షమ్సీ బౌలింగ్‌ మెరుపులు.. దక్షిణాఫ్రికా ఘనవిజయం | Shamsi Bowling Magic Clinch South Africa Victory Against Ireland | Sakshi
Sakshi News home page

IRE vs SA: షమ్సీ బౌలింగ్‌ మెరుపులు.. దక్షిణాఫ్రికా ఘనవిజయం

Published Tue, Jul 20 2021 9:34 AM | Last Updated on Tue, Jul 20 2021 10:04 AM

Shamsi Bowling Magic Clinch South Africa Victory Against Ireland - Sakshi

తబ్రైజ్‌ షమ్సీ 

డబ్లిన్‌: దక్షిణాఫ్రికా బౌలర్‌ తబ్రైజ్‌ షమ్సీ మెరుపు బౌలింగ్‌ ప్రదర్శనతో ఆకట్టుకోవడంతో ఐర్లాండ్‌పై ఘన విజయాన్ని నమోదు చేసింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన సఫారీ జట్టు 20 ఓవర్లలో 7 వికెట్లకు 165 పరుగులు చేసింది. మార్క్‌రమ్‌ (39; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. మిల్లర్‌ 28, వాండర్‌డుసెన్‌ 25 పరుగులు చేశాడు. ఐర్లాండ్‌ బౌలింగ్‌లో మార్క్‌ అధర్‌ 3, సిమీ సింగ్‌, జోషుహా లిటిల్‌ చెరో రెండు వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఐర్లాండ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. తబ్రైజ్‌ షమ్సీ (4/27) ప్రత్యర్థిని దెబ్బతీశాడు. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ప్రొటీస్‌ జట్టు 1-0 తేడాతో ఆధిక్యంలోకి వెళ్లింది. ఇక ఇరు జట్ల మధ్య రెండో టీ20 జూలై 22న జరగనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement