Daniel Sams
-
పాకిస్తాన్ లీగ్‌లో ఫుడ్ పాయిజన్ కలకలం.. 13 మందికి అస్వస్థత, ఒకరికి సీరియస్
పాకిస్తాన్ సూపర్ లీగ్ 2024లో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. కరాచీ కింగ్స్‌కు చెందిన 13 మంది క్రికెటర్లు కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురయ్యారని సమాచారం. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. పరిస్థితి చేయి దాటేలా ఉండటంతో సదరు ఆటగాడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తుంది. క్వెట్టా గ్లాడియేటర్స్‌తో ఇవాళ (ఫిబ్రవరి 29) జరుగుతున్న మ్యాచ్‌కు ముందు ఈ పరిస్థితి తలెత్తినట్లు తెలుస్తుంది. ఆసుపత్రికి తరలించిన క్రికెటర్ సౌతాఫ్రికాకు చెందిన తబ్రేజ్ షంషి అని సమాచారం. నిన్న ఆస్ట్రేలియాకు చెందిన డేనియల్ సామ్స్, సౌతాఫ్రికాకు చెందిన లూయిస్ డు ప్లూయ్ ఉదర సంబంధింత సమస్యల కారణంగా చాలా ఇబ్బంది పడినట్లు తెలుస్తుంది. కరాచీ కింగ్స్ హెడ్ కోచ్ ఫిల్ సిమన్స్ సైతం స్వల్ప అస్వస్థతకు గురైనట్లు సమాచారం. ఇంతమంది ఆటగాళ్లు అస్వస్థతకు గురయ్యారని తెలుస్తున్నప్పటికీ.. కరాచీ కింగ్స్ యాజమాన్యం వాస్తవాలను బయటకు పొక్కకుండా జాగ్రత్తపడుతున్నట్లు పాక్ మీడియానే ప్రచారం చేస్తుంది. క్వెట్టాతో కొద్ది సేపటి క్రితం మొదలైన మ్యాచ్‌లో కరాచీ కింగ్స్.. పై పేర్కొన్న ఆటగాళ్లు కాకుండా వేరే ముగ్గురు ఫారెన్ ప్లేయర్లతో బరిలోకి దిగింది. క్వెట్టాతో జరుగుతున్న మ్యాచ్‌లో కరాచీ కింగ్స్ తొలుత బ్యాటింగ్ చేస్తుంది. 16.1 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్ 134/6గా ఉంది. షాన్ మసూద్ (2), టిమ్ సీఫర్ట్ (21), జేమ్స్ విన్స్ (37), షోయబ్ మాలిక్ (12), మొహమ్మద్ నవాజ్ (28), పోలార్డ్ (13) ఔట్ కాగా.. ఇర్ఫాన్ ఖాన్ (15), హసన్ అలీ క్రీజ్‌లో ఉన్నారు. క్వెట్టా బౌలర్లలో అకీల్ హొసేన్, అబ్రార్ అహ్మద్, ఉస్మాన్ తారిక్ తలో 2 వికెట్లు పడగొట్టారు. -
పది మంది స్కోర్లను ఒక్కడే కొట్టేశాడు.. విధ్వంసం సృష్టించిన ఇంగ్లండ్ బ్యాటర్
అబుదాబీ టీ10 లీగ్ 2023లో ఆసక్తికర గణాంకాలు నమోదయ్యాయి. టీమ్ అబుదాబీ, బంగ్లా టైగర్స్ మధ్య నిన్న (డిసెంబర్ 4) జరిగిన మ్యాచ్‌లో ఓ బ్యాటర్ ప్రత్యర్ధి జట్టులోని పది మంది స్కోర్ల కంటే ఎక్కువ పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ అబుదాబీ నిర్ణీత 10 ఓవర్లలో 65 పరుగులకు ఆలౌట్ కాగా.. బంగ్లా టైగర్స్ బ్యాటర్, ఇంగ్లండ్ యువ ఆటగాడు జోర్డన్ కాక్స్ ఒక్కడే అజేయమైన 56 పరుగులు (23 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సర్లు) చేసి ఒంటిచేత్తో తన జట్టును గెలిపించాడు. జోర్డన్ చెలరేగడంతో బంగ్లా టైగర్స్ 4.5 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. అబుదాబీ ఇన్నింగ్స్‌లో ఇద్దరు డకౌట్లు కాగా.. ఏడుగురు ఆటగాళ్లు సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. ఆ జట్టు కెప్టెన్ ప్రిటోరియస్ (15), 11వ నంబర్ ఆటగాడు రయీస్ (8 బంతుల్లో 20 నాటౌట్; 3 సిక్సర్లు) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. రయీస్ ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడకపోతే అబుదాబీ టీమ్ ఈ మాత్రం స్కోర్ కూడా చేయలేకపోయేది. టీమ్ అబుదాబీ చేసిన స్కోర్‌లో (65) జోర్డన్ కాక్స్ ఒక్కడే 90 శాతానికి పైగా పరుగులు (56 నాటౌట్) సాధించడం విశేషం. డేనియల్ సామ్స్ (2-0-11-3), గాబ్రియెల్ (2-1-2-2), హోవెల్ (2-0-9-2), డొమినిక్ డ్రేక్స్ (1-0-11-1) బంగ్లా టైగర్స్ పతనాన్ని శాశించారు. అబుదాబీ టీమ్‌లో కైల్ మేయర్స్ (6), అలెక్స్ హేల్స్ (2), టామ్ బాంటన్ (0) లాంటి విధ్వంసకర వీరులు ఉన్నా అతి తక్కువ స్కోర్ల్కే పరిమితమయ్యారు. -
రఫ్ఫాడించిన జో రూట్.. అయినా..!
హండ్రెడ్ లీగ్-2023లో భాగంగా ట్రెంట్ రాకెట్స్‌తో నిన్న (ఆగస్ట్ 12) జరిగిన మ్యాచ్‌లో లండన్ స్పిరిట్ 2 పరుగుల స్వల్ప తేడాతో గెలుపొందింది. జో రూట్ చివరి వరకు ప్రయత్నించినప్పటికీ రాకెట్స్‌ను గెలిపించలేకపోయాడు. చెలరేగిన లారెన్స్.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన లండన్ స్పిరిట్.. కెప్టెన్ డేనియల్ లారెన్స్ (49 బంతుల్లో 93; 10 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగడంతో నిర్ణీత 100 బంతుల్లో 4 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. లారెన్స్‌తో పాటు జాక్ క్రాలే (15 బంతుల్లో 30; 5 ఫోర్లు, సిక్స్), డారిల్ మిచెల్ (17 బంతుల్లో 21 నాటౌట్; ఫోర్), రవి బొపారా (13 బంతుల్లో 25 నాటౌట్; ఫోర్, 2 సిక్సర్లు) రాణించారు. రాకెట్స్ బౌలర్లలో సామ్ కుక్, ఐష్ సోధి తలో 2 వికెట్లు పడగొట్టారు. రూట్ పోరాటం వృధా.. 196 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రాకెట్స్.. నిర్ణీత బంతుల్లో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యానికి 3 పరుగుల దూరంలో నిలిచిపోయింది. విధ్వంసకర వీరులు రాకెట్స్ ఓపెనర్లు అలెక్స్ హేల్స్ (15), డేవిడ్ మలాన్ (1) స్వల్ప స్కోర్లకే ఔట్ కాగా.. రూట్ (35 బంతుల్లో 72 నాటౌట్; 10 ఫోర్లు, 2 సిక్సర్లు).. టామ్ కొహ్లెర్ (23 బంతుల్లో 33; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), కొలిన్ మున్రో (15 బంతుల్లో 24; 3 ఫోర్లు), డేనియల్ సామ్స్ (11 బంతుల్లో 32; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) సాయంతో రాకెట్స్‌ను గెలిపించేందుకు విఫలయత్నం చేశాడు. లండన్ బౌలర్లలో డేనియల్ వారెల్, లియామ్ డాసన్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. నాథన్ ఎల్లిస్ ఓ వికెట్ తీశాడు. -
చెలరేగిన డేనియల్ సామ్స్.. ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించిన సూపర్ కింగ్స్
మేజర్ లీగ్ క్రికెట్లో టెక్సాస్ సూపర్ కింగ్స్ జట్టు ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది. నిన్న (జులై 24) శాన్ఫ్రాన్సిస్కో యునికార్న్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 3 వికెట్ల తేడాతో గెలుపొందిన సూపర్ కింగ్స్.. పాయింట్ల పట్టికలో (6 పాయింట్లు) రెండో స్థానానికి ఎగబాకి, ప్లే ఆఫ్స్‌కు చేరిన రెండో జట్టుగా నిలిచింది. 4 మ్యాచ్‌ల్లో 3 విజయాలతో 6 పాయింట్లు సాధించిన సీయాటిల్ ఆర్కాస్ టేబుల్ టాపర్‌గా ప్లే ఆఫ్స్‌కు క్వాలిఫై కాగా.. 5 మ్యాచ్‌ల్లో 3 విజయాలు సాధించిన వాషింగ్టన్ ఫ్రీడం ప్లే ఆఫ్స్‌కు చేరిన మూడో జట్టుగా నిలిచింది. నాలుగో బెర్త్ కోసం ముంబై ఇండియన్స్ న్యూయార్క్ (4), శాన్ఫ్రాన్సిస్కో యునికార్న్స్ (4) పోటీపడుతుండగా.. లాస్ ఏంజెలెస్ నైట్ రైడర్స్ (2) లీగ్ నుంచి నిష్క్రమించింది. మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన యునికార్న్స్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. మాథ్యూ వేడ్ (49; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), చైతన్య బిష్ణోయ్ (35; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించగా.. స్టోయినిస్ (13), షాదాబ్ ఖాన్ (20), కోరె ఆండర్సన్ (14), కెప్టెన్ ఆరోన్ ఫించ్ (19) రెండంకెల స్కోర్లు చేశారు. సూపర్ కింగ్స్ బౌలర్లలో గెరాల్డ్ కొయెట్జీ 4 వికెట్లు పడగొట్టగా.. డేనియల్ సామ్స్, మిచెల్ సాంట్నర్ తలో 2 వికెట్లు దక్కించుకున్నారు. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఇరగదీసిన డేనియల్ సామ్స్.. తొలుత బంతితో రాణించిన సామ్స్ (2/47) ఆతర్వాత బ్యాట్‌తోనూ మెరిశాడు. 18 బంతుల్లో 2 ఫోర్లు, 4 భారీ సిక్సర్లతో 42 పరుగులు చేసిన సామ్స్ సూపర్‌కింగ్స్ విజయంలో ప్రధానపాత్ర పోషించాడు. 172 పరుగుల లక్ష్య ఛేదనలో సామ్స్‌తో పాటు సూపర్‌కింగ్స్ ఆటగాళ్లు డెవాన్ కాన్వే (30), మిలింద్ కుమార్ (52) కూడా రాణించారు. సామ్స్ సుడిగాలి ఇన్నింగ్స్ కారణంగా సూపర్ కింగ్స్ మరో 5 బంతులు మిగిలుండగానే 7 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరుకుంది. యునికార్న్స్ బౌలర్లలో హరీస్ రౌఫ్, షాదాబ్ ఖాన్ చెరో 2 వికెట్లు.. రోక్స్, ప్లంకెట్, స్టోయినిస్ తలో వికెట్ పడగొట్టారు. -
లక్నో ఆల్‌రౌండర్ సిక్సర్ల సునామీ.. తడిసి ముద్ద అయిన లార్డ్స్ మైదానం
టీ20 బ్లాస్ట్-2023లో లక్నో సూపర్ జెయింట్స్ (ఐపీఎల్) ఆల్‌రౌండర్, ఎస్సెక్స్ ఫాస్ట్ బౌలర్, ఆసీస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ డేనియల్ సామ్స్ విశ్వరూపం ప్రదర్శించాడు. నిన్న (జూన్ 18) మిడిల్సెక్స్తో జరిగిన మ్యాచ్‌లో సామ్స్ 24 బంతుల్లో 8 సిక్సర్లు, 2 బౌండరీల సాయంతో 67 పరుగులు చేశాడు. సామ్స్ సిక్సర్ల సునామీలో ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానం తడిసిముద్ద అయ్యింది. కేవలం 20 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న సామ్స్.. ఆ తర్వాత 3 బంతుల్లో వరుసగా 2 సిక్సర్లు, ఓ ఫోర్ కొట్టి ఔటయ్యాడు. సామ్స్‌కు జతగా డేనియల్ లారెన్స్ (30 బంతుల్లో 53; 5 ఫోర్లు, 3 సిక్సర్లు), మైఖేల్ పెప్పర్ (34 బంతుల్లో 64; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) కూడా విజృంభించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్సెక్స్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 237 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం మిడిల్సెక్స్ భారీ లక్ష్య ఛేదనకు దిగగా వర్షం అంతరాయం కలిగించింది. 12.3 ఓవర్ల తర్వాత మొదలైన వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో డక్‌వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం ఎస్సెక్స్ను విజేతగా ప్రకటించారు. ఆ సమయానికి మిడిల్సెక్స్ 2 వికెట్ల నష్టానికి 116 పరుగులు చేసింది. అయితే డక్‌వర్త్ లూయిస్ సమీకరణల ప్రకారం మిడిల్సెక్స్ లక్ష్యానికి ఇంకా 22 పరుగులు వెనుకపడి ఉండింది. దీంతో అంపైర్లు ఎస్సెక్స్ను విజేతగా ప్రకటించారు. మిడిల్సెక్స్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ స్టీఫెన్ ఎస్కినాజీ (28), ర్యాన్ హిగ్గిన్స్ (32) ఓ మోస్తరు పరుగులు చేయగా.. జో క్రాక్నెల్ (36 నాటౌట్), మ్యాక్స్ హోల్డన్ (6 నాటౌట్) క్రీజ్‌లో ఉన్నారు. బౌలింగ్‌లోనూ సత్తా చాటిన డేనియల్ సామ్స్ ఓ వికెట్ దక్కంచుకోగా.. డేనియల్ లారెన్స్ మరో వికెట్ పడగొట్టాడు. కాగా, 31 ఏళ్ల డేనియల్ సామ్స్ ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడినప్పుడు బాగా పాపులర్ అయ్యాడు. 2022 సీజన్లో అతను ఎంఐ తరఫున 11 మ్యాచ్‌లు ఆడి 13 వికెట్లు పడగొట్టాడు. 2023 వేలంలో సామ్స్‌ను లక్నో సూపర్ జెయింట్స్ 75 లక్షలకు కొనుగోలు చేసింది. గత సీజన్లో అతను లక్నో తరఫున ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. -
IPL 2022: ముచ్చటగా మూడు...
ముంబై: ఐపీఎల్లో ప్లే ఆఫ్స్ అవకాశాలు కోల్పోయిన తర్వాత మెరుగ్గా ఆడుతున్న ముంబై ఇండియన్స్ మరో విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. ‘సొంతగడ్డ’ వాంఖెడేలో జరిగిన పోరులో ఐదుసార్లు లీగ్ చాంపియన్ ముంబై ఐదు వికెట్ల తేడాతో డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌ను చిత్తు చేసింది. తాజా ఫలితంతో నాలుగుసార్లు విజేత చెన్నై కూడా అధికారికంగా ‘ప్లే ఆఫ్స్’కు దూరమైంది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన చెన్నై 16 ఓవర్లలో 97 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్ ఎమ్మెస్ ధోని (33 బంతుల్లో 36 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఒక్కడే కాస్త పట్టుదలగా నిలబడగా, మిగతావారంతా చేతులెత్తేశారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ డానియెల్ స్యామ్స్ (3/16) చెన్నైని దెబ్బ తీయగా... కార్తికేయ, మెరిడిత్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం ముంబై 14.5 ఓవర్లలో 5 వికెట్లకు 103 పరుగులు చేసింది. తిలక్ వర్మ (32 బంతుల్లో 34 నాటౌట్; 4 ఫోర్లు), టిమ్ డేవిడ్ (7 బంతుల్లో 16 నాటౌట్; 2 సిక్స్‌లు) ఫినిషింగ్ టచ్ ఇచ్చారు. టపటపా... తొలి ఓవర్లో కాన్వే (0), మొయిన్ అలీ (0) వికెట్లను కోల్పోయిన చెన్నై ఆ తర్వాత కోలుకోలేకపోయింది. రాబిన్ ఉతప్ప (1), రుతురాజ్ గైక్వాడ్ (7), అంబటి రాయుడు (10) కూడా వెనుదిరగడంతో పవర్‌ప్లే ముగిసేసరికి స్కోరు 32/5కు చేరింది. ఈ దశలో ధోని ఒక ఎండ్‌లో నిలబడి పరుగులు సాధించే ప్రయత్నం చేయగా... శివమ్ దూబే (10), బ్రేవో (12) కూడా విఫలమయ్యారు. అనంతరం ముంబై కూడా కాస్త తడబడింది. ఇషాన్ కిషన్ (6), రోహిత్ శర్మ (18), స్యామ్స్ (1), స్టబ్స్ (0) తక్కువ వ్యవధిలో అవుట్ కావడంతో ముంబై ఇండియన్స్ స్కోరు 33/4కు చేరింది. అయితే తిలక్ వర్మ, హృతిక్ షోకిన్ (18; 2 ఫోర్లు) ఐదో వికెట్‌కు 48 పరుగుల భాగస్వామ్యంతో జట్టును గెలుపుదిశగా నడిపించారు. కరెంట్ లేదు...డీఆర్ఎస్ లేదు ప్రపంచ క్రికెట్లో అత్యంత విలువైన ప్రతిష్టాత్మక టోర్నీ... లీగ్ చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్ల మధ్య దేశంలో అమిత ప్రాధాన్యత ఉన్న మైదానంలో జరుగుతున్న మ్యాచ్... కానీ మ్యాచ్‌కు ముందస్తు ఏర్పాట్లను బీసీసీఐ చేసుకోవడంలో విఫలమైంది. ముంబై నగరంలో కరెంట్ కోతతో వాంఖెడేలో కూడా అంధకారం ఏర్పడింది. ఫ్లడ్ లైట్లు సరిగా వెలగకపోవడంతో టాస్ కూడా ఆలస్యమైంది. అయితే ఆ తర్వాత కరెంట్ కోత అసలు ఆటనూ ఇబ్బంది పెట్టింది. విద్యుత్ సమస్య కారణంగా ‘హాక్ ఐ’ టెక్నాలజీని వాడే అవకాశం లేదంటూ చెన్నై ఇన్నింగ్స్‌లో తొలి పది బంతుల పాటు డీఆర్ఎస్ పని చేయలేదు. నాలుగో బంతికి కాన్వేను అంపైర్ ఎల్బీగా ప్రకటించగా, రివ్యూ చేసే అవకాశం లేకపోయింది. బంతి గమనాన్ని చూస్తే కచ్చితంగా అతను నాటౌట్‌గా తేలేవాడని అనిపించింది. రెండో ఓవర్ నాలుగో బంతికి కూడా ఉతప్ప దాదాపు ఇదే తరహాలో వెనుదిరిగాడు. అతను కూడా రివ్యూ గురించి ఆలోచించినా ఆ అవకాశం లేదని తేలడంతో విరమించుకున్నాడు. ఆ తర్వాతే మైదానంలో సాధారణ స్థితి నెలకొంది. ఐపీఎల్లో నేడు బెంగళూరు X పంజాబ్ కింగ్స్ వేదిక: ముంబై, రాత్రి గం. 7:30 నుంచి స్టార్ స్పోర్ట్స్–1లో ప్రత్యక్ష ప్రసారం. -
'కోల్‌కతా మ్యాచ్‌లో విలన్.. ఇప్పుడు హీరో.. శభాష్ సామ్స్'
ఐపీఎల్-2022లో భాగంగా శుక్రవారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 5 పరుగుల తేడాతో సంచలన విజయం సాధించింది. ఈ విజయంలో ముంబై బౌలర్ డానియల్ సామ్స్ కీలక పాత్ర పోషించాడు. గుజరాత్ విజయానికి 6 బంతుల్లో కేవలం 9 పరుగులు మాత్రమే కావాలి. అంతే కాకుండా ఆ జట్టు హిట్టర్లు డేవిడ్ వార్నర్, రాహుల్ తెవాటియా క్రీజులో ఉన్నారు. ఈ సమయంలో ముంబై సారథి రోహిత్ శర్మ.. డానియల్ సామ్స్ చేతికి బంతి అందించాడు. అయితే అఖరి ఓవర్లో సామ్స్ కేవలం మూడు పరుగులు మాత్రమే ఇచ్చి ముంబై ఇండియన్స్‌కు అద్భుతమైన విజయాన్ని అందించాడు. ఈ క్రమంలో డానియల్ సామ్స్‌పై అభిమానులు ట్విట్టర్ వేదికగా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కేకేఆర్‌తో మ్యాచ్‌లో విలన్‌గా మారిన సామ్స్ గుజరాత్‌పై హీరోగా మారడంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కాగా అంతకుముందు కోల్‌కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్‌లో, సామ్స్ ఒకే ఓవర్లో ఏకంగా 35 పరుగులు ఇచ్చి విమర్శలు పాలైయ్యాడు. దీంతో అతడు కొన్ని మ్యాచ్‌లకు బెంచ్‌కే పరిమితమ్యాడు. చదవండి: IPL 2022: నైట్‌షిప్టులు..ఏడాది పాటు ఒక్క పూట భోజనం; ఎవరీ కుమార్ కార్తికేయ? WHAT. A. WIN! 👏 👏 What a thriller of a game we have had at the Brabourne Stadium-CCI and it's the @ImRo45-led @mipaltan who have sealed a 5⃣-run victory over #GT. 👌 👌 Scorecard ▶️ https://t.co/2bqbwTHMRS #TATAIPL | #GTvMI pic.twitter.com/F3UwVD7g5z — IndianPremierLeague (@IPL) May 6, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4381453179.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
IPL 2022: అస్సలు ఊహించలేదు.. జీర్ణించుకోవడం కష్టమే.. కానీ!
‘Awaaz badhao yaar’ – Says Frustrated Rohit Sharma: ఐపీఎల్-2022లో ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్‌లలోనూ ముంబై ఇండియన్స్ ఓటమి పాలైంది. ముఖ్యంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో బుధవారం నాటి మ్యాచ్‌లో వెంకటేశ్ అయ్యర్ మినహా మిడిలార్డర్ విఫలం కావడంతో విజయం తమదే అన్న ధీమాతో ఉన్న ముంబై ఆశలపై ప్యాట్ కమిన్స్ నీళ్లు చల్లాడు. ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన అతడు 15 బంతుల్లోనే ఏకంగా 56 పరుగులు సాధించాడు. తద్వారా కేకేఆర్‌ను విజయతీరాలకు చేర్చాడు. ముంబై బౌలర్ డేనియల్ సామ్స్ బౌలింగ్‌ను చీల్చిచెండాడి ఒకే ఓవర్లో 35 పరుగులు పిండుకుని ముంబైకి చేదు అనుభవం మిగిల్చాడు. ఈ క్రమంలో ఓటమి అనంతరం ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ.. తమ ప్రణాళికలు మైదానంలో అమలు చేయడంలో విఫలమయ్యామని పేర్కొన్నాడు. అదే సమయంలో ప్యాట్ కమిన్స్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. ఈ మేరకు అతడు మాట్లాడుతూ.. ‘‘కమిన్స్ ఇంత బాగా బ్యాటింగ్ చేస్తాడని అస్సలు ఊహించలేదు. కేకేఆర్ విజయానికి సంబంధించిన క్రెడిట్ మొత్తం అతడికే చెందుతుంది. 15వ ఓవర్ వరకు గేమ్ మా చేతిలోనే ఉంది. కానీ కమిన్స్ అద్బుతం చేశాడు’’ అని కొనియాడాడు. ఇక ఈ ఓటమిని జీర్ణించుకోవడం కష్టమేనన్న రోహిత్ శర్మ.. తాము మున్ముందు చేయాల్సింది చాలా ఉందన్నాడు. ‘‘నిజానికి మాకు శుభారంభం లభించలేదు. బౌలింగ్‌లో కూడా ప్రణాళికలు పక్కాగా అమలు చేయలేకపోయాం’’ అని తెలిపాడు. ప్రతిసారి ఇలాంటి స్థానం(ఓడిపోయిన కెప్టెన్)లో ఉండాలనుకోవడం లేదంటూ విసుగుతో కూడిన చిరునవ్వుతో తన మనసులోని భావాలను బయటపెట్టాడు. కాగా అంతకుముందు మాట్లాడటానికి వచ్చే సమయంలో.. డ్యానీ మోరిసన్ ప్రశ్న వినపడకపోవడంతో.. చిరాకు పడిన రోహిత్ .. ‘‘కాస్త సౌండ్ పెంచండి’’ అంటూ విసుక్కున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చదవండి: KKR vs MI: డేనియల్ సామ్స్ చెత్త రికార్డు.. రోహిత్‌కు ఆ అవకాశం ఇస్తే కదా! Pat Cummins finishes things off in style! Also brings up the joint fastest half-century in #TATAIPL off 14 deliveries.#KKR win by 5 wickets with 24 balls to spare. Scorecard - https://t.co/22oFJJzGVN #KKRvMI #TATAIPL pic.twitter.com/r5ahBcIWgR — IndianPremierLeague (@IPL) April 6, 2022 #RohitSharma This pretty much explains the #MIvsKKR Results 😆🤣#IPL pic.twitter.com/zBIZhkLPoZ — Mohd Yawer (@Dashingboy3212) April 6, 2022 -
డేనియల్ సామ్స్ చెత్త రికార్డు.. రోహిత్‌కు ఆ అవకాశం ఇస్తే కదా!
Daniel Sams- Most expensive overs in IPL: 3 ఓవర్లు... 50 పరుగులు.. ఒక నోబాల్.. ఒక వికెట్.. ముంబై ఇండియన్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఆస్ట్రేలియా ఆటగాడు డేనియల్ సామ్స్ నమోదు చేసిన గణాంకాలు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన బుధవారం నాటి మ్యాచ్‌లో చెత్త ప్రదర్శన(ఎకానమీ 16.70)తో విమర్శల పాలయ్యాడు. ముఖ్యంగా 16వ ఓవర్లో ఏకంగా 35 పరుగులు సమర్పించుకున్నాడు. సామ్స్ బౌలింగ్‌లో కేకేఆర్ బౌలర్ ప్యాట్ కమిన్స్ చితక్కొట్టడంతో మ్యాచ్ ముంబై చేజారడంతో పాటు.. సామ్స్ పేరిట ఓ చెత్త రికార్డు నమోదైంది. ఐపీఎల్ చరిత్రలో ఒకే ఓవర్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్ల జాబితాలో సామ్స్ చేరిపోయాడు. అంతకుముందు పి. పరమేరశ్వరన్, హర్షల్ పటేల్, రవి బొపార, పర్విందర్ అవానాలు ఇలాంటి గణాంకాలు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో నెటిజన్లు డేనియల్ సామ్స్‌పై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ‘‘బుమ్రా, మిల్స్‌ను డెత్ ఓవర్లలో పంపించాలని రోహిత్ ప్లాన్ చేశాడు. కానీ డేనియల్ సామ్స్ కెప్టెన్‌కు ఆ అవకాశం ఇస్తే కదా! 16వ ఓవర్లోనే ప్రత్యర్థి జట్టుకు మ్యాచ్ అప్పగించేశాడు. బాగుంది’’ అంటూ రకారకాల మీమ్స్‌తో ట్రోల్ చేస్తున్నారు. ఇక మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ గెలిచిన కోల్‌కతా నైట్‌రైడర్స్ బౌలింగ్ ఎంచుకోగా.. బ్యాటింగ్‌కు దిగిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. ఈ క్రమంలో లక్ష్య ఛేదనలో భాగంగా ఓపెనర్ వెంకటేశ్ అయ్యర్(50) ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన ప్యాట్ కమిన్స్(56 నాటౌట్)తో ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. వీరిద్దరి అద్భుత ప్రదర్శనతో మరో నాలుగు ఓవర్లు మిగిలి ఉండగానే కేకేఆర్ విజయం ఖరారైంది. ఐపీఎల్లో ఒకే ఓవర్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్లు 37- పి. పరమేశ్వరన్- 2011- ఆర్సీబీతో మ్యాచ్‌లో 37- హర్షల్ పటేల్-2021- సీఎస్కేతో మ్యాచ్‌లో 35- డేనియల్ సామ్స్- 2022- కేకేఆర్‌తో మ్యాచ్‌లో 33- రవి బొపార-2010- కేకేఆర్‌తో మ్యాచ్‌లో 33- పర్విందర్ అవానా-2014- సీఎస్కేతో మ్యాచ్‌లో చదవండి: IPL 2022: కమిన్స్ కమాల్.. ముంబై ఢమాల్.. తిలక్ కొట్టిన సిక్సర్ మాత్రం హైలైట్! Rohit planning to hold Bumrah & Mills for death overs!! Meanwhile Daniel Sams in 16th Over!! pic.twitter.com/Q5foMY4KeA — RCB Katchi (@sudhanks) April 6, 2022 Cummins to Bumrah & Daniel Sams pic.twitter.com/iBOjpdGGqf — Vickyyy Ummineni🕊☮ (@PramodChowdar20) April 6, 2022 Daniel sams in dressing room #KKRvMI #KKR #cummins pic.twitter.com/bhEKjRLOD9 — Kuldeep Sharnagat (@Ksharnagat15) April 6, 2022 Daniel sams in dressing room #KKRvMI #KKR #cummins pic.twitter.com/bhEKjRLOD9 — Kuldeep Sharnagat (@Ksharnagat15) April 6, 2022