Australia vs Srilanka
-
శ్రీలంకను మట్టికరిపించిన ఆస్ట్రేలియా.. లంకేయుల రికార్డు ఓటమి
శ్రీలంకతో తొలి టెస్టులో ఆస్ట్రేలియా(Sri Lanka vs Australia) ఘన విజయం సాధించింది. ఆతిథ్య జట్టును ఏకంగా ఇన్నింగ్స్ 242 పరుగుల తేడాతో మట్టికరిపించింది. తద్వారా రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. కాగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(World Test Championship- డబ్ల్యూటీసీ) 2023-25 సీజన్లో ఆసీస్ ఇప్పటికే ఫైనల్ చేరిన విషయం తెలిసిందే.అయితే, ఈ ఎడిషన్‌లో ఆఖరిగా రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడేందుకు శ్రీలంక పర్యటనకు వచ్చింది. ఈ టూర్లో భాగంగా రెండు వన్డేలు కూడా ఆడనుంది. ఈ క్రమంలో తొలుత గాలె వేదికగా బుధవారం లంక- ఆసీస్ జట్ల మధ్య మొదటి టెస్టు ఆరంభమైంది.ఉస్మాన్ ఖవాజా డబుల్ సెంచరీఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా(Usman Khawaja) డబుల్ సెంచరీ(232)తో చెలరేగగా.. ట్రవిస్ హెడ్ మెరుపు అర్ధ శతకం(40 బంతుల్లో 57) బాదాడు. స్మిత్, ఇంగ్లిస్ శతకాలుమిగతా వాళ్లలో వన్‌డౌన్ బ్యాటర్ మార్నస్ లబుషేన్(20) మరోసారి విఫలం కాగా.. కెప్టెన్ స్టీవ్ స్మిత్ అద్భుత శతకం(141)తో దుమ్ములేపాడు. ఇక టెస్టు అరంగేట్రంలోనే జోస్ ఇంగ్లిష్ సెంచరీ(102)తో మెరిసి తన విలువను చాటుకోగా.. వికెట్ కీపర్ బ్యాటర్ అలెక్స్ క్యారీ(46 నాటౌట్) కూడా ఫర్వాలేదనిపించాడు. టెయిలెండర్లలో బ్యూ వెబ్‌స్టర్(23), మిచెల్ స్టార్క్(19 నాటౌట్) తమ శక్తిమేర పరుగులు రాబట్టారు.ఈ క్రమంలో 154 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 654 పరుగుల వద్ద ఉన్న వేళ ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. లంక బౌలర్లలో స్పిన్నర్లు ప్రబాత్ జయసూర్య, జెఫ్రీ వాండర్సే మూడేసి వికెట్లు దక్కించుకున్నారు. ఇక తమ తొలి ఇన్నింగ్స్‌లో ఆరంభం నుంచే శ్రీలంక తడబడింది.కంగారూ స్పిన్నర్ల ధాటికి కుదేలుఓపెనర్లు ఒషాడా ఫెర్నాండో, దిముత్ కరుణరత్నె ఏడేసి పరుగులు చేసి పెవిలియన్ చేరగా.. వన్‌డౌన్‌లో వచ్చిన దినేశ్ చండిమాల్ ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యత తీసుకున్నాడు. మొత్తంగా 139 బంతులు ఎదుర్కొని తొమ్మిది ఫోర్ల సాయంతో 72 పరుగులు చేశాడు. అయితే, ఆసీస్ స్పిన్నర్ అద్భుత బంతితో చండిమాల్‌ను వికెట్ల ముందు దొరకబుచ్చుకోవడంతో లంక బ్యాటింగ్ ఆర్డర్ వేగంగా పతనమైంది.మిగతా వాళ్లలో ఏంజెలో మాథ్యూస్(15), కెప్టెన్ ధనంజయ డి సిల్వ(22), వికెట్ కీపర్ కుశాల్ మెండిస్(21) మాత్రమే డబుల్ డిజిట్ స్కోర్లు చేశారు. దీంతో 165 పరుగులకే శ్రీలంక ఆలౌట్ అయింది. ఆస్ట్రేలియా బౌలర్లలో స్పిన్నర్లు మాథ్యూ కుహ్నెమన్ ఐదు వికెట్లతో చెలరేగగా.. నాథన్ లియాన్ మూడు వికెట్లు కూల్చాడు. పేసర్ మిచెల్ స్టార్క్‌కు రెండు వికెట్లు దక్కాయి.ఫాలో ఆన్ గండం.. తప్పని ఓటమిఅయితే, తమ తొలి ఇన్నింగ్స్‌లో లంక కనీసం సగం కూడా స్కోరు చేయకపోవడంతో.. ఆస్ట్రేలియా ధనంజయ బృందాన్ని ఫాలో ఆన్ ఆడించింది. ఈ క్రమంలో వెంటనే తమ రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన శ్రీలంక 247 పరుగులకే కుప్పకూలింది.ఆసీస్ స్పిన్నర్లు కుహ్నెమన్, నాథన్ లియాన్ ధాటికి లంక బ్యాటింగ్ ఆర్డర్ కుదేలైంది. ఈ ఇద్దరు చెరో నాలుగు వికెట్లు తీసి సత్తా చాటారు. ఓపెనర్లు ఒషాడా ఫెర్నాండో(6), దిముత్ కరుణరత్నె(0) మరోసారి విఫలం కాగా.. మిడిలార్డర్ బ్యాటర్లు కాసేపు నిలబడ్డారు. చండిమాల్ 31, ఏంజెలో మాథ్యూస్ 41, కమిందు మెండిస్ 32, ధనంజయ డి సిల్వ 39, కుశాల్ మెండిస్ 34 పరుగులు చేశారు. ఇక ఆఖర్లో జెఫ్రీ వాండర్సే ఒక్కడే అర్ధ శతకం(53) చేయగలిగాడు.లంక క్రికెట్ చరిత్రలో అతిపెద్ద ఓటమిఅయితే, ఆస్ట్రేలియా స్కోరుకు దరిదాపుల్లోకి కూడా రాలేకపోయిన శ్రీలంక.. ఇన్నింగ్స్ 242 పరుగుల తేడాతో ఓటమిని మూటగట్టుకుంది. తమ టెస్టు చరిత్రలోనే పరుగుల పరంగా అతిపెద్ద పరాజయాన్ని నమోదు చేసింది. ఉస్మాన్ ఖవాజాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.చదవండి: హర్షిత్ బదులు అతడిని పంపాల్సింది.. ఇదేం పద్ధతి?: భారత మాజీ క్రికెటర్ ఫైర్ -
వావ్ వాట్ ఏ క్యాచ్.. సింగల్ హ్యాండ్‌తో అద్బుతం! వీడియో వైరల్
గాలే వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో ఆస్ట్రేలియా పట్టు బిగిస్తోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక 15 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 44 పరుగులు చేసింది. ఒషాడో ఫెర్నాండో (7), దిముత్ కరుణరత్నె (7), ఏంజెలో మాథ్యూస్ (7) అవుట్ కాగా... దినేశ్ చండీమల్ (9 బ్యాటింగ్), కమిందు మెండిస్ (13 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. లంక ఇంకా ప్రత్యర్థి తొలి ఇన్నింగ్స్ స్కోరుకు ఇంకా 610 పరుగులు వెనుకబడి ఉంది. అంతకముందు ఆ్రస్టేలియా 154 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 654 పరుగులు చేసి తమ తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. ఆసీస్ బ్యాటర్లలో ఓపెనర్ ఉస్మాన్ ఖ్వాజా (352 బంతుల్లో 232; 16 ఫోర్లు, 1 సిక్స్) కెరీర్లో తొలి డబుల్ సెంచరీ నమోదు చేసుకోగా... అరంగ్రేట ఆటగాడు జోస్ ఇంగ్లిస్ (94 బంతుల్లో 102; 10 ఫోర్లు, 1 సిక్స్), స్టీవ్ స్మిత్ (251 బంతుల్లో 141; 12 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీలతో మెరిశారు.హెడ్ సూపర్ క్యాచ్..కాగా రెండో రోజు ఆటలో ఆసీస్ స్టార్ ప్లేయర్ ట్రావిస్ హెడ్ అద్భుతమైన క్యాచ్‌తో మెరిశాడు. స్టన్నింగ్ క్యాచ్‌తో శ్రీలంక వెటరన్ ఏంజెలో మాథ్యూస్‌ను హెడ్ పెవిలియన్‌కు పంపాడు. లంక ఇన్నింగ్స్ 10వ ఓవర్ వేసిన ఆసీస్ స్పిన్నర్ నాథన్ లియాన్.. మూడో బంతిని మాథ్యూస్‌కు ఆఫ్‌బ్రేక్ డెలివరీగా సంధించాడు. ఆ లూపీ డెలివరీని మాథ్యూస్ ఫ్రంట్ ఫుట్ డిఫెన్స్ ఆడేందుకు ప్రయత్నం చేశాడు.కానీ బంతి బ్యాట్ ఎడ్జ్ తీసుకుని షార్ట్-లెగ్ ఫీల్డర్ కుడివైపునకు వెళ్లింది. ఈ క్రమంలో అక్కడే ఉన్న హెడ్ తన కుడివైపునకు లాంగ్ డైవ్ చేస్తూ సింగిల్ హ్యాండ్‌తో క్యాచ్ అందుకున్నాడు. దీంతో మాథ్యూస్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. చేసేదేమి లేక మాథ్యూస్(7) నిరాశతో మైదానాన్ని వీడాడు.ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా తొలి ఇన్నింగ్స్‌లో హెడ్ బ్యాట్‌తో కూడా సత్తాచాటాడు. ఓపెనర్‌గా వచ్చిన హెడ్ 40 బంతుల్లో 10 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 57 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇక ఆస్ట్రేలియా ఇప్పటికే డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ఆర్హత సాధించిన సంగతి తెలిసిందే.చదవండి: దినేష్ కార్తీక్ విధ్వంసం.. హ్యాట్రిక్ సిక్స్‌లతో హాఫ్ సెంచరీ! వీడియో Travis Head flies at bat pad! ✈️Nathan Lyon gets Australia's THIRD #SLvAUS pic.twitter.com/Nx4KxB0bwy— 7Cricket (@7Cricket) January 30, 2025 -
ఆస్ట్రేలియా ప్రపంచ రికార్డు.. టీమిండియాను వెనక్కి నెట్టి టాప్‌లోకి!
టీమిండియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ సందర్భంగా ఫామ్‌లోకి వచ్చిన ఆస్ట్రేలియా వెటరన్ క్రికెటర్ స్టీవ్ స్మిత్(Steve Smith).. తన జోరును కొనసాగిస్తున్నాడు. మెల్బోర్న్ టెస్టులో భారీ శతకం(140) బాదిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. భారత్ ఆఖరిదైన సిడ్నీ టెస్టులో మొత్తంగా 37 పరుగులు చేసి.. 9999 పరుగుల వద్ద నిలిచాడు. తాజాగా శ్రీలంక(Australia vs Sri Lanka)తో తొలి టెస్టు సందర్భంగా టెస్టుల్లో పది వేల పరుగుల క్లబ్లో చేరాడు. తద్వారా ఆస్ట్రేలియా తరఫున ఈ ఘనత సాధించిన నాలుగో క్రికెటర్‌గా స్మిత్ చరిత్రకెక్కాడు. ఆస్ట్రేలియా ప్రపంచ రికార్డుఅతడి కంటే ముందు.. అలెన్ బోర్డర్, స్టీవ్ వా, రిక్కీ పాంటింగ్(Ricky Ponting) ఈ ఫీట్ నమోదు చేశారు. అయితే, తాజాగా స్మిత్ పదివేల టెస్టు పరుగుల మైలురాయిని అందుకున్న క్రమంలో ఆస్ట్రేలియా ప్రపంచ రికార్డును సొంతం చేసుకుంది. టెస్టు క్రికెట్లో ఒక దేశం తరఫున అత్యధికంగా నలుగురు ఆటగాళ్లు ఈ మైలురాయిని చేరుకోవడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఇంతకు ముందు ఈ జాబితాలో టీమిండియాతో కలిసి ఆసీస్ అగ్రస్థానంలో ఉండేది. ఇప్పుడు భారత్‌ను వెనక్కి నెట్టి వరల్డ్ రికార్డు సొంతం చేసుకుంది. కాగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) 2023-25 సీజన్లో ఆసీస్ జట్టు ఇప్పటికే ఫైనల్‌కు చేరుకుంది. బోర్డర్ -గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఐదు టెస్టుల సిరీస్‌లో టీమిండియాను 3-1తో ఓడించి టైటిల్ పోరుకు అర్హత సాధించింది. ఈ క్రమంలో డబ్ల్యూటీసీ తాజా ఎడిషన్‌లో ఆఖరిగా రెండు టెస్టుల సిరీస్ ఆడేందుకు కంగారూ జట్టు శ్రీలంకకు వచ్చింది.ఖవాజా డబుల్ ధమాకాఈ క్రమంలో గాలె అంతర్జాతీయ స్టేడియం వేదికగా ఇరుజట్ల మధ్య బుధవారం తొలి టెస్టు ఆరంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్‌గా ప్రమోట్ అయిన ట్రవిస్ హెడ్ ధనాధన్ దంచికొట్టి అర్ధ శతకంతో మెరవగా.. మరో ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా ఏకంగా డబుల్ సెంచరీతో చెలరేగాడు. హెడ్ 40 బంతుల్లో 57 పరుగులు సాధిస్తే.. ఖవాజా ఏకంగా 352 బంతులు ఎదుర్కొని 232 రన్స్ చేశాడు.స్మిత్ రికార్డు సెంచరీమరోవైపు.. వన్‌డౌన్ బ్యాటర్ మార్నస్ లబుషేన్(20) తన వైఫల్యాన్ని కొనసాగించగా.. నాలుగో స్థానంలో వచ్చిన కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఆకాశమే హద్దుగా దూసుకుపోయాడు. మొత్తంగా 251 బంతులు ఫేస్ చేసిన స్మిత్.. 12 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 141 పరుగులతో సత్తా చాటాడు. తద్వారా తన టెస్టు కెరీర్లో 35వ టెస్టు సెంచరీ నమోదు చేసిన 36 ఏళ్ల స్మిత్.. పలు రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు.సెంచరీల పరంగా రెండోస్థానంలోకి‘ఫ్యాబ్ ఫోర్’లో ఒకరిగా గుర్తింపు పొందిన స్మిత్ టెస్టు సెంచరీల పరంగా రెండో స్థానానికి చేరుకున్నాడు. ఈ లిస్టులో ఇంగ్లండ్ టెస్టు దిగ్గజం జో రూట్ 36 శతకాలతో ప్రథమస్థానంలో ఉండగా.. న్యూజిలాండ్ స్టార్ కేన్ విలియమ్సన్ 33, టీమిండియా రన్‌మెషీన్ విరాట్ కోహ్లి 30 సెంచరీలతో స్మిత్ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.అంతేకాదు.. ప్రస్తుతం యాక్టివ్‌గా ఉన్న క్రికెటర్లలో మూడు ఫార్మాట్లలో కలిపి శతకాల పరంగా నాలుగో స్థానానికి ఎగబాకాడు. అంతర్జాతీయ స్థాయిలో విరాట్ కోహ్లి 81 శతకాలతో టాప్(Active Cricketers)లో ఉండగా.. రూట్ 52, రోహిత్ శర్మ 48, స్మిత్ 47 సెంచరీలతో టాప్-4లో నిలిచారు.ఇక శ్రీలంకతో మ్యాచ్‌లో ఖవాజా(232), స్మిత్(141)లతో పాటు జోష్ ఇంగ్లిస్ కూడా బ్యాట్ ఝులిపించాడు. 94 బంతుల్లోనే 102 పరుగులతో చెలరేగాడు. ఈ నేపథ్యంలో ఆరు వికెట్ల నష్టానికి 654 పరుగుల వద్ద ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది.టెస్టుల్లో పది వేలకు పైగా పరుగులు చేసిన ఆటగాళ్లు- ఏ దేశం తరఫున ఎందరు?👉ఆస్ట్రేలియా- నలుగురు- అలెన్ బోర్డర్, స్టీవ్ వా, రిక్కీ పాంటింగ్, స్టీవ్ స్మిత్👉ఇండియా- ముగ్గురు- సునిల్ గావస్కర్, సచిన్ టెండుల్కర్, రాహుల్ ద్రవిడ్👉ఇంగ్లండ్- ఇద్దరు- అలిస్టర్ కుక్, జో రూట్👉శ్రీలంక- ఇద్దరు- కుమార్ సంగక్కర, మహేళ జయవర్దనే👉వెస్టిండీస్- ఇద్దరు- బ్రియన్ లారా, శివ్‌నరైన్ చందర్‌పాల్👉పాకిస్తాన్- ఒక్కరు- యూనిస్ ఖాన్👉సౌతాఫ్రికా- ఒక్కరు- జాక్వెస్ కలిస్.చదవండి: మరో డీఎస్పీ!.. పోలీస్ ఉద్యోగంలో చేరిన భారత క్రికెటర్ -
చరిత్ర సృష్టించిన స్మిత్, ఖావాజా.. తొలి ఆసీస్ జోడీగా
గాలే వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో ఆస్ట్రేలియా తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. తొలి రోజు ఆటలో లంక బౌలర్ల భరతం పట్టిన ఆసీస్ బ్యాటర్లు.. రెండో రోజు ఆటలో సైతం అదే తీరును కనబరుస్తున్నారు. మొదటి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ దిశగా కంగారూ జట్టు సాగుతోంది. 117 ఓవర్లు ముగిసే సరికి ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 3 వికెట్లు కోల్పోయి 486 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా ఓపెనర్ ఉస్మాన్ ఖావాజా డబుల్ సెంచరీతో మెరిశాడు. . 290 బంతుల్లో 16 ఫోర్లు, 1 సిక్సర్‌తో ఖావాజా తన తొలి డబుల్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. మరోవైపు ఆసీస్ సూపర్ స్టార్ స్మివ్ స్మిత్ కూడా సూపర్ సెంచరీతో సత్తాచాటాడు. 251 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్స్‌లతో స్మిత్ 141 పరుగులు చేశాడు. రెండో రోజు ఆటలో స్పిన్నర్ వాండర్సే బౌలింగ్‌లో ఎల్బీగా స్మిత్ వెనుదిరిగాడు.అరుదైన రికార్డు..కాగా మూడో వికెట్‌కు ఉస్మాన్ ఖావాజా, స్టీవ్ స్మిత్ మూడో వికెట్‌కు 266 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని వీరిద్దరూ నెలకొల్పారు. తద్వారా ఓ అరుదైన రికార్డును ఈ వెటరన్ ద్వయం తమ ఖాతాలో వేసుకుంది. శ్రీలంక గడ్డపై టెస్టుల్లో అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పిన ఆస్ట్రేలియన్ జోడీగా వీరిద్దరూ రికార్డులకెక్కారు. ఇంతకుముందు ఈ రికార్డు ఆసీస్ దిగ్గజాలు ఆడమ్ గిల్‌క్రిస్ట్, డామియన్ మార్టిన్ పేరిట ఉండేది. 2004లో కాండే వేదికగా జరిగిన లంకతో జరిగిన టెస్టులో గిల్లీ, మార్టిన్ 200 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. తాజా మ్యాచ్‌తో గిల్లీ-డామియన్ ఆల్‌టైమ్ రికార్డును ఖావాజా-స్మిత్ బ్రేక్ చేశారు.కాగా ఇప్పటికే వరల్డ్ టెస్టు ఛాంపియన్ ఫైనల్ బెర్త్‌ను ఆస్ట్రేలియా ఖారారు చేసుకున్న సంగతి తెలిసిందే. టీమిండియాతో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని 3-1 తేడాతో సొంతం చేసుకున్న ఆస్ట్రేలియా.. వరుసగా రెండో సారి డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ఆర్హత సాధించింది. డబ్ల్యూటీసీ 2023-25 సైకిల్లో ఆస్ట్రేలియాకు ఇదే ఆఖరి సిరీస్. ఈ సిరీస్‌కు కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ వ్యక్తిగత కారణాలతో దూరమయ్యాడు. స్టీవ్ స్మిత్ సారథ్యంలో ఆస్ట్రేలియా ఆడుతోంది.చదవండి: RT 2025: హ్యాట్రిక్‌తో చెలరేగిన శార్ధూల్.. టీమిండియాలోకి రీ ఎంట్రీకి సిద్దం -
డబుల్ సెంచరీతో మెరిసిన ఖావాజా.. తొలి ఆసీస్ క్రికెటర్‌గా
గాలే వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ ఉస్మాన్ ఖావాజా(Usman Khawaja) అద్బుతమైన ద్విశకతంతో చెలరేగాడు. 290 బంతుల్లో 16 ఫోర్లు, 1 సిక్సర్‌తో ఖావాజా తన తొలి డబుల్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే అచితూచి ఆడుతూ శ్రీలంకకు కొరకరాని కొయ్యగా ఈ ఆసీస్ వెటరన్ మారాడు.తొలి రోజు ఆటలో ట్రావిస్ హెడ్,స్టీవ్ స్మిత్‌తో కలిసి భాగస్వామ్యాలను నెలకొల్పిన ఖావాజా.. రెండో రోజు ఆటలో జోష్ ఇంగ్లీష్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను నడిపిస్తున్నాడు. ఇదే అతడికి మొట్టమొదటి అంతర్జాతీయ డబుల్ సెంచరీ. ఇప్పటివరకు 79 టెస్టు మ్యాచ్‌లు ఆడిన ఖావాజా.. 45.26 సగటుతో 5839 పరుగులు చేశాడు.అతడి టెస్టు కెరీర్లో 16 సెంచరీలతో పాటు 27 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అయితే భారత్‌తో జరిగిన సిరీస్‌లో మాత్రం ఖావాజా తీవ్ర నిరాశపరిచాడు. కానీ అతడిపై నమ్మకం ఉంచిన సెలక్టర్లు శ్రీలంక పర్యటకు ఎంపిక చేశారు. సెలక్టర్ల నమ్మకాన్ని వమ్ము చేయని ఖావాజా తొలి మ్యాచ్‌లోనే అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు,.భారీ స్కోర్ దిశగా ఆస్ట్రేలియా..తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా భారీ స్కోరు దిశగా దూసుకుపోతుంది. రెండో రోజు ఆట లంచ్ సమయానికి ఆస్ట్రేలియా 3 వికెట్ల నష్టానికి 475 పరుగులు చేసింది. క్రీజులో ఖావాజా(204 నాటౌట్), జోష్ ఇంగ్లీష్(44 నాటౌట్) ఉన్నారు. 330/2 ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను ప్రారంభించిన ఆస్ట్రేలియా.. స్టీవ్ స్మిత్(141) రూపంలో మూడో వికెట్ కోల్పోయింది.తొలి ఆసీస్ క్రికెటర్‌గా..ఈ మ్యాచ్‌లో డబుల్ సెంచరీతో చెలరేగిన ఖావాజా ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. శ్రీలంక గడ్డపై టెస్టు డబుల్ సెంచరీ సాధించిన తొలి ఆస్ట్రేలియా ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఇప్పటివరకు ఏ ఆసీస్ క్రికెటర్ కూడా ఈ ఫీట్ సాధించలేదు.ఖావాజా కంటే ముందు శ్రీలంక గడ్డపై ఆస్ట్రేలియా బ్యాటర్ చేసిన అత్యధిక టెస్ట్ స్కోరు రికార్డు జస్టిన్ లాంగర్ పేరిట ఉండేది. 2004 కొలంబో వేదికగా లంకతో జరిగిన టెస్టులో లాంగర్ 295 బంతుల్లో 166 పరుగులు చేశాడు. తాజా మ్యాచ్‌తో లాంగర్ ఆల్‌టైమ్ రికార్డును ఖావాజా బ్రేక్ చేశాడు. కాగా ఆస్ట్రేలియాకు ఇదే నామమాత్రపు టెస్టు సిరీస్ మాత్రమే. కంగారులు ఇప్పటికే వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్‌కు ఆర్హత సాధించింది.చదవండి:జనాయ్ భోంస్లే కాదు.. సిరాజ్ డేటింగ్లో ఉన్నది ఆమెతోనే? -
శ్రీలంకతో తొలి టెస్టు: టీ20 తరహాలో ట్రవిస్ హెడ్ బాదుడు
శ్రీలంకతో తొలి టెస్టు(Sri Lanka Vs Australia)లో ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ ట్రవిస్ హెడ్(Travis Head) ధనాధన్ దంచికొట్టాడు. తనను ఓపెనర్‌గా పంపినందుకు... అద్భుతమైన ఇన్నింగ్స్‌తో ఆకట్టుకుని జట్టుకు శుభారంభం అందించాడు. మెరుపు అర్ధశతకంతో సత్తా చాటి తన విలువను చాటుకున్నాడు.కాగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) 2023-25 ఎడిషన్‌లో ఆస్ట్రేలియా ఇప్పటికే ఫైనల్‌కు చేరుకుంది. టైటిల్ పోరులో సౌతాఫ్రికాతో జూన్‌లో తలపడనుంది. అంతకంటే ముందు ఈ సీజన్లో ఆఖరిగా శ్రీలంకతో రెండు టెస్టులు ఆడేందుకు అక్కడికి వెళ్లింది.ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య గాలె వేదికగా బుధవారం తొలి టెస్టు ఆరంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఉస్మాన్ ఖవాజా(Usman Khawaja)కు ఓపెనింగ్ జోడీగా ప్రమోట్ అయిన టీ20 వీరుడు ట్రవిస్ హెడ్ ఆది నుంచే లంక బౌలర్లపై అటాక్ చేశాడు.తొలి ఓవర్లోనే మూడు బౌండరీలు.. మెరుపు ఫిఫ్టీఇన్నింగ్స్ ఆరంభంలోనే తన మార్కు చూపించిన హెడ్.. తొలి ఓవర్లోనే మూడు బౌండరీలు బాదాడు. లంక పేసర్ అసిత ఫెర్నాండో బౌలింగ్‌లో మూడు, ఐదు, ఆరో బంతికి ఫోర్లు బాదాడు. అదే జోరులో వీలుచిక్కినప్పుడల్లా బంతిని బౌండరీకి తరలించిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. 35 బంతుల్లోనే యాభై పరుగుల మార్కు అందుకున్నాడు.మొత్తంగా నలభై బంతులు ఎదుర్కొన్న ట్రవిస్ హెడ్.. 57 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటయ్యాడు. లంక స్పిన్నర్ ప్రబాత్ జయసూర్య బౌలింగ్‌లో చండీమాల్‌కు క్యాచ్‌కు ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఇక హెడ్ ఇన్నింగ్స్‌లో పది ఫోర్లతో పాటు.. ఒక సిక్సర్ కూడా ఉంది.టీ20 తరహా వీరబాదుడుఈ నేపథ్యంలో తనను టెస్టుల్లో ఓపెనర్‌గా ప్రమోట్ చేసినందుకు హెడ్.. మేనేజ్మెంట్కు పైసా వసూల్ ప్రదర్శన ఇచ్చాడంటూ అభిమానులు ప్రశంసిస్తున్నారు. టెస్టు ఫార్మాట్లోనూ టీ20 తరహా వీరబాదుడు బాదడం అతడికి మాత్రమే చెల్లుతుందంటూ కొనియాడుతున్నారు. ఇక సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్ అయితే.. హెడ్ ఇప్పటి నుంచే ఐపీఎల్ మోడ్‌లోకి వెళ్లిపోయాడంటూ ఆకాశానికెత్తుతున్నారు.స్టీవ్ స్మిత్ సారథ్యంలోకాగా శ్రీలంకతో టెస్టులకు ఆస్ట్రేలియా రెగ్యులర్ టెస్టు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ దూరంగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో మాజీ సారథి స్టీవ్ స్మిత్ ఈ సిరీస్‌లో కంగారూ జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. ఇక తాజా పర్యటనలో భాగంగా ఆస్ట్రేలియా శ్రీలంకతో రెండు టెస్టులతో పాటు.. కొలంబో వేదికగా రెండు వన్డేల సిరీస్ కూడా ఆడనుంది. ఫిబ్రవరి 14న రెండో వన్డేతో ఆసీస్ లంక టూర్ ముగుస్తుంది. ఇదిలా ఉంటే.. తొలి టెస్టులో హెడ్‌తో పాటు మరో ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా కూడా అర్ధ శతకం పూర్తి చేసుకోగా.. వన్‌డౌన్ బ్యాటర్ మార్నస్ లబుషేన్ అతడికి సహకారం అందిస్తున్నాడు. లంకతో తొలి రోజు ఆటలో భాగంగా 29 ఓవర్లు ముగిసేసరికి ఆస్ట్రేలియా వికెట్ నష్టానికి 132 పరుగులు చేసింది.శ్రీలంక వర్సెస్ ఆస్ట్రేలియా తొలి టెస్టుతుదిజట్లుశ్రీలంకదిముత్ కరుణరత్నే, ఓషద ఫెర్నాండో, దినేష్ చండిమాల్, ఏంజెలో మాథ్యూస్, కమిందు మెండిస్, ధనంజయ డి సిల్వా (కెప్టెన్), కుశాల్ మెండిస్ (వికెట్), ప్రబాత్ జయసూర్య, నిషాన్ పీరిస్, జెఫ్రీ వాండర్సే, అసిత ఫెర్నాండో.ఆస్ట్రేలియాఉస్మాన్ ఖవాజా, ట్రవిస్ హెడ్, మార్నస్ లబుషేన్, స్టీవెన్ స్మిత్ (కెప్టెన్), జోష్ ఇంగ్లిస్, బ్యూ వెబ్‌స్టర్, అలెక్స్ కారీ (వికెట్ కీపర్), మిచెల్ స్టార్క్, మాథ్యూ కుహ్నెమాన్, నాథన్ లియోన్, టాడ్ మర్ఫీ.చదవండి: Suryakumar Yadav: అతడొక వరల్డ్‌క్లాస్ బౌలర్.. మా ఓటమికి కారణం అదేA Travis Head half century inside the first hour of Day 1 👀#SLvAUS pic.twitter.com/e5QNF4FaK3— 7Cricket (@7Cricket) January 29, 2025 -
ట్రావిస్ హెడ్‌కు ప్రమోషన్..
గాలే వేదికగా శ్రీలంకతో బుధవారం(జనవరి29) నుంచి ప్రారంభం కానున్న తొలి టెస్టుకు ఆస్ట్రేలియా అన్ని విధాల సిద్దమైంది. ఈ రెండు మ్యాచ్‌ల సిరీస్ కోసం దుబాయ్‌లో ఏర్పాటు చేసిన స్పెషల్ ట్రైనింగ్ క్యాంపులో కంగారులు తీవ్రంగా శ్రమించారు.లంక స్పిన్నర్లను ఎదుర్కొనేందుకు ప్రత్యేకంగా స్పిన్ ట్రాక్‌లను ఏర్పా టు చేసుకుని మరి ఆస్ట్రేలియా ప్రాక్టీస్ చేసింది. ఈ టూర్‌కు ఆసీస్ రెగ్యూలర్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ వ్యక్తిగత కారణాలతో దూరమయ్యాడు. దీంతో స్టీవ్ స్మిత్ ఆసీస్ జట్టు కెప్టెన్‌గా వ్యహరించనున్నాడు.వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ 2023-25లో ఆసీస్‌కు ఇదే ఆఖరి సిరీస్. కాగా ఆసీస్ ఇప్పటికే డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్‌ను ఖారారు చేసుకుంది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భారత్‌ను ఓడించి డబ్ల్యూటీసీ ఫైనల్లో కమ్మిన్స్ సేన అడుగుపెట్టింది.ఆసీస్ ఓపెనర్‌గా ట్రావిస్ హెడ్..ఇక శ్రీలంకతో తొలి టెస్టులో ఆస్ట్రేలియా ఓపెనర్‌గా స్టార్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ బరిలోకి దిగనున్నాడు. ఉస్మాన్ ఖవాజాతో కలిసి ఆసీస్ ఇన్నింగ్స్‌ను హెడ్ ప్రారంభించనున్నాడు. జట్టులో సామ్ కాన్స్టాస్, నాథన్ మెక్‌స్వీనీ ఉన్నప్పటికి ఆసీస్ టీమ్ మెనెజ్‌మెంట్ మాత్రం హెడ్కే ప్రాధాన్యత ఇచ్చింది.హెడ్ సాధరణంగా వైట్ బాల్ ఫార్మాట్లో ఆసీస్ ఇన్నింగ్స్‌ను ప్రారంభిస్తుంటాడు. టెస్టుల్లో మాత్రం ఎక్కువగా మిడిలార్డర్లో బ్యాటింగ్ వస్తుంటాడు. అయితే రెడ్‌బాల్ క్రికెట్లో కూడా అతడు ఓపెనింగ్ వచ్చిన సందర్భాలు ఉన్నాయి. దీంతో మరోసారి అతడిని ఓపెనర్‌గా పంపి పరీక్షించాలని ఆస్ట్రేలియా టీమ్ మెనెజ్‌మెంట్ మాత్రం భావిస్తుంది.ఈ విషయాన్ని ఆసీస్ స్టాండింగ్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ ధ్రువీకరించాడు. కాగా వార్నర్ రిటైరయ్యాక ఆసీస్ ఓపెనర్లగా నాథన్ మెక్‌స్వీనీ, సామ్ కాన్స్టాస్కు సెలక్టర్లు అవకాశమిచ్చారు. నాథన్ మెక్‌స్వీనీ విఫలమైనప్పటికి కాన్స్టాస్ మాత్రం తన ఆట తీరుతో ఆకట్టుకున్నాడు. అయినప్పటకి లంకతో సిరీస్‌కు అతడికి ఓపెనర్‌గా చోటు దక్కలేదు.ట్రావిస్ హెడ్ మా ఇన్నింగ్స్‌ను ప్రారంభించనున్నాడు. టాపార్డర్డ్లో కూడా అతడు తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తాడని భావిసతున్నాను. అతడు ఏ పొజిషేన్లోనైనా ఒకేలా బ్యాటింగ్ చేస్తాడు. గతంలో భారత్‌లో అతడు ఓపెనర్‌గా వచ్చి అద్బుతమైన ఇన్నింగ్స్‌లు ఆడాడు. దీంతో సెలక్టర్లు మరోసారి ఛాన్స్ ఇచ్చారు అని ప్రీమ్యాచ్ కాన్ఫరెన్స్‌లో స్మిత్ పేర్కొన్నాడు. ఓపెనర్‌గా మూడు టెస్టులు ఆడిన ట్రావిస్.. 223 పరుగులు చేశాడు.కాగా హెడ్ అద్బుతమైన ఫామ్‌లో ఉన్నాడు. భారత్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో 448 పరుగులతో లీడింగ్ రన్‌స్కోరర్‌గా నిలిచాడు.శ్రీలంకతో టెస్టులకు ఆసీస్ జట్టు: స్టీవ్ స్మిత్ (కెప్టెన్), సీన్ అబాట్, స్కాట్ బోలాండ్, అలెక్స్ కారీ, కూపర్ కొన్నోలీ, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖవాజా, సామ్ కాన్స్టాస్, మాట్ కుహ్నెమాన్, మార్నస్ లాబుషేన్, నాథన్ లియోన్, నాథన్ మెక్‌స్వీనీ, టోడ్ మర్ఫీ చదవండి: Rohit Sharma: కొంపదీసి అందుకోసమేనా ఇదంతా?: గావస్కర్ -
ఆస్ట్రేలియాకు భారీ షాక్!.. చాంపియన్స్ ట్రోఫీకి కమిన్స్ దూరం?
‘కెప్టెన్‌గా టీమిండియాపై టెస్టు సిరీస్ గెలవలేకపోవడమే నాకున్న అతిపెద్ద లోటు.. ఈసారి ఎలాగైనా ఆ పని పూర్తిచేస్తాను’.. భారత్‌తో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ ఆరంభానికి ముందు ఆస్ట్రేలియా సారథి ప్యాట్ కమిన్స్ చేసిన వ్యాఖ్యలు ఇవి. అనుకున్నట్లుగానే ఈసారి కంగారూ జట్టుకు ఈ ప్రతిష్టాత్మక ట్రోఫీని అందించాడు ఈ స్టార్ పేసర్.సుదీర్ఘ నిరీక్షణకు తెరబౌలర్గా, కెప్టెన్‌గా తనదైన వ్యూహాలతో 3-1తో టీమిండియాను ఓడించి.. పదేళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించాడు. అంతేకాదు.. తన కెప్టెన్సీలో వరుసగా రెండోసారి ఆస్ట్రేలియాను ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌కు చేర్చాడు. కాగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీ సందర్భంగా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్‌తో పాటు కమిన్స్‌పై కూడా తీవ్రమైన భారం పడింది.స్కాట్ బోలాండ్, స్టార్క్ నుంచి సహకారం అందినా.. కమిన్స్ కూడా వీలైనన్ని ఎక్కువ ఓవర్లు బౌల్ చేయాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో కమిన్స్ గాయపడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అతడు చీలమండ నొప్పితో బాధపడుతున్నట్లు తెలిసింది. శ్రీలంక పర్యటనకు టెస్టు జట్టును ప్రకటించిన సందర్భంగా ఆసీస్ చీఫ్ సెలక్టర్ జార్జ్ బెయిలీ ఈ విషయాన్ని వెల్లడించాడు.చీలమండ గాయంకాగా సొంతగడ్డపై టీమిండియాపై టెస్టు సిరీస్ విజయం తర్వాత ఆస్ట్రేలియా జట్టు శ్రీలంకలో పర్యటించనుంది. కమిన్స్ ఈ టూర్‌కు దూరం కాగా.. అతడి డిప్యూటీ స్టీవ్ స్మిత్ కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. ఈ విషయాల గురించి జార్జ్ బెయిలీ మాట్లాడుతూ.. ‘‘కమిన్స్‌కు వ్యక్తిగతంగా కాస్త పని ఉంది. అయితే, అతడు జట్టుకు దూరం కావడానికి అదొక్కటే కారణం కాదు.అతడు చీలమండ నొప్పితో బాధపడుతున్నాడు. వచ్చే వారం అతడు స్కానింగ్‌కు వెళ్తాడు. వైద్య పరీక్షల నివేదిక వచ్చిన తర్వాతే గాయంపై పూర్తి స్పష్టత వస్తుంది’’ అని తెలిపాడు. కాగా కమిన్స్ గాయం గనుక తీవ్రతరమైతే ఆస్ట్రేలియాకు భారీ ఎదురుదెబ్బ తగిలినట్లే.చాంపియన్స్ ట్రోఫీకి ముందు ఎదురుదెబ్బఎందుకంటే.. చాంపియన్స్ ట్రోఫీ-2025 రూపంలో ఐసీసీ ప్రధాన టోర్నమెంట్ సమీపిస్తోంది. ఫిబ్రవరి 19- మార్చి 9 వరకు ఈ మెగా ఈవెంట్ జరుగనుంది. టోర్నీ మొదలయ్యేనాటికి కమిన్స్ పూర్తి ఫిట్‌గా లేనట్లయితే.. ఈ వన్డే వరల్డ్‌కప్-2023 చాంపియన్‌కు కష్టాలు తప్పవు. కాగా భారత్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్ టోర్నీలో ఆటగాడిగా, కెప్టెన్‌గా సత్తా చాటాడు కమిన్స్. ఫైనల్లో టీమిండియాను ఓడించి ఆసీస్‌ను చాంపియన్‌గా నిలిపాడు.ఇదిలా ఉంటే.. చాంపియన్స్ ట్రోఫీలో అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్, ఇంగ్లండ్‌లతో కలిసి ఆస్ట్రేలియా గ్రూప్-‘బి’లో ఉంది. ఇందులో భాగంగా తమ తొలి మ్యాచ్‌లో ఆసీస్ లాహోర్ వేదికగా ఫిబ్రవరి 22న ఇంగ్లండ్‌తో తమ తొలి మ్యాచ్ ఆడనుంది. కాగా.. పాకిస్తాన్ చాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్య హక్కులను దక్కించుకోగా.. టీమిండియాను అక్కడికి పంపేందుకు బీసీసీఐ నిరాకరించింది. ఈ నేపథ్యంలో భారత జట్టు తటస్థ వేదికైన దుబాయ్‌లో తమ మ్యాచ్‌లు ఆడుతుంది.శ్రీలంకతో రెండు టెస్టుల సిరీస్‌కు ఆస్ట్రేలియా జట్టుస్టీవ్ స్మిత్ (కెప్టెన్), సీన్ అబాట్, స్కాట్ బోలాండ్, అలెక్స్ క్యారీ, కూపర్ కొన్నోలీ, ట్రవిస్ హెడ్ (వైస్ కెప్టెన్), జోష్ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖవాజా, సామ్ కొన్‌స్టాస్, మాట్ కుహ్నెమాన్, మార్నస్ లబుషేన్, నాథన్ లియోన్, నాథన్ మెక్‌స్వీనీ, టాడ్ మర్పీ, మిచెల్ స్టార్క్, బ్యూ వెబ్‌స్టర్.చదవండి: ‘చాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే భారత జట్టు ఇదే.. వాళ్లిద్దరికి నో ఛాన్స్!’ -
ఆస్ట్రేలియా కెప్టెన్‌గా స్టీవ్ స్మిత్..
వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ 2023-25 సైకిల్లో ఆస్ట్రేలియా తమ ఆఖరి సిరీస్‌కు సిద్దమవుతోంది. ఇప్పటికే డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్‌ను ఖారారు చేసుకున్న ఆసీస్.. రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో తలపడేందుకు శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. ఇరు జట్ల మధ్య జనవరి 29 నుంచి ఈ రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది.ఈ క్రమంలో లంకతో సిరీస్‌కు 16 మంది సభ్యులతో కూడిన తమ జట్టును క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. ఈ టూర్‌కు రెగ్యూలర్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్(Pat cummins) దూరమయ్యాడు. అతడి భార్య రెండో బిడ్డకు జన్మనివ్వనుండడంతో ఈ సిరీస్ నుంచి కమ్మిన్స్ తప్పుకున్నాడు. అతడి స్దానంలో స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్(Steve Smith ) ఎంపికయ్యాడు.స్టార్క్‌కు నో రెస్ట్..అదే విధంగా ఈ సిరీస్‌లో ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ ఆడనున్నాడు. తొలుత అతడికి విశ్రాంతి ఇస్తారని వార్తలు వినిపించినప్పటికి, ఆసీస్ సెలక్టర్లు మాత్రం జట్టులో కొనసాగించారు. మరోవైపు స్టార్ పేసర్ జోష్ హాజిల్‌వుడ్ ప్రక్కటెముకుల గాయం కారణంగా ఈ సిరీస్‌కు దూరమయ్యాడు.భారత్‌తో జరిగిన సిరీస్‌లో గాయపడిన హాజిల్‌వుడ్.. ఇంకా కోలుకోవడానికి నెల రోజుల సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. అతడు తిరిగి ఛాంపియన్స్ ట్రోఫీకి అందుబాటులో రానున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా వర్గాలు వెల్లడించాయి. ఈ లంక సిరీస్‌కు ఎంపికైన జట్టులో మిచెల్ స్టార్క్, సీన్ అబాట్, స్కాట్ బోలాండ్ ఫ్రంట్‌లైన్ పేసర్లగా ఉన్నారు.యువ సంచలనానికి పిలుపు..ఆస్ట్రేలియా అండర్-19 జట్టు మాజీ కెప్టెన్ కూపర్ కొన్నోలీకి తొలిసారి సెలక్టర్లు పిలుపునిచ్చారు. ఈ 16 మంది సభ్యుల జట్టులో కొన్నోలీకి చోటు దక్కింది. దేశీవాళీ క్రికెట్లో మెరుగైన ప్రదర్శన కనబరుస్తుండడంతో అతడిని సెలక్టర్లు ఎంపిక చేశారు. కొన్నోలీ ప్రస్తుతం బిగ్‌బాష్ లీగ్‌లో పెర్త్స్కార్చర్స్ తరపున ఆడుతున్నాడు.ఈ 21 ఏళ్ల కొన్నోలీకి బ్యాటింగ్‌తో అద్బుతమైన బౌలింగ్ సిల్క్స్ కూడా ఉన్నాయి. ఇక భారత్‌తో టెస్టు సిరీస్‌కు దూరంగా ఉన్న స్పిన్నర్లు మాట్ కుహ్నెమాన్, టాడ్ మర్ఫీ తిరిగి జట్టులోకి వచ్చారు. అదేవిధంగా బీజీటీలో అదరగొట్టిన సామ్ కాన్స్టాస్, వెబ్స్టార్లను శ్రీలంక సిరీస్‌కు కూడా ఆసీస్ సెలక్టర్లు కొనసాగించారు.ఆస్ట్రేలియా జట్టు: స్టీవ్ స్మిత్ (కెప్టెన్), సీన్ అబాట్, స్కాట్ బోలాండ్, అలెక్స్ కారీ, కూపర్ కొన్నోలీ, ట్రావిస్ హెడ్ (వైస్ కెప్టెన్), జోష్ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖవాజా, సామ్ కాన్స్టాస్, మాట్ కుహ్నెమాన్, మార్నస్ లాబుషేన్, నాథన్ లియోన్, నాథన్ మెక్‌స్వీనీ, టాడ్ మర్ఫీ , మిచెల్ స్టార్క్, బ్యూ వెబ్స్టర్చదవండి: 'రోహిత్ నిర్ణయం సరైనది కాదు.. ఇక టెస్టులకు విడ్కోలు పలికితే బెటర్' -
గెలుపు జోష్‌లో ఉన్న ఆస్ట్రేలియాకు భారీ షాక్..
టీమిండియాతో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని సొంతం చేసుకున్న ఆస్ట్రేలియా.. ఇప్పుడు మరో రెడ్ బాల్ సిరీస్‌కు సిద్దమైంది. ఆసీస్ జట్టు రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడేందుకు శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. ఈ సిరీస్‌లో విజయం సాధించి డబ్ల్యూటీసీ సైకిల్ 2024-25ను విజయంతో ముగించాలని కంగారులు భావిస్తున్నారు.అయితే ఈ టెస్టు సిరీస్‌కు ముందు ఆస్ట్రేలియాకు భారీ ఎదరుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్‌పేసర్ జోష్ హాజిల్‌వుడ్ గాయం కారణంగా లంక పర్యటనకు దూరమయ్యాడు. ఇటీవల భారత్‌తో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో కేవలం రెండు టెస్టులు మాత్రమే ఆడిన హాజిల్‌వుడ్ ప్రస్తుతం.. ప్రక్కటెముకుల గాయంతో బాధపడుతున్నాడు.ఈ కారణంతోనే బీజీటీ మధ్యలో తప్పుకున్న హాజిల్‌వుడ్.. ఇప్పుడు శ్రీలంక సిరీస్‌కు కూడా అందుబాటులో ఉండడని ది సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ తెలిపింది. ఈ సిరీస్‌కు ఆసీస్ రెగ్యూలర్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ కూడా దూరం కానున్నాడు.అతడి భార్య రెండో బిడ్డకు జన్మనివ్వనుండడంతో లంక టూర్‌కు దూరంగా ఉండాలని ప్యాట్ నిర్ణయించుకున్నాడు. హాజిల్‌వుడ్ స్ధానంలో జో రిచర్డ్సన్, కమ్మిన్స్ స్ధానంలో మైఖల్ నీసర్ జట్టులోకి రానున్నట్లు తెలుస్తోంది.కాగా బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో 3-1 తేడాతో విజయం సాధించిన ఆస్ట్రేలియా జట్టు ఇప్పటికే తమ డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్‌ను ఖారారు చేసుకుంది. జూన్ 11న లార్డ్స్ వేదికగా ప్రారంభం కానున్న వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో దక్షిణాఫ్రికాతో ఆసీస్ తలపడనుంది.కాగా ఈ నామమాత్రపు సిరీస్‌కు వీరిద్దరితో పాటు స్టార్ ప్లేయర్ మిచెల్ స్టార్క్‌కు విశ్రాంతి ఇవ్వాలని క్రికెట్ ఆస్ట్రేలియా భావిస్తున్నట్లు సమాచారం. ఈ రెండు మ్యాచ్‌ల సిరీస్ జనవరి 29 నుంచి ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌కు ఆస్ట్రేలియా జట్టును ఒకట్రెండు రోజుల్లో ప్రకటించే అవకాశముంది.అయితే శ్రీలంకను వారి సొంతగడ్డపై ఓడించడం అసీస్‌కు అంతసులువు కాదు. శ్రీలంకలో టర్నింగ్ వికెట్స్ ఎక్కువగా ఉంటాయి. ఆసీస్‌తో పోలిస్తే లంక జట్టులోనే అద్బుతమైన స్పిన్నర్లు ఉన్నారు. ప్రభాత్ జయసూర్య వంటి స్పిన్నర్‌ను ఆసీస్ బ్యాటర్లు ఎలా ఎదుర్కొంటారో చూడాలి.చదవండి: BGT: ఆస్ట్రేలియా నిజంగానే గొప్పగా ఆడిందా?.. బుమ్రా వేరే గ్రహం నుంచి వచ్చాడా? -
WTC Final: టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాలంటే?
ఆస్ట్రేలియాతో మూడో టెస్టు డ్రా కావడం టీమిండియాకు సానుకూలాంశంగా పరిణమించింది. ఈ మ్యాచ్ ఫలితం లేకుండా ముగిసిపోవడం వల్ల ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) 2023-25 ఫైనల్ రేసులో రోహిత్ సేన నిలవగలిగింది. అయితే, మిగిలిన రెండు టెస్టుల్లో కచ్చితంగా గెలిస్తేనే భారత్‌కు మార్గం సుగమమవుతుంది.మూడో స్థానంలోనే టీమిండియాడబ్ల్యూటీసీ తాజా ఎడిషన్‌లో భాగంగా ఆస్ట్రేలియాలో తమ చివరి టెస్టు సిరీస్ ఆడుతోంది. ఈ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో కనీసం నాలుగు గెలిస్తేనే భారత్‌కు నేరుగా ఫైనల్లో అడుగుపెట్టే అవకాశం ఉండేది. ఈ క్రమంలో తొలి టెస్టులో భారీ తేడాతో గెలిచిన టీమిండియా.. రెండో టెస్టులో మాత్రం ఘోరంగా ఓడిపోయింది.అయితే, మూడో మ్యాచ్‌లో ఓటమి నుంచి తప్పించుకుని కనీసం డ్రా చేసుకోగలిగింది. ఈ నేపథ్యంలో డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో రోహిత్ సేన మూడో స్థానం నిలబెట్టుకోగలిగింది. ప్రస్తుతం భారత్ ఖాతాలో 114 పాయింట్లు ఉన్నాయి. ఇక విజయాల శాతం 55.88గా ఉంది.మరోవైపు.. అగ్రస్థానంలో ఉన్న సౌతాఫ్రికాకు 76 పాయింట్లే ఉన్నా.. గెలుపు శాతం 63.33. ఇక రెండో స్థానంలో ఆస్ట్రేలియా ఖాతాలో 106 పాయింట్లు ఉండగా.. విన్నింగ్ పర్సెంటేజ్ 58.89. కాగా సౌతాఫ్రికా తదుపరి సొంతగడ్డ మీద పాకిస్తాన్‌తో రెండు టెస్టులు ఆడనుంది.ఇక ఆస్ట్రేలియా కూడా టీమిండియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ ముగిసిన తర్వాత శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. ఈ రెండు జట్లు తమ తదుపరి సిరీస్‌లలో సులువుగానే గెలిచే అవకాశాలు ఉన్నాయి కాబట్టి... టీమిండియాకు పెద్ద సవాలే ముందుంది.రోహిత్ సేన తప్పక గెలవాల్సిందేఈ సీజన్లో టీమిండియాకు మిగిలినవి రెండే టెస్టులు. ఆసీస్‌తో మెల్బోర్న్, సిడ్నీ టెస్టులో కచ్చితంగా రోహిత్ సేన గెలవాల్సిందే. తద్వారా ఆస్ట్రేలియాపై 3-1తో విజయం సాధిస్తే.. భారత్ విజయాల శాతం 60.52కు పెరుగుతుంది. మరోవైపు.. ఆసీస్ విన్నింగ్ పర్సెంటేజ్ 57 శాతానికి పడిపోతుంది. దీంతో టీమిండియాకు ఫైనల్ లైన్ క్లియర్ అవుతుంది.లేని పక్షంలో.. ఒకవేళ ఈ సిరీస్ 2-2తో డ్రా అయితే.. రోహిత్ సేన గెలుపు శాతం 57.01 అవుతుంది. అదే గనుక జరిగితే ఆస్ట్రేలియాకు టైటిల్ పోరుకు అర్హత సాధించడం సులువవుతుంది. శ్రీలంక టూర్లో కంగారూలు 2-0తో గెలిస్తే నేరుగా ఫైనల్లో అడుగుపెడుతుంది.సౌతాఫ్రికాకు లైన్‌క్లియర్!ఇక సౌతాఫ్రికా పాకిస్తాన్‌ను గనుక 2-0తో క్లీన్‌స్వీప్ చేస్తే ఎలాంటి సమీకరణలతో సంబంధం లేకుండా డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరుకుంటుంది. కాబట్టి అప్పుడు రెండోస్థానం కోసం రేసు ప్రధానంగా టీమిండియా- ఆస్ట్రేలియా మధ్యే ఉంది. ఒకవేళ పాకిస్తాన్ ఏదైనా అద్భుతం చేసి సౌతాఫ్రికాను నిలువరిస్తే అప్పుడు పరిస్థితి మరింత రసవత్తరంగా మారుతుంది. చదవండి: అదే జరిగితే కెప్టెన్సీకి రోహిత్ శర్మ గుడ్‌బై! -
ట్రావిస్ హెడ్‌కు ప్రమోషన్.. ఆస్ట్రేలియా కెప్టెన్‌గా!?
భారత్‌తో టెస్టు సిరీస్ అనంతరం ఆస్ట్రేలియా శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్లో భాగంగా ఆతిథ్య శ్రీలంకతో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో కంగారులు తలపడనున్నారు. అయితే ఈ పర్యటనకు ఆసీస్ రెగ్యూలర్ ప్యాట్ కమ్మిన్స్ దూరం కానున్నట్లు తెలుస్తోంది.ఈ సిరీస్ జనవరి 27 నుంచి ప్రారంభం కానుంది. సరిగ్గా ఇదే సమయంలో కమ్మిన్స్ భార్య బెకీ తమ రెండవ బిడ్డకు జన్మనిచ్చే అవకాశముంది. ఈ క్రమంలోనే కమ్మిన్స్ శ్రీలంకతో సిరీస్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.తన కొడుకు అల్బీ పుట్టినప్పుడు పక్కనలేని కమ్మిన్స్.. ఈసారి రెండో బిడ్డ విషయంలో మాత్రం ఫ్యామిలీతోనే ఉండాలని భావిస్తున్నడంట. కమ్మిన్స్ ఇప్పటికే తన నిర్ణయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియాకు తెలియజేసినట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి.ఆసీస్ కెప్టెన్‌గా ట్రావిస్ హెడ్?ఇక స్వదేశంలో భారత్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో సత్తాచాటుతున్న ఆసీస్ స్టార్ ప్లేయర్ ట్రావిస్ హెడ్‌కు ప్రమోషన్ దక్కనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. శ్రీలంక టూర్‌కు ఒకవేళ కమ్మిన్స్ దూరమైతే, కెప్టెన్సీ బాధ్యతలు హెడ్‌కు అప్పగించాలని క్రికెట్ ఆస్ట్రేలియా భావిస్తున్నట్లు తెలుస్తోంది.వైస్ కెప్టెన్ స్మిత్ ఉన్నప్పటికి హెడ్ వైపే క్రికెట్ ఆస్ట్రేలియా పెద్దలు మొగ్గు చూపుతున్నారంట. అయితే హెడ్ ఇప్పటివరకు ఒక్కసారి కూడా టెస్టుల్లో కెప్టెన్సీ చేయలేదు. కానీ వైట్ క్రికెట్లో మాత్రం సారథిగా హెడ్‌కు అనుభవం ఉంది. బిగ్ బాష్ లీగ్‌లో అడిలైడ్ స్ట్రైకర్స్‌కు కెప్టెన్‌గా హెడ్ వహించాడు. కాగా బోర్డర్- గవాస్కర్ ట్రోఫీలో హెడ్ ఇప్పటికే రెండు సెంచరీలు సాధించాడు. పింక్‌బాల్ టెస్టులో ఆసీస్ ఘన విజయం సాధించడంలో హెడ్ కీలక పాత్ర పోషించాడు. -
అతడికి జట్టులో ఉండే అర్హత లేదు: డేవిడ్ వార్నర్
ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్‌ను ఉద్దేశించి ఆ జట్టు మాజీ క్రికెటర్ డేవిడ్ వార్నర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. మాక్సీకి టెస్టు జట్టులో ఉండే అర్హతే లేదన్నాడు. కాగా మాక్స్వెల్ ఆస్ట్రేలియా తరఫున టెస్టు బరిలో దిగి దాదాపు ఏడేళ్లు అవుతోంది. బంగ్లాదేశ్ పర్యటనలో భాగంగా 2017లో తన చివరి టెస్టు ఆడాడు.ఏడు టెస్టులుచట్టోగ్రామ్ వేదికగా నాటి మ్యాచ్‌లో 36 ఏళ్ల మాక్సీ రెండు ఇన్నింగ్స్‌లో వరుసగా 28, 25* పరుగులు చేశాడు. ఇక 2013లో టెస్టుల్లో అరంగేట్రం చేసిన ఈ స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ ఇప్పటివరకు మొత్తంగా.. తన కెరీర్లో ఏడు టెస్టులు ఆడాడు.టెస్టుల్లోనూ పునరాగమనం చేయాలనే ఆశఇందులో నాలుగు టీమిండియా, ఒకటి పాకిస్తాన్, రెండు బంగ్లాదేశ్‌తో ఆడిన మ్యాచ్‌లు. వీటన్నింటిలో కలిపి 339 పరుగులు చేసిన మాక్సీ.. ఎనిమిది వికెట్లు మాత్రమే తీశాడు. ఇక వన్డే, టీ20లలో అదరగొడుతున్న ఈ ఆల్‌రౌండర్.. టెస్టుల్లోనూ పునరాగమనం చేయాలని ఆశపడుతున్నాడు. వచ్చే ఏడాది జనవరిలో శ్రీలంక పర్యటనకు వెళ్లనున్న ఆసీస్ టెస్టు జట్టులో తనకు చోటు దక్కితే బాగుంటుందని.. ఇటీవల మాక్సీ తన మనసులోని మాట బయటపెట్టాడు.అతడి ఆ అర్హత కూడా లేదుఈ విషయంపై మాజీ ఓపెనర్ డేవిడ్ వార్నర్ స్పందిస్తూ.. ‘‘నీకు దేశీ టోర్నీ జట్టులోనే చోటు దక్కనపుడు.. జాతీయ జట్టులో స్థానం కావాలని ఆశించడం సరికాదు!.. నిజానికి నీకు టెస్టుల్లో ఆడాలనే కోరిక మాత్రమే ఉంది. ఆ కారణంగా నిన్నెవరూ జట్టుకు ఎంపిక చేయరు.క్లబ్ క్రికెట్ ఆడుతూ.. అక్కడ నిరూపించుకుంటే.. టెస్టు క్రికెట్ జట్టు నుంచి తప్పకుండా పిలుపు వస్తుంది. కానీ.. అతడు అలాంటిదేమీ చేయడం లేదు. కాబట్టి.. నా దృష్టిలో మాక్సీకి టెస్టు జట్టు చోటు కోరుకునే అర్హత కూడా లేదు’’ అని వార్నర్ ఘాటు విమర్శలు చేశాడు.కాగా గతేడాది ఇంగ్లండ్ కౌంటీల్లో భాగంగా వార్విక్షైర్ తరఫున మాక్స్వెల్ ఫస్ట్‌క్లాస్ మ్యాచ్ ఆడాడు. అనంతరం దేశీ టోర్నీ షెఫీల్డ్ షీల్డ్‌లో విక్టోరియా తరఫున అతడు బరిలోకి దిగాల్సింది. అయితే, పాకిస్తాన్‌తో ఇటీవల పరిమిత ఓవర్ల క్రికెట్ సిరీస్ సమయంలో మాక్సీకి తొడ కండరాల గాయమైంది. ఫలితంగా అతడు ఆటకు దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో డేవిడ్ వార్నర్ కోడ్ స్పోర్ట్స్ షోలో ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు.టీమిండియాతో టెస్టులతో ఆసీస్ బిజీఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియా ప్రస్తుతం టీమిండియాతో టెస్టు సిరీస్‌తో బిజీగా ఉంది. బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్‌తో ఐదు టెస్టులు ఆడతున్న కంగారూ జట్టు సిరీస్‌ను ప్రస్తుతం 1-1తో సమం చేసింది. పెర్త్‌లో జరిగిన తొలి టెస్టులో టీమిండియా చేతిలో ఓడిన ఆసీస్.. అడిలైడ్‌లో జరిగిన పింక్ టెస్టులో ఘన విజయం సాధించింది. ఇరుజట్ల మధ్య డిసెంబరు 14 నుంచి మూడో టెస్టు జరుగనుంది. బ్రిస్బేన్‌లోని ‘ది గాబా’ మైదానం ఇందుకు వేదిక.చదవండి: PAK vs SA: షాహీన్ అఫ్రిది ప్రపంచ రికార్డు.. -
ఏడేళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇవ్వనున్న మాక్సీ!
ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ టెస్టు క్రికెట్లో పునరాగమనం చేయనున్నట్లు తెలుస్తోంది. శ్రీలంకతో సిరీస్ ద్వారా అతడు రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైనట్లు సమాచారం.కాగా ప్రపంచకప్ టెస్టు చాంపియన్‌షిప్ 2023- 25 ఫైనల్ లక్ష్యంగా ముందుకు సాగుతోంది ఆసీస్. ఇందులో భాగంగా వచ్చే ఏడాది శ్రీలంకతో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడనుంది.ఈ టూర్ ద్వారా సిరీస్ ద్వారా మాక్సీని తిరిగి టెస్టుల్లో ఆడించేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా సుముఖంగా ఉన్నట్లు సమాచారం. అందుకే టీ20 ఫార్మాట్ నుంచి అతడికి విశ్రాంతినిచ్చిన బోర్డు.. టెస్టులకు సన్నద్ధం కావాలని ఆదేశించిందని ఆస్ట్రేలియా మీడియా సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ పేర్కొంది. రెడ్‌బాల్ క్రికెట్లో తక్కువ మ్యాచ్‌లు మాత్రమే ఆడినా మాక్సీపై మేనేజ్మెంట్కు నమ్మకం ఉందని సన్నిహిత వర్గాలు తెలిపినట్లు వెల్లడించింది.ఇక మాక్సీతో పాటు పీటర్ హ్యాండ్స్కోంబ్, జోష్ ఇంగ్లిస్ కూడా జట్టులోకి తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. కాగా టీమిండియాతో సిరీస్‌లో భాగంగా 2013లో టెస్టుల్లో అరంగేట్రం చేశాడు గ్లెన్ మాక్స్వెల్.ఇప్పటి వరకు కేవలం ఏడు టెస్టులు ఆడిన ఈ స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్.. ఓ సెంచరీ సాయంతో 339 పరుగులు చేశాడు. అదే విధంగా ఎనిమిది వికెట్లు పడగొట్టాడు. 2017లో చివరిసారిగా బంగ్లాదేశ్‌తో టెస్టు మ్యాచ్‌లో ఆడిన మాక్సీ.. ఆ తర్వాత పరిమిత ఓవర్ల క్రికెట్‌కే పరిమితమయ్యాడు.ఈ క్రమంలో 2022లో శ్రీలంక టూర్‌కు ఎంపికైన మాక్సీ.. టెస్టు తుదిజట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. అయితే, ఇంగ్లండ్ కౌంటీ చాంపియన్‌షిప్‌లో వార్విక్షైర్ తరఫున ఆడిన మాక్స్వెల్ 81 పరుగులతో రాణించాడు.ఈ నేపథ్యంలో టీమిండియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో అతడిని ఆడించాలని బోర్డు భావించగా.. రోడ్డు ప్రమాదం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. కాగా మాక్సీ టెస్టు కెరీర్ గొప్పగా లేకపోయినా.. శ్రీలంకలో స్పిన్నర్ల అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని ఆసీస్ బోర్డు అతడికి మరో అవకాశం ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నట్లు సమాచారం. -
WC 2023: మీ నాన్న నేర్పించలేదా?: ఆసీస్ క్రికెటర్‌ను ప్రశ్నించిన గావస్కర్
ICC WC 2023- Aus Vs SL: వన్డే వరల్డ్‌కప్-2023లో శ్రీలంకపై విజయంతో హ్యాట్రిక్ ఓటమి ముప్పు నుంచి తప్పించుకుంది ఆస్ట్రేలియా. లక్నోలో సోమవారం జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో లంకను ఓడించి.. తాజా ఎడిషన్‌లో తొలి గెలుపు నమోదు చేసింది. కాగా ఆసీస్‌తో మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక ఆరంభంలో అదరగొట్టినా.. మిడిలార్డర్, లోయర్ ఆర్డర్ కుప్పకూలడంతో 209 పరుగులకే పరిమితమైంది. ఆసీస్ స్పిన్నర్ ఆడం జంపా(4 వికెట్లు) దాటికి లంక బ్యాటర్లు విలవిల్లాడిపోయారు. స్వల్ప లక్ష్య ఛేదనలో ఇలా క్రీజులోకి వచ్చి.. అలా పెవిలియన్‌కు వెళ్లిపోయారు. ఇక స్వల్ప లక్ష్య ఛేదనలో ఆసీస్ ఓపెనర్ మిచెల్ మార్ష్ 51 బంతుల్లో 52 పరుగులతో రాణించగా.. నాలుగో నంబర్ బ్యాటర్ లబుషేన్ 40 పరుగులు చేశాడు. వికెట్ కీపర్ బ్యాటర్ జోష్ ఇంగ్లిస్ అర్ధ శతకం(58) సాధించగా.. గ్లెన్ మాక్స్వెల్(31- నాటౌట్), మార్కస్ స్టొయినిస్(20-నాటౌట్) విజయలాంఛనం పూర్తి చేశారు. 5 వికెట్ల తేడాతో గెలుపొందిన కంగారూ తొలి విజయం అందుకోగా.. ఆడం జంపాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. మీ నాన్న నీకు నేర్పించలేదా? అయితే, ఈ గెలుపుతో జంపాతో పాటు మార్ష్‌ది కూడా కీలక పాత్ర అనడంలో సందేహం లేదు. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం మార్ష్‌ను టీమిండియా దిగ్గజం సునిల్ గావస్కర్ ఫన్నీగా ట్రోల్ చేశాడు. ‘‘మీ నాన్న నీకెప్పుడూ ఇలా ఆడాలని నేర్పించలేదా’’ అంటూ డిఫెన్సివ్ షాట్ ఆడుతున్నట్లుగా ఫోజు పెట్టాడు. ఇందుకు స్పందించిన మార్ష్.. ‘‘మా నాన్న పూర్ స్ట్రైక్‌రేటును కప్పిపుచ్చేలా ఇలా నా వంతు ప్రయత్నం చేస్తున్నా’’ అని అంతే సరదాగా బదులిచ్చాడు. జెఫ్ మార్ష్ తనయుడే మిచెల్ కాగా మిచెల్ మార్ష్ మరెవరో కాదు.. ఆసీస్ మాజీ బ్యాటర్ జెఫ్ మార్ష్ కుమారుడు. గావస్కర్‌కు సమకాలీనుడైన జెఫ్ తన అంతర్జాతీయ వన్డే కెరీర్లో 117 మ్యాచ్‌లాడి.. 55.93 స్ట్రైక్‌రేటుతో 4357 పరుగులు సాధించాడు. ఇందులో 9 సెంచరీలు, 50 అర్ధ శతకాలు ఉన్నాయి. మరోవైపు.. బ్యాటింగ్ ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ ఇప్పటి వరకు 82 వన్డేల్లో 93.85 స్ట్రైక్‌రేటుతో 2290 రన్స్ చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 18 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. తండ్రి అలా.. కొడుకు ఇలా ఈ నేపథ్యంలో తండ్రీతనయులు స్ట్రైక్‌రేటును ఉద్దేశించి గావస్కర్ సరదాగా కామెంట్ చేయగా.. మార్ష్ బదులిచ్చిన తీరు అభిమానులను ఆకర్షిస్తోంది. ఇక లంకపై విజయం గురించి మార్ష్ మాట్లాడుతూ.. ఇంగ్లిస్ ఓ యోధుడని.. స్పిన్‌ను సమర్థవంతంగా ఎదుర్కోగల సత్తా ఉన్నవాడని ప్రశంసించాడు. భవిష్యత్తులో అతడు మరింత గొప్ప ఇన్నింగ్స్ ఆడాలని ఆకాంక్షించాడు. చదవండి: టీమిండియాతో మ్యాచ్.. బంగ్లాదేశ్‌కు భారీ షాక్! Sunil Gavaskar- "Did your father not teach you to bat like this (gestures playing a defensive shot)?" Mitch Marsh- "I am making up for his poor strike rate." pic.twitter.com/P4GuLGFCa6 — Rohit Yadav (@cricrohit) October 16, 2023 -
AUS VA SL: వెన్నునొప్పితో బాధపడుతూనే బరిలోకి దిగాడు.. తొలి విజయాన్ని అందించాడు
వన్డే వరల్డ్‌కప్-2023లో భాగంగా శ్రీలంకతో నిన్న జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఆడమ్ జంపా (8-1-47-4) ఆసీస్ గెలుపులో కీలకపాత్ర పోషించాడు. వెన్ను సమస్యతో బాధపడుతూనే బరిలోకి దిగిన జంపా.. నొప్పిని దిగమింగుతూ బౌలింగ్ చేసి మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన చేశాడు. ఈ మ్యాచ్‌లో జంపా కీలక వికెట్లు పడగొట్టి లంక పతనాన్ని శాశించాడు. భీకర ఫామ్‌లో ఉన్న కుశాల్ మెండిస్, సమరవిక్రమ వికెట్లతో పాటు చమిక కరుణరత్నే, తీక్షణ వికెట్లను పడగొట్టాడు. పరుగు వ్యవధిలో గత మ్యాచ్ సెంచరీ హీరోలు కుశాల్ మెండిస్, సమరవిక్రమ వికెట్లు పడగొట్టిన జంపా.. ఆఖర్లో 2 పరుగుల వ్యవధిలో కరుణరత్నే, తీక్షణ వికెట్లను పడగొట్టి లంక ఇన్నింగ్స్‌కు చరమగీతం పాడాడు. నొప్పిని దిగమింగుతూ జంపా చేసిన విన్యాసాలకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. కాగా, స్పిన్నర్లకు అనుకూలిస్తున్న భారత పిచ్‌లపై ప్రస్తుత వరల్డ్‌కప్‌లో జంపాకు ఇదే అత్యుత్తమ ప్రదర్శన. ఈ ఎడిషన్‌లో ఆసీస్ ఓడిన తొలి రెండు మ్యాచ్‌ల్లో దారుణంగా విఫలమైన జంపా.. కీలక సమయంలో ఫామ్‌లోకి వచ్చి తన జట్టుకు ఎంతో అవసరమైన విజయాన్ని అందించాడు. టీమిండియాతో జరిగిన తొలి మ్యాచ్‌లో 8 ఓవర్లలో వికెట్ లేకుండా 53 పరుగులు సమర్పించుకున్న జంపా.. సౌతాఫ్రికాతో జరిగిన రెండో మ్యాచ్‌లో 10 ఓవర్లలో ఒక్క వికెట్ మాత్రమే తీసి ఏకంగా 70 పరుగులు సమర్పించుకున్నాడు. మొత్తానికి జంపా ప్రదర్శన కారణంగా ఆసీస్ ప్రస్తుత ఎడిషన్‌లో తొలి విజయం సాధించింది. ఆసీస్‌తో మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 43.3 ఓవర్లలో 209 పరుగులకు ఆలౌట్ కాగా.. ఆస్ట్రేలియా 35.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. శ్రీలంక ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు పథుమ్ నిస్సంక (61), కుశాల్ పెరీరా (78) మాత్రమే రాణించగా మిగతా వారంతా విఫలమయ్యారు. అసలంక (25) ఓ మోస్తరు స్కోర్ చేశాడు. ఆసీస్ బౌలరల్లో ఆడమ్ జంపా (8-1-47-4) లంకను దారుణంగా దెబ్బకొట్టాడు. స్టార్క్, కమిన్స్ చెరో 2 వికెట్లు పడగొట్టగా.. మ్యాక్స్‌వెల్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా.. మిచెల్ మార్ష్ (52), జోష్ ఇంగ్లిస్ (58), లబూషేన్ (40), మ్యాక్స్‌వెల్ (31 నాటౌట్), స్టోయినిస్ (20 నాటౌట్) రాణించడంతో ఆడుతూపాడుతూ విజయతీరాలకు చేరింది. డేవిడ్ వార్నర్ (11), స్టీవ్ స్మిత్ (0) నిరాశపరిచారు. లంక బౌలర్లలో దిల్షన్ మధుషంక 3 వికెట్లు పడగొట్టగా.. దునిత్ వెల్లలగే ఓ వికెట్ దక్కించుకున్నాడు. ప్రస్తుత ప్రపంచకప్‌లో ఆసీస్‌కు ఇది మొదటి గెలుపు కాగా.. శ్రీలంకకు ఇది హ్యాట్రిక్ ఓటమి. -
CWC 2023: ఆసీస్ చేతిలో ఓటమి.. చెత్త రికార్డును సమం చేసిన శ్రీలంక
వన్డే ప్రపంచకప్‌లో శ్రీలంక చెత్త రికార్డును సమం చేసింది. ఆసీస్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో ఓటమి చెందడంతో ప్రపంచకప్‌లో అత్యధిక పరాజయాలు ఎదుర్కొన్న జట్టుగా రికార్డుల్లోకెక్కింది. ఈ మ్యాచ్‌కు ముందు వరకు ఈ చెత్త రికార్డు జింబాబ్వే పేరిట ఉండేది. తాజా ఓటమితో శ్రీలంక.. జింబాబ్వే సరసన చేరింది. ప్రస్తుతం ఈ రెండు జట్లు ప్రపంచకప్‌లో చెరి 42 అపజయాలతో చెత్త రికార్డును పంచుకున్నాయి. ఆతర్వాతి స్ఠానంలో వెస్టిండీస్ ఉంది. ఈ జట్టు 35 పరాజయాలతో మూడో స్థానంలో నిలిచింది. విండీస్ తర్వాత 34 పరాజయాలతో ఇంగ్లండ్ నాలుగో స్థానంలో ఉంది. ఇదిలా ఉంటే, లక్నో వేదికగా శ్రీలంకతో నిన్న జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 43.3 ఓవర్లలో 209 పరుగులకు ఆలౌట్ కాగా.. ఆస్ట్రేలియా 35.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. శ్రీలంక ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు పథుమ్ నిస్సంక (61), కుశాల్ పెరీరా (78) మాత్రమే రాణించగా మిగతా వారంతా విఫలమయ్యారు. అసలంక (25) ఓ మోస్తరు స్కోర్ చేశాడు. ఈ ముగ్గురు మినహా లంక ఇన్నింగ్స్‌లో కనీసం రెండంకెల స్కోర్ చేసిన ఆటగాడు కూడా లేడు. ఆసీస్ బౌలరల్లో ఆడమ్ జంపా (8-1-47-4) లంకను దారుణంగా దెబ్బకొట్టాడు. స్టార్క్, కమిన్స్ చెరో 2 వికెట్లు పడగొట్టగా.. మ్యాక్స్‌వెల్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా.. మిచెల్ మార్ష్ (52), జోష్ ఇంగ్లిస్ (58), లబూషేన్ (40), మ్యాక్స్‌వెల్ (31 నాటౌట్), స్టోయినిస్ (20 నాటౌట్) రాణించడంతో ఆడుతూపాడుతూ విజయతీరాలకు చేరింది. డేవిడ్ వార్నర్ (11), స్టీవ్ స్మిత్ (0) నిరాశపరిచారు. లంక బౌలర్లలో దిల్షన్ మధుషంక 3 వికెట్లు పడగొట్టగా.. దునిత్ వెల్లలగే ఓ వికెట్ దక్కించుకున్నాడు. ప్రస్తుత ప్రపంచకప్‌లో ఆసీస్‌కు ఇది మొదటి గెలుపు కాగా.. శ్రీలంకకు ఇది హ్యాట్రిక్ ఓటమి. -
World Cup 2023: ఆసీస్ బోణీ
లక్నో: ఐదుసార్లు విశ్వవిజేత ఆ్రస్టేలియా ఎట్టకేలకు ఈ వన్డే వరల్డ్‌కప్‌లో బోణీ కొట్టింది. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడిన ఆసీస్ మూడో మ్యాచ్‌లో శ్రీలంకపై ఐదు వికెట్ల తేడాతో గెలుపొందింది. ఆడమ్ జంపా స్పిన్, బ్యాటర్ల సమష్టి బాధ్యత ‘కంగారూ’ జట్టును గెలిపించాయి. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక 43.3 ఓవర్లలో 209 పరుగులకే ఆలౌటైంది. ఓపెనర్లు కుశాల్ పెరీరా (82 బంతుల్లో 78; 12 ఫోర్లు), నిసాంక (67 బంతుల్లో 61; 8 ఫోర్లు) అర్ధసెంచరీలతో అదరగొట్టారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ జంపా (4/47) తిప్పేయగా, పేసర్ స్టార్క్ 2 వికెట్లు తీశాడు. తర్వాత ఆసీస్ 35.2 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసి నెగ్గింది. మిచెల్ మార్‡ ్ష(51బంతుల్లో 52; 9 ఫోర్లు), జోష్ ఇంగ్లిస్ (59 బంతుల్లో 58; 5 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలతో రాణించారు. మదుషంకకు 3 వికెట్లు దక్కాయి. శుభారంభానికి స్పిన్‌తో చెక్ లంక ఓపెనర్లు ఆడిన ఆట, చేసిన పరుగులు, జతకూడిన భాగస్వామ్యం చూస్తే భారీస్కోరు గ్యారంటీ అనిపించింది! దీంతో ఒకదశలో ఆసీస్‌కు మళ్లీ ఓటమి కంగారూ తప్పదేమో అనిపించింది. అంతలా నిసాంక, కుశాల్ పెరీరా ఓపెనింగ్ జోడీ 21 ఓవర్లదాకా అర్ధసెంచరీలతో పరుగుల్ని పోగేసింది. అయితే కమిన్స్ పేస్ ఇద్దరిని స్వల్ప వ్యవధిలో పెవిలియన్‌కు పంపించింది. దీంతో 125 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడ్డాక... స్పిన్ వైపు పిచ్ మళ్లింది. ఇదే అదనుగా జంపా... కెప్టెన్ కుశాల్ మెండిస్ (9), సమరవిక్రమ (8)లను అవుట్ చేశాడు. మరో స్పిన్నర్ మ్యాక్స్‌వెల్ అసలంక (25) వికెట్ తీయగా ఆ తర్వాత ఎవరూ పది పరుగులైనా చేయనీకుండా జంపా స్పిన్ ఉచ్చు, స్టార్క్ నిప్పులు చెరిగే బౌలింగ్ లంకను ఉక్కిరిబిక్కిరి చేసింది. 157 వద్ద రెండో వికెట్ పడిన లంక అనూహ్యంగా 209 పరుగులకే కుప్పకూలింది. కేవలం 52 పరుగుల వ్యవధిలోనే 8 వికెట్లను కోల్పోయింది. తడబడినా... స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆసీస్ మళ్లీ తడబడింది. వార్నర్ (11; 1 సిక్స్), స్టీవ్ స్మిత్ (0)లను మదుషంక ఒకే ఓవర్లో పెవిలియన్ చేర్చడంతో కంగారూ శిబిరం ఆత్మరక్షణలో పడినట్లయింది. అయితే మరో ఓపెనర్ మార్‡్ష, లబుõÙన్ (60 బంతుల్లో 40; 2 ఫోర్లు) కుదురుగా ఆడి ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. ధాటిగా ఆడిన మార్‡్ష అర్ధసెంచరీ పూర్తయ్యాక రనౌట్ కాగా... తర్వాత వచి్చన ఇంగ్లిస్, లబుõÙన్ గట్టెక్కించే భాగస్వామ్యం నమోదు చేశారు. నాలుగో వికెట్‌కు 77 పరుగులు జతయ్యాక లబుõÙన్ పెవిలియన్ చేరాడు. ఫిఫ్టీ అనంతరం జట్టు విజయానికి చేరువ చేసి ఇంగ్లిస్ నిష్క్రమించాడు. మ్యాక్స్‌వెల్ (21 బంతుల్లో 31 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), స్టొయినిస్ (10 బంతుల్లో 20 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) ధాటిగా ఆడి ముగించారు. స్కోరు వివరాలు శ్రీలంక ఇన్నింగ్స్: నిసాంక (సి) వార్నర్ (బి) కమిన్స్ 61; కుశాల్ పెరీరా (బి) కమిన్స్ 78; మెండిస్ (సి) వార్నర్ (బి) జంపా 9; సమరవిక్రమ (ఎల్బీడబ్ల్యూ) (బి) జంపా 8; అసలంక (సి) లబుషేన్ (బి) మ్యాక్స్‌వెల్ 25; ధనంజయ (బి) స్టార్క్ 7; వెలలాగె (రనౌట్) 2; కరుణరత్నే (ఎల్బీడబ్ల్యూ) (బి) జంపా 2; తీక్షణ (ఎల్బీడబ్ల్యూ) (బి) జంపా 0; లహిరు (బి) స్టార్క్ 4; మదుషంక (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (43.3 ఓవర్లలో ఆలౌట్) 209. వికెట్ల పతనం: 1–125, 2–157, 3–165, 4–166, 5–178, 6–184, 7–196, 8–199, 9–204, 10–209. బౌలింగ్: స్టార్క్ 10–0–43–2, హాజల్‌వుడ్ 7–1–36–0, కమిన్స్ 7–0–32–2, మ్యాక్స్‌వెల్ 9.3–0–36–1, జంపా 8–1–47–4, స్టొయినిస్ 2–0–11–0. ఆ్రస్టేలియా ఇన్నింగ్స్: మార్‡్ష (రనౌట్) 52; వార్నర్ (ఎల్బీడబ్ల్యూ) (బి) మదుషంక 11; స్మిత్ (ఎల్బీడబ్ల్యూ) (బి) మదుషంక 0; లబుషేన్ (సి) కరుణరత్నే (బి) మదుషంక 40; ఇంగ్లిస్ (సి) తీక్షణ (బి) వెలలాగె 58; మ్యాక్స్‌వెల్ (నాటౌట్) 31; స్టొయినిస్ (నాటౌట్) 20; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (35.2 ఓవర్లలో 5 వికెట్లకు) 215. వికెట్ల పతనం: 1–24, 2–24, 3–81, 4–158, 5–192. బౌలింగ్: లహిరు 4–0–47–0, మదుషంక 9–2–38–3, తీక్షణ 7–0–49–0, వెలలాగె 9.2–0–53–1, కరుణరత్నే 3–0–15–0, ధనంజయ 3–0–13–0. ఈదురు గాలులతో వర్షం, ఊడిపడిన హోర్డింగ్స్ బలమైన ఈదురు గాలులతో కూడిన వర్షంతో మ్యాచ్‌కు అంతరాయం ఏర్పడింది. గాలి బలంగా వీయడంతో స్టేడియంలోని కొన్నిచోట్ల హోర్డింగులన్నీ ఊడిపడ్డాయి. అదృష్టవశాత్తు ప్రేక్షకుల హాజరు పలుచగా ఉండటం... ఊడిపడిన చోట జనం లేకపోవడంతో ఎలాంటి నష్టం జరగలేదు. చదవండి: SMT 2023: నిరాశపరిచిన సంజూ శాంసన్.. కేరళ ఘన విజయం -
డేవిడ్ వార్నర్ మంచి మనసు.. వీడియో వైరల్
ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ మరోసారి అభిమానుల మనసు గెలుచుకున్నాడు. వన్డే ప్రపంచకప్-2023లో భాగంగా లక్నో వేదికగా శ్రీలంకతో ఆస్ట్రేలియా తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో శ్రీలంక ఇన్నింగ్స్ 32.1 ఓవర్ల వద్ద వరుణుడు ఎంట్రీ ఇచ్చాడు. భారీ గాలులతో కూడిన వర్షం ఒక్కసారిగా రావడంతో ప్లేయర్స్ అందరూ డగౌట్ వైపు పరుగులు తీశారు. కానీ డేవిడ్ వార్నర్ మాత్రం తన మంచిమనసును చాటుకున్నాడు. కవర్లను మైదానంలోకి తీసుకువచ్చేందుకు లక్నో గ్రౌండ్ స్టాప్‌కు వార్నర్ సహాయం చేశాడు. బౌండరీ లైన్ దగ్గర నుంచి పిచ్ వరకు గ్రౌండ్ స్టాప్‌తో పాటు వార్నర్ కవర్లను తీసుకువెళ్లాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన అభిమానులు వార్నర్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. ఆసీస్ బౌలర్ల ధాటికి 43.3 ఓవర్లలో 209 పరుగులకు ఆలౌటైంది. శ్రీలంక బ్యాటర్లలో పాతుమ్ నిస్సాంక(61), కుశాల్ పెరీరా(78) టాప్ స్కోరర్లగా నిలిచారు. ఆసీస్ బౌలర్లలో స్పిన్నర్ ఆడమ్ జంపా 4 వికెట్లు పడగొట్టి శ్రీలంక పతనాన్ని శాసించగా.. ప్యాట్ కమ్మిన్స్, మిచెల్ స్టార్క్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. చదవండి: WC IND Vs PAK: 'బాబర్ ఆజం చాలా పిరికివాడు.. ఫిప్టి కోసమే ఆడాడు' David Warner leads a helping hand to the ground staff 🤝#CWC23 #AUSvsSL #DavidWarner pic.twitter.com/N6yFIJ5T8d — Malik Farooq (@EngrM_Farooq) October 16, 2023 -
4 వికెట్లతో చెలరేగిన జంపా.. 209 పరుగులకు శ్రీలంక ఆలౌట్
వన్డే ప్రపంచకప్-2023లో భాగంగా లక్నో వేదికగా శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో ఆస్ట్రేలియా బౌలర్లు అదరగొట్టారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక.. ఆసీస్ బౌలర్ల ధాటికి 43.3 ఓవర్లలో 209 పరుగులకు ఆలౌటైంది. కాగా టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంకకు ఓపెనర్లు అద్భుతమైన ఆరంభం ఇచ్చారు. ఓపెనర్లు పాతుమ్ నిస్సాంక(61), కుశాల్ పెరీరా(78) తొలి వికెట్‌కు 125 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే నిస్సాంక ఔట్ అయిన తర్వాత శ్రీలంక పతనం మొదలైంది. వరుస క్రమంలో లంక వికెట్లు కోల్పోయింది. కేవలం 84 పరుగుల వ్యవధిలో 9వికెట్లను లంక కోల్పోయింది. ఆసీస్ బౌలర్లలో స్పిన్నర్ ఆడమ్ జంపా 4 వికెట్లు పడగొట్టి శ్రీలంక పతనాన్ని శాసించగా.. ప్యాట్ కమ్మిన్స్, మిచెల్ స్టార్క్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. ఆఖరిలో మ్యాక్స్‌వెల్ ఒక్క వికెట్ సాధించాడు. చదవండి: SMT 2023: తిలక్ వర్మ కెప్టెన్ ఇన్నింగ్స్.. బోణీ కొట్టిన హైదరాబాద్ -
CWC 2023: ఆసీస్‌తో మ్యాచ్.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక
లక్నోలోని భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఎఖానా స్టేడియం వేదికగా ఇవాళ (అక్టోబర్ 16) శ్రీలంక-ఆస్ట్రేలియా జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో శ్రీలంక టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో కోసం ఆసీస్ ఎలాంటి మార్పులు చేయకపోగా.. శ్రీలంక రెండు మార్పులతో బరిలోకి దిగనుంది. గత మ్యాచ్‌లో ఆడిన దసున్ షనక, మతీష పతిరణ స్థానాల్లో చమిక కరుణరత్నే, లహీరు కుమార జట్టులోకి వచ్చారు. గాయపడి స్వదేశానికి పయనమైన కెప్టెన్ షనక స్థానంలో కుశాల్ మెండిస్ లంక కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. తుద జట్లు.. ఆస్ట్రేలియా: మిచెల్ మార్ష్, డేవిడ్ వార్నర్, స్టీవెన్ స్మిత్, మార్నస్ లాబుషేన్, జోష్ ఇంగ్లిస్(వికెట్‌కీపర్), గ్లెన్ మాక్స్వెల్, మార్కస్ స్టోయినిస్, మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్(కెప్టెన్), ఆడమ్ జంపా, జోష్ హాజిల్‌వుడ్ శ్రీలంక: పతుమ్ నిస్సంక, కుశాల్ పెరీరా, కుశాల్ మెండిస్(కెప్టెన్/వికెట్‌కీపర్), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ధనంజయ డి సిల్వా, చమిక కరుణరత్నే, దునిత్ వెల్లలగే, మహేశ్ తీక్షణ, లహిరు కుమార, దిల్షన్ మధుశంక -
బోణీ విజయం కోసం పరితపిస్తున్న ఆసీస్, శ్రీలంక.. పైచేయి ఎవరిదంటే..?
వన్డే వరల్డ్‌కప్-2023 ప్రారంభమై పది రోజులు పూర్తైనప్పటికీ ఫైవ్ టైమ్ వరల్డ్ ఛాంపియన్స్ ఆస్ట్రేలియా, 1996 వరల్డ్‌కప్ విన్నర్ శ్రీలంక బోణీ విజయం కోసం పరితపిస్తూనే ఉన్నాయి. ఈ రెండు జట్లు ప్రస్తుత ఎడిషన్‌లో చెరో రెండు మ్యాచ్‌లు ఆడినప్పటికీ.. ఒక్క మ్యాచ్‌లోనూ విజయం సాధించలేకపోయాయి. ఆస్ట్రేలియా.. భారత్, సౌతాఫ్రికా చేతుల్లో పరాభవాలు ఎదుర్కొని ఎన్నడూ లేనట్లుగా పాయింట్ల పట్టికలో చివరినుంచి మొదటిస్థానంలో ఉండగా.. సౌతాఫ్రికా, పాకిస్తాన్ చేతుల్లో ఓటమిపాలైన శ్రీలంక పాయింట్ల పట్టికలో చివరి నుంచి మూడో స్థానంలో నిలిచింది. లక్నో వేదికగా ఇవాళ (అక్టోబర్ 16) తలపడనున్న ఈ ఇరు జట్లు.. గెలుపుపై గంపెడాశలు పెట్టుకుని బరిలోకి దిగనున్నాయి. ప్రపంచకప్‌లో ఇరు జట్ల హెడ్ టు హెడ్ రికార్డులను పరిశీలిస్తే.. శ్రీలంకపై ఆసీస్‌కు స్పష్టమైన ఆధిక్యత ఉంది. ఈ రెండు జట్లు ప్రపంచకప్ టోర్నీల్లో 11 సార్లు ఎదురెదురుపడగా.. 8 మ్యాచ్‌ల్లో ఆసీస్, 2 సందర్భాల్లో శ్రీలంక విజయం సాధించాయి. 1996 వరల్డ్ ఛాంపియన్‌గా నిలిచిన శ్రీలంక.. ఆ ఎడిషన్‌లోనే రెండుసార్లు ఆసీస్‌పై గెలుపొందింది. గ్రూప్ మ్యాచ్‌లో వాకోవర్ లభించడంతో ఒక్క బంతి కూడా పడకుండానే విజేతగా నిలిచిన శ్రీలంక.. ఫైనల్లో ఆసీస్‌ను మట్టికరిపించి జగజ్జేతగా ఆవిర్భవించింది. ప్రస్తుత వరల్డ్‌కప్‌లో ఇరు జట్ల ఫామ్‌ను పరిశీలిస్తే.. ఆసీస్‌తో పోలిస్తే శ్రీలంక పరిస్థితి మెరుగ్గా ఉందని చెప్పాలి. లంకేయులు బౌలింగ్ విషయంలో చాలా వీక్‌గా ఉన్నా.. బ్యాటింగ్‌లో మాత్రం భీకర ఫామ్‌లో ఉన్నారు. సౌతాఫ్రికాతో జరిగిన తొలి మ్యాచ్‌లో భారీ లక్ష్య ఛేదనలోనూ (429) ఏమాత్రం తడబడని లంక బ్యాటర్లు గెలవలేమని తెలిసినప్పటికీ చివరి నిమిషం వరకు పోరాడారు. ఈ మ్యాచ్‌లో లంక బ్యాటర్లు కుశాల్ మెండిస్ (76), చరిత్ అసలంక (79), షనక (68) మెరుపు అర్ధశతకాలతో విజృంభించారు. అనంతరం పాక్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లోనూ తొలుత బ్యాటింగ్ చేస్తూ చెలరేగిన లంక బ్యాటర్లు 344 పరుగుల భారీ స్కోర్‌ను చేశారు. అయితే బౌలర్లు విఫలం కావడంతో ఈ మ్యాచ్‌లో కూడా ఆ జట్టు ఓడింది. సౌతాఫ్రికాపై చెలరేగిన కుశాల్ మెండిస్ ఈ మ్యాచ్‌లోనూ (122) పట్టపగ్గాల్లేకుండా విజృంభించాడు. అతనితో పాటు సమరవిక్రమ కూడా శతక్కొట్టాడు. నిస్సంక (51) అర్ధసెంచరీతో రాణించాడు. మరోవైపు ఆసీస్ రెండు మ్యాచ్‌ల్లో బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో దారుణంగా విఫలమైంది. టీమిండియాతో జరిగిన తొలి మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేస్తూ 199 పరుగులకే కుప్పకూలిన ఆస్ట్రేలియన్లు.. ఆతర్వాత చిన్న స్కోర్‌ను డిఫెండ్ చేసుకోవడంలో కూడా చేతులెత్తేశారు. సౌతాఫ్రికాతో జరిగిన రెండో మ్యాచ్‌లోనూ ఇదే సీన్ రిపీటైంది.ఈ మ్యాచ్‌లోనూ ఆస్ట్రేలియన్లు అన్ని విభాగాల్లో దారుణంగా విఫలమయ్యారు. తొలుత బౌలింగ్ చేస్తూ ప్రత్యర్ధిని 311 పరుగులు చేయనిచ్చిన ఆస్ట్రేలియన్లు.. ఆతర్వాత బ్యాటింగ్‌లో ఘోరంగా విఫలమై 177 పరుగులకే కుప్పకూలారు. -
ODI WC 1996: అప్పుడు కారు.. ఇప్పుడు మీరు! ఈ క్రికెటర్ని గుర్తుపట్టారా?
Sanath Jayasuriya- “Golden memories”: శ్రీలంక క్రికెట్ దిగ్గజం సనత్ జయసూర్య 1996 ప్రపంచకప్ నాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నాడు. నాటి వన్డే వరల్డ్‌కప్ టోర్నీలో తన అత్యుత్తమ ప్రదర్శనకు ప్రతిఫలంగా లభించిన కారుతో ఉన్న ఫొటోలు పంచుకున్నాడు. ఇన్‌స్టాలో షేర్ చేసిన ఈ అపురూప చిత్రానికి.. ‘‘మరుపురాని జ్ఞాపకాలు: 27 ఏళ్ల క్రితం.. 1996 వరల్డ్‌కప్ మ్యాన్ ఆఫ్ సిరీస్ కార్‌తో ఇలా’’ అని తన పాత, ప్రస్తుత ఫొటోను జతచేసి క్యాప్షన్ ఇచ్చాడు. సనత్ జయసూర్య అభిమానులను ఆకర్షిస్తున్న ఈ ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు అప్పుడు కారు మెరిసింది.. ఇప్పుడు మీరు మెరుస్తున్నారు అంటూ సరదాగా ట్రోల్ చేస్తున్నారు. కంగారూ జట్టును చిత్తుచేసి ప్రపంచకప్- 1996 ఫైనల్లో లాహోర్ వేదికగా శ్రీలంక- ఆస్ట్రేలియా తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో లంక ఆసీస్‌ను ఏడు వికెట్ల తేడాతో ఓడించింది. గడాఫీ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో కంగారూ జట్టును చిత్తు చేసి జగజ్జేతగా అవతరించింది. ఇక ఈ మెగా టోర్నీ ఆసాంతం అద్భుతంగా రాణించి 221 పరుగులు సాధించడంతో పాటు.. ఏడు వికెట్లు తీసిన లంక ఆల్‌రౌండర్ సనత్ జయసూర్య మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు. ఈ క్రమంలో అతడికి ఆడి కారు బహుమతిగా లభించింది. ఇదిలా ఉంటే.. సనత్ జయసూర్య తన కెరీర్లో 445 వన్డేల్లో 13,430, 110 టెస్టుల్లో 6973 పరుగులు, 31 టీ20 మ్యాచ్‌లలో 629 పరుగులు సాధించాడు. ఇందులో 42 సెంచరీలు, మూడు ద్విశతకాలు ఉన్నాయి. ఇక ఈ స్పిన్ ఆల్‌రౌండర్ తన కెరీర్ మొత్తంలో వన్డే, టెస్టులు, టీ20లలో వరుసగా.. 323, 98, 19 వికెట్లు పడగొట్టాడు. చదవండి: IPL 2023- Bhuvneshwar Kumar: నువ్వసలు పనికిరావు.. పైగా ఇలా మాట్లాడతావా? చెత్తగా ఆడిందే గాక.. IPL 2023: ధోనికి సరైన వారసుడు.. అతడికి ఎందుకు అవకాశాలు ఇవ్వడం లేదో!: సెహ్వాగ్ View this post on Instagram A post shared by Sanath Jayasuriya (Official) (@sanath_jayasuriya) -
స్టన్నింగ్ క్యాచ్.. అద్భుత విన్యాసానికి హ్యాట్సాఫ్
మహిళల టి20 ప్రపంచకప్‌లో భాగంగా శ్రీలంకతో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ప్లేయర్ గ్రేస్ హారిస్ స్టన్నింగ్ క్యాచ్‌తో మెరిసింది. దాదాపు 20 గజాల దూరం పరిగెత్తి డైవ్ చేస్తూ క్యాచ్ అందుకోవడం మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. శ్రీలంక ఇన్నింగ్స్ ఐదో ఓవర్లో ఇది చోటుచేసుకుంది. ఎలిస్సే పెర్రీ వేసిన బంతిని చమేరీ ఆటపట్టు లాంగాన్ దిశగా భారీ షాట్ ఆడాలని ప్రయత్నించింది. కానీ బ్యాట్ ఎడ్జ్ తాకిన బంతి గాల్లోకి లేచింది. మిడాన్‌లో ఉన్న గ్రేస్ హారిస్ తన కుడివైపునకు కొన్ని గజాల దూరం పరిగెత్తి డైవ్ చేసి బంతిని అందుకుంది. ఆమె అద్భుత విన్యాసానికి హ్యాట్సాఫ్ చెప్పకుండా మాత్రం ఉండలేం. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక హారిస్ స్టన్నింగ్ క్యాచ్‌తో మాత్రమే కాదు బౌలింగ్‌లోనూ అదరగొట్టింది. మూడు ఓవర్లు వేసిన గ్రేస్ హారిస్ ఏడు పరుగులిచ్చి రెండు వికెట్లు పడగొట్టింది. మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక వుమెన్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 112 పరుగులు చేసింది. మాదవి 34 పరుగులు చేయగా.. విశ్మి గుణరత్నే 24 పరుగులు చేసింది. ఆసీస్ వెటరన్ పేసర్ మేఘన్ స్కాట్ నాలుగు వికెట్లతో చెలరేగింది. అనంతరం బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 15.5 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా టార్గెట్‌ను చేధించింది. బెత్ మూనీ 56 నాటౌట్, అలీసా హేలీ 54 నాటౌట్ ఆసీస్‌ను గెలిపించారు. లీగ్ దశలో ఆస్ట్రేలియాకు ఇది వరుసగా మూడో విజయం. ఈ విజయంతో సెమీస్ బెర్తును దాదాపు ఖరారు చేసుకుంది. That's unreal from Grace Harris, what a catch #T20WorldCup pic.twitter.com/AkJRxZYzdf — Ricky Mangidis (@rickm18) February 16, 2023 చదవండి: 'క్షమించండి'.. ఇలా అయితే ఎలా పెద్దన్న! -
స్టొయినిస్ విధ్వంసం.. లంకపై ఆసీస్ ఘన విజయం
టీ20 వరల్డ్‌కప్-2022లో భాగంగా శ్రీలంకతో ఇవాళ (అక్టోబర్ 25) జరిగిన సూపర్-12 గ్రూప్-1 మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. దీపావళి తర్వాతి రోజు స్టార్ ఆల్‌రౌండర్ మార్కస్ స్టొయినిస్ రాకెట్ ఇన్నింగ్స్ ఆడి ఆసీస్‌ను ఒంటిచేత్తో గెలిపించాడు. స్టొయినిస్ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో పెర్త్ మైదానం దద్దరిల్లింది. స్టొయినిస్ పూనకం వచ్చినట్లు రెచ్చిపోయి కేవలం 17 బంతుల్లోనే అర్ధసెంచరీ బాదాడు. లంక నిర్ధేశించిన 158 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో స్టొయినిస్ మెరుపు హాఫ్ సెంచరీతో (18 బంతుల్లో 59 నాటౌట్; 4 ఫోర్లు, 6 సిక్సర్లు) లంక బౌలర్లను చీల్చిచెండాడు. ఫలితంగా ఆసీస్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక పథుమ్ నిస్సంక (45 బంతుల్లో 40; 2 ఫోర్లు), అసలంక (25 బంతుల్లో 38 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), ధనంజయ డిసిల్వా (23 బంతుల్లో 26; 3 ఫోర్లు), చమిక కరుణరత్నే (7 బంతుల్లో 14 నాటౌట్; 2 ఫోర్లు) ఓ మోస్తరుగా రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. ఆసీస్ బౌలర్లు హేజిల్‌వుడ్, కమిన్స్, స్టార్క్, అగర్, మ్యాక్స్‌వెల్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పాటు తలో వికెట్ పడగొట్టడంతో శ్రీలంక నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైంది. అనంతరం 158 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆసీస్.. ఆరంభంలోనే డేవిడ్ వార్నర్ (11), మిచెల్ మార్ష్ (17) వికెట్లు కోల్పోయి తడబడినప్పటికీ.. కెప్టెన్ ఫించ్ (42 బంతుల్లో 31 నాటౌట్; సిక్స్), మ్యాక్స్‌వెల్ (12 బంతుల్లో 23; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. అయితే 13 ఓవర్లో మ్యాక్సీ ఔట్ కావడంతో బరిలోకి దిగిన స్టొయినిస్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయి బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడి ఆసీస్‌ను విజయతీరాలకు చేర్చాడు. స్టొయినిస్ విధ్వంసం ధాటికి ఆసీస్ 16.3 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. చదవండి: రాణించిన బౌలర్లు.. నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైన శ్రీలంక