దక్షిణాఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహారాజ్ అరుదైన ఘనత సాధించాడు. టెస్టు క్రికెట్‌లో సౌతాఫ్రికా తరపున అత్యధిక వికెట్లు పడగొట్టిన స్పిన్నర్‌గా మహారాజ్ రికార్డులెక్కాడు. గయనా వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన రెండో టెస్టులో 5 వికెట్లు పడగొట్టిన కేశవ్ ఈ అరుదైన ఫీట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.
ఇప్పటివరకు 52 టెస్టులు ఆడిన ఈ ప్రోటీస్ స్టార్ స్పిన్నర్.. 171 వికెట్లు పడగొట్టాడు. ఇంతకుముందు ఈ రికార్డు సౌతాఫ్రికా లెజెండరీ స్పిన్నర్ హ్యూ టేఫీల్డ్(170) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో హ్యూ టేఫీల్డ్ ఆల్‌టైమ్ రికార్డును కేశవ్ బద్దలు కొట్టాడు.
ఓవరాల్‌గా ఈ ఘనత సాధించిన జాబితాలో సఫారీ పేస్ గన్(439) అగ్రస్ధానంలో కొనసాగుతున్నాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. రెండో టెస్టులో విండీస్‌పై 40 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా విజయం సాధించింది. తద్వారా రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను 0-1 తేడాతో ప్రోటీస్ జట్టు కైవసం చేసుకుంది.
స్కోర్లు
దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్: 160/10
వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్: 144/10
దక్షిణాఫ్రికా సెకెండ్ ఇన్నింగ్స్: 246/10
విండీస్ సెకెండ్ ఇన్నింగ్స్: 222/10
ఫలితం: 40 పరుగుల తేడాతో విండీస్‌పై ప్రోటీస్ విజయం
Comments
Please login to add a commentAdd a comment