహుల్(కెప్టెన్), మయాంక్ అగర్వాల్, ఛతేశ్వర్ పుజారా, అజింక్య రహానే, హనుమ విహారి, రిషభ్ పంత్(వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ సౌతాఫ్రికా: డీన్ ఎల్గర్(కెప్టెన్), ఎయిడెన్ మార్కరమ్, కీగన్ పీటర్సన్, రసే వాన్ డెర్ డసెన్, తెంబా బవుమా, కైలీ వెరెనె(వికెట్ కీపర్), మార్కో జాన్సెన్, కగిసో రబడ, కేశవ్ మహరాజ్, డువానే ఒలివర్, లుంగి ఎంగిడి. చదవండి: KL Rahul Vs Dean Elgar: డసెన్ తరహాలోనే కేఎల్ రాహుల్ అవుటైన తీరుపై వివాదం.. కెప్టెన్ల మధ్య వాగ్వాదం.. వైరల్! -
Ind Vs Sa: పాపం బుమ్రా, షమీని ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యారు.. అస్సలు ఊహించలేదు కదా!
Ind Vs Sa 2nd Test: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో ‘లార్డ్’ శార్దూల్ ఠాకూర్ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. వరుస విరామాల్లో వికెట్లు కూల్చి ప్రొటిస్‌ను దెబ్బకొడుతున్నాడు. ఇప్పటికే మూడు కీలక వికెట్లు తన ఖాతాలో వేసుకున్న శార్దూల్ పదునైన బంతులతో సౌతాఫ్రికా బ్యాటర్లను బెంబేలెత్తిస్తున్నాడు. మ్యాచ్‌ను టీమిండియా వైపు తిప్పే దిశగా దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలో ఈ యువ ఆటగాడిపై సోషల్ మీడియా వేదికగా ప్రశంసల జల్లు కురుస్తోంది. ‘‘లార్డ్ శార్దూల్... టీమిండియా ఫెయిర్ ప్లేను నమ్ముతుంది. అందుకే లార్డ్ ఎప్పుడూ కొత్త బ్యాటర్లకు బౌల్ చేయడు. ప్రత్యర్థి జట్టు భారీ భాగస్వామ్యాలు నమోదు చేస్తున్న సమయంలో రంగంలోకి దిగుతాడు. వాళ్లను అవుట్ చేసేస్తాడు’’అంటూ టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్ శార్దూల్‌ను ఆకాశానికెత్తాడు. ఇక ఇర్ఫాన్ పఠాన్ సైతం... శార్దూల్ అద్భుతంగా బౌల్ చేస్తున్నాడంటూ ప్రశంసించాడు. ఇంకొంత మంది నెటిజన్లు... ‘‘పాపం దక్షిణాఫ్రికా బుమ్రా, షమీ, అశ్విన్ బౌలింగ్ ఎదుర్కునేందుకు ప్రణాళికలు రచించింది. కానీ లార్డ్ శార్దూల్ ఠాకూర్ రంగంలోకి దిగాడు. అవుటాఫ్ సిలబస్ కదా’’అంటూ ఫన్మీ మీమ్స్ షేర్ చేస్తున్నారు. ఇక అభిమానులైతే.. ‘‘తక్కువ అంచనాలు.. అత్యద్భుతంగా రాణింపు.. అదీ మరి శార్దూల్ అంటే! నిజమైన పేసు గుర్రం అతడు’’ అంటూ మురిసిపోతున్నారు. కాగా వాండరర్స్‌లో జరుగుతున్న రెండో టెస్టు రెండో రోజు ఆటలో భాగంగా కెప్టెన్ ఎల్గర్, పీటర్సన్, వాన్ డెర్ డసెన్ వికెట్లు తీసి లంచ్ బ్రేక్ సమయానికి ముందు శార్దూల్ ఈ టీమిండియా శిబిరంలో జోష్ నింపాడు. చదవండి: IPL 2022 Auction: ఐపీఎల్ మెగా వేలం వేదిక, తేదీలు మార్పు.. ఎందుకంటే! Lord Shardul and team India believe in fair play. That's why Lord never bowls to new batsmen, he's only brought on once there is a partnership and the batsmen are set. Lord still gets them out though 😄 #SAvIND — Wasim Jaffer (@WasimJaffer14) January 4, 2022 South Africa was prepared for Bumrah , Shami and Ashwin but at the End Lord Shardul Thakur came out of the syllabus #INDvsSA pic.twitter.com/3iqr1mpCYM — h-a-m-m-a-d (@iamhmmad1) January 4, 2022 There are only three things which are truly inevitable: 1) Death 2) Taxes 3) Lord Shardul Thakur @imShard #INDvsSA — Shikhar (He/Him) (@Shikhar__T) January 4, 2022 Shardul Thakur ... Dark HORSE 🐎 among INDIAN Pacers....least expectations but maximum returns#INDvsSA #SAvsIND — Cricket Commentary (@sfdepanc) January 4, 2022 -
Ind VS Sa 2nd Test: ముగిసిన రెండో రోజు ఆట.. 58 పరుగుల లీడ్‌లో టీమిండియా
Ind VS Sa 2nd Test Day 2 Updates 9: 02 PM: 44 పరుగులకే ఓపెనర్ల వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన టీమిండియాను పుజారా(35), రహానే(11) ఆదుకున్నారు. వీరిద్దరు రెండో రోజు ఆఖరి సెషన్లో మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడి, టీమిండియాకు 58 పరుగుల స్వల్ప ఆధిక్యాన్ని అందించారు. టీమిండియా రెండో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్ల నష్టానికి 85 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్(8), మయాంక్(16) ఔటయ్యారు. జన్సెన్, ఒలీవియర్ తలో వికెట్ పడగొట్టారు. అంతకుముందు శార్ధూల్ ఏడు వికెట్లతో ఇరగదీయడంతో దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 229 పరుగులకు ఆలౌట్ కాగా, భారత్.. తమ తొలి ఇన్నింగ్స్‌లో 202 పరుగులకు చాపచుట్టేసింది. 8: 28 PM: కేఎల్ రాహుల్ అవుటయ్యాడన్న షాక్ నుంచి తేరుకోకముందే టీమిండియాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ సైతం 23 పరుగులు చేసి వెనుదిరిగాడు. ఒలీవియర్.. మయాంక్‌ను ఎల్బీడబ్ల్యూ చేశాడు. ఫలితంగా టీమిండియా 44 పరుగులకే ఇద్దరు ఓపెనర్ల వికెట్లు కోల్పోయి కష్టాల్లో చిక్కుకుంది. క్రీజ్‌లో పుజారా(7), రహానే ఉన్నారు. ప్రస్తుతం టీమిండియా 17 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. 8: 07 PM: దక్షిణాఫ్రికాను 229 పరుగులకే కట్టడి చేసిన ఆనందం టీమిండియాకు ఎంతో సేపు నిలువలేదు. ప్రత్యర్ధి లీడ్‌ను దాటే లోపే భారీ షాక్ తగిలింది. కెప్టెన్ కేఎల్ రాహుల్ (8) జన్సెన్ బౌలింగ్‌లో మార్క్రమ్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఫలితంగా టీమిండియా 24 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. మయాంక్(16), పుజారా క్రీజ్‌లో ఉన్నారు. 7: 26 PM: టీమిండియా పేసర్ శార్ధూల్ ఠాకూర్(7/61) శివాలెత్తడంతో రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా 229 పరుగులకే ఆలౌటైంది. అతనికి షమీ(2/52), బుమ్రా(1/49) తోడవ్వడంతో భారీ ఆధిక్యం సాధిద్దామనుకున్న సఫారీల ఆశలు అడియాశలయ్యాయి. దీంతో దక్షిణాఫ్రికా కేవలం 27 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యానికే పరిమితమైంది. కీగన్ పీటర్సన్(62), టెంబా బవుమా(51) అర్ధ సెంచరీలతో రాణించడంతో దక్షిణాఫ్రికా ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. అంతకుముందు టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 202 పరుగులకే ఆలౌటైన సంగతి తెలిసిందే. 5: 58 PM: దక్షిణాఫ్రికా ఏడో వికెట్ కోల్పోయింది. కగిసో రబడను షమీ అవుట్ చేశాడు. స్కోరు: 179/7. 5: 49 PM: లార్డ్ శార్దూల్ ఠాకూర్ ప్రొటిస్ బ్యాటర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. ఇప్పటికే నాలుగు వికెట్లు పడగొట్టిన అతడు... మరో కీలక వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. తెంబా బవుమాను అవుట్ చేసి 5 వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. స్కోరు: 177/6. 05: 42 PM: శార్దూల్ మరోసారి అద్భుతం చేశాడు. ఇప్పటికే 3 వికెట్లు తీసిన అతడు.. వెరెనె వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో ప్రొటిస్ ఐదో వికెట్ కోల్పోయింది. 21 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద వెరెనె ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. స్కోరు: 162-5. 5: 11 PM: ప్రొటిస్ జట్టు ప్రస్తుత స్కోరు: 145/4. 4: 53 PM: దక్షిణాఫ్రికా బ్యాటర్లు ఆచితూచి ఆడుతున్నారు. కైలీ వెరెనె 14, తెంబా బవుమా 15 పరుగులతో క్రీజులో ఉన్నారు. ప్రస్తుత స్కోరు: 132/4 3: 30 PM: టీమిండియా బౌలర్ శార్దూల్ ఠాకూర్ ప్రొటిస్ జట్టును దెబ్బ మీద దెబ్బ కొడుతున్నాడు. మూడు వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. ఎల్గర్, పీటర్సన్, వాన్ డెర్ డసెన్‌ను పెవిలియన్‌కు పంపాడు. దీంతో లంచ్ బ్రేక్ సమాయానికి దక్షిణాఫ్రికా నాలుగు వికెట్ల నష్టానికి 102 పరుగులు చేసింది. 3: 25 PM: మూడో వికెట్ కోల్పోయిన ప్రొటిస్.. స్కోరు 101-3 శార్దూల్ ఠాకూర్ మరోసారి అద్భుతమైన బంతితో రాణించాడు. కీగన్ పీటర్సన్‌ను పెవిలియన్‌కు పంపి రెండో వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. 3: 06 PM: రెండో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా ►కెప్టెన్ డీన్ ఎల్గర్ రూపంలో ప్రొటిస్ రెండో వికెట్ కోల్పోయింది. శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో పంత్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. రెండో రోజు ఆటమెదలు పెట్టిన దక్షిణాఫ్రికా నిలకడగా ఆడుతోంది. 28 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 50 పరుగులు సాధించింది. అయితే బుమ్రా బౌలింగ్‌లో ఎల్గర్ అవుటయ్యే ప్రమాదాన్ని తృటిలో తప్పించుకున్నాడు. సాఫ్ట్ సిగ్నల్ ప్రకారం అంపైర్ అవుట్ ఇవ్వగా.... థర్డ్ అంపైర్ మాత్రం నాటౌట్‌గా తేల్చాడు. 1: 48 PM: ప్రొటిస్ ప్రస్తుత స్కోరు: 44/1 1: 31 PM: భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరుగుతన్న రెండో టెస్ట్‌లో భాగంగా రెండో రోజు ఆట ఆరంభమైంది. ఓవర్‌నైట్ స్కోరు 35/1తో ప్రొటిస్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. ప్రస్తుతం క్రీజులో ఎల్గర్(11), పీటర్సన్(14) పరుగులతో ఉన్నారు. కాగా తొలి రోజు ఆటలో భాగంగా మోకాలి నొప్పితో బాధపడిన సిరాజ్ తిరిగి భారత జట్టుతో చేరాడు. ఇక అంతకుముందు టీమిండియా 202 పరుగులకు ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే. రబడ 3, ఒలివర్ 3, మార్కో జాన్సెన్ 4 వికెట్లు తీశాడు. తుది జట్లు: భారత్: కేఎల్ రాహుల్(కెప్టెన్), మయాంక్ అగర్వాల్, ఛతేశ్వర్ పుజారా, అజింక్య రహానే, హనుమ విహారి, రిషభ్ పంత్(వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ సౌతాఫ్రికా: డీన్ ఎల్గర్(కెప్టెన్), ఎయిడెన్ మార్కరమ్, కీగన్ పీటర్సన్, రసే వాన్ డెర్ డసెన్, తెంబా బవుమా, కైలీ వెరెనె(వికెట్ కీపర్), మార్కో జాన్సెన్, కగిసో రబడ, కేశవ్ మహరాజ్, డువానే ఒలివర్, లుంగి ఎంగిడి. చదవండి: Rohit Sharma: 5-6 కిలోలు తగ్గాలి రోహిత్.. అప్పుడే ఉపశమనం; ఫొటో షేర్ చేసిన ధావన్ -
Ind Vs Sa 2nd Test: తొలి రోజు సఫారీలదే..
Updates: తొలి రోజు సఫారీలదే దక్షిణాఫ్రికా సీమర్ల ధాటికి టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 202 పరుగులకే కుప్పకూలింది. అనంతరం బరిలోకి సఫారీలకు టీమిండియా పేసర్ మహ్మద్ షమీ ఆదిలోనే షాకిచ్చినప్పటికీ.. ఎల్గర్(11), పీటర్సన్(14) మరో వికెట్ పడకుండా జాగ్రత్తపడి తొలి రోజు ఆటను ముగించారు. టీ విరామం తర్వాత బరిలోకి దిగి 18 ఓవర్లు ఆడిన దక్షిణాఫ్రికా.. వికెట్ నష్టానికి 35 పరుగులు చేసింది. మార్క్రమ్(12 బంతుల్లో 7) షమీ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. తొలి వికెట్ కోల్పోయిన దక్షిణాఫ్రికా టీమిండియాను 202 పరుగులకే కట్టడి చేసి బరిలోకి దిగిన సఫారీలకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఇన్నింగ్స్ 4వ ఓవర్లో ఓపెనర్ మార్క్రమ్(12 బంతుల్లో 7) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. షమీ సఫారీలను తొలి దెబ్బ తీశాడు. 4 ఓవర్ల తర్వాత దక్షిణాఫ్రికా స్కోర్ 14/1. క్రీజ్‌లో ఎల్గర్(5), పీటర్సన్ ఉన్నారు. 7:33 PM: భీకరమైన సఫారీ పేసర్లను ఎదుర్కొన్న భారత జట్టు అతికష్టం మీద 200 పరుగుల మైలరాయిని క్రాస్ చేసింది. రబాడ బౌలింగ్‌లో సిరాజ్(1) వెనుదిరగడంతో టీమిండియా తొలి ఇన్నింగ్స్ 202 పరుగుల వద్ద ముగిసింది. కెప్టెన్ రాహుల్(50), అశ్విన్(46) రాణించడంతో టీమిండియా ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. సఫారీ బౌలర్లలో జన్సెన్ 4, ఒలీవియర్, రబాడ తలో 3 వికెట్లు పడగొట్టారు. 7:22 PM: ధాటిగా ఆడుతున్న అశ్విన్(50 బంతుల్లో 46; 6 ఫోర్లు) ఎట్టకేలకు జన్సెన్ బౌలింగ్‌లో పీటర్సన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఫలితంగా టీమిండియా 187 పరుగుల వద్ద తొమ్మిదో వికెట్ కోల్పోయింది. బుమ్రా, సిరాజ్ క్రీజ్‌లో ఉన్నారు. 7:13 PM: రబాడ బౌలింగ్‌లో స్ట్రయిట్ షాట్ ఆడబోయిన షమీ(12 బంతుల్లో 9; ఫోర్).. రిటర్న్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఫలితంగా టీమిండియా 185 పరుగుల వద్ద ఎనిమిదో వికెట్ కోల్పోయింది. అశ్విన్(45 బంతుల్లో 44), బుమ్రా క్రీజ్‌లో ఉన్నారు. 6:50 PM: సఫారీ బౌలర్ల ధాటికి టీమిండియా బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కడుతున్నారు. ఒలీవియర్ బౌలింగ్‌లో కీగన్ పీటర్సన్‌కు క్యాచ్ ఇచ్చి శార్ధూల్ ఠాకూర్(0) ఏడో వికెట్‌గా వెనుదిరిగాడు. 55 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 157/7. క్రీజ్‌లో అశ్విన్(27), షమీ ఉన్నారు. 6:42 PM: టీ విరామం తర్వాత టీమిండియాకు మరో షాక్ తగిలింది. జన్సెన్ బౌలింగ్‌లో రిషబ్ పంత్(43 బంతుల్లో 17; ఫోర్) ఔటయ్యాడు. వెర్రిన్ అద్భుతమైన క్యాచ్ పట్టి పంత్‌ను పెవిలియన్‌కు పంపాడు. 54 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 156/6. క్రీజ్‌లో అశ్విన్(22), శార్ధూల్ ఠాకూర్ ఉన్నారు. 6:13 PM: టీ బ్రేక్ సమయానికి టీమిండియా స్కోర్ 146/5. రాహుల్ వెనుదిరిగిన అనంతరం క్రీజ్‌లోకి వచ్చిన అశ్విన్(21 బంతుల్లో 24; 4 ఫోర్లు) ధాటిగా ఆడుతుండగా.. పంత్(32 బంతుల్లో 13; ఫోర్) మరో వికెట్ పడకుండా ఆచితూచి ఆడుతున్నాడు. 5:47 PM: 116 పరుగుల వద్ద టీమిండియాకు మరో షాక్ తగిలింది. నిలకడగా ఆడుతూ హాఫ్ సెంచరీ సాధించిన కేఎల్ రాహుల్(133 బంతుల్లో 50; 9 ఫోర్లు) మార్కో జన్సెన్ బౌలింగ్‌లో రబాడకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 46 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 117/5. క్రీజ్‌లో పంత్(12), అశ్విన్(1) ఉన్నారు. 5: 28 PM:హనుమ విహారి రూపంలో టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. కేఎల్ రాహుల్, రిషభ్ పంత్ ప్రస్తుతం క్రీజులో ఉన్నారు. 4: 58 PM: టీమిండియా బ్యాటర్లు కేఎల్ రాహుల్, హనుమ విహారి ఆచితూచి ఆడుతున్నారు. వీలు చిక్కినప్పుడల్లా బంతిని బౌండరీకి తరలిస్తూ పరుగులు రాబడుతున్నారు. ఈ క్రమంలో 36 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 3 వికెట్ల నష్టానికి 79 పరుగులు చేసింది. ప్రొటిస్ బౌలర్లలో మార్కోకు ఒకటి, సుదీర్ఘ కాలం తర్వాత జట్టులోకి వచ్చిన ఒలివర్‌కు రెండు వికెట్లు దక్కాయి. 4: 45 PM: కేఎల్ రాహుల్ 24 పరుగులు, హనుమ విహారి 11 పరుగులతో క్రీజులో ఉన్నారు. స్కోరు: 67/3. 3: 50 PM:లంచ్ బ్రేక్ సమయానికి టీమిండియా స్కోరు: 53/3 3:29 PM: ప్రొటిస్ బౌలర్ ఒలివర్ టీమిండియాను దెబ్బ మీద దెబ్బ కొడుతున్నాడు. వరుసగా రెండు వికెట్లు కూల్చి తడాఖా చూపించాడు. పుజారాను పెవిలియన్‌కు పంపిన ఒలివర్.. అతడి స్థానంలో క్రీజులోకి వచ్చిన రహానేను సైతం వెంటనే అవుట్ చేశాడు. దీంతో రహానే డకౌట్‌గా వెనుదిరిగాడు. 3: 19 PM: రెండో వికెట్ కోల్పోయిన టీమిండియా రెండో టెస్టు తొలి రోజు ఆటలో భాగంగా టీమిండియా మరో కీలక వికెట్ కోల్పోయింది. ఒలివర్ బౌలింగ్‌లో ఛతేశ్వర్ పుజారా అవుట్ అయ్యాడు. 33 బంతులు ఎదుర్కొన్న అతడు 3 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు. భారత్ స్కోరు: 49/2. 2: 37 PM తొలి వికెట్ కోల్పోయిన భారత్. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా మొదటి వికెట్ కోల్పోయింది. మార్కో జాన్సెన్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ వెరెనెకు క్యాచ్ ఇచ్చి మయాంక్ అగర్వాల్(26) పెవిలియన్ చేరాడు. కేఎల్ రాహుల్, ఛతేశ్వర్ పుజారా క్రీజులో ఉన్నారు. 2:30 PM: 14 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా స్కోరు: 36/0. కేఎల్ రాహుల్(9), మయాంక్ అగర్వాల్(26) క్రీజులో ఉన్నారు. 1:51 PM ఐదు ఓవర్లు ముగిసే సరికి టీమిండియా స్కోరు: 15/0. కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ క్రీజులో ఉన్నారు. 1: 03 PM: సఫారీల కంచుకోట సెంచూరియన్‌ను బద్దలు కొట్టి రెట్టించిన ఆత్మవిశ్వాసంతో టీమిండియా రెండో టెస్టుకు సిద్ధమైంది. సీమర్ల బలంతో తొలి టెస్టులో చారిత్రాత్మక విజయం సాధించిన భారత జట్టు అదే జోరును కొనసాగించాలని భావిస్తోంది. కానీ.. అనూహ్య రీతిలో కెప్టెన్ విరాట్ కోహ్లి ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. అతడి స్థానంలో వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ సారథ్య బాధ్యతలు నిర్వహించనున్నాడు. ఇక టాస్ గెలిచిన రాహుల్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కాగా కోహ్లి స్థానంలో తెలుగు క్రికెటర్ హనుమ విహారి తుదిజట్టులో చోటు దక్కించుకున్నాడు. తుది జట్లు: భారత్: కేఎల్ రాహుల్(కెప్టెన్), మయాంక్ అగర్వాల్, ఛతేశ్వర్ పుజారా, అజింక్య రహానే, హనుమ విహారి, రిషభ్ పంత్(వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ సౌతాఫ్రికా: డీన్ ఎల్గర్(కెప్టెన్), ఎయిడెన్ మార్కరమ్, కీగన్ పీటర్సన్, రసే వాన్ డెర్ డసెన్, తెంబా బవుమా, కైలీ వెరెనె(వికెట్ కీపర్), మార్కో జాన్సెన్, కగిసో రబడ, కేశవ్ మహరాజ్, డువానే ఒలివర్, లుంగి ఎంగిడి. చదవండి: Rahul Dravid- Virat Kohli: అందుకే కోహ్లి డుమ్మా కొట్టాడన్న హెడ్‌కోచ్! -
Ind Vs Sa: నాలుగో రోజు ముగిసిన ఆట..
Ind Vs Sa 1st Test- Day 4 Updates నాలుగోరోజు ఆట ముగిసే సమయానికి సౌతాఫ్రికా మూడు వికెట్ల నష్టానికి 94పరుగులు చేసింది. ప్రొటీస్ విజయానికి 211 పరుగుల దూరంలో ఉండగా.. టీమిండియా విజయానికి 7 వికెట్ల దూరంలో ఉంది. 7:46 PM: 305 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా రెండో వికెట్ కోల్పోయింది. 17 పరుగులు చేసిన కీగన్ పీటర్సన్ సిరాజ్ బౌలింగ్‌లో పంత్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం 18 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 43 పరుగులు చేసింది. డీన్ ఎల్గర్ 24, వాండర్ డుసెన్ 1 క్రీజులో ఉన్నారు. 6:51 PM: 305 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ఆడుతున్న సౌతాఫ్రికా టీ విరామ సమయానికి వికెట్ నష్టానికి 22 పరుగులు చేసింది. టీమిండియా విజయానికి 9 వికెట్ల దూరంలో ఉంటే.. సౌతాఫ్రికా గెలవాలంటే మరో 283 పరుగులు చేయాల్సి ఉంది. ప్రస్తుతం డీన్ ఎల్గర్ 9, కీగన్ పీటర్సన్ 12 పరుగులతో క్రీజులో ఉన్నారు. 5:53 PM: టీమిండియా తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో 174 పరుగులుకు ఆలౌటైంది. దక్షిణాఫ్రికా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో పెద్దగా పరుగులు చేయలేకపోయింది. రిషబ్ పంత్ 34 పరుగులతో టాప్ స్కోరర్ కాగా.. కేఎల్ రాహుల్ 23, అజింక్యా రహానే 20 పరుగులు చేశారు. ప్రొటీస్ బౌలర్లలో రబాడ 4, మార్కో జాన్సెన్ 3, ఎంగిడి 2 వికెట్లు తీశారు. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకొని టీమిండియా దక్షిణాఫ్రికా ముందు 305 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. 5:34 PM: రవిచంద్రన్ అశ్విన్(20) రూపంలో టీమిండియా ఏడో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం టీమిండియా 47 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. పంత్ 28, షమీ 0 పరుగులతో ఆడుతున్నారు. టీమిండియా 290 పరుగుల ఆధిక్యంలో ఉంది. 4:41 PM: 16 పరుగులు చేసిన పుజారా ఎన్గిడి బౌలింగ్‌లో డికాక్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో 109 పరుగుల వద్ద టీమిండియా ఐదో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం భారత్ 241 పరుగుల ఆధిక్యంలో ఉంది. రహానే 20, పంత్ 2 పరుగులతో ఆడుతున్నారు. 4:26 PM: విరాట్ కోహ్లి(18) రూపంలో టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. మార్కో జాన్సెన్ వేసిన ఇన్నింగ్స్ 32వ ఓవర్ తొలి బంతికి కోహ్లి డికాక్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం టీమిండియా 4 వికెట్ల నష్టానికి 94 పరుగులు చేసింది. పుజారా 16, రహానే 5 పరుగులతో ఆడుతున్నారు. టీమిండియా ఓవరాల్‌గా 224 పరుగులు ఆధిక్యంలో ఉంది. 3: 30 PM: లంచ్ బ్రేక్ సమయానికి టీమిండియా స్కోరు: 79/3. 209 పరుగుల ఆధిక్యం. కోహ్లి 18 పరుగులు, పుజారా 12 పరుగులతో క్రీజులో ఉన్నారు. 2: 55 PM: కేఎల్ రాహుల్ రూపంలో టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. ఎంగిడి బౌలింగ్‌లో రాహుల్ పెవిలియన్ చేరాడు. కెప్టెన్ విరాట్ కోహ్లి, ఛతేశ్వర్ పుజారా క్రీజులో ఉన్నారు. 2: 36 PM: 20 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా స్కోరు: 50/2 (20) 2: 00 PM: రెండో వికెట్ కోల్పోయిన టీమిండియా రబడ బౌలింగ్‌లో మల్దర్‌కు క్యాచ్ ఇచ్చి శార్దూల్ ఠాకూర్ అవుటయ్యాడు. 10 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు. కేఎల్ రాహుల్, ఛతేశ్వర్ పుజారా క్రీజులో ఉన్నారు. స్కోరు: 34/2 1: 58 PM: 12 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా స్కోరు: 30/1 1: 40 PM రివ్యూ వేస్ట్ చేసుకున్న ప్రొటిస్ మార్కో జాన్సెన్ బౌలింగ్‌లో బంతి శార్దూల్ ప్యాడ్లను తాకినట్టుగా కనిపించడంతో ప్రొటిస్ అప్పీలు చేయగా అంపైర్ నాటౌట్‌గా ప్రకటించాడు. ఈ క్రమంలో రివ్యూకు వెళ్లిన ఎల్గర్ బృందానికి నిరాశే మిగిలింది. బంతి ఎక్కువ ఎత్తు నుంచి వెళ్లడంతో శార్దూల్‌ను నాటౌట్‌గా ప్రకటించారు. దక్షిణాఫ్రికా- టీమిండియా మధ్య తొలి టెస్టులో భాగంగా నాలుగో రోజు ఆట ఆరంభమైంది. మూడో రోజు ఆట ముగిసే సరికి 146 పరుగుల ఆధిక్యంలో ఉన్న కోహ్లి సేన... ఒక వికెట్ నష్టానికి 16 పరుగుల వద్ద ఆటను ప్రారంభించింది. కేఎల్ రాహుల్, శార్దూల్ ఠాకూర్ క్రీజులో ఉన్నారు. ఇక మయాంక్ అగర్వాల్ మంగళవారం నాటి ఆటలో మార్కో జాన్సెన్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ డికాక్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరిన సంగతి తెలిసిందే. తుదిజట్లు: భారత్: కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, ఛతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి(కెప్టెన్), అజింక్య రహానే, రిషభ్ పంత్(వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్. దక్షిణాఫ్రికా: డీన్ ఎల్గర్(కెప్టెన్), ఎయిడెన్ మార్కరమ్, కీగన్ పీటర్సన్, రసే వాన్ డెర్ డసెన్, తెంబా బవుమా, క్వింటన్ డికాక్(వికెట్ కీపర్), వియాన్ మల్దర్, మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్, కగిసో రబడ, లుంగి ఎంగిడి. Good Morning from SuperSport Park 🌞 Huddle Talk 🗣️ done ☑️ We are all set for Day 4 action to get underway 💪#TeamIndia | #SAvIND pic.twitter.com/gsGz51PoOD — BCCI (@BCCI) December 29, 2021 -
24 ఏళ్ల క్రితం సొంతగడ్డపై.. 18 ఏళ్ల క్రితం విదేశీ గడ్డపై
సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా బ్యాటింగ్ వైఫల్యం మరోసారి కనిపించింది. రెండోరోజు ఆట వర్షంతో పూర్తిగా తుడిచిపెట్టుకుపోగా.. 272/3 స్కోరుతో మూడో రోజు ఆటను ప్రారంభించింది. కేఎల్ రాహుల్ 122 పరుగులు, రహానే 40 పరుగులతో ఇన్నింగ్స్‌ను ఆరంభించారు. అయితే జట్టు స్కోరు 278 పరుగులకు చేరగానే కేఎల్ రాహుల్(123 పరుగులు) రూపంలో వికెట్ కోల్పోయింది. అంతే అక్కడి నుంచి టీమిండియా ఇన్నింగ్స్ పేకమేడను తలపించింది. కేవలం 49 పరుగుల వ్యవధిలో మిగతా ఏడు వికెట్లు చేజార్చుకోవడం విశేషం. చదవండి: IND Vs SA: బుమ్రా స్టన్నింగ్ డెలివరీ.. అనవసరంగా గెలుక్కున్నాడు ఈ నేపథ్యంలో టీమిండియా ఒక చెత్త రికార్డును నమోదు చేసింది. దాదాపు 18 సంవత్సరాల తర్వాత అదే సీన్‌ను రిపీట్ చేసింది. 2003-04 ఆసీస్ పర్యటనలో మెల్బోర్న్ వేదికగా జరిగిన టెస్టులో టీమిండియా 311/3తో పటిష్టంగా కనిపించింది. అయితే మిగతా ఏడు వికెట్లను 55 పరుగుల వ్యవధిలో చేజార్చుకొని 366 పరుగులకు ఆలౌటైంది. ఇక అంతకముందు మరో ఆరేళ్లు వెనక్కి వెళితే.. అంటే 1997-98లో వెస్టిండీస్ టీమిండియా పర్యటనకు వచ్చింది. ముంబై వేదికగా జరిగిన టెస్టులో టీమిండియా 471 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయి భారీ స్కోరు దిశగా అడుగులు వేసింది. అయితే ఎవరు ఊహించని విధంగా 41 పరుగుల వ్యవధిలో ఏడు వికెట్లు చేజార్చుకొని 512 పరుగులకు ఆలౌటైంది. చదవండి: IND VS SA 1st Test: లడ్డూలాంటి క్యాచ్ వదిలేశారు.. ఫలితం అనుభవించండి -
బుమ్రా స్టన్నింగ్ డెలివరీ.. అనవసరంగా గెలుక్కున్నాడు
Bumrah Stunning Delivery To Dean Elgar.. సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలిటెస్టులో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 327 పరుగులకు ఆలౌటైంది. 273/3తో పటిష్టంగా కనిపించిన టీమిండియా రాహుల్ ఔటైన తర్వాత ఇన్నింగ్స్ పేకమేడను తలపించింది. కేవలం 55 పరుగులు వ్యవధిలో మిగతా ఏడు వికెట్లను చేజార్చుకోవడం ఆసక్తి కలిగించింది. అయితే రాహుల్ సెంచరీతో మెరవడం, మయాంక్ అర్థసెంచరీ, రహానే 48 పరుగులతో రాణించడంతో టీమిండియా కాస్త చెప్పుకోదగ్గ స్కోరును చేయగలిగింది. చదవండి: AUS vs ENG: 18 ఏళ్ల చెత్త రికార్డు బద్దలు కొట్టిన ఇంగ్లండ్ ఇక దక్షిణాఫ్రికాకు.. ఇన్నింగ్స్ ఆరంభంలోనే బుమ్రా గట్టి షాక్ ఇచ్చాడు. ఒక పరుగు చేసిన కెప్టెన్ డీన్ ఎల్గర్‌ను బుమ్రా తెలివైన బంతితో బోల్తా కొట్టించాడు. ఆఫ్‌స్టంప్ దిశగా బుమ్రా వేసిన ఐదో బంతిని ఎల్గర్ అనవసరంగా గెలుక్కున్నాడు. దీంతో బంతి బ్యాట్ ఎడ్జ్‌ను తాకుతూ వెళ్లడం.. కీపర్ పంత్ సూపర్ డైవింగ్‌తో క్యాచ్ తీసుకోవడం జరిగిపోయింది. దీనికి సంబంధించిన వీడియోనూ ఒక వ్యక్తి ట్విటర్లో షేర్ చేశాడు. ఒక రకంగా టీమిండియాకు డీన్ ఎల్గర్ పెద్ద వికెట్ అని చెప్పొచ్చు. కెప్టెన్ ఔటైతే ఆ జట్టు ఒత్తిడిలో పడే అవకాశం ఉంటుంది. అయితే ఇంకా రెండు సెషన్లు మిగిలి ఉండడంతో టీమిండియా బౌలర్లు ఎన్ని వికెట్లు పడగొడతారనేది చూడాలి. చదవండి: యాషెస్ సిరీస్ ఆసీస్ కైవసం.. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానం India draws first blood, SA' s Captain, walks back to the pavilion #INDvsSA #SAvIND #IndianCricketTeam #DisneyPlusHotstarID #DisneyPlusHotstarTH #DisneyPlusHotstar pic.twitter.com/vyRVgqOwxh — Inian Kumar Ganesan (@Inian14) December 28, 2021 -
Ind Vs Sa 1st Test: కేఎల్ రాహుల్ శతకం.. ముగిసిన తొలిరోజు ఆట
Ind Vs Sa 1st Test: సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలిటెస్టులో టీమిండియా తొలిరోజు ఆట ముగిసే సమయానికి 90 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ 122 పరుగులు, అజింక్యా రహానే 40 పరుగులతో ఆడుతున్నారు. ఇక తొలిరోజు ఆటలో టీమిండియా స్పష్టమైన ఆధిక్యం చూపెట్టింది. దాదాపు మూడు సెషన్లలోనూ టీమిండియాదే పైచేయి అయింది. టీమిండియా ఓపెనర్లు కేఎల్ రాహుల్ సెంచరీతో మెరవగా.. మయాంక్ అగర్వాల్ హాఫ్ సెంచరీ సాధించగా.. కోహ్లి 35 పరుగులు చేసి ఔటయ్యాడు. ప్రొటీస్ బౌలర్లలో లుంగీ ఎన్గిడి 3 వికెట్లు తీశాడు. 8:05 PM: టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ శతకంతో మెరిశాడు. 219 బంతుల్లో 14 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ప్రస్తుతం టీమిండియా 78 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 238 పరుగులు చేసింది. రహానే 25 పరుగులతో రాహుల్‌కు సహకరిస్తున్నాడు. 7:24 PM: విరాట్ కోహ్లి(35) రూపంలో టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం 69 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది ఓపెనర్ కేఎల్ రాహుల్ 90 పరుగులతో సెంచరీకి దగ్గరవ్వగా.. రహానే పరుగులతో క్రీజులో ఉన్నాడు. మయాంక్ అగర్వాల్, పుజారాలు వెనుదిరిగిన తర్వాత కోహ్లి, రాహుల్‌లు కలిసి మూడో వికెట్‌కు 82 పరుగులు జోడించారు. 6:22 PM: టీ విరామ సమయానికి టీమిండియా 57 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ 68 పరుగులతో, కోహ్లి 19 పరుగులతో క్రీజులో ఉన్నారు. 5: 45 Pm: టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ అర్థశతకంతో మెరిశాడు. ప్రస్తుతం టీమిండియా 49 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది. రాహుల్ 58, కోహ్లి 12 పరుగులతో ఆడుతున్నారు. 5: 26 Pm: టీమిండియా వరుస బంతుల్లో రెండు వికెట్లు కోల్పోయింది. ఎన్గిడి బౌలింగ్‌లో పుజారా గోల్డెన్‌డక్‌గా వెనుదిరిగాడు. అంతకముందు మయాంక్ అగర్వాల్(60) రూపంలో టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం 40 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 117 పరుగులు చేసింది. 4: 26 PM: మయాంక్ అగర్వాల్ అర్ధ సెంచరీ.. భారత్ స్కోరు: 98. 3:30 PM: తొలి టెస్టులో టీమిండియా ఓపెనర్లు శుభారంభం అందించారు. మయాంక్ అగర్వాల్ అర్ధ సెంచరీకి చేరువకాగా... కేఎల్ రాహుల్ 29 పరుగులతో క్రీజులో ఉన్నాడు. వీరిద్దరు మెరుగైన భాగస్వామ్యం నమోదు చేయడంతో లంచ్ బ్రేక్ సమయానికి టీమిండియా 83 పరుగులు చేసింది. 2:45 PM: 17 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా స్కోరు: 44/0. ఓపెనర్లు కేఎల్ రాహుల్ 16 పరుగులు, మయాంక్ అగర్వాల్ 28 పరుగులతో క్రీజులో ఉన్నారు. 2:20 PM: 12 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా స్కోరు: 38/0. కేఎల్ రాహుల్ (12), మయాంక్ అగర్వాల్(26) పరుగులతో క్రీజులో ఉన్నారు. ఐదు ఓవర్లు ముగిసే సరికి టీమిండియా స్కోరు: 8/0. కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ క్రీజులో ఉన్నారు. దక్షిణాఫ్రికాతో టీమిండియా మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆదివారం ఆరంభమైంది. తొలి టెస్టులో భాగంగా టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. వన్డే కెప్టెన్సీ నుంచి ఉద్వాసనకు గురైన తర్వాత కెప్టెన్ విరాట్ కోహ్లికి, హెడ్‌కోచ్‌గా రాహుల్ ద్రవిడ్‌కు విదేశంలో ఇదే తొలి సిరీస్ కావడంతో ఈ సిరీస్ మరింత ప్రతిష్టాత్మకంగా మారింది. ఇంతవరకు సఫారీ గడ్డపై భారత్ ఒక్క టెస్టు సిరీస్ కూడా గెలవలేదన్న అప్రదిష్టను తొలగించి చరిత్ర సృష్టించాలని ఈ ద్వయం భావిస్తోంది. ఈ క్రమంలో ఫామ్‌లో లేనప్పటికీ, విదేశాల్లో ఉన్న రికార్డు దృష్ట్యా అనుభవజ్ఞుడైన అజింక్య రహానే వైపే మొగ్గు చూపడం గమనార్హం. తుది జట్టులో అతడికి చోటు కల్పించారు. ఇక స్వదేశంలో న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌లో అదరగొట్టిన శ్రేయస్ అయ్యర్‌ను పక్కనపెట్టారు. ఇషాంత్ శర్మ కాకుండా హైదరాబాదీ పేసర్ సిరాజ్‌కు అవకాశం ఇచ్చారు. Updates: 1:50 PM: ఐదు ఓవర్లు ముగిసే సరికి టీమిండియా స్కోరు: IND 8/0. కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ క్రీజులో ఉన్నారు. 1: 05PM: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ తుదిజట్లు: భారత్: కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, ఛతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి(కెప్టెన్), అజింక్య రహానే, రిషభ్ పంత్(వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్. దక్షిణాఫ్రికా: డీన్ ఎల్గర్(కెప్టెన్), ఎయిడెన్ మార్కరమ్, కీగన్ పీటర్సన్, రసే వాన్ డెర్ డసెన్, తెంబా బవుమా, క్వింటన్ డికాక్(వికెట్ కీపర్), వియాన్ మల్దర్, మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్, కగిసో రబడ, లుంగి ఎంగిడి. -
IND vs SA: టీమిండియా అదరగొడుతోంది.. కానీ మాదే పైచేయి: ప్రొటిస్ కెప్టెన్
IND vs SA Test Series- Dean Elgar Comments: సఫారీ గడ్డపై టెస్టు సిరీస్ గెలవాలని కోహ్లి సేన పట్టుదలగా ఉంది. ఇందుకోసం టీమిండియా ఆటగాళ్లు నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నారు. హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ దగ్గరుండి పర్యవేక్షిస్తూ.. విలువైన సలహాలు, సూచనలు ఇస్తూ సిరీస్‌కు సన్నద్ధం చేస్తున్నాడు. మరోవైపు.. స్వదేశంలో భారత్‌పై తమకున్న రికార్డులను ప్రస్తావిస్తూ ప్రొటిస్ మాజీ ఆటగాళ్లు టీమిండియా ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా దక్షిణాఫ్రికా కెప్టెన్ డీన్ ఎల్గర్ సైతం ఇదే పని చేశాడు. విదేశాల్లో టీమిండియా రికార్డు మెరుగుపడిందని చెబుతూనే.. సొంతగడ్డపై తమదే పైచేయి అని వ్యాఖ్యానించాడు. అదే విధంగా... ఏడుసార్లు టీమిండియా తమ చేతిలో ఓడిపోయిందన్న విషయాన్ని గుర్తుచేసిన ఎల్గర్... ఈ సిరీస్‌లో తామే ఫేవరెట్ జట్టు అని చెప్పుకొచ్చాడు. స్వదేశంలో ఆడటం తమకు సానుకూల అంశమని.. భారత జట్టు తమను ఓడించడం అసాధ్యమని పేర్కొన్నాడు. ‘‘విదేశాల్లో టీమిండియా అదరగొడుతోంది. కానీ ఇక్కడ మాత్రం మాదే పైచేయి’’ అంటూ ధీమా వ్యక్తం చేశాడు. అయితే... ఎల్గర్ చెప్పినట్లు ప్రొటిస్ జట్టుకు సొంత దేశంలో ఆడటం కలిసివస్తుందేమో గానీ.. భారత్‌పై తప్ప వారికి ఇతర దేశాలపై మరీ అంత మెరుగైన రికార్డు లేకపోవడం గమనార్హం. కాగా డిసెంబరు 26 నుంచి తొలి టెస్టు ఆరంభం కానుంది. స్వదేశంలో దక్షిణాఫ్రికా జట్టు వైఫల్యాలు ►ఇటీవలి మూడు సిరీస్‌లలో ఒక్కటి మాత్రమే ప్రొటిస్ జట్టు గెలిచింది. ►2019లో శ్రీలంక చేతిలో దక్షిణాఫ్రికా 2-0తేడాతో ఓటమి పాలైంది. ►ఇంగ్లండ్ అయితే ఏకంగా 4-1 తేడాతో సౌతాఫ్రికాను మట్టికరిపించింది. ►ఇక 2017 నుంచి ఇప్పటి వరకు స్వదేశంలో 23 మ్యాచ్‌లు ఆడిన ప్రొటిస్ జట్టు 16 గెలిచింది. ఏడింటిలో ఓటమిపాలైంది. చదవండి: SA vs IND: ఓపెనర్లుగా మయాంక్, రాహుల్.. హనుమ విహారికు నో ఛాన్స్! -
ఎల్గర్‌ను ఆడేసుకుంటున్నారు..!
రాంచీ: భారత్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో పేలవ ప్రదర్శన కొనసాగిస్తున్న దక్షిణాఫ్రికా ఓపెనర్ డీన్ ఎల్గర్ అనవసరంగా నోరు జారి విమర్శలను కొనితెచ్చుకున్నాడు. భారత్‌లో హోటళ్లు ఇరుకుగా ఉంటాయని, ఫుడ్ కూడా పెద్దగా బాగోదని ఎల్గర్ అనవసర రాద్ధాంతానికి తెరలేపాడు. దాంతో ఎల్గర్‌ను నెటిజన్లు ఆడేసుకుంటున్నారు. ఫుడ్, హోటళ్లు కాదు.. ముందు ఆట మీద దృష్టి పెట్టు అంటూ ఎద్దేవా చేస్తున్నారు. ‘ ఇప్పుడు నీ ఫెయిల్యూర్స్‌కు భారత్‌లో హోటళ్లు, ఫుడ్ బాలేదని నువ్వు దక్షిణాఫ్రికాకు వెళ్లిన తర్వాత మీ బోర్డుకు వివరణ ఇస్తావేంటి’ అని ఒక నెటిజన్ ప్రశ్నించగా, ‘ నువ్వు విఫలం అయ్యావ్ కదా.. విమర్శించడానికి ఏదొకటి ఉండాలి. అందులో భారత్‌లోని హోటళ్లు, ఫుడ్ ఉన్నా తప్పులేదు కదా ఎల్గర్’ అని మరొకరు సెటైర్ వేశాడు. ‘ గంగూలీ ప్లీజ్.. వాళ్లు మూడో టెస్టు ఓడిపోకుండా ఉండాలంటే మంచి హోటళ్లు బుక్ చేయండి పాపం’ అని మరొకరు విమర్శించారు. ‘ క్వాలిటీ హోటళ్ల కోసం మాట్లాడుతున్నాడు. ఫుడ్ సరిగా లేకపోవడం, ఇరుకు హోటళ్లు అతని ఆటపై ప్రభావం చూపుతుందంట. నువ్వే వంట చేసుకో ఎల్గర్. అప్పుడు భారత క్రికెటర్లు నీకు వడ్డిస్తారు’ అని మరొక అభిమాని కోరాడు. ‘ ఎల్గర్‌కు ఏంటిల్లా-ముకేశ్ అంబానీ హౌజ్‌లు బుక్ చేయండి. అతనికి భారత హోటళ్లు సెట్ కాలేదంట. అతను మన గెస్ట్.. గెస్ట్‌ను గౌరవించాలి కదా’ మరొకరు సుతిమెత్తని విమర్శలు సంధించారు. -
ఎరక్కపోయి ఇరుక్కుపోయిన ఎల్గర్
రాంచీ: దక్షిణాఫ్రికా క్రికెటర్ డీన్ ఎల్గర్ నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యాడు. రాంచీ టెస్టు ప్రారంభానికి ముందు జరిగిన ప్రాక్టీస్ సేషన్లో ఎల్గర్ మీడియాతో సరదాగా సంభాషించాడు. ఈ క్రమంలో భారత పర్యటన ముగుస్తున్న తరుణంలో మీ అనుభవాలను తెలపాలంటూ ఎల్గర్‌ను మీడియా ప్రతినిధి అడిగాడు. దీనికి సమాధానంగా ‘వ్యక్తిగా, క్రికెటర్‌గా ఈ పర్యటన ఎంతో లాభించింది. ఈ పర్యటనలో ఎంతో నేర్చుకున్నాను. అయితే ఇక్కడికి వచ్చినప్పుడు హోటల్స్, ఫుడ్ విషయంలో ఇబ్బందులు తలెత్తుతాయని అర్థమైంది. హోటల్ రూమ్‌లు, ఆహారం అంత బాగా ఉండకపోయినా మైదానాలు సవాళ్లను విసురుతాయి’అంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేశాడు. తాజాగా ఎల్గర్ వ్యాఖ్యలపై భారత అభిమానులు మండిపడుతున్నారు. ఓటమికి సాకులను వెతికే క్రమంలో సఫారీ ఆటగాళ్లు ఉన్నారంటూ మండిపడుతున్నారు. ‘కేప్‌టౌన్‌లో భారత క్రికెటర్లు షవర్ బాత్ చేయడానికి హోటల్ సిబ్బంది కేవలం రెండు నిమిషాలు మాత్రమే సమయమచ్చిన విషయం గుర్తుందా ఎల్గర్?’, ‘ ఇక్కడి ప్రదేశాలు, ఆహారం, అలవాట్ల గురించి మీ దిగ్గజ క్రికెటర్ జాంటీ రోడ్స్ దగ్గరికి వెళ్లి నేర్చుకో’అని నెటిజన్లు పేర్కొంటున్నారు. ఇక ఎల్గర్ గత పర్యటనలో భారత పిచ్‌లను విమర్శించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడు టెస్టుల సిరీస్‌ను టీమిండియా ఇప్పటికే 2-0తో కైవసం చేసుకుంది. రాంచీ టెస్టులోనూ గెలిచి క్లీన్ స్వీప్ చేయాలని టీమిండియా ఆరాటపడుతోంది. -
హమ్మయ్య.. ఔట్ చేశాం!
విశాఖ: దక్షిణాఫ్రికాతో తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో భారత జట్టును ఎక్కువ విసిగించిన క్రికెటర్ డీన్ ఎల్గర్. గురువారం దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ ప్రారంభించే క్రమంలో ఓపెనర్‌గా దిగిన ఎల్గర్.. శుక్రవారం సాయంత్రం ఆరో వికెట్‌గా ఔటయ్యాడు. ఒకవైపు దక్షిణాఫ్రికా టాపార్డర్‌లో కీలకమైన వికెట్లను భారత బౌలర్లు సాధించినప్పటికీ ఎల్గర్ మాత్రం పట్టువదలకుండా ఇన్నింగ్స్ ఆడాడు. 287 బంతులను ఎదుర్కొని భారత్‌కు పరీక్ష పెట్టాడు. దాదాపు 50 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసిన ఎల్గర్ 18 ఫోర్లు, 4 సిక్సర్లతో 160 పరుగులు చేశాడు. కాగా, మూడో రోజు ఆట ఇంకా గంటలో ముగుస్తుందనగా ఎల్గర్ ఎట్టకేలకు ఔటయ్యాడు. రవీంద్ర జడేజా బౌలింగ్‌లో చతేశ్వర పుజారా అద్భుతమైన క్యాచ్ పట్టడంతో ఎల్గర్ ఇన్నింగ్స్ ముగిసింది. దాంతో హమ్మయ్య.. ఔట్ చేశాం అనుకోవడం భారత్ వంతైంది. 39/3 ఓవర్‌నైట్ స్కోరుతో తొలి ఇన్నింగ్స్‌ను ఆరంభించిన దక్షిణాఫ్రికా ఆదిలోనే బావుమా వికెట్‌ను చేజార్చుకుంది. ఇషాంత్ శర్మ బౌలింగ్‌లో బావుమా ఎల్బీగా ఔట్ కావడంతో దక్షిణాఫ్రికా నాల్గో వికెట్‌ను కోల్పోయింది. దాంతో 63 పరుగులకు సఫారీలు నాల్గో వికెట్‌ను నష్టపోయారు. ఈ తరుణంలో ఎల్గర్-డుప్లెసిస్ జోడి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దింది. వీరిద్దరూ 115 పరుగులు జోడించిన తర్వాత డుప్లెసిస్ ఐదో వికెట్‌గా ఔటయ్యాడు. అశ్విన్ బౌలింగ్‌లో లెగ్ గల్లీలో ఫీల్డింగ్ చేస్తున్న పుజారాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. కాగా, జట్టు స్కోరు 178 పరుగుల వద్ద డుప్లెసిస్ ఐదో వికెట్‌గా ఔటైన తర్వాత ఎల్గర్‌కు డీకాక్ జత కలిశాడు. డీకాక్ సైతం ఎల్గర్‌కు చక్కటి సహకారం అందించడంతో దక్షిణాఫ్రికా తేరుకుంది. ఈ జోడి 164 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసిన తర్వాత ఎల్గర్ ఔటయ్యాడు. -
మైదానంలో అభిమాని అత్యుత్సాహం
విశాఖ: భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఇక్కడ జరుగుతున్న తొలి టెస్టులో ఒక అభిమాని అత్యుత్సాహం ప్రదర్శించాడు. మూడో రోజు ఆట జరుగుతున్న సమయంలో మైదానంలోకి పరుగులు తీశాడు. అదే సమయంలో క్రికెటర్లతో సెల్ఫీలు దిగేందుకు యత్నించాడు. దీన్ని సిబ్బందికి అడ్డుకోవడానికి యత్నించడంతో పరుగులు తీశాడు. చివరకు ఆ యువకుడ్ని సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతన్ని పోలీసులకు అప్పగించారు. ఈ మ్యాచ్‌లో భారత్ సాధించిన స్కోరుకు దక్షిణాఫ్రికా దీటుగా బదులిస్తోంది. ఓపెనర్ డీన్ ఎల్గర్ శతకం సాధించగా, డుప్లెసిస్(55) హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. వీరిద్దరూ 115 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించి స్కోరును గాడిలో పెట్టారు. 34 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ సమయంలో ఎల్గర్-డుప్లెసిస్ జోడి మరమ్మత్తు చేపట్టింది. కాగా, జట్టు స్కోరు 178 పరుగుల వద్ద డుప్లెసిస్ ఐదో వికెట్‌గా ఔటైన తర్వాత ఎల్గర్‌కు డీకాక్ జత కలిశాడు. డీకాక్ సైతం ఎల్గర్‌కు చక్కటి సహకారం అందించడంతో సఫారీలు తేరుకున్నారు. డీకాక్ హాఫ్ సెంచరీ సాధించాడు.