Cape Town
-
రోహిత్ వ్యాఖ్యలపై ఐసీసీ సీరియస్.. చర్యలకు సిద్దం!?
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చిక్కుల్లో పడినట్లు తెలుస్తోంది. తాజాగా కేప్‌టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో రెండో టెస్టు అనంతరం క్రికెట్ పిచ్‌లపైన రోహిత్ చేసిన వ్యాఖ్యలను ఐసీసీ సీరియస్‌గా తీసుకున్నట్లు సమాచారం. ఐసీసీ మ్యాచ్ రిఫరీలను ఉద్దేశించి రోహిత్ ఘూటు వాఖ్యలు చేశాడు. ఈ క్రమంలో రోహిత్ కామెంట్స్‌ను సీరియస్‌గా తీసుకున్న ఐసీసీ.. హిట్‌మ్యాన్‌పై చర్యలకు సిద్దమైనట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. రోహిత్ ఏమన్నాడంటే? కేప్‌టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో భారత్ 7 వికెట్ల తేడాతో సంచలన విజయం సాధించింది. దీంతో టెస్టు సిరీస్‌ను 1-1తో టీమిండియా సమం చేసింది. ఈ క్రమంలో పోస్ట్‌మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో రోహిత్ మాట్లాడుతూ.. "ఇది కూడా క్రికెట్ పిచే కదా. ఆడింది మ్యాచే కదా! మ్యాచ్ రిఫరీలకు, ఐసీసీకి ఏం జరిగిందొ కనబడిందనే అనుకుంటున్నా. మరి దీనికేం రేటింగ్ ఇస్తారు? భారత్‌లో ప్రపంచకప్ ఫైనల్ కోసం తయారు చేసిన పిచ్‌పై ఓ బ్యాటర్ సెంచరీ చేసినా దానికి ‘యావరేజ్’ రేటింగ్ ఇస్తారు. ఇవేం ద్వంద్వ ప్రమాణాలు మరి! ఐసీసీ గానీ, రిఫరీలు గానీ తటస్థంగా ఉండాలి. కేప్‌టౌన్‌లో ఏం జరిగిందో అందరూ చూశారు. పిచ్ ఎలా ఉందో అందరికీ తెలుసు. నిజాయితీగా చెబుతున్నా... ఇలాంటి పిచ్‌లపై ఆడేందుకు నాకైతే ఎలాంటి ఇబ్బందులు లేవు. అలాగే విదేశీ జట్లు కూడా భారత్‌కు వచ్చినప్పుడు మూడు రోజుల్లో ముగిస్తే, స్పిన్ తిరిగితే ఇవేం పిచ్‌లు, ఇదేం చెత్త అని నోరుపారేసుకోవడం ఆపితే మంచిది" అని రోహిత్ పేర్కొన్నాడు. అయితే ఐసీసీ మాత్రం ఈ విషయంపై ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఇక దక్షిణాఫ్రికా పర్యటనను ముగించుకుని స్వదేశానికి చేరుకున్న భారత జట్టు అఫ్గానిస్తాన్‌తో టీ20 సిరీస్‌కు సిద్దమవుతోంది. జనవరి 11న మొహాలీ వేదికగా జరగనున్న తొలి టీ20తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ కోసం ఇరు దేశాల క్రికెట్ సెలక్షన్ కమిటీలు తమ జట్లను ప్రకటించాయి. చదవండి: IND Vs AFG: టీమిండియాలో ఛాన్స్ కొట్టేశాడు.. కట్ చేస్తే! అక్కడ 6 వికెట్లతో అదుర్స్ -
ఏం జరిగిందో చూశారు కదా.. నోరుపారేసుకోవడం ఆపితే మంచిది: రోహిత్
2024 ఏడాదిని విజయంతో టీమిండియా ఆరంభించింది. కేప్‌టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన భారత జట్టు కేవలం ఒకటిన్నర రోజుల్లోనే ఈ మ్యాచ్‌ను ముగించింది. దీంతో రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. 79 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ మ్యాచ్‌కు వేదికైన కేప్‌టౌన్ పిచ్‌పై ప్రస్తుతం క్రికెట్ వర్గాలపై తెగ చర్చనడుస్తోంది. ఈ పిచ్‌పై పేసర్లు అద్బుతాలు సృష్టించారు. ఒకటిన్నర రోజుల్లోనే 33 వికెట్లు నేలకూలాయి. టెస్ట్ క్రికెట్ చరిత్రలో బంతుల పరంగా అత్యంత వేగంగా ముగిసిన మ్యాచ్‌గా కేప్‌టౌన్ టెస్టు రికార్డులకెక్కింది. మ్యాచ్ అనంతరం ఇదే విషయంపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. భారత్ పిచ్‌లపై విమర్శలు చేసే వారికి రోహిత్ గట్టి కౌంటరిచ్చాడు. "ఇది కూడా క్రికెట్ పిచే కదా. ఆడింది మ్యాచే కదా! మ్యాచ్ రిఫరీలకు, ఐసీసీకి ఏం జరిగిందొ కనబడిందనే అనుకుంటున్నా. మరి దీనికేం రేటింగ్ ఇస్తారు? భారత్‌లో ప్రపంచకప్ ఫైనల్ కోసం తయారు చేసిన పిచ్‌పై ఓ బ్యాటర్ సెంచరీ చేసినా దానికి ‘యావరేజ్’ రేటింగ్ ఇస్తారు. ఇవేం ద్వంద్వ ప్రమాణాలు మరి! ఐసీసీ గానీ, రిఫరీలు గానీ తటస్థంగా ఉండాలి. కేప్‌టౌన్‌లో ఏం జరిగిందో అందరూ చూశారు. పిచ్ ఎలా ఉందో అందరికీ తెలుసు. నిజాయితీగా చెబుతున్నా... ఇలాంటి పిచ్‌లపై ఆడేందుకు నాకైతే ఎలాంటి ఇబ్బందులు లేవు. అలాగే విదేశీ జట్లు కూడా భారత్‌కు వచ్చినప్పుడు మూడు రోజుల్లో ముగిస్తే, స్పిన్ తిరిగితే ఇవేం పిచ్‌లు, ఇదేం చెత్త అని నోరుపారేసుకోవడం ఆపితే మంచిది" అని పోస్ట్‌మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో రోహిత్ పేర్కొన్నాడు. చదవండి: Ind vs SA: దెబ్బకు దెబ్బ: రెండు రోజుల్లోనే ముగించిన టీమిండియా.. సరికొత్త చరిత్ర -
భారత్-సౌతాఫ్రికా రెండో టెస్ట్ విశేషాలు, రికార్డులు..
కేప్‌టౌన్ వేదికగా భారత్-సౌతాఫ్రికా జట్ల మధ్య జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్ పలు రికార్డులకు వేదికైంది. ఈ మ్యాచ్‌లో భారత్.. 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో సమం చేసుకుంది. దీనికి ముందు సెంచూరియన్ వేదికగా జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో సౌతాఫ్రికా ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. కేప్‌టౌన్ టెస్ట్ రికార్డులు.. 2024లో తొలి టెస్ట్ కేవలం ఒకటిన్నర రోజుల్లో ముగిసింది (నాలుగున్నర సెషన్లు) భారత్.. సౌతాఫ్రికాను కేప్‌టౌన్‌లో తొలిసారి ఓడించింది కేప్‌టౌన్‌లో టెస్ట్ మ్యాచ్ గెలిచిన తొలి ఏషియన్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ రికార్డు కేప్‌టౌన్‌లో టెస్ట్ మ్యాచ్ గెలిచిన తొలి ఏషియన్ జట్టుగా భారత్ రికార్డు ధోని తర్వాత సౌతాఫ్రికా గడ్డపై టెస్ట్ సిరీస్‌ను డ్రా చేసుకున్న రెండో కెప్టెన్‌గా హిట్‌మ్యాన్ రికార్డు అంతర్జాతీయ క్రికెట్లోకి రీఎంట్రీ తర్వాత టెస్ట్‌ల్లో సౌతాఫ్రికా అత్యల్ప స్కోర్ (55, తొలి ఇన్నింగ్స్) టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఓ జట్టు (భారత్) పరుగులేమీ (153 పరుగుల వద్ద) చేయకుండా తమ చివరి ఆరు వికెట్లు కోల్పోవడం ఇదే తొలిసారి. 2024లో తొలి సెంచరీ చేసిన ఆటగాడిగా మార్క్రమ్ రికార్డు టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా (బంతుల పరంగా) ముగిసిన టెస్ట్ మ్యాచ్ (642 బంతుల్లో) టెస్టు క్రికెట్ చరిత్రలోనే తొలి రోజు అత్యధిక వికెట్లు (23) పడిన రెండో మ్యాచ్‌గా రికార్డు. మ్యాచ్ విశేషాలు.. సిరాజ్ చెలరేగడంతో (6/15) తొలి ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికా 55 పరుగులకే కుప్పకూలింది ఒకే స్కోర్ వద్ద (153, తొలి ఇన్నింగ్స్) టీమిండియా చివరి ఆరు వికెట్లు కోల్పోయింది. కెరీర్లో తొమ్మిదో ఐదు వికెట్ల ప్రదర్శనతో (6/61) సౌతాఫ్రికా నడ్డివిరిచిన బుమ్రా సౌతాఫ్రికా తరఫున టెస్ట్‌ల్లో అత్యంత వేగవంతమైన ఆరో సెంచరీ (99 బంతుల్లో) చేసిన మార్క్రమ్ సౌతాఫ్రికా తరఫున ఓ పూర్తయిన టెస్ట్ ఇన్నింగ్స్‌లో అత్యధిక శాతం (60.22) పరుగులు చేసిన ఆటగాడిగా మార్క్రమ్ రికార్డు సౌతాఫ్రికా తాత్కలిక కెప్టెన్ డీన్ ఎల్గర్ టెస్ట్ కెరీర్ ముగిసింది ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్-సిరాజ్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్- డీన్ ఎల్గర్, బుమ్రా స్కోర్ వివరాలు.. సౌతాఫ్రికా- 55 (వెర్రిన్ 15, సిరాజ్ 6/15), 176 (మార్క్రమ్ 106, బుమ్రా 6/61) భారత్- 153 (కోహ్లి 46, ఎంగిడి 3/30), 80/3 (జైస్వాల్ 28, జన్సెన్ 1/15) 7 వికెట్ల తేడాతో భారత్ విజయం -
7 వికెట్ల తేడాతో సఫారీలను చిత్తు చేసిన భారత్
-
ఇటువంటి పిచ్‌ను నా కెరీర్లో చూడలేదు: సౌతాఫ్రికా కెప్టెన్
కేప్‌టౌన్ వేదికగా భారత్-దక్షిణాఫ్రికా మధ్య ప్రారంభమైన రెండో టెస్టు మొదటి రోజు వికెట్ల వర్షం కురిసింది. ఇరు జట్ల పేసర్ల చెలరేగడంతో ఏకంగా మొదటి రోజు 23 వికెట్లు నేలకూలాయి. మొదటి ఇన్నింగ్స్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా కేవలం 55 పరుగులకే కుప్పకూలగా.. అనంతరం టీమిండియా కూడా 153 పరుగులకే చాపచుట్టేసింది. భారత బౌలర్లలో పేసర్ మహ్మద్ సిరాజ్ 6 వికెట్లతో విజృంభించాడు. సఫారీ బౌలర్లలో బర్గర్, రబాడ, ఎంగిడీ తలా మూడు వికెట్లు పడగొట్టారు. ఇక కెరీర్లో చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్న డీన్ ఎల్గర్.. ఈ టెస్టు రెండు ఇన్నింగ్స్‌లలోనూ దారుణంగా విఫలమయ్యాడు. తొలి టెస్టులో సెంచరీతో చెలరేగిన ఎల్గర్ రెండో టెస్టులో మాత్రం 4 పరుగులు మాత్రమే చేశాడు. ఇక తొలి రోజు ఆట అనంతరం స్టార్‌స్పోర్ట్స్‌తో మాట్లాడిన ఎల్గర్ కేప్‌టౌన్ పిచ్ పరిస్థితి గురించి వివరించాడు. సెషన్ కొనసాగుతన్నకొద్దీ వికెట్ పరిస్థితి మారిపోయిందని ఎల్గర్ చెప్పుకొచ్చాడు. "సాధారణంగా న్యూలాండ్స్ పిచ్ కొంచెం స్లోగా ఉంటుంది. బ్యాటర్ కాస్త సమయం వెచ్చిస్తే క్రీజులో నిలదొక్కకోవచ్చు. అందుకే తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాను. కానీ ఈ మ్యాచ్‌లో సెషన్ కొనసాగుతున్న కొద్దీ బంతి గతిలో మార్పు కన్పించింది. అంతేకాకుండా బౌన్స్ కూడా చాలా ఎక్కవైంది. దీంతో బ్యాటర్లు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొన్నాను. అయితే పిచ్‌ను దగ్గరనుంచి చూస్తే బాగానే ఉన్నట్లు అన్పిస్తోంది. గతంలో ఎప్పుడూ ఈ వేదికలో ఇలా జరగలేదు. డొమాస్టిక్ క్రికెట్లో కూడా ఇప్పటివరకు ఇంత చెత్త గణాంకాలు నమోదు కాలేదు. ఇటువంటి పిచ్‌ను ఇప్పటివరకు నా కెరీర్లో చూడలేదు" స్టార్ స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎల్గర్ పేర్కొన్నాడు. కాగా తొలి రోజు ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 62 పరుగులు చేసింది. చదవండి: Ind Vs SA: రెండో టెస్టులో విజయం భారత్‌దే.. ఎందుకంటే?: టీమిండియా దిగ్గజం -
Ind Vs SA: ‘రెండో టెస్టులో టీమిండియాదే విజయం.. ఎందుకంటే?’
Ind Vs SA 2nd Test: సౌతాఫ్రికాతో రెండో టెస్టులో టీమిండియా కచ్చితంగా విజయం సాధిస్తుందని భారత క్రికెట్ దిగ్గజం సునిల్ గావస్కర్ ధీమా వ్యక్తం చేశాడు. తొలి రోజే ప్రొటిస్ జట్టు కీలక వికెట్లు కోల్పోయింది కాబట్టి భారత్ గెలుపు సాధ్యమవుతుందని పేర్కొన్నాడు. టీమిండియా పేసర్లు మరోసారి విజృంభించి సౌతాఫ్రికాను తక్కువ స్కోరుకే కట్టడి చేసి శుభారంభం అందిస్తే.. బ్యాటర్లు విజయ లాంఛనం పూర్తి చేయగలరని గావస్కర్ అంచనా వేశాడు. కాగా సెంచూరియన్ వేదికగా బాక్సింగ్ డే టెస్టులో ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో ఘోర పరాజయం చవిచూసిన రోహిత్ సేన.. రెండో మ్యాచ్‌లో గెలిచి ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది. సఫారీ గడ్డపై తొలిసారి సిరీస్ గెలిచే అవకాశాన్ని ఆదిలోనే చేజార్చుకున్న టీమిండియా.. కేప్‌టౌన్‌లో గెలిచి కనీసం డ్రా చేసుకోవాలనే పట్టుదలతో ఉంది. ఇందులో భాగంగా బుధవారం మొదలైన టెస్టులో టాస్ ఓడి తొలుత బౌలింగ్ చేసిన భారత్.. అనూహ్య రీతిలో సౌతాఫ్రికాను 55 పరుగులకే ఆలౌట్ చేసింది. 36 పరుగుల ఆధిక్యంలో టీమిండియా ఆ తర్వాత 153 పరుగుల వద్ద తమ తొలి ఇన్నింగ్స్ ముగించింది. అనంతరం మళ్లీ బౌలింగ్ చేసిన టీమిండియాకు మూడు వికెట్లు దక్కాయి. డీన్ ఎల్గర్ రూపంలో కీలక బ్యాటర్‌ను అవుట్ చేయగలిగింది. ఈ క్రమంలో తొలి రోజు ఆట ముగిసే సరికి సౌతాఫ్రికా 17 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 62 పరుగులు చేయగా.. టీమిండియాకు 36 పరుగుల ఆధిక్యం దక్కింది. రోహిత్ సేనదే విజయం.. ఎందుకంటే ఈ నేపథ్యంలో సునిల్ గావస్కర్ స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ.. ‘‘ఇప్పటికే సౌతాఫ్రికా మూడు వికెట్లు కోల్పోయింది. భారత్ ఇంకా ఆధిక్యంలోనే కొనసాగుతోంది. కాబట్టి మ్యాచ్ టీమిండియా చేజారిపోతుందని నేను అనుకోవడం లేదు. సౌతాఫ్రికా బ్యాటింగ్ ఆర్డర్లో మిగిలిన ఆటగాళ్లంతా కలిసి 150- 200 పరుగులు చేయడం మాత్రం కష్టమే. కాబట్టి భారత్‌కు విజయావకాశాలు ఎక్కువే. ఇన్నింగ్స్ తేడాతో విజయం దక్కకపోయినా.. మెరుగైన స్థితిలోనే ఉంటుంది’’ అని అభిప్రాయపడ్డాడు. చదవండి: Ind vs SA: అస్సలు ఊహించలేదు.. వాళ్లిద్దరి సహకారం వల్లే సాధ్యమైంది: ‘సిక్సర్’ సిరాజ్ -
ఒకే రోజు 23 వికెట్లు.. సచిన్ టెండూల్కర్ రియాక్షన్ ఇదే
కేప్‌టౌన్ వేదికగా దక్షిణాఫ్రికా-భారత్ మధ్య రెండో టెస్టు రసవత్తరంగా ప్రారంభమైంది. తొలి రోజే ఆసక్తికర మలుపులు చోటు చేసుకున్నాయి. న్యూలాండ్స్ పిచ్‌పై ఇరు జట్ల పేసర్లు నిప్పులు చేరిగారు. ఫలితంగా మొదటి రోజే ఏకంగా 23 వికెట్లు నేలకూలాయి. తొలి ఇన్నింగ్స్‌లో మొదట బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా.. టీమిండియా పేసర్ సిరాజ్ దాటికి కేవలం 55 పరుగులకే కుప్పకూలింది. సిరాజ్ 6 వికెట్లతో చెలరేగగా.. బుమ్రా, ముఖేస్ కుమార్ తలా రెండు వికెట్లతో తమ వంతు పాత్ర పోషించారు. ఆ తర్వాత తమ తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన టీమిండియాది కూడా అదే తీరు. ఒక దశలో స్కోరు 153/4 వద్ద పటిష్ట స్ధితిలో నిలిచింది. దీంతో తొలి రోజును భారీ అధిక్యంతో భారత్ ముగిస్తుందని అభిమానులంతా భావించారు. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ చేసుకుంది. చివరి 11 బంతుల్లో ఒక్క పరుగు కూడా తీయకుండా జట్టు 6 వికెట్లు కోల్పోయింది. దీంతో భారత్ ఇన్నింగ్స్ అదే స్కోరు వద్ద టీమిండియా ఆలౌటైంది. సచిన్ రియాక్షన్ ఇదే.. ఇక ఒకే రోజులో 23 వికెట్లు కోల్పోవడంపై భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ స్పందించాడు. "ఒకే రోజు 23 వికెట్లతో ఈ ఏడాది క్రికెట్ ఆరంభమైంది. ఇది ఇప్పటికి నేను నమ్మలేకపోతున్నాను. సౌతాఫ్రికా ఆలౌటైనప్పుడు నేను ఫ్లైట్ ఎక్కాను. నేను ఇంటికి వచ్చి టీవీలో చూస్తే దక్షిణాఫ్రికా 3 వికెట్లు కోల్పోయి బ్యాటింగ్ చేస్తోంది. నేను ఆశ్చర్యపోయాను. ఈ గ్యాప్‌లో నేను ఏమి మిస్సయ్యాను?" అని సచిన్ ఎక్స్( ట్వీట్) చేశాడు. Cricket in ‘24 begins with 23 wickets falling in a single day. Unreal! Boarded a flight when South Africa was all out, and now that I'm home, the TV shows South Africa has lost 3 wickets. What did I miss?#SAvIND — Sachin Tendulkar (@sachin_rt) January 3, 2024 -
నిప్పులు చెరిగిన టీమిండియా పేసర్లు.. సౌతాఫ్రికా చెత్త రికార్డులు
కేప్‌టౌన్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్ట్‌లో భారత పేస్ బౌలింగ్ త్రయం (సిరాజ్, బుమ్రా, ముకేశ్ కుమార్) ఉగ్రరూపం దాల్చింది. వీరి ధాటికి సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 55 పరుగులకే కుప్పకూలింది. ఆట తొలి రోజే భారత పేసర్లు సఫారీల భరతం పట్టారు. ముఖ్యంగా సిరాజ్ (9-3-15-6) నిప్పులు చెరిగే బంతులతో సౌతాఫ్రికా పతనాన్ని శాశించాడు. సిరాజ్‌కు జతగా ముకేశ్ కుమార్ (2.2-2-0-2), బుమ్రా (8-1-25-2) కూడా విజృంభించడంతో సౌతాఫ్రికా అత్యల్ప స్కోర్‌కు పరిమితం కావడంతో పలు చెత్త రికార్డులను మూటగట్టుకుంది. క్రికెట్లోకి రీఎంట్రీ ఇచ్చాక సౌతాఫ్రికాకు టెస్ట్‌ల్లో ఇదే అత్యల్ప స్కోర్ కాగా.. టెస్ట్‌ల్లో భారత్‌పై ఏ ప్రత్యర్ధికైనా ఇదే అత్యల్ప స్కోర్‌గా నిలిచింది. ఈ మ్యాచ్‌లో సిరాజ్ నమోదు చేసిన గణాంకాలు సైతం రికార్డుల్లోకెక్కాయి. అతి తక్కువ పరుగులు సమర్పించుకుని ఐదు వికెట్ల ఘనత సాధించిన భారత బౌలర్ల జాబితాలో సిరాజ్ నాలుగో స్థానాన్ని (6/15) సాధించాడు. ఈ జాబితాలో బుమ్రా (5/7) టాప్‌లో ఉండగా.. వెంకటపతి రాజు (6/12), హర్భజన్ సింగ్ (5/13) ఆతర్వాతి స్థానాల్లో నిలిచారు. అలాగే ఈ ప్రదర్శనతో సిరాజ్ మరో రికార్డుల జాబితాలోనూ చోటు దక్కించుకున్నాడు. సౌతాఫ్రికా గడ్డపై అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన భారత బౌలర్ల జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో శార్దూల్ ఠాకూర్ (7/61) టాప్‌లో ఉండగా.. హర్బజన్ సింగ్ (7/120) ఆతర్వాతి స్థానంలో నిలిచాడు. సౌతాఫ్రికా 55 పరుగులకే ఆలౌట్ కావడంతో కేప్‌టౌన్ సైతం రికార్డుల్లోకెక్కింది. టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు 36 సందర్భాల్లో ఆయా జట్టు 55 అంతకంటే తక్కువ స్కోర్లకు ఆలౌట్ కాగా.. అత్యధిక సందర్బాల్లో (7) కేప్‌టౌన్‌లోనే ఈ చెత్త రికార్డులు నమోదయ్యాయి. కేప్‌టౌన్ తర్వాత అత్యధికంగా ఆరుసార్లు ఆయా జట్లు 55 అంతకంటే తక్కువ స్కోర్లను లార్డ్స్ మైదానంలో చేశాయి. సౌతాఫ్రికా ఇన్నింగ్స్ విషయానికొస్తే.. బెడింగ్హమ్ (12), వెర్రిన్ (15) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. మార్క్రమ్ 2, కెరీర్లో చివరి టెస్ట్ ఆడుతున్న సౌతాఫ్రికా తాత్కాలిక కెప్టెన్ డీన్ ఎల్గర్ 4, టోనీ జార్జీ 2, ట్రిస్టన్ స్టబ్స్ 3, మార్కో జన్సెన్ 0, కేశవ్ మహారాజ్ 3, రబాడ 5, నండ్రే బర్గర్ 4 పరుగులు చేశారు. కాగా, రెండు మ్యాచ్‌ల ఈ టెస్ట్ సిరీస్‌లో సౌతాఫ్రికా తొలి మ్యాచ్‌లో గెలుపొందిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్‌లో ప్రోటీస్ ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో విజయం సాధించింది. -
ఆరు వికెట్లతో చెలరేగిన సిరాజ్: 55 పరుగులకే సౌతాఫ్రికా ఆలౌట్
South Africa Vs India 2nd Test 2024 Day 1 Updates- కేప్‌టౌన్: రెండో టెస్టులో భారత పేసర్ల విజృంభణతో సౌతాఫ్రికా 55 పరుగులకే కుప్పకూలింది. బుధవారం నాటి మ్యాచ్‌లో తొలి రోజు ఆట తొలి సెషన్లో 23.2 ఓవర్లలోనే ఆలౌట్ అయి తొలి ఇన్నింగ్స్ ముగించింది. ప్రొటిస్ బ్యాటర్లలో వికెట్ కీపర్ కైల్ వెరెనె 15 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవడం విశేషం. టీమిండియా బౌలర్లలో మహ్మద్ సిరాజ్ అత్యధికంగా ఆరు వికెట్లు తీయగా.. బుమ్రాకు రెండు, ముకేశ్ కుమార్‌కు రెండు వికెట్లు దక్కాయి. మరో పేసర్ ప్రసిద్ కృష్ణ 4 ఓవర్ల బౌలింగ్‌లో పది పరుగులు మాత్రమే ఇచ్చి పొదుపుగానే బౌలింగ్ చేశాడు. Double breakthrough for #TeamIndia!@mdsirajofficial is breathing 🔥 this morning & bags a -fer in just his 8th over! A sensational spell leaves #SouthAfrica reeling! Tune in to #SAvIND 2nd Test LIVE NOW | Star Sports Network#Cricket pic.twitter.com/hpzR8g9wLH — Star Sports (@StarSportsIndia) January 3, 2024 22.6: తొమ్మిదో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా బుమ్రా బౌలింగ్‌లో యశస్వి జైస్వాల్‌కు క్యాచ్ ఇచ్చి నండ్రే బర్గర్(4) పెవిలియన్ చేరాడు. స్కోరు: 55-9(23) 21: హాఫ్ సెంచరీ మార్కు అందుకున్న సౌతాఫ్రికా.. స్కోరు: 50-8 ఎనిమిదో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా 19.6: ముకేశ్ కుమార్ బౌలింగ్‌లో బుమ్రాకు క్యాచ్ ఇచ్చి ఔటైన కేశవ్ మహరాజ్(3). సౌతాఫ్రికా స్కోరు: 46-8(20) 17.5: ఏడో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా సిరాజ్ బౌలింగ్‌లో శుబ్‌మన్ గిల్‌కు క్యాచ్ ఇచ్చి వెరెనె (15) ఔటయ్యాడు. అతడి రూపంలో సౌతాఫ్రికా ఏడో వికెట్ కోల్పోయింది. సిరాజ్ ఖాతాలో ఆరో వికెట్ చేరింది. సౌతాఫ్రికా స్కోరు: 45-7(18). రబడ, కేశవ్ మహరాజ్ క్రీజులో ఉన్నారు. 15.5: తిరుగులేని సిరాజ్.. ఆరో వికెట్ డౌన్ టీమిండియా పేసర్ సిరాజ్ ఒకే ఓవర్లో రెండు వికెట్లతో సత్తా చాటాడు. పదహారో ఓవర్ రెండో బంతికి బెడింగ్హాం(12)ను పెవిలియన్‌కు పంపిన ఈ హైదరాబాదీ బౌలర్.. ఐదో బంతికి మార్కో జాన్సెన్(0) రూపంలో మరో వికెట్ దక్కించుకున్నాడు. మొత్తంగా ఇప్పటి వరకు ఐదు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. కేశవ్ మహరాజ్, వెరెనె క్రీజులో ఉన్నారు. సౌతాఫ్రికా స్కోరు: 34-6(16) మరోసారి మ్యాజిక్ చేసిన సిరాజ్ 15.2: కేప్‌టౌన్ టెస్టులో టీమిండియా స్పీడ్‌స్టర్ మహ్మద్ సిరాజ్ ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. ఇప్పటికే మార్క్రమ్, ఎల్గర్, జోర్జి రూపంలో మూడు వికెట్లు తీసిన తాజాగా నాలుగో వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. మంచి లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేసి డేవిడ్ బెడింగ్హాంను ఔట్ చేశాడు. తద్వారా సౌతాఫ్రికా ఐదో వికెట్ కోల్పోయింది. ఇక అంతకు ముందు బుమ్రా ట్రిస్టన్ స్టబ్స్‌ను అవుట్ చేసిన విషయం తెలిసిందే. 11 ఓవర్లు ముగిసే సరికి సౌతాఫ్రికా స్కోరు: 23-4 బెడింగ్హామ్ 8, వెరెనె సున్నా పరుగులతో క్రీజులో ఉన్నారు. నిప్పులు చెరుగుతున్న సిరాజ్.. 15 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన సౌతాఫ్రికా హైదరాబాదీ పేసర్ మహమ్మద్ సిరాజ్ నిప్పులు చెరుగుతున్నాడు. అతడి ధాటికి సౌతాఫ్రికా 15 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. 15 పరుగుల వద్ద డి జార్జీ (2) ఔటయ్యాడు. నాలుగు వికెట్లు కోల్పోయిన సౌతాఫ్రికా 9.2: సిరాజ్బౌలింగ్లో 2 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద టోనీ డీ జోర్జీ ఔట్ 8.3: బుమ్రా బౌలింగ్‌లో మూడో వికెట్‌గా వెనుదిరిగిన ట్రిస్టన్ స్టబ్స్ ►రెండో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా.. కెప్టెన్ ఔట్ ►సౌతాఫ్రికాతో రెండో టెస్టులో భారత్ బౌలర్ సిరాజ్ నిప్పులు చెరుగుతున్నాడు. ►ఇన్నింగ్స్ ఐదో ఓవర్లో సౌతాఫ్రికా కెప్టెన్ డీన్ ఎల్గర్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. మొదటి మ్యాచ్‌లో సెంచరీలో రాణించిన ఎల్గర్ ఈ ఇన్నింగ్స్‌లో 4(15) పరుగులు చేసి ఔటయ్యాడు. తొలి వికెట్ డౌన్ ►ఫస్ట్ వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా.. ►సిరాజ్ వేసిన రెండో ఓవర్లో మార్క్రమ్2(10) ఔట్ ►టీమిండియాతో రెండో టెస్టులో టాస్ గెలిచిన సౌతాఫ్రికా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. తెంబా బవుమా గాయం కారణంగా దూరమైన నేపథ్యంలో అతడి స్థానంలో డీన్ ఎల్గర్ సౌతాఫ్రికా కెప్టెన్‌గా బరిలోకి దిగాడు. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకోవడమే తమ లక్ష్యమని టాస్ సందర్భంగా పేర్కొన్నాడు. ఎల్గర్‌కు ఆఖరి టెస్టు పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలిస్తుంది కాబట్టే తొలుత బ్యాట్‌తో రంగంలోకి దిగాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించాడు. తొలి టెస్టులో గెలిచాం కాబట్టి కేప్‌టౌన్‌లో తాము ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా ఆడగలమని ఎల్గర్ పేర్కొన్నాడు. గాయాల కారణంగా జట్టుకు దూరమైన బవుమా స్థానంలో ట్రిస్టన్ స్టబ్స్, గెరాల్డ్ కోయెట్జీ స్థానంలో లుంగి ఎంగిడిని రెండో టెస్టులో ఆడిస్తున్నట్లు ఎల్గర్ తెలిపాడు. కాగా వెటరన్ ఓపెనర్ డీన్ ఎల్గర్ కెరీర్లో ఇదే ఆఖరి టెస్టు కావడం విశేషం. అశ్విన్, శార్దూల్ అవుట్ ఇక ఇప్పటికే బాక్సింగ్ డే టెస్టులో ఓటమి పాలైన రోహిత్ సేన.. రెండో మ్యాచ్‌లో రెండు మార్పులతో బరిలోకి దిగింది. స్పిన్ ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ స్థానంలో రవీంద్ర జడేజా, పేసర్ శార్దూల్ ఠాకూర్ స్థానంలో ముకేశ్ కుమార్ తుదిజట్టులో చోటు దక్కించుకున్నారు. సౌతాఫ్రికా వర్సెస్ ఇండియా రెండో టెస్టు తుదిజట్లు ఇవే సౌతాఫ్రికా ప్లేయింగ్ ఎలెవన్ డీన్ ఎల్గర్ (కెప్టెన్), ఐడెన్ మార్క్రమ్, టోనీ డి జోర్జీ, ట్రిస్టన్ స్టబ్స్, డేవిడ్ బెడింగ్హామ్, కైల్ వెర్రెన్నె(వికెట్ కీపర్), మార్కో జాన్సెన్, కేశవ్ మహారాజ్, కగిసో రబాడ, నండ్రే బర్గర్, లుంగి ఎంగిడి. టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ రోహిత్ శర్మ(కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ, ముకేష్ కుమార్. చదవండి: T20 WC 2024: రోహిత్, కోహ్లి విషయంలో బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అగార్కర్ కీలక నిర్ణయం! -
ప్రొటిస్ బ్యాటింగ్ ఆర్డర్ బలహీనం: భారత్ గెలవాలంటే అదొక్కటే మార్గం
South Africa vs India, 2nd Test : సౌతాఫ్రికాతో రెండో టెస్టులో టీమిండియా గెలుపు అవకాశాలపై భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గత మ్యాచ్ సెంచరీ హీరో డీన్ ఎల్గర్‌ను తొందరగా అవుట్ చేస్తే రోహిత్ సేన పని సులువు అవుతుందని పేర్కొన్నాడు. కేప్‌టౌన్‌లో ఎల్గర్ కేవలం బ్యాటర్‌గా మాత్రమే కాకుండా కెప్టెన్‌గానూ బరిలోకి దిగుతున్న కారణంగా అతడిపై సహజంగానే ఒత్తిడి ఉంటుందన్న ఈ మాజీ ఓపెనర్.. టీమిండియా బౌలర్లు దీనిని తమకు అనుకూలంగా మార్చుకోవాలని సూచించాడు. ఎల్గర్‌ను పెవిలియన్‌కు పంపితే సౌతాఫ్రికా బ్యాటింగ్ ఆర్డర్‌ను కుప్పకూల్చడం కష్టమేమీ కాబోదని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. కేప్‌టౌన్‌లో అంత ఈజీ కాదు కాగా సౌతాఫ్రికాతో రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా బాక్సింగ్ డే టెస్టులో ఓడిన టీమిండియా కేప్‌టౌన్‌లో గెలిచి సిరీస్ సమం చేయాలని భావిస్తోంది. అయితే, సీమర్లకు స్వర్గధామమైన న్యూల్యాండ్స్ పిచ్‌పై ఆతిథ్య జట్టు బౌలర్లు మరోసారి చెలరేగడం ఖాయంగా కనిపిస్తోంది. ఇలాంటి తరుణంలో రోహిత్ సేన ఎలాంటి ప్రణాళికలు అమలు చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. కెప్టెన్ కాబట్టి ఒత్తిడి సహజం ఈ నేపథ్యంలో ఆకాశ్ చోప్రా కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘డీన్ ఎల్గర్ కెరీర్లో ఇది ఆఖరి టెస్టు. తెంబా బవుమా జట్టుతో లేడు కాబట్టి ఎల్గర్ కెప్టెన్‌గా వ్యవహరించబోతున్నాడు. ఇప్పుడు తన దృష్టి మొత్తం కేవలం రన్స్ తీయడం కాకుండా.. ట్రోఫీ గెలవడం పైనే ఉందని ఇప్పటికే ఎల్గర్ స్పష్టం చేశాడు. కాబట్టి అతడిపై ఒత్తిడి ఉండటం సహజం. నా దృష్టిలో అయితే.. సౌతాఫ్రికా బ్యాటింగ్ ఆర్డర్ బలహీనంగానే ఉంది. డీన్ ఎల్గర్ బ్యాటింగ్ కూడా సాధారణంగానే ఉంది. అయితే, అతడిని అవుట్ చేయడం అంత తేలికేమీ కాదు. ఒక్కసారి ఎల్గర్‌ను పెవిలియన్‌కు పంపితే మాత్రం మిగతా బ్యాటర్లు కూడా క్యూ కట్టడం ఖాయం’’ అని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. కేశవ్ మహరాజ్‌ను ఆడిస్తారు! అదే విధంగా.. పేసర్ గెరాల్డ్ కోయెట్జీ గాయపడటం సౌతాఫ్రికాకు ఎదురుదెబ్బేనన్న ఆకాశ్ చోప్రా.. అతడి స్థానంలో లుంగీ ఎంగిడీ జట్టులోకి వచ్చే అవకాశం లేదన్నాడు. ఎంగిడి దాదాపు ఏడాది కాలంగా ఫస్ట్ క్లాస్ క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు కాబట్టి మేనేజ్మెంట్ అతడి వైపు మొగ్గు చూపకపోవచ్చని అభిప్రాయపడ్డాడు. స్పిన్నర్ కేశవ్ మహరాజ్‌ను రెండో టెస్టులో ఆడించే అవకాశాలు ఉన్నాయని ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు. చదవండి: T20 WC 2024: రోహిత్, కోహ్లి విషయంలో బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అగార్కర్ కీలక నిర్ణయం! -
కేప్‌టౌన్‌లో అంత ఈజీ కాదు.. ఇక్కడ సెంచరీలు చేసింది నలుగురే..!
రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా టీమిండియా రేపటి నుంచి (జనవరి 3) సౌతాఫ్రికాతో రెండో టెస్ట్‌లో తలపడనుంది. ఈ మ్యాచ్ కేప్‌టౌన్‌లోని న్యూల్యాండ్స్ మైదానం వేదికగా జరుగనుంది. ఈ పిచ్‌పై భారత్‌కు చెప్పుకోదగ్గ ట్రాక్ రికార్డు లేకపోవడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అసలే తొలి టెస్ట్‌లో ఓడిపోయి సిరీస్ కోల్పోయే ప్రమాదంలో ఉన్న టీమిండియా ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి పరువు దక్కించుకోవాలని పట్టుదలగా ఉంది. అయితే న్యూల్యాండ్స్‌లో టీమిండియా ట్రాక్ రికార్డు ప్రస్తుతం అందరినీ కలవరపెడుతుంది. ఈ మైదానంలో భారత్ ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. ఇక్కడ ఇరు జట్ల మధ్య మొత్తం ఆరు మ్యాచ్‌లు జరగగా.. నాలుగింట గెలిచిన సౌతాఫ్రికా, రెండింటిని డ్రా చేసుకుంది. ఇరు జట్ల మధ్య చివరిసారిగా (2022, జనవరి 11-14) ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు టీమిండియాను 7 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. 1993, 2011లో జరిగిన మ్యాచ్‌లు డ్రా కాగా.. 1997, 2007, 2018, 2022 సిరీస్‌ల్లో ఇక్కడ జరిగిన మ్యాచ్‌లను సౌతాఫ్రికా గెలిచింది. న్యూల్యాండ్స్ పిచ్ ఆనవాయితీగా పేసర్లకు స్వర్గధామంగా ఉంటూ వస్తుంది. ఇక్కడ బ్యాటింగ్ చేసేందుకు దిగ్గజాలు సైతం వణికిపోతారు. ఈ మైదానంలో ఇప్పటివరకు కేవలం నలుగురు భారత క్రికెటర్లు మాత్రమే సెంచరీలు చేయగలిగారు. సచిన్ టెండూల్కర్ రెండుసార్లు.. మొహమ్మద్ అజారుద్దీన్, వసీం జాఫర్, రిషబ్ పంత్ తలో సారి న్యూల్యాండ్స్ పిచ్‌పై సెంచరీ మార్కును తాకారు. ఇక్కడ టీమిండియా అత్యధిక స్కోర్ 414గా ఉంది. 2007 సిరీస్‌లో భారత్ ఈ స్కోర్‌ను చేసింది. ఈ పిచ్‌పై టీమిండియా తరఫున అత్యధిక పరుగులు చేసిన రికార్డు సచిన్ పేరిట ఉంది. సచిన్ ఇక్కడ నాలుగు మ్యాచ్‌ల్లో ఏడు ఇన్నింగ్స్‌లు ఆడి 489 పరుగులు చేశాడు. ఇక్కడ భారత్ తరఫున అత్యధిక స్కోర్ (169) కూడా సచిన్ పేరిటే ఉంది. కాగా, ప్రస్తుత సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి టెస్ట్‌లో టీమిండియా ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్న విషయం తెలిసిందే. -
IND VS SA 2nd Test: అరుదైన రికార్డుపై కన్నేసిన బుమ్రా
కేప్‌టౌన్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగబోయే రెండో టెస్ట్‌కు ముందు టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రాను ఓ అరుదైన రికార్డు ఊరిస్తుంది. ఈ మ్యాచ్‌లో బుమ్రా మరో ఏడు వికెట్లు తీస్తే.. కేప్‌టౌన్‌లో అత్యధిక వికెట్లు తీసిన విజిటింగ్ బౌలర్‌గా (యాక్టివ్ బౌలర్లలో) రికార్డుల్లోకెక్కుతాడు. ఈ వేదికపై బుమ్రా ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లో 10 వికెట్లు పడగొట్టాడు. జనవరి 3 నుంచి ప్రారంభంకాబోయే మ్యాచ్‌లో అతను మరో ఏడు వికెట్లు తీస్తే ఇంగ్లండ్ వెటరన్ జేమ్స్ ఆండర్సన్ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొడతాడు. కేప్‌టౌన్‌లో ఆండర్సన్ అందరి కంటే ఎక్కువగా (యాక్టివ్ బౌలర్లలో) 16 వికెట్లు పడగొట్టాడు. ఓవరాల్‌గా కేప్‌టౌన్ పిచ్‌పై అత్యధిక వికెట్లు తీసిన పర్యాటక బౌలర్ రికార్డు ఇంగ్లండ్‌కు చెందిన కొలిన్ బ్లైత్ (25 వికెట్లు) పేరిట ఉంది. కేప్‌టౌన్ టెస్ట్‌లో బుమ్రా మరో మూడు వికెట్లు తీసినా మరో రికార్డు అతని ఖాతాలో వచ్చిపడుతుంది. ఈ మ్యాచ్‌లో అతను మూడు వికెట్లు తీస్తే.. కేప్‌టౌన్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా రికార్డుల్లోకెక్కుతాడు. ఈ రికార్డు మాజీ పేసర్ జవగల్ శ్రీనాథ్ (12 వికెట్లు) పేరిట ఉంది. కేప్‌టౌన్‌తో బుమ్రాకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. సరిగ్గా ఐదేళ్ల క్రితం (2018) అతను ఇక్కడే తన టెస్ట్ అరంగేట్రం చేశాడు. దీంతో ఈ మ్యాచ్‌లో బుమ్రాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఓవరాల్‌గా బుమ్రా తన టెస్ట్ కెరీర్లో 31 మ్యాచ్‌లు ఆడి 21.84 సగటున 132 వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుత పర్యటనలో భాగంగా సెంచూరియన్ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లోనూ బుమ్రా సత్తా చాటాడు. ఆ మ్యాచ్‌లో అతను 4 వికెట్లు పడగొట్టాడు. ఇదిలా ఉంటే, రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి టెస్ట్‌లో టీమిండియా ఇన్నింగ్స్ 32 పరుగుల భారీ తేడాతో పరాజయంపాలైన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ (తొలి ఇన్నింగ్స్‌లో 101), విరాట్ కోహ్లి (సెకెండ్ ఇన్నింగ్స్‌లో 76), జస్ప్రీత్ బుమ్రా (4/69) మినహా భారత ఆటగాళ్లంతా దారుణంగా విఫలమయ్యారు. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. తొలి ఇన్నింగ్స్‌లో 245, సెకెండ్ ఇన్నింగ్స్‌లో 131 పరుగులకే కుప్పకూలగా.. సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్ మాత్రమే బ్యాటింగ్ చేసి 408 పరుగుల భారీ స్కోర్ చేసింది. నిర్ణయాత్మకమైన రెండో టెస్ట్‌లో గెలిచి సిరీస్ కోల్పోయే ప్రమాదం నుంచి తప్పించుకోవాలని టీమిండియా పట్టుదలగా ఉంది. -
సౌతాఫ్రికాతో రెండో టెస్టు.. టీమిండియాను భయపెడుతున్న రికార్డులు!
కేప్‌టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో రెండో టెస్టులో తలపడేందుకు టీమిండియా సిద్దమవుతోంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్‌ను కాపాడుకోవాలని భారత జట్టు భావిస్తోంది. ఈ మ్యాచ్ కోసం రోహిత్ సేన నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తోంది. అయితే ఈ మ్యాచ్‌కు ముందు కేప్‌టౌన్‌లోని రికార్డులు భారత జట్టును భయపెడుతున్నాయి. కేప్‌టౌన్‌లోని న్యూల్యాండ్స్ క్రికెట్ స్టేడియంలో టీమిండియా టెస్టు రికార్డు మరి దారుణంగా ఉంది. న్యూలాండ్స్‌లో భారత్ రికార్డులు ఇవే.. ►ఇప్పటివరకు కేప్‌టౌన్‌లో ఆరు టెస్టు మ్యాచ్‌లు ఆడిన భారత్.. ఒక్క మ్యాచ్‌లో భారత్ విజయం సాధించలేదు. 4 మ్యాచ్‌లలో భారత్ ఓటమి పాలవ్వగా.. రెండు సార్లు డ్రా ముగిచింది. ఈ వేదికలో 1993లో భారత్ తొలి టెస్టు మ్యాచ్ ఆడింది. ►ఈ స్టేడియంలో టీమిండియా అత్యధిక అత్యధిక స్కోర్ 414 పరుగులగా ఉంది. 2007లో ప్రోటీస్‌తో జరిగిన మ్యాచ్‌లో 131.1 ఓవర్లలో 414 పరుగులకు ఆలౌటైంది. ►ఈ వేదికలో భారత జట్టు అత్యల్ప స్కోర్ 135గా ఉంది. 2018లో సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో 42.4 ఓవర్లలో 135 పరుగులకు టీమిండియా ఆలౌటైంది. ►న్యూలాండ్స్ స్టేడియంలో అత్యధిక పరుగులు చేసిన రికార్డు భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది. ఈ వేదికలో నాలుగు టెస్టులు ఆడిన సచిన్ 489 పరుగులు సాధించాడు. ►అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా మాజీ పేసర్ జవగల్ శ్రీనాథ్ ఉన్నాడు. రెండు టెస్టులు ఆడిన శ్రీనాథ్ 12 వికెట్లు పడగొట్టాడు. ►అత్యధిక సిక్స్‌లు కొట్టిన రికార్డు టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్(4) పేరిట ఉంది. చదవండి: 2024 ఏడాదిలో టీమిండియా షెడ్యూల్ ఇదే.. ఈ సారైనా కల నెరవేరేనా? -
విధివంచితురాలి యథార్థ గాధ: ఆమె శరీర భాగాలను గొడుగు మొనలతో పొడిచి..
మా చిన్నతనంలో చెంచులో.. మరెవరో.. నల్లమల అడవుల నుంచి ఎలుగుబంట్ల ముక్కుకు తాడు కట్టి తీసుకుని వచ్చేవారు. ఆ జీవి చుట్టూ జనం మూగేవారు. దాని వీపుపై తమ పిల్లలను సవారీ చేయించేవారు. దానిని తడిమేవారు, తట్టేవారు. అల్లరి మనుషులు కొందరు కర్ర పుల్లతో పొడిచేవారు, మరి కొంతమంది ఆ ఎలుగ్గొడ్డు వెంట్రుకలను పీక్కునేవారు. ఆ వెంట్రుకలను దారంగా పేనుకుని కాలి బ్రోటన వేలుకు కట్టుకుంటే శుభమని భావించేవారు. లేదా దాని యజమానికి కాసిన్ని డబ్బులు ఇచ్చి అతనితోనే దాని వెంట్రుకలను పీకించే వారు. Duniyaa banaane wale, kyaa tere man me samaai ? Kaaheko duniyaa banaai? అని ఆడుగుతారు కవి శైలేంద్ర ఒక పాటలో. ఈ పాట తెలిసిన వాళ్ళే కాదు, తెలీని వాళ్ళు కూడా భగవంతుడిని ఈ మాట అడిగే ఉంటారు తమ తమ మూగభాషలో. ఒక విధివంచితురాలి యథార్థ గాధ 20 ఏళ్ల సారా బార్ట్‌మాన్ 1810లో బతుకు తెరువు కోసమన్న తలంపుతో కేప్‌టౌన్ నుంచి లండన్‌కు బయలుదేరడానికి పడవ ఎక్కినప్పుడు, ఆమె ఇక తన ఇంటిని మళ్లీ చూడదని ఆమెకు తెలియదు. అక్కడి గాలిని, అక్కడి గడ్డిని, అక్కడి సూర్యుడి వెలుతురును ఇక తన జీవితకాలంలో మరెప్పుడు తాకలేదని ఆవిడకు తెలీదు. మా ప్రాంతాల ఎలుగుబంటి కన్నా అన్యాయమైన జీవితం ఆవిడకు సంప్రాప్తించినపుడు ఆవిడ పదే పదే అదే ప్రశ్న భగవంతుడిని అడుగుతూ ఉండి ఉండవచ్చు. మా ఊరి ఎలుగు బంటిని నేను బోనులో చూడలేదు. కానీ మనిషి పుట్టుక పుట్టిన సారా బార్ట్మన్ని బోనులో నుండి బయటకు లాగేవారు. ధృఢమైన ఎలుగు శరీరాన్ని జనం పుల్లలతో తాకేవారు. సారా శరీరాన్ని, ఆవిడ వంటిని, ఆవిడ శరీర భాగాలను ఆడా మగ, పిల్లా జెల్లా, ముసలీ ముతక ప్రేక్షకులు అంతా తాకేవారు, గొడుగు మొనలతో పొడిచి పొడిచి పులకించి పోయేవారు. ఎలుగుబంటి వెంట్రుకలతో తమ ధైర్య సాహాసాలని పెంచుకోవడానికి చూశారు. సారా బార్ట్‌మన్ శరీరాంగాలను చూసుకుంటూ లండన్ సభ్య సమాజం, ఇంగ్లీష్ నాగరిక ప్రపంచం ప్రేరేపణలో మునిగి తేలారు. అచ్చు ఎలుగుబంటి మీద స్వారీ చేసినట్లు నల్ల పిల్ల, అఫ్రికా అమ్మాయి సారాబార్ట్మన్ మీద ఊరేగింది మానవజాతి. దునియా బనానే వాలే, క్యా తేరే మన్ మే సమాయి? కాహికో దునియా బనాయి తూనే, కాహికో దునియా బనాయి? మనుష్యులు కాదు.. రాక్షసులు ఇరవై ఆరు సంవత్సరాల వయస్సులో మానవ ఉన్మాద హింసతో మరణించింది సారా బార్ట్‌మన్. మరణించినా ఆమె శరీరాన్ని విడిచిపెట్టలేదు జాత్యహంకారం. 1815 నుండి ఆమె మెదడు, ఆమె తాలూకు శరీర తోలు తిత్తి బొమ్మ , ఆమె శరీర భాగాలను 1974 వరకు పారిస్ మ్యూజియంలో ప్రదర్శనలో పెట్టారు. సారా బార్ట్‌మన్ జీవితాన్ని 2010 బ్లాక్ వీనస్ అనే సినిమాగా తీశారు. సున్నిత మనస్కులు, మానవ జాతి మీద ప్రేమ, గౌరవం, ఔన్నత్యం కలవారు ఎవరూ ఈ సినిమా భరించలేరు. -అన్వర్, ఆర్టిస్ట్, సాక్షి. 'మానవ జూ'ల ఏర్పాటులో భాగంగా యూరోపియన్ సమాజం సారా బార్ట్‌మన్ పట్ల వ్యవహరించిన తీరు అమానుషం. 1789లో జన్మించిన ఆమెను యూరప్‌లో దేశాల్లోని జాతరల్లో ప్రేక్షకుల ముందు ప్రదర్శించేవాళ్లు. 1815లో ఆమె చనిపోయారు. అయినప్పటికీ సారా అస్తిపంజరం, మెదడు సహా లైంగిక అవయవాలను పారిస్‌లోని ఓ మ్యూజియంలో 1974 వరకూ ప్రదర్శించినట్లు చరిత్ర చెబుతోంది. ఇక 2002లో సారా అవశేషాలను తిరిగి సౌతాఫ్రికాకు అప్పగించినట్లు కథనాలు ఉన్నాయి. చదవండి: Neena Rao: బిడ్డ మేధాశక్తిని గ్రహించండి! బిడ్డకు ఏమివ్వాలో తెలుసుకోండి.. -
వీడియో వైరల్: వాహ్.. వాటే క్యాచ్.. ఆల్ టైం గ్రేట్ క్యాచ్!
అప్పుడప్పుడూ క్రికెట్లో అసాధారణ విన్యాసాలు చూస్తూ ఉంటాం. బ్యాట్స్‌మెన్ అద్భుతమైన షాట్స్ కావొచ్చు.. వికెట్ కీపర్ల నైపుణ్యాలు కావొచ్చు.. ఫీల్డర్ల మెరుపు విన్యాసాలు కావొచ్చు. ఇలా ఎన్నో సూపర్మూమెంట్స్ను ఆస్వాదిస్తూ ఉంటాం. ఇలా ఒక అద్భుతమైన ఫీల్డింగ్ మూమెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మ్యాచ్ జరిగి రెండు దశాబ్దాల కావొస్తున్నా ఆ విన్యాసం మాత్రం ఇప్పటికీ వావ్ అనిపిస్తోంది. 1997లో కేప్‌టౌన్ వేదికగాభారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన టెస్టు మ్యాచ్‌లో ఒక ఫీల్డింగ్ మూమెంట్ అబ్బురపరచడమే కాదు.. ఆల్ టైమ్ టాప్-10 క్యాచెస్‌లో నిలుస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. 1997లొ కేప్‌టౌన్‌లో టెస్టు మ్యాచ్ జరగ్గా, ఆడమ్ బాచెర్ ఒక క్యాచ్ అందుకున్నాడు. అది కూడా భారత దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ క్యాచ్. మెక్మిలాన్ బౌలింగ్ భారీ షాట్ ఆడబోయిన సచిన్.. ఆడమ్ మార్క్ బాచెర్ పట్టిన అద్భుతమైన క్యాచ్‌తో వెనుదిరిగాడు. ఆ షాట్‌ను కచ్చితంగా ఫోర్ వెళుతుందని ఊహించిన సచిన్.. బాచెర్ ఫీల్డింగ్ విన్యాసంతో ఆశ్చర్యానికి గురవ్వడమే కాకుండా భారంగా పెవిలియన్ వీడాడు. బంతి గాల్లో ఉండగానే దాన్ని వెంటాడిన బాచెర్.. ఒంటి చేత్తో అందుకుని శభాష్ అనిపించాడు. నేడు(అక్టోబర్ 29వ తేదీ) మార్క్ బాచెర్ బర్త్ డే సందర్భంగా ఈ క్యాచ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. క్రికెట్ సుప్రిమో ఆలీ బాచెర్ మేనల్లుడే మార్క్ బాచెర్. ఆనాటి మ్యాచ్ సదరు ఇన్నింగ్స్‌లో సచిన్ 169 పరుగులు చేశాడు. Happy Birthday Adam Bacher 🇿🇦. The nephew of cricket supremo Ali Bacher. Played 19 Tests & Scored 833 with 96 His top Score One of Best Catch he Taken in 90s of @sachin_rt in Cape Town 1997 & even this catch should in all time top 10 catches. pic.twitter.com/20eEI0gnwV— Zohaib (Cricket King) 🏏 (@Zohaib1981) October 29, 2022 -
Aus Vs SA: ‘మేమే కాదు దక్షిణాఫ్రికా కూడా టాంపరింగ్ చేసింది’
Tim Paine- Ball Tampering- Sandpaper Scandal- సిడ్నీ: 2018లో కేప్‌టౌన్‌లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా టెస్టు సందర్భంగా జరిగిన ‘బాల్ టాంపరింగ్’ ఉదంతం క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపర్చింది. దాంతో స్మిత్, వార్నర్, బాన్‌క్రాఫ్ట్‌లపై వేటు పడటంతో పాటు తర్వాతి మ్యాచ్‌నుంచి టిమ్ పెయిన్ ఆస్ట్రేలియాకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. అయితే నాటి ఘటనను తన పుస్తకం ‘ద పెయిడ్ ప్రైస్’లో గుర్తు చేసుకున్న పెయిన్... తామే కాదు, తర్వాతి టెస్టులో దక్షిణాఫ్రికా కూడా టాంపరింగ్ చేసిందని వ్యాఖ్యానించాడు. అయితే స్థానిక ప్రసారకర్తల సహాయంతో ఆ వీడియోను దాచేశారని అతను ఆరోపించాడు. ‘సిరీస్ నాలుగో టెస్టులో ఇది జరిగింది. దక్షిణాఫ్రికా ప్లేయర్ చేతిలో ఉన్న బంతిపై చాలా పగుళ్లు ఉన్న దృశ్యం అక్కడి భారీ స్క్రీన్‌పై కనిపించింది. కానీ ఆ వెంటనే దానిని తొలగించారు. మేం ఈ విషయంపై అంపైర్లతో మాట్లాడినా అసలు ఎవరూ పట్టించుకోలేదు’ అని పెయిన్ చెప్పాడు. బాల్ టాంపరింగ్ ఘటన సమయంలో తమ ముగ్గురు క్రికెటర్లకు ఎవరూ అండగా నిలవలేదని విషయాన్ని అతను అంగీకరించాడు. ‘సాధారణంగా ఇలాంటి సమయంలో తమ ఆటగాళ్లను సహచర క్రికెటర్లు ఆదుకోవాలి. మానసికంగా వారికి అండగా నిలవాలి. కానీ వారందరినీ వెలి వేసినట్లు చూశారు’ అని పెయిన్ చెప్పాడు. చదవండి: Ind Vs Pak: టీమిండియా మోసం చేసి గెలిచిందంటూ అక్కసు.. దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన దిగ్గజ అంపైర్ T20 WC 2022: అక్తర్, బ్రాడ్ హాగ్‌లు దొరికేశారు కదా..! -
IND vs SA 3rd Test Day 1: భారత్ 223 ఆలౌట్, దక్షిణాఫ్రికా 17/1
IND vs SA 3rd Test Updates: భారత్ 223 ఆలౌట్, దక్షిణాఫ్రికా 17/1 తొలి రోజు ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా వికెట్ నష్టానికి 17 పరుగులు చేసింది. కెప్టెన్ డీన్ ఎల్గర్(3)ను బుమ్రా ఔట్ చేశాడు. క్రీజ్‌లో మార్క్రమ్(8), కేశవ్ మహారాజ్(6) ఉన్నారు. 8: 46 PM: సఫారీ పేసర్ల విజృంభణ.. టీమిండియా 223 ఆలౌట్ దక్షిణాఫ్రికాతో జరుగుతున్న నిర్ణయాత్మక మూడో టెస్ట్‌లో టీమిండియా నిరాశపరిచింది. సఫారీ పేసర్ల ధాటికి 223 పరుగులకే చాపచుట్టేసింది. కెప్టెన్ కోహ్లి(79) ఓంటరి పోరాటం చేయడంతో గౌరవప్రదమైన స్కోర్‌ను సాధించగలిగింది. సఫారీ బౌలర్లు రబాడ 4, మార్కో జన్సెన్ 3, ఒలీవియర్, ఎంగిడి, కేశవ్ మహారాజ్ తలో వికెట్ సాధించారు. కోహ్లి(79) ఔట్.. తొమ్మిదో వికెట్ కోల్పోయిన టీమిండియా క్రీజ్‌లో పాతుకుపోయిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి(79) ఎట్టకేలకు ఔటయ్యాడు. రబాడ బౌలింగ్‌లో వెర్రిన్‌కు క్యాచ్ ఇచ్చి 211 పరుగుల వద్ద తొమ్మిదో వికెట్‌గా వెనుదిరిగాడు. క్రీజ్‌లో ఉమేశ్ యాదవ్, షమీ ఉన్నారు. టీమిండియా ఎనిమిదో వికెట్ డౌన్ డ్రింక్స్ బ్రేక్‌కు ముందు టీమిండియాకు మరో షాక్ తగిలింది. రబాడ బౌలింగ్‌లో బుమ్రా డకౌటయ్యాడు. ఫలితంగా టీమిండియా 210 పరుగుల వద్ద ఎనిమిదో వికెట్ కోల్పోయింది. క్రీజ్‌లో కోహ్లి(78), ఉమేశ్ యాదవ్ ఉన్నారు. శార్ధూల్ ఔట్ రెండో టెస్ట్‌లో బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ రాణించిన శార్ధూల్ ఠాకూర్(12) ఈ మ్యాచ్‌లో నిరాశపరిచాడు. వచ్చీ రాగానే భారీ షాట్లతో విరుచుకుపడిన అతను.. మరో భారీ షాట్‌కు ప్రయత్నించి కేశవ్ మహారాజ్ బౌలింగ్‌లో కీగన్ పీటర్సన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఫలితంగా టీమిండియా 205 పరుగుల వద్ద ఏడో వికెట్ కోల్పోయింది. క్రీజ్‌లో కోహ్లి(73), బుమ్రా ఉన్నారు. జన్సెన్ విజృంభణ.. 175 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన టీమిండియా దక్షిణాఫ్రికా యువ పేసర్ మార్కో జన్సెన్ విజృంభణతో టీమిండియా 175 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి ఎదురీదుతుంది. అశ్విన్ 2 పరుగులు మాత్రమే చేసి జన్సెన్ బౌలింగ్‌లో వెర్రిన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. క్రీజ్‌లో కోహ్లి(56), శార్ధూల్ ఠాకూర్ ఉన్నాడు. 167 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన టీమిండియా మార్కో జన్సెన్ టీమిండియాపై మరోసారి ప్రతాపం చూపుతున్నాడు. ఈ ఇన్నింగ్స్‌లో ఇదివరకే కీలకమైన పుజారా వికెట్ పడగొట్టిన అతను.. రిషబ్ పంత్(27)ను కూడా పెవిలియన్‌కు పంపాడు. దీంతో టీమిండియా 167 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో చిక్కుకుంది. కెప్టెన్ విరాట్ కోహ్లి(50), అశ్విన్ క్రీజ్‌లో ఉన్నారు. నాలుగో వికెట్ కోల్పోయిన టీమిండియా 116 పరుగుల వద్ద టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. రహానే(9) వైఫల్యాల పరంపరను కొనసాగించాడు. రబాడ బౌలింగ్‌లో వెర్రిన్‌కు క్యాచ్ ఇచ్చి రహానే ఔటయ్యాడు. క్రీజ్‌లో విరాట్ కోహ్లి(29), పంత్ ఉన్నారు. టీమిండియా మూడో వికెట్ డౌన్ క్రీజ్‌లో నిలదొక్కుకున్నట్లు కనిపించిన పుజారా 43 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద మార్కో జన్సెన్ బౌలింగ్‌లో వెర్రిన్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఫలితంగా 95 పరుగుల వద్ద టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. క్రీజ్‌లో కోహ్లి(17), రహానే ఉన్నారు. 5: 06 PM: టీమిండియా స్కోరు: 85/2 (34.3). పుజారా 35, కోహ్లి 16 పరుగులతో క్రీజులో ఉన్నారు. ప్రొటిస్ బౌలర్లు రబడ, ఒలివర్ చెరో వికెట్ తీశారు. 4: 00 PM: లంచ్ బ్రేక్ సమయానికి టీమిండియా స్కోరు: 75/2 (28). కోహ్లి 15, పుజారా 26 పరుగులతో క్రీజులో ఉన్నారు. 3: 36 PM: టీమిండియా ప్రస్తుత స్కోరు: 53/2 (22.1). కెప్టెన్ కోహ్లి 5, పుజారా 17 పరుగులతో క్రీజులో ఉన్నారు. 2: 53 PM: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టులో భారత జట్టు రెండో వికెట్ కోల్పోయింది. మయాంక్ అగర్వాల్‌ను రబడ అవుట్ చేశాడు. స్కోరు: 33/2. విరాట్ కోహ్లి, పుజారా క్రీజులో ఉన్నారు. 2: 48 PM: తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా.. కేఎల్ రాహుల్ అవుట్. ఒలివర్ బౌలింగ్‌లో టీమిండియా ఓపెనర్ రాహుల్ పెవిలియన్ చేరాడు. వికెట్ కీపర్ వెరెన్కు క్యాచ్ ఇచ్చి 12 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు. పుజారా క్రీజులోకి వచ్చాడు. 2: 30 PM: కేఎల్ రాహుల్ 12, మయాంక్ అగర్వాల్ 15 పరుగులతో క్రీజులో ఉన్నారు. స్కోరు 31/0. మూడో టెస్టులో రెండు మార్పులతో భారత జట్టు బరిలోకి దిగింది. గాయం కారణంగా రెండో టెస్టుకు దూరమైన విరాట్ కోహ్లి.. విహారి స్ధానంలో జట్టులోకి రాగా, సిరాజ్ స్థానంలో ఉమేశ్ యాదవ్ తుది జట్టులోకి వచ్చాడు. ఇక దక్షిణాఫ్రికా ఎటువంటి మార్పులు లేకుండానే బరిలోకి దిగింది. తుది జట్లు: భారత్: కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, ఛతేశ్వర్ పుజారా, అజింక్య రహానే, విరాట్ కోహ్లి(కెప్టెన్), రిషభ్ పంత్(వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, ఉమేశ్ యాదవ్ సౌతాఫ్రికా: డీన్ ఎల్గర్(కెప్టెన్), ఎయిడెన్ మార్కరమ్, కీగన్ పీటర్సన్, రసే వాన్ డెర్ డసెన్, తెంబా బవుమా, కైలీ వెరెనె(వికెట్ కీపర్), మార్కో జాన్సెన్, కగిసో రబడ, కేశవ్ మహరాజ్, డువానే ఒలివర్, లుంగి ఎంగిడి. కేప్‌టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో తుది సమరానికి భారత్ సిద్దమైంది. ఒక్కో టెస్టు గెలిచి భారత్, దక్షిణాఫ్రికా 1–1తో సమంగా ఉన్న సంగతి తెలిసిందే. తొలి సారి సఫారీ గడ్డపై టెస్ట్ సిరీస్ సాధించి చరిత్ర సృష్టించాలన్న పట్టుదలతో టీమిండియా బరిలోకి దిగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. చదవండి: క్రికెట్ చరిత్రలోనే అద్భుతమైన క్యాచ్.. సూపర్ మ్యాన్‌లా.. వీడియో వైరల్! -
Ind Vs Sa 3rd Test: నేటి నుంచి భారత్, సౌతాఫ్రికా మూడో టెస్ట్
-
Ind Vs Sa 3rd Test: టెస్టు మ్యాచ్‌కు సరిగ్గా సరిపోయే పిచ్.. టాస్ గెలిస్తే..
Ind Vs Sa Test Series 2021-22: దక్షిణాఫ్రికా గడ్డపై ఏడు పర్యటనల్లో ఒక్కసారి కూడా టెస్టు సిరీస్ గెలవలేకపోయిన భారత జట్టు ఈ సారి సిరీస్ విజయమే లక్ష్యంగా అక్కడ అడుగుపెట్టింది. సెంచూరియన్ విక్టరీతో దానికి బాటలు వేసుకున్నా... జొహన్నెస్‌బర్గ్‌లో ఆతిథ్య జట్టు పోరాటంతో లెక్క సమమైంది. ఇప్పుడు మరో అవకాశం మన ముంగిట నిలిచింది. గత మ్యాచ్‌లో ఓడినా ఇప్పటికీ ప్రత్యర్థితో పోలిస్తే టీమిండియా పటిష్టంగా కనిపిస్తోంది. అయితే, సొంత మైదానంలో సిరీస్ చేజార్చుకోరాదనే పట్టుదల, గత మ్యాచ్ విజయం ఇచ్చిన స్ఫూర్తి సఫారీ టీమ్‌లో కూడా ఉత్సాహం పెంచాయి. న్యూలాండ్స్ మైదానంలో భారత్ గతంలో ఎన్నడూ గెలవకపోయినా...కొత్త చరిత్ర సృష్టించడం ఈ జట్టుకు కొత్త కాదు. ఇక పిచ్, వాతావరణం కేప్‌టౌన్‌లోని న్యూలాండ్స్ మైదానంలో దక్షిణాఫ్రికా- టీమిండియా మధ్య మూడో టెస్టు జరుగనుంది. ఒక టెస్టు మ్యాచ్‌కు సరిగ్గా సరిపోయే పిచ్ అని విశ్లేషకుల అంచనా. ఆరంభంలో పేసర్లు ప్రభావం చూపించడంతో పాటు బౌన్స్ కారణంగా బ్యాట్స్‌మెన్ కూడా బాగా పరుగులు సాధించే అవకాశం ఉంది. మ్యాచ్ సాగుతున్న కొద్దీ పొడిబారి స్పిన్నర్లకు అనుకూలిస్తుంది. టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ ఎంచుకోవడం ఖాయం. మంచి వాతావరణం, వర్షం సూచన లేదు. టీమిండియా రికార్డు న్యూలాండ్స్ మైదానంలో భారత్ 5 టెస్టులు ఆడింది. 3 మ్యాచ్‌లలో ఓడి 2 ‘డ్రా’గా ముగించింది. భారత తుది జట్టు అంచనా: కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, ఛతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి(కెప్టెన్), అజింక్య రహానే, రిషభ్ పంత్(వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, ఉమేశ్ యాదవ్. చదవండి: IPL 2022: కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్! 🔊 🔊 🔛 Practice 🔛 𝐈𝐧 𝐭𝐡𝐞 𝐳𝐨𝐧𝐞 - 𝐂𝐚𝐩𝐭𝐚𝐢𝐧 𝐊𝐨𝐡𝐥𝐢.👌 👌#TeamIndia | #SAvIND | @imVkohli pic.twitter.com/ChFOPzTT6q — BCCI (@BCCI) January 10, 2022 -
Ind Vs Sa 3rd Test: నేను ఫిట్‌గా ఉన్నా.. సిరాజ్ సిద్ధంగా లేడు: కోహ్లి
-
ఎక్కడ మొదలెట్టానో అక్కడే ఉన్నాను.. టీమిండియా పేసర్ ఆసక్తికర ట్వీట్
IND Vs SA 3rd Test: కేప్‌టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో రేపటి(జనవరి 11) నుంచి ప్రారంభంకానున్న నిర్ణయాత్మక మూడో టెస్ట్‌కు ముందు టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా ఆసక్తికర ట్వీట్ చేశాడు. టెస్ట్ కెరీర్‌ను ఎక్కడ మొదలుపెట్టానో నాలుగేళ్ల తర్వాత అక్కడే ఉన్నానంటూ తన టెస్ట్ అరంగేట్రాన్ని గుర్తు తెచ్చుకున్నాడు. 2018 జనవరిలో ఇదే వేదికపై టెస్ట్‌ల్లోకి ఎంట్రీ ఇచ్చిన బుమ్రా.. నాలుగేళ్ల కాలంలో ఆటగాడిగానే కాకుండా వ్యక్తిగానూ పరిణితి చెందానని, తిరిగి కేప్‌టౌన్‌కు రావడం మధుర స్మృతులను నెమరువేసుకున్నట్లు ఉందని భావోద్వేగంతో కూడిన పోస్ట్ చేశాడు. Cape Town, January 2018 - is where it all began for me in Test cricket. Four years on, I’ve grown as a player and a person and to return to this ground brings back special memories. 😊 pic.twitter.com/pxRPNnqwBH— Jasprit Bumrah (@Jaspritbumrah93) January 9, 2022 విరాట్ కోహ్లి నేతృత్వంలోని టీమిండియా 2018లో దక్షిణాఫ్రికా పర్యటనకు వచ్చింది. ఆ సిరీస్‌లో తొలి మ్యాచ్ ద్వారా బుమ్రా టెస్ట్ అరంగేట్రం చేశాడు. 3 మ్యాచ్‌ల ఆ సిరీస్‌లో అతను 14 వికెట్లు పడగొట్టాడు. ఇప్పటివరకు 25 టెస్ట్‌లు ఆడిన బుమ్రా.. 23.24 సగటుతో 106 వికెట్లు సాధించాడు. ఇదిలా ఉంటే, 3 టెస్ట్‌ల ప్రస్తుత సిరీస్‌లో భారత్, దక్షిణాఫ్రికా జట్లు చెరో మ్యాచ్ గెలిచి సమంగా నిలిచాయి. రేపటి నుంచి ప్రారంభంకాబోయే నిర్ణయాత్మక మ్యాచ్‌లో ఇరు జట్లు అమితుమీకి సిద్ధమయ్యాయి. చదవండి: విరాట్ కోహ్లిని బ్రాండ్ అంబాసిడర్‌గా పెట్టుకుని, భార్యకు భరణం కట్టలేనంటావా..? -
Ind Vs Sa 3rd Test: నేను ఫిట్‌గా ఉన్నా.. సిరాజ్ సిద్ధంగా లేడు: కోహ్లి
IND Vs SA 3rd Test: ఎట్టకేలకు టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి మీడియా ముందుకు వచ్చాడు. దక్షిణాఫ్రికాతో నిర్ణయాత్మక మూడో టెస్టుకు ముందు నిర్వహించిన ప్రెస్ కాన్పరెన్స్‌లో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ.. తను ఫిట్‌గా ఉన్నాడని స్పష్టం చేశాడు. కేప్‌టౌన్ టెస్టుకు అందుబాటులో ఉంటానని పేర్కొన్నాడు. ఇక స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ ఇంకా పూర్తిగా కోలుకోలేదని కోహ్లి వెల్లడించాడు. ‘‘నేను పూర్తి ఫిట్నెస్ సాధించాను. సిరాజ్ మాత్రం మ్యాచ్ ఆడేందుకు సిద్ధంగా లేడు. ఈరోజు జరిగే సమావేశంలో అతడి స్థానంలో ఎవరిని తీసుకోవాలో చర్చిస్తాం. నిజానికి సిరాజ్ స్థానాన్ని భర్తీ చేయడానికి మాకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. నిజంగా ఇది మాకు గర్వకారణం’’ అని కోహ్లి పేర్కొన్నాడు. -
దక్షిణాఫ్రికా ‘పార్లమెంట్’లో అగ్ని ప్రమాదం
కేప్ టౌన్: కేప్‌టౌన్‌లోని దక్షిణాఫ్రికా పార్లమెంట్ భవన సముదాయంలో ఆదివారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఉదయం 6 గంటల ప్రాంతంలో ప్రభుత్వ కార్యాలయాలున్న పురాతన పార్లమెంట్ భవనం మూడో అంతస్తులో మొదటగా మంటలు ప్రారంభమయ్యాయి. అనంతరం అగ్ని కీలలు పక్కనే ఉన్న ప్రస్తుత పార్లమెంట్ నేషనల్ అసెంబ్లీ భవనానికి వ్యాపించాయి. పార్లమెంట్ కార్యాలయ భవనం పైకప్పు కూలింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారని మంత్రి పాట్రీసియా చెప్పారు. ప్రమాదవశాత్తూ మంటలు చెలరేగాయా లేదా విద్రోహ చర్యా అనేది ఇప్పుడే చెప్పలేమని పార్లమెంట్ స్పీకర్ నొసివివే అన్నారు. అగ్ని కీలల వేడికి ఆ కాంప్లెక్స్‌లోని మిగతా భవనాలు దెబ్బతినడంతోపాటు, అందులోని కళాఖండాలు ధ్వంసమయ్యే ప్రమాదముందని మంత్రి పాట్రీసియా ఆందోళన వ్యక్తం చేశారు. సంఘటన ప్రాంతాన్ని అధ్యక్షుడు సిరిల్ రమఫోసా సందర్శించారు. ఘటనకు సంబంధించి పోలీసులు ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. మంటలు మొదట ప్రారంభమైన పార్లమెంట్ పాత భవనం 1880ల నాటిది కాగా, దాని వెనుక ఉన్న నేషనల్ అసెంబ్లీ భవనం ఇటీవలి కాలంలో నిర్మించింది. కాగా, దక్షిణాఫ్రికాకు మూడు రాజధానులున్నాయి. కేప్‌టౌన్ నగరం లెజిస్లేటివ్ రాజధాని కాగా, ప్రిటోరియా పరిపాలన కేంద్రంగా, బ్లోమ్ ఫోంటెన్ న్యాయ రాజధానిగాను ఉన్నాయి. #BREAKING: Firefighters are battling a large fire that has ripped through the Houses of Parliament in Cape Town, South Africa "There have been reports of some walls showing cracks, which could indicate a collapse” Jermaine Carelse, of CT fire servicepic.twitter.com/LZTNH0Dzmu — Stefan Simanowitz (@StefSimanowitz) January 2, 2022 -
జాతి వివక్ష పోరాట యోధుడు అస్తమయం
జొహన్నెస్‌బర్గ్/న్యూఢిల్లీ: దక్షిణాఫ్రికాలో జాతి వివక్షపై అవిశ్రాంత పోరాటం సాగించిన హక్కుల నేత, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత డెస్మండ్ టుటు(90) అస్తమించారు. ఆర్చ్‌బిషప్ డెస్మండ్ టుటు ఆదివారం వేకువజామున కేప్‌టౌన్‌లోని ఓ ఆస్పత్రిలో కన్నుమూశారని దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసా ప్రకటించారు. గతంలో క్షయవ్యాధికి గురైన డెస్మండ్ టుటు, ప్రొస్టేట్ కేన్సర్ బారినపడి 1997లో శస్త్రచికిత్స చేయించుకున్నారు. అనంతరం పలు అనారోగ్య సమస్యలు ఆయన్ను చుట్టుముట్టాయి. బ్రిటిషర్ల హయాంలో నల్లజాతి ప్రజల హక్కుల కోసం, అన్యాయాలకు గురైన వారి తరఫున డెస్మండ్ టుటు తీవ్రంగా పోరాడారు. నల్ల జాతీయుల పాలన మొదలైన తర్వాత కూడా అన్యాయాలను, అక్రమాలను ఖండించడంలో ఆయన వెనుకాడలేదు. అధికార ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్‌లో కొనసాగుతూనే పార్టీ నేతలు అక్రమాలకు పాల్పడుతూ ప్రభుత్వ సంస్థలను కొల్లగొడుతున్న తీరుపై గళమెత్తారు. ఆర్చ్‌బిషప్ టుటు మృతిపై భారత ప్రధాని మోదీ సహా పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ఆర్చి బిషప్ టుటును ‘ఆఫ్రికా పీస్ బిషప్’గా నోబెల్ ఇన్స్టిట్యూట్ అభివర్ణించింది. దక్షిణాఫ్రికా నల్లజాతి ప్రజలపై బ్రిటిషర్లు దారుణాలకు పాల్పడినప్పటికీ బిషప్ టుటు మాత్రం అహింసాయుత విధానాలకే కట్టుబడి ఉన్నారని కొనియాడింది. మండేలాతో విడదీయరాని మైత్రి మొదట జొహన్నెస్‌బర్గ్ ఆర్చ్‌బిషప్‌గా ఉన్న టుటు తర్వాత కేప్‌టౌన్ బిషప్‌గా బాధ్యతలు నిర్వహించారు. ఆ పదవులు నిర్వహిస్తూనే స్థానిక నల్లజాతి వారిపై శ్వేత జాతీయుల దురాగతాలను ఖండించడంలో వెనుకాడలేదు. జొహన్నెస్‌బర్గ్ ఆర్చ్‌బిషప్‌గా కొనసాగుతున్న సమయంలోనే 1984లో ఆయన్ను నోబెల్ శాంతి బహుమతి వరించింది. బ్రిటిషర్ల హయాంలో జాతి వివక్షకు గురైన వారికి న్యాయం చేసే లక్ష్యంతో 1995లో టుటు నేతృత్వంలో ‘ట్రూత్ అండ్ రికన్సిలియేషన్ కమిషన్’ను మండేలా నియమించారు. టుటు, మండేలా మధ్య అనుబంధాన్ని వివరిస్తూ మండేలా ఫౌండేషన్ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది. ‘1950లలో పాఠశాలలో చదువుకునే రోజుల్లో జరిగిన వక్తృత్వ పోటీల సమయంలో మండేలా, టుటు తొలిసారి కలుసుకున్నారు. ఇద్దరూ జాతి వివక్షపై ప్రజల తరఫున పోరాటం సాగించారు. ఇది నచ్చని బ్రిటిషర్లు వారిద్దరూ కలుసుకోకుండా దాదాపు 4 దశాబ్దాలపాటు పలు అవాంతరాలు కల్పించారు. చివరికి మండేలా 27 ఏళ్లపాటు జైలు జీవితం గడిపి విడుదలయ్యాకే టుటుతో నేరుగా మాట్లాడగలిగారు. చెరసాల నుంచి విడుదలైన మండేలా మొదటగా వెళ్లి ఆ రోజు గడిపింది టుటు నివాసంలోనే’అని తెలిపింది. మండేలా 2013లో తుదిశ్వాస విడిచే వరకు టుటుతో అనునిత్యం మాట్లాడుకుంటూనే ఉన్నారంటూ వారి మధ్య ఉన్న గాఢమైత్రిని గుర్తు చేసింది. -
దక్షిణాఫ్రికా అధ్యక్షుడికి కోవిడ్ పాజిటివ్
జొహన్నెస్‌బర్గ్: దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసా(69) కరోనా వైరస్ బారినపడ్డారు. ఆయనకు స్వల్పలక్షణాలు బయటపడ్డాయని, ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నారని అధ్యక్ష కార్యాలయం వెల్లడించింది. సోమవారం కేప్‌టౌన్‌లో జరిగిన మాజీ ఉపాధ్యక్షుడు డీక్లార్క్ సంస్మరణ కార్యక్రమంలో పాల్గొన్న అధ్యక్షుడు రమఫోసా అస్వస్థతకు గురయ్యారని పేర్కొంది. ఆయన ఆరోగ్య పరిస్థితులను రక్షణ శాఖ ఆరోగ్య అధికారులు పర్యవేక్షిస్తున్నట్లు తెలిపింది. రమఫోసా కోవిడ్ టీకా రెండు డోసులు తీసుకున్నారు. సోమవారం 37,875 కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం కేప్‌టౌన్‌లో సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉన్న రమఫోసా..ఉపాధ్యక్షుడు డేవిడ్ మబూజాకు వారం పాటు అధ్యక్ష బాధ్యతలను అప్పగించారని మంత్రి ఒకరు తెలిపారు. రమఫోసా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ భారత ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. ఒమిక్రాన్ దక్షిణాఫ్రికాలో బయటపడిన విషయం తెలిసిందే.