Tabraiz Shamsi
-
సౌతాఫ్రికా క్రికెటర్ షంసీ కీలక నిర్ణయం
సౌతాఫ్రికా స్టార్ క్రికెటర్ తబ్రేజ్ షంసీ సెంట్రల్ కాంట్రాక్టు నుంచి వైదొలిగాడు. ప్రపంచ వ్యాప్తంగా ఫ్రాంఛైజీ క్రికెట్లో భాగమయ్యేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాడు. అయితే, జాతీయ జట్టుకు తన సేవలు అవసరమైన వేళ తప్పకుండా అందుబాటులో ఉంటానని స్పష్టం చేశాడు. ఈ విషయాన్ని సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు నిర్ధారించింది.అందుకే ఈ నిర్ణయం‘‘సెంట్రల్ కాంట్రాక్టు నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాను. దేశవాళీ క్రికెట్ సీజన్ సమయంలో కాస్త విరామంతో పాటు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న లీగ్ మ్యాచ్‌లు ఆడాలని కోరుటుకుంటున్నాను. నా కుటుంబానికి తగినంత సమయం కేటాయించాలని భావిస్తున్నాను.అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. అయితే, ప్రొటిస్ జట్టుకు నా అవసరం ఉందనుకున్న సమయంలో బోర్డు పిలిస్తే కచ్చితంగా దేశానికి ఆడతా’’ అని తబ్రేజ్ షంసీ పేర్కొన్నాడు. కాగా 2016లో సౌతాఫ్రికా తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన తబ్రేజ్ షంసీ.. వన్డే, టీ20 జట్టలో ఫస్ట్ ఛాయిస్ స్పిన్నర్‌గా ఎదిగాడు.ఇప్పటి వరకు సౌతాఫ్రికా తరఫున 51 వన్డేలు, 70 టీ20లు ఆడి ఆయా ఫార్మాట్లలో 72, 89 వికెట్లు పడగొట్టాడు. అయితే, టెస్టుల్లో మాత్రం షంసీ నిలదొక్కుకోలేకపోయాడు. కేవలం రెండే మ్యాచ్‌లు ఆడి ఆరు వికెట్లు తీయగలిగాడు.సెంట్రల్ కాంట్రాక్టు లేకపోయినాఇక షంసీ నిర్ణయాన్ని తాము ఆమోదిస్తున్నట్లు క్రికెట్ సౌతాఫ్రికా డైరెక్టర్ ఎనోచ్ తెలిపాడు. సౌతాఫ్రికా పరిమిత ఓవర్ల క్రికెట్ జట్లలో షంసీ కీలక సభ్యుడని.. సెంట్రల్ కాంట్రాక్టు లేకపోయినా సెలక్షన్‌కు అందుబాటులో ఉంటానని చెప్పడం అతడి నిజాయితీకి నిదర్శనమని ప్రశంసించాడు. కాగా షంసీ ఐపీఎల్‌తో పాటు మరెన్నో టీ20లలో భాగమవుతున్నాడు. చివరగా.. ఈ ఏడాది కరేబియన్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంఛైజీ సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పాట్రియాట్స్‌తో అతడు ఒప్పందం కుదుర్చుకున్నాడు. చదవండి: ధోని కంటే రోహిత్ బెటర్ కెప్టెన్: భారత స్పిన్ దిగ్గజం -
మాకు ఇదొక గుణపాఠం.. వాళ్లు అద్భుతం: మార్క్రమ్
టీ20 ప్రపంచకప్-2024లో సెమీస్ చేరడం సంతోషంగా ఉందని సౌతాఫ్రికా కెప్టెన్ ఐడెన్ మార్క్రమ్ హర్షం వ్యక్తం చేశాడు. తమ జట్టు అద్భుతంగా ఆడిందని.. ఈ గెలుపు తమకు ఊరటనందించిందని పేర్కొన్నాడు.వర్షం పడి వెలిసిన తర్వాత పిచ్ బ్యాటింగ్‌కు మరింత అనుకూలంగా మారిందన్న మార్క్రమ్.. వీలైనంత త్వరగా మ్యాచ్ పూర్తి చేయాలని భావించినట్లు తెలిపాడు. అందుకు తగ్గట్లుగానే ఫలితం కూడా వచ్చిందని సంతోషం వ్యక్తం చేశాడు.కాగా టీ20 ప్రపంచకప్-2024 సూపర్-8లో భాగంగా వెస్టిండీస్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా గెలుపొందిన విషయం తెలిసిందే. అంటిగ్వా వేదికగా టాస్ గెలిచిన ప్రొటిస్ జట్టు విండీస్‌ను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.వర్షం వల్ల అంతరాయం సౌతాఫ్రికా బౌలర్ల దెబ్బకు వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు నష్టపోయి కేవలం 135 పరుగులు మాత్రమే చేసింది. రోస్టన్ చేజ్ హాఫ్ సెంచరీతో ఆకట్టుకోగా.. ఓపెనర్ కైలీ మేయర్స్ 35 పరుగులతో రాణించాడు.ప్రొటిస్ స్పిన్నర్ తబ్రేజ్ షంసీ మూడు కీలక వికెట్లు కూల్చి విండీస్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించాడు. ఇక ఈ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించగా.. రెండో ఇన్నింగ్స్‌ను 17 ఓవర్లకు కుదించారు.డీఎల్ఎస్ పద్ధతి ప్రకారం సౌతాఫ్రికా లక్ష్యాన్ని 123 పరుగులుగా నిర్దేశించారు. ఈ క్రమంలో ఆరంభంలో ప్రొటిస్ జట్టు వికెట్లు కోల్పోయినా.. ట్రిస్టన్ స్టబ్స్(29), హెన్రిచ్ క్లాసెన్(22), మార్కో జాన్సన్(14 బంతుల్లో 21) మెరుగ్గా రాణించి జట్టుకు విజయం అందించారు.మాకిది ఒక గుణపాఠం లాంటిదేమరో ఐదు బంతులు మిగిలి ఉండగానే టార్గెట్ ఛేదించిన సౌతాఫ్రికా సెమీ ఫైనల్లో అడుగుపెట్టగా.. ఆతిథ్య వెస్టిండీస్ సెమీస్ ఆశలు గల్లంతయ్యాయి. ఈ నేపథ్యంలో సౌతాఫ్రికా కెప్టెన్ ఐడెన్ మార్క్రమ్ మాట్లాడుతూ.. ‘‘మా వాళ్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు.వికెట్‌ను సరిగ్గా అంచనా వేసి అందుకు తగ్గట్లుగా ఆడారు. షంసీ రూపంలో మిస్టరీ స్పిన్నర్‌ను వెస్టిండీస్‌పై అస్త్రంలా ప్రయోగించి విజయవంతమయ్యాం.అయితే, లక్ష్య ఛేదనలో భాగస్వామ్యాలు నెలకొల్పడంలో మేము విఫలమయ్యాం. మాకిది ఒక గుణపాఠం లాంటిదే. పరిస్థితులకు అనుగుణంగా ఇంకాస్త తెలివిగా వ్యవహరించి ముందుకు సాగాలి’’ అని పేర్కొన్నాడు. కాగా ఈ మ్యాచ్‌లో మార్క్రమ్ 18 పరుగులు చేయడంతో పాటు ఒక వికెట్ తీశాడు.చదవండి: కోహ్లి, రోహిత్‌లకు అదే ఆఖరి ఛాన్స్.. పట్టుబట్టిన గంభీర్! -
T20 World Cup 2024: సౌతాఫ్రికా సెమీస్‌కు చేరాలంటే 136 పరుగులు చేయాలి
టీ20 వరల్డ్‌కప్ సూపర్-8 పోరులో ఇవాళ (జూన్ 24) సౌతాఫ్రికా, వెస్టిండీస్ జట్లు తలపడుతున్నాయి. ఇవాళ ఉదయం ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. సౌతాఫ్రికా బౌలర్లు మూకుమ్మడిగా రాణించడంతో వెస్టిండీస్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 135 పరుగులు మాత్రమే చేయగలిగింది. తబ్రేజ్ షంషి తన స్పిన్ మాయాజాలాన్ని ప్రదర్శించి విండీస్‌ను దెబ్బకొట్టాడు. షంషి 4 ఓవర్లలో 27 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. షంషికి జతగా సఫారీ బౌలర్లంతా రాణించారు. జన్సెన్, మార్క్రమ్, కేశవ్ మహారాజ్, రబాడ తలో వికెట్ పడగొట్టారు. విండీస్ ఇన్నింగ్స్‌లో రోస్టన్ ఛేజ్ (52) అర్దసెంచరీతో రాణించగా.. కైల్ మేయర్స్ 35 పరుగులతో పర్వాలేదనిపించాడు. వీరిద్దరు మినహా విండీస్ బ్యాటర్లంతా చేతులెత్తేశారు. హోప్ 0, పూరన్ 1, రోవ్‌మన్ పావెల్ 1, రూథర్‌ఫోర్డ్ 0, రసెల్ 15, అకీల్ హొసేన్ 6 పరుగులకు ఔటయ్యారు. అల్జరీ జోసఫ్ (11 నాటౌట్), మోటీ (4) నాటౌట్‌గా నిలిచారు. 10 పరుగులు ఎక్స్‌ట్రాల రూపంలో వచ్చాయి. కాగా, గ్రూప్-2 నుంచి ఇంగ్లండ్ సెమీఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. ఆ జట్టు నిన్న యూఎస్ఏతో జరిగిన మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో గెలుపొంది దర్జాగా సెమీస్‌లోకి అడుగుపెట్టింది. ఈ గ్రూప్ నుంచి రెండో బెర్త్ కోసం దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ జట్లు పోటీపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో విండీస్ గెలిస్తేనే సెమీస్‌కు చేరుకుంటుంది. సౌతాఫ్రికా ఓడితే నెట్ రన్‌రేట్ కీలకమవుతుంది. -
SA Vs Nepal: నరాలు తెగే ఉత్కంఠ.. ఆఖరి బంతికి!
టీ20 ప్రపంచకప్-2024 లీగ్ మ్యాచ్‌లో నేపాల్ జట్టు సౌతాఫ్రికాకు చెమటలు పట్టించింది. ఆఖరి బంతి వరకు నరాలు తెగే ఉత్కంఠ రేపి.. చివరికి ఒక్క పరుగు తేడాతో ఓటమిపాలైంది.అయితే.. నువ్వా-నేనా అన్నట్లుగా పటిష్ట ప్రొటిస్ జట్టుతో విజయం కోసం నేపాల్ జట్టు పోరాడిన తీరు మాత్రం అభిమానుల మనసు గెలుచుకుంది.వరల్డ్‌కప్-2024 లీగ్ దశలో బంగ్లాదేశ్, నెదర్లాండ్స్, నేపాల్, శ్రీలంకతో కలిసి గ్రూప్-డిలో ఉన్న సౌతాఫ్రికా ఇప్పటికే హ్యాట్రిక్ విజయాలతో సూపర్-8కు చేరుకుంది. మరోవైపు.. నేపాల్ వరుసగా రెండు మ్యాచ్‌లు ఓడి టోర్నీ నుంచి దాదాపుగా నిష్క్రమించింది.సౌతాఫ్రికాకు చుక్కలు చూపించిఇలాంటి దశలో నామమాత్రపు ఆఖరి మ్యాచ్‌లో సౌతాఫ్రికాకు చుక్కలు చూపించి సత్తా చాటింది. సెయింట్ విన్సెంట్ వేదికగా శనివారం ఉదయం జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన నేపాల్ తొలుత బౌలింగ్ చేసింది.స్పిన్నర్ కుశాల్ భూర్తేల్(4/19), పేసర్ దీపేంద్ర సింగ్(3/21) సంచలన ప్రదర్శన కనబరిచారు. అద్భుత స్పెల్స్‌తో సౌతాఫ్రికాను 115 పరుగులకు కట్టడి చేశారు. ప్రొటిస్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్ రీజా హెండ్రిక్స్(43) టాప్ స్కోరర్‌గా నిలవగా.. ట్రిస్టన్ స్టబ్స్(18 బంతుల్లో 27 నాటౌట్) రాణించాడు. View this post on Instagram A post shared by ICC (@icc) ఇక లక్ష్య ఛేదనకు దిగిన నేపాల్‌ను సౌతాఫ్రికా స్పిన్నర్ తబ్రేజ్ షంసీ ఆదిలోనే దెబ్బకొట్టినా.. ఓపెనర్ ఆసిఫ్ షేక్(49 బంతుల్లో 42) పట్టుదలగా నిలబడ్డాడు. అతడికి తోడుగా అనిల్ సా(27) రాణించాడు. View this post on Instagram A post shared by ICC (@icc)అయితే, మిగతా బ్యాటర్ల నుంచి వీరికి సహకారం అందలేదు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి నేపాల్ 114 పరుగులు మాత్రమే చేయగలిగింది. విజయానికి ఒక్క పరుగు దూరంలో నిలిచిపోయింది.ఇక నేపాల్ టాపార్డర్‌ను కుప్పకూల్చిన తబ్రేజ్ షంసీ(4/19) ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలవగా.. కెప్టెన్ ఐడెన్ మార్క్రమ్ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు.నేపాల్‌పై విజయంతో గ్రూప్ దశలో నాలుగింటికి నాలుగు మ్యాచ్‌లు గెలిచిన సౌతాఫ్రికా.. పొట్టి ఫార్మాట్ వరల్డ్‌కప్ తొమ్మిదో ఎడిషన్‌లో ఈ ఘనత సాధించిన తొలి జట్టుగా నిలిచింది.సౌతాఫ్రికా వర్సెస్ నేపాల్ స్కోర్లుసౌతాఫ్రికా- 115/7 (20)నేపాల్- 114/7 (20)ఫలితం- ఒక్క పరుగు తేడాతో నేపాల్‌పై సౌతాఫ్రికా గెలుపు. చదవండి: T20 WC: పాకిస్తాన్‌కు చావు దెబ్బ.. ప్రపంచకప్ టోర్నీ నుంచి అవుట్ View this post on Instagram A post shared by ICC (@icc) -
పాకిస్తాన్ లీగ్‌లో ఫుడ్ పాయిజన్ కలకలం.. 13 మందికి అస్వస్థత, ఒకరికి సీరియస్
పాకిస్తాన్ సూపర్ లీగ్ 2024లో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. కరాచీ కింగ్స్‌కు చెందిన 13 మంది క్రికెటర్లు కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురయ్యారని సమాచారం. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. పరిస్థితి చేయి దాటేలా ఉండటంతో సదరు ఆటగాడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తుంది. క్వెట్టా గ్లాడియేటర్స్‌తో ఇవాళ (ఫిబ్రవరి 29) జరుగుతున్న మ్యాచ్‌కు ముందు ఈ పరిస్థితి తలెత్తినట్లు తెలుస్తుంది. ఆసుపత్రికి తరలించిన క్రికెటర్ సౌతాఫ్రికాకు చెందిన తబ్రేజ్ షంషి అని సమాచారం. నిన్న ఆస్ట్రేలియాకు చెందిన డేనియల్ సామ్స్, సౌతాఫ్రికాకు చెందిన లూయిస్ డు ప్లూయ్ ఉదర సంబంధింత సమస్యల కారణంగా చాలా ఇబ్బంది పడినట్లు తెలుస్తుంది. కరాచీ కింగ్స్ హెడ్ కోచ్ ఫిల్ సిమన్స్ సైతం స్వల్ప అస్వస్థతకు గురైనట్లు సమాచారం. ఇంతమంది ఆటగాళ్లు అస్వస్థతకు గురయ్యారని తెలుస్తున్నప్పటికీ.. కరాచీ కింగ్స్ యాజమాన్యం వాస్తవాలను బయటకు పొక్కకుండా జాగ్రత్తపడుతున్నట్లు పాక్ మీడియానే ప్రచారం చేస్తుంది. క్వెట్టాతో కొద్ది సేపటి క్రితం మొదలైన మ్యాచ్‌లో కరాచీ కింగ్స్.. పై పేర్కొన్న ఆటగాళ్లు కాకుండా వేరే ముగ్గురు ఫారెన్ ప్లేయర్లతో బరిలోకి దిగింది. క్వెట్టాతో జరుగుతున్న మ్యాచ్‌లో కరాచీ కింగ్స్ తొలుత బ్యాటింగ్ చేస్తుంది. 16.1 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్ 134/6గా ఉంది. షాన్ మసూద్ (2), టిమ్ సీఫర్ట్ (21), జేమ్స్ విన్స్ (37), షోయబ్ మాలిక్ (12), మొహమ్మద్ నవాజ్ (28), పోలార్డ్ (13) ఔట్ కాగా.. ఇర్ఫాన్ ఖాన్ (15), హసన్ అలీ క్రీజ్‌లో ఉన్నారు. క్వెట్టా బౌలర్లలో అకీల్ హొసేన్, అబ్రార్ అహ్మద్, ఉస్మాన్ తారిక్ తలో 2 వికెట్లు పడగొట్టారు. -
రోహిత్ 20 సిక్స్‌లు కొట్టేవాడు.. ఆ బౌలర్ బతికిపోయాడు: షోయబ్ అక్తర్
వన్డే ప్రపంచకప్-2023లో భాగంగా టీమిండియా చేతిలో 243 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా ఘోర ఓటమి చవిచూసిన సంగతి తెలిసిందే. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో 327 పరుగుల లక్ష్య ఛేదనలో ప్రోటీస్ కేవలం 83 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో స్పిన్నర్ రవీంద్ర జడేజా 5 వికెట్లతో చెలరేగాడు. సఫారీలు ఈ మ్యాచ్‌లో బౌలింగ్‌లో కూడా దారుణంగా విఫలమయ్యారు. మొదటి బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 326 పరుగులు చేసింది. కాగా ఈడెన్ గార్డెన్స్ పిచ్ మాత్రం స్పిన్నర్లకు అద్బుతంగా అనుకూలించింది. అయితే స్పిన్‌కు అనుకూలించిన వికెట్‌పై విఫలమైన ప్రోటీస్ స్పిన్నర్ తబ్రైజ్ షమ్సీపై పాక్ మాజీ స్పీడ్ స్టార్ షోయబ్ అక్తర్ విమర్శల వర్షం కురిపించాడు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ షమ్సీ బౌలింగ్‌ను ఆడి వుంటే కనీసం 20 సిక్స్‌లు కొట్టేవాడని అక్తర్ అన్నాడు. కాగా ఈ మ్యాచ్‌లో షమ్సీ తన 10 ఓవర్ల కోటాలో ఏకంగా 72 పరుగులిచ్చి ఒక్క వికెట్ పడగొట్టాడు. అంతేకాకుండా ఏకంగా 7 వైడ్లు వేశాడు. ఒక స్పిన్నర్ ఇన్నివైడ్లు వేయడం మనం అరుదుగా చూస్తూ ఉంటాం. ఇక అతడి తోటి స్పిన్నర్ కేశవ్ మహారాజ్ మాత్రం అద్బుతంగా బౌలింగ్ చేశాడు. మహారాజ్ తన కోటాలో కేవలం 30 పరుగులు మాత్రమే ఇచ్చాడు. "రోహిత్ శర్మ అద్బుతమైన షాట్లు ఆడాడు. తబ్రైజ్ షమ్సీ చెత్త బౌలింగ్ వేశాడు. షమ్సీ రోహిత్‌కు అలాంటి బంతులను వేసి ఉంటే.. అతడు కనీసం 15 నుంచి 20 సిక్సర్లు కొట్టేవాడు. అప్పుడు భారత్ స్కోర్ బోర్డులో 430 పైగా పరుగులు వచ్చేవి. ప్రతీ మ్యాచ్‌లోనూ రోహిత్ శర్మ నిస్వార్థ ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. దూకుడుగా ఆడి జట్టుకు అద్భుతమైన ఆరంభాన్ని ఇస్తున్నాడని" తన యూట్యూబ్ ఛానల్లో అక్తర్ పేర్కొన్నాడు. కాగా ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ కేవలం 24 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 40 పరుగులు చేశాడు. చదవండి: WC 2023: బంగ్లాదేశ్ అప్పీలు.. మాథ్యూస్ అవుట్! అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి! -
సౌతాఫ్రికాతో మ్యాచ్.. టాస్ గెలిచిన న్యూజిలాండ్, ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌కు నో ప్లేస్
వన్డే వరల్డ్‌కప్ 2023లో భాగంగా ఇవాళ (నవంబర్ 1) సౌతాఫ్రికా, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి (పూణే వేదికగా). ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు చెరో మార్పు చేశాయి. పాకిస్తాన్‌తో జరిగిన గత మ్యాచ్‌లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచిన తబ్రేజ్ షంషిని సౌతాఫ్రికా ఈ మ్యాచ్ నుంచి తప్పించింది. పిచ్ పేస్‌కు అనుకూలించే అవకాశం ఉండటంతో షంషి స్థానంలో కగిసో రబాడ జట్టులోకి వచ్చాడు. మరోవైపు న్యూజిలాండ్ లోకీ ఫెర్గూసన్ స్థానంలో టిమ్ సౌథీని జట్టులోకి తీసుకుంది. దక్షిణాఫ్రికా: క్వింటన్ డికాక్(వికెట్‌కీపర్), టెంబా బావుమా(కెప్టెన్), రస్సీ వాన్ డెర్ డస్సెన్, ఎయిడెన్ మార్క్రమ్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, మార్కో జన్సెన్, గెరాల్డ్ కోయెట్జీ, కేశవ్ మహరాజ్, కగిసో రబడ, లుంగి ఎంగిడి న్యూజిలాండ్: డెవాన్ కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, టామ్ లాథమ్(వికెట్‌కీపర్/కెప్టెన్), గ్లెన్ ఫిలిప్స్, జేమ్స్ నీషమ్, మిచెల్ సాంట్నర్, మాట్ హెన్రీ, టిమ్ సౌతీ, ట్రెంట్ బౌల్ట్ -
ఓవరాక్షన్ రిజ్వాన్.. అతడి గుండె పగిలింది! మేము ‘చోకర్స్’ కాదు.. అర్థమైందా?
ICC WC 2023- South Africa Beat Pakistan By 1 Wicket: భారత్‌లో వన్డే ప్రపంచకప్-2023.. రెండు వరుస విజయాలు.. ఆ తర్వాత హ్యాట్రిక్ ఓటములు.. వెరసి సెమీస్ అవకాశాలు సంక్లిష్టం.. ఇలాంటి దశలో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో దురదృష్టం వెక్కిరించింది.. ‘చోకర్స్’ అన్న పేరున్న జట్టు చేతిలో ఘోర పరాభవానికి గురై సెమీస్ రేసు నుంచి దాదాపుగా నిష్క్రమించే దుస్థితికి చేరుకుంది.. ఈ ఉపోద్ఘాతమంతా పాకిస్తాన్ జట్టు గురించే అని ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది. ఆరంభ శూరత్వమే! వరల్డ్‌కప్-2023లో నెదర్లాండ్స్‌తో తొలి మ్యాచ్ ఆడిన బాబర్ ఆజం బృందం 81 పరుగులతో జయభేరి మోగించింది. అనంతరం మ్యాచ్‌లో శ్రీలంకను ఆరు వికెట్ల తేడాతో ఓడించింది. ఆ తర్వాత గెలుపు అన్న మాటనే మరిచిపోయింది. చిరకాల ప్రత్యర్థి టీమిండియా చేతిలో చిత్తుగా ఓడిన తర్వాత.. పాకిస్తాన్‌ను వరుసగా పరాజయాలే పలకరించాయి. తాజాగా శుక్రవారం నాటి మ్యాచ్‌లో సౌతాఫ్రికా సైతం తమపై జయకేతనం ఎగురవేయడంతో బాబర్ బృందం సెమీస్ దారులు దాదాపుగా మూసుకుపోయాయి. నువ్వా- నేనా.. నరాలు తెగే ఉత్కంఠ అయితే, తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో అటు పాకిస్తాన్ ఆటగాళ్లు.. తమపై పాక్ ఆధిపత్యాన్ని తగ్గించడం సహా టేబుల్ టాపర్‌గా నిలించేందుకు ఇటు సౌతాఫ్రికా ప్లేయర్లు పోరాడిన తీరు మాత్రం క్రికెట్ ప్రేమికులను ఆకట్టుకుంది. పాక్ విధించిన 271 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 10 పరుగుల వ్యవధిలో మూడు వికెట్లు కోల్పోయిన ప్రొటిస్ జట్టు మరోసారి చోకర్స్ అనిపించుకోవడం ఖాయమంటూ విశ్లేషణలు ఓవైపు.. ఆఖరి వికెట్ తీసేందుకు అస్త్రశస్త్రాలను ప్రయోగిస్తున్న పాకిస్తాన్ డూ ఆర్ డై మ్యాచ్‌లో గెలిచి నిలుస్తుందా అన్న చర్చలు మరోవైపు.. చివరి వరకు హైడ్రామా.. పాక్ గెలుపు ఖాయమైందన్నంతగా ఆ మధ్యలో 46వ ఓవర్ ఆఖరి బంతికి పాకిస్తాన్ పేసర్ హ్యారిస్ రవూఫ్.. సఫారీ జట్టు టెయిలెండర్ తబ్రేజ్ షంసీని అవుట్ చేసినంత పనిచేశాడు. పాక్‌కు గెలుపు ఖాయమైపోయిందన్నంత నమ్మకంగా ఎల్బీకి అప్పీలు చేశాడు. అయితే అనుభవజ్ఞుడైన అంపైర్ అలెక్స్ వార్ఫ్ అదేమీ లేదన్నట్లు అడ్డంగా తలూపాడు. పాకిస్తాన్‌కు వేరే ఆప్షన్ లేదు. రవూఫ్ ఓవైపు.. వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్ మరోవైపు నమ్మకంగా చెప్పడంతో కెప్టెన్ బాబర్ ఆజం రివ్యూకు వెళ్లాడు. సఫారీల అదృష్టం బాగుంది కానీ.. షంసీ అదృష్టం బాగుంది. బంతి లెగ్ స్టంప్‌ను జస్ట్ అలా ముద్దాడినట్లుగా అనిపించింది గానీ మిస్ అయింది.. అంపైర్స్ కాల్ నాటౌట్ కావడంతో సౌతాఫ్రికాకు ఫేవర్‌గా ఫలితం వచ్చింది. అంతే.. పాక్ ఆటగాళ్లు ఒక్కసారిగా నీరుగారిపోయారు. రవూఫ్ అయితే ఏడ్చినంత పనిచేశాడు. రిజ్వాన్ సైతం ఒక్కసారిగా పరిగెత్తుకు వచ్చి రవూఫ్‌ను హత్తుకుని ‘ఎమోషనల్’ అయ్యాడు. పాకిస్తాన్ శిబిరం మొత్తం నిరాశలో కూరుకుపోయింది. ఓవరాక్షన్ రిజ్వాన్.. అతడి గుండె పగిలింది ఇందుకు సంబంధించిన దృశ్యాలను ఐసీసీ సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్‌గా మారాయి. ఇవి చూసిన నెటిజన్లలో కొందరు పాక్ ఆటగాళ్లకు సానుభూతి తెలుపుతుండగా.. ‘‘ఓవరాక్షన్ రిజ్వాన్‌ను ఇలా చూడాల్సి వస్తుందని అనుకోలేదు’’ అంటూ మరికొందరు ట్రోల్ చేస్తున్నారు. కాగా పాక్ వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్ కాస్త అతి చేస్తాడన్న సంగతి తెలిసిందే. ఫీల్డింగ్ సమయంలో ప్రత్యర్థి జట్టు బ్యాటర్లను హడలెత్తించే క్రమంలో మాటిమాటికి గట్టిగా అప్పీలు చేస్తూ ఉంటాడు. అంతేకాదు ఆటతో సంబంధంలేని విషయాల్లోనూ తలదూరుస్తూ ఉంటాడు. ఈ విషయాలను ప్రస్తావిస్తూ నెటిజన్లు అతడిని ట్రోల్ చేస్తున్నారు. మేము చోకర్స్ కాదు.. అర్థమైందా? ఇక చెన్నై మ్యాచ్‌లో సౌతాఫ్రికా చేతిలో పాక్ పరాజయం పాలైన విషయం తెలిసిందే. ప్రొటిస్ ఇన్నింగ్స్‌లో 48వ ఓవర్ రెండో బంతికి కేశవ్ మహరాజ్ ఫోర్ బాది పాకిస్తాన్ ఓటమిని ఖరారు చేసి సౌతాఫ్రికాపై ఉన్న ‘చోకర్స్’(అంతా బాగా ఆడి ఆఖరి నిమిషంలో చేతులెత్తేస్తారన్న అర్థంలో) అన్న ట్యాగ్ ఇకపై తమకు వాడొద్దనేలా సంకేతాలు ఇచ్చాడు. ఇక సఫారీల చేతిలో ఓటమితో పాక్ సెమీ ఫైనల్ ఆశలకు దాదాపు గండిపడినట్లే! చదవండి: Ind vs Aus: టీమిండియాతో టీ20 సిరీస్.. జట్టును ప్రకటించిన ఆస్ట్రేలియా.. కెప్టెన్ అతడే WC 2023: అతడు అవుట్ అయినట్లు తేలితే మేమే గెలిచేవాళ్లం.. ఓటమికి కారణం అదే: బాబర్ View this post on Instagram A post shared by ICC (@icc) -
WC 2023: అతడు అవుట్ అయినట్లు తేలితే మేమే గెలిచేవాళ్లం.. ఓటమికి కారణం అదే: బాబర్
ICC WC 2023- Pak Vs SA- Babar Azam Comments On Loss: ‘విజయానికి అత్యంత చేరువగా వచ్చాం.. కానీ సరైన ముగింపు ఇవ్వలేకపోయాం. జట్టు మొత్తం తీవ్ర నిరాశలో మునిగిపోయింది. ఆఖరి ఓవర్లలో మేము తిరిగి పుంజుకున్న తీరు.. కనబరిచిన పోరాట పటిమ అద్భుతం. కానీ ఇలా జరిగిపోయింది’’ అని పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం విచారం వ్యక్తం చేశాడు. అలా అయితే ఫలితం వేరేలా ఉండేది తాము మరో 10-15 పరుగులు చేసి ఉంటే ఫలితం వేరేలా ఉండేదని అభిప్రాయపడ్డాడు. వన్డే వరల్డ్‌కప్-2023లో హ్యాట్రిక్ ఓటములతో డీలాపడిన పాకిస్తాన్.. శుక్రవారం నాటి మ్యాచ్‌లో సౌతాఫ్రికా చేతిలో పరాజయం పాలైన విషయం తెలిసిందే. ఆఖరి వరకు ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో ప్రొటిస్ టెయిలెండర్ కేశవ్ మహరాజ్ ఫోర్ బాదడంతో.. ఎలాంటి సమీకరణలతో సంబంధం లేకుండా సెమీస్ రేసులో ముందుకు వెళ్లాలనుకున్న పాకిస్తాన్‌కు భంగపాటు ఎదురైంది. అందుకే ఓడిపోయాం ఈ నేపథ్యంలో ఓటమిపై స్పందించిన బాబర్ ఆజం.. తమ ఫాస్ట్ బౌలర్లు, స్పిన్నర్లు ఆఖరి వరకు అద్భుతంగా పోరాడారని.. కానీ దురదృష్టవశాత్తూ అనుకున్న ఫలితం రాబట్టలేకపోయామని విచారం వ్యక్తం చేశాడు. అతడు అవుట్ అయితే సెమీస్ రేసులో ఉండేవాళ్లం అదే విధంగా.. 46వ ఓవర్ ఆఖరి బంతికి సౌతాఫ్రికా టెయిలెండర్ తబ్రేజ్ షంసీ విషయంలో ఎల్బీడబ్ల్యూకు అప్పీలు చేసిన పాకిస్తాన్‌కు ప్రతికూల ఫలితం వచ్చిన విషయాన్ని బాబర్ ఈ సందర్భంగా ప్రస్తావించాడు. ‘‘డీఆర్ఎస్ ఆటలో భాగం. ఒకవేళ అతడిని అవుట్‌గా పరిగణించినట్లయితే.. ఫలితం మాకు అనుకూలంగా ఉండేది. సెమీస్ రేసులో నిలిచేందుకు మాకు అవకాశాలు ఉండేవి. కానీ అలా జరుగలేదు’’ అని అంపైర్ కాల్ వల్ల తమకు నష్టం జరిగిందని చెప్పుకొచ్చాడు. ఇక తదుపరి మూడు మ్యాచ్‌లలో బాగా ఆడి పాకిస్తాన్‌ను గెలిపించేందుకు శాయశక్తులా కృషి చేస్తామన్న బాబర్.. ఆ తర్వాత పాయింట్ల పట్టికలో ఎక్కడి వరకు చేరుకుంటామో చూద్దామంటూ నిర్వేదంగా మాట్లాడాడు. హైడ్రామా.. కాగా పేసర్ హ్యారిస్ రవూఫ్ బౌలింగ్‌లో షంసీ ఎల్బీడబ్ల్యూ అయినట్లు నమ్మకంగా ఉన్న పాకిస్తాన్‌కు అంపైర్స్ కాల్ షాకిచ్చిన విషయం తెలిసిందే. రవూఫ్ సంధించిన ఇన్‌స్వింగర్ లెగ్ స్టంప్స్‌ను తాకినట్లుగా అనిపించింది. అయితే, బాల్ ట్రాకింగ్‌లో తృటిలో మిస్ అయినట్లు కనిపించగా.. నాటౌట్‌గా పేర్కొన్న అంపైర్స్ కాల్ వల్ల సౌతాఫ్రికా బతికిపోయింది. మరుసటి రెండో ఓవర్ వరకు హైడ్రామా నడవగా కేశవ్ మహరాజ్ సౌతాఫ్రికా విజయ లాంఛనం పూర్తి చేశాడు. పాకిస్తాన్ వర్సెస్ సౌతాఫ్రికా స్కోర్లు: ►వేదిక: చెన్నై చెపాక్ స్టేడియం ►టాస్: పాకిస్తాన్- తొలుత బ్యాటింగ్ ►పాక్ స్కోరు: 270 (46.4) ►సౌతాఫ్రికా స్కోరు: 271/9 (47.2) ►ఫలితం: ఒక్క వికెట్ తేడాతో సౌతాఫ్రికా విజయం ►ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: తబ్రేజ్ షంసీ(4 వికెట్లు) చదవండి: WC 2023: అతడు లేని లోటు తీర్చేందుకు రంగంలోకి కోహ్లి! గిల్ కూడా.. View this post on Instagram A post shared by ICC (@icc) -
షంషి మాయాజాలం.. ఇంటిదారి పట్టిన బాబర్ ఆజమ్ జట్టు
లంక ప్రీమియర్ లీగ్-2023లో భాగంగా కొలొంబో స్ట్రయికర్స్‌తో నిన్న (ఆగస్ట్ 15) జరిగిన మ్యాచ్‌లో గాలే టైటాన్స్ ఘన విజయం సాధించింది. తద్వారా ప్లే ఆఫ్స్‌కు చేరిన రెండో జట్టుగా నిలిచింది. ఓడిన కొలంబో జట్టు ఇంటిదారి పట్టింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కొలొంబో.. గాలే స్పిన్నర్లు తబ్రేజ్ షంషి (4-0-20-4), సీక్కుగ్గే ప్రసన్న (3-0-14-3), షకీబ్ అల్ హసన్ (3.4-0-8-1) ధాటికి 15.4 ఓవర్లలో 74 పరుగులకు చాపచుట్టేసింది. గాలే స్పిన్ త్రయానికి పేసర్ లహీరు కుమార (2-1-9-2) తోడవ్వడంతో కొలొంబో ఇన్నింగ్స్ పేకమేడలా కూలింది. Colombo fail to ‘strike’ as the Titans bundle them out for 74, their lowest total!#LPL2023 #LiveTheAction pic.twitter.com/JdkUZ6pL0W — LPL - Lanka Premier League (@LPLT20) August 15, 2023 కొలంబో ఇన్నింగ్స్‌లో నువనిదు ఫెర్నాండో (14) టాప్ స్కోరర్‌గా నిలువగా.. లహీరు ఉదాన (14), నిపున్ ధనంజయ (13), మహ్మద్ నవాజ్ (11) రెండంకెల స్కోర్లు చేశారు. ఓపెనర్ పథుమ్ నిస్సంక (2), స్టార్ బ్యాటర్ బాబర్ ఆజమ్ (6), ఇఫ్తికార్ అహ్మద్ (5), కరుణరత్నే (2) సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితం కాగా.. షోరిఫుల్ ఇస్లాం, వాండర్సే ఖాతా కూడా తెరవలేకపోయారు. Galle Titans finish second on the points table with this win, ease into the playoffs!#LPL2023 #LiveTheAction pic.twitter.com/u6vxWRW0cd — LPL - Lanka Premier League (@LPLT20) August 15, 2023 అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన గాలే టైటాన్స్.. ఓపెనర్ లసిత్ క్రూస్పుల్లే (42 నాటౌట్), షకీబ్ (17 నాటౌట్) రాణించడంతో కేవలం 8.3 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి ఆడుతూ పాడుతూ విజయతీరాలకు చేరింది. తద్వారా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. గాలే ఇన్నింగ్స్‌లో భానుక రాజపక్ష (6), లిటన్ దాస్ (1) తక్కువ స్కోర్లకే పెవిలియన్‌కు చేరగా..వీరి వికెట్లు ఇఫ్తికార్ అహ్మద్‌కు, జెఫ్రీ వాండర్సేకు దక్కాయి. Dasun’s men gave no quarter as they demolished a strong Colombo side! Be part of the action. Get your tickets now! Book online via BookMyShow 👉https://t.co/leccAIsdLx#LPL2023 #LiveTheAction pic.twitter.com/RCOtOmLeSu — LPL - Lanka Premier League (@LPLT20) August 15, 2023 ఈ గెలుపుతో గాలే దర్జాగా ప్లే ఆఫ్స్‌కు చేరగా.. పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచిన కొలొంబో ఇంటిదారి పట్టింది. 8 మ్యాచ్‌ల్లో 6 విజయాలు సాధించిన దంబుల్లా ఔరా టీమ్ ప్లే ఆఫ్స్‌కు చేరిన తొలి జట్టు కాగా.. గాలే టైటాన్స్ రెండో స్థానంలో, బి లవ్ క్యాండీ, జాఫ్నా కింగ్స్ 3, 4 స్థానాల్లో నిలిచాయి. గాలే-కొలొంబో మ్యాచ్‌తో లీగ్ దశ మ్యాచ్‌లు ముగియగా.. ఆగస్ట్ 17 నుంచి ప్లే ఆఫ్స్ మ్యాచ్‌లు మొదలవుతాయి. Shamsi’s spin left the Strikers in ruins! Be part of the action. Get your tickets now! Book online via BookMyShow 👉https://t.co/leccAIrFVZ#LPL2023 #LiveTheAction pic.twitter.com/PnY9IvXFNA — LPL - Lanka Premier League (@LPLT20) August 15, 2023 We’re into the playoffs, and four of the season’s best performers will lock horns!#LPL2023 #LiveTheAction pic.twitter.com/2fRO8uUUUf — LPL - Lanka Premier League (@LPLT20) August 15, 2023 ఆగస్ట్ 17: దంబుల్లా వర్సెస్ గాలే (క్వాలిఫయర్ 1) బి లవ్ క్యాండీ వర్సెస్ జాఫ్నా కింగ్స్ (ఎలిమినేటర్) ఆగస్ట్ 19: క్వాలిఫయర్ 1లో ఓడిన జట్టు వర్సెస్ ఎలిమినేటర్‌లో గెలిచిన జట్టు (క్వాలిఫయర్ 2) ఆగస్ట్ 20: క్వాలిఫయర్ 1లో గెలిచిన జట్టు వర్సెస్ క్వాలిఫయర్ 2లో గెలిచిన జట్టు (ఫైనల్) -
షంషి, షోయబ్ మాలిక్ మాయాజాలం.. రిజ్వాన్ జట్టుకు ఊహించని షాక్
PSL 2023: పాకిస్తాన్ సూపర్ లీగ్ 2023 సీజన్లో మహ్మద్ రిజ్వాన్ సారథ్యంలోని ముల్తాన్ సుల్తాన్స్‌కు రెండో ఓటమి ఎదురైంది. ప్రస్తుత సీజన్లో తొలి మ్యాచ్‌లో ఓటమిపాలైన సుల్తాన్స్ ఆ తర్వాత వరుసగా 4 విజయాలు సాధించి, ఇవాళ (ఫిబ్రవరి 26) జరిగిన 6వ మ్యాచ్‌లో ఓటమిపాలైంది. ప్రస్తుత సీజన్లో భీకర ఫామ్‌లో ఉన్న రిజ్వాన్.. ఈ మ్యాచ్‌లో విఫలం కావడంతో సుల్తాన్స్ ఓటమిపాలైంది. ఈ సీజన్లో ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల్లో వరుసగా 75, 28 నాటౌట్, 66, 50, 110 నాటౌట్, 29 స్కోర్లు చేసిన రిజ్వాన్.. ఈ ఒక్క మ్యాచ్‌లోనే నిరుత్సాహపరిచాడు. మ్యాచ్ విషయానికొస్తే.. ముల్తాన్ సుల్తాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కరాచీ కింగ్స్ 66 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన కింగ్స్.. మాథ్యూ వేడ్ (46), జేమ్స్ విన్స్ (27), తయ్యబ్ తాహిర్ (65) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేయగా, ఛేదనలో సుల్తాన్స్ 101 పరుగులకే చాపచుట్టేయడంతో ఓటమిపాలైంది. సుల్తాన్స్ ఇన్నింగ్స్‌లో షాన్ మసూద్ (25), మహ్మద్ రిజ్వాన్ (29), అన్వర్ అలీ (12), ఉసామా అలీ (10) మినహా మిగతవారు కనీసం రెండంకెల స్కోర్ కూడా చేయలేకపోయారు. తబ్రేజ్ షంషి (3/18), షోయబ్ మాలిక్ (3/18), అకీఫ్ జావిద్ (2/8), ఇమాద్ వసీం (2/34) పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు సుల్తాన్స్‌ను కట్టడి చేయడంలోనూ సఫలమయ్యారు. అంతకుముందు ముల్తాన్స్ బౌలర్లు ఇహసానుల్లా 2 వికెట్లు, అన్వర్ అలీ ఓ వికెట్ పడగొట్టారు. పీఎస్ఎల్లో ఇవాళ రాత్రి లాహోర్ ఖలందర్స్-పెషావర్ జల్మీ తలపడనున్నాయి. -
BGT 2023: అక్కడ ఆడటం ఈజీ కాదన్న షంసీ! చెత్త వాగకు అంటూ కౌంటర్
India vs Australia, 1st Test: చెత్త మాటలు మాట్లాడితే సహించేది లేదంటూ నెటిజన్‌కు చురకలంటించాడు సౌతాఫ్రికా బౌలర్ తబ్రేజ్ షంసీ. ఏదైనా మాట్లాడేటపుడు కాస్త ముందూ వెనుక ఆలోచించాలని సూచించాడు. కాగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీ నేపథ్యంలో క్రికెట్ ప్రపంచమంతా టెస్టు క్రికెట్ ఫీవర్‌లో మునిగిపోయిందనడంలో సందేహం లేదు. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిన్ ఫైనలిస్టులను ఖరారు చేసే టీమిండియా- ఆస్ట్రేలియా సిరీస్‌పైనే అందరి దృష్టి పడింది. ఈ క్రమంలో పిచ్, ఆటగాళ్ల బలాబలాలు తదితర అంశాలపై క్రీడా వర్గాల్లో చర్చ నడుస్తోంది. ముఖ్యంగా తొలి టెస్టుకు వేదికైన నాగ్‌పూర్ పిచ్‌ను డాక్టర్డ్ పిచ్ అంటూ క్రికెట్ ఆస్ట్రేలియా వ్యాఖ్యానించడం వివాదానికి దారి తీసింది. భారత జట్టు తమకు అనుకూలంగా(స్పిన్నర్లకు) పిచ్ తయారు చేయించుకుందని ఆరోపణలు చేసింది. ఈ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సహా మాజీలు సీఏకు గట్టి కౌంటర్ ఇచ్చారు. షంసీ ఆసక్తికర ట్వీట్ ఇక గురువారం భారత్- ఆసీస్ తొలి టెస్టు ఆరంభం కాగా తొలి రోజు టీమిండియానే పైచేయి సాధించింది. టీమిండియా స్పిన్నింగ్ ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా ఐదు, రవిచంద్రన్ అశ్విన్ మూడు వికెట్లు తీసి కంగారూ జట్టు పతనాన్ని శాసించారు. వీరి బౌలింగ్‌ను ఎదుర్కోలేక ఆసీస్ బ్యాటర్లు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఈ క్రమంలో.. సౌతాఫ్రికా స్పిన్నర్ తబ్రేజ్ షంసీ ఆసక్తికర ట్వీట్ చేశాడు. ‘‘ఇండియాలో ఇండియాతో మ్యాచ్ ఆడటం అంత సులువేమీ కాదు’’ అంటూ ఫన్నీ ఎమోజీని జతచేశాడు. ఇక ఇందుకు స్పందించిన ఓ నెటిజన్.. ‘‘నీకు ఐపీఎల్ కాంట్రాక్ట్ కచ్చితంగా వస్తుంది.. కంగ్రాట్యులేషన్స్ బ్రో’’ అంటూ వెటకారం ప్రదర్శించాడు. అయితే, షంసీ సదరు ట్విటిజెన్కు ఘాటుగానే బదులిచ్చాడు. చెత్త వాగకు.. ‘‘నేను ఇండియాలో ఇండియాతో మ్యాచ్‌లు ఆడాను. బహుశా నువ్వు ఆ మ్యాచ్‌లు చూసి ఉండవు. నేను అక్కడ ఆడిన నా వ్యక్తిగత అనుభవం గురించి పంచుకున్నాను. నువ్వు మాత్రం ఏదో ఒకటి మాట్లాడాలి కదా అని చెత్త వాగుతున్నావు. మన ఇద్దరి అభిప్రాయాల మధ్య చాలా తేడా ఉంది. పిచ్చిపిచ్చిగా మాట్లాడొద్దు.. థాంక్స్’’ అంటూ షంసీ కౌంటర్ ఇచ్చాడు. కాగా టీమిండియాతో పలు మ్యాచ్‌లు ఆడిన చైనామన్ స్పిన్నర్ షంసీ.. ఐపీఎల్లో రాజస్తాన్ రాయల్స్‌కు ప్రాతినిథ్యం వహించిన సంగతి తెలిసిందే. అయితే, ఐపీఎల్-2023 వేలం నేపథ్యంలో కోటి రూపాయల కనీస ధరతో పేరు నమోదు చేసుకోగా.. అమ్ముడుపోకుండా మిగిలిపోయాడు. దీంతో సదరు నెటిజన్ ఈ మేరకు కామెంట్ చేయగా.. షంసీ దిమ్మతిరిగేలా సమాధానమిచ్చాడు. చదవండి: IND VS AUS 1st Test: భారత క్రికెట్ చరిత్రలో ఒకే ఒక్కడు.. రోహిత్ శర్మ అరుదైన రికార్డు IND vs AUS: ఆసీస్ స్పిన్నర్ దెబ్బకు సూర్యకు మైండ్ బ్లాంక్.. అయ్యో ఇలా జరిగిందే!! I've played against India in India and you havnt...... I'm speaking about something from personal experience and you are speaking nonsense just for the sake of speaking nonsense There is a huge difference between the two No need to throw rubbish comments around... thanks https://t.co/SfNHmHY8yh — Tabraiz Shamsi (@shamsi90) February 9, 2023 -
నేను ఆల్‌రౌండర్‌ని.. చహల్‌కు ఇక ఎప్పటికీ ఆ ఛాన్స్ రాదు!
Yuzvendra Chahal: టీమిండియా లెగ్ స్పిన్నర్ యజ్వేంద్ర చహల్... సౌతాఫ్రికా చైనామన్ బౌలర్ తబ్రేజ్ షంసీ.. ఒకరినొకరు ఆటపట్టించుకోవడంలో ఎల్లప్పుడూ ముందుంటారు. ఐపీఎల్ ఫ్రాంఛైజీ రాజస్తాన్ రాయల్స్‌కు ఆడుతున్న సమయంలో చహల్‌తో.. షంసీకి స్నేహం బలపడింది. ఇక ఛాన్స్ దొరికినప్పుడల్లా పరస్పరం సరదాగా మాటల యుద్ధానికి దిగడం వీరికి అలవాటు. ఈ క్రమంలో తాజాగా మరోసారి షంసీ... చహల్‌ను ఆటపట్టిస్తూ అతడిని ట్రోల్ చేశాడు. కాగా జనవరి 10 నుంచి సౌతాఫ్రికా టీ20 లీగ్ ఆరంభం కానున్న సమయం తెలిసిందే. సౌతాఫ్రికా ఆల్‌రౌండర్‌ని! ఈ నేపథ్యంలో తొలి మ్యాచ్‌లో రాజస్తాన్ ఫ్రాంఛైజీ పర్ల్ రాయల్స్- ముంబై ఫ్రాంఛైజీ ఎంఐ కేప్‌టౌన్ తలపడనున్నాయి. ఈ సందర్భంగా రాజస్తాన్ తమ ట్విటర్లో షంసీ వీడియోను షేర్ చేసింది. ఇందులో షంసీ చహల్‌ను ఉద్దేశించి.. ‘‘హెలో యుజీ.. సౌతాఫ్రికా నుంచి నేను.. ఆల్‌రౌండర్‌ను మాట్లాడుతున్నా.. అది సరేగానీ.. నువ్వు ఎంత ప్రయత్నించినా బ్యాటింగ్ ఆర్డర్లో నా కంటే ముందు స్థానంలో ఎప్పుడూ రాలేవు.. ఎప్పుడూ అంటే ఎప్పుడూ కూడా నీకు ఆ అవకాశం రాదు’’ అంటూ ఆటపట్టించాడు. ఇక సోషల్ మీడియాలో తనదైన పంచులతో చెలరేగే చహల్.. ‘‘అది సరేగానీ.. నీ టమ్మీ(పొట్ట) గురించి కాస్త చెప్పు బ్రో’’ అంటూ కౌంటర్ వేశాడు. కాగా చహల్ ప్రస్తుతం స్వదేశంలో శ్రీలంకతో టీ20 సిరీస్‌తో బిజీగా ఉన్నాడు. గతంలో రాజస్తాన్‌కు ఆడిన షంసీ.. ఈసారి వేలంలో కోటి రూపాయల కనీస ధరతో పేరు నమోదు చేసుకోగా.. అమ్ముడుపోకుండా మిగిలిపోయాడు. అయితే, సౌతాఫ్రికా టీ20లీగ్‌లో మాత్రం ఈ స్పిన్నర్ రాజస్తాన్ పర్ల్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. చదవండి: IPL 2023: ఐపీఎల్ వేలానికి ముందు ఈ సిరీస్ జరిగి ఉంటేనా! కానీ పాపం.. Hardik Pandya: మావి స్థానంలో తను రావాల్సింది! ఇలా చేస్తాడనుకోలేదు.. What about your tummy my bru 😂😂 @shamsi90 — Yuzvendra Chahal (@yuzi_chahal) January 7, 2023 -
ఓయ్ చహల్.. ఏంటా పని?
ఆట అన్నాకా కాస్త కళా, పోషణ ఉంటేనే మజాగా ఉంటుంది. ఎప్పుడు సీరియస్‌గా ఆడితే పెద్దగా కిక్ ఉండదు. అందుకే క్రికెట్ సహా ఇతర ఏ ఆటలైనా.. గొడవలు, సరదా సంఘటనలు లేకుండా చప్పగా సాగితే బోర్ కొట్టేస్తుంది. ఇక టీమిండియా స్పిన్నర్ యజ్వేంద్ర చహల్ తన తుంటరితనాన్ని మరోసారి బయటపెట్టాడు. చహల్ ఫ్రేమ్‌లో ఉన్నాడంటే చాలు ఏదో ఒక చర్యతో నవ్వులు పూయిస్తుంటాడు. తాజాగా సౌతాఫ్రికా, టీమిండియాల మధ్య జరిగిన రెండో టి20లో ఒక ఆసక్తికర సంఘటన జరిగింది. దక్షిణాఫ్రికా స్పిన్నర్ తబ్రెయిజ్ షంసీని చహల్ వెనుక నుంచి వచ్చి తన్నడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఇదంతా కేవలం సరదా కోసమే. విషయంలోకి వెళితే.. సౌతాఫ్రికా ఇన్నింగ్స్ రెండో ఓవర్ ముగిసిన తర్వాత క్రీజులో ఉన్న డికాక్, మార్క్రమ్లకు డ్రింక్స్ అందించడానికి తబ్రెయిజ్ షంసీ వచ్చాడు. మార్క్రమ్, డికాక్‌లతో కీపర్ పంత్ ముచ్చటిస్తున్నాడు. ఈలోగా అక్కడికి వచ్చిన చహల్.. వెనుక నుంచి షంసీని తన్నాడు. దీంతో పక్కనే ఉన్న డికాక్, మార్క్రమ్, పంత్‌లు నవ్వాపుకోలేకపోయారు. వెంటనే వెనక్కి తిరిగిన షంసీ.. ఓయ్ చహల్ ఏంటా పని అన్నట్లుగా పేర్కొన్నాడు. మ్యాచ్ తిరిగి ఆరంభం కావడంతో ఇద్దరు సరదాగా కబుర్లు చెప్పుకుంటూ వెళ్లిపోయారు. ఇక లెగ్ స్పిన్నర్లైన చహల్, షంసీలు ఈ మ్యాచ్‌కు దూరంగా ఉన్నారు. చహల్ స్థానంలో రవిచంద్రన్ అశ్విన్ రాగా.. ఇక దక్షిణాఫ్రికా స్పిన్నర్ షంసీ స్థానంలో లుంగీ ఎన్గిడి మ్యాచ్ ఆడాడు. మ్యాచ్ విషయానికి వస్తే టీమిండియా 16 పరుగుల తేడాతో సౌతాఫ్రికాపై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 237 పరుగులు చేయగా.. దక్షిణాఫ్రికా 221 పరుగులు చేసింది. డేవిడ్ మిల్లర్ సెంచరీతో టీమిండియాను వణికించినప్పటికి.. చేయాల్సిన పరుగులు ఎక్కువగా ఉండడంతో ప్రొటిస్‌కు ఓటమి తప్పలేదు. ఈ విజయంతో టీమిండియా ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0తో సిరీస్‌ను గెలిచింది. ఇరుజట్ల మధ్య మూడో టి20 ఇండోర్ వేదికగా అక్టోబర్ 4న జరగనుంది. Yuzi bhai 😂#INDvSA #CricketTwitter pic.twitter.com/CTkXqpw2A5 — ...... (@Brahman_Kuldip) October 2, 2022 చదవండి: ఇదొక్కటి చాలు.. కోహ్లి ఏంటో చెప్పడానికి! స్వదేశంలో టీమిండియా కొత్త చరిత్ర.. -
బట్లర్ సేనకు చుక్కలు చూపించిన షంషి.. మరో సిరీస్ కోల్పోయిన ఇంగ్లండ్
టెస్ట్‌ల్లో వరుస విజయాలతో అదరగొడుతున్న ఇంగ్లండ్ క్రికెట్ టీమ్ పరిమిత ఓవర్ల ఫార్మాట్లో మాత్రం దారుణంగా విఫలమవుతుంది. జోస్ బట్లర్ కెప్టెన్సీ చేపట్టాక ఆ జట్టు పరిస్థితి మరింత దిగజారింది. ఇటీవల టీమిండియా చేతిలో వన్డే, టీ20 సిరీస్ కోల్పోయిన ఇంగ్లీష్ జట్లు.. తాజాగా దక్షిణాఫ్రికా చేతిలో టీ20 సిరీస్‌లో కూడా ఓటమిపాలైంది. 3 మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో తొలి టీ20 గెలిచిన బట్లర్ టీమ్.. ఆతర్వాత వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓటమిపాలై 2-1తేడాతో సిరీస్‌ను చేజార్చుకుంది. ఆదివారం (జులై 31) జరిగిన నిర్ణయాత్మక మూడో టీ20ల్లో సఫారీ జట్టు 90 పరుగుల భారీ తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తు చేసింది. సఫారీ స్పిన్నర్ తబ్రేజ్ షంషి (5/24) తన స్పిన్ మాయాజాలంతో ఇంగ్లండ్ ఆటగాళ్లను ఉక్కిరిబిక్కిరి చేశాడు. టాస్ ఓడినప్పటికీ ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన సఫారీ టీమ్.. నిర్ణీత ఓవర్లలో 191 పరుగుల భారీ స్కోర్ చేసింది. రీజా హెండ్రిక్స్ (50 బంతుల్లో 70; 9 ఫోర్లు), ఎయిడెన్ మార్క్రమ్ (36 బంతుల్లో 51 నాటౌట్; 5 ఫోర్లు) అర్ధ సెంచరీలతో రాణించగా.. రొస్సో (18 బంతుల్లో 31; 6 ఫోర్లు), కెప్టెన్ మిల్లర్ (9 బంతుల్లో 22; 3 ఫోర్లు, సిక్స్) మెరుపు ఇన్నింగ్స్ ఆడి జట్టు భారీ స్కోర్ సాధించడంలో కీలకపాత్ర పోషించారు. ఇంగ్లండ్ బౌలర్లలో డేవిడ్ విల్లే (3/25) పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు వికెట్లు పడగొట్టాడు. అనంతరం ఛేదనలో ఇంగ్లండ్ జట్టుకు షంషి చుక్కలు చూపించాడు. ఫలితంగా ఆ జట్టు 16.4 ఓవర్లలో 101 పరుగులకే చాపచుట్టేసింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో జేసన్ రాయ్ (17), జోస్ బట్లర్ (14), జానీ బెయిర్‌స్టో (27), క్రిస్ జోర్డాన్ (14) మాత్రమే రెండంకెల స్కోర్ చేయగలిగారు. ఆ జట్టులో అరివీర భయంకర హిట్టర్లు ఉన్నా షంషి మాయాజాలం ముందు అంతా తేలిపోయారు. షంషికి మరో ఎండ్‌లో కేశవ్ మహారాజ్ (2/21), ఫెలుక్వాయో (1/23), మార్క్రమ్ (1/5) సహకరించడంతో సఫారీ టీమ్ వారి స్వదేశంలోనే ఇంగ్లండ్‌ను మట్టికరిపించింది. కాగా, ఈ సిరీస్‌కు ముందు జరిగిన 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్ 1-1తో డ్రా ముగిసిన విషయం తెలిసిందే. వర్షం కారణంగా నిర్ణయాత్మక మూడో మ్యాచ్ రద్దు కావడంతో ఫలితం ఎటు తేలకుండా నిలిచిపోయింది. ఈ పర్యటనలో తదుపరి 3 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ప్రారంభంకానుంది. ఆగస్ట్ 17, 25, సెప్టెంబర్ 8 తేదీల్లో మూడు టెస్ట్‌లు ప్రారంభమవుతాయి. చదవండి: ఐదేసిన మొసద్దెక్.. జింబాబ్వేపై ప్రతీకారం తీర్చుకున్న బంగ్లా -
ఐపీఎల్లో అన్‌సోల్డ్.. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానం.. ఆ వెనుకే 7.75 కోట్ల ఆటగాడు!
ICC T20 Rankings: ఆస్ట్రేలియా పేసర్ జోష్ హాజిల్‌వుడ్ ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అదరగొట్టాడు. టీ20 ఫార్మాట్ బౌలర్ల విభాగంలో నాలుగు స్థానాలు ఎగబాకాడు. 783 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు. దక్షిణాఫ్రికా బౌలర్ తబ్రేజ్ షంసీ (784 పాయింట్లు) అగ్రస్థానానికి చేరుకున్నాడు. అతడి కంటే ఒకే ఒక్క పాయింట్ వెనుకబడి ఉన్న హాజిల్‌వుడ్ ద్వితీయ స్థానానికి పరిమితమయ్యాడు. కాగా శ్రీలంకతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో అద్భుతంగా రాణిస్తున్న అతడు ఈ మేరకు టాప్-2లో చోటు దక్కించుకోవడం విశేషం. ఇక లంకతో సిరీస్‌లో హాజిల్‌వుడ్ వరుసగా 4, 3(ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్), ఒక వికెట్ పడగొట్టాడు. ఇప్పటికే 3-0 తేడాతో ఈ సిరీస్‌ను ఆసీస్ కైవసం చేసుకుంది. కాగా శ్రీలంక ఆటగాడు వనిందు హసరంగ, ఆదిల్ రషీద్(ఇంగ్లండ్), ఆడం జంపా(ఆస్ట్రేలియా), రషీద్ ఖాన్(అఫ్గనిస్తాన్), ముజీబ్ ఉర్ రహమాన్(అఫ్గనిస్తాన్), అన్రిచ్ నోర్జే(దక్షిణాఫ్రికా), షాబాద్ ఖాన్(పాకిస్తాన్), టిమ్ సౌథీ(న్యూజిలాండ్) టాప్-10లో చోటు దక్కించుకున్నారు. ఇదిలా ఉండగా.. ఐపీఎల్ మెగా వేలం-2022లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 7.75 కోట్లు వెచ్చించి హాజిల్‌వుడ్‌ను సొంతం చేసుకుంది. మరోవైపు ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో మొదటి స్థానంలో ఉన్న తబ్రేజ్ అమ్ముడుపోకుండా మిగిలిపోయిన సంగతి తెలిసిందే. 👑 New number one T20I bowler 🚀 Rohan Mustafa launches into the top-10 ⏫ Josh Hazlewood climbs four spots after an incredible performance against Sri Lanka Some big movements in the latest @MRFWorldwide ICC Men's Player Rankings for T20Is. Details 👉 https://t.co/YrLa53Ls5E pic.twitter.com/otGbDw3B0r — ICC (@ICC) February 16, 2022 -
పంత్‌పై సౌతాఫ్రికా స్పిన్నర్ ప్రశంసల వర్షం
Tabraiz Shamsi Praise Rishabh Pant Batting.. టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్‌పై సౌతాఫ్రికా స్పిన్నర్ తబ్రెయిజ్ షంసీ ప్రశంసల వర్షం కురిపించాడు. సౌతాఫ్రికాతో రెండో వన్డేలో పంత్ బ్యాటింగ్‌లో మెరిసిన సంగతి తెలిసిందే. 71 బంతుల్లో 85 పరుగులు చేసిన పంత్ ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు.. 2 సిక్సర్లు ఉన్నాయి. పంత్ బ్యాటింగ్‌లో ఎక్కడా నిర్లక్ష్యం కనిపించలేదు. ఆడినంతసేపు దూకుడు కనబరిచిన పంత్.. సౌతాఫ్రికా బౌలర్లకు ఏ మాత్రం అవకాశమివ్వకుండా పరుగులు రాబట్టాడు. ఇదే అంశం సౌతాఫ్రికా బౌలర్ షంసీని బాగా ఆకట్టుకుంది. అందుకే పంత్ తన బౌలింగ్‌లో ఔటై వెళ్లిపోతున్నప్పుడు.. షంసీ తన చేతులతో వెనుక నుంచి పంత్ భుజాన్ని తడుతూ.. బాగా ఆడావన్నట్లుగా సిగ్నల్ ఇచ్చాడు. తాజాగా షంసీ ఆ ఫోటోను షేర్ చేస్తూ.. ;''బాగా కష్టపడ్డాడు.. బాగా ఆడాడు.. ఒక్కసారి గీత దాటలేదు.. '' అంటూ తనదైన శైలిలో క్యాప్షన్ జత చేశాడు. చదవండి: Rishabh Pant: 'సఫారీ గడ్డపై ధోనికి సాధ్యం కాలేదు.. పంత్ సాధించాడు' ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. రెండో వన్డేలో దక్షిణాఫ్రికా 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఫలితంగా మూడు వన్డేల సిరీస్‌ను 2–0తో గెలుచుకుంది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 287 పరుగులు చేసింది. రిషభ్ పంత్ (71 బంతుల్లో 85; 10 ఫోర్లు, 2 సిక్స్‌లు), రాహుల్ (79 బంతుల్లో 55; 4 ఫోర్లు) అర్ధ సెంచరీలు చేశారు. అనంతరం దక్షిణాఫ్రికా 48.1 ఓవర్లలో 3 వికెట్లకు 288 పరుగులు చేసి గెలిచింది. జేన్‌మన్ మలాన్ (108 బంతుల్లో 91; 8 ఫోర్లు, 1 సిక్స్), ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ డి కాక్ (66 బంతుల్లో 78; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు) తొలి వికెట్‌కు 132 పరుగులు జోడించారు. చివరి మ్యాచ్ ఆదివారం కేప్‌టౌన్‌లో జరుగుతుంది. చదవండి: Virat Kohli: డ్రెస్సింగ్‌రూమ్‌లో కోహ్లి చిందులు.. వీడియో వైరల్ -
T20 WC 2021: మూడేళ్ల రికార్డు బద్దలు కొట్టిన నెంబర్‌వన్ బౌలర్
Tabriaz Shamsi Most Wickets In Calender Year.. టి20 క్రికెట్ చరిత్రలో దక్షిణాఫ్రికా స్పిన్నర్ తబ్రెయిజ్ షంసీ అరుదైన ఘనత సాధించాడు. టి20ల్లో ఒక క్యాలెండర్ ఇయర్లో ఎక్కువ వికెట్లు సాధించిన ఆటగాడిగా షంసీ రికార్డు సాధించాడు. టి20 ప్రపంచకప్‌లో భాగంగా శ్రీలంకతో మ్యాచ్‌లో షంసీ 17 పరుగులిచ్చి 3 వికెట్లు తీసి ఈ రికార్డును అందుకున్నాడు.2021 ఏడాదిలో టి20ల్లో షంసీ 32 వికెట్లు పడగొట్టి మూడేళ్ల రికార్డును బద్దలు కొట్టాడు. ఓవరాల్‌గా షంసీ సౌతాఫ్రికా తరపున 45 టి20ల్లో 53 వికెట్లు.. 2 టెస్టుల్లో 6 వికెట్లు.. 30 వన్డేల్లో 44 వికెట్లు పడగొట్టాడు. చదవండి: SA Vs SL: నోర్జ్టే సూపర్ డెలివరీ.. పెరీరాకు ఫ్యూజ్‌లు ఎగిరిపోయుంటాయి 2018 క్యాలండర్ ఇయర్లో ఆండ్రూ టై 31 వికెట్లు సాధించాడు. ఇక ఐసీసీ టి20 బౌలర్ల ర్యాంకింగ్స్‌లో షంసీ ప్రస్తుతం నెంబర్‌వన్ బౌలర్‌గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కాగా ఈ ఏడాదిలోనే మరో ఇద్దరు క్రికెటర్లు కూడా టి20ల్లో ఒకే ఏడాదిలో అత్యధిక వికెట్లు సాధించిన జాబితాలో చోటు సంపాధించారు. వారే ఉగాండాకు చెందిన దినేష్ నకర్ణి(31 వికెట్లు), వసీమ్ అబ్బాస్(29 వికెట్లు) ఉన్నారు. చదవండి: SA Vs SL: డికాక్ మోకాళ్లపై నిల్చున్నాడు.. ఇప్పుడైనా వదిలేయండి -
IPL 2021: టీ20 వరల్డ్‌కప్ బాగా ఆడు.. కానీ గెలవకూడదు.. ఓకేనా!
RR message To Proteas Spinner Tabraiz Shamsi Goes Viral: ఐపీఎల్-2021 లీగ్ స్టేజ్ ముగిసిన నేపథ్యంలో రాజస్తాన్ రాయల్స్ జట్టుకు చెందిన విదేశీ ఆటగాళ్లు క్యాంపును వీడుతున్నారు. ఈ సందర్భంగా ఆర్ఆర్ ఫ్రాంఛైజీ వారికి ఆత్మీయ వీడ్కోలు పలికింది. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. తబ్రేజ్ షంసీ(దక్షిణాఫ్రికా), డేవిడ్ మిల్లర్(దక్షిణాఫ్రికా), ముస్తాఫిజుర్ రహ్మమాన్(బంగ్లాదేశ్) తదితరులను ఇందులో చూడవచ్చు. ఇక వీడ్కోలు పలికే సందర్భంగా.. ఆర్ఆర్ అధికారి ఒకరు షంసీతో సంభాషించిన తీరు నెటిజన్లను ఆకర్షిస్తోంది. ఐపీఎల్ ముగిసిన రెండు రోజుల వ్యవధిలో టీ20 వరల్డ్‌కప్ టోర్నీ ఆరంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సదరు అధికారి.. షంసీని ఉద్దేశించి.. ‘‘వరల్డ్‌కప్ బాగా ఆడు.. షంసీ.. కానీ గెలవకూడదు.. ఓకేనా? ఇండియా కప్ గెలుస్తుంది’’ అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. ఇందుకు స్పందించిన షంసీ.. ‘‘ఛాన్సే లేదు’’ అంటూ బదులిచ్చాడు. ఇక గతంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిథ్యం వహించిన లెఫ్టార్మ్ స్పిన్నర్ తబ్రేజ్ షంసీ.. ఐపీఎల్-2021 రెండో అంచెలో భాగంగా... ఆండ్రూ టై స్థానంలో రాజస్తాన్ జట్టులోకి వచ్చాడు. ఈ సీజన్లో ఒకే ఒక్క మ్యాచ్(ఢిల్లీ క్యాపిటల్స్‌తో) ఆడిన ఈ ప్రొటీస్ బౌలర్ ఖాతా తెరవలేకపోయాడు. ఈ సీజన్లో 14 మ్యాచ్‌లలో కేవలం ఐదింట గెలిచిన రాజస్తాన్ పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంతో సరిపెట్టుకుంది. ఇదిలా ఉండగా.. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో బౌలర్ల జాబితాలో 775 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్న షంసీ.. యూఏఈ, ఒమన్ వేదికగా జరుగనున్న పొట్టి ఫార్మాట్ ప్రపంచకప్ ఆడబోయే దక్షిణాఫ్రికా జట్టులో చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే. దక్షిణాఫ్రికా టీ20 జట్టు: తెంబ బవుమా (కెప్టెన్), డికాక్ (వికెట్ కీపర్), పార్చూన్, హెండ్రిక్స్, హెన్రిచ్ క్లాసెన్, కేశవ్ మహరాజ్, మర్క్రమ్, డేవిడ్ మిల్లర్, వియాన్ మల్డర్, లుంగి ఎంగిడి, ఆన్రిచ్ నోర్తేజ్, ప్రొటోరియస్, కగిసో రబాడ, షంషీ, దుస్సేన్. రిజర్వ్ ప్లేయర్లు: జార్జ్ లిండే, ఫెహ్లువాయో, విలియమ్స్. చదవండి: MI Vs SRH: ఐపీఎల్లో సరికొత్త రికార్డు సృష్టించిన మహ్మద్ నబీ టీ20 వరల్డ్‌కప్‌కి ఐర్లాండ్ జట్టు ప్రకటన.. View this post on Instagram A post shared by Rajasthan Royals (@rajasthanroyals) -
రెండో వన్డేలో దక్షిణాఫ్రికా గెలుపు
కొలంబో: వర్షం అంతరాయం కలిగించిన రెండో వన్డేలో దక్షిణాఫ్రికా డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో 67 పరుగుల తేడాతో శ్రీలంకపై నెగ్గి మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 1–1తో సమం చేసింది. తొలుత సఫారీ జట్టు 47 ఓవర్లలో 6 వికెట్లకు 283 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ జేన్‌మన్ మలాన్ (135 బంతుల్లో 121; 9 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీ చేశాడు. హెండ్రిక్స్ (51; 5 ఫోర్లు) రాణించాడు. వర్షం కారణంగా శ్రీలంక లక్ష్యాన్ని 41 ఓవర్లకు 265 పరుగులుగా కుదించారు. ఛేదనలో లంక 36.4 ఓవర్లలో 197 పరుగులకు ఆలౌటైంది. చరిత్ అసలంక (77; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించాడు. షమ్సీ 5 వికెట్ల శ్రీలంకను కట్టడి చేశాడు. చదవండి: BAN Vs NZ: వార్నీ ఇదేం డెలివరీ.. నోరెళ్లబెట్టిన బ్యాట్స్‌మన్ -
రాజస్థాన్ రాయల్స్‌లోకి టీ 20 నెం.1 బౌలర్..
జైపూర్: వచ్చేనెలలో జరిగే ఐపీఎల్ 2021 సెకెండ్ ఫేజ్ కు రాజస్థాన్ రాయల్స్ స్టార్ ఆటగాళ్లు జోస్ బట్లర్, జోఫ్రా ఆర్చర్, బెన్ స్టోక్స్, ఆండ్రూ టై దూరమైన విషయం తెలిసిందే. అయితే ఆస్ట్రేలియా క్రికెటర్ ఆండ్రూ టై స్థానంలో టీ 20 నెం.1 బౌలర్, సౌతాఫ్రికా సెన్సేషనల్ స్పిన్నర్ తబ్రాజ్ షమ్సీని రాజస్థాన్ రాయల్స్ తీసుకుంది. యూఏఈలో జరిగే ఐపీఎల్ 2021 సీజన్ మిగిలిన మ్యాచ్‌లకు తబ్రాజ్ షమ్సీ తో ఒప్పందం కుదర్చుకున్నట్లు రాజస్థాన్ రాయల్స్ బుధవారం ప్రకటించింది. 2017 లో ఇంగ్లాండ్‌తో జరిగిన ద్వైపాక్షిక టీ 20 సిరీస్‌లో దక్షిణాఫ్రికా తరఫున తబ్రాజ్ షమ్సీ అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. షమ్సీ 39 టీ20 మ్యాచుల్లో 45 వికెట్లు పడగొట్టి ఐసీసీ ర్యాంకింగ్స్‌లో నెం.1 బౌలర్‌గా ఎదిగాడు. 2016 సీజన్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరుపున ఆడిన తబ్రాజ్ షమ్సీ కేవలం 3 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. కాగా ఇప్పటికే వ్యక్తిగత కారణాలతో ఐపీఎల్‌కి దూరమైన జోస్ బట్లర్ స్దానంలో న్యూజిలాండ్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ గ్లెన్ ఫిలిప్స్‌ను రాజస్థాన్ తీసుకుంది. చదవండి: హార్ధిక్ పాండ్యా రిస్ట్ వాచ్ ధరెంతో తెలిస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే.. 🪄 Magic. Shamsi. Pink. 💗 The world's No.1 T20I bowler will represent the Royals in UAE. 🇦🇪#IPL2021 | #HallaBol | #RoyalsFamily | @shamsi90 pic.twitter.com/TDGIaW9gNJ — Rajasthan Royals (@rajasthanroyals) August 25, 2021 -
షమ్సీ బౌలింగ్ మెరుపులు.. దక్షిణాఫ్రికా ఘనవిజయం
డబ్లిన్: దక్షిణాఫ్రికా బౌలర్ తబ్రైజ్ షమ్సీ మెరుపు బౌలింగ్ ప్రదర్శనతో ఆకట్టుకోవడంతో ఐర్లాండ్‌పై ఘన విజయాన్ని నమోదు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన సఫారీ జట్టు 20 ఓవర్లలో 7 వికెట్లకు 165 పరుగులు చేసింది. మార్క్రమ్ (39; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మిల్లర్ 28, వాండర్డుసెన్ 25 పరుగులు చేశాడు. ఐర్లాండ్ బౌలింగ్‌లో మార్క్ అధర్ 3, సిమీ సింగ్, జోషుహా లిటిల్ చెరో రెండు వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఐర్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. తబ్రైజ్ షమ్సీ (4/27) ప్రత్యర్థిని దెబ్బతీశాడు. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ప్రొటీస్ జట్టు 1-0 తేడాతో ఆధిక్యంలోకి వెళ్లింది. ఇక ఇరు జట్ల మధ్య రెండో టీ20 జూలై 22న జరగనుంది. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1731380308.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
'డబ్బు కోసం లీగ్‌లు ఆడం.. నా జీవితాన్ని మార్చేసింది'
జోహన్నెస్‌బర్గ్ : ఐపీఎల్ లాంటి లీగ్‌ల ద్వారా నైపుణ్యం ఉన్న ఆటగాళ్లు ఎందరో పరిచయమయ్యారు. రవీంద్ర జడేజా, అజింక్య రహానే లాంటి ఆటగాళ్లు ఐపీఎల్లో ఆడిన తర్వాతే భారత జట్టులో చోటు సంపాదించారు. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికా బౌలర్ తబ్రెజ్ షంసీ టీ20 లీగ్‌లపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. '' ఏ దేశానికి చెందిన ఆటగాడైనా సరే.. డబ్బుల కోసం లీగ్ మాత్రం ఆడడు.. ఆటలో నైపుణ్యం చూపించే అవకాశం ఇలాంటి లీగ్‌ల ద్వారానే వస్తాయి. నా దృష్టిలో సీపీఎల్, ఐపీఎల్, ఇంగ్లీష్ దేశాల్లో ఆడే కౌంటీ క్రికెట్ ద్వారా ఆట మెరుగైందని అనుకుంటున్నా. నేను ఇవాళ దక్షిణాఫ్రికా జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నా అంటే దానికి ఇలాంటి లీగ్‌లే కారణం. ఇలాంటి లీగ్స్‌లో ఆడడం వల్ల వివిధ దేశాలకు చెందిన ఆటగాళ్లతో పరిచయాలు.. వారితో కలిసి ఆడడం వల్ల బౌలింగ్‌లో మరిన్ని మెళుకువలు సాధించే అవకాశాలుంటాయి. నేను ఐపీఎల్ ఆడిన మ్యాచ్‌లు తక్కువే కావొచ్చు.. కానీ కరేబియన్ లీగ్‌లో మాత్రం చాలా మ్యాచ్‌లు ఆడాను.. అది నా జీవితాన్నే మార్చేసింది.'' అని చెప్పుకొచ్చాడు. కాగా షంసీ 2016లో రైజింగ్ పుణే సూపర్‌జెయింట్స్ తరపున ఐపీఎల్లో అరంగేట్రం చేశాడు. ఇక దక్షిణాఫ్రికా తరపున 2 టెస్టుల్లో 6 వికెట్లు, 24 వన్డేల్లో 27 వికెట్లు, 32 టీ20ల్లో 31 వికెట్లు తీశాడు. ఐపీఎల్ 14వ సీజన్ రద్దు అనంతరం లీగ్‌లో పాల్గొన్న విదేశీ ఆటగాళ్లు ఎవరి సొంత దేశాలకు వారు చేరుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఇప్పటికే వెస్టిండీస్, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్ ఆటగాళ్లు వారి సొంత దేశానికి చేరుకోగా.. ఆస్ట్రేలియా ఆటగాళ్లు మాత్రం డైరెక్ట్‌గా దేశానికి వెళ్లే అవకాశం లేకపోవడంతో మాల్దీవ్స్‌కు వెళ్లి అక్కడినుంచి ఆసీస్‌కు వెళ్లనున్నారు. ఇక న్యూజిలాండ్‌కు చెందిన ఆటగాళ్లలో కొందరు స్వదేశానికి వెళ్లగా.. భారత్‌తో టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ ఆడాల్సి ఉన్న నేపథ్యంలో మరికొందరు ఆటగాళ్లు మాత్రం ఇంగ్లండ్‌కు చేరుకున్నారు. చదవండి: ఇలా జరుగుతుందని నాకు ముందే తెలుసు 'ప్రైవేట్ జెట్‌లో వెళ్లి అక్కడి వీధుల్లో శవాలను చూడండి' -
ఏంటి బాబూ.. ఇలా కూడా సెలబ్రేట్ చేసుకుంటారా?!
జొహన్నస్‌బర్గ్: అర్ధ సెంచరీ, సెంచరీ చేసినపుడు లేదా కెరీర్లో అరుదైన మైలురాయిని చేరుకున్నపుడు బ్యాట్స్‌మెన్, కీలకమైన వికెట్లు తీసినపుడు బౌలర్లు.. తమదైన శైలిలో ఆనందాన్ని వ్యక్తం చేయడం మనం చూస్తూనే ఉంటాం. టీమిండియా బ్యాట్స్‌మెన్ కేఎల్ రాహుల్‌కు, స్పెషల్ ఇన్నింగ్స్ తర్వాత చెవులు మూసుకుని సెలబ్రేట్ చేసుకోవడం అలవాటు. ఇక బౌలర్ల విషయానికొస్తే, షెల్డన్ కాట్రెల్ మార్చ్ సెల్యూట్ చేస్తూ సంబరాలు చేసుకుంటాడు. ఇలా ఒక్కో ఆటగాడు మైదానంలో ఒక్కో రకంగా ప్రవర్తిస్తూ అభిమానులను ఆకట్టుకుంటాడు. దక్షిణాఫ్రికా బౌలర్ తబ్రేజ్ షంసీ కూడా తాజాగా ఈ జాబితాలో చేరిపోయాడు. అయితే, నెటిజన్లు మాత్రం అతడు సెలబ్రేట్ చేసుకునే విధానం చూసి.. ‘‘ఏంటీ బాబూ.. ఇలా కూడా సెలబ్రేట్ చేసుకుంటారా? ఇంతకు ముందెన్నడు ఇలాంటిది మేం జూడలే.. ఏదైతేనేం నీ కంటూ ఓ స్టైల్ ఉంది కదా’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇంతకీ అతడేం ఏం చేశాడంటే.. పాకిస్తాన్ ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శనివారం నాటి మొదటి టీ20లో టాస్ గెలిచిన ప్రొటిస్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. పర్యాటక జట్టుకు 189 పరుగుల లక్ష్యం విధించింది. ఇక లక్ష్య ఛేదనలో భాగంగా, పాక్ ఆటగాళ్లు బ్యాటింగ్ చేస్తుండగా, షంసీ రెండు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. 10 ఓవర్లో ఫఖర్ జమాన్‌ను, 14 ఓవర్లో మహ్మద్ హఫీజ్‌ను పెవిలియన్‌కు పంపాడు. ఈ సందర్భంగా.. తన షూ తీసి, చెవి దగ్గర పెట్టుకుని, ఎవరికో ఫోన్ చేస్తున్నట్లుగా నటిస్తూ సంబరాలు చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కాగా షంసీ సెలబ్రేషన్ గురించి సహచర ఆటగాడు రసీ వన్ దేర్ దసెన్ మాట్లాడుతూ.. ‘‘షంసీ తన ఆనందాన్ని పంచుకునేందుకు ఇమ్మీ(ఇమ్రాన్ తాహిర్)కు ఫోన్ చేస్తాడు. తన ఆరాధ్య బౌలర్లలో ఇమ్మీ ఒకడు. వాళ్లిద్దరూ కలిసి ఆడారు. అందుకే వికెట్ తీసినప్పుడల్లా ఇమ్మీకి ఇలా ఫోన్ చేసి సంతోషం పంచుకుంటాడు’’అని వివరణ ఇచ్చాడు. ఇక ఈ మ్యాచ్‌లో పాక్ నాలుగు వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో నాలుగు ఓవర్లు వేసిన షంసీ, 29 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు కూల్చాడు. చదవండి: ఐపీఎల్ కాసుల వర్షం కురిపిస్తుంది.. కాబట్టి: పాక్ మాజీ పేసర్ Hafeez gone for 13 in his 100th T20I and Shamsi wrote another wicket on his shoe. This guy is alrwady pissing me off. Fitte mun Hafeez tere te 😠😠😠#PAKvSA pic.twitter.com/PW6uBybf7G — Daniyal Mirza (@Danitweets__) April 10, 2021 -
క్రికెట్ ఫీల్డ్‌లోనే మ్యాజిక్ చేశాడు!
పారీ(దక్షిణాఫ్రికా): భారత్‌తో ఇటీవల జరిగిన ఒక టీ20లో దక్షిణాఫ్రికా స్పిన్నర్ షమ్సీ విన్నూత్న రీతిలో సెలబ్రేట్ చేసుకున్నాడు. శిఖర్ ధావన్ వికెట్‌ను తీసిన తర్వాత షమీ తన కాలి షూను తీసి చెవి దగ్గర పెట్టుకుని మరీ సెలబ్రేట్ చేసుకున్నాడు. అది అప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచాడు షమ్సీ. మాన్షి టీ20 లీగ్‌లో భాగంగా పారీ రాక్స్ తరఫున ఆడుతున్న షమీ.. బుధవారం డర్బన్ హీట్‌తో జరిగిన మ్యాచ్‌లో సెలబ్రేషన్స్‌కు మ్యాజిక్ జోడించాడు. షమ్సీ బౌలింగ్‌లో డేవిడ్ మిల్లర్ క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. అదే సమయంలో ముందుగా చేతుల్లోకి ఒక క్లాత్ తీసుకున్న షమ్సీ.. దానిని స్టిక్‌గా మార్చాడు. ఇలా సెలబ్రేట్ చేసుకోవడం షమ్సీకి కొత్తేమీ కాదు. గతంలో కూడా ఇలానే చేశాడు. నవంబర్ నెలలో ఈ లీగ్‌లో జోజి స్టార్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సైతం షమ్సీ ఇదే తరహా మ్యాజిక్‌తో అభిమానుల్ని అలరించాడు. ప్రస్తుత మ్యాజిక్ వీడియో వైరల్‌గా మారింది. ఈ మ్యాచ్‌లో డర్బన్ హీట్ ఆరు వికెట్ల తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన పారీ టీమ్ 195 పరుగులు చేయగా, డర్బన్ హీట్ 18.5 ఓవర్లలోనే నాలుగు వికెట్లు కోల్పోయి 197 పరుగులు చేసింది. అలెక్స్ హేల్స్(97 నాటౌట్), డేవిడ్ మిల్లర్(40)లు డర్బన్ హీట్ విజయంలో కీలక పాత్ర పోషించారు. WICKET! A bit of magic from @shamsi90 🎩 #MSLT20 pic.twitter.com/IxMqRYF1Ma — Mzansi Super League 🔥 🇿🇦 🏏 (@MSL_T20) December 4, 2019