CWC 2023: ఆసీస్‌తో మ్యాచ్‌.. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న శ్రీలంక | CWC 2023 AUS VS SL: Sri Lanka Won The Toss And Opt To Bat, Here Are Playing XI | Sakshi
Sakshi News home page

CWC 2023: ఆసీస్‌తో మ్యాచ్‌.. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న శ్రీలంక

Published Mon, Oct 16 2023 1:55 PM | Last Updated on Mon, Oct 16 2023 2:53 PM

CWC 2023 AUS VS SL: Sri Lanka Won The Toss And Opt To Bat, Here Are Playing XI - Sakshi

లక్నోలోని భారతరత్న శ్రీ అటల్‌ బిహారీ వాజ్‌పేయి ఎఖానా స్టేడియం వేదికగా ఇవాళ (అక్టోబర్‌ 16) శ్రీలంక-ఆస్ట్రేలియా జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో శ్రీలంక టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో కోసం ఆసీస్‌ ఎలాంటి మార్పులు చేయకపోగా.. శ్రీలంక రెండు మార్పులతో బరిలోకి దిగనుంది. గత మ్యాచ్‌లో ఆడిన దసున్‌ షనక, మతీష పతిరణ స్థానాల్లో చమిక కరుణరత్నే, లహీరు కుమార జట్టులోకి వచ్చారు. గాయపడి స్వదేశానికి పయనమైన కెప్టెన్‌ షనక​ స్థానంలో కుశాల్‌ మెండిస్‌ లం​క కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. 

తుద జట్లు..
ఆస్ట్రేలియా: మిచెల్ మార్ష్, డేవిడ్ వార్నర్, స్టీవెన్ స్మిత్, మార్నస్ లాబుషేన్‌, జోష్ ఇంగ్లిస్(వికెట్‌కీపర్‌), గ్లెన్ మాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్(కెప్టెన్‌), ఆడమ్ జంపా, జోష్ హాజిల్‌వుడ్

శ్రీలంక: పతుమ్ నిస్సంక, కుశాల్ పెరీరా, కుశాల్ మెండిస్(కెప్టెన్‌/వికెట్‌కీపర్‌), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ధనంజయ డి సిల్వా, చమిక కరుణరత్నే, దునిత్ వెల్లలగే, మహేశ్ తీక్షణ, లహిరు కుమార, దిల్షన్ మధుశంక

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement