Sri Lanka Vs Australia T20 Series: ఆస్ట్రేలియాతో స్వదేశంలో టీ20 సిరీస్‌కు శ్రీలంక క్రికెట్ జట్టు సిద్ధమైంది. కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియం వేదికగా మొదటి టీ20 జరుగనుంది. ఈ క్రమంలో మంగళవారం నాటి(జూన్ 7) మ్యాచ్‌కు శ్రీలంక తమ తుది జట్టును ప్రకటించింది.
కాగా 3 టీ20లు, 5 వన్డేలు, 2 టెస్టుల సిరీస్ కోసం కంగారూ జట్టు శ్రీలంకలో పర్యటిస్తోంది. ఇక ఈ ఏడాది ఫిబ్రవరిలో లంక జట్టు ఆస్ట్రేలియాలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడగా ఆతిథ్య ఆసీస్ జట్టు చేతిలో ఘోర పరాభవం చవిచూసింది.
ఆఖరి మ్యాచ్‌లో మాత్రమే గెలుపొంది ఐదింట నాలుగు మ్యాచ్‌లు ఓడిపోయి సిరీస్‌ను ఫించ్ బృందానికి సమర్పించుకుంది. ఈ నేపథ్యంలో ఆసీస్ చేతిలో పరాభవానికి బదులు తీర్చుకోవాలని లంక జట్టు పట్టుదలగా ఉంది.
ఈ నేపథ్యంలో కెప్టెన్ దసున్ షనక మాట్లాడుతూ.. ‘‘ఐపీఎల్-2022లో మా ఆటగాళ్లు భాగస్వామ్యం కావడంతో కావాల్సినంత ప్రాక్టీసు దొరికింది. ఐపీఎల్ అనుభవం మా జట్టుకు ఉపకరిస్తుంది. బలమైన ఆసీస్ జట్టును ఢీకొట్టేందుకు మేము సిద్ధంగా ఉన్నాము’’ అని పేర్కొన్నాడు. టీ20 వరల్డ్‌కప్ విజేత ఆస్ట్రేలియాను తప్పకుండా ఓడించి తీరతామని విశ్వాసం వ్యక్తం చేశాడు.
ఆస్ట్రేలియాతో మొదటి టీ20 మ్యాచ్‌కు శ్రీలంక తుది జట్టు:
పాథుమ్ నిసాంక, దనుష్క గుణతిలక, చరిత్ అసలంక, కుశాల్ మెండిస్, భనుక రాజపక్స, దసున్ షనక(కెప్టెన్), వనిందు హసరంగ, చమిక కరుణరత్నె, దుష్మంత చమీర, మహీశ్ తీక్షణ, నువాన్ తుషార.
శ్రీలంకతో తొలి టీ20కి ఆస్ట్రేలియా తుది జట్టు
ఆరోన్ ఫించ్(కెప్టెన్), డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్‌వెల్, స్టీవ్ స్మిత్, మార్కస్ స్టొయినిస్, మాథ్యూ వేడ్(వికెట్ కీపర్), ఆష్టన్ అగర్, మిచెల్ స్టార్క్, కేన్ రిచర్డ్‌సన్, జోష్ హాజిల్‌వుడ్.
చదవండి: MS Dhoni: 'ధోని కెప్టెన్సీలో ఆడటం నా అదృష్టంగా భావిస్తున్నా'
Comments
Please login to add a commentAdd a comment