టీ20 వరల్డ్‌కప్ సూపర్-8 పోరులో ఇవాళ (జూన్ 24) సౌతాఫ్రికా, వెస్టిండీస్ జట్లు తలపడుతున్నాయి. ఇవాళ ఉదయం ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. సౌతాఫ్రికా బౌలర్లు మూకుమ్మడిగా రాణించడంతో వెస్టిండీస్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 135 పరుగులు మాత్రమే చేయగలిగింది.
తబ్రేజ్ షంషి తన స్పిన్ మాయాజాలాన్ని ప్రదర్శించి విండీస్‌ను దెబ్బకొట్టాడు. షంషి 4 ఓవర్లలో 27 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. షంషికి జతగా సఫారీ బౌలర్లంతా రాణించారు. జన్సెన్, మార్క్రమ్, కేశవ్ మహారాజ్, రబాడ తలో వికెట్ పడగొట్టారు.
విండీస్ ఇన్నింగ్స్‌లో రోస్టన్ ఛేజ్ (52) అర్దసెంచరీతో రాణించగా.. కైల్ మేయర్స్ 35 పరుగులతో పర్వాలేదనిపించాడు. వీరిద్దరు మినహా విండీస్ బ్యాటర్లంతా చేతులెత్తేశారు. హోప్ 0, పూరన్ 1, రోవ్‌మన్ పావెల్ 1, రూథర్‌ఫోర్డ్ 0, రసెల్ 15, అకీల్ హొసేన్ 6 పరుగులకు ఔటయ్యారు. అల్జరీ జోసఫ్ (11 నాటౌట్), మోటీ (4) నాటౌట్‌గా నిలిచారు. 10 పరుగులు ఎక్స్‌ట్రాల రూపంలో వచ్చాయి.
కాగా, గ్రూప్-2 నుంచి ఇంగ్లండ్ సెమీఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. ఆ జట్టు నిన్న యూఎస్‌ఏతో జరిగిన మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో గెలుపొంది దర్జాగా సెమీస్‌లోకి అడుగుపెట్టింది. ఈ గ్రూప్ నుంచి రెండో బెర్త్ కోసం దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ జట్లు పోటీపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో విండీస్ గెలిస్తేనే సెమీస్‌కు చేరుకుంటుంది. సౌతాఫ్రికా ఓడితే నెట్ రన్‌రేట్ కీలకమవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment