Paarl Royals
-
రాణించిన కిల్లర్ మిల్లర్.. రాయల్స్‌కు హ్యాట్రిక్ విక్టరీ
సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో (SA20 2025) పార్ల్ రాయల్స్ హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసింది. జోబర్గ్ సూపర్ కింగ్స్‌తో నిన్న (జనవరి 20) జరిగిన లో స్కోరింగ్ మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ గెలుపుతో రాయల్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ఎగబాకింది. రాయల్స్ ఈ సీజన్లో ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్‌ల్లో 4 విజయాలు సాధించింది. రాయల్స్ చేతిలో ఓడిన సూపర్ కింగ్స్ 5 మ్యాచ్‌ల్లో రెండు విజయాలతో మూడో స్థానంలో నిలిచింది. 5 మ్యాచ్‌ల్లో మూడింట గెలిచిన ఎంఐ కేప్‌టౌన్ రెండో స్థానంలో ఉంది.మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన జోబర్గ్ సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. సూపర్ కింగ్స్ ఈ మాత్రం స్కోరైనా చేసిందంటే అది జానీ బెయిర్‌స్టో పుణ్యమే. బెయిర్‌స్టో 40 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 60 పరుగులు చేశాడు. ఆఖర్లో డొనొవన్ ఫెరియెరా (19 బంతుల్లో 32 నాటౌట్; ఫోర్, 2 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. రాయల్స్ బౌలర్లలో ఫోర్టుయిన్ 2 వికెట్లు పడగొట్టగా.. ముజీబ్ ఉర్ రెహ్మాన్, జో రూట్, డేవిడ్ గేలియమ్ తలో వికెట్ దక్కించుకున్నారు.అనంతరం 147 పరుగుల లక్ష్యాన్ని రాయల్స్ 19.1 ఓవర్లలో ఛేదించింది. మిచెల్ వాన్ బెర్రెన్ (44), కెప్టెన్ డేవిడ్ మిల్లర్ (40 నాటౌట్) రాణించి రాయల్స్‌ను విజయతీరాలకు చేర్చారు. రాయల్స్ ఇన్నింగ్స్‌లో డ్రి ప్రిటోరియస్ 27 పరుగులు చేయగా.. జో రూట్ 6, రూబిన్ హెర్మన్ 19 పరుగులకు ఔటయ్యారు. మిల్లర్‌కు జతగా దినేశ్ కార్తీక్ (2) అజేయంగా నిలిచాడు. సూపర్ కింగ్స్ బౌలర్లలో హర్డస్ సిపామ్లా 2, ఇమ్రాన్ తాహిర్, ఫెరియెరా తలో వికెట్ దక్కించుకున్నారు. -
ప్రిటోరియస్ విధ్వంసం.. ముంబై ఇండియన్స్‌పై ప్రతీకారం తీర్చుకున్న రాయల్స్
సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో (SA20 2025) భాగంగా ముంబై ఇండియన్స్ కేప్‌టౌన్‌తో నిన్న (జనవరి 15) జరిగిన మ్యాచ్‌లో పార్ల్ రాయల్స్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఎంఐ కేప్‌టౌన్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. ఓపెనర్ రస్సీ వాన్ డర్ డస్సెన్ (64 బంతుల్లో 91 నాటౌట్; 5 ఫోర్లు, 5 సిక్సర్లు) అజేయ అర్ద శతకంతో ఎంఐ కేప్‌టౌన్‌కు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. రీజా హెండ్రిక్స్ 27 బంతుల్లో 30.. అజ్మతుల్లా 11 బంతుల్లో 13, జార్జ్ లిండే 10 బంతుల్లో 10, డెవాల్డ్ బ్రెవిస్ 4 బంతుల్లో 8, డెలానో పాట్గెటర్ 5 బంతుల్లో 2 (నాటౌట్) పరుగులు చేశారు.డస్సెన్ ఇన్నింగ్స్ 19వ ఓవర్లో క్వేనా మఫాకాకు చుక్కలు చూపించాడు. ఈ ఓవర్లో డస్సెన్ రెండు సిక్సర్లు, బౌండరీ సహా 20 పరుగులు పిండుకున్నాడు. స్పెషలిస్ట్ బ్యాటర్ అయిన జో రూట్ ఈ మ్యాచ్‌లో బంతితో అద్భుతంగా రాణించాడు. ఇన్నింగ్స్ 16, 18, 20 ఓవర్లు వేసిన రూట్ కేవలం 24 పరుగులు మాత్రమే ఇచ్చి ముంబై బ్యాటర్లను కట్టడి చేశాడు. రాయల్స్ బౌలర్లలో ముజీబ్ రెండు, రూట్, గేలిమ్ తలో వికెట్ పడగొట్టారు.ప్రిటోరియస్ విధ్వంసం159 పరుగుల సాధారణ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రాయల్స్ 19 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. యువ ఓపెనర్ డ్రి ప్రిటోరియస్ (52 బంతుల్లో 83; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) విధ్వంసకర అర్ద శతకం బాది రాయల్స్ విజయానికి గట్టి పునాది వేశాడు. రూట్ 15, మిచెల్ వాన్ బూరెన్ 22, డేవిడ్ మిల్లర్ 24 (నాటౌట్), దినేశ్ కార్తీక్ (10), అండైల్ ఫెహ్లుక్వాయో 1 (నాటౌట్) పరుగులు చేశారు. ముంబై బౌలర్లలో రషీద్ ఖాన్, ట్రెంట్ బౌల్ట్ తలో వికెట్ పడగొట్టారు. ఈ గెలుపుతో రాయల్స్ గత మ్యాచ్‌లో ముంబై చేతిలో ఎదురైన పరాజయానికి ప్రతీకారం తీర్చుకుంది.అదరగొడుతున్న ప్రిటోరియస్ప్రస్తుత ఎడిషన్‌లో పార్ల్ రాయల్స్ యువ ఓపెనర్ డ్రి ప్రిటోరియస్ అదరగొడుతున్నాడు. ఈ సీజన్లో ప్రిటోరియస్ ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో 68.67 సగటున, 179.13 స్ట్రయిక్‌రేట్‌తో 206 పరుగులు చేశాడు. ఈ సీజన్లో ప్రిటోరియస్ లీడింగ్ రన్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. 18 ఏళ్ల వయసులోనే అద్భుతమైన బ్యాటింగ్ ప్రతిభ కనబరుస్తున్న ప్రిటోరియస్ సౌతాఫ్రికాకు ఆశాకిరణంలా మారాడు.SA20 2025లో ప్రిటోరియస్ స్కోర్లు..సన్‌రైజర్స్ ఈస్ట్రన్‌కేప్‌పై 51 బంతుల్లో 97 (ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్)ముంబై ఇండియన్స్ కేప్‌టౌన్‌పై 12 బంతుల్లో 26ముంబై ఇండియన్స్ కేప్‌టౌన్‌పై 52 బంతుల్లో 83 (ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్) -
రాణించిన రబాడ.. ముంబై ఇండియన్స్ ఘన విజయం
సౌతాఫ్రికా టీ20 లీగ్-2025లో ముంబై ఇండియన్స్ కేప్‌టౌన్ రెండో విజయం నమోదు చేసింది. పార్ల్ రాయల్స్‌తో నిన్న (జనవరి 13) జరిగిన మ్యాచ్‌లో 33 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఎంఐ కేప్‌టౌన్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. రీజా హెండ్రిక్స్ (37 బంతుల్లో 59; 8 ఫోర్లు, సిక్స్) అర్ద సెంచరీతో రాణించాడు. రస్సీ వాన్ డెర్ డస్సెన్ (33 బంతుల్లో 43; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) ఓ మోస్తరు స్కోర్ చేశాడు. ఆఖర్లో డెలానో పాట్గెటర్ (18 బంతుల్లో 29; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. కేప్‌టౌన్ ఇన్నింగ్స్‌లో ర్యాన్ రికెల్టన్ 8, కొలిన్ ఇంగ్రామ్ 7, జార్జ్ లిండే 1, జూనియర్ ఏబీడి 14, అజ్మతుల్లా 2 (నాటౌట్) పరుగులు చేశారు. రాయల్స్ బౌలర్లలో గాలిమ్ 3 వికెట్లు పడగొట్టగా.. ఫోర్టుయిన్, మఫాకా, ముజీబ్ ఉర్ రెహ్మన్, లుంగి ఎంగిడి తలో వికెట్ దక్కించుకున్నారు.173 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రాయల్స్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 139 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఓపెనర్లు డ్రి ప్రిటోరియస్ (26), జో రూట్ (26), వన్‌డౌన్ బ్యాటర్ సామ్ హెయిన్ (20), ముజీబ్ రెహ్మాన్ (34), మఫాకా (22 నాటౌట్) రెండంకెల స్కోర్లు చేశారు. ఈ లీగ్‌లో ఆడుతున్న ఏకైక భారతీయుడు దినేశ్ కార్తీక్ దారుణంగా విఫలమయ్యాడు. డీకే 7 బంతుల్లో 2 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. కెప్టెన్ డేవిడ్ మిల్లర్ (1) కూడా నిరాశపరిచాడు. ఎంఐ బౌలర్లలో జార్జ్ లిండే 3 వికెట్లు పడగొట్టగా.. రబాడ, కెప్టెన్ రషీద్ ఖాన్ తలో రెండు, అజ్మతుల్లా ఒమర్జాయ్ ఓ వికెట్ దక్కించుకున్నారు. రబాడ అద్భుతమైన స్పెల్ వేశాడు. తొలి రెండు ఓవర్లను మెయిడిన్ చేసి రెండు వికెట్లు తీశాడు. మ్యాచ్ విన్నింగ్ స్పెల్ వేసిన రబాడకే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఈ గెలుపుతో ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి వెళ్లింది. -
రాయల్స్ ఓపెనర్ విధ్వంసం.. మార్క్రమ్ మెరుపు ఇన్నింగ్స్ వృధా
సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో (SA20 2025) నిన్న (జనవరి 11) రెండు మ్యాచ్‌లు జరిగాయి. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ సన్‌రైజర్స్ ఈస్ట్రన్‌కేప్‌పై పార్ల్ రాయల్స్ 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. కెప్టెన్ మార్క్రమ్ 49 బంతుల్లో 7 ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 82 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. జోర్డన్ హెర్మన్ 10, జాక్ క్రాలే 27, టామ్ ఏబెల్ 20, మార్కో జన్సెన్ 4, ట్రిస్టన్ స్టబ్స్ 28 (నాటౌట్) పరుగులు చేశారు. రాయల్స్ బౌలర్లలో క్వేనా మపాకా, ముజీబ్ ఉర్ రెహ్మాన్ తలో రెండు వికెట్లు పడగొట్టారు.ఓ మోస్తరు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రాయల్స్ 18.4 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. ఓపెనర్ లుహాన్ డ్రే ప్రిటోరియస్ (51 బంతుల్లో 97; 10 ఫోర్లు, 6 సిక్సర్లు) రాయల్స్ గెలుపుకు బలమైన పునాది వేశాడు. మరో ఓపెనర్ జో రూట్ 44 బంతుల్లో 4 ఫోర్లు, సిక్సర్ సాయంతో 62 పరుగులు చేసి రాయల్స్‌ను విజయతీరాలకు చేర్చాడు. రూట్‌కు కెప్టెన్ డేవిడ్ మిల్లర్ (17 నాటౌట్) సహకరించాడు. రాయల్స్ కోల్పోయిన ఏకైక వికెట్ మార్కో జన్సెన్కు దక్కింది.డిఫెండింగ్ ఛాంపియన్‌ను చిత్తు చేసిన సూపర్ కింగ్స్నిన్ననే జరిగిన రెండో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ కేప్‌టౌన్‌పై జోబర్గ్ సూపర్ కింగ్స్ ఆరు పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఎంఐ కేప్‌టౌన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది. లోయర్ ఆర్డర్ బ్యాటర్లు జార్జ్ లిండే (48 నాటౌట్), డెలానో పాట్గెటర్ (44 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేయడంతో ఎంఐ ఈ మాత్రమే స్కోరైనా చేయగలిగింది. కేప్‌టౌన్ 75 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోగా.. లిండే, పాట్గెటర్ తమ జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ అందించారు. జోబర్గ్ సూపర్ కింగ్స్ బౌలర్లలో తబ్రేజ్ షంషి, డేవిడ్ వీస్, సిపామ్లా, ఈవాన్ జోన్స్ తలో వికెట్ పడగొట్టారు.141 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సూపర్‌కింగ్స్‌కు వర్షం పలుమార్లు అడ్డుతగిలింది. 11.3 ఓవర్ల అనంతరం మొదలైన వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో డక్‌వర్త్ లూయిస్ పద్దతిన సూపర్ కింగ్స్‌ను విజేతగా ప్రకటించారు. మ్యాచ్ ఆగిపోయే సమయానికి సూపర్ కింగ్స్ 3 వికెట్లు కోల్పోయి 82 పరుగులు చేసింది. సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్‌లో డెవాన్ కాన్వే 9, డుప్లెసిస్ 30, లుస్ డు ప్లూయ్ 24 (నాటౌట్), జానీ బెయిర్‌స్టో 14 పరుగులు చేశారు. సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచిన డుప్లెసిస్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఎంఐ బౌలర్లలో రబాడకు రెండు, ట్రెంట్ బౌల్ట్‌కు ఓ వికెట్ దక్కాయి. -
బాధగా ఉంది.. కానీ తప్పడం లేదు: రాయల్స్‌కు బట్లర్ గుడ్‌బై
ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల క్రికెట్ కెప్టెన్ జోస్ బట్లర్ కీలక ప్రకటన చేశాడు. సౌతాఫ్రికా టీ20 లీగ్(SA20) నుంచి దూరం అవుతున్నట్లు తెలిపాడు. జాతీయ జట్టు విధుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాడు. ప్రపంచవ్యాప్తంగా పొట్టి ఫార్మాట్ లీగ్‌ల హవా కొనసాగుతున్న నేపథ్యంలో సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు సైతం.. 2023లో తమ సొంత లీగ్‌ను ఆరంభించింది.ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో భాగమైన ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్, రాజస్తాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంఛైజీలు ఈ లీగ్‌లో పెట్టుబడులు పెట్టాయి. వరుసగా.. ఎంఐ కేప్‌టౌన్, జొబర్గ్ సూపర్ కింగ్స్, డర్బన్ సూపర్ జెయింట్స్, ప్రిటోరియా క్యాపిటల్స్, సన్‌రైజర్స్ ఈస్టర్న్‌కేప్ పేరిట ఆరు జట్లు కొనుగోలు చేశాయి.పర్ల్ రాయల్స్ తరఫునఇక ఐపీఎల్లో రాజస్తాన్ రాయల్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న ఇంగ్లండ్ సారథి జోస్ బట్లర్.. సౌతాఫ్రికా లీగ్‌లోనూ అదే ఫ్రాంఛైజీకి చెందిన పర్ల్ రాయల్స్‌కు ఆడుతున్నాడు. రెండేళ్లపాటు అదే జట్టుతో కొనసాగిన బట్లర్.. 2025 సీజన్‌కు మాత్రం అందుబాటులో ఉండటం లేదని స్పష్టం చేశాడు. ఈ నేపథ్యంలో అభిమానులను ఉద్దేశించి పర్ల్ రాయల్స్ సోషల్ మీడియా వేదికగా తన సందేశం వినిపించాడు.విడిచి వెళ్లాలంటే బాధగా ఉంది‘‘వచ్చే ఏడాది ఇక్కడకు రాలేకపోతున్నందుకు నిరాశగా ఉంది. ఇంగ్లండ్ మ్యాచ్‌లతో బిజీ కాబోతున్నాను. ప్రస్తుతం నా దృష్టి మొత్తం వాటి మీదే ఉంది. ఈ టోర్నీకి ఇక తిరిగి రాలేకపోతున్నందుకు ఎంతగానో బాధపడుతున్నా. ఇక్కడి అభిమానులు నన్నెంతగానో ప్రేమించారు. పర్ల్ రాయల్స్‌ను విడిచి వెళ్లాలంటే బాధగా ఉంది. టీమ్‌కి ఆల్ ది బెస్ట్. బహుశా భవిష్యత్తులో మళ్లీ తిరిగి వస్తానేమో’’ అంటూ జోస్ బట్లర్ ఉద్వేగపూరిత వ్యాఖ్యలు చేశాడు.రెండు సీజన్లలో విజేతగా సన్రైజర్స్ఈ వీడియోను షేర్ చేసిన పర్ల్ రాయల్స్.. ‘‘జోస్.. ది బాస్.. మా జట్టుకు ఆడినందుకు ధన్యవాదాలు. నీ స్కూప్ షాట్స్ మేము కచ్చితంగా మిస్ అవుతాం’’ అంటూ క్యాప్షన్ జత చేసింది. కాగా అరంగేట్ర 2023, 2024 సీజన్లలో సన్‌రైజర్స్ ఈస్టర్న్‌కేప్ సౌతాఫ్రికా టీ20 లీగ్ టైటిల్స్‌ను సొంతం చేసుకుంది. ఇప్పటిదాకా జరిగిన ఈ రెండు ఎడిషన్లలో ప్రిటోరియా క్యాపిటల్స్, డర్బన్ సూపర్ జెయింట్స్ రన్నరప్‌తో సరిపెట్టుకున్నాయి.ఇక 2023లో పది మ్యాచ్‌లకు గానూ నాలుగు మాత్రమే గెలిచి.. పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచిన పర్ల్ రాయల్స్.. 2024లో పదికి ఐదు గెలిచి మూడో స్థానంతో ముగించింది. రెండుసార్లు సెమీ ఫైనల్ చేరినా ఓటమినే చవిచూసి టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇదిలా ఉంటే.. వికెట్ కీపర్ బ్యాటర్ జోస్ బట్లర్ గాయం కారణంగా ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాడు.Thank you for everything, Jos the Boss. We’ll miss the scoops, we’ll miss you! 💗 pic.twitter.com/OTYR4cfWw2— Paarl Royals (@paarlroyals) August 6, 2024 -
వెస్టిండీస్ స్టార్ క్రికెటర్‌కు ఊహించని షాక్.. గన్‌తో బెదిరించి! ఏకంగా
దక్షిణాఫ్రికాలో ఉన్న వెస్టిండీస్ ఆల్‌రౌండర్ ఫాబియన్ అలెన్‌కు చేదు అనుభవం ఎదురైంది. సౌతాఫ్రికా టీ20 లీగ్ 2024లో అలెన్ పార్ల్ రాయల్స్ తరపున ఆడుతున్నాడు. ఈ క్రమంలో జోహాన్స్‌బర్గ్‌లో జట్టు బసచేస్తున్న శాండ్టన్ సన్ హోటల్ సమీపంలో అలెన్‌ను కొంతమంది దుండగలు తుపాకితో బెదరించి తన ఫోన్‌ను, వ్యక్తిగత వస్తువులను ఎత్తుకుపోయారు. ఈ ఘటనతో ఫాబియన్ అలెన్ ఒక్కసారిగా భయభ్రాంతులకు గురైనట్లు విండీస్ క్రికెట్ బోర్డు అధికారి ఒకరు తెలిపారు. ప్రస్తుతం ఈ విషయం క్రీడావర్గాల్లో చర్చనీయాంశమైంది. ఒక అంతర్జాతీయ క్రికెటర్‌కు కనీస భద్రత లేకపోవడం పట్ల క్రికెట్ సౌతాఫ్రికాపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. "మా జట్టు ప్రధాన కోచ్ ఆండ్రీ కోలీ ఫాబియన్‌తో ఇప్పటికే మాట్లాడాడు. మరో విండీస్ క్రికెటర్ ఒబెడ్ మెక్కాయ్ కూడా ప్రస్తుతం సౌతాఫ్రికాలోనే ఉన్నాడు. ఈ క్రమంలో మెక్‌కాయ్‌ను ఆండ్రీ కోలీ కాంటాక్ట్ అయ్యాడు. ప్రస్తుతం అలెన్ బాగానే ఉన్నాడు. కానీ ఈ ఘటనపై సౌతాఫ్రికా క్రికెట్, పార్ల్ రాయల్స్ ఇంకా స్పందించాల్సి ఉందని" విండీస్ క్రికెట్ సీనియర్ అధికారి ఒకరు క్రిక్‌బజ్‌తో పేర్కొన్నారు. కాగా ఈ ఏడాది సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో అలెన్ దారుణ ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఈ కరేబియన్ ఆల్‌రౌండర్ 8 మ్యాచ్‌లు ఆడి కేవలం 38 పరుగులు మాత్రమే చేశాడు. -
94 నాటౌట్.. ఎంఐ కేప్‌టౌన్ ఘన విజయం! పొలార్డ్ ప్రశంసలు
సౌతాఫ్రికా టీ20 లీగ్-2024లో హ్యాట్రిక్ విజయాలతో జోరు మీదున్న పర్ల్ రాయల్స్‌కు ఎంఐ కేప్‌టౌన్ షాకిచ్చింది. సీజన్ ఆరంభం నుంచి వరుసగా మూడు మ్యాచ్‌లు గెలిచిన మిల్లర్ బృందానికి తొలి ఓటమిని రుచి చూపించింది. వికెట్ కీపర్ బ్యాటర్ రియాన్ రెకెల్టన్ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో విరుచుకుపడటంతో కేప్‌టౌన్‌కు ఈ విజయం సాధ్యమైంది. సొంత మైదానం న్యూల్యాండ్స్‌లో శుక్రవారం నాటి మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఎంఐ కేప్‌టౌన్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. స్పిన్ ఆల్‌రౌండర్ థామస్ కెబర్ మూడు కీలక వికెట్లు తీసి పర్ల్ రాయల్స్‌ను దెబ్బకొట్టాడు. మిగతా వాళ్లలో ఓలీ స్టోన్, జార్జ్ లిండే, కగిసో రబడ, సామ్ కరన్ ఒక్కో వికెట్ తీశారు. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో పర్ల్ జట్టు ఎనిమిది వికెట్ల నష్టానికి 172 పరుగులు సాధించింది. ఇక లక్ష్య ఛేదనలో ఎంఐ కేప్‌టౌన్‌కు ఓపెనర్లు రాసీ వాన్ డర్ డసెన్(28 బంతుల్లో 41), రియాన్ రెకెల్టన్ అద్భుత ఆరంభం అందించారు. రెకెల్టన్ ఆకాశమే హద్దుగా చెలరేగుతూ ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించాడు. మొత్తంగా 52 బంతులు ఎదుర్కొని 7 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 94 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఇక.. వన్‌డౌన్ బ్యాటర్ డెవాల్డ్ బ్రెవిస్(10) విఫలం కాగా.. నాలుగో నంబర్ బ్యాటర్ కానర్(17*), రియాన్‌తో కలిసి ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. ఈ నేపథ్యంలో 16.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించిన ఎంఐ కేప్‌టౌన్.. పర్ల్ రాయల్స్ మీద 8 వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. రియాన్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. గెలుపు అనంతరం ఎంఐ కేప్‌టౌన్ కెప్టెన్ కీరన్ పొలార్డ్ మాట్లాడుతూ.. ‘‘మంచి ఆరంభం ఇవ్వాలని ఓపెనర్లకు చెప్పాము. రెకెల్టన్ అద్భుతం చేశాడు. అతడికి మేము అవకాశం ఇచ్చాం. పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడు. ప్రతిభకు ఆకాశమే హద్దు’’ అంటూ రియాన్ రెకెల్టన్ను ప్రశంసించాడు. -
విధ్వంసం సృష్టించిన జోస్ బట్లర్.. కొనసాగుతున్న రాయల్స్ జైత్రయాత్ర
సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో పార్ల్ రాయల్స్ జైత్రయాత్ర కొనసాగుతుంది. జోబర్గ్ సూపర్ కింగ్స్‌తో నిన్న (జనవరి 17) జరిగిన మ్యాచ్‌లో రాయల్స్ ఆటగాడు జోస్ బట్లర్ విశ్వరూపం ప్రదర్శించాడు. కేవలం 37 బంతుల్లోనే 8 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో అజేయమైన 70 పరుగులు చేసి తన జట్టును గెలిపించాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సూపర్ కింగ్స్.. లుంగి ఎంగిడి (3/17), ఓబెద్ మెక్కాయ్ (2/31) ధాటికి 19.5 ఓవర్లలో 134 పరుగులకే కుప్పకూలింది. డు ప్లూయ్ (71) మెరుపు ఇన్నింగ్స్ ఆడకపోయుంటే సూపర్ కింగ్స్ ఈ మాత్రం స్కోరైనా చేసుండేది కాదు. రీజా హెండ్రిక్స్ (8), డుప్లెసిస్ (10), మొయిన్ అలీ (18), డొనొవన్ ఫెరియెరా (5), రొమారియో షెపర్డ్ (0) నిరాశపరిచారు. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రాయల్స్.. బట్లర్‌తో పాటు విహాన్ లుబ్బే (39) రాణించడంతో 14.1 ఓవర్లలో కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. జేసన్ రాయ్ (5), డేవిడ్ మిల్లర్ (2) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. సూపర్ కింగ్స్ బౌలర్లలో లిజాడ్ విలియమ్స్, మొయిన్ అలీ, ఇమ్రాన్ తాహిర్ తలో వికెట్ పడగొట్టారు. సూపర్ కింగ్స్‌పై విజయంతో రాయల్స్ ఈ సీజన్లో వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసి, పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతుంది. -
SA20 2023: రాయల్స్‌ను ఓడించి ఫైనల్లో అడుగుపెట్టిన క్యాపిటల్స్
SA20, 2023 - Pretoria Capitals vs Paarl Royals: సౌతాఫ్రికా టీ20 లీగ్ ఆరంభ సీజన్లో ఫైనల్ చేరిన తొలి జట్టుగా ప్రిటోరియా క్యాపిటల్స్ రికార్డులకెక్కింది. జోహన్నస్బర్గ్ వేదికగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో పర్ల్ రాయల్స్‌ను ఓడించి ఈ ఘనత సాధించింది. రాయల్స్ జట్టును 29 పరుగుల తేడాతో ఓడించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. అదరగొట్టిన రొసో ది వాండరర్స్ వేదికగా జరిగిన తొలి సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ప్రిటోరియా- పర్ల్ జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచిన పర్ల్ రాయల్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన ప్రిటోరియాకు ఓపెనర్ ఫిలిప్ సాల్ట్(22) శుభారంభం అందించగా.. మరో ఓపెనర్ కుశాల్ మెండిస్(7) విఫలమయ్యాడు. కెప్టెన్ థియూనిస్ డి బ్రూయిన్ కూడా 9 పరుగులకే పెవిలియన్ చేరాడు. ఇలా జట్టు కష్టాల్లో కూరుకుపోయిన వేళ నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన రిలీ రొసో విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. 41 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 56 పరుగులు చేశాడు. మిగతా వాళ్లలో ఈథన్ బోష్(22) ఒక్కడే కాస్త ఫర్వాలేదనిపించాడు. ఫైనల్‌కు ప్రిటోరియా ఇక లక్ష్య ఛేదనకు దిగిన పర్ల్ రాయల్స్‌ను ప్రిటోరియా బౌలర్లు ఆరంభం నుంచే ఇబ్బంది పెట్టారు. ఓపెనర్ జేసన్ రాయ్‌ను బోష్ డకౌట్ చేసి బ్రేక్ ఇచ్చాడు. మిగతా బౌలర్లు కూడా సమిష్టిగా రాణించడంతో 19 ఓవర్లకే పర్ల్ రాయల్స్ కథ ముగిసింది. 124 పరుగులకు ఆలౌట్ అయి.. ఓటమిని మూటగట్టుకుని టోర్నీ నుంచి నిష్క్రమించింది. ప్రిటోరియా విజయంలో కీలక పాత్ర పోషించిన రిలీ రొసో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. మరో సెమీస్ పోరులో.. కాగా ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంఛైజీకి చెందినదే ప్రిటోరియా క్యాపిటల్స్. ఇదిలా ఉంటే.. గురువారం నాటి రెండో సెమీ ఫైనల్లో జోబర్గ్ సూపర్ కింగ్స్- సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో విజేతగా నిలిచిన జట్టు ఫైనల్లో ప్రిటోరియాను ఢీకొట్టనుంది. చదవండి: Suryakumar Yadav: కల ఫలించింది.. టెస్టుల్లో అరంగేట్రం.. సూర్య, భరత్ ఉద్విగ్న క్షణాలు Zim Vs WI 1st Test: జింబాబ్వే- వెస్టిండీస్‌టెస్టు ‘డ్రా’.. విండీస్ ఓపెనర్ల అరుదైన ఘనత Rilee roared and ROARED LOUD 🐯💙 Watch @Rileerr’s 🔝 knock that powered @PretoriaCapsSA to the #SA20League final 🔥#PCvPR #SA20 #SA20onJioCinema #SA20onSports18 pic.twitter.com/TLemf48dLW — JioCinema (@JioCinema) February 9, 2023 -
SA20 2023: ఆదుకున్న బట్లర్.. ఓడినా సెమీస్‌కు దూసుకెళ్లిన రాయల్స్
Pretoria Capitals vs Paarl Royals: సౌతాఫ్రికా టీ20-2023 లీగ్‌లో పర్ల్ రాయల్స్ సెమీస్‌కు దూసుకెళ్లింది. ప్రిటోరియా క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో ఓడినప్పటికీ బట్లర్ అద్భుత ఇన్నింగ్స్ కారణంగా సెమీస్ అవకాశాలను సజీవం చేసుకుంది. పాయింట్ల పట్టికలో డర్బన్ సూపర్‌జెయింట్స్‌ను వెనక్కి నెట్టి టాప్-4లో చోటు సంపాదించింది. అదరగొట్టిన మెండిస్ సెంచూరియన్ వేదికగా ప్రిటోరియా క్యాపిటల్స్, పర్ల్ రాయల్స్ మంగళవారం తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాయల్స్ జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 226 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆదుకున్న బట్లర్ ఓపెనర్ కుశాల్ మెండిస్ 80(41 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లు) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. ఇంగ్రామ్ 41 పరుగులతో రాణించాడు. ఇక భారీ లక్ష్య ఛేదనకు దిగిన రాయల్స్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్లు జేసన్ రాయ్(10), పాల్ స్టిర్లింగ్(19) పూర్తిగా నిరాశపరిచారు. ఈ క్రమంలో వన్‌డౌన్‌లో వచ్చిన జోస్ బట్లర్ బ్యాట్ ఝులిపించాడు. 45 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 70 పరుగులు రాబట్టాడు. ఓటమి పాలైనా అయితే, మిగతా వాళ్లలో ఇయాన్ మోర్గాన్(24), కెప్టెన్ డేవిడ్ మిల్లర్(11) తప్ప ఎవరూ కూడా కనీసం సింగిల్ డిజిట్ స్కోరు దాటలేకపోయారు. దీంతో 167 పరుగులకే పర్ల్ రాయల్స్ కథ ముగిసింది. 59 పరుగులతో ఓటమిని మూటగట్టుకుంది. కాగా సెమీస్ బెర్తు కోసం పర్ల్, సూపర్‌జెయింట్స్ పోటీ పడ్డాయి. ఒకవేళ ప్రిటోరియాతో మ్యాచ్‌లో గనుక పర్ల్ జట్టు 62 పరుగుల తేడాతో ఓటమిపాలైతే సూపర్‌జెయింట్స్ సెమీస్‌కు అర్హత సాధించేది. అయితే, బట్లర్ 19వ ఓవర్ వరకు పట్టుదలగా నిలబడి ఈ ప్రమాదం నుంచి జట్టును తప్పించాడు. And he keeps hearts too 💗 pic.twitter.com/Vm3dUGxP0c — Paarl Royals (@paarlroyals) February 7, 2023 The Paarl Royals will have another chance to impress in their #Betway #SA20 semi-final 👍@Betway_India pic.twitter.com/jddWrrRa2P — Betway SA20 (@SA20_League) February 7, 2023 సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో సెమీస్ చేరిన జట్లు ఇవే 1. ప్రిటోరియా క్యాపిటల్స్ 2. జోబర్గ్ సూపర్‌కింగ్స్ 3. సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ 4. పర్ల్ రాయల్స్ సెమీ ఫైనల్ మ్యాచ్‌లు ఇలా.. 1. ప్రిటోరియా క్యాపిటల్స్ వర్సెస్ పర్ల్ రాయల్స్(ఫిబ్రవరి 8) 2. జోబర్గ్ సూపర్ కింగ్స్ వర్సెస్ సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్(ఫిబ్రవరి 9) చదవండి: Asha Kiran: కడు పేదరికం.. రూ. 1000 పెన్షనే ఆధారం.. చెప్పుల్లేకుండా రోజూ 7 కిమీ పరుగు.. స్వర్ణ పతకాలతో.. BGT 2023: 'ఓరి మీ వేశాలో.. కాస్త ఎక్కువైనట్టుంది!' -
పార్ల్ రాయల్స్ జట్టులోకి ఐర్లాండ్ విధ్వంసకర ఆటగాడు
సౌతాఫ్రికా టీ20 లీగ్-2023కు వెస్టిండీస్ స్టార్ పేసర్ ఒబెడ్ మెకాయ్ గాయం కారణంగా దూరమై సంగతి తెలిసిందే. గతేడాది జరిగిన వేలంలో మెకాయ్ను పార్ల్ రాయల్స్ కొనుగోలు చేసింది. అయితే ఈ టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా అతడు ఆడలేదు. ఈ క్రమంలో మెకాయ్ స్థానాన్ని ఐర్లాండ్ స్టార్ బ్యాటర్ పాల్ స్టిర్లింగ్‌తో పార్ల్ రాయల్స్ భర్తీ చేసింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా రాయల్స్ మెనేజెమెంట్ వెల్లడించింది. ఇక ఫిబ్రవరి 7న ప్రిటోరియా క్యాపిటల్స్లతో పార్ల్ రాయల్స్ తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో తలపడనుంది. ఈ మ్యాచ్ జట్టు సెలక్షన్‌కు స్టిర్లింగ్ అందుబాటులో ఉండనున్నాడు. ఇక స్టిర్లింగ్ ఇంటర్నేషనల్ టీ20 లీగ్‌లో కూడా భాగమయ్యాడు. ఈ టోర్నీలో అబుదాబి నైట్‌రైడర్స్‌కు ప్రాతినిథ్యం వహించిన అతడు 6 మ్యాచ్‌ల్లో 168 పరుగులు చేశాడు. అయితే ప్లే ఆఫ్స్‌కు నైట్‌రైడర్స్ అర్హత సాధించడంలో విఫలమైంది. ఇక ఓవరాల్‌గా తన కెరీర్లో 120 టీ20లు ఆడిన అతడు 3181 పరుగులు చేశాడు. చదవండి: IND vs AUS: భారత్ గెలవాలంటే.. రాహుల్ ఓపెనర్‌గా వద్దు! అతడే సరైనోడు -
SA20 2023: చెలరేగిన బట్లర్, మిల్లర్.. సన్‌రైజర్స్‌కు భంగపాటు
Sunrisers Eastern Cape vs Paarl Royals: సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో గత మ్యాచ్‌లో భారీ విజయం సాధించిన సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ తాజా మ్యాచ్‌లో ఓడిపోయింది. పర్ల్ రాయల్స్ చేతిలో 5 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. జోస్ బట్లర్, డేవిడ్ మిల్లర్ మెరుపు ఇన్నింగ్స్‌తో రాయల్స్ జట్టును గెలిపించారు. సెయింట్ జార్జ్ పార్క్ వేదికగా మంగళవారం జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన సన్‌రైజర్స్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు రాసింగ్టన్(4), జోర్డాన్ హెర్మాన్(4) విఫలం కాగా.. వన్‌డౌన్ బ్యాటర్ స్మట్స్ జట్టును ఆదుకున్నాడు. 49 బంతుల్లో 9 ఫోర్ల సాయంతో 65 పరుగులు సాధించాడు. మిగతా బ్యాటర్లలో ఎవరూ కనీసం 20 పరుగుల మార్కును అందుకోలేకపోయారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో మార్కరమ్ బృందం 7 వికెట్లు నష్టపోయి 130 పరుగులు చేసింది. బట్లర్ హాఫ్ సెంచరీ లక్ష్య ఛేదనకు దిగిన రాయల్స్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. మార్కో జాన్సెన్ జేసన్ రాయ్‌ను 8 పరుగులకే పెవిలియన్‌కు పంపాడు. ఆ తర్వాత వరుసగా వికెట్లు పడ్డా.. మరో ఓపెనర్ జోస్ బట్లర్ నిలకడైన ప్రదర్శన కనబరిచాడు. మిల్లర్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఈ వికెట్ కీపర్ బ్యాటర్ 39 బంతుల్లో 51 పరుగులతో రాణించాడు. కెప్టెన్ డేవిడ్ మిల్లర్ 23 బంతుల్లో 4 సిక్స్‌ల సాయంతో 37 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడి ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. వీరిద్దరు చెలరేగడంతో రాయల్స్ జట్టు 18.5 ఓవర్లలోనే టార్గెట్‌ను ఛేజ్ చేసింది. రాయల్స్ సారథి డేవిడ్ మిల్లర్‌ను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది. ఏ స్థానంలో ఉన్నాయంటే కాగా ఈ ఓటమితో సన్‌రైజర్స్ ఖాతాలో నాలుగో పరాజయం నమోదైంది. ఇక ఇప్పటి వరకు ఆడిన ఎనిమిది మ్యాచ్‌లలో రైజర్స్ నాలుగు గెలిచి.. నాలుగు ఓడింది. 17 పాయింట్లతో ప్రస్తుతం పట్టికలో రెండో స్థానంలో ఉంది. ఇక రాయల్స్ సైతం 17 పాయింట్లు సాధించగా.. రైజర్స్(0.508) కంటే రన్‌రేటు(0.050) పరంగా వెనుకబడి మూడో స్థానంలో ఉంది. చదవండి: మైదానంలో ‘కింగ్’లైనా.. ‘రాణుల’ ప్రేమకు తలవంచిన వాళ్లే! Shubman Gill: 'చాలా క్లిష్టమైన ప్రశ్న.. కోహ్లికే నా ఓటు' 𝙈𝙖𝙟𝙚𝙨𝙩𝙞𝙘 𝙈𝙞𝙡𝙡𝙚𝙧 👀the super hits of the Royal's skipper More action from the #SA20League 👉 LIVE on #JioCinema, #Sports18 & @ColorsTvTamil 📲#SA20 #SA20onJioCinema #SA20onSports18 pic.twitter.com/VsJiM9uyKS — JioCinema (@JioCinema) January 24, 2023 -
రాణించిన బట్లర్, ఎంగిడి.. రాయల్స్ ఖాతాలో మూడో విజయం
సౌతాఫ్రికా టీ20 లీగ్-2023లో పార్ల్ రాయల్స్ టీమ్ కీలక విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ప్రిటోరియా క్యాపిటల్స్‌తో ఇవాళ (జనవరి 22) జరిగిన మ్యాచ్‌లో రాయల్స్ 6 వికెట్ల తేడాతో గెలుపొంది, పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి (7 మ్యాచ్‌ల్లో 3 విజయాలతో 13 పాయింట్లు) ఎగబాకింది. మరోవైపు సీజన్లో రెండో ఓటమి చవిచూసినా క్యాపిటల్స్ తన అగ్రస్థానాన్ని (6 మ్యాచ్‌ల్లో 4 విజయాలతో 18 పాయింట్లు) పదిలంగా కాపాడుకుంది. ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్, సూపర్ కింగ్స్, సూపర్ జెయింట్స్ పాయింట్ల పట్టికలో వరుసగా 2, 4, 5, 6 స్థానాల్లో ఉన్నాయి. Paarl Royals registered a much-needed win for their #SA20 campaign. 📸: Jio Cinema#CricTracker #DavidMiller #PCvPR #SA20 pic.twitter.com/sepbANPv16 — CricTracker (@Cricketracker) January 22, 2023 క్యాపిటల్స్‌తో సాదాసీదాగా సాగిన ఇవాల్టి మ్యాచ్‌లో తొలుత బౌలింగ్ చేసిన రాయల్స్.. లుంగి ఎంగిడి (4-0-19-1), ఫెరిస్కో ఆడమ్స్ (4-0-38-2), ఇవాన్ జోన్స్ (3-0-25-1), ఫోర్టిన్ (4-0-32-1), షంషి (4-0-29-1) రాణించడంతో ప్రత్యర్ధిని నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 158 పరుగులకు కట్టడి చేసింది. క్యాపిటల్స్ ఇన్నింగ్స్‌లో కుశాల్ మెండిస్ (37), థెనిస్ డి బ్ర్యూన్ (53) రాణించారు. అనంతరం రాయల్స్.. జట్టులో అందరూ తలో చేయి వేయడంతో 19.4 ఓవర్లలో లక్ష్యాన్ని చేరుకుంది. జోస్ బట్లర్ (37) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. జేసన్ రాయ్ (21), విహాన్ లుబ్బే (29), డానీ విలాస్ (24), డేవిడ్ మిల్లర్ (28 నాటౌట్), మిచెల్ వాన్ బురెన్ (12 నాటౌట్) ఓ మోస్తరుగా రాణించారు. క్యాపిటల్స్ బౌలర్లలో విల్ జాక్స్ 2, ఈథన్ బోష్, ఆదిల్ రషీద్ తలో వికెట్ పడగొట్టారు. -
దుమ్మురేపుతున్న సన్‌రైజర్స్.. హ్యాట్రిక్ విజయాలు.. ఫ్యాన్స్ ఖుషీ
SA20, 2023- Paarl Royals vs Sunrisers Eastern Cape: సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ జట్టు దుమ్మురేపుతోంది. తొలి రెండు మ్యాచ్‌లలో ఓడినా.. పడిలేచిన కెరటంలా హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసింది. ఈ నెల 10న పర్ల్ రాయల్స్- ఎంఐ కేప్‌టౌన్‌తో మ్యాచ్‌తో ప్రొటిస్ పొట్టి లీగ్‌కు తెరలేచింది. ఈ క్రమంలో జనవరి 12న ప్రిటోరియా క్యాపిటల్స్‌తో తొలి మ్యాచ్ ఆడిన సన్‌రైజర్స్ ఈస్టర్న్‌కేప్ 23 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఆ తర్వాత మళ్లీ క్యాపిటల్స్ చేతిలోనే 37 పరుగుల తేడాతో పరాజయాన్ని మూటగట్టుకుంది. దీంతో ఎయిడెన్ మార్కరమ్ బృందం ఆట తీరుపై విమర్శలు వచ్చాయి. పర్ల్తో మ్యాచ్‌లో అయితే, ఎంఐ కేప్‌టౌన్‌ను వరుసగా 4 వికెట్లు, 2 వికెట్ల తేడాతో ఓడించిన సన్‌రైజర్స్.. గురువారం నాటి మ్యాచ్‌లో పర్ల్ రాయల్స్‌ను మట్టికరిపించింది. 5 వికెట్ల తేడాతో గెలుపొంది హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసింది. పర్ల్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సన్‌రైజర్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన పర్ల్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసింది. సన్‌రైజర్స్ కెప్టెన్ ఎయిడెన్ మార్కరమ్ బంతితో రాణించడం విశేషం. 3 ఓవర్లు బౌలింగ్ వేసి అతడు 21 పరుగులు ఇచ్చి 2 వికెట్లు కూల్చాడు. సమిష్టి కృషితో.. ఇతర బౌలర్లలో మగల ఒక వికెట్ తీయగా.. వాన్ డెర్ మెర్వె, బ్రైడన్ కార్సే రెండేసి వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు. ఇక స్వల్ప లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్‌కు ఓపెనర్స్ ఆడం రాసింగ్టన్ 20 రన్స్ స్కోరు చేయగా, జోర్డాన్ హెర్మన్ 43 పరుగులతో రాణించాడు. ఫ్యాన్స్ ఖుషీ ఇక కెప్టెన్ మార్కరమ్ 23 బంతుల్లో 23 పరుగులు సాధించగా.. ఆఖర్లో ట్రిస్టన్ స్టబ్స్ 12 బంతుల్లో 18 పరుగులు, మార్కో జాన్సెన్ 21 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు తీర్చారు. 18.2 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసిన సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ పర్ల్పై ఐదు వికెట్ల తేడాతో గెలుపొందింది. మార్కరమ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఇక ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ సహ యజమాని కావ్య మారన్ హైలైట్‌గా నిలిచారు. కాగా సన్‌రైజర్స్ వరుసగా మూడు విజయాలు సాధించడంతో ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. రైజర్స్ ఐపీఎల్-2023లో మంచి ప్రదర్శన చేయాలని కోరుకుంటున్నారు. చదవండి: Hockey WC 2023: నెదర్లాండ్స్ సంచలన విజయం.. ఆస్ట్రేలియాను వెనక్కి నెట్టి చరిత్ర! ఇక భారత్ క్వార్టర్స్ అవకాశాలు?! కర్ణాటక కెప్టెన్‌గా రాహుల్ ద్రవిడ్ తనయుడు అన్వయ్ ద్రవిడ్ Top scorer in his first #SA20 game! 👊 Jordan Hermann shares his thoughts on his performance & our win in Paarl! 🗣️#SEC #SunrisersEasternCape #PRvSEC #SA20 #PlayWithFire pic.twitter.com/u8HQNKIu2Q — Sunrisers Eastern Cape (@SunrisersEC) January 19, 2023 -
మా మేడమ్‌కే లైన్ వేస్తావా?.. కావ్య మారన్‌కు పెళ్లి ప్రపోజల్.. వైరల్
SA20, 2023 - Sunrisers Eastern Cape- Kavya Maran: కావ్యా మారన్... ఐపీఎల్ ఫ్రాంఛైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్ సహ యజమాని, సీఈఓగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఈ యువ వ్యాపారవేత్త గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఐపీఎల్ వేలం సహా తమ జట్టుకు సంబంధించిన మ్యాచ్‌లలో సందడి చేస్తూ ఫేమస్ అయింది ఈ చెన్నై బ్యూటీ. క్యాష్ రిచ్ లీగ్‌కు సంబంధించిన ఈవెంట్ ఏదైనా సరే కావ్య అక్కడ ఉందంటే సోషల్ మీడియాలో ఆమె ఫొటోలు వైరల్ అవ్వాల్సిందే! నెటిజన్లలో ఆమెకున్న క్రేజ్ అలాంటిది మరి! ఇక తాజాగా కావ్య పేరు మరోసారి నెట్టింట హాట్‌టాపిక్‌గా మారింది. సౌతాఫ్రికా టీ20 లీగ్ నేపథ్యంలో హైదరాబాద్ జట్టు యాజమాన్యం... సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ పేరిట టీమ్‌ను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. జనవరి 10న మొదలైన ఈ టోర్నీలో సన్‌రైజర్స్ ఇప్పటి వరకు మూడు మ్యాచ్‌లు ఆడింది. పెళ్లి ప్రపోజల్ ఇందులో భాగంగా గురువారం నాటి మ్యాచ్‌లో రాజస్తాన్ ఫ్రాంఛైజీ పర్ల్ రాయల్స్‌తో తలపడింది. పర్ల్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌ను కావ్య ప్రత్యక్షంగా వీక్షించింది. స్టాండ్స్‌లో కూర్చుని జట్టును ఉత్సాహపరిచింది. ఈ క్రమంలో మ్యాచ్‌ను చూడటానికి వచ్చిన ఓ ప్రేక్షకుడు ఆమెకు ప్రపోజ్ చేయడం విశేషం. నన్ను పెళ్లి చేసుకుంటావా? ‘‘కావ్యా మారన్.. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా?’’ అంటూ హార్ట్ సింబల్ జత చేసిన ప్లకార్డును పట్టుకుని తన మనసులోని కావ్యతో పాటు అక్కడున్న వాళ్లందరి ముందు బయటపెట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియోను సౌతాఫ్రికా టీ20 లీగ్ తమ అధికారిక ట్విటర్ ఖాతాలో షేర్ చేయగా వైరల్ అవుతోంది. సౌతాఫ్రికాలో కూడా డామినేషన్ ఇక ఈ వీడియోపై స్పందించిన సన్‌రైజర్స్ ఫ్యాన్స్ తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ‘‘ఎంత ధైర్యం? మా మేడమ్‌కే లైన్ వేస్తావా? ఆమెకు దూరంగా ఉండు... లేదంటే నీ సంగతి చూస్తాం! ఏదేమైనా సౌతాఫ్రికాలో కూడా మీ డామినేషన్ సూపర్ మేడమ్’’ అంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు. ‘‘మేడమ్ సార్.. మేడమ్ అంతే’’ అంటూ రకరకాల మీమ్స్‌తో సందడి చేస్తున్నారు. ఇక ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. కాగా సన్ నెట్వర్క్ వ్యవస్థాపకుడు, మీడియా మొఘల్స్‌లో ఒకరైన కళానిధి మారన్ కుమార్తె కావ్య. సన్‌రైజర్స్ జట్ల సహ యజమానిగా ఉన్న 30 ఏళ్ల కావ్య.. సన్ టీవీ మ్యూజిక్, ఎఫ్ఎం చానెల్స్ వ్యవహారాలు కూడా పర్యవేక్షిస్తున్నట్లుగా సమాచారం. Looks like someone needs a bit of help from @Codi_Yusuf on how to propose in the BOLAND. 💍#Betway #SA20 | @Betway_India pic.twitter.com/ZntTIImfau — Betway SA20 (@SA20_League) January 19, 2023 -
ఫోర్టిన్ మాయాజాలం, మేయర్స్ ఆల్‌రౌండ్ షో.. రాజస్థాన్, లక్నో జట్ల విజయం
సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో నిన్న (జనవరి 13) జరిగిన మ్యాచ్‌ల్లో పార్ల్ రాయల్స్ (రాజస్థాన్ రాయల్స్), డర్బన్ సూపర్ జెయింట్స్ (లక్నో సూపర్ జెయింట్స్) జట్లు విజయం సాధించాయి. తొలి మ్యాచ్‌లో రాయల్స్.. సూపర్ కింగ్స్‌ను 7 వికెట్ల తేడాతో, సూపర్ జెయింట్స్.. ముంబై కేప్ టౌన్‌ను 5 వికెట్ల తేడాతో మట్టికరిపించాయి. తిప్పేసిన రాయల్స్ స్పిన్నర్లు.. పార్ల్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన జోబర్గ్ సూపర్ కింగ్స్.. స్పిన్నర్లు ఫోర్టిన్ (3/16), ఇవాన్ జోన్స్ (3/21), తబ్రేజ్ షంషి (1/4) మాయాజాలం ధాటికి 17.2 ఓవర్లలో 81 పరుగులకే చాపచుట్టేసింది. వెర్రిన్ (11), అల్జరీ జోసఫ్ (13), విలియమ్స్ (17 నాటౌట్), ఫాంగిసో (10) మాత్రమే రెండంకెల స్కోర్ సాధించారు. స్వల్ప లక్ష్య ఛేదనలో రాయల్స్ 10.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఆడుతూ పాడుతూ విజయం సాధించింది. జోస్ బట్లర్ (21 బంతుల్లో 29; 4 ఫోర్లు) అజేయమైన ఇన్నింగ్స్‌తో రాయల్స్‌ను విజయతీరాలకు చేర్చాడు. తలో చేయి వేసిన ఎంఐని ఓడించిన సూపర్ జెయింట్స్.. డర్బన్ సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఎంఐ కేప్ టౌన్.. రోలోఫ్సన్ (44 బంతుల్లో 52; 4 ఫోర్లు, సిక్స్) అర్ధసెంచరీతో, జార్జ్ లిండే (33), డెలానో పాట్గేయిటర్ (25) ఓ మోస్తరుగా రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. సూపర్ జెయింట్స్ బౌలర్లలో టాప్లే, సుబ్రయెన్, విల్యోన్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. కైల్ మేయర్స్, జేసన్ హోల్డర్ తలో వికెట్ దక్కించుకున్నారు. ఛేదనలో కైల్ మేయర్స్ (34), వియాన్ ముల్దర్ (30), హెన్రిచ్ క్లాసిన్ (36), కీమో పాల్ (20 నాటౌట్) తలో చేయి వేసి సూపర్ జెయింట్స్‌ను గెలిపించారు. ఎంఐ బౌలర్లలో ఓలీ స్టోన్ 4 వికెట్లు పడగొట్టగా.. జార్జ్ లిండేకు ఓ వికెట్ దక్కింది. కాగా, లీగ్‌లో భాగంగా ఇవాళ (జనవరి 14) జరుగబోయే మ్యాచ్‌ల్లో ప్రిటోరియ క్యాపిటల్స్-సన్‌రైజర్స్ ఈస్ట్రన్ కేప్ జట్లు.. ఎంఐ కేప్ టౌన్-జోబర్గ్ సూపర్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. -
బేబీ ఏబీడీ విధ్వంసం.. ముంబై ఇండియన్స్ టీమ్ శుభారంభం
మినీ ఐపీఎల్‌గా పరిగణించబడే సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ముంబై ఇండియన్స్ యాజమాన్యం కొనుగోలు చేసిన ఎంఐ కేప్‌టౌన్ టీమ్ శుభారంభం చేసింది. లీగ్ ఇనాగురల్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ కొనుగోలు చేసిన పార్ల్ రాయల్స్‌ను ఢీకొట్టిన కేప్‌టౌన్ జట్టు.. 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన కేప్‌టౌన్.. జోఫ్రా ఆర్చర్ (3/27), ఓలీ స్టోన్ (2/31), డుయన్ జన్సెన్ (1/16) విజృంభించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 142 పరుగుల నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైంది. రాయల్స్ ఇన్నింగ్స్‌లో జోస్ బట్లర్ (42 బంతుల్లో 51; 6 ఫోర్లు, సిక్స్), కెప్టెన్ డేవిడ్ మిల్లర్ (31 బంతుల్లో 42; 4 ఫోర్లు, సిక్స్) మాత్రమే రాణించారు. అనంతరం 143 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కేప్‌టౌన్ టీమ్.. బేబీ ఏబీడీ డెవాల్డ్ బ్రెవిస్ (41 బంతుల్లో 70 నాటౌట్; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) విధ్వంసం ధాటికి 15.3 ఓవర్లలో కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్‌గా బరిలోకి దిగిన బ్రెవిస్ అజేయమైన అర్ధశతకంతో రాయల్స్ బౌలింగ్‌ను తునాతునకలు చేయగా.. మరో ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ (33 బంతుల్లో 42; 5 ఫోర్లు, సిక్స్) పర్వాలేదనిపించాడు. వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన సామ్ కర్రన్.. 16 బంతుల్లో 2 సిక్సర్లు, ఫోర్ సాయంతో 20 పరుగులు చేసి ఔటయ్యాడు. బ్రెవిస్.. రస్సీ వాన్ డర్ డస్సెన్ (3 బంతుల్లో 8 నాటౌట్; సిక్స్) సాయంతో మ్యాచ్‌ను ముగించాడు. రాయల్స్ బౌలర్లలో కోడి యుసఫ్, రామోన్ సిమండ్స్కు తలో వికెట్ లభించింది. లీగ్‌లో తదుపరి మ్యాచ్ డర్బన్ సూపర్ జెయింట్స్ (లక్నో సూపర్ జెయింట్స్)-జొహనెస్‌బర్గ్ సూపర్ కింగ్స్ (చెన్నై సూపర్ కింగ్స్) జట్ల మధ్య ఇవాళ (జనవరి 11) జరుగనుంది. భారతకాలమానం ప్రకారం ఈ మ్యాచ్ రాత్రి 9 గంటలకు ప్రారంభంకానుంది. -
నేను ఆల్‌రౌండర్‌ని.. చహల్‌కు ఇక ఎప్పటికీ ఆ ఛాన్స్ రాదు!
Yuzvendra Chahal: టీమిండియా లెగ్ స్పిన్నర్ యజ్వేంద్ర చహల్... సౌతాఫ్రికా చైనామన్ బౌలర్ తబ్రేజ్ షంసీ.. ఒకరినొకరు ఆటపట్టించుకోవడంలో ఎల్లప్పుడూ ముందుంటారు. ఐపీఎల్ ఫ్రాంఛైజీ రాజస్తాన్ రాయల్స్‌కు ఆడుతున్న సమయంలో చహల్‌తో.. షంసీకి స్నేహం బలపడింది. ఇక ఛాన్స్ దొరికినప్పుడల్లా పరస్పరం సరదాగా మాటల యుద్ధానికి దిగడం వీరికి అలవాటు. ఈ క్రమంలో తాజాగా మరోసారి షంసీ... చహల్‌ను ఆటపట్టిస్తూ అతడిని ట్రోల్ చేశాడు. కాగా జనవరి 10 నుంచి సౌతాఫ్రికా టీ20 లీగ్ ఆరంభం కానున్న సమయం తెలిసిందే. సౌతాఫ్రికా ఆల్‌రౌండర్‌ని! ఈ నేపథ్యంలో తొలి మ్యాచ్‌లో రాజస్తాన్ ఫ్రాంఛైజీ పర్ల్ రాయల్స్- ముంబై ఫ్రాంఛైజీ ఎంఐ కేప్‌టౌన్ తలపడనున్నాయి. ఈ సందర్భంగా రాజస్తాన్ తమ ట్విటర్లో షంసీ వీడియోను షేర్ చేసింది. ఇందులో షంసీ చహల్‌ను ఉద్దేశించి.. ‘‘హెలో యుజీ.. సౌతాఫ్రికా నుంచి నేను.. ఆల్‌రౌండర్‌ను మాట్లాడుతున్నా.. అది సరేగానీ.. నువ్వు ఎంత ప్రయత్నించినా బ్యాటింగ్ ఆర్డర్లో నా కంటే ముందు స్థానంలో ఎప్పుడూ రాలేవు.. ఎప్పుడూ అంటే ఎప్పుడూ కూడా నీకు ఆ అవకాశం రాదు’’ అంటూ ఆటపట్టించాడు. ఇక సోషల్ మీడియాలో తనదైన పంచులతో చెలరేగే చహల్.. ‘‘అది సరేగానీ.. నీ టమ్మీ(పొట్ట) గురించి కాస్త చెప్పు బ్రో’’ అంటూ కౌంటర్ వేశాడు. కాగా చహల్ ప్రస్తుతం స్వదేశంలో శ్రీలంకతో టీ20 సిరీస్‌తో బిజీగా ఉన్నాడు. గతంలో రాజస్తాన్‌కు ఆడిన షంసీ.. ఈసారి వేలంలో కోటి రూపాయల కనీస ధరతో పేరు నమోదు చేసుకోగా.. అమ్ముడుపోకుండా మిగిలిపోయాడు. అయితే, సౌతాఫ్రికా టీ20లీగ్‌లో మాత్రం ఈ స్పిన్నర్ రాజస్తాన్ పర్ల్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. చదవండి: IPL 2023: ఐపీఎల్ వేలానికి ముందు ఈ సిరీస్ జరిగి ఉంటేనా! కానీ పాపం.. Hardik Pandya: మావి స్థానంలో తను రావాల్సింది! ఇలా చేస్తాడనుకోలేదు.. What about your tummy my bru 😂😂 @shamsi90 — Yuzvendra Chahal (@yuzi_chahal) January 7, 2023