
డానియల్ సామ్స్(PC: IPL/bcci)
ఐపీఎల్-2022లో భాగంగా శుక్రవారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 5 పరుగుల తేడాతో సంచలన విజయం సాధించింది. ఈ విజయంలో ముంబై బౌలర్ డానియల్ సామ్స్ కీలక పాత్ర పోషించాడు. గుజరాత్ విజయానికి 6 బంతుల్లో కేవలం 9 పరుగులు మాత్రమే కావాలి. అంతే కాకుండా ఆ జట్టు హిట్టర్లు డేవిడ్ వార్నర్, రాహుల్ తెవాటియా క్రీజులో ఉన్నారు. ఈ సమయంలో ముంబై సారథి రోహిత్ శర్మ.. డానియల్ సామ్స్ చేతికి బంతి అందించాడు.
అయితే అఖరి ఓవర్‌లో సామ్స్ కేవలం మూడు పరుగులు మాత్రమే ఇచ్చి ముంబై ఇండియన్స్‌కు అద్భుతమైన విజయాన్ని అందించాడు. ఈ క్రమంలో డానియల్ సామ్స్‌పై అభిమానులు ట్విట్టర్ వేదికగా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కేకేఆర్‌తో మ్యాచ్‌లో విలన్‌గా మారిన సామ్స్ గుజరాత్‌పై హీరోగా మారడంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కాగా అంతకుముందు కోల్‌కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్‌లో, సామ్స్ ఒకే ఓవర్‌లో ఏకంగా 35 పరుగులు ఇచ్చి విమర్శలు పాలైయ్యాడు. దీంతో అతడు కొన్ని మ్యాచ్‌లకు బెంచ్‌కే పరిమితమ్యాడు.
చదవండి: IPL 2022: నైట్‌షిప్టులు..ఏడాది పాటు ఒక్క పూట భోజనం; ఎవరీ కుమార్ కార్తికేయ?
WHAT. A. WIN! 👏 👏
— IndianPremierLeague (@IPL) May 6, 2022
What a thriller of a game we have had at the Brabourne Stadium-CCI and it's the @ImRo45-led @mipaltan who have sealed a 5⃣-run victory over #GT. 👌 👌
Scorecard ▶️ https://t.co/2bqbwTHMRS #TATAIPL | #GTvMI pic.twitter.com/F3UwVD7g5z