
ఐపీఎల్-2024 ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉండాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం సాధించింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఆదివారం నాటి మ్యాచ్‌లో 47 పరుగుల తేడాతో జయభేరి మోగించింది.
ఇదిలా ఉంటే.. ఆర్సీబీ- ఢిల్లీ మ్యాచ్ సందర్భంగా ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లి, ఢిల్లీ సీనియర్ పేసర్ ఇషాంత్‌ల ‘బ్రొమాన్స్’ హైలైట్‌గా నిలిచింది.
కాగా చిన్నస్వామి స్టేడియంలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి 187 పరుగులు చేసింది. ఇక ఓపెనర్ విరాట్ కోహ్లి 13 బంతులు ఎదుర్కొని 27 పరుగులు చేశాడు.
అయితే, ఆర్సీబీ ఇన్నింగ్స్ నాలుగో ఓవర్ వేసిన ఇషాంత్ శర్మ బౌలింగ్‌లో మొదటి బంతికి ఫోర్ బాదిన కోహ్లి.. ఇషాంత్‌ను టీజ్ చేశాడు. తదుపరి బంతికి స్లిప్‌లో ఫీల్డర్‌ను పెట్టు అంటూ ఆటపట్టించాడు. అంతేకాదు.. మరుసటి బాల్‌ను సిక్సర్‌గా మలిచాడు.
దీంతో ఉడుక్కున్నా కామ్‌గా కనిపించిన ఇషాంత్.. నాలుగో బంతికి కోహ్లిని ఊరించగా.. అతడు బంతిని గాల్లోకి లేపాడు. అభిషేక్ పోరెల్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా కోహ్లి ఇచ్చిన క్యాచ్ పట్టడంతో అతడు పెవిలియన్ చేరక తప్పలేదు.
ఈ క్రమంలో తానే గెలిచానన్నట్లుగా ఇషాంత్ కోహ్లిని నవ్వుతూ కోహ్లి దగ్గరు వచ్చి.. ‘‘వెళ్లు వెళ్లు ’’ అన్నట్లుగా సైగ చేశాడు. ఇందుకు బదులుగా కోహ్లి కూడా నవ్వుతూ సరేలే అన్నట్లు మైదానాన్ని వీడాడు.
వీళ్లిద్దరి ఫ్రెండ్లీ బ్యాంటర్‌కు సంబంధించిన ఫొటోను షేర్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్.. ‘‘పశ్చిమ ఢిల్లీ అబ్బాయిలు ఇదిగో ఇలా ఉంటారు’’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. అయితే, లక్ష్య ఛేదనలో ఆరంభం నుంచే తడబడ్డ ఢిల్లీ క్యాపిటల్స్ 19.1 ఓవర్లలో 140 పరుగులకే కుప్పకూలింది.
అయితే, పదకొండో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ఇషాంత్ శర్మ నాలుగు బంతులు ఎదుర్కొని సున్నా పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఈ క్రమంలో కోహ్లి ఇషాంత్ శర్మ దగ్గరికి వెళ్లి ‘సర్లే పదా ఇంకా’ అంటూ టీజ్ చేశాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
కాగా కోహ్లి- ఇషాంత్ దేశవాళీ క్రికెట్‌లో ఢిల్లీకి ప్రాతినిథ్య వహించారు. ఇక టీమిండియాలో కోహ్లి కెప్టెన్సీలో ఇషాంత్ ఆడిన విషయం తెలిసిందే.
Kohli man I love him 🤣❤pic.twitter.com/65HxtsIwta
— POTT⁷⁶⁵ (@KlolZone) May 12, 2024
Wrapped up in style ⚡️
High fives 🙌 all around as #RCB make it FIVE 🖐️ in a row 🔥
A comfortable 4️⃣7️⃣-run win at home 🥳
Scorecard ▶️ https://t.co/AFDOfgLefa#TATAIPL | #RCBvDC pic.twitter.com/qhCm0AwUIE— IndianPremierLeague (@IPL) May 12, 2024