టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ స్పిన్నర్‌గా సరికొత్త అవతరమెత్తాడు. ఢిల్లీ ప్రీమియర్ లీగ్‌లో పురాణి డిల్లీ 6 జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న పంత్.. సౌత్ ఢిల్లీ సూపర్‌స్టార్జ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో స్పిన్ బౌలింగ్ చేసి అందరని ఆశ్చర్చపరిచాడు.
ఢిల్లీ సూపర్‌స్టార్జ్ విజయానికి ఒక్క పరుగు అవసరమైన సమయంలో పంత్ ఆఫ్ స్పిన్ బౌలింగ్ చేశాడు. అయితే మొదటి బంతికే ఢిల్లీ సూపర్‌స్టార్జ్ విజయం సాధించడంతో పంత్‌కు తన ఓవర్‌ను పూర్తి చేసే అవకాశం లభించలేదు.
కేవలం ఒక్క బాల్ మాత్రమే రిషబ్ బౌలింగ్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇది చూసిన నెటిజన్లు భారత క్రికెట్‌కు మరో బౌలర్ దొరికేశాడంటూ కామెంట్లు చేస్తున్నారు.
కాగా హెడ్ కోచ్ గంభీర్ నేతృత్వంలో ఇప్పటికే సూర్యకుమార్ యాదవ్, శుభమన్ గిల్ వంటి వారు పార్ట్‌టైమ్ బౌలర్లగా మారారు. రాబోయే మ్యాచ్‌ల్లో పంత్ కూడా బౌలింగ్ చేసే అవకాశం లేకపోలేదు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. పురాణి డిల్లీపై 3 వికెట్ల తేడాతో సౌత్ ఢిల్లీ సూపర్‌స్టార్జ్ ఘన విజయం సాధించింది.
తొలుత బ్యాటింగ్ చేసిన పురాణి డిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 197 పరుగుల భారీ స్కోర్ సాధించింది. పురాణి ఢిల్లీ బ్యాటర్లలో అర్పిత్ రాణా(59) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. వన్స్ బేడి(47), పంత్(35), లలిత్ యాదవ్(34) పరుగులతో రాణించారు.
అనంతరం 198 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌత్ ఢిల్లీ.. 19.1 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. సౌత్ ఢిల్లీ బ్యాటర్లలో పియూన్ష్ ఆర్య(57), ఆయూష్ బదోని(57) హాఫ్ సెంచరీలతో మెరిశారు.
Rishabh pant bowling 😸🔥pic.twitter.com/QvM7tFZLcu
— 𝓱 ¹⁷ 🇮🇳 (@twitfrenzy_) August 17, 2024
Comments
Please login to add a commentAdd a comment