డేనియల్ సామ్స్(PC: IPL/ BCCI)
Daniel Sams- Most expensive overs in IPL: 3 ఓవర్లు... 50 పరుగులు.. ఒక నోబాల్.. ఒక వికెట్.. ముంబై ఇండియన్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఆస్ట్రేలియా ఆటగాడు డేనియల్ సామ్స్ నమోదు చేసిన గణాంకాలు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన బుధవారం నాటి మ్యాచ్‌లో చెత్త ప్రదర్శన(ఎకానమీ 16.70)తో విమర్శల పాలయ్యాడు. ముఖ్యంగా 16వ ఓవర్‌లో ఏకంగా 35 పరుగులు సమర్పించుకున్నాడు.
సామ్స్ బౌలింగ్‌లో కేకేఆర్ బౌలర్ ప్యాట్ కమిన్స్ చితక్కొట్టడంతో మ్యాచ్ ముంబై చేజారడంతో పాటు.. సామ్స్ పేరిట ఓ చెత్త రికార్డు నమోదైంది. ఐపీఎల్ చరిత్రలో ఒకే ఓవర్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్ల జాబితాలో సామ్స్ చేరిపోయాడు. అంతకుముందు పి. పరమేరశ్వరన్, హర్షల్ పటేల్, రవి బొపార, పర్విందర్ అవానాలు ఇలాంటి గణాంకాలు నమోదు చేశారు.
ఈ నేపథ్యంలో నెటిజన్లు డేనియల్ సామ్స్‌పై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ‘‘బుమ్రా, మిల్స్‌ను డెత్ ఓవర్లలో పంపించాలని రోహిత్ ప్లాన్ చేశాడు. కానీ డేనియల్ సామ్స్ కెప్టెన్‌కు ఆ అవకాశం ఇస్తే కదా! 16వ ఓవర్లోనే ప్రత్యర్థి జట్టుకు మ్యాచ్ అప్పగించేశాడు. బాగుంది’’ అంటూ రకారకాల మీమ్స్‌తో ట్రోల్ చేస్తున్నారు.
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ గెలిచిన కోల్‌కతా నైట్‌రైడర్స్ బౌలింగ్ ఎంచుకోగా.. బ్యాటింగ్‌కు దిగిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది.
ఈ క్రమంలో లక్ష్య ఛేదనలో భాగంగా ఓపెనర్ వెంకటేశ్ అయ్యర్(50) ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన ప్యాట్ కమిన్స్(56 నాటౌట్)తో ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. వీరిద్దరి అద్భుత ప్రదర్శనతో మరో నాలుగు ఓవర్లు మిగిలి ఉండగానే కేకేఆర్ విజయం ఖరారైంది.
ఐపీఎల్‌లో ఒకే ఓవర్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్లు
37- పి. పరమేశ్వరన్- 2011- ఆర్సీబీతో మ్యాచ్‌లో
37- హర్షల్ పటేల్-2021- సీఎస్‌కేతో మ్యాచ్‌లో
35- డేనియల్ సామ్స్- 2022- కేకేఆర్‌తో మ్యాచ్‌లో
33- రవి బొపార-2010- కేకేఆర్‌తో మ్యాచ్‌లో
33- పర్విందర్ అవానా-2014- సీఎస్‌కేతో మ్యాచ్‌లో
చదవండి: IPL 2022: కమిన్స్ కమాల్.. ముంబై ఢమాల్.. తిలక్ కొట్టిన సిక్సర్ మాత్రం హైలైట్!
Rohit planning to hold Bumrah & Mills for death overs!! Meanwhile Daniel Sams in 16th Over!! pic.twitter.com/Q5foMY4KeA
— RCB Katchi (@sudhanks) April 6, 2022
Cummins to Bumrah & Daniel Sams pic.twitter.com/iBOjpdGGqf
— Vickyyy Ummineni🕊☮ (@PramodChowdar20) April 6, 2022
Daniel sams in dressing room #KKRvMI #KKR #cummins pic.twitter.com/bhEKjRLOD9
— Kuldeep Sharnagat (@Ksharnagat15) April 6, 2022
Daniel sams in dressing room #KKRvMI #KKR #cummins pic.twitter.com/bhEKjRLOD9
— Kuldeep Sharnagat (@Ksharnagat15) April 6, 2022
Comments
Please login to add a commentAdd a comment