
పారీ(దక్షిణాఫ్రికా): భారత్‌తో ఇటీవల జరిగిన ఒక టీ20లో దక్షిణాఫ్రికా స్పిన్నర్ షమ్సీ విన్నూత్న రీతిలో సెలబ్రేట్ చేసుకున్నాడు. శిఖర్ ధావన్ వికెట్‌ను తీసిన తర్వాత షమీ తన కాలి షూను తీసి చెవి దగ్గర పెట్టుకుని మరీ సెలబ్రేట్ చేసుకున్నాడు. అది అప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచాడు షమ్సీ. మాన్షి టీ20 లీగ్‌లో భాగంగా పారీ రాక్స్ తరఫున ఆడుతున్న షమీ.. బుధవారం డర్బన్ హీట్‌తో జరిగిన మ్యాచ్‌లో సెలబ్రేషన్స్‌కు మ్యాజిక్ జోడించాడు.
షమ్సీ బౌలింగ్‌లో డేవిడ్ మిల్లర్ క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. అదే సమయంలో ముందుగా చేతుల్లోకి ఒక క్లాత్ తీసుకున్న షమ్సీ.. దానిని స్టిక్‌గా మార్చాడు. ఇలా సెలబ్రేట్ చేసుకోవడం షమ్సీకి కొత్తేమీ కాదు. గతంలో కూడా ఇలానే చేశాడు. నవంబర్ నెలలో ఈ లీగ్‌లో జోజి స్టార్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సైతం షమ్సీ ఇదే తరహా మ్యాజిక్‌తో అభిమానుల్ని అలరించాడు. ప్రస్తుత మ్యాజిక్ వీడియో వైరల్‌గా మారింది. ఈ మ్యాచ్‌లో డర్బన్ హీట్ ఆరు వికెట్ల తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన పారీ టీమ్ 195 పరుగులు చేయగా, డర్బన్ హీట్ 18.5 ఓవర్లలోనే నాలుగు వికెట్లు కోల్పోయి 197 పరుగులు చేసింది. అలెక్స్ హేల్స్(97 నాటౌట్), డేవిడ్ మిల్లర్(40)లు డర్బన్ హీట్ విజయంలో కీలక పాత్ర పోషించారు.
WICKET!
— Mzansi Super League 🔥 🇿🇦 🏏 (@MSL_T20) December 4, 2019
A bit of magic from @shamsi90 🎩
#MSLT20 pic.twitter.com/IxMqRYF1Ma
Comments
Please login to add a commentAdd a comment