టీ20 వరల్డ్ కప్-2022 సూపర్-12 గ్రూప్-1 మ్యాచ్‌ల్లో భాగంగా ఇవాళ (అక్టోబర్ 25) ఆస్ట్రేలియా-శ్రీలంక జట్లు తలపడుతున్నాయి. పెర్త్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. తొలి మ్యాచ్‌లో ఐర్లాండ్‌పై ఘన విజయం సాధించిన శ్రీలంక రెట్టించిన ఉత్సాహంతో ఉరకలేస్తుండగా.. తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో చావుదెబ్బ తిన్న ఆసీస్ విజయ దాహంతో రంకెలేస్తుంది.
సెమీస్‌కు చేరాలంటే తప్పక గెలవాల్సిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆసీస్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. కరోనా బారిన పడిన ఆడమ్ జంపా స్థానంలో ఆస్టన్ అగర్ జట్టులోకి రాగా.. శ్రీలంక గత మ్యాచ్‌లో ఆడిన జట్టునే యధాతథంగా కొనసాగించింది.
తుది జట్లు..
ఆస్ట్రేలియా: డేవిడ్ వార్నర్, ఆరోన్ ఫించ్, మిచెల్ మార్ష్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, టిమ్ డేవిడ్, మాథ్యూ వేడ్, పాట్ కమిన్స్, ఆస్టన్ అగర్, మిచెల్ స్టార్క్, జోష్ హేజిల్‌వుడ్
శ్రీలంక: పథుమ్ నిస్సంక, కుశాల్ మెండిస్, ధనంజయ డిసిల్వా, చరిత్ అసలంక, భానుక రాజపక్ష, దసున్ శనక, వనిందు హసరంగ, చమిక కరుణరత్నే, మహీశ్ తీక్షణ, బినుర ఫెర్నాండో, లహీరు కుమార
Comments
Please login to add a commentAdd a comment