PC: RR Instagram
RR message To Proteas Spinner Tabraiz Shamsi Goes Viral: ఐపీఎల్-2021 లీగ్ స్టేజ్ ముగిసిన నేపథ్యంలో రాజస్తాన్ రాయల్స్ జట్టుకు చెందిన విదేశీ ఆటగాళ్లు క్యాంపును వీడుతున్నారు. ఈ సందర్భంగా ఆర్‌ఆర్ ఫ్రాంఛైజీ వారికి ఆత్మీయ వీడ్కోలు పలికింది. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. తబ్రేజ్ షంసీ(దక్షిణాఫ్రికా), డేవిడ్ మిల్లర్(దక్షిణాఫ్రికా), ముస్తాఫిజుర్ రహ్మమాన్(బంగ్లాదేశ్) తదితరులను ఇందులో చూడవచ్చు. ఇక వీడ్కోలు పలికే సందర్భంగా.. ఆర్‌ఆర్ అధికారి ఒకరు షంసీతో సంభాషించిన తీరు నెటిజన్లను ఆకర్షిస్తోంది.
ఐపీఎల్ ముగిసిన రెండు రోజుల వ్యవధిలో టీ20 వరల్డ్‌కప్ టోర్నీ ఆరంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సదరు అధికారి.. షంసీని ఉద్దేశించి.. ‘‘వరల్డ్‌కప్ బాగా ఆడు.. షంసీ.. కానీ గెలవకూడదు.. ఓకేనా? ఇండియా కప్ గెలుస్తుంది’’ అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. ఇందుకు స్పందించిన షంసీ.. ‘‘ఛాన్సే లేదు’’ అంటూ బదులిచ్చాడు.
ఇక గతంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిథ్యం వహించిన లెఫ్టార్మ్ స్పిన్నర్ తబ్రేజ్ షంసీ.. ఐపీఎల్-2021 రెండో అంచెలో భాగంగా... ఆండ్రూ టై స్థానంలో రాజస్తాన్ జట్టులోకి వచ్చాడు. ఈ సీజన్‌లో ఒకే ఒక్క మ్యాచ్(ఢిల్లీ క్యాపిటల్స్‌తో) ఆడిన ఈ ప్రొటీస్ బౌలర్ ఖాతా తెరవలేకపోయాడు. ఈ సీజన్‌లో 14 మ్యాచ్‌లలో కేవలం ఐదింట గెలిచిన రాజస్తాన్ పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంతో సరిపెట్టుకుంది. ఇదిలా ఉండగా.. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో బౌలర్ల జాబితాలో 775 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్న షంసీ.. యూఏఈ, ఒమన్ వేదికగా జరుగనున్న పొట్టి ఫార్మాట్ ప్రపంచకప్ ఆడబోయే దక్షిణాఫ్రికా జట్టులో చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే.
దక్షిణాఫ్రికా టీ20 జట్టు: తెంబ బవుమా (కెప్టెన్), డికాక్ (వికెట్ కీపర్), పార్చూన్, హెండ్రిక్స్, హెన్రిచ్ క్లాసెన్, కేశవ్ మహరాజ్, మర్‌క్రమ్, డేవిడ్ మిల్లర్, వియాన్ మల్డర్, లుంగి ఎంగిడి, ఆన్రిచ్ నోర్తేజ్, ప్రొటోరియస్, కగిసో రబాడ, షంషీ, దుస్సేన్.
రిజర్వ్ ప్లేయర్లు: జార్జ్ లిండే, ఫెహ్లువాయో, విలియమ్స్.
చదవండి: MI Vs SRH: ఐపీఎల్‌లో సరికొత్త రికార్డు సృష్టించిన మహ్మద్ నబీ
టీ20 వరల్డ్‌కప్‌కి ఐర్లాండ్ జట్టు ప్రకటన..
Comments
Please login to add a commentAdd a comment