లంక క్రికెట్ సెలెక్షన్ ప్యానెల్ రాజీనామా
లంక క్రికెట్ సెలెక్షన్ ప్యానెల్ రాజీనామా
Published Tue, Aug 29 2017 8:11 PM | Last Updated on Sun, Sep 17 2017 6:06 PM
సాక్షి, పల్లెకెలె: శ్రీలంక ఘోర పరాజయాలకు బాధ్యత వహిస్తూ ఆ దేశ క్రికెట్ సెలక్షన్ ప్యానెల్ రాజీనామా చేసింది. భారత్‌తో జరిగిన టెస్టు, వన్డే సిరీస్‌లు కోల్పోవడం, అంతకు ముందు జింబాంబ్వేతో ఘోర పరాజయం, చాంపియన్స్ ట్రోఫిలో లీగ్ దశలోనే ఇంటికి చేరడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇక చీఫ్ సెలక్టర్‌గా సనత్ జయసూర్య కమిటీ మెంబర్స్ రంజీత్ మధురసింగే, రొమెశ్ కలువితరణ, ఎరిక్ ఉపాసంతా, అసంకా గురుసిన్హాలతో కూడిన సెలక్షన్ ప్యానెల్ భారత్‌తో జరిగే ఎకైక టీ20 అనంతరం తప్పుకోనున్నట్టు శ్రీలంక క్రికెట్ బోర్డు వైస్ ప్రెసిడెంట్ మోహన్ సిల్వా తెలిపారు. ఈ ప్యానెల్ రాజీనామా లేఖ అందించిందని శ్రీలంక క్రీడా శాఖ మంత్రి దయాశ్రీ జయశేకర ధృవీకరించారు. సెప్టెంబర్ 7తో వీరి పదవుల గడువు ముగుస్తుందన్నారు.
ఇక దిగ్గజ ఆటగాళ్లు కుమార సంగక్కర, జయవర్ధనే, మురళిధరన్‌ల వీడ్కోలనంతరం శ్రీలంక క్రికెట్ బోర్డు గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటుంది. భారత్‌తో సొంతగడ్డపై 3-0తో టెస్టు సిరీస్, రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే 3-0తో వన్డే సిరీస్‌లు కోల్పోయింది. దీంతో లంక క్రికెట్ బోర్డు మెనేజ్‌మెంట్ సంక్షోభంలో పడింది.
Advertisement