శ్రీలంకపై దక్షిణాఫ్రికా భారీ విజయం
కేప్ టౌన్: శ్రీలంకతో జరిగిన రెండోటెస్టు మ్యాచ్‌లో దక్షిణాప్రికా 282 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. దక్షిణాఫ్రికా నిర్దేశించిన 507 పరుగుల లక్ష్యాన్ని చేధించలేక 224 పరుగులకే ఆలౌట్ అయింది. దక్షిణాప్రికా తొలి ఇన్నింగ్స్‌లో 392 పరుగులు చేయగా.. శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 110 పరుగులకే కుప్పకూలింది. రెండో ఇన్నింగ్స్‌లో 224 పరుగుల వద్ద దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌ని డిక్లేర్ చేసి శ్రీలంక ముందు 507 పరుగుల టార్గెట్‌ను ఉంచింది. భారీ లక్ష్యంలో బరిలోకి దిగిన శ్రీలంక 224 పరుగులకే ఆలౌట్ అయింది. దక్షిణాప్రికా బౌలర్ రబడ మొదటి ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు, రెండో ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు తీసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ సొంతం చేసుకున్నాడు. మూడు టెస్టుల సిరీస్‌లో మరో మ్యాచ్ ఉండగానే సిరీస్‌ను దక్షిణాఫ్రికా సొంతం చేసుకుంది. మూడో టెస్టు జనవరి 12న జోహన్నెస్‌బర్గ్‌లో ప్రారంభం కానుంది.