భారత్‌-సౌతాఫ్రికా రెండో టెస్ట్‌ విశేషాలు, రికార్డులు.. | IND VS SA 2nd Test Important Records | Sakshi
Sakshi News home page

భారత్‌-సౌతాఫ్రికా రెండో టెస్ట్‌ విశేషాలు, రికార్డులు..

Published Thu, Jan 4 2024 6:44 PM | Last Updated on Thu, Jan 4 2024 7:03 PM

IND VS SA 2nd Test Important Records - Sakshi

కేప్‌టౌన్‌ వేదికగా భారత్‌-సౌతాఫ్రికా జట్ల మధ్య జరిగిన రెండో టెస్ట్‌ మ్యాచ్‌ పలు రికార్డులకు వేదికైంది. ఈ మ్యాచ్‌లో భారత్‌.. 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో సమం చేసుకుంది. దీనికి ముందు సెంచూరియన్‌ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌ మ్యాచ్‌లో సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌ 32 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.

కేప్‌టౌన్‌ టెస్ట్‌ రికార్డులు..

  • 2024లో తొలి టెస్ట్‌
  • కేవలం ఒకటిన్నర రోజుల్లో ముగిసింది (నాలుగున్నర సెషన్లు)
  • భారత్‌.. సౌతాఫ్రికాను కేప్‌టౌన్‌లో తొలిసారి ఓడించింది
  • కేప్‌టౌన్‌లో టెస్ట్‌ మ్యాచ్‌ గెలిచిన తొలి ఏషియన్‌ కెప్టెన్‌గా రోహిత్‌ శర్మ రికార్డు
  • కేప్‌టౌన్‌లో టెస్ట్‌ మ్యాచ్‌ గెలిచిన తొలి ఏషియన్‌ జట్టుగా భారత్‌ రికార్డు
  • ధోని తర్వాత సౌతాఫ్రికా గడ్డపై టెస్ట్‌ సిరీస్‌ను డ్రా చేసుకున్న రెండో కెప్టెన్‌గా హిట్‌మ్యాన్‌ రికార్డు
  • అంతర్జాతీయ క్రికెట్‌లోకి రీఎంట్రీ తర్వాత టెస్ట్‌ల్లో సౌతాఫ్రికా అత్యల్ప స్కోర్‌ (55, తొలి ఇన్నింగ్స్‌)
  • టెస్ట్‌ క్రికెట్‌ చరిత్రలో ఓ జట్టు  (భారత్‌) పరుగులేమీ (153 పరుగుల వద్ద) చేయకుండా తమ చివరి ఆరు వికెట్లు కోల్పోవడం ఇదే తొలిసారి.
  • 2024లో తొలి సెంచరీ చేసిన ఆటగాడిగా మార్క్రమ్‌ రికార్డు
  • టెస్ట్‌ క్రికెట్‌ చరిత్రలో అత్యంత వేగంగా (బంతుల పరంగా) ముగిసిన టెస్ట్‌ మ్యాచ్‌ (642 బంతుల్లో)
  • టెస్టు క్రికెట్ చరిత్రలోనే తొలి రోజు అత్యధిక వికెట్లు (23) పడిన రెండో మ్యాచ్‌గా రికార్డు.

మ్యాచ్‌ విశేషాలు..

  • సిరాజ్‌ చెలరేగడంతో (6/15) తొలి ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికా 55 పరుగులకే కుప్పకూలింది
  • ఒకే స్కోర్‌ వద్ద (153, తొలి ఇన్నింగ్స్‌) టీమిండియా చివరి ఆరు వికెట్లు కోల్పోయింది.  
  • కెరీర్‌లో తొమ్మిదో ఐదు వికెట్ల ప్రదర్శనతో (6/61) సౌతాఫ్రికా నడ్డివిరిచిన బుమ్రా
  • సౌతాఫ్రికా తరఫున టెస్ట్‌ల్లో అత్యంత వేగవంతమైన ఆరో సెంచరీ (99 బంతుల్లో) చేసిన మార్క్రమ్‌
  • సౌతాఫ్రికా తరఫున ఓ పూర్తయిన టెస్ట్‌ ఇన్నింగ్స్‌లో అత్యధిక శాతం (60.22) పరుగులు చేసిన ఆటగాడిగా మార్క్రమ్‌ రికార్డు
  • సౌతాఫ్రికా తాత్కలిక కెప్టెన్‌ డీన్‌ ఎల్గర్‌ టెస్ట్‌ కెరీర్‌ ముగిసింది

ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌-సిరాజ్‌
ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌- డీన్‌ ఎల్గర్‌, బుమ్రా

స్కోర్‌ వివరాలు..
సౌతాఫ్రికా- 55 (వెర్రిన్‌ 15, సిరాజ్‌ 6/15), 176 (మార్క్రమ్‌ 106, బుమ్రా 6/61)
భారత్‌- 153 (కోహ్లి 46, ఎంగిడి 3/30), 80/3 (జైస్వాల్‌ 28, జన్సెన్‌ 1/15)
7 వికెట్ల తేడాతో భారత్‌ విజయం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement