
న్యూఢిల్లీ: భారత్‌తో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక 373 పరుగులకు కుప్పకూలింది. 356/9 ఓవర్‌నైట్ స్కోర్‌తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన లంక 5.3 ఓవర్ల వ్యవధిలోనే చివరి వికెట్‌ను కోల్పోయింది. ఇషాంత్ వేసిన 135 ఓవర్ మూడో బంతికి చండిమాల్(164) ధావన్‌కు క్యాచ్ ఇచ్చి అవుటవ్వడంతో శ్రీలంక తొలి ఇన్నింగ్స్ ముగిసింది. దీంతో భారత్‌కు 163 పరుగుల ఆధిక్యం లభించింది.
సెంచరితో జట్టును ఆదుకున్న చండీమల్‌కు టెస్టుల్లో ఇదే అత్యుత్తమ స్కోరు కావడం విశేషం. ఇక భారత్ తొలి ఇన్నింగ్స్ 536/7 స్కోరువద్ద డిక్లెర్ ఇచ్చిన విషయం తెలిసిందే.