పాకిస్తాన్ సూపర్ లీగ్ 2024లో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. కరాచీ కింగ్స్‌కు చెందిన 13 మంది క్రికెటర్లు కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురయ్యారని సమాచారం. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. పరిస్థితి చేయి దాటేలా ఉండటంతో సదరు ఆటగాడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తుంది.
క్వెట్టా గ్లాడియేటర్స్‌తో ఇవాళ (ఫిబ్రవరి 29) జరుగుతున్న మ్యాచ్‌కు ముందు ఈ పరిస్థితి తలెత్తినట్లు తెలుస్తుంది. ఆసుపత్రికి తరలించిన క్రికెటర్ సౌతాఫ్రికాకు చెందిన తబ్రేజ్ షంషి అని సమాచారం. నిన్న ఆస్ట్రేలియాకు చెందిన డేనియల్ సామ్స్, సౌతాఫ్రికాకు చెందిన లూయిస్ డు ప్లూయ్ ఉదర సంబంధింత సమస్యల కారణంగా చాలా ఇబ్బంది పడినట్లు తెలుస్తుంది. కరాచీ కింగ్స్ హెడ్ కోచ్ ఫిల్ సిమన్స్ సైతం స్వల్ప అస్వస్థతకు గురైనట్లు సమాచారం.
ఇంతమంది ఆటగాళ్లు అస్వస్థతకు గురయ్యారని తెలుస్తున్నప్పటికీ.. కరాచీ కింగ్స్ యాజమాన్యం వాస్తవాలను బయటకు పొక్కకుండా జాగ్రత్తపడుతున్నట్లు పాక్ మీడియానే ప్రచారం చేస్తుంది. క్వెట్టాతో కొద్ది సేపటి క్రితం మొదలైన మ్యాచ్‌లో కరాచీ కింగ్స్.. పై పేర్కొన్న ఆటగాళ్లు కాకుండా వేరే ముగ్గురు ఫారెన్ ప్లేయర్లతో బరిలోకి దిగింది.
క్వెట్టాతో జరుగుతున్న మ్యాచ్‌లో కరాచీ కింగ్స్ తొలుత బ్యాటింగ్ చేస్తుంది. 16.1 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్ 134/6గా ఉంది. షాన్ మసూద్ (2), టిమ్ సీఫర్ట్ (21), జేమ్స్ విన్స్ (37), షోయబ్ మాలిక్ (12), మొహమ్మద్ నవాజ్ (28), పోలార్డ్ (13) ఔట్ కాగా.. ఇర్ఫాన్ ఖాన్ (15), హసన్ అలీ క్రీజ్‌లో ఉన్నారు. క్వెట్టా బౌలర్లలో అకీల్ హొసేన్, అబ్రార్ అహ్మద్, ఉస్మాన్ తారిక్ తలో 2 వికెట్లు పడగొట్టారు.
Comments
Please login to add a commentAdd a comment