
సౌతాఫ్రికా టీ20 లీగ్-2025లో టీమిండియా మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ దినేష్ కార్తీక్(Dinesh KarthiK అద్భుతమైన ప్రదర్శన చేశాడు. ఈ టోర్నీలో పార్ల్ రాయల్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న కార్తీక్.. గురువారం జోబర్గ్ సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో మెరిశాడు. ఆరో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చిన డీకే.. ప్రత్యర్ధి బౌలర్లను ఊతికారేశాడు.
ముఖ్యంగా జోబర్గ్ పార్ట్‌టైమ్ బౌలర్ విహాన్ లుబ్బేకు కార్తీక్ చుక్కలు చూపించాడు. పార్ల్ ఇన్నింగ్స్ 13వ ఓవర్ వేసిన లుబ్బే బౌలింగ్‌లో కార్తీక్ వరుసగా మూడు బంతుల్లో మూడు సిక్సర్లు బాదాడు. ఓవరాల్‌గా 39 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 56 పరుగులు చేశాడు. అతడి విరోచిత ఇన్నింగ్స్ ఫలితంగా పార్ల్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది.
రాయల్స్ బ్యాటర్లలో కార్తీక్‌తో పాటు రూబిన్ హెర్మాన్(28) రాణించాడు. సూపర్ కింగ్స్ బౌలర్లలో డెవాన్ ఫెరీరా, సిపామల తలా మూడు వికెట్లు పడగొట్టారు. వీరితో పాటు విల్జోయెన్, తహీర్ తలా వికెట్ పడగొట్టారు. అనంతరం 151 పరుగుల లక్ష్యాన్ని జోబర్గ్ సూపర్ కింగ్స్.. 17.5 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది.
సూపర్ కింగ్స్ కెప్టెన్ డుప్లెసిస్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. డుప్లెసిస్ 55 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్స్‌లతో 87 పరుగులు చేశాడు. రాయల్స్ బౌలర్లలో లుంగి ఎంగిడీ, ముజీబ్, కీత్ డడ్జియన్ తలా వికెట్ సాధించింది. ఇక ఈ విజయంతో సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్స్‌కు బెర్త్‌కు మరింత చేరువైంది.
జోరు తగ్గని డీకే..
కాగా గతేడాది ఐపీఎల్ సీజన్ తర్వాత అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు కార్తీక్ విడ్కోలు పలికాడు. బీసీసీఐతో పూర్తిగా తెగదింపులు చేసుకున్న కార్తీక్ సౌతాఫ్రికా టీ20లో ఆడాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో అతడిని పార్ల్ రాయల్స్ సొంతం చేసుకుంది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 9 మ్యాచ్‌లు ఆడిన కార్తీక్‌కు పెద్దగా బ్యాటింగ్ చేసే అవకాశం లభించలేదు.
జోరూట్, డేవిడ్ మిల్లర్ వంటి కీలక ఆటగాళ్లు సూపర్ కింగ్స్‌తో మ్యాచ్‌కు దూరమయ్యారు. దీంతో కార్తీక్‌కు బ్యాటింగ్ చేసే అవకాశం కాస్త ముందుగానే లభించింది. దీంతో తనకు వచ్చిన అవకాశాన్ని డికే సద్వినియోగపరుచుకున్నాడు. తొలి ఎస్‌ఎ 20 హాఫ్ సెంచరీని కార్తీక్ నమోదు చేశాడు.
39 ఏళ్ల కార్తీక్ 362 టీ20 ఇన్నింగ్స్‌లలో 27.09 సగటు, 136.83 స్ట్రైక్ రేట్‌తో 7504 పరుగులు చేశాడు. ఇందులో 35 అర్ధ శతకాలు ఉన్నాయి. అలాగే తన టీ20 కెరీర్‌లో ఇప్పటివరకు 261 సిక్సర్లు, 722 ఫోర్లు కొట్టాడు. అటు ధోనీ 342 టీ20 ఇన్నింగ్స్‌లలో 38.11 సగటుతో 7,432 పరుగులు చేశాడు. ఇందులో 28 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అలాగే 517 ఫోర్లు, 338 సిక్సర్లు బాదాడు.
చదవండి: CT 2025: పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం.. ఆ ఈవెంట్ రద్దు
MAIDEN SA20 FIFTY FROM DINESH KARTHIK. 🙇♂️🌟pic.twitter.com/1c7uReQZ8l
— Mufaddal Vohra (@mufaddal_vohra) January 30, 2025
Comments
Please login to add a commentAdd a comment