పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు కీలక నిర్ణయం.. ఆ ఈవెంట్‌ రద్దు | No captains photoshoot in Pakistan before Champions Trophy 2025 | Sakshi
Sakshi News home page

CT 2025: పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు కీలక నిర్ణయం.. ఆ ఈవెంట్‌ రద్దు

Jan 31 2025 7:59 AM | Updated on Jan 31 2025 8:57 AM

No captains photoshoot in Pakistan before Champions Trophy 2025

ఐసీసీ ఛాంపియ‌న్స్ ట్రోఫీ-2025 ప్రారంభానికి మ‌రో 20 రోజుల స‌మ‌యం మాత్రమే మిగిలి ఉంది. ఫిబ్రవరి 19 నుంచి పాకిస్తాన్ వేదిక‌గా ప్రారంభం కానుంది. అయితే  టోర్నీకి పాకిస్తాన్ ఆతిథ్యం ఇస్తుండటంతో భారత్ ఆడే మ్యాచులన్నీ దుబాయ్ వేదికగా జరగనున్నాయి.ఈ టోర్నీని హైబ్రిడ్ మోడ‌ల్‌లో నిర్వ‌హించ‌నున్నారు. 

టీమిండియా ఒకవేళ సెమీస్‌, ఫైన‌ల్‌కు చేరినా ఆ మ్యాచ్‌లు కూడా దుబాయ్‌లోనే జ‌రుగుతాయి. కాగా 1996 తర్వాత తొలిసారి పాకిస్తాన్‌ అంతర్జాతీయ క్రికెట్‌ మండలి ఓ ఐసీసీ ఈవెంట్‌కు ఆతిథ్యం ఇస్తోంది. దీంతో ప్రారంభ వేడుకలనూ గ్రాండ్‌గా నిర్వ‌హించాల‌ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు భావిస్తోంది. 

అయితే ఈ టోర్నీకి ముందు పీసీబీ ఓ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ప్ర‌తీ ఐసీసీ ఈవెంట్‌కు ముందు జ‌రిగే  కెప్టెన్స్ ఫోటో షూట్‌ను పీసీబీ ర‌ద్దు చేసింది.  గత కొన్నేళ్లుగా టోర్నీ ఆరంభానికి ముందు కెప్టెన్స్ మీట్ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. 

అంతర్జాతీయ క్రికెట్‌ సీజన్‌ జోరుగా సాగడం వల్లే ఈ ప్రిటోర్నీ ఈవెంట్‌ రద్దు చేయాల్సి వచ్చిందని పాక్ క్రికెట్ బోర్డు అధికారి ఒక‌రు తెలిపారు. అయితే ఓపెనింగ్ సెర్మ‌నీ మాత్రం ఫిబ్ర‌వ‌రి 16న లహోర్‌లో నిర్వ‌హించ‌నున్న‌ట్లు స‌ద‌రు అధికారి పేర్కొన్నారు.

దీంతో టీమిండియా సార‌థి రోహిత్ శ‌ర్మ కరాచీలో జరగాల్సిన కెప్టెన్స్ మీట్ కోసం వెళ్లడం లేదని తేలిపోయింది. అయితే ఈ కెప్టెన్ల ఫోటో షూట్‌ కోసం రోహిత్‌ పాక్‌కు వెళ్లనున్నాడని తొలుత వార్తలు వినిపించాయి. ఇప్పుడు ఏకంగా ఆ ఈవెంటే రద్దు కావడంతో పాక్‌కు రోహిత్‌ వెళ్లే అవకాశం లేకపోయింది.

బిజీ బిజీ షెడ్యూల్‌..
కాగా భార‌త్‌తో పాటు ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా జ‌ట్ల అంత‌ర్జాతీయ మ్యాచ్‌ల‌తో బిజీబీజీగా ఉన్నాయి. ఇంగ్లండ్‌తో వ‌న్డే సిరీస్ ముగిశాక టీమిండియా ఫిబ్ర‌వ‌రి 15న ఈ టోర్నీ కోసం దుబాయ్‌లో అడుగుపెట్టే అవ‌కాశ‌ముంది. మ‌రోవైపు శ్రీలంక ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ఆస్ట్రేలియా జ‌ట్టు నేరుగా అక్క‌డ నుంచి ఫిబ్రవరి 14న పాకిస్తాన్‌కు ప‌య‌నం కానుంది. 

అదేవిధంగా ఇంగ్లీష్ జ‌ట్టు ఫిబ్ర‌వరి 12న‌ భార‌త్‌తో వ‌న్డే సిరీస్ ముగిశాక నాలుగైదు  రోజుల పాటు విశ్రాంతి తీసుకోనుంది. ఆ త‌ర్వాతే పాక్ గ‌డ్డ‌పై బ‌ట్ల‌ర్ సేన అడుగుపెట్ట‌నుంది. ఈ క్ర‌మంలోనే ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా జ‌ట్లు త‌మ వామాప్ మ్యాచ్‌ల‌ను కూడా ర‌ద్దు చేసుకున్నాయి.

ఇక అఫ్గానిస్తాన్ ఫిబ్రవరి 12న రానుండగా.. న్యూజిలాండ్, సౌతాఫ్రికా అంతకుముందే ఫిబ్రవరి 8 నుంచి 14 వరకు పాకిస్తాన్‌తో ట్రై సిరీస్ కోసం ముందే వెళ్తున్నాయి. కాగా ఈ టోర్నీలో భారత్‌ తమ తొలి మ్యాచ్‌లో ఫిబ్రవరి 20న దుబాయ్‌ వేదికగా బంగ్లాదేశ్‌తో తలపడనుంది. ఆ తర్వాత ఫిబ్రవరి 23న దాయాది పాకిస్తాన్‌తో టీమిండియా అమీతుమీ తెల్చుకోనుంది.
చదవండి: ఆస్ట్రేలియా ప్రపంచ రికార్డు.. టీమిండియాను వెనక్కి నెట్టి టాప్‌లోకి!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement