India - Sri Lanka
-
ఆర్థిక, దౌత్యంలో నూతనాధ్యాయం
నాగపట్నం/న్యూఢిల్లీ: దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత భారత్, శ్రీలంక మధ్య మొదలైన పడవ ప్రయాణ సేవలు ఇరుదేశాల ద్వైపాక్షిక బంధాన్ని సుధృడం చేస్తాయని ప్రధాని మోదీ అభిలíÙంచారు. శనివారం తమిళనాడులోని నాగపట్నం, జాఫా్నలోని కంకెసంథురై మధ్య ఫెర్రీ సేవలు మొదలవడం అనేది ఇరుదేశాల మైత్రీ బంధంలో కీలకమైన మైలురాయి అని మోదీ శ్లాఘించారు. షిప్పింగ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈ హైస్పీడ్ ఫెర్రీ సేవలు మొదలయ్యాయి. సముద్రమార్గంలో 110 కిలోమీటర్ల దూరాన్ని 3.5 గంటల వ్యవధిలో చేరుకోవచ్చు. ఫెర్రీ సేవలను లాంఛనంగా ప్రారంభించిన సందర్భంగా చెరియాపని అనే పడవ 50 మంది ప్రయాణికులతో శ్రీలంకకు బయల్దేరింది. సాయంత్రం కల్లా భారత్‌కు తిరిగొచి్చంది. ‘ఇరుదేశాల మధ్య కనెక్టివిటీతోపాటు వాణిజ్యం, బంధాల బలోపేతానికి ఫెర్రీ సేవలు ఎంతో కీలకం’ అని ప్రధాని మోదీ తన వీడియో సందేశంలో వ్యాఖ్యానించారు. ‘ ఈ బంధం ఈనాటిదికాదు. ప్రాచీన తమిళ సాహిత్యంలోనూ దీని ప్రస్తావన ఉంది. సంగం కాలం నాటి పట్టినాప్పలై, మణిమేఖలై సాహిత్యంలోనూ భారత్, శ్రీలంక నౌకల రాకపోకల వివరణ ఉంది. ప్రఖ్యాత కవి సుబ్రమణ్యభారతి రాసిన పాట ‘సింధు నదియన్ మిసై’లోనూ రెండుదేశాల బంధాన్ని వివరించారు. చారిత్రక, సాంస్కృతిక బంధాల్లో ఈ పడవ ప్రయాణాల మధుర జ్ఞాపకాలు సజీవంగా ఉన్నాయి. ఇటీవల భారత్‌లో పర్యటించిన సందర్భంగా విక్రమసింఘే అనుసంధాన సంబంధిత విజన్ డాక్యుమెంట్‌ను భారత్‌తో పంచుకున్నారు. 2015లో శ్రీలంకలో నేను పర్యటించాకే ఢిల్లీ, కొలంబో మధ్య నేరుగా విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి ’ అని మోదీ గుర్తుచేసుకున్నారు. మనసులనూ దగ్గర చేస్తోంది ‘ఈ అనుసంధానం రెండు పట్టణాలను మాత్రమే కాదు. రెండు దేశాలను, దేశాల ప్రజలను, వారి మనసులనూ దగ్గర చేస్తోంది. ‘పొరుగుదేశాలకు ప్రాధాన్యం’ అనే మోదీ సర్కార్ విధానాన్ని మరింత తీసుకెళ్తున్నాం’ అని ఈ సేవలను లాంఛనంగా పచ్చజెండా ఊపి ప్రారంభించిన భారత విదేశాంగ మంత్రి జైశంకర్ వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర నౌకలు, షిప్పింగ్, జలరవాణా మంత్రి సర్బానంద సోనోవాల్ పాల్గొన్నారు. రెండు దేశాల మధ్య అనుసంధానం, వాణిజ్యం, పర్యాటకం, సాంస్కృతిక అనుబంధాలను మరింత మెరుగుపరిచేందుకు ఈ సేవలు దోహదపడతాయని శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే వ్యాఖ్యానించారు. గతంలో చెన్నై, కొలంబోల మధ్య తూత్తుకుడి మీదుగా ఇండో–సియోల్ ఎక్స్‌ప్రెస్ ఆధ్వర్యంలో పడవ ప్రయాణలు కొనసాగేవి. అయితేశ్రీలంకలో పౌర సంక్షోభం తలెత్తాక 1982లో ఆ సేవలు నిలిచిపోయాయి. మళ్లీ ఇన్నాళ్లకు ఇలా పడవ సేవలు పునఃప్రారంభమయ్యాయి. -
లంకతో రెండో వన్డే: ధావన్ హాఫ్ సెంచరీ
మొహాలీ: శ్రీలంకతో జరుగుతున్న రెండో వన్డేలో భారత ఓపెనర్ శిఖర్‌ధావన్ అర్ధ సెంచరీ సాధించాడు. 47 బంతుల్లో 7 ఫోర్లతో కెరీర్లో 23 హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇక రోహిత్(23) నిలకడగా ఆడుతున్నాడు. దీంతో భారత్ 15 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 75 పరుగులు చేసింది. ఇక తొలి మ్యాచ్‌లో దారుణంగా విఫలమైన ధావన్ ఈ మ్యాచ్‌లో లంక బౌలర్లను ఓ ఆటాడుకున్నాడు. ప్రదీప్ వేసిన 13 ఓవర్లో మూడు ఫోర్లతో 15 పరుగులు పిండుకున్నాడు. తొలి పది ఓవర్లు నెమ్మదిగా ఆడిన ఈ జోడి అనంతరం పరుగుల వేగాన్ని పెంచింది. -
మూడో టెస్టు : శ్రీలంక 373 ఆలౌట్
న్యూఢిల్లీ: భారత్‌తో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక 373 పరుగులకు కుప్పకూలింది. 356/9 ఓవర్‌నైట్ స్కోర్‌తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన లంక 5.3 ఓవర్ల వ్యవధిలోనే చివరి వికెట్‌ను కోల్పోయింది. ఇషాంత్ వేసిన 135 ఓవర్ మూడో బంతికి చండిమాల్(164) ధావన్‌కు క్యాచ్ ఇచ్చి అవుటవ్వడంతో శ్రీలంక తొలి ఇన్నింగ్స్ ముగిసింది. దీంతో భారత్‌కు 163 పరుగుల ఆధిక్యం లభించింది. సెంచరితో జట్టును ఆదుకున్న చండీమల్కు టెస్టుల్లో ఇదే అత్యుత్తమ స్కోరు కావడం విశేషం. ఇక భారత్ తొలి ఇన్నింగ్స్ 536/7 స్కోరువద్ద డిక్లెర్ ఇచ్చిన విషయం తెలిసిందే. -
లంక క్రికెట్ సెలెక్షన్ ప్యానెల్ రాజీనామా
సాక్షి, పల్లెకెలె: శ్రీలంక ఘోర పరాజయాలకు బాధ్యత వహిస్తూ ఆ దేశ క్రికెట్ సెలక్షన్ ప్యానెల్ రాజీనామా చేసింది. భారత్‌తో జరిగిన టెస్టు, వన్డే సిరీస్‌లు కోల్పోవడం, అంతకు ముందు జింబాంబ్వేతో ఘోర పరాజయం, చాంపియన్స్ ట్రోఫిలో లీగ్ దశలోనే ఇంటికి చేరడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక చీఫ్ సెలక్టర్‌గా సనత్ జయసూర్య కమిటీ మెంబర్స్ రంజీత్ మధురసింగే, రొమెశ్ కలువితరణ, ఎరిక్ ఉపాసంతా, అసంకా గురుసిన్హాలతో కూడిన సెలక్షన్ ప్యానెల్ భారత్‌తో జరిగే ఎకైక టీ20 అనంతరం తప్పుకోనున్నట్టు శ్రీలంక క్రికెట్ బోర్డు వైస్ ప్రెసిడెంట్ మోహన్ సిల్వా తెలిపారు. ఈ ప్యానెల్ రాజీనామా లేఖ అందించిందని శ్రీలంక క్రీడా శాఖ మంత్రి దయాశ్రీ జయశేకర ధృవీకరించారు. సెప్టెంబర్ 7తో వీరి పదవుల గడువు ముగుస్తుందన్నారు. ఇక దిగ్గజ ఆటగాళ్లు కుమార సంగక్కర, జయవర్ధనే, మురళిధరన్ల వీడ్కోలనంతరం శ్రీలంక క్రికెట్ బోర్డు గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటుంది. భారత్‌తో సొంతగడ్డపై 3-0తో టెస్టు సిరీస్, రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే 3-0తో వన్డే సిరీస్‌లు కోల్పోయింది. దీంతో లంక క్రికెట్ బోర్డు మెనేజ్మెంట్ సంక్షోభంలో పడింది.