Tabraiz Shamsi Trolls Chahal You Never Get That Yuzi Reply - Sakshi
Sakshi News home page

ఆల్‌రౌండర్‌ని.. చహల్‌ నీకెప్పటికీ ఆ ఛాన్స్‌ రాదు! సరే.. నీ పొట్ట సంగతేంటి బ్రో!

Published Sat, Jan 7 2023 4:40 PM | Last Updated on Sat, Jan 7 2023 5:13 PM

Tabraiz Shamsi Trolls Chahal You Never Get That Yuzi Reply - Sakshi

యజువేంద్ర చహల్‌ (PC: IPL/RR)

Yuzvendra Chahal: టీమిండియా లెగ్‌ స్పిన్నర్‌ యజ్వేంద్ర చహల్‌... సౌతాఫ్రికా చైనామన్‌ బౌలర్‌ తబ్రేజ్‌ షంసీ.. ఒకరినొకరు ఆటపట్టించుకోవడంలో ఎల్లప్పుడూ ముందుంటారు. ఐపీఎల్‌ ఫ్రాంఛైజీ రాజస్తాన్‌ రాయల్స్‌కు ఆడుతున్న సమయంలో చహల్‌తో.. షంసీకి స్నేహం బలపడింది.

ఇక ఛాన్స్‌ దొరికినప్పుడల్లా పరస్పరం సరదాగా మాటల యుద్ధానికి దిగడం వీరికి అలవాటు. ఈ క్రమంలో తాజాగా మరోసారి షంసీ... చహల్‌ను ఆటపట్టిస్తూ అతడిని ట్రోల్‌ చేశాడు. కాగా జనవరి 10 నుంచి సౌతాఫ్రికా టీ20 లీగ్‌ ఆరంభం కానున్న సమయం తెలిసిందే.

సౌతాఫ్రికా ఆల్‌రౌండర్‌ని!
ఈ నేపథ్యంలో తొలి మ్యాచ్‌లో రాజస్తాన్‌ ఫ్రాంఛైజీ పర్ల్‌ రాయల్స్‌- ముంబై ఫ్రాంఛైజీ ఎంఐ కేప్‌టౌన్‌ తలపడనున్నాయి. ఈ సందర్భంగా రాజస్తాన్‌ తమ ట్విటర్‌లో షంసీ వీడియోను షేర్‌ చేసింది. ఇందులో షంసీ చహల్‌ను ఉద్దేశించి.. ‘‘హెలో యుజీ.. సౌతాఫ్రికా నుంచి నేను.. ఆల్‌రౌండర్‌ను మాట్లాడుతున్నా..

అది సరేగానీ..
నువ్వు ఎంత ప్రయత్నించినా బ్యాటింగ్‌ ఆర్డర్‌లో నా కంటే ముందు స్థానంలో ఎప్పుడూ రాలేవు..  ఎప్పుడూ అంటే ఎప్పుడూ కూడా నీకు ఆ అవకాశం రాదు’’ అంటూ ఆటపట్టించాడు. ఇక సోషల్‌ మీడియాలో తనదైన పంచులతో చెలరేగే చహల్‌.. ‘‘అది సరేగానీ.. నీ టమ్మీ(పొట్ట) గురించి కాస్త చెప్పు బ్రో’’ అంటూ కౌంటర్‌ వేశాడు. 

కాగా చహల్‌ ప్రస్తుతం స్వదేశంలో శ్రీలంకతో టీ20 సిరీస్‌తో బిజీగా ఉన్నాడు. గతంలో రాజస్తాన్‌కు ఆడిన షంసీ.. ఈసారి వేలంలో కోటి రూపాయల కనీస ధరతో పేరు నమోదు చేసుకోగా.. అమ్ముడుపోకుండా మిగిలిపోయాడు. అయితే, సౌతాఫ్రికా టీ20లీగ్‌లో మాత్రం ఈ స్పిన్నర్‌ రాజస్తాన్‌ పర్ల్స్‌ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.

చదవండి: IPL 2023: ఐపీఎల్‌ వేలానికి ముందు ఈ సిరీస్‌ జరిగి ఉంటేనా! కానీ పాపం.. 
Hardik Pandya: మావి స్థానంలో తను రావాల్సింది! ఇలా చేస్తాడనుకోలేదు..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement