SL Vs AUS Series 1st T20: Australia Announced Final Playing XI, Check Names Here - Sakshi
Sakshi News home page

SL Vs AUS 1st T20: తొలి టీ20.. తుది జట్టును ప్రకటించిన ఆస్ట్రేలియా

Published Mon, Jun 6 2022 2:39 PM | Last Updated on Mon, Jun 6 2022 2:56 PM

SL vs AUS Series 1st T20: Australia Announce Playing XI Check Names - Sakshi

PC: Australia Cricket

Australia tour of Sri Lanka, 2022: మూడు టీ20లు, 5 వన్డేలు, రెండు టెస్టుల సిరీస్‌ నిమిత్తం ఆస్ట్రేలియా శ్రీలంకలో పర్యటిస్తోంది. ఈ నేపథ్యంలో జూన్‌ 7న జరుగనున్న మొదటి టీ20 మ్యాచ్‌కు తుది జట్టును ప్రకటించింది. స్వదేశంలో శ్రీలంకతో టీ20 సిరీస్‌కు దూరమైన మిచెల్‌ మార్ష్‌, డేవిడ్‌ వార్నర్‌, గ్లెన్‌ మాక్స్‌వెల్‌, స్టీవ్‌ స్మిత్‌ ఈసారి లంకతో తలపడే జట్టులో చోటు దక్కించుకున్నారు.

ఇక జట్టు ప్రకటన నేపథ్యంలో ఆసీస్‌ కెప్టెన్‌ ఆరోన్‌ ఫించ్‌ మాట్లాడుతూ.. ‘‘ఇద్దరు స్పిన్నర్లతో ఆడాలనేలా పిచ్‌ ఊరించింది. కానీ, గత రెండు రోజులుగా వర్షం కారణంగా పరిస్థితులు మారిపోయాయి. కాబట్టి ఫాస్ట్‌ బౌలర్ల సేవలపై దృష్టి సారించాల్సి ఉంటుంది. నిజానికి గత రెండేళ్లుగా శ్రీలంక ఫాస్ట్‌ బౌలింగ్‌ అటాక్‌ మెరుగ్గా ఉంది. దుష్మంత చమీర నేతృత్వంలో వారి మంచి ఫలితాలు రాబడుతున్నారు’’ అని పేర్కొన్నాడు. కాగా కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో తొలి టీ20 జరుగనుంది.

శ్రీలంకతో తొలి టీ20కి ఆస్ట్రేలియా తుది జట్టు(SL Vs AUS: Australia Playing XI For 1st T20I)
ఆరోన్‌ ఫించ్‌(కెప్టెన్‌), డేవిడ్‌ వార్నర్‌, మిచెల్‌ మార్ష్‌, గ్లెన్‌ మాక్స్‌వెల్‌, స్టీవ్‌ స్మిత్‌, మార్కస్‌ స్టొయినిస్‌, మాథ్యూ వేడ్‌(వికెట్‌ కీపర్‌), ఆష్టన్‌ అగర్‌, మిచెల్‌ స్టార్క్‌, కేన్‌ రిచర్డ్‌సన్‌, జోష్‌ హాజిల్‌వుడ్‌.

చదవండి: Joe Root: వామ్మో.. ఇదేంటి? రూట్‌ నీకు చేతబడి తెలుసా? అదేం కాదు బ్రో.. వైరల్‌!
Happy Birthday Ajinkya Rahane: తక్కువగా అంచనా వేశారు.. కానీ.. అతడే ‘గెలిపించాడు’!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement