పంత్ కీలక నిర్ణయం.. ఆ లీగ్‌లో ఆడనున్న ఢిల్లీ చిచ్చర పిడుగు | DPL 2024: Rishabh Pant And Ishant Sharma Join Dilli 6, Mayank Yadav Misses Out | Sakshi
Sakshi News home page

DPL 2024: పంత్ కీలక నిర్ణయం.. ఆ లీగ్‌లో ఆడనున్న ఢిల్లీ చిచ్చర పిడుగు

Published Sat, Aug 3 2024 6:58 PM | Last Updated on Sat, Aug 3 2024 7:59 PM

DPL 2024: Rishabh Pant And Ishant Sharma join Dilli 6

ఢిల్లీ ప్రీమియర్ లీగ్ ప్రారంభ ఎడిషన్‌లో టీమిండియా స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ భాగం కానున్నాడు. ఈ లీగ్‌లో పురాణి ఢిల్లీ 6 ఫ్రాంచైజీ తరపున పంత్ ఆడనున్నాడు. అతడితో పాటు భారత వెటరన్ క్రికెటర్‌ ఇషాంత్ శర్మ కూడా పురాణి ఢిల్లీకి ప్రాతినిథ్యం వహించనున్నాడు. 

అదే విధంగా యువ ఢిల్లీ ఆటగాళ్లు  హర్షిత్ రాణా, ఆయుష్ బడోనీ, అనుజ్ రావత్‌, యశ్‌దయాల్‌లు కూడా డీపీఎల్‌లో ఆడనున్నారు. తాజాగా డీపీఎల్‌లో పాల్గోనే ఆటగాళ్ల డ్రాఫ్ట్ జాబితాను ఢిల్లీ అండ్‌ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ విడుదల చేసింది. 

అయితే ఈ అరంగేట్ర సీజన్‌కు ఢిల్లీ ఫాస్ట్ బౌలింగ్ సంచలనం మయాంక్ యాదవ్ దూరమయ్యాడు. ఫిట్‌నెస్ సమస్యల కారణంగా ఈ టోర్నీకి మయాంక్‌ దూరంగా ఉండనున్నాడు. మయాంక్ ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ ఆకాడమీలో శిక్షణ పొందుతున్నాడు. ఇక ఈ డీపీఎల్‌ తొట్ట‌ తొలి ఎడిష‌న్ ఆగ‌స్టు 17 నుంచి సెప్టెంబ‌ర్ 8 వ‌ర‌కు జ‌ర‌గ‌నుంది. 

మ్యాచ్‌లన్నీ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరగనున్నాయి. ఈ లీగ్ ప్రారంభ ఎడిషన్‌లో మొత్తం ఆరు ఫ్రాంచైజీలు భాగం కానున్నాయి. సౌత్ ఢిల్లీ సూపర్ స్టార్స్, పురాణి డిల్లీ 6, సెంట్రల్ ఢిల్లీ కింగ్స్, నార్త్ ఢిల్లీ స్ట్రైకర్స్, వెస్ట్ ఢిల్లీ లయన్స్, ఈస్ట్ ఢిల్లీ రైడర్స్ ఫ్రాంచైజీలు రూ. 49.65 కోట్ల రూపాయలకు విక్రయించబడ్డాయి.

సౌత్ ఢిల్లీ సూపర్ స్టార్స్: ఆయుష్ బదోని, కులదీప్ యాదవ్, ప్రియాంష్ ఆర్య, సుమిత్ మాథుర్, దివిజ్ మెహ్రా, కున్వర్ బిధురి, దిగ్వేష్ రాఠీ, తేజస్వి దహియా, రాఘవ్ సింగ్, సౌరభ్ దేస్వాల్, సార్థక్ రే, లక్షయ్ సెహ్రావత్, తరుణ్ బిష్త్, శుభ్ పన్‌బే, శుభమ్ పన్‌బే, శుభమ్ పన్. సింగ్, మయాంక్ గుప్తా, అన్షుమాన్ హుడా, అనిందో నహరాయ్, దీపాంశు గులియా

తూర్పు ఢిల్లీ రైడర్స్: అనుజ్ రావత్, సిమర్జీత్ సింగ్, హిమ్మత్ సింగ్, హిమాన్షు చౌహాన్, హర్ష్ త్యాగి, వైభవ్ శర్మ, మయాంక్ రావత్, సమర్థ్ సేథ్, ప్రణవ్ పంత్, సుజల్ సింగ్, హార్దిక్ శర్మ, రౌనక్ వాఘేలా, అగ్రిమ్ శర్మ, శంతను సింగ్, భగవాన్, భగవాన్, భగవాన్ చౌదరి, సాగర్ ఖత్రి, శివమ్ కుమార్ త్రిపాఠి, రిషబ్ రాణా, లక్షయ సాంగ్వాన్

సెంట్రల్ ఢిల్లీ కింగ్స్: యశ్ ధుల్, ప్రిన్స్ చౌదరి, హితేన్ దలాల్, జాంటీ సిద్ధు, లక్షయ్ థరేజా, యోగేష్ శర్మ, మనీ గ్రేవార్, కేశవ్ దాబాస్, శౌర్య మాలిక్, సౌరవ్ దాగర్, ఆర్యన్ రాణా, సిద్ధాంత్ బన్సల్, రజనీష్ దాదర్, సుమిత్ కుమార్, కౌశల్ సుమన్, దీప్ బల్యాన్, విశాంత్ భాటి, ధ్రువ్ కౌశిక్, అజయ్ గులియా

నార్త్ ఢిల్లీ స్ట్రైకర్స్: హర్షిత్ రాణా, సుయాష్ శర్మ, ప్రన్షు విజయరన్, వైభవ్ కంద్‌పాల్, క్షితిజ్ శర్మ, వైభవ్ రావల్, యష్ దాబాస్, ప్రణవ్ రాజ్‌వంశీ, మనన్ భరద్వాజ్, యశ్ భాటియా, యతీష్ సింగ్, అమన్ భారతి, యజాస్ శర్మ, సార్థక్ చోరంద్, అనిరుధ్ రంజన్, అనిరుద్ , యథార్త్ సింగ్, సిద్ధార్థ సోలంకి, ధ్రువ్ చౌహాన్, యువరాజ్ రాఠీ

వెస్ట్ ఢిల్లీ లయన్స్: హృతిక్ షోకీన్, నవదీప్ సైనీ, దేవ్ లక్రా, దీపక్ పునియా, శివంక్ వశిష్త్, అఖిల్ చౌదరి, ఆయుష్ దోసెజా, క్రిష్ యాదవ్, అన్మోల్ శర్మ, యుగల్ సైనీ, అంకిత్ రాజేష్ కుమార్, వివేక్ యాదవ్, ఆర్యన్ దలాల్, మసాబ్ ఆలం, ఏకాంష్ దోబల్, శివం గుప్తా, యోగేష్ కుమార్, సూర్యకాంత్ చౌహాన్, తిషాంత్ దబ్లా, అబ్రహీం అహ్మద్ మసూది

పురాణి డిల్లీ 6: లలిత్ యాదవ్, ఇషాంత్ శర్మ, అర్పిత్ రాణా, శివం శర్మ, ప్రిన్స్ యాదవ్, రిషబ్ పంత్, మయాంక్ గుసేన్, సనత్ సాంగ్వాన్, అంకిత్ భదానా, యుగ్ గుప్తా, కేశవ్ దలాల్, ఆయుష్ సింగ్, కుష్ నాగ్‌పాల్, సుమిత్ ఛికారా, అర్నవ్ బుగ్గారా బేడీ, మంజీత్, యష్ భరదవాజ్, సంభవ్ శర్మ, లక్ష్మణ్
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement