టీ20 వరల్డ్ కప్-2022 సూపర్-12 గ్రూప్-1 మ్యాచ్‌ల్లో భాగంగా శ్రీలంకతో ఇవాళ (అక్టోబర్ 25) జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. సెమీస్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన ఈ మ్యాచ్‌లో ఆసీస్ బౌలర్లు మూకుమ్మడిగా రాణించడంతో లంకేయులు నామమాత్రపు స్కోర్‌కే పరిమితమయ్యారు.
తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. పథుమ్ నిస్సంక (45 బంతుల్లో 40; 2 ఫోర్లు), అసలంక (25 బంతుల్లో 38 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), ధనంజయ డిసిల్వా (23 బంతుల్లో 26; 3 ఫోర్లు), చమిక కరుణరత్నే (7 బంతుల్లో 14 నాటౌట్; 2 ఫోర్లు) ఓ మోస్తరుగా రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. వీరు మినహా లంక ఇన్నింగ్స్‌లో అంతా విఫలమయ్యారు. ఆసీస్ బౌలర్లలో హేజిల్‌వుడ్, కమిన్స్, స్టార్క్, అగర్, మ్యాక్స్‌వెల్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పాటు తలో వికెట్ పడగొట్టారు.
కాగా, పెర్త్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ ఆస్ట్రేలియాకు కీలకంగా మారిన విషయం తెలిసిందే. తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో చావుదెబ్బ తిన్న ఆసీస్.. సెమీస్ రేసులో నిలవాలంటే ఈ మ్యాచ్‌లో తప్పనిసరిగా గెలవాలి. మరోవైపు తొలి మ్యాచ్‌లో ఐర్లాండ్‌పై ఘన విజయం సాధించిన శ్రీలంక సైతం ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి సెమీస్ బెర్త్ ఖరారు చేసుకోవాలని పట్టుదలగా ఉంది.
తుది జట్లు..
ఆస్ట్రేలియా: డేవిడ్ వార్నర్, ఆరోన్ ఫించ్, మిచెల్ మార్ష్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, టిమ్ డేవిడ్, మాథ్యూ వేడ్, పాట్ కమిన్స్, ఆస్టన్ అగర్, మిచెల్ స్టార్క్, జోష్ హేజిల్‌వుడ్
శ్రీలంక: పథుమ్ నిస్సంక, కుశాల్ మెండిస్, ధనంజయ డిసిల్వా, చరిత్ అసలంక, భానుక రాజపక్ష, దసున్ శనక, వనిందు హసరంగ, చమిక కరుణరత్నే, మహీశ్ తీక్షణ, బినుర ఫెర్నాండో, లహీరు కుమార
చదవండి: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా.. కరోనాతో స్టార్ బౌలర్ దూరం
Comments
Please login to add a commentAdd a comment