గాలే వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో ఆస్ట్రేలియా పట్టు బిగిస్తోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక 15 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 44 పరుగులు చేసింది. ఒషాడో ఫెర్నాండో (7), దిముత్ కరుణరత్నె (7), ఏంజెలో మాథ్యూస్ (7) అవుట్ కాగా... దినేశ్ చండీమల్ (9 బ్యాటింగ్), కమిందు మెండిస్ (13 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. లంక ఇంకా ప్రత్యర్థి తొలి ఇన్నింగ్స్ స్కోరుకు ఇంకా 610 పరుగులు వెనుకబడి ఉంది.
అంతకముందు ఆ్రస్టేలియా 154 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 654 పరుగులు చేసి తమ తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. ఆసీస్ బ్యాటర్లలో ఓపెనర్ ఉస్మాన్ ఖ్వాజా (352 బంతుల్లో 232; 16 ఫోర్లు, 1 సిక్స్) కెరీర్లో తొలి డబుల్ సెంచరీ నమోదు చేసుకోగా... అరంగ్రేట ఆటగాడు జోస్ ఇంగ్లిస్ (94 బంతుల్లో 102; 10 ఫోర్లు, 1 సిక్స్), స్టీవ్ స్మిత్ (251 బంతుల్లో 141; 12 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీలతో మెరిశారు.
హెడ్ సూపర్ క్యాచ్..
కాగా రెండో రోజు ఆటలో ఆసీస్ స్టార్ ప్లేయర్ ట్రావిస్ హెడ్ అద్భుతమైన క్యాచ్‌తో మెరిశాడు. స్టన్నింగ్ క్యాచ్‌తో శ్రీలంక వెటరన్ ఏంజెలో మాథ్యూస్‌ను హెడ్ పెవిలియన్‌కు పంపాడు. లంక ఇన్నింగ్స్ 10వ ఓవర్ వేసిన ఆసీస్ స్పిన్నర్ నాథన్ లియాన్.. మూడో బంతిని మాథ్యూస్‌కు ఆఫ్‌బ్రేక్ డెలివరీగా సంధించాడు. ఆ లూపీ డెలివరీని మాథ్యూస్ ఫ్రంట్ ఫుట్ డిఫెన్స్ ఆడేందుకు ప్రయత్నం చేశాడు.
కానీ బంతి బ్యాట్ ఎడ్జ్ తీసుకుని షార్ట్-లెగ్ ఫీల్డర్ కుడివైపునకు వెళ్లింది. ఈ క్రమంలో అక్కడే ఉన్న హెడ్ తన కుడివైపునకు లాంగ్ డైవ్ చేస్తూ సింగిల్ హ్యాండ్‌తో క్యాచ్ అందుకున్నాడు. దీంతో మాథ్యూస్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. చేసేదేమి లేక మాథ్యూస్(7) నిరాశతో మైదానాన్ని వీడాడు.
ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా తొలి ఇన్నింగ్స్‌లో హెడ్ బ్యాట్‌తో కూడా సత్తాచాటాడు. ఓపెనర్‌గా వచ్చిన హెడ్ 40 బంతుల్లో 10 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 57 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇక ఆస్ట్రేలియా ఇప్పటికే డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ఆర్హత సాధించిన సంగతి తెలిసిందే.
చదవండి: దినేష్ కార్తీక్ విధ్వంసం.. హ్యాట్రిక్ సిక్స్‌లతో హాఫ్ సెంచరీ! వీడియో
Travis Head flies at bat pad! ✈️
Nathan Lyon gets Australia's THIRD #SLvAUS pic.twitter.com/Nx4KxB0bwy— 7Cricket (@7Cricket) January 30, 2025
Comments
Please login to add a commentAdd a comment