Sanath Jayasuriya
-
జయసూర్య జమానాలో పూర్వ వైభవం దిశగా శ్రీలంక
1996 వన్డే వరల్డ్ కప్‌లో ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగి, ఏకంగా టైటిల్‌నే ఎగరేసుకుపోయిన శ్రీలంక.. ఆతర్వాత రెండు దశాబ్దాల పాటు వన్డే క్రికెట్లో అద్భుత విజయాలు సాధించింది. 1999 వరల్డ్‌కప్‌లో గ్రూప్ స్టేజ్‌లో పరిమితమైన లంకేయులు.. 2003లో సెమీస్‌కు.. 2007, 2011 ప్రపంచకప్‌ల్లో ఫైనల్స్‌కు చేరారు. 2015 వరల్డ్‌కప్ వరకు వన్డేల్లో లంక ప్రయాణం సాఫీగా సాగింది.అయితే గత దశాబ్దకాలంలో ఆ జట్టు శోభ మసకబారింది. సంగక్కర, జయవర్దనే లాంటి స్టార్ ఆటగాళ్ల రిటైర్మెంట్తో శ్రీలంక బలహీన జట్టుగా మారిపోయింది. భారత్‌లో జరిగిన 2023 వరల్డ్‌కప్‌కు క్వాలిఫయర్స్ ద్వారా అర్హత సాధించింది. ఘన కీర్తి కలిగిన శ్రీలంక క్వాలిఫయర్స్ ద్వారా ప్రపంచకప్‌లో పోటీపడటం.. అక్కడ కూడా దారుణ పరాజయాలు మూటగట్టుకోవడంతో ఈ జట్టు పనైపోయిందని అంతా అనుకున్నారు.అయితే దిగ్గజ ఆటగాడు సనత్ జయసూర్య రాకతో (హెడ్ కోచ్‌గా) శ్రీలంక ప్రదర్శనల్లో ఒక్కసారిగా మార్పు వచ్చింది. టెస్ట్‌లు, టీ20ల విషయాన్ని పక్కన పెడితే.. ద్వీప జట్టు వన్డేల్లో అమోఘంగా రాణిస్తుంది. జయసూర్య జమానాలో శ్రీలంక.. భారత్, న్యూజిలాండ్ లాంటి పటిష్ట జట్లను మట్టికరిపించింది. తాజాగా శ్రీలంక.. ప్రపంచ ఛాంపియన్ ఆస్ట్రేలియాపై సంచలన విజయం సాధించింది.రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. గతేడాది ఈ జట్టు భారత్‌ను సైతం 2-0 తేడాతో ఓడించింది. ప్రస్తుతం లంక జట్టులో ఉన్న ఆటగాళ్లు పాతవారే అయినప్పటికీ జయసూర్య ఆధ్వర్యంలో వారు రాటుదేలుతున్నారు. నిస్సంక, కుసాల్ మెండిస్, కమిందు మెండిస్, చరిత్ అసలంక బ్యాటింగ్‌లో అద్భుతాలు చేస్తున్నారు. లంక జట్టు బౌలింగ్ గతంలో పోలిస్తే మరింత బలపడింది. నాణ్యమైన స్పిన్నర్లు తయారవుతున్నారు. మొదటి నుంచే ఆ జట్టు పేస్ విభాగం బలంగా ఉంది.జయసూర్య రాక ముందు చిన్న జట్ల చేతుల్లో సైతం ఘోర పరాజయాలను ఎదుర్కొన్న శ్రీలంక.. త్వరలో జరుగబోయే ఛాంపియన్స్ ట్రోఫీకి అర్హత సాధించలేకపోయింది. ఈ మెగా టోర్నీలో శ్రీలంక 2002లో భారత్‌తో కలిసి సంయుక్తంగా ఛాంపియన్‌గా నిలిచింది. త్వరలో జరుగబోయే మెగా టోర్నీకి ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ లాంటి చిన్న జట్లు అర్హత సాధించినా, శ్రీలంక మాత్రం క్వాలిఫై కాలేకపోయింది. 2025 ఛాంపియన్స్ ట్రోఫీకి శ్రీలంకతో పాటు ఘన చరిత్ర కలిగిన వెస్టిండీస్‌కు కూడా అర్హత సాధించలేకపోయింది.జయసూర్య హెడ్ కోచ్‌గా ఉండగా శ్రీలంక సాధించిన విజయాలువన్డే సిరీస్‌లో భారత్‌పై 2-0 తేడాతో విజయంఇంగ్లండ్లో టెస్ట్ విజయంన్యూజిలాండ్పై టెస్ట్ సిరీస్‌లో విజయంవెస్టిండీస్పై టీ20 సిరీస్ విజయంవెస్టిండీస్పై వన్డే సిరీస్ 2-1 తేడాతో విజయంన్యూజిలాండ్తో టీ20 సిరీస్ డ్రాన్యూజిలాండ్పై వన్డే సిరీస్ 2-0 తేడాతో విజయంఆస్ట్రేలియాపై వన్డే సిరీస్ 2-0 తేడాతో విజయం -
లంక క్రికెట్ సెలెక్షన్ ప్యానెల్ రాజీనామా
సాక్షి, పల్లెకెలె: శ్రీలంక ఘోర పరాజయాలకు బాధ్యత వహిస్తూ ఆ దేశ క్రికెట్ సెలక్షన్ ప్యానెల్ రాజీనామా చేసింది. భారత్‌తో జరిగిన టెస్టు, వన్డే సిరీస్‌లు కోల్పోవడం, అంతకు ముందు జింబాంబ్వేతో ఘోర పరాజయం, చాంపియన్స్ ట్రోఫిలో లీగ్ దశలోనే ఇంటికి చేరడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక చీఫ్ సెలక్టర్‌గా సనత్ జయసూర్య కమిటీ మెంబర్స్ రంజీత్ మధురసింగే, రొమెశ్ కలువితరణ, ఎరిక్ ఉపాసంతా, అసంకా గురుసిన్హాలతో కూడిన సెలక్షన్ ప్యానెల్ భారత్‌తో జరిగే ఎకైక టీ20 అనంతరం తప్పుకోనున్నట్టు శ్రీలంక క్రికెట్ బోర్డు వైస్ ప్రెసిడెంట్ మోహన్ సిల్వా తెలిపారు. ఈ ప్యానెల్ రాజీనామా లేఖ అందించిందని శ్రీలంక క్రీడా శాఖ మంత్రి దయాశ్రీ జయశేకర ధృవీకరించారు. సెప్టెంబర్ 7తో వీరి పదవుల గడువు ముగుస్తుందన్నారు. ఇక దిగ్గజ ఆటగాళ్లు కుమార సంగక్కర, జయవర్ధనే, మురళిధరన్ల వీడ్కోలనంతరం శ్రీలంక క్రికెట్ బోర్డు గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటుంది. భారత్‌తో సొంతగడ్డపై 3-0తో టెస్టు సిరీస్, రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే 3-0తో వన్డే సిరీస్‌లు కోల్పోయింది. దీంతో లంక క్రికెట్ బోర్డు మెనేజ్మెంట్ సంక్షోభంలో పడింది. -
'ఆ క్రికెటర్ ఆట కోసం ఎదురుచూస్తున్నా'
న్యూఢిల్లీ:టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్‌పై శ్రీలంక దిగ్గజ ఆటగాడు సనత్ జయసూర్య ప్రశంసలు కురిపించాడు. శిఖర్ ధావన్ ఎటాక్ ను చూస్తుంటే తాను క్రికెట్ ఆడిన రోజులు గుర్తుస్తున్నాయన్నాడు. గతంలో తన ఎటాక్ కు, ప్రస్తుత ధావన్ ఎటాక్ కు చాలా పోలికలున్నాయని జయసూర్య అభిప్రాయపడ్డాడు. తమ జట్టుతో జరిగిన తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్ లో భారీ సెంచరీ చేసిన ధావన్ ఆటను ఎంతగానో ఎంజాయ్ చేశానన్నాడు. అదే క్రమంలో అతని ఆట కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నానని జయసూర్య స్పష్టం చేశాడు. తొలి టెస్టులో గెలిచిన భారత జట్టు ప్రదర్శన సైతం తనను ఎంతగానో ఆకట్టుకుందన్నాడు. చివరిసారి లంకలో పర్యటించి గాలే టెస్టులో ఓటమిని ఎదుర్కొన్న భారత్.. దానికి ఘనమైన ప్రతీకారం తీర్చుకుందన్నాడు. స్వదేశంలో అత్యంత ప్రమాదకరమైన జట్టైన తమను భారత్ ఓడించిందంటే అందుకు వారి సమష్టి పోరాటమే ప్రధానకారణమన్నాడు. ఈ సందర్భంగా గతేడాది ఆస్ట్రేలియాపై వరుసగా మూడు టెస్టు మ్యాచ్ లు గెలిచిన సంగతిని జయసూర్య గుర్తుచేశాడు. అప్పటి నంబర్ వన్ ఆస్ట్రేలియాను చుట్టేసిన తమ జట్టు.. ఇప్పుడు నంబర్ వన్ గా ఉన్న భారత్ కు సునాయాసంగా లొంగిపోవడాన్ని సమర్ధించుకున్నాడు. ఇది క్రికెట్ అని, ఏదైనా ఈ గేమ్ లో సాధ్యమేనన్నాడు. తమ జట్టు తిరిగి పుంజుకుంటుందని జయసూర్య ఆశాభావం వ్యక్తం చేశాడు. దాదాపు ఆరేళ్ల క్రితం అంతర్జాతీయ క్రికెట్ కు జయసూర్య గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. జయసూర్య 110 టెస్టులు, 445 వన్డేలు, 31 ట్వంటీ 20లు ఆడాడు. 1996లో లంకేయులు వన్డే వరల్డ్ కప్ గెలవడంలో జయసూర్యదే ముఖ్య భూమిక. పవర్ ప్లే ఎలా ఆడాలో ప్రపంచానికి పరిచయం చేసింది జయసూర్యనే అనడంలో ఎటువంటి సందేహం లేదు. -
ఆ వైఫల్యానికి పూర్తి బాధ్యత నాదే!
కొలంబో:టీమిండియాతో జరిగిన వన్డే సిరీస్ లో శ్రీలంక ఘోర వైఫల్యానికి తానే పూర్తిగా బాధ్యత వహిస్తానని ఆ దేశ క్రికెట్ సెలెక్షన్ కమిటీ చైర్మన్ సనత్ జయసూర్య స్పష్టం చేశాడు. టీమిండియాపై 5-0 తేడాతో శ్రీలంక ఓడిన అనంతరం బోర్డు తరపున తొలిసారి మీడియాకు ముందుకొచ్చిన జయసూర్య ఆ ఓటమి భారాన్ని తనపై వేసుకుంటానన్నాడు. 2015 లో జరిగే వరల్డ్ కప్ కు శ్రీలంక క్రికెట్ ను పూర్తిగా ప్రక్షాళన చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడిందని. అందుకోసం ఇప్పటికే సెలెక్షన్ ప్యానెల్ యత్నాలు ఆరంభించదన్నాడు. ప్రస్తుతం డిప్యూటీ స్పోర్ట్స్ మినిష్టర్ గా ఉన్న జయసూర్య.. శ్రీలంక ఘోర ఓటమికి క్రీడా మంత్రిని గానీ మిగతా వారిని నిందించాల్సిన అవసరం లేదన్నాడు. శ్రీలంక జట్టు ఘోర ఓటమికి మాజీ కెప్టెన్ అర్జున రణతుంగ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన సంగతి తెలిసిందే. బీసీసీఐని మెప్పించడం కోసం శ్రీలంక క్రికెట్ జట్టును నిరాశ నిస్పృహల్లో మునిగేలా చేశారని వ్యాఖ్యానించారు. -
క్రికెటర్ జయసూర్యపై భార్య కోర్టులో పిటిషన్!
ప్రస్తుత శ్రీలంక క్రికెట్ సెలెక్షన్ ప్యానెల్ చైర్మన్, మాజీ కెప్టెన్ సనత్ జయసూర్య భార్య సండ్రా జయసూర్య విడాకుల కోసం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిందని ఆమె తరపు న్యాయవాదుల వెల్లడించారు. అక్టోబర్ 23 తేదిన జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారని.. సాండ్రా తరపు అటార్ని అనోమా గునథిలకే తెలిపారు. త్వరలోనే జయసూర్యకు నోటిసులు జారీ చేస్తారని.. ఆతర్వాత వాదనలు ప్రారంభమవుతాయన్నారు. తన ముగ్గురు పిల్లలతోపాటు తన మెయింటెనెన్స్ కోసం 20 మిలియన్ల ఇప్పించాలని పిటిషన్ లో పేర్కొన్నట్టు అటార్ని తెలిపారు. శ్రీలంక అధ్యక్షుడు మహింద్ర రాజపక్స ప్రభుత్వంలో జయసూర్య పోస్టల్ శాఖలో డిప్యూటి మినిస్టర్ గా సేవలందిస్తున్నారు. ఏప్రిల్ 2010లో జరిగిన ఎన్నికల్లో జయస్యూర్య పార్లమెంట్ కు ఎన్నికయ్యారు.