South Africa vs West Indies
-
'మళ్లీ స్కూల్‌కు వెళ్తా.. విండీస్ టూర్లో కూడా చదువుకున్నా'
క్వేనా మఫాకా.. దక్షిణాఫ్రికా తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేసిన అంత్యంత పిన్న వయస్కుడు. తాజాగా వెస్టిండీస్‌తో జరిగిన టీ20 సిరీస్‌తో 18 ఏళ్ల మఫాకా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. తద్వారా ఈ ఘనతను మఫాకా తన పేరిట లిఖించుకున్నాడు.ఈ ఏడాది జరిగిన అండర్-19 క్రికెట్ వరల్డ్‌కప్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరచడంతో మఫాకాకు సీనియర్ ప్రోటీస్ జట్టులో చోటు దక్కింది. అయితే తనకు వచ్చిన అవకాశాన్ని ఈ యువ సంచలనం అందిపుచ్చుకోలేకపోయాడు. విండీస్ సిరీస్‌లో రెండు మ్యాచ్‌లు ఆడిన అతడు 54 పరుగులిచ్చి కేవలం ఒక్క వికెట్ మాత్రమే పడగొట్టాడు. అంతర్జాతీయ అరంగేట్రానికి ముందు ఐపీఎల్లో కూడా మఫాకా ఆడాడు.ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ తరపున క్యాచ్‌రిచ్ లీగ్‌లోకి అడగుపెట్టాడు. కానీ అక్కడ కూడా ఈ ప్రోటీస్ యువ పేసర్ తన మార్క్ చూపించలేకపోయాడు. ఐపీఎల్లో 2 మ్యాచ్‌లు ఆడిన మఫాక ఏకంగా 89 పరుగులు సమర్పించుకుని ఒక్క వికెట్ సాధించాడు. దీంతో మిగితా మ్యాచ్‌లకు ముంబై ఫ్రాంచైజీ అతడిని పక్కన పెట్టింది. అయితే మఫాకా వికెట్లు సాధించకపోయినప్పటకి 150 పైగా వేగంతో బౌలింగ్ చేసి అందరని ఆకట్టుకున్నాడు.చదవును కొనసాగిస్తున్నా?ఇక వెస్టిండీస్‌తో టీ20 సిరీస్ అనంతరం ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మఫాక పలు అసక్తికర విషయాలను వెల్లడించాడు. ఓ వైపు క్రికెట్‌ను, మరో వైపు తన చదువును ఎలా బ్యాలెన్స్ చేశాడో అతడు చెప్పుకొచ్చాడు."నేను తిరిగి ఇంటికి వెళ్లాక ప్రిలిమ్స్(స్కూల్ ఎడ్యూకేషన్) కోసం సిద్దమవుతాను. మళ్లీ నా స్కూల్‌కు వెళ్తాను. విండీస్ టార్ సమయంలో కూడా నా చదువును కొనసాగించాను. ఓ వైపు కొంచెం కొంచెం చదవుతూ నా ఆటపై దృష్టి పెట్టాను. ప్రిలిమ్స్ తర్వాత నాకు ఫైనల్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఆ పరీక్షలతో నా పాఠశాల విద్య పూర్తి అవుతోంది. దక్షిణాఫ్రికాకు ప్రాతినిధ్యం వహించిన అతి పిన్న వయస్కుడైన ఆటగాడిగా నిలవడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. ఇది ఎప్పటికీ నాకు గుర్తుండిపోతుంది. అదే విధంగా ప్రోటీస్‌కు అత్యున్నత స్ధాయిలో ప్రాతినిథ్యం వహించే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది. ఇది ప్రతీ ఒక్క ఆటగాడి చిరకాల స్వప్నం. క్రికెట్ అంటే నాకు చిన్నతనం నుంచే మక్కువ ఎక్కువ. ఆరు, ఏడేళ్ల వయస్సు నుంచే దక్షిణాఫ్రికా తరపున ఆడాలని కలలు కన్నాను అని ఐవోఎల్.కామ్( iol.com.za)కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మఫాకా పేర్కొన్నాడు. -
నికోలస్ పూరన్ విధ్వంసం.. సౌతాఫ్రికాను చిత్తు చేసిన వెస్టిండీస్
దక్షిణాఫ్రికాతో మూడు టీ20ల సిరీస్‌లో వెస్టిండీస్ శుభారంభం చేసింది. ట్రినిడాడ్ వేదికగా జరిగిన తొలి టీ20లో సౌతాఫ్రికాపై 7 వికెట్ల తేడాతో విండీస్ ఘన విజయం సాధించింది. 175 పరుగుల భారీ లక్ష్యాన్ని కరేబియన్లు ఊదిపడేశారు. 17.5 ఓవర్లలో కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి విండీస్ ఛేదించింది. లక్ష్య చేధనలో వెస్టిండీస్ ఓపెనర్లు అలిక్ అథ్నాజ్(40), షాయ్ హోప్(51) పరుగులతో అద్బుత ఆరంభాన్ని అందిచారు. అనంతరం క్రీజులోకి వచ్చిన నికోలస్ పూరన్ తన విధ్వంసకర ఇన్నింగ్స్‌లో మ్యాచ్‌ను ఫినిష్ చేశాడు. కేవలం 26 బంతులు మాత్రమే ఎదుర్కొన్న పూరన్.. 7 సిక్స్‌లు, 2 ఫోర్లతో 65 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. సఫారీ బౌలర్లలో బార్టమన్ ఒక్కడే రెండు వికెట్లు పడగొట్టాడు.రాణించిన స్టబ్స్..అంతకముందు బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. ప్రోటీస్ బ్యాటర్లలో ట్రిస్టన్ స్టబ్స్(76) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. ఆఖరిలో పట్రిక్ కుర్గర్(44) పర్వాలేదన్పించాడు. విండీస్ బౌలర్లలో ఫోర్డే 3 వికెట్లు పడగొట్టగా.. జోషఫ్ రెండు, అకిల్ హోస్సేన్ తలా వికెట్ సాధించారు. ఇక ఇరు జట్ల మధ్య రెండో టీ20 ఆగస్టు 25న ట్రినిడాడ్ వేదికగానే జరగనుంది. -
వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాడు దూరం
స్వదేశంలో దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కు 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును వెస్టిండీస్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఈ సిరీస్‌కు స్టార్ ఆటగాళ్లు ఆండ్రీ రస్సెల్, జాసన్ హోల్డర్, అల్జారీ జోషఫ్, కైల్ మైర్స్‌కు సెలక్టర్లు విశ్రాంతి ఇచ్చారు. ఈ జట్టుకు రోవ్మాన్ పావెల్ మరోసారి సారథ్యం వహించనున్నాడు. అతడి డిప్యూటీగా స్టార్ ఆల్‌రౌండర్ రోస్టన్ చేజ్ వ్యవరించారు. ఇక ఈ జట్టులో వెటరన్ ఆల్‌రౌండర్ ఫాబియన్ అలెన్, పేసర్ మాథ్యూ ఫోర్డ్, యంగ్ బ్యాటర్ అలిక్ అథనాజ్లకు చోటు దక్కింది. ఇక ఈ సిరీస్‌లో భాగంగా ఇరు జట్లు మూడు టీ20 మ్యాచ్‌లు ఆడనున్నాయి. ఆగస్టు 23 నుంచి ఈ సిరీస్ ప్రారంభం కానుంది. మూడు మ్యాచ్‌లు కూడా ట్రినిడాడ్ వేదికగానే జరగనున్నాయి. కాగా ఇప్పటికే ప్రోటీస్ జట్టు విండీస్ టెస్టు సిరీస్‌ను 0-1తో సొంతం చేసుకుంది.దక్షిణాఫ్రికాతో టీ20లకు విండీస్ జట్టురోవ్మన్ పావెల్ (కెప్టెన్), రోస్టన్ చేజ్ (వైస్ కెప్టెన్), అలిక్ అథానాజ్, జాన్సన్ చార్లెస్, మాథ్యూ ఫోర్డ్, షిమ్రాన్ హెట్మెయర్, ఫాబియన్ అలెన్, షాయ్ హోప్, అకేల్ హోసేన్, షామర్ జోసెఫ్, ఒబెడ్ మెక్కాయ్, గుడాకేష్ మోటీ, నికోలస్ పూరన్, షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్. -
WI vs SA: చరిత్ర సృష్టించిన కేశవ్ మహారాజ్..
దక్షిణాఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహారాజ్ అరుదైన ఘనత సాధించాడు. టెస్టు క్రికెట్లో సౌతాఫ్రికా తరపున అత్యధిక వికెట్లు పడగొట్టిన స్పిన్నర్‌గా మహారాజ్ రికార్డులెక్కాడు. గయనా వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన రెండో టెస్టులో 5 వికెట్లు పడగొట్టిన కేశవ్ ఈ అరుదైన ఫీట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పటివరకు 52 టెస్టులు ఆడిన ఈ ప్రోటీస్ స్టార్ స్పిన్నర్.. 171 వికెట్లు పడగొట్టాడు. ఇంతకుముందు ఈ రికార్డు సౌతాఫ్రికా లెజెండరీ స్పిన్నర్ హ్యూ టేఫీల్డ్(170) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో హ్యూ టేఫీల్డ్ ఆల్‌టైమ్ రికార్డును కేశవ్ బద్దలు కొట్టాడు. ఓవరాల్‌గా ఈ ఘనత సాధించిన జాబితాలో సఫారీ పేస్ గన్(439) అగ్రస్ధానంలో కొనసాగుతున్నాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. రెండో టెస్టులో విండీస్‌పై 40 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా విజయం సాధించింది. తద్వారా రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను 0-1 తేడాతో ప్రోటీస్ జట్టు కైవసం చేసుకుంది.స్కోర్లుదక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్: 160/10వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్: 144/10దక్షిణాఫ్రికా సెకెండ్ ఇన్నింగ్స్: 246/10విండీస్ సెకెండ్ ఇన్నింగ్స్: 222/10ఫలితం: 40 పరుగుల తేడాతో విండీస్‌పై ప్రోటీస్ విజయం -
వెస్టిండీస్‌పై దక్షిణాఫ్రికా ఘన విజయం.. సిరీస్ సొంతం
గయానా వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన రెండో టెస్టులో 40 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా ఘన విజయం సాధించింది. దీంతో రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 0-1 తేడాతో సౌతాఫ్రికా కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సఫారీలు తమ మొదటి ఇన్నింగ్స్‌లో 160 పరుగులకే కుప్పకూలింది.విండీస్ బౌలర్లలో యువ పేసర్ షమీర్ జోషఫ్ 5 వికెట్లతో చెలరేగగా.. సీల్స్ మూడు,హోల్డర్, మోటీ తలా వికెట్ సాధించారు. ప్రోటీస్ బ్యాటర్లలో డేన్ పీడ్ట్(38) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం వెస్టిండీస్ కూడా తొలి ఇన్నింగ్స్‌లో తేలిపోయింది.దక్షిణాఫ్రికా బౌలర్ల దాటికి 144 పరుగులకే చాప చుట్టేసింది. 16 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టిన ప్రోటీస్ 246 పరుగులకు ఆలౌటైంది. సౌతాఫ్రికా సెకెండ్ ఇన్నింగ్స్‌లో వెర్రెయిన్నే(59), మార్క్రమ్(51) హాఫ్ సెంచరీలతో రాణించారు.వెస్టిండీస్ బౌలర్లలో జైడన్ సీల్స్ 6 వికెట్లతో సత్తాచాటాడు. ఇక తొలి ఇన్నింగ్స్‌లో లభించిన ఆధిక్యాన్ని కలుపునకుని విండీస్ ముందు 263 పరుగుల లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా ఉంచింది. లక్ష్య చేధనలో కరేబియన్ జట్టు 222 పరుగులకు ఆలౌటైంది. కేశవ్ మహారాజ్, రబాడ తలా మూడు వికెట్లతో ఆతిథ్య జట్టును దెబ్బకొట్టాడు. ఇక ఇరు జట్ల మధ్య టీ20 సిరీస్ ఆగస్టు 23 నుంచి ప్రారంభం కానుంది. -
వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. దక్షిణాఫ్రికా జట్టు ప్రకటన.. ఫాస్ట్ బౌలింగ్ సంచలనం ఎంపిక
వెస్టిండీస్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం దక్షిణాఫ్రికా జట్టును ఇవాళ (ఆగస్ట్ 14) ప్రకటించారు. ఈ జట్టుకు కెప్టెన్‌గా ఎయిడెన్ మార్క్రమ్ ఎంపికయ్యాడు. అన్క్యాప్డ్ ప్లేయర్, ఫాస్ట్ బౌలింగ్ సంచలనం క్వేనా మపాకా ఈ జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఈ సిరీస్‌కు సీనియర్లు రబాడ, నోర్జే, డికాక్, క్లాసెన్‌లను పరిగణలోకి తీసుకోలేదు దక్షిణాఫ్రికా సెలెక్టర్లు. వర్క్ లోడ్ మేనేజ్మెంట్ కారణంగా వీరికి విశ్రాంతి కల్పించినట్లు తెలుస్తుంది. మపాకాతో పాటు మరో అన్క్యాప్డ్ ప్లేయర్ జేసన్ స్మిత్‌ను ఎంపిక చేశారు సెలెక్టర్లు. స్మిత్ ఇటీవల ముగిసిన సీఎస్ఏ టీ20 ఛాలెంజ్ టోర్నీలో 41.57 సగటున 291 పరుగులు చేశాడు. స్మిత్ పేస్ బౌలింగ్ కూడా చేయగలడు. మపాకా విషయానికొస్తే.. ఈ ఫాస్ట్ బౌలింగ్ సంచలనం ఈ ఏడాది ఆరంభంలో జరిగిన అండర్-19 వరల్డ్‌కప్‌లో విశేషంగా రాణించాడు. ఆ టోర్నీలో అతను 21 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచాడు. ఈ ప్రదర్శన కారణంగా మాపాకా ఐపీఎల్లో ముంబై ఇండియన్స్‌కు ఎంపికయ్యాడు. టీ20 వరల్డ్‌కప్ ఫైనల్లో భారత్ చేతిలో ఓటమి తర్వాత దక్షిణాఫ్రికా ఆడనున్న మొట్టమొదటి టీ20 సిరీస్ ఇదే.వెస్టిండీస్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు దక్షిణాఫ్రికా జట్టు..ఎయిడెన్ మార్క్రమ్ (కెప్టెన్), ఓట్నీల్ బార్ట్‌మన్, నండ్రే బర్గర్, డొనోవన్ ఫెరియెరా, జోర్న్ ఫోర్టుయిన్, రీజా హెండ్రిక్స్, ప్యాట్రిక్ క్రూగర్, క్వేనా మపాకా, వియాన్ ముల్దర్, లుంగి ఎంగిడి, ర్యాన్ రికెల్టన్, జేసన్ స్మిత్, ట్రిస్టన్ స్టబ్స్, రస్సీ వాన్‌డర్ డస్సెన్, లిజాడ్ విలియమ్స్ -
సౌతాఫ్రికా కొంపముంచిన వరుణుడు.. విండీస్‌తో తొలి టెస్టు డ్రా
ట్రినిడాడ్ వేదికగా దక్షిణాఫ్రికా-వెస్టిండీస్ మధ్య జరిగిన తొలి టెస్టు డ్రాగా ముగిసింది. అయితే ఈ మ్యాచ్‌లో విండీస్‌పై దక్షిణాఫ్రికా మాత్రం పూర్తి ఆధిపత్యం సాధించింది. కానీ దురదృష్టవశాత్తూ పదే పదే వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచ్‌ను డ్రాగా ముగించాల్సి వచ్చింది. ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికా 357 పరుగులు చేయగా.. ఆతిథ్య విండీస్ 233 పరుగులకే ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా బ్యాటర్లలో కెప్టెన్ టెంబా బావుమా(86) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. టోనీ డి జోర్జి(78), బవెర్రెయిన్నే(39) పరుగులతో రాణించారు.అనంతరం తొలి ఇన్నింగ్స్‌లో 124 పరుగుల ఆధిక్యం దక్కించుకున్న సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌ను 173/3 వద్ద డిక్లేర్ చేసింది. ప్రోటీస్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో స్టబ్స్ (68) హాఫ్ సెంచరీతో మెరిశాడు. 298 పరుగుల లక్ష్యంతో నాలుగో ఇన్నింగ్స్ ఆరంభించిన విండీస్.. ఆఖరి రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్లు కోల్పోయి 201 పరుగులు చేసింది. దీంతో మొదటి టెస్టు డ్రాగా ముగిసింది. కరేబియన్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో అలిక్ అథానాజ్(92) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇక ఇరు జట్ల మధ్య రెండో టెస్టు ఆగస్టు 15 నుంచి గయానా వేదికగా ప్రారంభం కానుంది. -
అరుదైన క్లబ్లో చేరిన సౌతాఫ్రికా కెప్టెన్
సౌతాఫ్రికా టెస్ట్ జట్టు కెప్టెన్ టెంబా బవుమా అరుదైన క్లబ్లో చేరాడు. టెస్ట్‌ల్లో 3000 పరుగుల మార్కు తాకిన 17వ సౌతాఫ్రికా ప్లేయర్‌గా రికార్డుల్లోకెక్కాడు. వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో బవుమా ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 86 పరుగులు చేసిన బవుమా 3 పరుగుల వ్యక్తిగత స్కోర్ల వద్ద 3000 పరుగుల మార్కును క్రాస్ చేశాడు. కెరీర్లో 57 టెస్ట్‌లు ఆడిన బవుమా 2 సెంచరీలు, 21 హాఫ్ సెంచరీల సాయంతో 3083 పరుగులు చేశాడు. టెస్ట్‌ల్లో సౌతాఫ్రికా తరఫున అత్యధిక పరుగులు చేసిన రికార్డు జాక్ కల్లిస్ పేరిట ఉంది. కల్లిస్ 165 మ్యాచ్‌ల్లో 13206 పరుగులు చేశాడు. ఓవరాల్‌గా టెస్ట్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన ఘనత సచిన్ టెండూల్కర్‌కు దక్కుతుంది. సచిన్ సుదీర్ఘ ఫార్మాట్లో 15921 పరుగులు చేశాడు. సచిన్ తర్వాతి స్థానంలో పాంటింగ్ (13378) ఉన్నాడు.కాగా, ట్రినిడాడ్ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేస్తున్న సౌతాఫ్రికా రెండో రోజు ఆట ముగిసే సమయానికి 8 వికెట్ల నష్టానికి 344 పరుగులు చేసింది. వర్షం కారణంగా తొలి రోజు ఆట దాదాపుగా తుడిచిపెట్టుకుపోగా.. రెండో రోజు సజావుగా సాగింది. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో బవుమా, ఓపెనర్ టోనీ డి జోర్జీ (78) అర్ద సెంచరీలతో రాణించగా.. ఎయిడెన్ మార్క్రమ్ 9, ట్రిస్టన్ స్టబ్స్ 20, డేవిడ్ బెడింగ్హమ్ 29, ర్యాన్ రికెల్టన్ 19, కైల్ వెర్రిన్ 39, కేశవ్ మహారాజ్ 0 పరుగులు చేసి ఔటయ్యారు. వియాన్ ముల్దర్ (37), రబాడ (12) బ్యాటింగ్ కొనసాగిస్తున్నారు. విండీస్ బౌలర్లలో జోమెల్ వార్రికన్ 3, కీమర్ రోచ్, జేడన్ సీల్స్ తలో 2, జేసన్ హోల్డర్ ఓ వికెట్ పడగొట్టారు. -
SA vs WI 1st Test: చెలరేగిన కెప్టెన్.. పటిష్ట స్థితిలో సౌతాఫ్రికా
ట్రినిడాడ్ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో దక్షిణాఫ్రికా అద్బుతమైన ప్రదర్శన కనబరుస్తుంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్ల నష్టానికి 344 పరుగులు చేసింది.క్రీజులో ముల్డర్(37), రబాడ(12) పరుగులతో ఉన్నారు. దక్షిణాఫ్రికా బ్యాటర్లలో కెప్టెన్ టెంబా బావుమా(86) పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అతడితో పాటు టోనీ డి జోర్జి(78), బవెర్రెయిన్నే(39) పరుగులతో రాణించారు. అయితే ఆ జట్టు పరిమిత ఓవర్ల కెప్టెన్, స్టార్ బ్యాటర్ ఐడైన్ మార్క్రమ్ మరోసారి నిరాశపరిచాడు. కేవలం 9 పరుగులు మాత్రమే చేసి మార్క్రమ్ ఔటయ్యాడు. ఇక విండీస్ బౌలర్లలో జోమెల్ వారికన్ 3 వికెట్లు పడగొట్టగా.. కీమర్ రోచ్, సీల్స్ తలా రెండు వికెట్లు సాధించారు. కాగా వర్షం కారణంగా తొలి రోజు కేవలం 15 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యపడింది. -
సౌతాఫ్రికా బ్యాటింగ్ లీడ్‌గా ఇమ్రాన్ ఖాన్
సౌతాఫ్రికా క్రికెట్ జట్టు బ్యాటింగ్ లీడ్‌గా మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ ఎంపికయ్యాడు. అశ్వెల్ ప్రిన్స్ స్థానంలో తాత్కాలిక ప్రాతిపదికన ఈ బాధ్యతలు చేపట్టనున్నాడు. వెస్టిండీస్‌తో సిరీస్ నేపథ్యంలో సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి సోమవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది.కాగా సౌతాఫ్రికా తరఫున 2009లో ఒకే ఒక్క టెస్టు మ్యాచ్ ఆడాడు ఇమ్రాన్ ఖాన్. ఆ తర్వాత ఈ లెఫ్టాండ్ బ్యాటర్‌కు మళ్లీ జాతీయ జట్టులో చోటు దక్కలేదు. కాగా పదిహేనేళ్లపాటు దేశవాళీ జట్టు డాల్ఫిన్స్ జట్టు టాపార్డర్‌లో బ్యాటర్‌గా కొనసాగిన ఇమ్రాన్ ఖాన్.. రెడ్ బాల్ క్రికెట్లో అద్భుతంగా రాణించాడు. 161 మ్యాచ్‌లు ఆడి 20 శతకాల సాయంతో 9367 పరుగులు సాధించాడు.ఇక తన కెరీర్లో 121 లిస్ట్-ఏ మ్యాచ్‌లు ఆడిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. 51 టీ20లలోనూ భాగమయ్యాడు. జాతీయ జట్టులో పెద్దగా అవకాశాలు రాకపోయినా.. కోచ్‌గా మాత్రం విజయవంతమయ్యాడు. దేశవాళీ క్రికెట్లో డాల్ఫిన్స్ జట్టు శిక్షకుడిగా ఉన్న ఇమ్రాన్ ఖాన్.. ఆ జట్టుకు రెండుసార్లు ట్రోఫీ అందించాడు. అంతేకాదు..అతడి మార్గదర్శనంలో డాల్ఫిన్స్ టీమ్ వన్డే కప్‌లో ఒకసారి, సీఎస్ఏ టీ20 టోర్నమెంట్లలో మూడుసార్లు ఫైనల్ చేరింది.తొలిసారి సౌతాఫ్రికా బ్యాటింగ్ కోచ్‌గా..వెస్టిండీస్ పర్యటనకు వెళ్లనున్న సౌతాఫ్రికా జట్టు ఆగష్టు 7 నుంచి టెస్టు సిరీస్ ఆడనుంది. ఆగష్టు 7- 11, ఆగష్టు 15- 19 వరకు రెండు మ్యాచ్‌లు ఆడేందుకు షెడ్యూల్ ఖరారైంది. ఈ క్రమంలో తొలిసారిగా ఇమ్రాన్ ఖాన్ బ్యాటింగ్ కోచ్‌గా బాధ్యతలు స్వీకరించనున్నాడు. తన నియామకంపై హర్షం వ్యక్తం చేసిన ఇమ్రాన్ ఖాన్.. కోచ్‌గా తన అంతిమ లక్ష్యానికి చేరువయ్యానని ఉద్వేగానికి లోనయ్యాడు.చదవండి: WI vs SA: సౌతాఫ్రికాతో సిరీస్.. ముగ్గురు అన్క్యాప్డ్ ప్లేయర్లకు చోటు -
సౌతాఫ్రికాతో సిరీస్.. విండీస్ వికెట్ల వీరుడి రీ ఎంట్రీ
దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు వెస్టిండీస్ క్రికెట్ బోర్డు తమ జట్టు ప్రకటించింది. క్రెగ్ బ్రాత్‌వైట్ కెప్టెన్సీలోని ఈ జట్టులో ముగ్గురు అన్క్యాప్డ్ ప్లేయర్లకు చోటిచ్చింది. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో ఆకట్టుకున్న టెవిన్ ఇమ్లాచ్, బ్రియాన్ చార్లెస్‌కు తొలిసారిగా జాతీయ జట్టులో స్థానం కల్పించింది.గయానాకు చెందిన ఇమ్లాచ్ 22 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడి 1097 పరుగులు సాధించాడు. ఇందులో మూడు సెంచరీలు ఉన్నాయి. ఇక ఆఫ్ స్పిన్నర్ చార్లెస్ 44 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లలో భాగమై.. 150 వికెట్లు పడగొట్టాడు. వీరి సంగతి ఇలా ఉంటే.. ఇప్పటికే వన్డే జట్టులో సభ్యుడైన కేసీ కార్టీకి టెస్టు క్రికెట్ ఆడే అవకాశం ఇచ్చింది విండీస్ బోర్డు.వైస్ కెప్టెన్‌గా జోషువా డా సిల్వాఇక ఇటీవల ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో రాణించిన వికెట్ కీపర్ బ్యాటర్ జోషువా డా సిల్వాను వైస్ కెప్టెన్‌గా నియమించింది. తమ రెగ్యులర్ వైస్ కెప్టెన్ అల్జారీ జోసెఫ్‌కు విశ్రాంతినివ్వాలని భావించామని.. అందుకే జోషువాకు ఈ ఛాన్స్ ఇచ్చినట్లు వెస్టిండీస్ హెడ్ కోచ్ ఆండ్రే కోలే తెలిపాడు. ఇక ఈ జట్టులో.. ఇంగ్లండ్ టూర్‌కు పక్కనపెట్టిన జస్టిన్ గ్రేవ్స్‌కు కూడా అవకాశం ఇచ్చారు సెలక్టర్లు. వికెట్ల వీరుడి పునరాగమనంఅదే విధంగా.. గాయం కారణంగా జట్టుకు దూరమైన సీనియర్ పేసర్, వికెట్ల వీరుడు కెమర్ రోచ్(81 టెస్టుల్లో 270 వికెట్లు) కూడా ఈ సిరీస్ ద్వారా రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. కాగా రెండు టెస్టు, మూడు టీ20 మ్యాచ్‌లు ఆడే నిమిత్తం దక్షిణాఫ్రికా జట్టు వెస్టిండీస్‌లో పర్యటించనుంది. ట్రినిడాడ్ వేదికగా ఆగష్టు 7- 11 వరకు తొలి టెస్టు, గయానాలో ఆగష్టు 15- 19 వరకు రెండో టెస్టు నిర్వహించనున్నారు. అదే విధంగా.. ఆగష్టు 23, 24, 27 తేదీల్లో ఇరు జట్ల మధ్య టీ20 సిరీస్ జరుగనుంది. ఈ మూడు మ్యాచ్‌లకు ట్రినిడాడ్ వేదిక.ఇక ఇటీవల ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లిన వెస్టిండీస్ మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో 0-3తో క్లీన్‌స్వీప్‌నకు గురైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సొంతగడ్డపై దక్షిణాఫ్రికాతో సిరీస్‌లోనైనా సత్తా చాటాలని పట్టుదలగా ఉంది.దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు వెస్టిండీస్ జట్టుక్రెగ్ బ్రాత్‌వైట్ (కెప్టెన్), జాషువా డా సిల్వా (వైస్ కెప్టెన్), అలిక్ అథనేజ్, కేసీ కార్టీ, బ్రియాన్ చార్లెస్, జస్టిన్ గ్రీవ్స్, జాసన్ హోల్డర్, కవెమ్ హాడ్జ్, టెవిన్ ఇమ్లాచ్, షమర్ జోసెఫ్, మిక్కిల్ లూయిస్, గుడకేష్ మోటీ, కెమర్ రోచ్, జేడెన్ సీల్స్, జోమెల్ వారికాన్. -
సౌతాఫ్రికాకు బిగ్ షాక్
వెస్టిండీస్‌తో టెస్ట్ సిరీస్‌కు ముందు సౌతాఫ్రికాకు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ గెరాల్డ్ కొయెట్జీ గాయం కారణంగా సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. మేజర్ లీగ్ క్రికెట్ సందర్భంగా కొయెట్జీ గాయపడ్డాడు. కొయెట్జీ స్థానాన్ని 29 ఏళ్ల నార్త్ వెస్ట్ డ్రాగన్స్ ఫాస్ట్ బౌలర్ మైగెల్ ప్రిటోరియస్ భర్తీ చేయనున్నాడు.కాగా, రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్, మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ల కోసం సౌతాఫ్రికా జట్టు వెస్టిండీస్‌లో పర్యటించనుంది. ఈ సిరీస్‌లు ఆగస్ట్ 7 నుంచి ప్రారంభమవుతాయి. ఆగస్ట్ 7-11 మధ్యలో తొలి టెస్ట్ (ట్రినిడాడ్), ఆగస్ట్ 15-19 మధ్యలో రెండో టెస్ట్ (పోర్ట్ ఆఫ్ స్పెయిన్), ఆగస్ట్ 23, 24, 27 తేదీల్లో టీ20 జరుగనున్నాయి. మూడు టీ20లకు ట్రినిడాడ్‌లోని తరౌబా వేదిక కానుంది.ఇదిలా ఉంటే, ప్రస్తుతం వెస్టిండీస్ ఇంగ్లండ్‌లో పర్యటిస్తుంది. అక్కడ ఆ జట్టు మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడుతుంది. ఈ సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే ఇంగ్లండ్ 2-0 తేడాతో కైవసం చేసుకుంది. సౌతాఫ్రికా విషయానికొస్తే.. ఈ జట్టు టీ20 ప్రపంచకప్ ఫైనల్ తర్వాత ఖాళీగా ఉంది. విండీస్ పర్యటనతో ఆ జట్టు సీజన్‌ను ప్రారంభించనుంది. వెస్టిండీస్‌లోనే జరిగిన టీ20 వరల్డ్‌కప్ ఫైనల్లో సౌతాఫ్రికా భారత్ చేతిలో ఓటమిపాలై రన్నరప్‌గా నిలిచింది.సౌతాఫ్రికా-వెస్టిండీస్ మధ్య టెస్ట్ సిరీస్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ సైకిల్లో భాగంగా జరుగనుంది. ప్రస్తుతం డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో భారత్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. ఇంగ్లండ్ చేతిలో వరుస పరాజయాలు ఎదుర్కొన్న వెస్టిండీస్ చిట్టచివరి స్థానంలో ఉంది. ప్రస్తుత డబ్ల్యూటీసీ సైకిల్లో 25 శాతం విజయాలు సాధించిన సౌతాఫ్రికా ఏడో స్థానంలో నిలిచింది. వెస్టిండీస్‌తో టెస్ట్ సిరీస్ కోసం సౌతాఫ్రికా జట్టు..టెంబా బవుమా (కెప్టెన్), డేవిడ్ బెడింగ్హామ్, మాథ్యూ బ్రీట్జ్కీ, నండ్రే బర్గర్, టోనీ డి జోర్జి, కేశవ్ మహరాజ్, ఎయిడెన్ మార్క్రమ్, వియాన్ ముల్డర్, లుంగి ఎంగిడి, డేన్ ప్యాటర్సన్, డేన్ పీడ్ట్, మైగెల్ ప్రిటోరియస్, కగిసో రబడా, ట్రిస్టన్ స్టబ్స్, కైల్ వెర్రిన్ -
WI vs SA: విండీస్‌తో సిరీస్.. సంచలన ఆటగాడి ఎంట్రీ
సౌతాఫ్రికా క్రికెట్ జట్టు వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్ కోసం సన్నద్ధం కానుంది. విండీస్ పర్యటనలో భాగంగా రెండు టెస్టులు ఆడేందుకు సిద్ధమైంది.తొలిసారి జాతీయ జట్టులోఈ క్రమంలో 16 మంది సభ్యులతో కూడిన జట్టును క్రికెట్ సౌతాఫ్రికా సోమవారం ప్రకటించింది. దేశవాళీ క్రికెట్లో దుమ్ములేపిన 25 ఏళ్ల మాథ్యూ బ్రీట్జ్కేకు తొలిసారిగా జాతీయ జట్టులో చోటిచ్చారు సెలక్టర్లు.అదే విధంగా.. వికెట్ కీపర్ ర్యాన్ రికెల్టన్ కూడా ఈ సిరీస్ ద్వారా పునరాగమనం చేయనున్నాడు. కాగా తెంబా బవుమా కెప్టెన్సీలో వెస్టిండీస్‌తో ఆడనున్న ఈ సిరీస్‌కు ఆల్‌రౌండర్ మార్కో జాన్సెన్ దూరం కానున్నాడు.నిర్విరామంగా క్రికెట్ ఆడుతున్న ఈ పేసర్‌కు మేనేజ్మెంట్ విశ్రాంతినిచ్చింది. ఈ నేపథ్యంలో సౌతాఫ్రికా హెడ్ కోచ్ షుక్రి కొన్రాడ్ మాట్లాడుతూ.. ‘‘గత కొంత కాలంగా పరిమిత ఓవర్ల క్రికెట్‌తో బిజీగా ఉన్న మేము.. తిరిగి టెస్టు క్రికెట్‌తో బిజీ కానున్నాము.ఐసీసీ వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్‌లో మెరుగైన స్థితిలో నిలవడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం. అందుకే కరేబియన్ జట్టుతో పోరుకు పటిష్ట జట్టును ఎంపిక చేశాం.డొమెస్టిక్ క్రికెట్లో అదరగొట్టిదేశవాళీ క్రికెట్లో అదరగొట్టిన మాథ్యూకు ఈసారి చోటిచ్చాం. మార్కో జాన్సెన్కు విశ్రాంతి అవసరమని భావించాం’’ అని తెలిపాడు. సౌతాఫ్రికా డొమెస్టిక్ క్రికెట్ గత సీజన్లో మాథ్యూ బ్రీట్జ్కే 322 పరుగులు సాధించాడు. ఇండియా-ఏ జట్టుతో అనధికారిక సిరీస్‌లోనూ ఆడాడు.కాగా ఆగష్టు 7 నుంచి వెస్టిండీస్- సౌతాఫ్రికా మధ్య టెస్టు సిరీస్ ఆరంభం కానుంది. కరేబియన్ దీవుల్లోని ట్రినిడాడ్, టొబాగో ఈ రెండు మ్యాచ్‌ల సిరీస్‌కు ఆతిథ్యం ఇవ్వనున్నాయి.ఇక ఇదే వెస్టిండీస్ గడ్డపై ఇటీవల సౌతాఫ్రికాకు చేదు అనుభవం ఎదురైన విషయం తెలిసిందే. టీ20 ప్రపంచకప్-2024 ఫైనల్లో టీమిండియా చేతిలో ఓడిపోయి రన్నరప్‌తో సరిపెట్టుకుంది.వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌కు సౌతాఫ్రికా జట్టు:తెంబా బవుమా (కెప్టెన్), డేవిడ్ బెడింగ్హామ్, మాథ్యూ బ్రీట్జ్కే, నండ్రే బర్గర్, గెరాల్డ్ కోయెట్జీ, టోనీ డి జోర్జీ, కేశవ్ మహారాజ్, ఐడెన్ మార్క్రమ్, వియాన్ ముల్డర్, లుంగి ఎంగిడి, డేన్ పాటర్సన్, డేన్ పీడ్ట్, కగిసో రబడ, ట్రిస్టన్ స్టబ్స్, ర్యాన్ రికెల్టన్, కైల్ వెరెన్నే. -
T20 World Cup 2024: దారుణంగా ఢీకొట్టుకున్నారు.. జన్సెన్కు తీవ్ర గాయం..!
టీ20 వరల్డ్‌కప్ 2024లో భాగంగా వెస్టిండీస్‌తో ఇవాళ (జూన్ 24) జరుగుతున్న కీలక సమరంలో ఓ ప్రమాదకర ఘటన చోటు చేసుకుంది. మార్క్రమ్ బౌలింగ్ కైల్ మేయర్స్ కొట్టిన సిక్సర్‌ను క్యాచ్‌గా మలిచే క్రమంలో మార్కో జన్సెన్, కగిసో రబాడ తీవ్రంగా గాయపడ్డారు. బౌండరీ లైన్ వద్ద రబాడ, జన్సెన్ ఒకరినొకరు దారుణంగా ఢీకొట్టుకున్నారు. ఈ ఘటనలో జన్సెన్ తీవ్రంగా గాయపడగా.. రబాడ స్వల్ప గాయంతో బయటపడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతుంది.Kagiso Rabada and Marco Jansen collide on the boundary line 🤯Hope there are no serious injuries 🤞📸: Disney+Hotstar pic.twitter.com/S1PYlR4Ddw— CricTracker (@Cricketracker) June 24, 2024ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్.. సౌతాఫ్రికా బౌలర్లు మూకుమ్మడిగా చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 135 పరుగులు మాత్రమే చేయగలిగింది. తబ్రేజ్ షంషి తన స్పిన్ మాయాజాలాన్ని ప్రదర్శించి విండీస్‌ను దారుణంగా దెబ్బకొట్టాడు. షంషి 4 ఓవర్లలో 27 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. షంషికి జతగా సఫారీ బౌలర్లంతా రాణించారు. జన్సెన్, మార్క్రమ్, కేశవ్ మహారాజ్, రబాడ తలో వికెట్ పడగొట్టారు. View this post on Instagram A post shared by ICC (@icc)విండీస్ ఇన్నింగ్స్‌లో రోస్టన్ ఛేజ్ (52) అర్దసెంచరీతో రాణించగా.. కైల్ మేయర్స్ 35 పరుగులతో పర్వాలేదనిపించాడు. వీరిద్దరు మినహా విండీస్ బ్యాటర్లంతా చేతులెత్తేశారు. హోప్ 0, పూరన్ 1, రోవ్‌మన్ పావెల్ 1, రూథర్‌ఫోర్డ్ 0, రసెల్ 15, అకీల్ హొసేన్ 6 పరుగులు చేశారు. అల్జరీ జోసఫ్ (11 నాటౌట్), మోటీ (4) నాటౌట్‌గా నిలిచారు. 10 పరుగులు ఎక్సట్రాల రూపంలో వచ్చాయి. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సౌతాఫ్రికాకు వరుణుడు అడ్డు తగిలాడు. ఆ జట్టు స్కోర్ 15/2 (2 ఓవర్లలో) వద్ద ఉండగా.. వర్షం మొదలైంది. దీంతో అక్కడే మ్యాచ్‌ను ఆపేశారు. ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా గెలవాలంటే మరో 18 ఓవర్లలో 121 పరుగులు చేయాల్సి ఉంది. చేతిలో 8 వికెట్లు ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా గెలిస్తే గ్రూప్-2 నుంచి ఇంగ్లండ్‌తో పాటు సెమీస్‌కు చేరుకుంటుంది. ఒకవేళ ఓడితే మెరుగైన రన్‌రేట్ కలిగిన జట్టు (విండీస్, సౌతాఫ్రికా) సెమీస్‌కు చేరుకుంటుంది. -
T20 World Cup 2024: సౌతాఫ్రికా సెమీస్‌కు చేరాలంటే 136 పరుగులు చేయాలి
టీ20 వరల్డ్‌కప్ సూపర్-8 పోరులో ఇవాళ (జూన్ 24) సౌతాఫ్రికా, వెస్టిండీస్ జట్లు తలపడుతున్నాయి. ఇవాళ ఉదయం ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. సౌతాఫ్రికా బౌలర్లు మూకుమ్మడిగా రాణించడంతో వెస్టిండీస్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 135 పరుగులు మాత్రమే చేయగలిగింది. తబ్రేజ్ షంషి తన స్పిన్ మాయాజాలాన్ని ప్రదర్శించి విండీస్‌ను దెబ్బకొట్టాడు. షంషి 4 ఓవర్లలో 27 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. షంషికి జతగా సఫారీ బౌలర్లంతా రాణించారు. జన్సెన్, మార్క్రమ్, కేశవ్ మహారాజ్, రబాడ తలో వికెట్ పడగొట్టారు. విండీస్ ఇన్నింగ్స్‌లో రోస్టన్ ఛేజ్ (52) అర్దసెంచరీతో రాణించగా.. కైల్ మేయర్స్ 35 పరుగులతో పర్వాలేదనిపించాడు. వీరిద్దరు మినహా విండీస్ బ్యాటర్లంతా చేతులెత్తేశారు. హోప్ 0, పూరన్ 1, రోవ్‌మన్ పావెల్ 1, రూథర్‌ఫోర్డ్ 0, రసెల్ 15, అకీల్ హొసేన్ 6 పరుగులకు ఔటయ్యారు. అల్జరీ జోసఫ్ (11 నాటౌట్), మోటీ (4) నాటౌట్‌గా నిలిచారు. 10 పరుగులు ఎక్స్‌ట్రాల రూపంలో వచ్చాయి. కాగా, గ్రూప్-2 నుంచి ఇంగ్లండ్ సెమీఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. ఆ జట్టు నిన్న యూఎస్ఏతో జరిగిన మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో గెలుపొంది దర్జాగా సెమీస్‌లోకి అడుగుపెట్టింది. ఈ గ్రూప్ నుంచి రెండో బెర్త్ కోసం దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ జట్లు పోటీపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో విండీస్ గెలిస్తేనే సెమీస్‌కు చేరుకుంటుంది. సౌతాఫ్రికా ఓడితే నెట్ రన్‌రేట్ కీలకమవుతుంది. -
చెలరేగిన విండీస్ కెప్టెన్.. దక్షిణాఫ్రికాపై ఘన విజయం
టీ20 వరల్డ్‌కప్-2024 సన్నాహాకాల్లో వెస్టిండీస్ తమ సొంత గడ్డపై దక్షిణాఫ్రికాతో ఆరు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తలపడుతోంది. ఈ క్రమంలో జమైకా వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో 28 పరుగుల తేడాతో విండీస్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. వెస్టిండీస్ బ్యాటర్లలో కెప్టెన్ బ్రాండెన్ కింగ్(79) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. మైర్స్(34), ఛేజ్(32) పరుగులతో రాణించారు. సఫారీ బౌలర్లలో ఫెహ్లుక్వాయో, బార్ట్‌మన్ తలా 3 వికెట్లు పడగొట్టగా.. కొయిట్జీ ఒక్క వికెట్ సాధించారు. అనంతరం 176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా.. 19.5 ఓవర్లలో 147 పరుగులకే ఆలౌటైంది. ఓపెనర్ రీజా హెండ్రిక్స్(87) పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడినప్పటకి.. మిగితా బ్యాటర్ల నుంచి సహకారం లభించకపోవడంతో ప్రోటీస్ జట్టు ఓటమి పాలైంది. కరేబియన్ బౌలర్లలో ఫోర్డే, మోటీ తలా మూడు వికెట్లు పడగొట్టగా.. మెకాయ్ రెండు, ఛేజ్, జోషఫ్ చెరో వికెట్ సాధించారు. -
అదే 26 పరుగులు.. శాసించిన చివరి ఓవర్
టి20 క్రికెట్లో మ్యాచ్ పరిస్థితులు ఎప్పుడు ఎలా ఉంటాయో ఎవరు ఊహించరు. ఓవర్ ఓవర్‌కు ఫలితాలు మారుతాయి కాబట్టే పొట్టి క్రికెట్‌కు అంత ఆదరణ దక్కింది. కొన్ని జట్లు ఒక్క పరుగుతో ఓడిపోయిన సందర్భాలు చూసే ఉంటారు. కానీ తొలి ఇన్నింగ్స్‌లో చివరి ఓవర్లో పరుగుల పండగ చేసుకున్న జట్టు.. ఆ ఓవర్లో వచ్చిన పరుగులతోనే మ్యాచ్ విజయాన్ని శాసించడం అరుదుగా చూస్తుంటాం. అలాంటి ఫీట్ సౌతాఫ్రికా, వెస్టిండీస్‌ల మధ్య జరిగిన మూడో టి20లో నమోదైంది. మంగళవారం జోహన్నెస్‌బర్గ్ వేదికగా జరిగిన మూడో టి20లో సౌతాఫ్రికా ఏడు పరుగుల తేడాతో ఓటమి పాలయ్యింది. 220 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ప్రొటిస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 213 పరుగులు మాత్రమే చేయగలిగింది. రీజా హెండ్రిక్స్(44 బంతుల్లో 83, 11 ఫోర్లు, 2 సిక్సర్లు) సంచలన ఇన్నింగ్స్‌కు తోడుగా.. ఐడెన్ మార్ర్కమ్ 18 బంతుల్లో 35 నాటౌట్ రాణించినప్పటికి సౌతాఫ్రికాను గెలిపించలేకపోయాడు. ఆఖరి ఓవర్లో 26 పరుగులు అవసరమైన దశలో సౌతాఫ్రికా 17 పరుగులు మాత్రమే చేయగలిగింది. విండీస్ బౌలర్లలో అల్జారీ జోసెఫ్ ఐదు వికెట్లతో రాణించాడు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ నష్టానికి 220 పరుగులు చేసింది. తొలుత బ్రాండన్ కింగ్ 25 బంతుల్లో 36, నికోలస్ పూరన్ 19 బంతుల్లో 41 పరుగులు చేశారు. చివర్లో రొమారియో షెపర్డ్ 22 బంతుల్లో 44 పరుగులు నాటౌట్, అల్జారీ జోసెఫ్ 9 బంతుల్లో 14 నాటౌట్ విధ్వంసం సృష్టించారు. ఆఖరి ఓవర్లో 26 పరుగులు.. 19 ఓవర్లు ముగిసేసరికి వెస్టిండీస్ 8 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. స్ట్రైక్ తీసుకున్న షెపర్డ్ పూనకం వచ్చినట్లుగా చెలరేగిపోయాడు. తొలి బంతికి రెండు పరుగులు తీసిన షెపర్డ్ వరుసగా నాలుగు బంతుల్లో రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు బాదాడు. ఇక ఆఖరి బంతికి రెండు పరుగులు రావడంతో ఆ ఓవర్లో 26 పరుగులు వచ్చాయి. చిత్రంగా వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో ఆఖరి ఓవర్లో 26 పరుగులు బాదితే.. టార్గెట్‌లో సౌతాఫ్రికాకు ఆఖరి ఓవర్లో అదే 26 పరుగులు అవసరం అయ్యాయి. అయితే తొలి ఇన్నింగ్స్ కాబట్టి ఒత్తిడి ఉండదు.. కానీ రెండో ఇన్నింగ్స్‌లో ఒత్తిడి ప్రొటిస్ విజయాన్ని దెబ్బతీసింది.ఈ విజయంతో వెస్టిండీస్ 2-1 తేడాతో టి20 సిరీస్‌ను కైవసం చేసుకుంది. దాదాపు 8 ఏళ్ల తర్వాత సౌతాఫ్రికా గడ్డపై విండీస్ జట్టు టి20 సిరీస్‌ను గెలవడం విశేషం. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా అల్జారీ జోసెఫ్ నిలవగా.. జాన్సన్ చార్లెస్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు. West Indies vs South Africa 3rd T20 highlight WI 220-8(20)/213-6(20)SA#Highlights #SAvsWI #3rdt20 Watch full highlight on YouTube 👇https://t.co/tZW9e0Hbqc 1k subscribers Kara do yarr🙏 Share please #cricket pic.twitter.com/VJELBSzoVL — cricket kida (@cricket_kida1) March 29, 2023 First SERIES WIN as CAPTAIN! Thanks to all involved, until next time South Africa 🇿🇦.#Rpowell52 pic.twitter.com/703d9d74Wy — Rovman Powell (@Ravipowell26) March 29, 2023 చదవండి: చేసిందే తప్పు.. వేలు చూపిస్తూ అసభ్య ప్రవర్తన -
ఆల్‌టైమ్ పర్ఫెక్ట్ టీ20 మ్యాచ్.. డజన్‌కు పైగా రికార్డులు బద్దలు
సౌతాఫ్రికా-వెస్టిండీస్ జట్ల మధ్య నిన్న (మార్చి 26) జరిగిన రసవత్తర మ్యాచ్ పొట్టి ఫార్మాట్లో పర్ఫెక్ట్ మ్యాచ్‌గా అభివర్ణిస్తున్నారు విశ్లేషకులు. హోరీహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు పోటాపోటీగా పరుగులు సాధించడంతో పాటు అదే స్థాయిలో రికార్డులు కూడా కొల్లగొట్టారు. ఇరు జట్ల ధాటికి నిన్నటి మ్యాచ్‌లో డజన్‌కు పైగా రికార్డులు బద్దలయ్యాయి. ఆ రికార్డులేవంటే.. అంతర్జాతీయ టీ20ల్లో హైయెస్ట్ సక్సెస్ఫుల్ రన్ ఛేజ్ (సౌతాఫ్రికా- 259 టార్గెట్) అంతర్జాతీయ టీ20ల్లో వెస్టిండీస్ అత్యధిక టీమ్ స్కోర్- 258/5 అంతర్జాతీయ టీ20ల్లో సౌతాఫ్రికా అత్యధిక టీమ్ స్కోర్- 259/4 అంతర్జాతీయ టీ20ల్లో ఓ మ్యాచ్‌లో అత్యధిక పరుగులు- 517 అంతర్జాతీయ టీ20ల్లో ఓ మ్యాచ్‌లో అత్యధిక బౌండరీలు- 81 అంతర్జాతీయ టీ20ల్లో ఓ మ్యాచ్‌లో అత్యధిక సిక్సర్లు- 35 అంతర్జాతీయ టీ20ల్లో బౌండరీల ద్వారా ఓ మ్యాచ్‌లో అత్యధిక పరుగులు- 394 వెస్టిండీస్ తరఫున ఫాస్టెస్ట్ టీ20 హండ్రెడ్- జాన్సన్ చార్లెస్ (39 బంతుల్లో) సౌతాఫ్రికా తరఫున ఫాస్టెస్ట్ ఫిఫ్టి- క్వింటన్ డికాక్ (15 బంతుల్లో) పవర్ ప్లే (6 ఓవర్లు)లో అత్యధిక టీమ్ టోటల్- 102/0 (సౌతాఫ్రికా) అంతర్జాతీయ టీ20ల్లో వేగంగా 200 పరుగులు పూర్తి చేసిన జట్టు (సౌతాఫ్రికా-13.5 ఓవర్లలో) మొదటి 10 ఓవర్లలో అత్యధిక పరుగులు చేసిన జట్టు (సౌతాఫ్రికా-149) -
చరిత్ర సృష్టించిన డికాక్.. టీ20ల్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ!
అంతర్జాతీయ టీ20ల్లో దక్షిణాఫ్రికా స్టార్ ఓపెనర్ క్వింటన్ డికాక్ అరుదైన ఘనత సాధించాడు. టీ20ల్లో అత్యంత వేగవంతంగా హాఫ్ సెంచరీ చేసిన దక్షిణాఫ్రికా ఆటగాడిగా డికాక్ రికార్డు సృష్టించాడు. ఆదివారం సెంచూరియన్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన రెండో టీ20లో.. కేవలం 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్క్ అందుకున్న డికాక్ ఈ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. ఇక ఓవరాల్‌గా ప్రపంచక్రికెట్లో ఈ ఘనత సాధించిన జాబితాలో డికాక్ ఐదో స్థానంలో నిలిచాడు. తొలి స్థానంలో టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ ఉన్నాడు. 2007 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో యువీ కేవలల 12 బంతుల్లోనే అర్ధసెంచరీ సాధించాడు. ఇక రెండో టీ20లో డికాక్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. 44 బంతులు ఎదుర్కొన్న డికాక్ 9 పోర్లు, 8 సిక్స్‌ల సాయంతో 100 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో విండీస్‌పై దక్షిణాఫ్రికా రికార్డు విజయం సాధించింది. 259 పరుగుల లక్ష్యాన్ని 18.5 ఓవర్లలోనే ఛేదించి దక్షిణాఫ్రికా ప్రపంచరికార్డు సృష్టించింది. చదవండి: SA vs WI: టీ20 మ్యాచ్‌లో 517 పరుగులు.. దెబ్బకు ప్రపంచ రికార్డు బద్దలు! ఇదే తొలిసారి That was special 🔥#SAvWI #BePartOfIt pic.twitter.com/rruu4aYa0h — Proteas Men (@ProteasMenCSA) March 26, 2023 -
టీ20 మ్యాచ్‌లో 517 పరుగులు.. దెబ్బకు ప్రపంచ రికార్డు బద్దలు
సెంచూరియన్ వేదికగా దక్షిణాఫ్రికా-వెస్టిండీస్ జట్ల మధ్య జరిగిన రెండో టీ20లో పరుగుల వరద పారింది. ఇరు జట్ల ఆటగాళ్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. సూపర్‌స్పోర్ట్ పార్క్ మైదానంలో బౌండరీల వర్షం కురిపించారు. ఈ మ్యాచ్‌లో రెండు జట్లు కలిపి ఏకంగా 517 పరుగులు సాధించాయి. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 258 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం 259 పరుగుల లక్ష్యాన్ని 18.5 ఓవర్లలోనే ఛేదించి దక్షిణాఫ్రికా ప్రపంచరికార్డు సృష్టించింది. టీ20 క్రికెట్ చరిత్రలోనే అత్యధిక టార్గెట్‌ను ఛేజ్ జట్టుగా సౌతాఫ్రికా నిలిచింది. అంతకుముందు ఈ రికార్డు ఆస్ట్రేలియా (245/5) జట్టు పేరిట ఉంది. 2018లో న్యూజిలాండ్ జట్టుతో (20 ఓవర్లలో 243/6)తో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఈ రికార్డు నమోదు చేసింది. కాగా ప్రోటీస్ ఇన్నింగ్స్‌లో క్వింటన్ డి కాక్ (44 బంతుల్లో 100; 9 ఫోర్లు, 8 సిక్స్‌లు) దూకుడుగా ఆడి 43 బంతుల్లో శతకం బాదగా, హెన్డ్రిక్స్ (28 బంతుల్లో 68; 11 ఫోర్లు, 2 సిక్స్‌లు) అండగా నిలిచాడు. ప్రపంచ రికార్డు సృష్టించిన విండీస్-దక్షిణాఫ్రికా మ్యాచ్ ఇక పరుగుల సునామీ సృష్టించిన విండీస్-దక్షిణాఫ్రికా రెండో టీ20 మ్యాచ్ మరో ప్రపంచ రికార్డును కూడా నమోదు చేసింది. టీ20 క్రికెట్ చరిత్రలోనే రెండు ఇన్నింగ్స్‌లు కలిపి అత్యధిక పరుగులు నమోదైన మ్యాచ్‌గా ఈ రెండో టీ20 నిలిచింది. ఈ మ్యాచ్‌లో విండీస్-ప్రోటీస్ జట్లు కలిపి 517 పరుగులు సాధించాయి. ఇంతకుముందు ఈ రికార్డు పాకిస్తాన్ సూపర్ లీగ్-2023లో భాగంగా క్వెట్టా గ్లాడియేటర్స్ , ముల్తాన్ సుల్తాన్స్ మధ్య జరిగిన మ్యాచ్ పేరిట ఉండేది. ఈ మ్యాచ్‌లో రెండు జట్లు కలిపి 515 పరుగులు చేశాయి. తాజా మ్యాచ్‌లో విధ్వంసం సృష్టించిన విండీస్,దక్షిణాఫ్రికా జట్లు ఈ ప్రపంచ రికార్డును బ్రేక్ చేశాయి. చదవండి: SA vs WI: చరిత్ర సృష్టించిన దక్షిణాఫ్రికా.. ప్రపంచంలోనే తొలి జట్టుగా 🚨 RESULT | SOUTH AFRICA WIN BY 6 WICKETS Records were broken as Quinton de Kock's maiden T20I century set the #Proteas on their way to chasing down a mammoth 259-run target - with 7 balls remaining - to level the KFC T20I series#SAvWI #BePartOfIt pic.twitter.com/XMJnBL6p5r — Proteas Men (@ProteasMenCSA) March 26, 2023 That was special 🔥#SAvWI #BePartOfIt pic.twitter.com/rruu4aYa0h — Proteas Men (@ProteasMenCSA) March 26, 2023 -
చరిత్ర సృష్టించిన దక్షిణాఫ్రికా.. ప్రపంచంలోనే తొలి జట్టుగా
అంతర్జాతీయ టీ20ల్లో దక్షిణాఫ్రికా సరి కొత్త చరిత్ర సృష్టించింది. టీ20ల్లో అత్యధిక టార్గెట్ ఛేదించిన జట్టుగా దక్షిణాఫ్రికా నిలిచింది. వెస్టిండీస్‌తో జరిగిన రెండో టీ20లో 259 పరుగుల లక్ష్యాన్ని చేజ్ చేసిన ప్రోటీస్.. ఈ ప్రపంచ రికార్డును తమ పేరిట లిఖించుకుంది. అంతకుముందు ఈ రికార్డు ఆస్ట్రేలియా పేరిట ఉండేది. 2018లో ఆక్లాండ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన టీ20లో 245 పరుగుల టార్గెట్‌ను ఆస్ట్రేలియా ఛేజ్ చేసింది. ఇప్పటివరకు ఇదే అత్యధిక ఛేజింగ్ కాగా.. తాజా మ్యాచ్‌తో ప్రోటీస్ ఆసీస్ రికార్డును బ్రేక్ చేసింది. 259 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా.. 18.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ప్రోటీస్ బ్యాటర్లలో క్వింటన్ డికాక్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. 44 బంతులు ఎదుర్కొన్న డికాక్ 9 ఫోర్లు, 8 సిక్స్‌ల సాయంతో 100 పరుగులు చేశాడు. డికాక్‌తో పాటు మరో ఓపెనర్ రెజా హెండ్రిక్స్ (28 బంతుల్లో 68 పరుగులు) కూడా కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఆఖరిలో కెప్టెన్ మార్క్రమ్ 38 పరుగులతో ఆజేయంగా నిలిచి తమ జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు. ఇక అంతకుముందు బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్.. జాన్సన్(118) అద్బుతమైన సెంచరీ చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 258 పరుగులు సాధించింది. చార్లెస్ కేవలం 39 బంతుల్లోనే సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. చదవండి: WI vs SA: వెస్టిండీస్ క్రికెటర్ విధ్వంసకర శతకం.. కేవలం 39 బంతుల్లోనే! -
చరిత్ర సృష్టించిన వెస్టిండీస్.. ప్రపంచ రికార్డు సమం!
సెంచూరియన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టీ20లో వెస్టిండీస్ విధ్వంసం సృష్టించింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి ఏకంగా 258 పరుగుల భారీ స్కోర్ సాధించింది. విండీస్ బ్యాటర్లలో జాన్సన్ చార్లెస్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. 39 బంతుల్లోనే చార్లెస్ సెంచరీ సాధించాడు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో 46 బంతులు ఎదుర్కొన్న చార్లెస్ 118 పరుగులు చేశాడు. అతడు ఇన్నింగ్స్‌లో ఏకంగా 10 ఫోర్లు, 11 సిక్స్‌లు ఉన్నాయి. చార్లెస్‌తో పాటు ఓపెనర్ కైల్ మైర్స్ 51 పరగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఆఖరిలో షెపర్డ్ 18 బంతుల్లో 41) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ప్రోటీస్ బౌలరల్లో జానెసన్ మూడు వికెట్లు,పార్నెల్ రెండు వికెట్లు సాధించారు. వెస్టిండీస్ ప్రపంచ రికార్డు.. కాగా ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ తమ ఇన్నింగ్స్‌లో ఏకంగా 22 సిక్స్‌లు నమోదు చేసింది. తద్వారా విండీస్ ఓ అరుదైన ఘనత సాధించింది. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక సిక్స్‌లు బాదిన ఆఫ్గానిస్తాన్ రికార్డును వెస్టిండీస్ సమం చేసింది. 2019లో ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆఫ్గానిస్తాన్ కూడా 22 సిక్స్‌లు బాదింది. ఆ తర్వాతి స్ధానంలో కూడా విండీస్‌నే ఉంది. 2016లో భారత్‌తో జరిగిన టీ20లో విండీస్ 21 సిక్స్‌లు కొట్టింది. చదవండి: WI vs SA: వెస్టిండీస్ క్రికెటర్ విధ్వంసకర శతకం.. కేవలం 23 బంతుల్లోనే! -
వెస్టిండీస్ క్రికెటర్ విధ్వంసకర శతకం.. కేవలం 39 బంతుల్లోనే!
సెంచూరియన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరగుతున్న రెండో టీ20లో వెస్టిండీస్ స్టార్ బ్యాటర్ జాన్సన్ చార్లెస్ విధ్వంసం సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో చార్లెస్ కేవలం 39 బంతుల్లోనే అద్భుతమైన సెంచరీ సాధించాడు. విండీస్ ఇన్నింగ్స్ తొలి ఓవర్లో కింగ్ ఔటయ్యక క్రీజులోకి వచ్చిన చార్లెస్.. మొదటి బంతి నుంచే ప్రోటీస్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఫోర్లు, సిక్సర్లతో బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో 46 బంతులు ఎదుర్కొన్న చార్లెస్ 118 పరుగులు చేశాడు. అతడు ఇన్నింగ్స్‌లో ఏకంగా 10 ఫోర్లు, 11 సిక్స్‌లు ఉన్నాయి. 23 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్న ఈ కరీబియన్.. అనంతరం మరో 16 బంతుల్లోనే సెంచరీ మార్క్‌ను పూర్తిచేశాడు. ఇక 39 బంతుల్లో విధ్వంసకర శతకం సాధించిన చార్లెస్ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. చార్లెస్ సాధించిన రికార్డులు ఇవే.. అంతర్జాతీయ టీ20ల్లో అత్యంత వేగవంతంగా సెంచరీ సాధించిన వెస్టిండీస్ క్రికెటర్‌గా చార్లెస్ నిలిచాడు. అంతకుముందు ఈ రికార్డు విండీస్ విధ్వంసకర ఆటగాడు క్రిస్ గేల్ పేరిట ఉండేది. 2016లో ముంబై వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన టీ20లో గేల్ 47 బంతుల్లో సెంచరీ సాధించాడు. ఇక తాజా మ్యాచ్‌లో 39 బంతుల్లోనే సెంచరీ సాధించిన చార్లెస్.. గేల్ రికార్డు బ్రేక్ చేశాడు. ►అదే విధంగా విదేశీ గడ్డపై అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన విండీస్ క్రికెటర్‌గా చార్లెస్(118) నిలిచాడు. అంతకుముందు ఈ రికార్డు కూడా క్రిస్ గేల్ పేరిటే ఉండేది. 2007లో దక్షిణాఫ్రికా పైనే గేల్ 117 పరుగులు సాధించాడు. ►ఇక ప్రపంచ క్రికెట్లో టీ20ల్లో అత్యంత వేగవంతంగా సెంచరీ చేసిన నాలుగో ఆటగాడిగా చార్లెస్ నిలిచాడు .అంతకుముందు ప్రోటీస్ బ్యాటర్ డేవిడ్ మిల్లర్ 35 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. విండీస్ భారీ స్కోర్ ఇక చార్లెస్ అద్భుత ఇన్నింగ్స ఫలితంగా విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 258 పరుగులు సాధించింది. చార్లెస్‌తో పాటు ఓపెనర్ కైల్ మైర్స్ 51 పరగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఆఖరిలో షెపర్డ్ 18 బంతుల్లో 41) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ప్రోటీస్ బౌలరల్లో జానెసన్ మూడు వికెట్లు,పార్నెల్ రెండు వికెట్లు సాధించారు. -
చెత్త రికార్డు సమం చేసిన డికాక్
మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా సెంచూరియన్ వేదికగా సాతాఫ్రికాతో నిన్న (మార్చి 25) జరిగిన తొలి మ్యాచ్‌లో పర్యాటక వెస్డిండీస్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. వర్షం అంతరాయం కలిగించడంతో 11 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 8 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేయగా.. విండీస్ మరో 3 బంతులు మిగిలుండగానే 7 వికెట్లు కోల్నోయి లక్ష్యాన్ని ఛేదించింది. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో డేవిడ్ మిల్లర్ (22 బంతుల్లో 48; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌తో విరుచుకుపడగా.. విండీస్‌ను కెప్టెన్ రోవ్‌మన్ పావెల్ (18 బంతుల్లో 43; ఫోర్, 5 సిక్సర్లు) అజేయమై విధ్వంసకర ఇన్నింగ్స్‌తో విజయతీరాలకు చేర్చాడు. కాగా, ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా వికెట్‌కీపర్,బ్యాటర్ క్వింటన్ డికాక్ ఓ చెత్త రికార్డును సమం చేశాడు. ఈ మ్యాచ్‌లో తొలి బంతికే ఔటైన (గోల్డన్ డక్) డికాక్.. సౌతాఫ్రికా తరఫున టీ20ల్లో అత్యధిక సార్లు డకౌట్ అయిన ఆటగాడిగా జేపీ డుమినీ, ఆండైల్ ఫెలుక్వాయో సరసన చేరాడు. వీరు ముగ్గురు టీ20ల్లో 6 సార్లు డకౌటయ్యారు. ఇదిలా ఉంటే, 2 టెస్ట్‌లు, 3 వన్డేలు, 3 టీ20ల సిరీస్‌లు ఆడేందుకు సౌతాఫ్రికాలో పర్యటిస్తున్న వెస్టిండీస్ జట్టు టెస్ట్ సిరీస్‌ను 0-2 తేడాతో కోల్పోగా.. వన్డే సిరీస్‌ను 1-1తో (వర్షం కారణంగా ఓ మ్యాచ్ రద్దైంది) సమం చేసుకుంది. తొలి టీ20లో విండీస్ గెలవడంతో 3 మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. -
తెలివైన క్రికెటర్.. 'క్యాచ్‌లందు ఈ క్యాచ్ వేరయా'
సౌతాఫ్రికా బౌలర్ అన్రిచ్ నోర్ట్జే తెలివైన క్యాచ్ అందుకున్నాడు. బహుశా క్రికెట్ చరిత్రలో ఇలాంటి క్యాచ్‌లు అరుదుగా చూస్తుంటాం. మాములుగా బౌండరీ లైన్ దగ్గర ఫీల్డర్లు క్యాచ్‌లు అందుకోవడంలో విన్యాసాలు చేస్తుంటారు. క్యాచ్ పట్టే క్రమంలో బ్యాలెన్స్ తప్పితే బంతిని గాల్లోకి విసిరి బౌండరీ లైన్ దాటి మళ్లీ లోపలికి వచ్చి క్యాచ్‌లు తీసుకోవడం చూస్తుంటాం. కానీ నోర్ట్జే కాస్త కొత్తగా, తెలివిగా ఆలోచించాడు. బ్యాటర్ బంతిని బారీ షాట్ కొట్టగానే బౌండరీ అవతలికి వెళ్లిపోయిన నోర్జ్టే బంతి గమనాన్ని చూసి మళ్లీ మైదానం లోపలికి వచ్చి క్యాచ్‌ను ఒడిసిపట్టుకున్నాడు. ఎలాంటి విన్యాసాలు లేకుండా స్మార్ట్‌గా నోర్ట్జే తీసుకున్న క్యాచ్‌కు క్రికెట్ ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో ఈ అద్భుతం చోటుచేసుకుంది. నోర్ట్జే ఆలోచన కాస్త కొత్తగా ఉండడంతో ''క్యాచ్‌లందు ఈ క్యాచ్ వేరయా'' అన్న క్యాప్షన్ సరిగ్గా సరిపోతుందని అభిమానులు పేర్కొన్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో వెస్టిండీస్ సంచలన విజయం సాధించింది. వర్షం కారణంగా ఈ మ్యాచ్‌ను 11 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. ప్రోటీస్ బ్యాటర్లలో డేవిడ్ మిల్లర్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. అతడు కేవలం 22 బంతుల్లోనే 48 పరుగులు సాధించాడు. మిల్లర్ ఇన్నింగ్స్‌లో 4 ఫోర్లు, 3 భారీ సిక్సర్లు ఉన్నాయి. విండీస్ బౌలర్లలో కాట్రల్, స్మిత్ తలా రెండు వికెట్లు సాధించగా.. జోషఫ్, హోస్సేన్, షెపర్డ్ చెరో వికెట్ సాధించారు. అనంతరం 132 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ 7 వికెట్లు కోల్పోయి మరో మూడు బంతులు మిగిలూండగానే ఛేదించింది. విండీస్ కెప్టెన్ రోవమన్ పావెల్(18 బంతుల్లో 42 పరుగులు) ఆఖరి వరకు క్రీజులో నిలిచి తమ జట్టుకు అద్భుతమైన విజయాన్ని అందించాడు. పావెల్‌తో పాటు చార్లెస్ (14 బంతుల్లో 28) పరుగులతో రాణించాడు. కాగా ప్రోటీస్ బౌలర్లలో మగాల మూడు వికెట్లు సాధించాడు. ఇక ఇరు జట్ల మధ్య రెండో టీ20 ఆదివారం జరగనుంది. @AnrichNortje02 Become The Superman What a catch 🔥 @DelhiCapitals #SAvsWIt20 📹 by FanCode pic.twitter.com/S3JntWA8qd — Mr Perfect 🤟🏻 (@starmanjeet007) March 25, 2023 చదవండి: బీచ్‌లో పరిగెడితే ఆట పట్టించారు.. కట్‌చేస్తే 'పరుగుల రాణి'గా నెదర్లాండ్స్ కలను నాశనం చేసిన జింబాబ్వే -
పావెల్ విధ్వంసం.. దక్షిణాఫ్రికాపై వెస్టిండీస్ సంచలన విజయం
సెంచూరియన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో వెస్టిండీస్ సంచలన విజయం సాధించింది. వర్షం కారణంగా ఈ మ్యాచ్‌ను 11 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. ప్రోటీస్ బ్యాటర్లలో డేవిడ్ మిల్లర్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. అతడు కేవలం 22 బంతుల్లోనే 48 పరుగులు సాధించాడు. మిల్లర్ ఇన్నింగ్స్‌లో 4 ఫోర్లు, 3 భారీ సిక్సర్లు ఉన్నాయి. విండీస్ బౌలర్లలో కాట్రల్, స్మిత్ తలా రెండు వికెట్లు సాధించగా.. జోషఫ్, హోస్సేన్, షెపర్డ్ చెరో వికెట్ సాధించారు. అనంతరం 132 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ 7 వికెట్లు కోల్పోయి మరో మూడు బంతులు మిగిలూండగానే ఛేదించింది. విండీస్ కెప్టెన్ రోవమన్ పావెల్(18 బంతుల్లో 42 పరుగులు) ఆఖరి వరకు క్రీజులో నిలిచి తమ జట్టుకు అద్భుతమైన విజయాన్ని అందించాడు. పావెల్‌తో పాటు చార్లెస్ (14 బంతుల్లో 28) పరుగులతో రాణించాడు. కాగా ప్రోటీస్ బౌలర్లలో మగాల మూడు వికెట్లు సాధించాడు. ఇక ఇరు జట్ల మధ్య రెండో టీ20 ఆదివారం జరగనుంది. చదవండి: SA vs WI: డేవిడ్ మిల్లర్ విధ్వంసం.. కేవలం 22 బంతుల్లోనే! -
SA vs WI: డేవిడ్ మిల్లర్ విధ్వంసం.. కేవలం 22 బంతుల్లోనే!
సెంచూరియన్ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టీ20లో దక్షిణాఫ్రికా బ్యాటర్ డేవిడ్ మిల్లర్ విధ్వంసం సృష్టించాడు. వర్షం కారణంగా 11 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో మిల్లర్.. కేవలం 22 బంతుల్లోనే 48 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లో 4 ఫోర్లు, 3 భారీ సిక్సర్లు ఉన్నాయి. ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన మిల్లర్ తన అద్బుత ఇన్నింగ్స్‌తో జట్టును అదుకున్నాడు. అతడితో పాటు ప్రోటీస్ పేసర్ మగాల మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 5 బంతులు ఎదుర్కొన్న మగాల 2 సిక్స్‌లు, ఒక్క ఫోరు సాయంతో 18 పరుగులు చేశాడు. ఇక వీరిద్దరి అద్భుత ఇన్నింగ్స్‌ల ఫలితంగా దక్షిణాఫ్రికా నిర్ణీత 11 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. విండీస్ బౌలర్లలో కాట్రల్, స్మిత్ తలా రెండు వికెట్లు సాధించగా.. జోషఫ్, హోస్సేన్, షెపర్డ్ చెరో వికెట్ సాధించారు. చదవండి: IPL 2023: ఐపీఎల్‌కు ముందు సన్‌రైజర్స్ బ్యాటర్ సిక్సర్ల వర్షం.. వీడియో వైరల్ -
క్లాసెన్ విశ్వరూపం; 29 ఓవర్లలోనే టార్గెట్‌ను ఊదేశారు
మంగళవారం వెస్టిండీస్‌తో జరిగిన మూడో వన్డేలో సౌతాఫ్రికా నాలుగు వికెట్ల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. విండీస్ విధించిన 261 పరుగుల టార్గెట్‌ను కేవలం 29.3 ఓవర్లలోనే ఉదేశారు. హెన్రిచ్ క్లాసెన్ (61 బంతుల్లో 119 పరుగులు నాటౌట్, 15 ఫోర్లు, 5 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడి సౌతాఫ్రికాకు ఘన విజయాన్ని కట్టబెట్టాడు. అతనికి తోడుగా మార్కో జాన్సెన్ 43, ఐడెన్ మార్క్రమ్ 25 పరుగులు చేశారు. ఒక దశలో 87 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఇక మ్యాచ్ విండీస్ వైపు అనుకున్న తరుణంలో క్లాసెన్ తన విశ్వరూపాన్ని చూపెట్టాడు. 12.1 ఓవర్లలో 87/4గా ఉన్న స్కోరు 29.3 ఓవర్లలో 264/6గా మారింది. అంటే కేవలం 17.1 ఓవర్లలో సౌతాఫ్రికా 177 పరుగులు చేసింది. దీన్నిబట్లే క్లాసెన్ విధ్వంసం ఏ మేరకు సాగిందో అర్థం చేసుకోవచ్చు. క్లాసెన్ దాటికి సౌతాఫ్రికా ఇన్నింగ్స్ ఓవర్‌కు 8.90 రన్‌రేట్‌తో ఇన్నింగ్స్ కొనసాగడం విశేషం. వన్డేల్లో భాగంగా చేజింగ్‌లో రన్‌రేట్ పరంగా సౌతాఫ్రికా ఇదే అత్యుత్తమం. ఇంతకముందు 2006లో ఆస్ట్రేలియాపై వాండరర్స్ వేదికగా జరిగిన వన్డేలో 435 పరుగుల లక్ష్యాన్ని 8.78 రన్‌రేట్‌తో 49.5 ఓవర్లలో చేధించడం ఇప్పటివరకు అత్యుత్తమంగా ఉంది. తాజాగా ఆ రికార్డును సవరించింది. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 48.2 ఓవర్లలో 260 పరుగులకు ఆలౌటైంది. బ్రాండన్ కింగ్ 72 పరుగులతో టాప్‌స్కోరర్ కాగా.. జాసన్ హోల్డర్ 36, నికోలస్ పూరన్ 39 పరుగులు చేశారు. ప్రొటీస్ బౌలర్లలో గెరాల్డ్ కోర్ట్జే, ఫోర్టున్, మార్కో జాన్సెన్లు తలా రెండు వికెట్లు తీశారు. masss batting display 💥🥵 by klaassen hundred in just 54 balls🔥#SAvsWI#OrangeFireIdhi pic.twitter.com/NuZVmwZlQB — notnot7 (@lostcause4aid) March 21, 2023 చదవండి: అన్నింటా విఫలం.. కెప్టెన్‌గా పనికిరాదా? -
సెంచరీల మీద సెంచరీలు బాదుతూ జాత్యాహంకారుల నోళ్లు మూయించిన ధీరుడు
SA VS WI 2nd ODI: జాతి వివక్ష.. వర్ణ భేదం.. ఆహార్యంపై వెకిలి మాటలు..జాతీయ జట్టుకు సారధి అయినప్పటికీ, సొంతవారి నుంచే వ్యతిరేకత.. ఇలా చెప్పుకుంటూ పోతే వర్ణించరాని ఎన్నో కష్టాలు, అవమానాలు, ఆటుపోట్లను ఎదుర్కొన్న సౌతాఫ్రికా టెస్ట్, వన్డే జట్టు సారధి టెంబా బవుమా.. అవకాశం దొరికిన ప్రతిసారి తనను విమర్శించిన వారికి తన ఆటతీరుతో బదులిస్తున్నాడు. పేలవ ఫామ్ కారణంగా ఇటీవలే టీ20 కెప్టెన్సీని కోల్పోయిన బవుమా.. ప్రస్తుతం కెరీర్ అత్యుత్తమ ఫామ్‌లో కొనసాగుతున్నాడు. తాజాగా స్వదేశంలో వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో విధ్వంసకర శతకంతో (118 బంతుల్లో 144; 11 ఫోర్లు, 7 సిక్సర్లు) విజృంభించిన బవుమా.. అంతర్జాతీయ క్రికెట్లో వరుసగా రెండో శతకాన్ని (విండీస్‌తో రెండో టెస్ట్‌లో 172) బాదాడు. బవుమాకు గత 3 వన్డేల్లో ఇది రెండో శతకం. ఈ మ్యాచ్‌కు ముందు ఇంగ్లండ్‌తో జరిగిన మూడో వన్డేలో 35 పరుగులు చేసిన బవుమా అంతకుముందు జరిగిన రెండో వన్డేలో 109 పరుగులు చేశాడు. వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్ట్ రెండు ఇన్నింగ్స్‌ల్లో డకౌట్ కావడంతో తీవ్ర విమర్శలను ఎదుర్కొన్న బవుమాను ఓ దశలో టెస్ట్ కెప్టెన్సీ నుంచి తప్పించాలని కొందరు జాత్యాహంకారులు డిమాండ్ చేశారు. బవుమా సౌతాఫ్రికా కెప్టెన్ కావడం ఇష్టం లేని కొందరు అతను ఒక్క మ్యాచ్‌లో విఫలమైనా పని కట్టుకుని మరీ విమర్శలు చేసేవారు. అలాంటి వారికి బవుమా ప్రతిసారి తన బ్యాట్‌తో సమాధానం చెప్తూ వస్తున్నాడు. తాజా సెంచరీతో బవుమా తన జట్టును గెలిపించలేకపోయినా.. అద్భుతమైన పోరాటపటిమ, ఆటతీరుతో విమర్శకుల ప్రశంసలను అందుకున్నాడు. విండీస్‌తో రెండో వన్డేలో శైలీకి భిన్నంగా 7 భారీ సిక్సర్లు బాదిన బవుమా విమర్శకులు ముక్కునవేళ్లేసుకునేలా చేశాడు. ఈ మ్యాచ్‌లో భారీ షాట్లతో పాటు మాస్టర్ క్లాస్ ఆటను ఆడిన బవుమా..సొగసైన బౌండరీలు కొట్టి, స్ట్రయిక్ రొటేట్ చేస్తూ బెస్ట్ వన్డే నాక్ ఆడాడు. కెరీర్ ఆరంభం నుంచే జాత్యాహంకారులకు టార్గెట్‌గా మారిన బవుమా.. ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నా, ఏమాత్రం నిరుత్సాహానికి లోను కాకుండా ప్రతిసారి బ్యాట్‌తో సమాధానం చెప్పడం యావత్ క్రికెట్ ప్రపంచాన్ని ఆకట్టుకుంటుంది. క్లిష్ట సమయంలో ముళ్ల కిరీటం లాంటి సౌతాఫ్రికన్ కెప్టెన్సీని చేపట్టిన బవుమా.. సారధిగానూ అద్భుతంగా రాణిస్తున్నప్పటికీ, సహచరుల నుంచి సరైన మద్దతు లభించడం లేదని స్పష్టంగా తెలుస్తోంది. సౌతాఫ్రికా కెప్టెన్‌గా నియమితుడైన మొట్టమొదటి బ్లాక్ అఫ్రికన్ అయిన బవుమా.. సౌతాఫ్రికా తరఫున టెస్ట్‌ల్లో సెంచరీ చేసిన తొలి నల్లజాతీయుడిగా, వన్డే అరంగేట్రంలో సెంచరీ చేసిన తొలి సౌతాఫ్రికన్‌గా పలు రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు. కాగా, సౌతాఫ్రికాలో జాతి వివక్ష గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. నెల్సన్ మండేలా ఎందు కోసం పోరాడాడో యావత్ ప్రపంచం చూసింది. కాలంలో ఎన్ని మార్పులు వస్తున్నా ఇంకా కొంత మంది సౌతాఫ్రికన్లలో జాత్యాహంకారం బీజాలు పోలేదు. ఈ వరుస సౌతాఫ్రికా క్రికెట్లో ఇంకా కొనసాగుతూనే ఉంది. జాత్యాహంకారానికి వ్యతిరేకంగా మోకాలిపై నిలబడాలని క్రికెట్ సౌతాఫ్రికా ఆదేశించినా ఆ జట్టు స్టార్ ఆటగాడు క్వింటన్ డికాక్‌తో పాటు కొందరు అలా చేసేందుకు నిరాకరించడం ఇందుకు నిదర్శనం. మున్ముందు ఇలా చేయాల్సి వస్తుందేమోనని డికాక్ ఏకంగా తన కెరీర్‌నే వదులుకునేందుకు సిద్ధపడ్డాడు. గతంలో సౌతాఫ్రికా జట్టులో బ్లాక్స్‌ను వ్యతిరేస్తూ కొందరు స్టార్ ఆటగాళ్లు ఏకంగా దేశం వదలి ఇతర దేశాలకు వలస వెళ్లిన సందర్భాలు ఉన్నాయి. బవుమా లాంటి ఆటగాళ్లు తమ టాలెంట్‌తో కెప్టెన్ స్థాయికి ఎదగడంతో కొందరు కడుపు మంటతో అనునిత్యం విమర్శలు చేస్తూనే ఉంటారు. నేషనల్ టీమ్‌కు కెప్టెన్ అయినప్పటికీ స్వదేశంలో ఇటీవల జరిగిన ఎస్ఏ20 లీగ్‌లో బవుమాను ఏ ఫ్రాంచైజీ తీసుకోకుండా ఘోరంగా అవమానించింది. రేసిజమ్ కారణంగా ఇలా జరిగిందని క్రికెట్ సర్కిల్స్‌లో ప్రచారం జరిగింది. ఆతర్వాత రీప్లేస్‌మెంట్‌గా బవుమాను ఓ ఫ్రాంచైజీ అక్కును చేర్చుకున్నప్పటికీ ఇది క్రికెట్ సౌతాఫ్రికాకు మాయని మచ్చగా మిగిలిపోతుంది. కెరీర్లో 56 టెస్ట్‌లు, 24 వన్డేలు, 33 టీ20లు ఆడిన బవుమా.. మొత్తంగా 4500 పైచిలుకు పరుగులు సాధించాడు. ఇందులో 2 టెస్ట్ శతకాలు, 20 అర్ధసెంచరీలు.. 4 వన్డే హండ్రెడ్స్, 2 ఫిఫ్టీలు.. ఓ టీ20 హాఫ్ సెంచరీ ఉన్నాయి. -
విండీస్ ఘన విజయం; కెప్టెన్ ఒక్కడే ఆడితే సరిపోదు
సౌతాఫ్రికాతో జరుగుతున్న వన్డే సిరీస్‌లో వెస్టిండీస్ శుభారంభం చేసింది. శనివారం జరిగిన రెండో వన్డేలో వెస్టిండీస్ 48 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 50 ఓవరల్లో 8 వికెట్ల నష్టానికి 335 పరుగులు చేసింది. మిడిలార్డర్ బ్యాటర్ షెయ్ హోప్ (115 బంతుల్లో 128 పరుగులు, 5 ఫోర్లు, ఏడు సిక్సర్లు) సెంచరీతో చెలరేగగా.. రోవ్‌మన్ పావెల్ 46, బ్రాండన్ కింగ్ 30, కైల్ మేయర్స్ 36 పరుగులు చేశారు. ప్రొటీస్ బౌలర్లలో గెరాల్డ్ కొట్జే మూడు వికెట్లు పడగొట్టగా.. ఫొర్టున్, షంసీ చెరో రెండు వికెట్లు తీశారు. అనంతరం 339 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా 41.4 ఓవర్లలో 287 పరుగులకు ఆలౌట్ అయింది. కెప్టెన్ బవుమా(118 బంతుల్లో 144 పరుగులు) తన కెరీర్లో ఎప్పటికి గుర్తుండిపోయే ఇన్నింగ్స్ ఆడాడు. అయితే కెప్టెన్ ఒక్కడే ఆడితే సరిపోదు.. డికాక్(48 పరుగులు) మినహా బవుమాకు సహకరించేవారు కరువయ్యారు. టోని డి జార్జీ 27 పరుగులు చేశాడు. విండీస్ బౌలర్లలో అకిల్ హొసెన్, అల్జారీ జోసెఫ్‌లు చెరో మూడు వికెట్లు తీయగా.. ఓడెన్ స్మిత్, యానిక్ కారియా, కైల్ మేయర్స్ తలా ఒక వికెట్ తీశారు. తొలి వన్డే వర్షార్పణం కావడంతో రెండో వన్డేలో గెలిచిన విండీస్ 1-0తో ఆధిక్యంలో ఉంది. ఇక చివరిదైన మూడో వన్డే మార్చి 21న(మంగళవారం) జరగనుంది. కెప్టెన్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్న షెయ్ హోప్‌ను ప్లేయర్ ఆఫ్ ది అవార్డు వరించింది. చదవండి: 36 బంతుల్లో 99 పరుగులు; ఒక్క పరుగు చేసుంటే చరిత్రలో -
SA Vs WI: జేసన్ హోల్డర్ ఒంటరి పోరాటం.. అయినా పాపం!
South Africa vs West Indies, 2nd Test- జొహన్నెస్‌బర్గ్: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్ 251 పరుగులకు ఆలౌటైంది. జేసన్ హోల్డర్ (117 బంతుల్లో 81 నాటౌట్; 8 ఫోర్లు, 4 సిక్స్‌లు) అజేయ అర్ధ సెంచరీతో జట్టును ఆదుకున్నాడు. ఇతర బ్యాటర్లలో కైల్ మేయర్స్ (29), రోస్టన్ ఛేజ్ (28), జొషువా డ సిల్వ (26) కొన్ని పరుగులు జోడించగలిగారు. సఫారీ బౌలర్లలో కోయెట్జీ 3 వికెట్లు పడగొట్టగా...రబడ, హార్మర్ చెరో 2 వికెట్లు తీశారు. దక్షిణాఫ్రికాకు తొలి ఇన్నింగ్స్‌లో 69 పరుగుల ఆధిక్యం లభించింది. అనంతరం రెండో రోజు ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా వికెట్ కోల్పోకుండా 4 పరుగులు చేసింది. అంతకు ముందు ఓవర్‌నైట్ స్కోరు 311/7తో ఆట కొనసాగించిన దక్షిణాఫ్రికా తమ మొదటి ఇన్నింగ్స్‌లో 320 పరుగులకు ఆలౌటైంది. కాగా రెండు టెస్టులు, మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లు ఆడేందుకు వెస్టిండీస్ సౌతాఫ్రికాలో పర్యటిస్తోంది. ఫిబ్రవరి 28న ఆరంభమైన టెస్టు సిరీస్‌లో భాగంగా ఆతిథ్య ప్రొటిస్ తొలి మ్యాచ్‌లో 87 పరుగుల తేడాతో విజయం సాధించింది. తద్వారా ఇప్పటికే 1-0తో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక మార్చి 8న మొదలైన రెండో టెస్టులోనూ విండీస్‌పై బవుమా బృందానిదే పైచేయిగా ఉంది. ఇదిలా ఉంటే.. మార్చి 16-21 వరకు వన్డే, మార్చి 25-28 వరకు సౌతాఫ్రికా- వెస్టిండీస్ మధ్య టీ20 సిరీస్ జరుగనుంది. చదవండి: Wanindu Hasaranga: పెళ్లి చేసుకున్న శ్రీలంక ఆల్‌రౌండర్.. ఫొటోలు వైరల్! Steve Smith: అంతా బాగానే ఉంది కానీ.. ఇదేంటి స్మిత్! మరీ ఇలా.. కెరీర్లో ఇదే తొలిసారి! -
మెరిసిన మార్క్రమ్ మామ.. సూపర్ ఫామ్ కొనసాగిస్తున్న సన్‌రైజర్స్ సారధి
జొహనెస్‌బర్గ్: దక్షిణాఫ్రికా టీ20 జట్టు కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్ సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. గత కొంతకాలంగా ఫార్మాట్లకతీతంగా విశ్వరూపం ప్రదర్శిస్తున్న మార్క్రమ్.. వెస్టిండీస్‌తో బుధవారం మొదలైన రెండో టెస్టులోనూ అదే జోరు కొనసాగించాడు. ఈ మ్యాచ్ తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 7 వికెట్లు కోల్పోయి 311 పరుగులు (తొలి ఇన్నింగ్స్) సాధించింది. మార్క్రమ్ (139 బంతుల్లో 96; 17 ఫోర్లు), టోనీ డి జార్జి (155 బంతుల్లో 86; 11 ఫోర్లు) అర్ధ సెంచరీలతో రాణించారు. మార్క్రమ్ 4 పరుగుల తేడాతో సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. తొలి వికెట్‌కు డీన్ ఎల్గర్ (54 బంతుల్లో 42; 7 ఫోర్లు)తో కలిసి 76 పరుగులు, రెండో వికెట్‌కు టోనీ డి జార్జితో 116 పరుగులు జోడించిన మార్క్రమ్.. క్రీజ్‌లో ఉన్నంత సేపు విండీస్ బౌలర్ల సహనాన్ని పరీక్షించాడు. సఫారీ బ్యాటర్లలో బవుమా (28), ర్యాన్ రికెల్టన్ (22), వియాన్ ముల్దర్ (12), సైమన్ హార్మర్ (1) తక్కువ స్కోర్‌కే పరిమితం కాగా, ఆట ముగిసే సమయానికి హెన్రిచ్ క్లాసెన్ (17), కేశవ్ మహారాజ్ క్రీజ్‌లో ఉన్నారు. విండీస్ బౌలర్లలో గుడకేశ్ మోటీ మూడు వికెట్లు, కైల్ మేయర్స్ రెండు వికెట్లు తీయగా.. అల్జరీ జోసఫ్, జేసన్ హోల్డర్ తలో వికెట్ దక్కించుకున్నారు. కాగా, 2 టెస్ట్‌లు, 3 వన్డేలు, 3 టీ20ల సిరీస్ కోసం సౌతాఫ్రికాలో పర్యటిస్తున్న విండీస్, టూర్లో భాగంగా జరిగిన తొలి టెస్ట్‌లో ఆతిధ్య జట్టు చేతిలో 87 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. -
WI vs SA: దక్షిణాఫ్రికాతో వైట్‌బాల్ సిరీస్.. క్రికెట్ వెస్టిండీస్ కీలక నిర్ణయం!
దక్షిణాఫ్రికాతో పరిమిత ఓవర్ల సిరీస్‌కు ముందు క్రికెట్ వెస్టిండీస్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ దేశ మాజీ లెగ్ స్పిన్నర్ శామ్యూల్ బద్రీని వారి కొత్త అసిస్టెంట్ కోచ్‌గా క్రికెట్ వెస్టిండీస్ నియమించింది. అయితే బద్రీ కేవలం దక్షిణాఫ్రికాతో జరిగే వైట్-బాల్ సిరీస్‌లో మాత్రమే తన సేవలందిస్తాడు. ప్రోటీస్ పర్యటన అనంతరం పూర్తి స్థాయి అసిస్టెంట్ కోచ్‌ను క్రికెట్ విండీస్ నియమించనుంది. కాగా బద్రీ గతంలో వెస్టిండీస్ స్పిన్-బౌలింగ్ సలహాదారుగా కూడా పనిచేశాడు. అదే విధంగా ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు స్పిన్ బౌలింగ్ కోచ్‌గా పని చేసిన అనుభవం కూడా బద్రీకి ఉంది. ఇక దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా విండీస్ రెండు టెస్టులు, మూడు వన్డేలు, మూడు టీ20ల వైట్‌బాల్ సిరీస్‌లో తలపడనుంది. ఇప్పటికే ప్రోటీస్ చేతిలో తొలి టెస్టులో ఓటమి చవిచూసిన విండీస్.. ఇప్పుడు రెండో టెస్టులో తాడోపేడో తెల్చుకోవడానికి సిద్దమైంది. విండీస్-ప్రోటీస్ మధ్య రెండో టెస్టు మార్చి8 నుంచి ప్రారంభమైంది. అదే విధంగా ఈస్ట్ లండన్ వేదికగా మార్చి 16న జరగనున్న తొలి వన్డేతో విండీస్ వైట్‌బాల్ టూర్ ప్రారంభం కానుంది. మరోవైపు ఈ సిరీస్‌ల నుంచే విండీస్ వన్డే, టీ20 కెప్టెన్లుగా షాయ్ హోప్,రోవ్‌మన్ పావెల్ తమ ప్రయాణాన్ని మొదలపెట్టనున్నారు. చదవండి: IND vs AUS: భారత్‌తో నాలుగో టెస్టు.. స్టీవ్ స్మిత్ కీలక నిర్ణయం! స్టార్ ఆటగాడికి నో ఛాన్స్ -
దక్షిణాఫ్రికా కొత్త కెప్టెన్‌గా స్టార్ క్రికెటర్.. బవుమాపై వేటు!
దక్షిణాఫ్రికా కొత్త టీ20 కెప్టెన్‌గా ఆ జట్టు స్టార్ బ్యాటర్ ఐడెన్ మార్క్రమ్ ఎంపికయ్యాడు. టెంబా బవుమా స్థానంలో తమ జట్టు కెప్టెన్‌గా మార్క్రమ్ను దక్షిణాఫ్రికా క్రికెట్ నియమించింది. ఇక బవుమా కేవలం వన్డేలు,టెస్టుల్లో మాత్రమే ప్రోటీస్ జట్టుకు సారథ్యం వహించనున్నాడు. అదే విధంగా వైట్‌బాల్ క్రికెట్లో తమ జట్టు బ్యాటింగ్ కోచ్‌గా మాజీ ఆటగాడు జేపీ డుమిని, బౌలింగ్ కోచ్‌గా రోరీ క్లీన్వెల్ట్ను దక్షిణాఫ్రికా క్రికెట్ ఎంపిక చేసింది. కాగా స్వదేశంలో వెస్టిండీస్‌తో జరగనున్న వన్డే, టీ20 సిరీస్‌లకు జట్టును ప్రకటించిన క్రికెట్ సౌతాఫ్రికా.. ఈ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇక ఇది ఇలా ఉండగా.. మాజీ కెప్టెన్ బవుమాను ఇకపై టీ20లకు పరిగణించకూడదని ప్రోటీస్ సెలక్టర్లు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మరోవైపు అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్న ప్రోటీస్ మాజీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్.. విండీస్ సిరీస్‌తో తిరిగి రీ ఎంట్రీ ఇస్తాడని వార్తలు వినిపించాయి. అయితే సెలక్టర్లు మాత్రం అతడి పునరాగమనంపై ఆసక్తి చూపకపోయినట్లు తెలుస్తోంది. అదే విధంగా ప్రోటీస్ పరిమిత ఓవర్ల హెడ్ కోచ్ రాబ్ వాల్టర్‌తో డుప్లెసిస్ జరిపిన చర్చలు కూడా విఫలమైనట్లు పలు నివేదికలు పేర్కొంటున్నాయి. ఇక జట్టు ఎంపిక విషయానికి వస్తే.. వన్డే సిరీస్‌కు స్టార్ పేసర్లు కగిసో రబాడ, అన్రిచ్ నోర్జేకు సెలక్టర్లు విశ్రాంతి ఇచ్చారు. యువ క్రికెటర్లు గెరాల్డ్ కోయెట్జీ, ర్యాన్ రికెల్టన్, టోనీ డి జోర్జి,ట్రిస్టన్ స్టబ్స్ కు తొలి సారి దక్షిణాఫ్రికా వన్డే జట్టులో చోటు దక్కింది. తొలి రెండు వన్డేలకు దక్షిణాఫ్రికా జట్టు: టెంబా బవుమా (కెప్టెన్), గెరాల్డ్ కోయెట్జీ, క్వింటన్ డి కాక్, టోనీ డి జోర్జి, జార్న్ ఫార్టుయిన్, రీజా హెండ్రిక్స్, సిసంద మగాలా, కేశవ్ మహరాజ్, వియాన్ ముల్డర్, లుంగీ ఎంగిడీ, ర్యాన్ రికెల్టన్, ఆండిలే స్టిల్బుబ్స్, ఫెహ్లుక్వేబ్స్, లిజాడ్ విలియమ్స్, రాస్సీ వాన్ డెర్ డస్సెన్. మూడో వన్డే కోసం జట్టు: టెంబా బావుమా (కెప్టెన్), గెరాల్డ్ కోయెట్జీ, క్వింటన్ డి కాక్, టోనీ డి జోర్జి, బ్జోర్న్ ఫోర్టుయిన్, రీజా హెండ్రిక్స్, మార్కో జాన్సెన్, హెన్రిచ్ క్లాసెన్, సిసంద మగల, కేశవ్ మహరాజ్, ఐడెన్ మార్క్రామ్, డేవిడ్ మిల్లర్ , లుంగి ఎం, ర్యాన్ రికెల్టన్, వేన్ పార్నెల్, ఆండిలే ఫెహ్లుక్వాయో, ట్రిస్టన్ స్టబ్స్, లిజాడ్ విలియమ్స్, రాస్సీ వాన్ డెర్ డ్యూసెన్. టీ20లకు ప్రోటీస్ జట్టు: ఐడెన్ మార్క్రామ్ (కెప్టెన్), క్వింటన్ డి కాక్, జార్న్ ఫోర్టుయిన్, రీజా హెండ్రిక్స్, మార్కో జాన్సెన్, హెన్రిచ్ క్లాసెన్, సిసంద మగాలా, డేవిడ్ మిల్లర్, లుంగి ఎన్గిడి, అన్రిచ్ నార్టే, వేన్ పార్నెల్, కగిసో రబాడ, రిలీ రోసోవ్, , ట్రిస్టన్ స్టబ్స్. -
వెస్టిండీస్‌తో రెండో టెస్టు.. దక్షిణాఫ్రికాకు ఊహించని షాక్!
వెస్టిండీస్‌తో రెండో టెస్టుకు ముందు దక్షిణాఫ్రికా బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ అన్రిచ్ నోర్జే గజ్జ గాయం కారణంగా రెండో టెస్టుకు దూరమయ్యాడు. సెంచూరియన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో గజ్జ నొప్పితో అతడు బాధపడ్డాడు. ఈ క్రమంలో అతడిని పరిశీలించిన ప్రొటీస్ వైద్య బృందం కనీసం వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించింది. దీంతో అతడిని రెండో టెస్టుకు ముందు దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు నుంచి రిలీజ్ చేసింది. ఇక విండీస్‌తో జరిగిన తొలి టెస్టులో 87 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా ఘన విజయం సాధించింది. ప్రోటీస్ విజయంలో నోర్జే కీలక పాత్ర పోషించాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లతో చెలరేగిన అన్రిచ్ .. రెండో ఇన్నింగ్స్‌లో కూడా ఒక వికెట్ సాధించాడు. ఇక గాయపడిన నోర్జే స్థానంలో ఆల్‌రౌండర్ విలియమ్ ముల్డర్ తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. ఇక ఇరు జట్ల మధ్య రెండో టెస్టు వాండరర్స్ వేదికగా మార్చి8 నుంచి ప్రారంభం కానుంది. దక్షిణాఫ్రికా తుది జట్టు(అంచనా): డీన్ ఎల్గర్, ఐడెన్ మార్క్రామ్, టోనీ డి జోర్జి, టెంబా బావుమా (కెప్టెన్), కీగన్ పీటర్సన్, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), సెనురన్ ముత్తుసామి, మార్కో జాన్సెన్, విలియ్ ముల్డర్, కగిసో రబడా, గెరాల్డ్ కోయెట్జీ చదవండి: Virat Kohli: సెంచరీ కరువైంది.. ఆ విషయం తెలుసు.. కానీ: ఆసీస్ దిగ్గజం -
విండీస్‌ను శాసించిన రబాడ.. తొలి టెస్టులో ఘన విజయం
వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టులో సౌతాఫ్రికా శుభారంభం చేసింది. సెంచూరియన్ వేదికగా ముగిసిన తొలి టెస్టులో ప్రొటీస్ 87 పరుగుల తేడాతో విజయం అందుకుంది. 246 పరుగుల టార్గెట్‌తో నాలుగో ఇన్నింగ్స్ ఆరంభించిన వెస్టిండీస్ 41 ఓవర్లలో 159 పరుగులకు ఆలౌటైంది. జెర్మెన్ బ్లాక్‌వుడ్ 79 పరుగులతో ఒంటరిపోరాటం చేయగా మిగతావారు విఫలమయ్యారు. కగిసో రబాడ ఆరు వికెట్లతో విండీస్ నడ్డి విరవగా.. మార్కో జాన్సెన్ రెండు, నోర్ట్జే , కోట్జే చెరొక వికెట్ తీశారు. అంతకముందు సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో 116 పరుగులకు ఆలౌట్ అయింది. ఇక తొలి ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికా 342 పరుగులకు ఆలౌట్ కాగా.. విండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 212 పరుగుల వద్ద ముగించడంతో సౌతాఫ్రికాకు 130 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించినట్లయింది. ఇక తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ, రెండో ఇన్నింగ్స్‌లో 47 పరుగులతో ఆకట్టుకున్న ఓపెనర్ మార్క్రమ్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఇరుజట్ల మధ్య రెండో టెస్టు మార్చి 8 నుంచి 12 వరకు జోహన్నెస్‌బర్గ్ వేదికగా జరగనుంది. చదవండి: టీమిండియా నిలబెట్టుకుంటే.. 141 ఏళ్ల రికార్డు బద్దలు! 'లక్ష్యం చిన్నదే.. రేపు ఏమైనా జరగొచ్చు!' -
De Kock: తగ్గేదేలే అన్నాడు.. ఇప్పుడేమో దిగొచ్చాడు..!
Quinton De Kock Apologises For Refusing To Take Knee: ‘బ్లాక్ లైవ్స్ మ్యాటర్’ ఉద్యమానికి మద్దతు తెలుపుతూ ప్రపంచవ్యాప్తంగా వివిధ క్రీడా వేదికలపై ఆటగాళ్లు సంఘీభావం తెలుపుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో టీ20 ప్రపంచకప్-2021లో భాగంగా వెస్టిండీస్‌తో మ్యాచ్ ఆరంభానికి ముందు.. దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు(సీఎస్ఏ) సైతం మోకాలిపై కూర్చుని ఉద్యమానికి మద్దతు తెలపాల్సిందిగా ఆ దేశ ఆటగాళ్లను ఆదేశించింది. అయితే ఆ జట్టు వికెట్ కీపర్ క్వింటన్ డికాక్ మాత్రం ఇందుకు ససేమిరా అన్నాడు. ఏకంగా జట్టు నుంచే తప్పుకున్నాడు. అయితే, సదరు అంశంపై వివరణ ఇవ్వాల్సిందిగా సీఎస్ఏ చివరి అవకాశం ఇవ్వడంతో తాజాగా అతను దిగొచ్చాడు. Quinton de Kock statement 📝 pic.twitter.com/Vtje9yUCO6— Cricket South Africa (@OfficialCSA) October 28, 2021 జట్టు సభ్యులకు, అభిమానులకు క్షమాపణలు చెప్పాడు. జాత్యాహంకారానికి వ్యతిరేకంగా నిలబడడం యొక్క ప్రాముఖ్యతను తెలుసుకున్నానని, తదుపరి మ్యాచ్‌లో మోకాలిపై నిల్చొని ఉద్యమానికి మద్దతు తెలుపుతానని అన్నాడు. ఈ సున్నితమైన అంశాన్ని రాద్దాంతం చేయడం, ఎవరినీ అగౌరవపరచడం తన ఉద్దేశం కాదని వివరణ ఇచ్చాడు. తన చర్యలు ఎవరినైనా బాధించి ఉంటే పెద్ద మనసుతో తనను క్షమించాలని కోరాడు. జట్టుతో చేరేందుకు తాను సుముఖంగా ఉన్నానని తెలిపాడు. కాగా, మొదట్లో ఈ అంశంపై స్పందించేందుకు కూడా ఇష్టపడని డికాక్.. ఓ దశలో కెరీర్‌ను అర్ధంతరంగా ముగించేందుకు సన్నిహితులతో చర్చించినట్లు సమాచారం. చదవండి: David Warner: మోకాలిపై కూర్చుంటాం... ఆ విషయం గురించి స్పందించలేను! -
Quinton De Kock: నేను అలా చేయలేను; అతడేం చిన్నపిల్లాడు కాదు: కెప్టెన్
Temba Bavuma On Quinton De Kock Refusal To Take Knee: టీ20 వరల్డ్‌కప్-2021 టోర్నీలో భాగంగా వెస్టిండీస్‌తో మ్యాచ్ ఆరంభానికి ముందు జట్టు నుంచి తప్పుకొన్న క్వింటన్ డికాక్ నిర్ణయంపై దక్షిణాఫ్రికా కెప్టెన్ తెంబా బవుమా స్పందించాడు. ‘‘మ్యాచ్‌కు కొన్ని గంటలముందు సీఎస్ఏ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం సరైంది కాదు. డికాక్ నిర్ణయం మాకూ ఆశ్చర్యం కలిగించింది. అతను చిన్నపిల్లాడు కాదు. తన నిర్ణయం తాను తీసుకోగలడు. దానికే కట్టుబడే ఉంటాడు. అతని నిర్ణయాన్ని మేం గౌరవిస్తాం. అతనిపై ఎలాంటి చర్య తీసుకుంటారనేది ఒక కెప్టెన్‌గా నేను ఇప్పుడే చెప్పలేను. దానిని నేను నిర్ణయించలేను. ప్రపంచకప్‌లో రాబోయే మ్యాచ్‌లపై కూడా మేం దృష్టి పెట్టాల్సి ఉంది. అయితే ఒకటి మాత్రం నిజం. డికాక్ మాలో ఒకడు. అతనికి మా వైపు నుంచి ఎలాంటి సహకారం కావాలన్నా అండగా ఉంటాం. ఏదైనా అతను మాతో చర్చించవచ్చు. నాకు తెలిసి మేం సహచరులం దీనిపై మాట్లాడుకోగలం’’ అని బవుమా స్పష్టం చేశాడు. అసలేం జరిగిందంటే... జాతి వివక్షకు వ్యతిరేకంగా సాగుతున్న ‘బ్లాక్ లైవ్స్ మ్యాటర్’ (బీఎల్ఎమ్) కోసం ప్రపంచవ్యాప్తంగా వివిధ క్రీడా వేదికల్లో సంఘీభావం తెలుపుతున్న విషయం తెలిసిందే. ఆటగాళ్లు మోకాలిపై కూర్చొని ఈ ఉద్యమానికి మద్దతు పలుకుతున్నారు. ఈ క్రమంలో మంగళవారం వెస్టిండీస్‌తో మ్యాచ్‌కు ముందుకు దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు (సీఎస్ఏ) సైతం తమ ఆటగాళ్లకు ఇదే తరహా ఆదేశాలు ఇచ్చింది. అయితే, తాను ఈ ఆదేశాలను పాటించలేనంటూ వికెట్ కీపర్ క్వింటన్ డికాక్.. మ్యాచ్ నుంచి స్వచ్ఛందంగా తప్పుకున్నాడు. శ్వేత జాతీయుడైన డికాక్ దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలిసింది. అవసరమైతే మ్యాచ్ ఆడను కానీ అలా మాత్రం చేయనంటూ అతను తన మాటపైనే నిలబడ్డాడు. టాస్ సమయంలో కెప్టెన్ బవుమా ‘వ్యక్తిగత కారణాలతో డికాక్ దూరమయ్యాడు’ అని ప్రకటించడంతో ఈ విషయం గురించి అందరికీ తెలిసింది. డికాక్ తన శ్వేత జాతి అహంకారాన్ని ప్రదర్శించాడని ఒకవైపు నుంచి విమర్శలు వస్తుండగా... అతడి ఇష్టానికి వదిలేయడమే సరైందని మరికొందరు డికాక్‌కు మద్దతుగా నిలిచారు. ఇక క్రికెట్ ప్రపంచంలో ఊహించని ఈ పరిణామం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఆటతో సంబంధం లేని అంశంలో తన వ్యక్తిగత అభిప్రాయాన్ని ప్రకటిస్తూ ప్రపంచకప్‌లాంటి మెగా ఈవెంట్లో ఒక ఆటగాడు మ్యాచ్‌కు దూరమయ్యేందుకు సిద్ధం కావడం తీవ్ర చర్చకు దారి తీసింది. ఇక మ్యాచ్ విషయానికొస్తే.. వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో సౌతాఫ్రికా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. చదవండి: T20 World Cup 2021 Pak Vs NZ: రెండు మేటి జట్లపై విజయాలు.. సెమీస్ దారిలో పాక్ .. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1971406958.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
SA Vs WI: రెండుసార్లు విజేత.. 8 వికెట్ల తేడాతో చిత్తు.. అరె ఏంట్రా ఇది?
T20 World Cup 2021: రెండుసార్లు టి20 ప్రపంచకప్ విశ్వవిజేత, డిఫెండింగ్ చాంపియన్ వెస్టిండీస్ ఈసారి మెగా టోర్నీలో అందరికంటే ముందే నిష్క్రమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంగ్లండ్‌తో తొలి మ్యాచ్‌లో 55కే కుప్పకూలిన విండీస్ ఈసారి అంతకంటే మెరుగ్గా ఆడినా అదీ ఓటమి నుంచి తప్పించలేకపోయింది. వరుసగా రెండు ఓటముల తర్వాత పేలవ రన్‌రేట్‌తో నిలిచిన పొలార్డ్ బృందం ముందుకెళ్లాలంటే అద్భుతాలు జరగాలి. మరోవైపు గత ఓటమి నుంచి పాఠం నేర్చుకున్న దక్షిణాఫ్రికా పదునైన ఆటతో ప్రత్యరి్థని పడగొట్టి కీలక పాయింట్లు తమ ఖాతాలో వేసుకుంది. నోర్జే, ప్రిటోరియస్ బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లో మార్క్రమ్ మెరుపులు సఫారీలను గెలిపించాయి. South Africa Beat West Indies By 8 Wickets: టి20 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికాకు తొలి విజయం దక్కింది. దుబాయ్‌లో మంగళవారం జరిగిన గ్రూప్–1 మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 8 వికెట్ల తేడాతో వెస్టిండీస్‌పై ఘన విజయం సాధించింది. ముందుగా విండీస్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 143 పరుగులు చేసింది. ఎవిన్ లూయిస్ (35 బంతుల్లో 56; 3 ఫోర్లు, 6 సిక్సర్లు) అర్ధ సెంచరీ చేయగా...‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ నోర్జే (1/14), ప్రిటోరియస్ (3/17) ప్రత్యర్థిని దెబ్బ తీశారు. అనంతరం దక్షిణాఫ్రికా 18.2 ఓవర్లలో 2 వికెట్లకు 144 పరుగులు చేసి గెలిచింది. మార్క్రమ్ (26 బంతుల్లో 51 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), వాన్ డర్ డసెన్ (51 బంతుల్లో 43 నాటౌట్; 3 ఫోర్లు), రీజా హెన్డ్రిక్స్ (30 బంతుల్లో 39; 4 ఫోర్లు, 1 సిక్స్) కీలక ఇన్నింగ్స్ ఆడారు. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1971406958.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); గేల్ విఫలం... ఓపెనర్ లూయిస్ విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగిపోగా... మిగతా ఆటగాళ్లంతా విఫలం కావడంతో విండీస్ తక్కువ స్కోరుకే పరిమితమైంది. ముఖ్యంగా రెండో ఓపెనర్ లెండిల్ సిమన్స్ (35 బంతుల్లో 16;) అనూహ్యంగా బంతులను వృథా చేయడం కూడా జట్టును దెబ్బ తీసింది. ఒక ఎండ్‌లో లూయిస్ మెరుపు బ్యాటింగ్‌తో తొలి వికెట్‌కు 73 పరుగుల పార్ట్నర్షిప్ నమోదైనా, ఇందులో లూయిస్ ఒక్కడే 56 పరుగులు సాధించాడు. రబడ ఓవర్లో వరుసగా ఫోర్, సిక్స్ కొట్టిన అతను... మార్క్రమ్ ఓవర్లో వరుస బంతుల్లో 6, 6, 4 బాదాడు. షమ్సీ బౌలింగ్‌లో కొట్టిన మరో భారీ సిక్స్‌తో 32 బంతుల్లోనే లూయిస్ అర్ధసెంచరీ పూర్తయింది. ఎట్టకేలకు మహరాజ్ బౌలింగ్‌లో లూయిస్ వెనుదిరగడంతో తొలి వికెట్ భాగస్వామ్యానికి తెర పడింది. పూరన్ (12) విఫలం కాగా, తన 75 మ్యాచ్‌ల అంతర్జాతీయ కెరీర్లో ఎన్నడూ మూడో స్థానంకంటే దిగువన ఆడని క్రిస్ గేల్ (12) ఈ మ్యాచ్‌లోనే తొలిసారి నాలుగో స్థానంలో బ్యాటింగ్ దిగి ప్రభావం చూపలేకపోయాడు. ఆ తర్వాత విండీస్ బ్యాటింగ్ పూర్తిగా తడబడింది. చివర్లో పొలార్డ్ (20 బంతుల్లో 26; 2 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. ఆఖరి 3 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయిన విండీస్ 22 పరుగులే జోడించింది. కీలక భాగస్వామ్యాలు... సాధారణ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో దక్షిణాఫ్రికా రనౌట్ రూపంలో కెప్టెన్ బవుమా (2) వికెట్ కోల్పోయింది. అయితే ఆ తర్వాతి రెండు అర్ధ సెంచరీ భాగస్వామ్యాలు సఫారీలను గెలిపించాయి. ముందుగా హెన్డ్రిక్స్, డసెన్ కలిసి రెండో వికెట్‌కు 57 పరుగులు (50 బంతుల్లో) జోడించారు. ఎక్కడా తొందరపాటు ప్రదర్శించకుండా వీరిద్దరు జాగ్రత్తగా ఆడుతూ ఇన్నింగ్స్‌ను నడిపించారు. హెట్‌మైర్ అద్భుత క్యాచ్‌తో హెన్డ్రిక్స్ ఆట ముగిసినా ...ఆ తర్వాత వచ్చిన మార్క్రమ్ చూడచక్కటి షాట్లతో దూసుకుపోయాడు. 4 భారీ సిక్సర్లు సహా 25 బంతుల్లోనే ఫిఫ్టీ చేసిన అతను, తర్వాతి బంతికే సింగిల్‌తో మ్యాచ్‌ను ముగించాడు. వీరిద్దరు మూడో వికెట్‌కు అజేయంగా 83 పరుగులు (54 బంతుల్లో) జత చేశారు. స్కోరు వివరాలు వెస్టిండీస్ ఇన్నింగ్స్: సిమన్స్ (బి) రబడ 16; లూయిస్ (సి) రబడ (బి) మహరాజ్ 56; పూరన్ (సి) మిల్లర్ (బి) మహరాజ్ 12; గేల్ (సి) క్లాసెన్ (బి) ప్రిటోరియస్ 12; పొలార్డ్ (సి) డసెన్ (బి) ప్రిటోరియస్ 26; రసెల్ (బి) నోర్జే 5; హైట్‌మైర్ (రనౌట్) 1; బ్రావో (నాటౌట్) 8; వాల్‡్ష (సి) హెన్డ్రిక్స్ (బి) ప్రిటోరియస్ 0; హొసీన్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 7, మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 143. వికెట్ల పతనం: 1–73, 2–87, 3–89, 4–121, 5–132, 6–133, 7–137, 8–137. బౌలింగ్: మార్క్రమ్ 3–1–22–0, రబడ 4–0–27–1, నోర్జే 4–0–14–1, మహరాజ్ 4–0–24–2, షమ్సీ 3–0–37–0, ప్రిటోరియస్ 2–0–17–3. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: బవుమా (రనౌట్) 2; హెన్డ్రిక్స్ (సి) హెట్‌మైర్ (బి) హొసీన్ 39; వాన్ డర్ డసెన్ (నాటౌట్) 43; మార్క్రమ్ (నాటౌట్) 51; ఎక్స్‌ట్రాలు 9, మొత్తం (18.2 ఓవర్లలో 2 వికెట్లకు) 144. వికెట్ల పతనం: 1–4, 2–61. బౌలింగ్: హొసీన్ 4–0–27–1, రవి రాంపాల్ 3–0–22–0, రసెల్ 3.2–0–36–0, హేడెన్ వాల్‡్ష 3–0–26–0, బ్రావో 4–0–23–0, పొలార్డ్ 1–0–9–0. చదవండి: T20 WC 2021: వారెవ్వా హసన్ అలీ.. అయ్యో విలియమ్సన్ T20 World Cup 2021 Pak Vs NZ: రెండు మేటి జట్లపై విజయాలు.. సెమీస్ దారిలో పాక్ .. South Africa got their #T20WorldCup 2021 campaign back on track after a commanding victory against West Indies 💪 https://t.co/YriZdtyUev — T20 World Cup (@T20WorldCup) October 26, 2021 -
T20WorldCup2021: వెస్టిండీస్ పై దక్షిణాఫ్రికా విజయం
-
WI VS SA: రసెల్ స్టన్నింగ్ త్రో.. దాదాపు 100 కిమీ వేగంతో
Andre Russel Bullet Throw.. టి20 ప్రపంచకప్ 2021లో వెస్టిండీస్, దక్షిణాఫ్రికా మ్యాచ్‌లో ఆండీ రసెల్ సూపర్ త్రోతో మెరిశాడు. దాదాపు 100 కిమీ వేగంతో విసిరిన డైరెక్ట్ త్రోకు దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా రనౌట్‌గా వెనుదిరిగాల్సి వచ్చింది. ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే ఇది చోటుచేసుకోవడం విశేషం. చదవండి: T20 WC 2021: ఫోకస్‌గా లేవు.. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌కు పక్కనపెడుతున్నా తొలి ఓవర్‌ను ఎకిల్ హొస్సేన్ వేయగా.. చివరి బంతిని బవుమా మిడాన్ దిశగా ప్లిక్ చేశాడు. ఫీల్డర్ దూరంగా ఉండడంతో ఈజీ సింగిల్ అనుకున్నారు.. కానీ రసెల్ ఇక్కడే మ్యాజిక్ చేశాడు. వేగంగా ముందుకు పరిగెత్తుకు వచ్చిన రసెల్ బంతిని అందుకొని వేగంగా త్రో విసిరాడు. దీంతో బంతి డైరెక్టుగా వికెట్లను గిరాటేయడం.. బవుమా రనౌట్ కావడం చకచకా జరిగిపోయాయి. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం ట్రెండింగ్‌గా మారింది. చదవండి: T20 WC 2021 SA Vs WI: విండీస్ బ్యాటర్ చెత్త రికార్డు.. 35 బంతుల్లో..! A bullet of a throw from Russell gets the wicket of Bavuma via @t20worldcup https://t.co/87kxjf0Ysb — varun seggari (@SeggariVarun) October 26, 2021 -
విండీస్ బ్యాటర్ చెత్త రికార్డు.. 35 బంతుల్లో..!
Lendl Simmons Equals Bangladesh Alok kapali Record: టీ20 ప్రపంచకప్-2021 సూపర్ 12లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో విండీస్ ఓపెనర్ లెండిల్ సిమన్స్ చెత్త రికార్డు నెలకొల్పాడు. పొట్టి ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక బంతులను ఎదుర్కొని బౌండరీ సాధించని ఆటగాడిగా బంగ్లా ఆటగాడు అలోక్ కపాలి రికార్డును సమం చేశాడు. 2007 ప్రపంచకప్‌లో కపాలి 35 బంతులను ఎదుర్కొని ఒక్క బౌండరీ కుడా సాధించకుండా కేవలం 14 మాత్రమే చేయగా.. ఈ మ్యాచ్‌లో సిమన్స్ అదే 35 బంతులను ఎదుర్కొని బౌండరీ లేకుండా 16 పరుగులు చేశాడు. ఇదే ప్రపంచకప్‌లో ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో స్కాట్లాండ్ ఆటగాడు మాట్ క్రాస్ 35 బంతుల్లో బౌండరీ లేకుండా 26 పరుగులతో నాటౌట్‌గా నిలిచి వీరిద్దరితో సమంగా నిలిచాడు. ఇదిలా ఉంటే, సఫారీలతో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్.. నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. ఎవిన్ లూయిస్(35 బంతుల్లో 56; 3 ఫోర్లు, 6 సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. చదవండి: Mohammad Shami: పాక్ అభిమానికి స్ట్రాంగ్ వార్నింగ్..! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1971406958.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
మ్యాచ్‌కు 30 నిమిషాల ముందు డికాక్ ఔట్.. కారణం
Quinton De Kock Pulled Out Vs WI Match.. టి20 ప్రపంచకప్ 2021లో భాగంగా వెస్డీండీస్తో మ్యాచ్‌కు దక్షిణాఫ్రికా సిద్ధమైన వేళ మ్యాచ్‌కు 30 నిమిషాల ముందు క్వింటన్ డికాక్ రూపంలో షాక్ తగిలింది. ఈ మ్యాచ్‌కు అతను దూరంగా ఉండనున్నాడని.. అతని స్థానంలో రీజా హెండ్రిక్స్ ఆడుతాడంటూ జట్టుకు కెప్టెన్ టెంబా బవుమా వెల్లడించాడు. అయితే డికాక్ వ్యక్తిగత కారణాల రిత్యా విండీస్‌తో మ్యాచ్‌కు దూరంగా ఉన్నాడని బవుమా పేర్కొన్నప్పటికి అసలు కారణం వేరే ఉందని సమాచారం. చదవండి: T20 WC: చెత్త ప్రదర్శన.. ప్రపంచకప్ ఆడటానికి వచ్చారా.. టూరిస్ట్ వీసా మీద ఉన్నారా? బ్లాక్‌లైవ్ మ్యాటర్స్ ఉద్యమానికి మద్దతుగా టి20 ప్రపంచకప్‌లో వివిధ జట్లు వివిధ పద్దతుల్లో మద్దతు తెలుపుతున్నాయి. దక్షిణాఫ్రికా ఆటగాళ్లు కూడా ఇకపై తాము ఆడబోయే అన్ని మ్యాచ్‌ల్లో మొకాళ్లపై నిలబడి బ్లాక్‌లైవ్ మ్యాటర్స్ మూమెంట్‌కు మద్దతు తెలపాలంటూ క్రికెట్ దక్షిణాఫ్రికా బోర్డు(సీఎస్ఏ) సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ విషయంలో విండీస్‌తో మ్యాచ్‌కు కొన్ని నిమిషాల ముందు సీఎస్ఏతో డికాక్ గొడవకు దిగినట్లు సమాచారం. బ్లాక్‌లైవ్ మ్యాటర్స్ ఉద్యమానికి తాను వ్యతిరేకి కాదని.. కానీ మొకాళ్లపై కూర్చొని మద్దతు పలకలేనని తెలిపినట్లు సమాచారం. కేవలం ఈ కారణంతోనే డికాక్ కీలకమ్యాచ్‌కు దూరంగా ఉన్నట్లు పలువురు పేర్కొంటున్నారు. అయితే డికాక్ మాత్రం అలాంటిదేం లేదని.. కొన్ని వ్యక్తిగత కారణాల రిత్యా ఈ మ్యాచ్‌కు దూరంగా ఉన్నానని.. అనవసరంగా దీన్ని పెద్ద విషయం చేయొద్దంటూ మీడియాను విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. చదవండి: T20 WC 2021 SA Vs WI: విండీస్ మూడో వికెట్ డౌన్.. సిమన్స్(16) ఔట్ 🚨 TEAM ANNOUNCEMENT 🇿🇦 There's one change as Reeza Hendricks comes in for Quinton de Kock 📝 Ball by Ball https://t.co/c1ztvrT95P#SAvWI #T20WorldCup #BePartOfIt pic.twitter.com/0blL4GviNO — Cricket South Africa (@OfficialCSA) October 26, 2021 -
SA Vs WI: విండీస్‌కు మరో పరాజయం.. 8 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా విజయం
8 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా విజయం సమయం: 19:00.. వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 8 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. 144 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 18.2 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేధించింది. కెప్టెన్ బవుమా తక్కువ స్కోరుకే వెనుదిరిగినప్పటికీ .. మరో ఓపెనర్ రీజా హెండ్రిక్స్(39) రాణించి ఇన్నింగ్స్‌కు పునాది వేశాడు. ఆ తర్వాత ఎయిడెన్ మార్క్రమ్(51 నాటౌట్), వాన్ డర్ డస్సెన్(43 నాటౌట్) జట్టును విజయతీరాలకు చేర్చారు. విండీస్ బౌలర్లలో హొస్సేన్ ఒక వికెట్ పడగొట్టాడు. పొదుపుగా బౌలింగ్ చేసిన నోర్జే(1/14)కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. అంతకముందు విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 143 పరుగులు మాత్రమే చేయగలిగింది. సఫారి బౌలర్లలో ప్రిటోరియస్ 3 వికెట్లతో చెలరేగగా.. కేశవ్ మహారాజ్ 2, నోర్జే, రబాడ తలో వికెట్ పడగొట్టారు. రెండో వికెట్ కోల్పోయిన దక్షిణాఫ్రికా.. హెండ్రిక్స్(39) ఔట్ సమయం 6:12.. ఇన్నింగ్స్ 9.2వ ఓవర్లో దక్షిణాఫ్రికా రెండో వికెట్ కోల్పోయింది. అకీల్ హొసేన్ బౌలింగ్‌లో హెట్‌మైర్‌కు క్యాచ్ ఇచ్చి హెండ్రిక్స్(30 బంతుల్లో 39; 4 ఫోర్లు, సిక్స్) ఔటయ్యాడు. 10 ఓవర్ల తర్వాత దక్షిణాఫ్రికా స్కోర్ 66/2. క్రీజ్‌లో వాన్ డర్ డస్సెన్(19), మార్క్రమ్(1) ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన దక్షిణాఫ్రికా.. బవుమా (2) రనౌట్ సమయం 5:30.. 144 పరుగుల నామమాత్రపు స్కోర్‌ను ఛేదించే క్రమంలో సఫారి జట్టు ఆరంభంలోనే వికెట్ కోల్పోయింది. జట్టు కెప్టెన్ బవుమా(3 బంతుల్లో 2) రనౌటయ్యాడు. రసెల్ అద్భుతమైన త్రోతో బవుమాను పెవిలియన్‌కు పంపాడు. తొలి ఓవర్ తర్వాత దక్షిణాఫ్రికా స్కోర్ 4/1. క్రీజ్‌లో హెండ్రిక్స్(2), వాన్ డర్ డస్సెన్ ఉన్నారు. విండీస్ నామమాత్రపు స్కోర్.. దక్షిణాఫ్రికా లక్ష్యం 144 సమయం 5:13.. ప్రిటోరియస్ వేసిన ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో విండీస్ జట్టు రెండు వికెట్లు కోల్పోయింది. పోలార్డ్(20 బంతుల్లో 26; 2 ఫోర్లు, సిక్స్), హేడెన్ వాల్ష్(0) వరుస బంతుల్లో పెవిలియన్‌కు చేరారు. దీంతో విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 143 పరుగులు మాత్రమే చేయగలిగింది. సఫారి బౌలర్లలో ప్రిటోరియస్ 3 వికెట్లతో చెలరేగగా.. కేశవ్ మహారాజ్ 2, నోర్జే, రబాడ తలో వికెట్ పడగొట్టారు. ఒకే ఓవర్లో రెండు వికెట్లు కోల్పోయిన విండీస్ సమయం 4:57.. నోర్జే వేసిన 19వ ఓవర్లో విండీస్ జట్టు రెండు కీలక వికెట్లు కోల్పోయి భారీ స్కోర్ సాధించే అవకాశాన్ని చేజార్చుకుంది. 18.2వ ఓవర్లో తొలుత రసెల్(4 బంతుల్లో 5; ఫోర్) క్లీన్ బౌల్డ్ కాగా.. నాలుగో బంతికి హెట్‌మైర్(2 బంతుల్లో 1) రనౌట్‌గా వెనుదిరిగాడు. 19 ఓవర్ల తర్వాత విండీస్ స్కోర్ 136/6. క్రీజ్‌లో పోలార్డ్(26), బ్రావో(1) ఉన్నారు. గేల్(12) ఔట్.. 18 ఓవర్ల తర్వాత విండీస్ స్కోర్ 131/4 సమయం 4:52.. ప్రిటోరియస్ వేసిన ఇన్నింగ్స్ 18వ ఓవర్ తొలి బంతికి గేల్(12 బంతుల్లో 12; సిక్స్) ఔటయ్యాడు. వికెట్‌కీపర్ క్లాసీన్‌కు క్యాచ్ ఇచ్చి గేల్ పెవిలియన్ బాట పట్టాడు. 18 ఓవర్ల తర్వాత దక్షిణాఫ్రికా స్కోర్ 131/4. క్రీజ్‌లో పోలార్డ్(23), రసెల్(5) ఉన్నారు. విండీస్ మూడో వికెట్ డౌన్.. సిమన్స్(16) ఔట్ సమయం 4:29.. రబాడ వేసిన ఇన్నింగ్స్ 13.2వ ఓవర్లో లెండిల్ సిమన్స్(35 బంతుల్లో 16) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 14 ఓవర్ల తర్వాత దక్షిణాఫ్రికా స్కోర్ 93/3. క్రీజ్‌లో గేల్(2), పోలార్డ్(3) ఉన్నారు. పూరన్(12) ఔట్.. విండీస్ 87/2 సమయం 4:23.. సఫారి స్పిన్నర్ కేశవ్ మహారాజ్.. వరుస ఓవర్లలో విండీస్‌ను దెబ్బకొట్టాడు. 11వ ఓవర్లో హార్డ్ హిట్టర్ ఎవిన్ లూయిస్‌ను పెవిలియన్‌కు పంపిన అతను.. 13వ ఓవర్ రెండో బంతికి పూరన్(7 బంతుల్లో 12; 2 ఫోర్లు)ను ఔట్ చేశాడు. పూరన్.. మిల్లర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 13 ఓవర్ల తర్వాత విండీస్ స్కోర్ 89/2. క్రీజ్‌లో సిమన్స్(33 బంతుల్లో 16), క్రిస్ గేల్(1) ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన విండీస్.. ఎవిన్ లూయిస్(56) ఔట్ సమయం 4:16.. ధాటిగా ఆడుతున్న ఎవిన్ లూయిస్(35 బంతుల్లో 56; 3 ఫోర్లు, 6 సిక్సర్లు)ను కేశవ్ మహారాజ్ బోల్తా కొట్టించాడు. ఇన్నింగ్స్ 10.3వ ఓవర్లో భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన లూయిస్.. రబాడకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 11 ఓవర్ల తర్వాత విండీస్ స్కోర్ 74/1. క్రీజ్‌లో లెండిల్ సిమన్స్(30 బంతుల్లో 13), నికోలస్ పూరన్(1) ఉన్నారు. ఎవిన్ లూయిస్ సిక్సర్ల మోత.. 10 ఓవర్ల తర్వాత విండీస్ 65/0 సమయం 4:11.. విండీస్ ఓపెనర్ ఎవిన్ లూయిస్ సిక్సర్ల మోత మోగిస్తున్నాడు. కేవలం 33 బంతుల్లో 3 ఫోర్లు 5 భారీ సిక్సర్ల సాయంతో అర్ధ శతకాన్ని నమోదు చేశాడు. మరో ఎండ్‌లో లెండిల్ సిమన్స్(28 బంతుల్లో 13) నిదానంగా ఆడుతున్నప్పటికీ లూయిస్ మాత్రం చెలరేగుతున్నాడు. 10 ఓవర్ల తర్వాత విండీస్ స్కోర్ 65/0. ఆచితూచి ఆడుతున్న విండీస్.. 5 ఓవర్ల తర్వాత 36/0 సమయం 3:50.. టాస్ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగిన విండీస్ జట్టు ఆచితూచి ఆడుతుంది. తొలి 5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 36 పరుగులు చేసింది. ఓపెనర్లలో ఎవిన్ లూయిస్(19 బంతుల్లో 30; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగుతుండగా.. లెండిల్ సిమన్స్(11 బంతుల్లో 4) నిదానంగా ఆడుతున్నాడు. దుబాయ్: టీ20 ప్రపంచకప్ 2021 సూపర్ 12 గ్రూప్-1లో భాగంగా మంగళవారం మధ్యాహ్నం 3:30 గంటలకు షెడ్యూలైన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మెగా టోర్నీలో ఇరు జట్లు ఇప్పటికే చెరో ఓటమి చవిచూసి బోణి విజయం కోసం ఎదురు చూస్తున్నాయి. విండీస్.. ఇంగ్లండ్ చేతిలో ఓడగా, సఫారీలు.. ఆస్ట్రేలియా చేతిలో పరాజయం పాలయ్యారు. పొట్టి ఫార్మాట్లో ఇరు జట్లు ఇప్పటివరకు 15 సార్లు ముఖాముఖి పోరులో తలపడగా.. దక్షిణాఫ్రికా 9, విండీస్ 5 మ్యాచ్‌ల్లో గెలుపొందాయి. టీ20 ప్రపంచకప్‌లో ఇరు జట్ల మధ్య జరిగిన 3 మ్యాచ్‌ల్లో దక్షిణాఫ్రికా 2-1 ఆధిక్యంలో ఉంది. ఇప్పటివరకు జరిగిన 6 టీ20 ప్రపంచకప్‌లలో(2007, 2009, 2010, 2012, 2014, 2016) కరీబియన్ జట్టు మంచి ట్రాక్ రికార్డే కలిగి ఉంది. 2 సార్లు ఛాంపియన్(2012, 2016)గా నిలిచి డిఫెండింగ్ ఛాంపియన్‌గా కొనసాగుతుంది. మరోవైపు ఈ మెగా టోర్నీలో దక్షిణాఫ్రికా ఒక్కసారి కూడా ఫైనల్‌కు చేరలేకపోయింది. 2009, 2014లో సెమీస్ చేరడమే ఆ జట్టుకు అత్యుత్తమం. తుది జట్లు: దక్షిణాఫ్రికా: టెంబా బవుమా (కెప్టెన్), హెన్రిక్ క్లాసీన్(వికెట్‌కీపర్), వాన్ డెర్ డస్సెన్, ఎయిడెన్ మార్క్రమ్, రీజా హెండ్రిక్స్, డేవిడ్ మిల్లర్, డ్వేన్ ప్రిటోరియస్, కేశవ్ మహారాజ్, కగిసో రబాడా, అన్రిచ్ నోర్జే, తబ్రేజ్ షమ్సీ వెస్టిండీస్: లెండిల్ సిమన్స్, ఎవిన్ లూయిస్, క్రిస్ గేల్, షిమ్రోన్ హెట్‌మైర్, డ్వేన్ బ్రావో, నికోలస్ పూరన్ (కీపర్), కీరన్ పొలార్డ్ (కెప్టెన్), ఆండ్రీ రస్సెల్, అకేల్ హోసేన్, హేడెన్ వాల్ష్, రవి రాంపాల్ (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఈ భూమ్మీద దాన్ని ‘వైడ్’ అంటారు కదా: హా.. ఇట్స్ షాకింగ్!
సెయింట్ జార్జెస్: వెస్టిండీస్- దక్షిణాఫ్రికా మధ్య జరిగిన ఐదో టీ20 మ్యాచ్ సందర్భంగా అంపైర్ వ్యవహరించిన తీరుపై ప్రొటీస్ దిగ్గజాలు ఏబీ డివిల్లియర్స్, డేల్ స్టెయిన్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. విండీస్ బౌలర్ మెకాయ్ వేసిన బంతి వైడ్ అని క్లియర్‌గా కనిపిస్తున్నా స్పందించకపోవడం ఏమిటని ప్రశ్నించారు. కాగా 2 టెస్టులు, 5 టీ20 మ్యాచ్‌ల సిరీస్ నిమిత్తం సౌతాఫ్రికా జట్టు వెస్టిండీస్‌లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శనివారం జరిగిన చివరి టీ20లో గెలుపొంది 3–2తో పర్యాటక జట్టు సిరీస్‌ను సొంతం చేసుకుంది. అయితే, ఈ మ్యాచ్ సందర్భంగా... దక్షిణాఫ్రికా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో.. 19 ఓవర్లో వెస్టిండీస్ బౌలర్ ఒబెడ్ మెకాయ్.. ముల్దర్‌కు షార్ట్ బాల్‌ను సంధించాడు. దానిని షాట్ ఆడేందుకు ముల్దర్ విఫలయత్నం చేశాడు. నిజానికి అది వైడ్‌బాల్. కానీ అంపైర్లు మాత్రం ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోలేదు. ఈ నేపథ్యంలో.. డేల్ స్టెయిన్ ఈ అంశంపై ట్విటర్ వేదికగా అసంతృప్తిని వెళ్లగక్కాడు. ‘‘ఈ భూమి మీద.. అది ఎలా వైడ్‌గా పరిగణించరో చెప్పగలరా’’ అని కామెంట్ చేశాడు. ఇందుకు స్పందనగా... ‘‘షాకర్’’ అంటూ ఏబీ డివిలియర్స్ అతడిని సమర్థించాడు. ఇక క్రికెట్ ఫ్యాన్స్ సైతం.. ‘‘ఇది నిజంగా చెత్త అంపైరింగ్’’ అని దుమ్మెత్తిపోస్తున్నారు. కాగా ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 25 పరుగుల తేడాతో వెస్టిండీస్‌ను ఓడించింది. మార్క్రమ్ (48 బంతుల్లో 70; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డును సొంతం చేసుకున్నాడు. Worst umpiring ever 🤣🤣🤣 pic.twitter.com/4fd9DwRy74 — ribas (@ribas30704098) July 4, 2021 -
WI Vs SA: టి20 సిరీస్ కైవసం చేసుకున్న దక్షిణాఫ్రికా
సెయింట్ జార్జెస్: వెస్టిండీస్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ను దక్షిణాఫ్రికా సొంతం చేసుకుంది. నిర్ణాయక ఐదో మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 25 పరుగుల తేడాతో వెస్టిండీస్‌ను ఓడించి సిరీస్‌ను 3–2తో దక్కించుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 4 వికెట్లు నష్టపోయి 168 పరుగులు చేసింది. మార్క్రమ్ (48 బంతుల్లో 70; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు), క్వింటన్ డికాక్ (42 బంతుల్లో 60; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ శతకాలతో రాణించారు. వీరిద్దరు రెండో వికెట్‌కు 128 పరుగులు జోడించారు. లక్ష్యఛేదనలో వెస్టిండీస్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 143 పరుగులు చేసి ఓడింది. ఎవిన్ లూయిస్ (34 బంతుల్లో 52; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) ఆకట్టుకున్నాడు. ఇన్‌గిడి 3 వికెట్లు తీయగా... రబడ, వియాన్ ముల్దర్ చెరో రెండు వికెట్లు దక్కించుకున్నారు. మార్క్రమ్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డును దక్కించుకోగా... ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’గా షమ్సీ నిలిచాడు. 🔥 Wiaan Mulder had a dream performance in the 5th T20I, claiming 2 massive wickets 🎥 Full Highlights https://t.co/3nINbKmCMS#WIvSA #ThatsOurGame pic.twitter.com/T62eYNDeHN — Cricket South Africa (@OfficialCSA) July 4, 2021 -
లూయిస్, గేల్ సిక్సర్ల సునామీ.. విండీస్‌దే తొలి టీ20
సెయింట్ జార్జియా: ఓపెనర్ ఎవిన్ లూయిస్(35 బంతుల్లో 71; 4 ఫోర్లు, 7 సిక్సర్లు), యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్(24 బంతుల్లో 32; ఫోర్, 3 సిక్సర్లు), ఆండ్రీ రసెల్(12 బంతుల్లో 23; ఫోర్, 3 సిక్సర్లు), ఆండ్రీ ఫ్లెచర్(19 బంతుల్లో 30; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) సిక్సర్లతో విరుచుకుపడటంతో దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ 20లో విండీస్ 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. 5 టీ20ల సిరీస్‌లో భాగంగా శనివారం జరిగిన తొలి మ్యాచ్‌లో అతిధ్య జట్టు సఫారీలను మట్టికరిపించి, సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఈ మ్యాచ్‌లో విండీస్ టాస్ గెలిచి ప్రత్యర్ధిని బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. వాన్ డర్ డుసెన్ (38 బంతుల్లో 56 పరుగులు), వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ డికాక్ (24 బంతుల్లో 37) రాణించడంతో సఫారీ జట్టు 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. ఫాబియన్ అలెన్, బ్రావోలకు తలో రెండు వికెట్లు, హోల్డర్, రసెల్‌లకు చెరో వికెట్ దక్కింది. అనంతరం 161 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన విండీస్.. కేవలం 15 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. సఫారీ బౌలర్ షంషికి ఓ వికెట్ దక్కగా, ఫ్లెచర్ రనౌట్‌గా వెనుదిరిగాడు. ఇరు జట్ల మధ్య రెండో టీ20 ఆదివారం జరుగనుంది. కాగా, సఫారీలతో జరిగిన రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను ఆతిధ్య జట్టు 0-2తేడాతో కోల్పోయింది. చదవండి: WTC Final: ‘ఒక్క గంట ఆట, ఇమేజ్ మొత్తం డ్యామేజీ’ -
ఆ రాత్రి డివిలియర్స్ కాల్ చేశాడు.. కానీ
లండన్ : దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఏబీ డివిలియర్స్ తన పునరాగమన కోరికను జట్టు ప్రకటనకు ఒక రోజు ముందు చెప్పాడని ఆ దేశ కెప్టెన్ ఫాఫ్ డూప్లెసిస్ తెలిపాడు. సరిగ్గా ప్రపంచకప్ జట్టు ప్రకటనకు ముందు రోజు రాత్రి డివిలియర్స్ తనకు కాల్ చేశాడని కానీ అప్పటికే ఆలస్యం చేసావని తనకు చెప్పినట్లు వారి మధ్య జరిగిన సంభాషణను వివరించాడు. సోమవారం వెస్టిండీస్‌తో జరగాల్సిన మ్యాచ్ వర్షంతో రద్దైన అనంతరం డూప్లెసిస్ మీడియాతో మాట్లాడాడు.(చదవండి : వస్తానంటే... వద్దన్నారు) ‘ప్రపంచకప్ జట్టును ప్రకటించే ముందు రోజు రాత్రి డివిలియర్స్ నాకు ఫోన్ చేశాడు. చాలా ఆలస్యం చేశావని చెప్పా. కానీ కోచ్, సెలక్టర్లతో మాట్లాడి 99.99 శాతం ఒప్పించే ప్రయత్నం చేస్తానన్నాను.’ అని డూప్లెసిస్ చెప్పుకొచ్చాడు. ఏబీకి జట్టులో చోటు దక్కకపోవడంతో తమ మధ్య స్నేహం ఏం చెడదన్నాడు. ‘ఏబీ, నేను ఇప్పటికి మంచి స్నేహితులమే. ఈ వ్యవహారంతో మా స్నేహం ఏం చెడదు. మా ఫ్రెండ్షిప్ ముందు ఇది చాలా చిన్నవిషయం. అంతా సర్దుకుపోతుంది’ అని తెలిపాడు. వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడిన సఫారీలను వర్షం నిండా ముంచేసింది. కీలక మ్యాచ్ రద్దవ్వడంతో డు ప్లెసిస్ సేన సెమీస్ ఆశలు దాదాపుగా ఆవిరయ్యాయి. అయినా తమ జట్టు ఇంకా బలంగానే ఉందని డూప్లెసిస్ అభిప్రాయపడ్డాడు. ఆటగాళ్లు తమ సామర్థ్యాన్ని కనబర్చకపోవడంతో పరాజయాలు ఎదురయ్యాయని, అయినా టోర్నీని ఆస్వాదిస్తున్నామన్నాడు. మిగతా మ్యాచ్‌ల్లో రాణిస్తామని ఆశాభావం వ్యక్తం చేశాడు. (చదవండి : హతవిధీ... సఫారీ ఆశలు ఆవిరి!) అయితే మిస్టర్ 360 డివిలియర్స్ జట్టులో ఉంటే సఫారీలకు ఈ పరిస్థితి వచ్చేది కాదని మెజార్టీ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. కానీ డివిలియర్స్‌ను తీసుకోకపోవడం సరైన చర్యేనని సెలక్షన్ కమిటీ కన్వీనర్ లిండా జొండి సమర్ధించుకున్నాడు. ‘రిటైర్ కావొద్దంటూ గతేడాది ఏబీడీని నేను బతిమాలాను. అప్పటికీ ప్రపంచ కప్‌నకు తాజాగా ఉండేలా రాబోయే సీజన్‌ను ప్లాన్ చేసుకోమని అవకాశం కూడా ఇచ్చాను. కప్ కోసం పరిగణనలో ఉండాలంటే స్వదేశంలో శ్రీలంక, పాకిస్తాన్‌తో సిరీస్‌లు ఆడాలనీ చెప్పాం. అతడు వాటిని పట్టించుకోలేదు. రిటైర్మెంట్ ప్రకటనతో తాను ప్రశాంతంగా ఉన్నట్లు చెప్పాడు. తీరా ఏప్రిల్ 18న డివిలియర్స్ ఆలోచన చెప్పేసరికి మేం షాక్ అయ్యాం. అతడి లోటు తీర్చలేనిదే. కానీ, ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు కొందరు కుర్రాళ్లు తీవ్రంగా శ్రమించారు. వారికి అవకాశం ఇవ్వాల్సిందే. ఏదేమైనా మా నిర్ణయం విధానాల ప్రకారమే తీసుకున్నాం’ అని వివరించాడు. ఇక డివిలియర్స్ 2018 మేలో సామాజిక మాధ్యమం ద్వారా సందేశం పంపించి ఉన్నపళంగా అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. అలసిపోవడంతో పాటు తనలో తపన లేదంటూ ఈ సందర్భంగా ఏబీడీ పేర్కొన్నాడు. -
వరల్డ్‌కప్‌లో మరో మ్యాచ్ వర్షార్పణం
సౌతాంప్టన్: వన్డే వరల్డ్‌కప్‌లో వర్షం కారణంగా మరో మ్యాచ్ రద్దయ్యింది. మూడు రోజుల క్రితం శ్రీలంక-పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా, తాజాగా దక్షిణాఫ్రికా-వెస్టిండీస్ జట్ల జరగాల్సిన మ్యాచ్‌కు వరుణుడు అడ్డుపడ్డాడు. దక్షిణాఫ్రికా 7.3 ఓవర్లలో 29/2 వద్ద ఉండగా వర్షం పడటంతో మ్యాచ్ నిలిచిపోయింది. ఆ తర్వాత మ్యాచ్ జరపడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఓ దశలో వర్షం వెలిసి కవర్లు తొలిగించే క్రమంలో మరొకసారి వరుణుడు అంతరాయం కల్గించాడు. కనీసం 20 ఓవర్ల మ్యాచ్ జరపాలకున్నప్పటికీ అది సాధ్యం కాలేదు. చివరకు భారత కాలమానప్రకారం రాత్రి గం.8.50 ని.లకు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. మ్యాచ్ రద్దు కావడంతో ఇరు జట్లకు తలో పాయింట్ లభించింది. -
సఫారీలకు ఆదిలోనే షాక్
సౌతాంప్టన్: వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా వెస్టిండీస్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాకు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ హషీమ్ ఆమ్లా(6), ఫస్ట్ డౌన్ ఆటగాడు మర్కరమ్(5) వికెట్లను చేజార్చుకుని కష్టాల్లో పడింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌ను ఆమ్లా, డీకాక్‌లు ఆరంభించారు. కాగా, కాట్రెల్ వేసిన ఇన్నింగ్స్ మూడో ఓవర్ ఐదో బంతికి ఆమ్లా స్లిప్‌లో గేల్ క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఆపై క్రీజ్‌లోకి వచ్చిన మర్కరమ్ కీపర్ షాయ్ హోప్‌కి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. కాట్రెల్ వేసిన ఏడో ఓవర్ తొలి బంతికి మర్కరమ్ బంతిని లెగ్ సైడ్‌కు ఆడబోయాడు. అది కాస్తా ఎడ్జ్ తీసుకుని కీపర్ చేతుల్లోకి వెళ్లడంతో మర్కరమ్ భారంగా పెవిలియన్ వీడాడు. దాంతో సఫారీలు 28 పరుగులకే రెండు వికెట్లను కోల్పోయారు. ఇప్పటికే వరుస మూడు మ్యాచ్‌ల్లో ఓటమి పాలైన దక్షిణాఫ్రికాకు విండీస్ మ్యాచ్ కీలకం. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే వారు సెమీస్ రేసులో నిలుస్తారు. మరొకవైపు ఒక మ్యాచ్‌లో గెలిచి, మరొక మ్యాచ్‌లో విండీస్‌కు ఇది మూడో లీగ్ మ్యాచ్. ఆస్ట్రేలియాతో జరిగిన గత మ్యాచ్‌లో వెస్టిండీస్ ఓటమి పాలైంది. దాంతో తాజా మ్యాచ్ ద్వారా విజయాల పట్టాలని కరీబియన్లు భావిస్తున్నారు. కాగా, ఇరు జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌కు వరుణుడు అంతరాయం కల్గించాడు. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌లో భాగంగా 7.3 ఓవర్ల వద్ద ఉండగా వర్షం పడటంతో మ్యాచ్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు. -
ఆండ్రీ రసెల్ ఔట్
సౌతాంప్టన్: వన్డే వరల్డ్‌కప్‌లో దక్షిణాఫ్రికా ఇప్పటిదాకా బోణీ కొట్టలేదు. ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయింది. సెమీస్ అవకాశాలు సంక్లిష్టం కాకుండా ఉండాలంటే వెస్టిండీస్‌పై గెలవడం సఫారీలకు తప్పనిసరి. ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఒక మ్యాచ్ గెలిచి.. మరో మ్యాచ్‌లో ఓడిన విండీస్.. దక్షిణాఫ్రికాపై గెలవాలనే పట్టుదలతో ఉంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన వెస్టిండీస్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన విండీస్ కెప్టెన్ జాసన్ హోల్డర్.. సఫారీలను ముందుగా బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఈ మ్యాచ్‌కు విండీస్ స్టార్ ఆల్ రౌండర్ ఆండ్రీ రసెల్ దూరమయ్యాడు. గాయం కారణంగా రసెల్ మ్యాచ్ నుంచి వైదొలిగాడు. ఇక ముఖాముఖి పోరులో దక్షిణాఫ్రికా, వెస్టిండీస్‌లు 61 వన్డేలు ఆడగా, ఇందులో సఫారీ జట్టు 44 గెలిచి, విండీస్ 15 మాత్రమే నెగ్గింది. ఒక మ్యాచ్ టై అయ్యింది. మరో మ్యాచ్ రద్దయ్యింది. గత మూడు కప్‌లలోనూ వారిపై విజయం సాధించింది. కానీ, ఇప్పుడు పరిస్థితి అంతా తారుమారైంది. సెమీస్ రేసులో నిలవాలంటే దక్షిణాఫ్రికా తప్పక గెలవాల్సి ఉండగా, కరీబియన్లు మంచి ఫామ్‌లో ఉన్నారు. ఇరు జట్లు ఇప్పటివరకు ప్రపంచ కప్‌లో ఆరు మ్యాచ్‌ల్లో తలపడితే... నాలుగింటిలో సఫారీలు, రెండింటిలో వెస్టిండీస్ గెలిచింది. దక్షిణాఫ్రికా డుప్లెసిస్(కెప్టెన్), హషీమ్ ఆమ్లా, డీకాక్, మర్కరమ్, వాన్ డెర్ డస్సెన్, డేవిడ్ మిల్లర్, ఫెహ్లుక్వోయో, క్రిస్ మోరిస్, కగిసో రబడా, ఇమ్రాన్ తాహీర్, హెండ్రిక్స్ వెస్టిండీస్ జాసన్ హోల్డర్(కెప్టెన్), క్రిస్ గేల్, షాయ్ హోప్, డారెన్ బ్రేవో, నికోలస్ పూరన్, హెట్ మెయిర్, బ్రాత్‌వైట్, ఆశ్లే నర్స్, కీమర్ రోచ్, షెల్డాన్ కాట్రెల్, ఓష్నే థామస్