
సాయి సుదర్శన్(షPC: IPL/BCCI)
ఐపీఎల్-2022లో భాగంగా శుక్రవారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ యువ ఆటగాడు సాయి సుదర్శన్‌ను దురదృష్టం వెంటాడింది. ఈ మ్యాచ్‌లో సాయి సుదర్శన్ అనూహ్యంగా హిట్ వికెట్‌గా వెనుదిరిగాడు. గుజరాత్ ఇన్నింగ్స్ 16 ఓవర్‌లో కీరన్ పొలార్డ్ వేసిన అఖరి బంతిని పుల్ షాట్ ఆడటానికి సుదర్శన్ ప్రయత్నించాడు. అయితే పొలార్డ్ వేసిన షార్ట్ పిచ్ బాల్‌ను సరిగ్గా అంచనా వేయలేకపోయిన సుదర్శన్ .. బ్యాలన్స్ కోల్పోయి తన బ్యాట్‌తో వికెట్లను కొట్టాడు.
దీంతో ఈ సీజన్‌లో హిట్ వికెట్‌గా వెనుదిరిగిన తొలి ఆటగాడిగా సాయి సుదర్శన్ చెత్త రికార్డు నెలకొల్పాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక చివర వరకు ఉత్కంఠ భరితంగా జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 5 పరుగులు తేడాతో విజయం సాధించింది. అఖరి ఓవర్‌లో 9 పరుగులు కావల్సిన నేపథ్యంలో డానియల్ సామ్స్ అద్భుతంగా బౌలింగ్ చేసి ముంబైకు విజయాన్ని అందించాడు.
స్కోర్లు
ముంబై ఇండియన్స్: 177/6
గుజరాత్ టైటాన్స్: 172/5
చదవండి: IPL 2022: 'వార్నర్‌ను సెంచరీ గురించి అడిగాను.. నన్ను హిట్టింగ్ చేయమన్నాడు'
— Diving Slip (@SlipDiving) May 6, 2022
Comments
Please login to add a commentAdd a comment