
1996 వన్డే వరల్డ్ కప్‌లో ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగి, ఏకంగా టైటిల్‌నే ఎగరేసుకుపోయిన శ్రీలంక.. ఆతర్వాత రెండు దశాబ్దాల పాటు వన్డే క్రికెట్‌లో అద్భుత విజయాలు సాధించింది. 1999 వరల్డ్‌కప్‌లో గ్రూప్ స్టేజ్‌లో పరిమితమైన లంకేయులు.. 2003లో సెమీస్‌కు.. 2007, 2011 ప్రపంచకప్‌ల్లో ఫైనల్స్‌కు చేరారు. 2015 వరల్డ్‌కప్ వరకు వన్డేల్లో లంక ప్రయాణం సాఫీగా సాగింది.
అయితే గత దశాబ్దకాలంలో ఆ జట్టు శోభ మసకబారింది. సంగక్కర, జయవర్దనే లాంటి స్టార్ ఆటగాళ్ల రిటైర్మెంట్‌తో శ్రీలంక బలహీన జట్టుగా మారిపోయింది. భారత్‌లో జరిగిన 2023 వరల్డ్‌కప్‌కు క్వాలిఫయర్స్ ద్వారా అర్హత సాధించింది. ఘన కీర్తి కలిగిన శ్రీలంక క్వాలిఫయర్స్ ద్వారా ప్రపంచకప్‌లో పోటీపడటం.. అక్కడ కూడా దారుణ పరాజయాలు మూటగట్టుకోవడంతో ఈ జట్టు పనైపోయిందని అంతా అనుకున్నారు.
అయితే దిగ్గజ ఆటగాడు సనత్ జయసూర్య రాకతో (హెడ్ కోచ్‌గా) శ్రీలంక ప్రదర్శనల్లో ఒక్కసారిగా మార్పు వచ్చింది. టెస్ట్‌లు, టీ20ల విషయాన్ని పక్కన పెడితే.. ద్వీప జట్టు వన్డేల్లో అమోఘంగా రాణిస్తుంది. జయసూర్య జమానాలో శ్రీలంక.. భారత్, న్యూజిలాండ్ లాంటి పటిష్ట జట్లను మట్టికరిపించింది. తాజాగా శ్రీలంక.. ప్రపంచ ఛాంపియన్ ఆస్ట్రేలియాపై సంచలన విజయం సాధించింది.
రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. గతేడాది ఈ జట్టు భారత్‌ను సైతం 2-0 తేడాతో ఓడించింది. ప్రస్తుతం లంక జట్టులో ఉన్న ఆటగాళ్లు పాతవారే అయినప్పటికీ జయసూర్య ఆధ్వర్యంలో వారు రాటుదేలుతున్నారు. నిస్సంక, కుసాల్ మెండిస్, కమిందు మెండిస్, చరిత్ అసలంక బ్యాటింగ్‌లో అద్భుతాలు చేస్తున్నారు. లంక జట్టు బౌలింగ్ గతంలో పోలిస్తే మరింత బలపడింది. నాణ్యమైన స్పిన్నర్లు తయారవుతున్నారు. మొదటి నుంచే ఆ జట్టు పేస్ విభాగం బలంగా ఉంది.
జయసూర్య రాక ముందు చిన్న జట్ల చేతుల్లో సైతం ఘోర పరాజయాలను ఎదుర్కొన్న శ్రీలంక.. త్వరలో జరుగబోయే ఛాంపియన్స్ ట్రోఫీకి అర్హత సాధించలేకపోయింది. ఈ మెగా టోర్నీలో శ్రీలంక 2002లో భారత్‌తో కలిసి సంయుక్తంగా ఛాంపియన్‌గా నిలిచింది. త్వరలో జరుగబోయే మెగా టోర్నీకి ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ లాంటి చిన్న జట్లు అర్హత సాధించినా, శ్రీలంక మాత్రం క్వాలిఫై కాలేకపోయింది. 2025 ఛాంపియన్స్ ట్రోఫీకి శ్రీలంకతో పాటు ఘన చరిత్ర కలిగిన వెస్టిండీస్‌కు కూడా అర్హత సాధించలేకపోయింది.
జయసూర్య హెడ్ కోచ్‌గా ఉండగా శ్రీలంక సాధించిన విజయాలు
వన్డే సిరీస్‌లో భారత్‌పై 2-0 తేడాతో విజయం
ఇంగ్లండ్‌లో టెస్ట్ విజయం
న్యూజిలాండ్‌పై టెస్ట్ సిరీస్‌లో విజయం
వెస్టిండీస్‌పై టీ20 సిరీస్ విజయం
వెస్టిండీస్‌పై వన్డే సిరీస్ 2-1 తేడాతో విజయం
న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ డ్రా
న్యూజిలాండ్‌పై వన్డే సిరీస్ 2-0 తేడాతో విజయం
ఆస్ట్రేలియాపై వన్డే సిరీస్ 2-0 తేడాతో విజయం