Keshav Maharaj
-
పాక్‌తో టెస్టులు: సౌతాఫ్రికా జట్టు ప్రకటన.. అన్క్యాప్డ్ ప్లేయర్లకు చోటు
ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) 2023-25 ఫైనల్‌కు అడుగుదూరంలో ఉంది సౌతాఫ్రికా. సొంతగడ్డపై పాకిస్తాన్‌తో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసి.. టైటిల్ పోరుకు అర్హత సాధించాలని పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలో రిస్క్ తీసుకునేందుకు కూడా ప్రొటిస్ బోర్డు వెనుకాడటం లేదు.గాయం బారినపడ్డ కేశవ్ మహరాజ్, వియాన్ ముల్దర్లను కూడా టెస్టు జట్టుకు ఎంపిక చేయడం ఇందుకు నిదర్శనం. కాగా పాకిస్తాన్‌తో డిసెంబరు 26 నుంచి సౌతాఫ్రికా టెస్టు సిరీస్ మొదలుకానుంది. ఈ నేపథ్యంలో ఇందుకు సంబంధించి ప్రొటిస్ బోర్డు బుధవారం తమ జట్టును ప్రకటించింది.తొలి పిలుపుపదహారు మంది సభ్యులున్న ఈ టీమ్‌లో అన్క్యాప్డ్ ప్లేయర్‌కు చోటిచ్చింది. పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అయిన కార్బిన్ బాష్‌కు తొలిసారి పిలుపునిచ్చింది. అదే విధంగా.. గజ్జల్లో గాయంతో బాధపడుతున్న స్పిన్నర్ కేశవ్ మహరాజ్, వేలి నొప్పి నుంచి కోలుకుంటున్న ఆల్‌రౌండర్ వియాన్ ముల్దర్‌ను కూడా ఈ జట్టులో చేర్చింది.కాగా తొలి వన్డే సందర్భంగా గాయపడ్డ కేశవ్ మహరాజ్ కోలుకోని పక్షంలో.. అతడి స్థానంలో స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ సెనూరన్ ముత్తుస్వామిని జట్టుకు ఎంపిక చేయనున్నారు. అదే విధంగా సీమ్ బౌలింగ్ ఆల్‌రౌండర్ ముల్దర్ ఫిట్నెస్ సాధిస్తే.. బ్యాటర్ మాథ్యూ బ్రీట్జ్కు ఉద్వాసన పలుకనున్నారు.క్వెనా మఫాకా కూడాఇక తెంబా సారథ్యంలో పాక్‌తో టెస్టులు ఆడనున్న సౌతాఫ్రికా జట్టులో స్థానం సంపాదించిన బాష్.. ఇప్పటి వరకు 34 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు. 40.46 సగటుతో పరుగులు రాబట్టడంతో పాటు.. 72 వికెట్లు పడగొట్టాడు. మరోవైపు.. మరో పేసర్, పద్దెమినిదేళ్ల క్వెనా మఫాకా కూడా తొలిసారి టెస్టు జట్టులోకి వచ్చాడు.అయితే, పేస్ సూపర్స్టార్లు లుంగి ఎంగిడి, గెరాల్డ్ కొయెట్జిలతో పాటు నండ్రీ బర్గర్, లిజాడ్ విలియమ్స్ తదితరులు సెలక్షన్‌కు అందుబాటులో లేరు. మరోవైపు.. కగిసో రబడ, మార్కో జాన్సెన్ పాక్‌తో తొలి వన్డే ఆడినా.. ఆ తర్వాత నుంచి విశ్రాంతి తీసుకోనున్నారు. టెస్టుల నేపథ్యంలో బోర్డు వారికి రెస్ట్ ఇచ్చింది. కాగా పాక్‌తో ఒక్క టెస్టులో గెలిచినా డబ్ల్యూటీసీ ఫైనల్ రేసులో సౌతాఫ్రికా ముందు వరుసలో ఉంటుంది. ఇక పాక్‌తో సౌతాఫ్రికా టెస్టులకు సెంచూరియన్, కేప్‌టౌన్ వేదికలు. పాకిస్తాన్‌తో టెస్టులకు సౌతాఫ్రికా జట్టుతెంబా బవుమా (కెప్టెన్), డేవిడ్ బెడింగ్హామ్, కార్బిన్ బాష్, మాథ్యూ బ్రీట్జ్, టోనీ డి జోర్జీ, మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్, క్వెనా మఫాకా, ఐడెన్ మార్క్రమ్, వియాన్ ముల్దర్, సెనురన్ ముత్తుస్వామి, డేన్ ప్యాటర్సన్, కగిసో రబడ, ర్యాన్ రికెల్టన్, ట్రిస్టన్ స్టబ్స్, కైల్ వెరెయిన్ (వికెట్ కీపర్).చదవండి: WTC Final: టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ చేరుతుందా? -
పాక్‌తో వన్డే సిరీస్.. సౌతాఫ్రికా విధ్వంసకర వీరుల రీఎంట్రీ
పాకిస్తాన్‌తో వన్డే సిరీస్‌కు క్రికెట్ సౌతాఫ్రికా తమ జట్టును ప్రకటించింది. తెంబా బవుమా సారథ్యంలోని ఈ జట్టులో క్వెనా మఫాకాకు తొలిసారి చోటు ఇచ్చినట్లు తెలిపింది. ఇక ఈ సిరీస్‌తో కగిసో రబడ, ట్రిస్టన్ స్టబ్స్, కేశవ్ మహరాజ్ పునరాగమనం చేయనుండగా.. టీ20 వీరులు డేవిడ్ మిల్లర్, హెన్రిచ్ క్లాసెన్ సైతం తిరిగి వన్డే జట్టులో స్థానం సంపాదించారు.డిసెంబరు 17 నుంచి వన్డే సిరీస్ కాగా మూడు టీ20, మూడు వన్డే, రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ఆడేందుకు పాకిస్తాన్ సౌతాఫ్రికా పర్యటనకు వచ్చింది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య డిసెంబరు 10న తొలి టీ20 జరుగగా.. ఆతిథ్య జట్టు 11 పరుగుల తేడాతో పాక్‌పై గెలిచింది. ఇక డిసెంబరు 13న రెండో, డిసెంబరు 14న మూడో టీ20 జరుగునుండగా.. డిసెంబరు 17 నుంచి వన్డే సిరీస్ మొదలుకానుంది.‘అన్క్యాప్డ్’ ప్లేయర్‌కు చోటుఈ నేపథ్యంలో సౌతాఫ్రికా గురువారం తమ వన్డే జట్టును ప్రకటించింది. ఇక ఈ సిరీస్‌తో పద్దెమినిదేళ్ల లెఫ్టార్మ్ పేసర్ క్వెనా మఫాకా వన్డేల్లో అరంగేట్రం చేసే అవకాశం ఉంది. ఇటీవల వెస్టిండీస్‌తో టీ20 సిరీస్ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన క్వెనా మఫాకా.. పాక్‌తో తొలి టీ20లో అదరగొట్టాడు. తన అద్భుత బౌలింగ్‌తో బాబర్ ఆజంను అవుట్ చేశాడు. మొత్తంగా ఈ మ్యాచ్‌లో నాలుగు ఓవర్ల బౌలింగ్ కోటా పూర్తిచేసి 39 పరుగులిచ్చి రెండు వికెట్లు కూల్చాడు.గాయాల బెడదమరోవైపు.. స్టార్ పేసర్ అన్రిచ్ నోర్జే కాలి గాయం కారణంగా.. మిగిలిన రెండు టీ20లు, వన్డే సిరీస్‌కు దూరమయ్యాడు. ఇక వేలు విరిగిన కారణంగా వియాన్ ముల్దర్, తుంటినొప్పి వల్ల లుంగి ఎంగిడి, గజ్జల్లో గాయం కారణంగా గెరాల్డ్ కోయెట్జి, వెన్నునొప్పితో బాధపడుతున్న నండ్రీ బర్గర్ సెలక్షన్‌కు అందుబాటులో లేకుండా పోయారు.వారికి పునఃస్వాగతంఇదిలా ఉంటే.. పాక్‌తో టీ20 సిరీస్‌లో విశ్రాంతి తీసుకున్న రబడ, స్టబ్స్, కేశవ్ మహరాజ్ రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో సౌతాఫ్రికా కోచ్ రాబ్ వాల్టర్ మాట్లాడుతూ.. తాము తమ వన్డే జట్టు పట్ల పూర్తి సంతృప్తితో ఉన్నట్లు తెలిపాడు. క్వెనా మఫాకాకు కొత్త పాఠాలు నేర్చుకునే అవకాశం దొరుకుతుందని.. క్లాసెన్, మిల్లర్లకు వన్డే జట్టులోకి తిరిగి స్వాగతం పలుకుతున్నట్లు పేర్కొన్నాడు.పాకిస్తాన్‌తో వన్డే సిరీస్‌కు సౌతాఫ్రికా క్రికెట్ జట్టుతెంబా బవుమా (కెప్టెన్), ఒట్ట్నీల్ బార్ట్‌మన్, టోనీ డి జోర్జీ, మార్కో జాన్సెన్, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), కేశవ్ మహరాజ్, క్వెనా మఫాకా, ఐడెన్ మార్క్రమ్, డేవిడ్ మిల్లర్, ఆండిల్ ఫెహ్లుక్వాయో, కగిసో రబాడ, ట్రిస్టన్ స్టబ్స్, ర్యాన్ రికెల్టన్, తబ్రేజ్ షంసీ, రాస్సీ వాన్ డెర్ డస్సెన్.సౌతాఫ్రికా వర్సెస్ పాకిస్తాన్ వన్డే సిరీస్ షెడ్యూల్తొలి వన్డే- డిసెంబరు 17- పర్ల్- బోలాండ్ పార్క్రెండో వన్డే- డిసెంబరు 19- సెంచూరియన్- సూపర్‌స్పోర్ట్ పార్క్మూడో వన్డే- డిసెంబరు 22- జొహన్నస్‌బర్గ్- ది వాండరర్స్ స్టేడియం.చదవండి: భారత్‌తో మూడో టెస్టు... ఆసీస్ స్టార్ క్రికెటర్‌పై వేటు! -
బంగ్లా ఆల్‌రౌండర్ విశ్వరూపం.. సౌతాఫ్రికాకు షాకిచ్చేలా!
సౌతాఫ్రికాతో తొలి టెస్టులో బంగ్లాదేశ్ క్రికెటర్ మెహదీ హసన్ మిరాజ్ అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఈ మ్యాచ్‌లో వికెట్లు(2) తీయడంతో పాటు బ్యాట్ ఝులిపిస్తూ సత్తా చాటుతున్నాడు ఈ స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్. మిరాజ్ సూపర్ బ్యాటింగ్ కారణంగానే బంగ్లా ఇన్నింగ్స్ ఓటమి నుంచి తప్పించుకుని మళ్లీ పోటీలోకి వచ్చే స్థితిలో నిలిచింది.106 పరుగులకే ఆలౌట్‌కాగా రెండు టెస్టుల సిరీస్ ఆడేందుకు సౌతాఫ్రికా బంగ్లాదేశ్‌లో పర్యటిస్తోంది. ఇందులో భాగంగా ఇరుజట్ల మధ్య సోమవారం ఢాకా వేదికగా తొలి టెస్టు ఆరంభమైంది. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, ప్రొటిస్ బౌలర్ల ధాటికి నిలవలేక తొలి ఇన్నింగ్స్‌లో 106 పరుగులకే ఆలౌట్ అయింది. 202 పరుగుల ఆధిక్యంలో సౌతాఫ్రికాసౌతాఫ్రికా బౌలర్లలో కగిసో రబాడ, వియాన్ ముల్దర్, కేశవ్ మహరాజ్ మూడేసి వికెట్లు పడగొట్టగా.. డేన్ పీడ్ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికా 308 పరుగులు చేసి.. తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ కంటే 202 రన్స్ ఆధిక్యంలో నిలిచింది. అయితే, రెండో ఇన్నింగ్స్‌లోనూ బంగ్లాదేశ్‌కు శుభారంభం లభించలేదు. ఓపెనర్ షాద్మన్ ఇస్లాం(1), వన్‌డౌన్ బ్యాటర్ మొమినుల్ హక్(0) పూర్తిగా విఫలమయ్యారు.ఈ దశలో మరో ఓపెనర్ మహ్మదుల్ హసన్ జాయ్ 40 పరుగులతో రాణించగా.. కెప్టెన్ నజ్ముల్ షాంటో(23) అతడికి సహకరించాడు. సీనియర్ బ్యాటర్ ముష్ఫికర్ రహీం(33) స్థాయికి తగ్గట్లు ఆడలేక చతికిలపడగా.. వికెట్ కీపర్ లిటన్ దాస్ 7 పరుగులకే అవుటయ్యాడు.మిరాజ్ మిరాకిల్ఫలితంగా ఇన్నింగ్స్ తేడాతో ఓటమిపాలయ్యే దుస్థితిలో బంగ్లాదేశ్ ఉన్న వేళ మెహదీ హసన్ మిరాజ్ ఆపద్భాందవుడిగా ఆదుకున్నాడు. ఏడోస్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన అతడు ఊహించని రీతిలో సౌతాఫ్రికా బౌలర్లకు షాకిచ్చాడు.తన బ్యాటింగ్ విశ్వరూపం ప్రదర్శిస్తూ.. అర్ధ శతకం పూర్తిచేసుకున్నాడు. బుధవారం నాటి మూడో రోజు ఆటలో భాగంగా 171 బంతులు ఎదుర్కొని 87 పరుగులతో అజేయంగా నిలిచాడు. మిరాజ్‌తో పాటు వికెట్ కీపర్ బ్యాటర్ జాకిర్ అలీ సైతం హాఫ్ సెంచరీ(58)తో రాణించాడు.సరికొత్త రికార్డుఈ క్రమంలో వీరిద్దరు కలిసి సౌతాఫ్రికాపై సరికొత్త రికార్డు నెలకొల్పారు. 138 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసి.. సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో ఏ వికెట్‌కైనా అత్యధిక పార్ట్నర్షిప్ సాధించిన జోడీగా మెహదీ హసన్ మిరాజ్- జాకిర్ అలీ నిలిచారు. ఈ సందర్భంగా హబీబుల్ బషార్- జావేద్ ఒమర్(131 రన్స్) పేరిట ఉన్న రికార్డు బ్రేక్ చేశారు.ఎట్టకేలకు లీడ్లోకిఇదిలా ఉంటే.. బుధవారం నాటి మూడో రోజు ఆట ముగిసే సరికి మిరాజ్ 87, నయీం హసన్ 16 పరుగులతో క్రీజులో ఉన్నారు. బంగ్లాదేశ్ 85 ఓవర్ల ఆటలో ఏడు వికెట్ల నష్టానికి 283 పరుగులు చేసి.. 81 పరుగుల లీడ్‌లోకి వచ్చింది. ఇక బంగ్లా రెండో ఇన్నింగ్స్‌లో ప్రొటిస్ బౌలర్లలో కగిసో రబాడ నాలుగు వికెట్లతో చెలరేగగా.. కేశవ్ మహరాజ్ మూడు వికెట్లు పడగొట్టాడు. చదవండి: Ind vs NZ: అతడి ఆట తీరు బాగుంది.. అయినా..: గంభీర్ -
ప్లేయర్ ఆఫ్ ద మంత్ నామినీస్ వీరే..!
ఆగస్ట్ నెల ప్లేయర్ ఆఫ్ ద మంత్ నామినీస్ వివరాలను ఐసీసీ ఇవాళ (సెప్టెంబర్ 5) ప్రకటించింది. పురుషుల విభాగంలో సౌతాఫ్రికాకు చెందిన కేశవ్ మహారాజ్, వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్ జేడెన్ సీల్స్, శ్రీలంక ఆల్‌రౌండర్ దునిత్ వెల్లలగే అవార్డు రేసులో ఉండగా.. మహిళల విభాగంలో శ్రీలంకకు చెందిన హర్షిత సమరవిక్రమ, ఐర్లాండ్ ఆల్‌రౌండర్ ఓర్లా ప్రెండర్‌గాస్ట్, ఐర్లాండ్ ఓపెనర్ గాబీ లూయిస్ పోటీలో ఉన్నారు.కేశవ్ మహారాజ్: ఈ దక్షిణాఫ్రికా స్పిన్నర్ గత నెలలో వెస్టిండీస్‌తో జరిగిన రెండు టెస్ట్ మ్యాచ్‌లలో విశేషంగా రాణించి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు గెలుచుకున్నాడు. మహారాజ్ ఈ రెండు మ్యాచ్‌ల్లో 13 వికెట్లు పడగొట్టాడు.జేడెన్ సీల్స్: ఈ విండీస్ ఫాస్ట్ బౌలర్ గత నెలలో సౌతాఫ్రికాతో జరిగిన టెస్ట్ సిరీస్‌లో 12 వికెట్లు తీసి అద్భుతంగా రాణించాడు. ఈ సిరీస్‌లోని రెండో టెస్ట్‌లో సీల్స్ ఏకంగా తొమ్మిది వికెట్లు పడగొట్టాడు. తద్వారా అతను ఐసీసీ ర్యాంకింగ్స్‌లో 13వ స్థానానికి ఎగబాకాడు.దునిత్ వెల్లలగే: ఈ లంక ఆల్‌రౌండర్ గత నెలలో భారత్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు గెలుచుకున్నాడు. ఈ సిరీస్‌ను భారత్ 0-2 తేడాతో కోల్పోయింది. వెల్లలగే తొలి వన్డేలో 67 నాటౌట్, రెండో వన్డేలో 39 మరియు రెండు వికెట్లు, మూడో వన్డేలో ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. -
WI vs SA: చరిత్ర సృష్టించిన కేశవ్ మహారాజ్..
దక్షిణాఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహారాజ్ అరుదైన ఘనత సాధించాడు. టెస్టు క్రికెట్లో సౌతాఫ్రికా తరపున అత్యధిక వికెట్లు పడగొట్టిన స్పిన్నర్‌గా మహారాజ్ రికార్డులెక్కాడు. గయనా వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన రెండో టెస్టులో 5 వికెట్లు పడగొట్టిన కేశవ్ ఈ అరుదైన ఫీట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పటివరకు 52 టెస్టులు ఆడిన ఈ ప్రోటీస్ స్టార్ స్పిన్నర్.. 171 వికెట్లు పడగొట్టాడు. ఇంతకుముందు ఈ రికార్డు సౌతాఫ్రికా లెజెండరీ స్పిన్నర్ హ్యూ టేఫీల్డ్(170) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో హ్యూ టేఫీల్డ్ ఆల్‌టైమ్ రికార్డును కేశవ్ బద్దలు కొట్టాడు. ఓవరాల్‌గా ఈ ఘనత సాధించిన జాబితాలో సఫారీ పేస్ గన్(439) అగ్రస్ధానంలో కొనసాగుతున్నాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. రెండో టెస్టులో విండీస్‌పై 40 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా విజయం సాధించింది. తద్వారా రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను 0-1 తేడాతో ప్రోటీస్ జట్టు కైవసం చేసుకుంది.స్కోర్లుదక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్: 160/10వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్: 144/10దక్షిణాఫ్రికా సెకెండ్ ఇన్నింగ్స్: 246/10విండీస్ సెకెండ్ ఇన్నింగ్స్: 222/10ఫలితం: 40 పరుగుల తేడాతో విండీస్‌పై ప్రోటీస్ విజయం -
వెస్టిండీస్‌పై దక్షిణాఫ్రికా ఘన విజయం.. సిరీస్ సొంతం
గయానా వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన రెండో టెస్టులో 40 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా ఘన విజయం సాధించింది. దీంతో రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 0-1 తేడాతో సౌతాఫ్రికా కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సఫారీలు తమ మొదటి ఇన్నింగ్స్‌లో 160 పరుగులకే కుప్పకూలింది.విండీస్ బౌలర్లలో యువ పేసర్ షమీర్ జోషఫ్ 5 వికెట్లతో చెలరేగగా.. సీల్స్ మూడు,హోల్డర్, మోటీ తలా వికెట్ సాధించారు. ప్రోటీస్ బ్యాటర్లలో డేన్ పీడ్ట్(38) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం వెస్టిండీస్ కూడా తొలి ఇన్నింగ్స్‌లో తేలిపోయింది.దక్షిణాఫ్రికా బౌలర్ల దాటికి 144 పరుగులకే చాప చుట్టేసింది. 16 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టిన ప్రోటీస్ 246 పరుగులకు ఆలౌటైంది. సౌతాఫ్రికా సెకెండ్ ఇన్నింగ్స్‌లో వెర్రెయిన్నే(59), మార్క్రమ్(51) హాఫ్ సెంచరీలతో రాణించారు.వెస్టిండీస్ బౌలర్లలో జైడన్ సీల్స్ 6 వికెట్లతో సత్తాచాటాడు. ఇక తొలి ఇన్నింగ్స్‌లో లభించిన ఆధిక్యాన్ని కలుపునకుని విండీస్ ముందు 263 పరుగుల లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా ఉంచింది. లక్ష్య చేధనలో కరేబియన్ జట్టు 222 పరుగులకు ఆలౌటైంది. కేశవ్ మహారాజ్, రబాడ తలా మూడు వికెట్లతో ఆతిథ్య జట్టును దెబ్బకొట్టాడు. ఇక ఇరు జట్ల మధ్య టీ20 సిరీస్ ఆగస్టు 23 నుంచి ప్రారంభం కానుంది. -
రోహిత్ శర్మకు నేను వీరాభిమానిని.. ఫియర్ లెస్‌గా ఆడుతాడు: మహారాజ్
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చరిత్ర సృష్టించేందుకు అడుగుదూరంలో నిలిచాడు. గత 13 ఏళ్లగా భారత్‌ను ఊరిస్తున్న వరల్డ్‌కప్‌ను అందించేందుకు హిట్‌మ్యాన్ సిద్దమయ్యాడు. టీ20 వరల్డ్‌కప్-2024 ఫైనల్ పోరులో బార్బోడస్ వేదికగా దక్షిణాఫ్రికాతో భారత్ తలపడనుంది. అయితే ఈ టోర్నీలో రోహిత్ శర్మ కెప్టెన్‌గానే కాకుండా వ్యక్తిగత ప్రదర్శనలతో కూడా అదరగొడుతున్నాడు. ఈ మెగా ఈవెంట్లో రోహిత్ సారథ్యంలోని భారత్ జట్టు ఇప్పటివరకు ఆజేయంగా నిలిచింది. ఆడిన 7 మ్యాచ్‌ల్లోనూ రోహిత్ సేన విజయం సాధించింది. సూపర్-8లో ఆసీస్‌పై అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడిన రోహిత్.. ఇంగ్లండ్‌తో సెమీస్‌లోనూ సత్తాచాటాడు. ఈ క్రమంలో దక్షిణాఫ్రికాతో ఫైనల్లోనూ రోహిత్ అదరగొట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మపై సౌతాఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహారాజ్ ప్రశంసల వర్షం కురిపించాడు. హిట్‌మ్యాన్‌కు తన పెద్ద అభిమానినని మహారాజ్ చెప్పుకొచ్చాడు."నేను రోహిత్ శర్మకు వీరాభిమానిని. బ్యాటింగ్‌లో అతడు డేరింగ్ అండ్ డాషింగ్. బౌలర్లకు అతడంటే చాలా భయం. కెప్టెన్‌గా కూడా రోహిత్ అద్బుతం. అతడికి అత్యుత్తమ నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. గేమ్‌ను బాగా ఆర్ధం చేసుకుంటాడు. జట్టులో పూర్తి స్వేఛ్చను రోహిత్ ఇస్తాడు. ఆటగాళ్లను సపోర్ట్ చేసి వారిలో బెస్ట్‌ను తీయడంలో రోహిత్ దిట్ట. ఫీల్డ్‌లో కూడా రోహిత్ చాలా వ్యూహాత్మకంగా ఉంటడాని" స్టార్ స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మహారాజ్ పేర్కొన్నాడు. -
నరాలు తెగే ఉత్కంఠ: ఒక్క క్యాచ్‌తో అంతా తలకిందులు.. వీడియో
టీ20 ప్రపంచకప్-2024లో దక్షిణాఫ్రికా జైత్రయాత్ర కొనసాగుతోంది. శ్రీలంక, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్, నేపాల్‌లతో కలిసి గ్రూప్-డిలో భాగమైన ప్రొటిస్ జట్టు ఇప్పటికే మూడు మ్యాచ్‌లు ఆడేసింది.తొలుత శ్రీలంకను ఆరు వికెట్ల తేడాతో చిత్తు చేసిన మార్క్రమ్ బృందం.. ఆ తర్వాత నెదర్లాండ్స్ పనిపట్టింది. నాలుగు వికెట్ల తేడాతో ఆ జట్టును ఓడించి.. గ్రూప్-డి టాపర్‌గా నిలిచింది.ఇక తాజాగా సోమవారం నాటి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన పోరులో.. చివరికి పైచేయి సాధించింది. నాలుగు పరుగుల స్వల్ప తేడాతో నజ్ముల్ షాంటో బృందాన్ని ఓడించిన సౌతాఫ్రికా.. ఈ ఎడిషన్‌లో సూపర్-8 చేరిన తొలి జట్టుగా నిలిచింది.న్యూయార్క్ వేదికగా ఆద్యంతం ఆసక్తి రేపిన ఈ మ్యాచ్‌లో.. టాస్ గెలిచి ప్రొటిస్ జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్ క్వింటన్ డికాక్(18) ఒక్కడు కాస్త ఫర్వాలేదనిపించగా.. మరో ఓపెనర్ రీజా హెండ్రిక్స్(0), కెప్టెన్ ఐడెన్ మార్క్రమ్(4) పూర్తిగా నిరాశపరిచారు.నాలుగో నంబర్ బ్యాటర్ ట్రిస్టన్ స్టబ్స్ సైతం సున్నాకే పెవిలియన్ చేరాడు. ఈ క్రమంలో పీకల్లోతు కష్టాలో ఉన్న సౌతాఫ్రికాను హెన్రిచ్ క్లాసెన్ గట్టెక్కించాడు.తన శైలికి భిన్నంగా ఆచితూచి ఆడుతూ 44 బంతుల్లో 46 పరుగులు సాధించాడు క్లాసెన్. అతడికి తోడుగా డేవిడ్ మిల్లర్(29) రాణించాడు. ఈ క్రమంలో సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 113 పరుగులు చేసింది.ఇక లక్ష్యం స్వల్పంగానే కనిపిస్తున్నా.. బ్యాటింగ్‌కు అనుకూలించని న్యూయార్క్ పిచ్‌పై బంగ్లాదేశ్ పరుగులు రాబట్టేందుకు ఆపసోపాలు పడింది. టాపార్డర్‌లో కెప్టెన్ నజ్ముల్ షాంటో(14) మినహా అందరూ సింగిల్ డిజిట్ స్కోర్లు చేయగా.. తౌహీద్ హృదయ్(37), మహ్మదుల్లా(20) బంగ్లా శిబిరంలో గెలుపు ఆశలు రేకెత్తించారు.సౌతాఫ్రికాపై గెలవాలంటే ఆఖరి ఓవర్లో విజయానికి 11 పరుగులు అవసరం కాగా.. కేవలం ఆరు పరుగులే వచ్చాయి. అయితే, ఈ ఓవర్ ఆసాంతం ఎంతో ఆసక్తిగా సాగింది.డెత్ ఓవర్లో మార్క్రమ్ తమ స్పిన్నర్ కేశవ్ మహరాజ్ చేతికి బంతినివ్వగా.. అతడు వైడ్‌తో ఆరంభించాడు. దీంతో బంగ్లా విజయ సమీకరణం ఆరు బంతుల్లో 10 పరుగులుగా మారింది.ఈ క్రమంలో మహ్మదుల్లా 1, జాకిర్ అలీ 2 పరుగులు తీయగా.. నాలుగు బంతుల్లో 7 పరుగులు అవసరమయ్యాయి. అయితే, అక్కడే మ్యాచ్ మలుపు తిరిగింది. మహరాజ్ బౌలింగ్‌లో జాకిర్ అలీ(8) ఇచ్చిన క్యాచ్‌ను మార్క్రమ్ ఒడిసిపట్టాడు.ఆ తర్వాతి బంతికి లెగ్‌బై రూపంలో ఒక పరుగు రాగా.. రెండు బంతుల్లో 6 పరుగులు అవసరమయ్యాయి. ఈ క్రమంలో మహరాజ్ బౌలిండ్లో షాట్ ఆడేందుకు ప్రయత్నించిన మహ్మదుల్లా బౌండరీ దిశగా బంతిని గాల్లోకి లేపాడు.అయితే, బౌండరీ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న మార్క్రమ్ ఊహించని రీతిలో క్యాచ్ అందుకోగా.. మహ్మదుల్లా ఇన్నింగ్స్‌కు తెరపడింది. ఇక ఆఖరి బంతికి ఆరు పరుగులు అవసరం కాగా టస్కిన్ అహ్మద్ ఒక్కటి మాత్రమే తీయగలిగాడు.చదవండి: జట్టును నాశనం చేసింది ఎవరో చెప్తా: ఆఫ్రిది ఘాటు వ్యాఖ్యలు View this post on Instagram A post shared by ICC (@icc) దీంతో సౌతాఫ్రికా నాలుగు పరుగుల తేడాతో విజయం సాధించి సూపర్-8లో అడుగుపెట్టింది. నిజానికి మార్క్రమ్ గనుక మహ్మదుల్లా క్యాచ్ వదిలేసి ఉంటే ఫలితం వేరేలా ఉండేది. అయితే, బ్యాటింగ్‌లో విఫలమైనా తన కెప్టెన్సీ, అద్బుత ఫీల్డింగ్‌తో మార్క్రమ్ సౌతాఫ్రికా విజయంలో కీలక పాత్ర పోషించాడు. View this post on Instagram A post shared by ICC (@icc) -
రాజస్తాన్ రాయల్స్ జట్టులో కేశవ్ మహరాజ్
దక్షిణాఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహరాజ్‌కు ఐపీఎల్లో ఆడే అవకాశాన్ని దక్కించుకున్నాడు. గాయంతో ఐపీఎల్ టోర్నీకి దూరమైన బౌలర్ ప్రసిధ్ కృష్ణ స్థానంలో రాజస్తాన్ రాయల్స్ జట్టు కేశవ్ ను అతని కనీస ధర రూ. 50 లక్షలకు జట్టులోకి తీసు కుంది. 34 ఏళ్ల కేశవ్ దక్షిణాఫ్రికా తరఫున 27 టి20లు, 44 వన్డేలు, 50 టెస్టులు ఆడి మొత్తం 237 వికెట్లు తీశాడు. మరోవైపు గాయపడ్డ ముజీబ్ ఉర్ రెహ్మాన్ స్థానంలో కోల్‌కతా నైట్‌రైడర్స్ అఫ్గానిస్తాన్‌కు చెందిన 16 ఏళ్ల స్పిన్నర్ అల్లా ఘజన్‌ఫర్‌ను జట్టులోకి తీసుకుంది. -
అయోధ్య రాముడిని దర్శించుకున్న సౌతాఫ్రికా స్టార్ క్రికెటర్
దక్షిణాఫ్రికా స్టార్ క్రికెటర్ కేశవ్ మహారాజ్ తొలిసారి ఐపీఎల్లో భాగం కానున్నాడు. ఐపీఎల్-2024లో లక్నో సూపర్ జెయింట్స్‌కు మహారాజ్ ప్రాతినిథ్యం వహించనున్నాడు. గతేడాది డిసెంబర్లో జరిగిన మినీ వేలంలో రూ.50 లక్షల కనీస ధరకు మహారాజ్‌ను లక్నో సొంతం చేసుకుంది. ఇప్పటికే లక్నో జట్టుతో కేశవ్ మహారాజ్ కలిశాడు. లక్నో సూపర్ జెయింట్స్ జట్టు ప్రస్తుతం లక్నోలోని ఏక్నా స్టేడియంలో తీవ్రంగా శ్రమిస్తోంది. ఈ క్రమంలో ఆయోద్య రామమందిరాన్ని మహారాజ్ గురువారం సందర్శించాడు. View this post on Instagram A post shared by Lucknow Super Giants (@lucknowsupergiants) మందిరంలో బాల రాముని విగ్రహాన్ని ఈ ప్రోటీస్ స్టార్ దర్శించుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటోను సోషల్ మీడియాలో కేశవ్ షేర్ చేశాడు. అందుకు క్యాప్షన్‌గా జై శ్రీరామ్ అంటూ రాసుకొచ్చాడు. దీంతో ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా భారత సంతతికి చెందిన కేశవ్ మహారాజ్ రామభక్తుడు అన్న సంగతి తెలిసిందే. ఇటీవల కాలంలో అతడి బ్యాటింగ్‌కు వచ్చిన ప్రతీసారి ‘‘రామ్ సియా రామ్’’ అంటూ సాగే పాటను ప్లే చేస్తున్నారు.కాగా ఈ ఏడాది జనవరి 22న అయోధ్యలో భవ్య రామ మందిరంలో బాల రాముడి ప్రతిష్టాపన జరిగిన విషయం తెలిసిందే. View this post on Instagram A post shared by Keshav Maharaj (@keshavmaharaj16) -
అయోధ్యలో శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ట.. సౌతాఫ్రికా స్టార్ క్రికెటర్ స్పెషల్ విషెస్
భవ్య రామమందిరంలో బాలరాముడి ప్రాణప్రతిష్ట కోసం అయోధ్య నగరం అందంగా ముస్తాబైంది. అయోధ్య గర్భగుడిలో రామ్‌లల్లా కొలువుదీరబోతున్నాడు. 500 ఏళ్ల నాటి హిందువుల కల కాసేపట్లో నెరవేరనుంది. అయోధ్యలోని రామమందిరం 'ప్రాణ ప్రతిష్ఠ' మహోత్సవం కోసం యావత్ భారతదేశం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. సోమవారం మధ్యాహ్నం 12: 20 గంటలకు ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది. ఈ వేడుకను ప్రత్యేక్షంగా వీక్షించేందుకు రాజకీయ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, సెలబ్రెటీలు అయోధ్యకు చేరుకున్నారు. చాలా మంది క్రికెట్ దిగ్గజాలతో పాటు ప్రస్తుత తరం క్రికెటర్లకు సైతం రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ఆహ్వానాలను పంపించింది. రామమందిర ప్రాణప్రతిష్ఠ సందర్భంగా దక్షిణాఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహరాజ్ స్పందించాడు. భారత్‌కు తన శుభాకాంక్షలను తెలియజేశాడు. అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి నమస్తే.. ఈ రోజు భారత దేశ చరిత్రలో ఎప్పటికీ చిరస్మరణీయంగా నిలిచిపోతుంది. దక్షిణాఫ్రికాలో ఉన్న భారత సంతతి ప్రజలకు నా శుభాకాంక్షలు చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను. అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం ఘనంగా జరగాలని కోరుకుంటున్నాను. అందరిలోనూ శాంతి, సామరస్యం, ఆధ్యాత్మిక జ్ఞానోదయం తీసుకురావాలి. జై శ్రీరామ్’’ అని ఇన్‌స్ట్రాగ్రామ్‌లో కేశవ్ మహరాజ్ పేర్కొన్నాడు. కాగా కేశవ్ మహారాజ్ భారత సంతతికి చెందినవాడన్న విషయం తెలిసిందే. అంతేకాకుండా రామభక్తుడు కూడా. ఇటీవల కాలంలో అతడి బ్యాటింగ్‌కు వచ్చిన ప్రతీసారి ‘‘రామ్ సియా రామ్’’ అంటూ సాగే పాటను ప్లే చేస్తున్నారు. చదవండి: BBL 2024: పాకిస్తాన్ బ్యాటర్‌కు ఊహించని షాకిచ్చిన బోర్డు.. ఎయిర్ పోర్ట్ నుంచే రిటర్న్!? Keshav Maharaj wishes everyone ahead of the Pran Pratishtha of Lord Rama in Ram Temple. pic.twitter.com/zU00hr7DgJ — Mufaddal Vohra (@mufaddal_vohra) January 21, 2024 -
పాట మొదలుకాగానే రాహుల్ అలా.. బదులిచ్చిన కేశవ్ మహరాజ్! వైరల్
KL Rahul-Keshav Maharaj stump-mic chat over 'Ram Siya Ram': టీమిండియా- సౌతాఫ్రికా మధ్య మూడో వన్డే సందర్భంగా ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. భారత జట్టు తాత్కాలిక కెప్టెన్ కేఎల్ రాహుల్, ప్రొటిస్ స్పిన్నర్ కేశవ్ మహరాజ్ జరిగిన సరదా సంభాషణ నెట్టింట వైరల్‌గా మారింది. కాగా సిరీస్ సొంతం చేసుకోవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో టీమిండియా అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. పర్ల్ వేదికగా గురువారం జరిగిన మ్యాచ్‌లో టాస్ ఓడి.. సౌతాఫ్రికా ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసింది భారత జట్టు. సంజూ సెంచరీతో వన్‌డౌన్ బ్యాటర్ సంజూ శాంసన్ శతకం(108) బాదడంతో నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 296 పరుగులు సాధించింది. అయితే, టీమిండియా విధించిన లక్ష్యాన్ని ఛేదించడంలో సౌతాఫ్రికా తడ‘బ్యా’టుకు లోనైంది. భారత బౌలర్లు ఆకాశమే హద్దుగా చెలరేగి ప్రొటిస్ బ్యాటర్లకు చుక్కలు చూపించారు. భారత బౌలర్ల ధాటికి ప్రొటిస్ బ్యాటర్లు బెంబేలు పేసర్లు అర్ష్‌దీప్ సింగ్ నాలుగు, ఆవేశ్ ఖాన్ రెండు, ముకేశ్ కుమార్ ఒక వికెట్ తీయగా.. స్పిన్నర్లు వాషింగ్టన్ సుందర్ రెండు, అక్షర్‌పటేల్ ఒక వికెట్ పడగొట్టారు. దీంతో 218 పరుగులకే సౌతాఫ్రికా కథ ముగియగా.. 78 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఈ నేపథ్యంలో సిరీస్‌ను టీమిండియా 2-1తో సొంతం చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండగా.. మరో వీడియో కూడా నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. ఇంతకీ అందులో ఏముందంటే.. సౌతాఫ్రికా ఇన్నింగ్స్ సందర్భంగా 33.2 ఓవర్ వద్ద స్కోరు 177 ఉన్నపుడు టెయిలెండర్ కేశవ్ మహరాజ్ బ్యాటింగ్‌కు వచ్చాడు. రామ్ సీతా రామ్ ఆ సమయంలో స్టేడియం వద్ద బోలాండ్ పార్కులో.. ‘‘రామ్ సియా రామ్’’ అంటూ సాగే పాటను ప్లే చేశారు. ఇది విన్న రాహుల్ వెంటనే మహరాజ్ వైపు చూస్తూ... నువ్వు బ్యాటింగ్‌కు వచ్చిన ప్రతిసారీ ఇలాగే చేస్తారు కదా అన్న ఉద్దేశంలో నవ్వులు చిందించాడు. ఇందుకు స్పందనగా మహరాజ్ సైతం అవును అంటూ నవ్వుతూ క్రీజులో కుదురుకున్నాడు. ఈ మాటలు స్టంప్ మైకులో రికార్డయ్యాయి. ఇందుకు సంబంధించిన వీడియోను లక్నో సూపర్ జెయింట్స్.. ‘‘సూపర్ జెయింట్స్ మధ్య సరదా సంభాషణ’’ అంటూ ఎక్స్ వేదికగా షేర్ చేసింది. కాగా ఐపీఎల్లో లక్నో ఫ్రాంఛైజీకి రాహుల్ కెప్టెన్ కాగా.. సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో డర్బన్ సూపర్ జెయింట్స్(లక్నో)కు కేశవ్ మహరాజ్ ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. చదవండి: టీమిండియాకు షాకులు.. స్వదేశానికి తిరిగి వచ్చిన కోహ్లి? Super Giants banter 😂😂😂 >>>>>pic.twitter.com/k0DxIrRqLN — Lucknow Super Giants (@LucknowIPL) December 21, 2023 Watch Full Video 🕉️❤️👇👇 pic.twitter.com/U2pnTRAZWR — अर्पित 🇮🇳🕉️ (@arpitdealer) December 21, 2023 -
దక్షిణాఫ్రికా బౌలర్ సూపర్ డెలివరీ.. దెబ్బకు గిల్ ఫ్యూజ్‌లు ఔట్
వన్డే ప్రపంచకప్-2023లో దక్షిణాఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహారాజ్ సంచలన బంతితో మెరిశాడు. ఓ అద్భతమైన బంతితో టీమిండియా ఓపెనర్ శుబ్‌మన్ గిల్‌ను మహారాజ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. మహారాజ్ వేసిన బంతికి గిల్ దగ్గర సమాధానమే లేకుండా పోయింది. పవర్ ప్లే ముగిసిన వెంటటే సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బావుమా స్పిన్నర్ మహారాజ్ చేతికి బంతి ఇచ్చాడు. 11 ఓవర్లో మూడో బంతిని స్లో డెలివరీగా సంధించాడు. ఈ క్రమంలో గిల్ ఆట్సైడ్ లెగ్ వైపు ఆడటానికి ప్రయత్నించాడు. అయితే బంతి బ్యాట్‌కు మిస్స్ అయ్యి స్టంప్స్‌ను గిరాటేసింది. దీంతో గిల్ ఒక్కసారిగా బిత్తరపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఈ మ్యాచ్‌లో గిల్ కేవలం 23 పరుగులు మాత్రమే చేశాడు. చదవండి: CWC 2023: 35వ వసంతంలోకి 'కింగ్ కోహ్లి'.. పుట్టిన రోజున సచిన్ రికార్డు సమం చేసేనా..? pic.twitter.com/vze1AgdtkN — Cricket Videos Here (@CricketVideos98) November 5, 2023 -
అంతా తెలిసే చేశావంటే నిన్నేమనుకోవాలి? అతడి రాతే అంత.. ఎప్పుడూ ఇలాగే!
ICC WC 2023- South Africa Beat Pakistan By 1 Wicket: ‘‘మ్యాచ్ సాగుతూ.. ఉంది. ఎనిమిది వికెట్లు పడ్డాయి.. ఆ తర్వాత తొమ్మిదో వికెట్ కూడా తీశారు. అయినా.. గెలుపు కోసం అంతలా తంటాలు.. అసలు ఇదేం కెప్టెన్సీ? అసలు ఏం చేస్తున్నావో నీకైనా అర్థమైందా? టెయిలెండర్లకు సింగిల్స్ తీసే అవకాశం ఇచ్చావు. నీ ఆలోచన ఏంటో అర్థం కాలేదు. ఇందుకు మీరు భారీ మూల్యమే చెల్లించాల్సి వస్తుందని అందరికీ అర్థమైపోయింది. ఇంకా ఓవర్లు మిగిలే ఉన్నాయి కదా.. ప్రధాన బౌలర్ల కోటా పూర్తయ్యేటప్పటికే మ్యాచ్ ముగించాల్సింది. ఆఖర్లో మీకు మిగిలిన ఆప్షన్లు స్పిన్ బౌలర్లు మాత్రమే. ఇదంతా తెలిసి కూడా లోయర్ ఆర్డర్ బ్యాటర్లను సింగిల్స్‌కు అనుమతించేలా ఫీల్డింగ్ సెట్ చేశావంటే నిన్ను ఏమనుకోవాలి? నువ్వింకా ఏ లోకంలో ఉన్నావు బాబర్? నలుగురైదుగురు సర్కిల్ లోపల.. మిగిలిన వాళ్లు బౌండరీ వద్ద.. ఇలా ఫీల్డ్ సెట్ చేసి నువ్వేం సాధించావు? ఒకవేళ సౌతాఫ్రికా ఆటగాళ్లను చివరి ఓవర్ వరకు తీసుకొచ్చి మ్యాచ్‌ను కాపాడుకుందామని భావించావా? నువ్వింకా ఏ లోకంలో ఉన్నావు బాబర్? నీ కెప్టెన్సీ నాకైతే అంతుపట్టలేదు. ప్రధాన బౌలర్లు బరిలోకి దిగినపుడు స్లిప్ పెట్టాలి.. సర్కిల్ లోపల ఎక్స్ట్రా ఫీల్డర్లను సెట్ చేయాలి అని తెలియదా?’’ అంటూ టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా.. పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం కెప్టెన్సీపై మండిపడ్డాడు. చెత్త కెప్టెన్సీ సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో సారథిగా బాబర్ పూర్తిగా విఫలమయ్యాడంటూ విమర్శలు గుప్పించాడు. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో చేజేతులా ఓటమిని ఆహ్వానించావంటూ బాబర్ తీరును తప్పుబట్టాడు. కాగా వన్డే వరల్డ్‌కప్-2023లో సెమీస్ ఆశలు సజీవంగా ఉంచుకోవాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో పాకిస్తాన్ చేతులెత్తేసిన విషయం తెలిసిందే. చెన్నైలోని చెపాక్ మైదానంలో తీవ్ర ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో పాక్‌పై సౌతాఫ్రికా ఒక్క వికెట్ తేడాతో గట్టెక్కి టేబుల్ టాపర్‌గా నిలిచింది. మరోవైపు.. బాబర్ ఆజం బృందం సెమీ ఫైనల్ అవకాశాలు పూర్తి సంక్లిష్టంగా మారాయి. నీ వల్లే ఓటమి! ఈ నేపథ్యంలో కామెంటేటర్ ఆకాశ్ చోప్రా.. సౌతాఫ్రికా- పాకిస్తాన్ మ్యాచ్ ఫలితాన్ని విశ్లేషిస్తూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. హైడ్రామా నెలకొన్న మ్యాచ్‌లో టెయిలెండర్లను కూడా కట్టడి చేయలేక చతికలపడ్డ పాకిస్తాన్ ఓటమికి బాబర్ కెప్టెన్సీనే ప్రధాన కారణమని పరోక్షంగా అభిప్రాయపడ్డాడు. అతడి రాతే అంత ఈ సందర్భంగా పాకిస్తాన్ స్పిన్ ఆల్‌రౌండర్ మహ్మద్ నవాజ్ గురించి ప్రస్తావిస్తూ.. ‘‘నవాజ్ రాతే అంత. దుబాయ్ గ్రౌండ్లో హార్దిక్ పాండ్యా.. మెల్బోర్న్లో రవిచంద్రన్ అశ్విన్.. ఇప్పుడు ఇక్కడ చెన్నై గ్రౌండ్లో కేశవ్ మహరాజ్.. అతడి బౌలింగ్‌లో అద్భుతం చేశారు. పాపం ప్రతిసారి నవాజ్ ఎందుకో ఇలా కఠిన పరిస్థితుల్లో చిక్కుకుపోతాడు’’ అంటూ ఆకాశ్ చోప్రా సానుభూతి వ్యక్తం చేశాడు. కాగా సౌతాఫ్రికా విజయలక్ష్యానికి ఐదు పరుగుల దూరంలో ఉన్న సమయంలో ఉసామా మిర్, మహ్మద్ నవాజ్లలో ఒకరిని బరిలోకి దింపాల్సి రాగా బాబర్ ఆజం నవాజ్ వైపు మొగ్గు చూపాడు. ఊహించని షాకిచ్చిన కేశవ్ మహరాజ్ అప్పటికి పేసర్ల కోటా పూర్తవడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాడు. అయితే, 48 ఓవర్లో నవాజ్ బౌలింగ్‌లో మొదటి బంతికి తబ్రేజ్ షంసీ సింగిల్ తీసి కేశవ్ మహరాజ్‌కు స్ట్రైక్ ఇచ్చాడు. అంతే.. రెండో బంతిని ఫోర్‌గా మలిచిన కేశవ్ ఊహించని రీతిలో సౌతాఫ్రికాను గెలుపుతీరాలకు చేర్చాడు. పాకిస్తాన్‌ను కోలుకోలేని దెబ్బ కొట్టాడు. నవాజ్ మరోసారి బలిపశువు అయ్యాడు. చదవండి: ఓవరాక్షన్ రిజ్వాన్.. అతడి గుండె పగిలింది! మేము ‘చోకర్స్’ కాదు.. అర్థమైందా? View this post on Instagram A post shared by ICC (@icc) -
ఓవరాక్షన్ రిజ్వాన్.. అతడి గుండె పగిలింది! మేము ‘చోకర్స్’ కాదు.. అర్థమైందా?
ICC WC 2023- South Africa Beat Pakistan By 1 Wicket: భారత్‌లో వన్డే ప్రపంచకప్-2023.. రెండు వరుస విజయాలు.. ఆ తర్వాత హ్యాట్రిక్ ఓటములు.. వెరసి సెమీస్ అవకాశాలు సంక్లిష్టం.. ఇలాంటి దశలో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో దురదృష్టం వెక్కిరించింది.. ‘చోకర్స్’ అన్న పేరున్న జట్టు చేతిలో ఘోర పరాభవానికి గురై సెమీస్ రేసు నుంచి దాదాపుగా నిష్క్రమించే దుస్థితికి చేరుకుంది.. ఈ ఉపోద్ఘాతమంతా పాకిస్తాన్ జట్టు గురించే అని ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది. ఆరంభ శూరత్వమే! వరల్డ్‌కప్-2023లో నెదర్లాండ్స్‌తో తొలి మ్యాచ్ ఆడిన బాబర్ ఆజం బృందం 81 పరుగులతో జయభేరి మోగించింది. అనంతరం మ్యాచ్‌లో శ్రీలంకను ఆరు వికెట్ల తేడాతో ఓడించింది. ఆ తర్వాత గెలుపు అన్న మాటనే మరిచిపోయింది. చిరకాల ప్రత్యర్థి టీమిండియా చేతిలో చిత్తుగా ఓడిన తర్వాత.. పాకిస్తాన్‌ను వరుసగా పరాజయాలే పలకరించాయి. తాజాగా శుక్రవారం నాటి మ్యాచ్‌లో సౌతాఫ్రికా సైతం తమపై జయకేతనం ఎగురవేయడంతో బాబర్ బృందం సెమీస్ దారులు దాదాపుగా మూసుకుపోయాయి. నువ్వా- నేనా.. నరాలు తెగే ఉత్కంఠ అయితే, తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో అటు పాకిస్తాన్ ఆటగాళ్లు.. తమపై పాక్ ఆధిపత్యాన్ని తగ్గించడం సహా టేబుల్ టాపర్‌గా నిలించేందుకు ఇటు సౌతాఫ్రికా ప్లేయర్లు పోరాడిన తీరు మాత్రం క్రికెట్ ప్రేమికులను ఆకట్టుకుంది. పాక్ విధించిన 271 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 10 పరుగుల వ్యవధిలో మూడు వికెట్లు కోల్పోయిన ప్రొటిస్ జట్టు మరోసారి చోకర్స్ అనిపించుకోవడం ఖాయమంటూ విశ్లేషణలు ఓవైపు.. ఆఖరి వికెట్ తీసేందుకు అస్త్రశస్త్రాలను ప్రయోగిస్తున్న పాకిస్తాన్ డూ ఆర్ డై మ్యాచ్‌లో గెలిచి నిలుస్తుందా అన్న చర్చలు మరోవైపు.. చివరి వరకు హైడ్రామా.. పాక్ గెలుపు ఖాయమైందన్నంతగా ఆ మధ్యలో 46వ ఓవర్ ఆఖరి బంతికి పాకిస్తాన్ పేసర్ హ్యారిస్ రవూఫ్.. సఫారీ జట్టు టెయిలెండర్ తబ్రేజ్ షంసీని అవుట్ చేసినంత పనిచేశాడు. పాక్‌కు గెలుపు ఖాయమైపోయిందన్నంత నమ్మకంగా ఎల్బీకి అప్పీలు చేశాడు. అయితే అనుభవజ్ఞుడైన అంపైర్ అలెక్స్ వార్ఫ్ అదేమీ లేదన్నట్లు అడ్డంగా తలూపాడు. పాకిస్తాన్‌కు వేరే ఆప్షన్ లేదు. రవూఫ్ ఓవైపు.. వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్ మరోవైపు నమ్మకంగా చెప్పడంతో కెప్టెన్ బాబర్ ఆజం రివ్యూకు వెళ్లాడు. సఫారీల అదృష్టం బాగుంది కానీ.. షంసీ అదృష్టం బాగుంది. బంతి లెగ్ స్టంప్‌ను జస్ట్ అలా ముద్దాడినట్లుగా అనిపించింది గానీ మిస్ అయింది.. అంపైర్స్ కాల్ నాటౌట్ కావడంతో సౌతాఫ్రికాకు ఫేవర్‌గా ఫలితం వచ్చింది. అంతే.. పాక్ ఆటగాళ్లు ఒక్కసారిగా నీరుగారిపోయారు. రవూఫ్ అయితే ఏడ్చినంత పనిచేశాడు. రిజ్వాన్ సైతం ఒక్కసారిగా పరిగెత్తుకు వచ్చి రవూఫ్‌ను హత్తుకుని ‘ఎమోషనల్’ అయ్యాడు. పాకిస్తాన్ శిబిరం మొత్తం నిరాశలో కూరుకుపోయింది. ఓవరాక్షన్ రిజ్వాన్.. అతడి గుండె పగిలింది ఇందుకు సంబంధించిన దృశ్యాలను ఐసీసీ సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్‌గా మారాయి. ఇవి చూసిన నెటిజన్లలో కొందరు పాక్ ఆటగాళ్లకు సానుభూతి తెలుపుతుండగా.. ‘‘ఓవరాక్షన్ రిజ్వాన్‌ను ఇలా చూడాల్సి వస్తుందని అనుకోలేదు’’ అంటూ మరికొందరు ట్రోల్ చేస్తున్నారు. కాగా పాక్ వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్ కాస్త అతి చేస్తాడన్న సంగతి తెలిసిందే. ఫీల్డింగ్ సమయంలో ప్రత్యర్థి జట్టు బ్యాటర్లను హడలెత్తించే క్రమంలో మాటిమాటికి గట్టిగా అప్పీలు చేస్తూ ఉంటాడు. అంతేకాదు ఆటతో సంబంధంలేని విషయాల్లోనూ తలదూరుస్తూ ఉంటాడు. ఈ విషయాలను ప్రస్తావిస్తూ నెటిజన్లు అతడిని ట్రోల్ చేస్తున్నారు. మేము చోకర్స్ కాదు.. అర్థమైందా? ఇక చెన్నై మ్యాచ్‌లో సౌతాఫ్రికా చేతిలో పాక్ పరాజయం పాలైన విషయం తెలిసిందే. ప్రొటిస్ ఇన్నింగ్స్‌లో 48వ ఓవర్ రెండో బంతికి కేశవ్ మహరాజ్ ఫోర్ బాది పాకిస్తాన్ ఓటమిని ఖరారు చేసి సౌతాఫ్రికాపై ఉన్న ‘చోకర్స్’(అంతా బాగా ఆడి ఆఖరి నిమిషంలో చేతులెత్తేస్తారన్న అర్థంలో) అన్న ట్యాగ్ ఇకపై తమకు వాడొద్దనేలా సంకేతాలు ఇచ్చాడు. ఇక సఫారీల చేతిలో ఓటమితో పాక్ సెమీ ఫైనల్ ఆశలకు దాదాపు గండిపడినట్లే! చదవండి: Ind vs Aus: టీమిండియాతో టీ20 సిరీస్.. జట్టును ప్రకటించిన ఆస్ట్రేలియా.. కెప్టెన్ అతడే WC 2023: అతడు అవుట్ అయినట్లు తేలితే మేమే గెలిచేవాళ్లం.. ఓటమికి కారణం అదే: బాబర్ View this post on Instagram A post shared by ICC (@icc) -
WC 2023: అతడు అవుట్ అయినట్లు తేలితే మేమే గెలిచేవాళ్లం.. ఓటమికి కారణం అదే: బాబర్
ICC WC 2023- Pak Vs SA- Babar Azam Comments On Loss: ‘విజయానికి అత్యంత చేరువగా వచ్చాం.. కానీ సరైన ముగింపు ఇవ్వలేకపోయాం. జట్టు మొత్తం తీవ్ర నిరాశలో మునిగిపోయింది. ఆఖరి ఓవర్లలో మేము తిరిగి పుంజుకున్న తీరు.. కనబరిచిన పోరాట పటిమ అద్భుతం. కానీ ఇలా జరిగిపోయింది’’ అని పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం విచారం వ్యక్తం చేశాడు. అలా అయితే ఫలితం వేరేలా ఉండేది తాము మరో 10-15 పరుగులు చేసి ఉంటే ఫలితం వేరేలా ఉండేదని అభిప్రాయపడ్డాడు. వన్డే వరల్డ్‌కప్-2023లో హ్యాట్రిక్ ఓటములతో డీలాపడిన పాకిస్తాన్.. శుక్రవారం నాటి మ్యాచ్‌లో సౌతాఫ్రికా చేతిలో పరాజయం పాలైన విషయం తెలిసిందే. ఆఖరి వరకు ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో ప్రొటిస్ టెయిలెండర్ కేశవ్ మహరాజ్ ఫోర్ బాదడంతో.. ఎలాంటి సమీకరణలతో సంబంధం లేకుండా సెమీస్ రేసులో ముందుకు వెళ్లాలనుకున్న పాకిస్తాన్‌కు భంగపాటు ఎదురైంది. అందుకే ఓడిపోయాం ఈ నేపథ్యంలో ఓటమిపై స్పందించిన బాబర్ ఆజం.. తమ ఫాస్ట్ బౌలర్లు, స్పిన్నర్లు ఆఖరి వరకు అద్భుతంగా పోరాడారని.. కానీ దురదృష్టవశాత్తూ అనుకున్న ఫలితం రాబట్టలేకపోయామని విచారం వ్యక్తం చేశాడు. అతడు అవుట్ అయితే సెమీస్ రేసులో ఉండేవాళ్లం అదే విధంగా.. 46వ ఓవర్ ఆఖరి బంతికి సౌతాఫ్రికా టెయిలెండర్ తబ్రేజ్ షంసీ విషయంలో ఎల్బీడబ్ల్యూకు అప్పీలు చేసిన పాకిస్తాన్‌కు ప్రతికూల ఫలితం వచ్చిన విషయాన్ని బాబర్ ఈ సందర్భంగా ప్రస్తావించాడు. ‘‘డీఆర్ఎస్ ఆటలో భాగం. ఒకవేళ అతడిని అవుట్‌గా పరిగణించినట్లయితే.. ఫలితం మాకు అనుకూలంగా ఉండేది. సెమీస్ రేసులో నిలిచేందుకు మాకు అవకాశాలు ఉండేవి. కానీ అలా జరుగలేదు’’ అని అంపైర్ కాల్ వల్ల తమకు నష్టం జరిగిందని చెప్పుకొచ్చాడు. ఇక తదుపరి మూడు మ్యాచ్‌లలో బాగా ఆడి పాకిస్తాన్‌ను గెలిపించేందుకు శాయశక్తులా కృషి చేస్తామన్న బాబర్.. ఆ తర్వాత పాయింట్ల పట్టికలో ఎక్కడి వరకు చేరుకుంటామో చూద్దామంటూ నిర్వేదంగా మాట్లాడాడు. హైడ్రామా.. కాగా పేసర్ హ్యారిస్ రవూఫ్ బౌలింగ్‌లో షంసీ ఎల్బీడబ్ల్యూ అయినట్లు నమ్మకంగా ఉన్న పాకిస్తాన్‌కు అంపైర్స్ కాల్ షాకిచ్చిన విషయం తెలిసిందే. రవూఫ్ సంధించిన ఇన్‌స్వింగర్ లెగ్ స్టంప్స్‌ను తాకినట్లుగా అనిపించింది. అయితే, బాల్ ట్రాకింగ్‌లో తృటిలో మిస్ అయినట్లు కనిపించగా.. నాటౌట్‌గా పేర్కొన్న అంపైర్స్ కాల్ వల్ల సౌతాఫ్రికా బతికిపోయింది. మరుసటి రెండో ఓవర్ వరకు హైడ్రామా నడవగా కేశవ్ మహరాజ్ సౌతాఫ్రికా విజయ లాంఛనం పూర్తి చేశాడు. పాకిస్తాన్ వర్సెస్ సౌతాఫ్రికా స్కోర్లు: ►వేదిక: చెన్నై చెపాక్ స్టేడియం ►టాస్: పాకిస్తాన్- తొలుత బ్యాటింగ్ ►పాక్ స్కోరు: 270 (46.4) ►సౌతాఫ్రికా స్కోరు: 271/9 (47.2) ►ఫలితం: ఒక్క వికెట్ తేడాతో సౌతాఫ్రికా విజయం ►ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: తబ్రేజ్ షంసీ(4 వికెట్లు) చదవండి: WC 2023: అతడు లేని లోటు తీర్చేందుకు రంగంలోకి కోహ్లి! గిల్ కూడా.. View this post on Instagram A post shared by ICC (@icc) -
జన్సెన్ ఆల్‌రౌండ్ షో.. ఆసీస్‌కు షాకిచ్చిన సౌతాఫ్రికా.. సిరీస్ కైవసం
స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన 5 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను సౌతాఫ్రికా 3-2 తేడాతో కైవసం చేసుకుంది. జొహన్నెస్‌బర్గ్ వేదికగా ఇవాళ (సెప్టెంబర్ 17) జరిగిన ఐదో వన్డేలో సౌతాఫ్రికా 122 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. మార్కో జన్సెన్ ఆల్‌రౌండ్ షోతో (23 బంతుల్లో 47; 4 ఫోర్లు, 3 సిక్సర్లు, 8-1-39-5) ఇరగదీసి తన జట్టును విజయపథాన నడిపించాడు. జన్సెన్కు కేశవ్ మహారాజ్ (9.1-2-33-4) సహకరించడంతో ఆస్ట్రేలియా ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా.. మార్క్రమ్ (87 బంతుల్లో 93; 9 ఫోర్లు, 3 సిక్సర్లు), డేవిడ్ మిల్లర్ (65 బంతుల్లో 63; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధ సెంచరీలతో చెలరేగడంతో.. నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 315 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ చివర్లో మార్కో జన్సెన్, ఫెలుక్వాయో (19 బంతుల్లో 39 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌తో విరుచుకుపడటంతో సౌతాఫ్రికా 300 స్కోర్‌ను దాటింది. ఆసీస్ బౌలర్లలో ఆడమ్ జంపా (3/71), సీన్ అబాట్ (2/54), గ్రీన్ (1/59), నాథన్ ఇల్లిస్ (1/49), టిమ్ డేవిడ్ (1/20) వికెట్లు పడగొట్టారు. అనంతరం 316 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆసీస్.. జన్సెన్, కేశవ్ మహారాజ్, ఫెలుక్వాయో (1/44) ధాటికి 34.1 ఓవర్లలో 193 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ మిచెల్ మార్ష్ (71) టాప్ స్కోరర్‌గా నిలువగా.. లబూషేన్ (44) పర్వాలేదనిపించాడు. వీరు మినహాయించి అంతా విఫలమయ్యారు. వార్నర్ 10, ఇంగ్లిస్ 0, అలెక్స్ క్యారీ 2, గ్రీన్ 18, టిమ్ డేవిడ్ 1, సీన్ అబాట్ 23, మైఖేల్ నెసర్ 0, జంపా 5 పరుగులు చేసి నిరాశపరిచారు. కాగా, ఈ సిరీస్‌లో ఆసీస్ తొలి రెండు వన్డేలు గెలువగా.. ఆతర్వాత సౌతాఫ్రికా వరుసగా మూడు విజయాలు సాధించి, సిరీస్ కైవసం చేసుకుంది. దీనికి ముందు జరిగిన 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను ఆసీస్ 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. -
చెలరేగిన దక్షిణాఫ్రికా బౌలర్లు.. 98 పరుగులకే కివీస్ ఆలౌట్
టీ20 ప్రపంచకప్-2022 ప్రిపరేషన్స్‌లో భాగంగా వార్మప్ మ్యాచ్‌లో దక్షిణాప్రికాతో న్యూజిలాండ్ తలపడుతోంది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్.. దక్షిణాఫ్రికా బౌలర్లు చెలరేగడంతో 98 పరుగులకే కుప్పకూలింది. ప్రోటీస్ స్పిన్నర్ కేశవ్ మహారాజ్ మూడు వికెట్లతో కివీస్‌ను దెబ్బతీయగా.. షమ్సీ, పార్నెల్ రెండు వికెట్లు, మార్క్రమ్,జాన్సెన్, రబాడ తలా వికెట్ సాధించారు. న్యూజిలాండ్ బ్యాటర్లలో గ్లెన్ ఫిలిఫ్స్(23), గప్టిల్(23) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ కేవలం మూడు పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరాడు. చదవండి: T20 WC 2022: పంత్‌కు దినేశ్ కార్తిక్ పాఠాలు.. వీడియో వైరల్ -
ధవన్ సేన బి టీమ్ కాదు.. భారత్‌కు ఒకేసారి నాలుగైదు జట్లను ఆడించే సత్తా ఉంది..!
IND VS SA 2nd ODI: రాంచీ వేదికగా టీమిండియాతో రేపు (అక్టోబర్ 9) జరుగబోయే రెండో వన్డేకి ముందు దక్షిణాఫ్రికా స్టార్ స్పిన్నర్ కేశవ్ మహారాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సీనియర్ల గైర్హాజరీలో తమతో వన్డే సిరీస్ ఆడుతున్న శిఖర్ ధవన్ సేనను భారత-బి టీమ్ అంటే అస్సలు ఒప్పుకోనని అతను వ్యాఖ్యానించాడు. భారత ఆటగాళ్లలో చాలా టాలెంట్ ఉందని, ఒకేసారి నాలుగైదు అంతర్జాతీయ స్థాయి జట్లను బరిలోకి దించే సత్తా వారికి ఉందని టీమిండియా ఆటగాళ్లను పొగడ్తలతో ముంచెత్తాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి జట్టులో లేనంత మాత్రాన ధవన్ సేనను తక్కువ అంచనా వేయడానికి వీళ్లేదని పేర్కొన్నాడు. తమతో వన్డే సిరీస్ ఆడుతున్న భారత జట్టులో నాణ్యమైన ప్లేయర్లు ఉన్నారని, వారితో ఏమరపాటుగా ఉంటే అసలుకే మోసం వస్తుందని సఫారీ ప్లేయర్లను పరోక్షంగా హెచ్చరించాడు. ధవన్ సేనలో చాలా మంది కుర్రాళ్లకు ఐపీఎల్‌తో పాటు అంతర్జాతీయ క్రికెట్ ఆడిన అనుభవం ఉందని, వారంతా ప్రపంచ స్థాయి ఆటగాళ్లేనని సంజూ శాంసన్, శ్రేయస్ అయ్యర్‌లను ఉద్దేశించి కామెంట్ చేశాడు. టీమిండియాతో ఆడటం ఎంతటి జట్టుకైనా సవాలుతో కూడుకున్న పనేనని, వారు ఒకేసారి నాలుగైదు జట్లను బరిలోకి దించినా వారి బ్యాటింగ్ లైనప్ దుర్భేద్యంగానే ఉంటుందని కొనియాడాడు. టీ20 సిరీస్‌ను 1-2 తేడాతో కోల్పోయిన తమ జట్టు 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో ప్రస్తుతం 1-0 ఆధిక్యంలో ఉందని, ఈ సిరీస్‌ను తామ తప్పక చేజిక్కించుకుని ఆస్ట్రేలియాకు (టీ20 వరల్డ్‌కప్ వేదిక) బయల్దేరుతామని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇదిలా ఉంటే, లక్నో వేదికగా భారత్‌తో జరిగిన తొలి వన్డేలో సఫారీ జట్టు 9 పరుగుల స్వల్ప తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్‌లో సంజూ శాంసన్ (86 నాటౌట్) అద్భుతమైన పోరాటపటిమ కనబర్చి మ్యాచ్‌ను చివరి నిమిషం వరకు ఆసక్తికరంగా మార్చాడు. అయితే ఆఖర్లో టెయిలెండర్ ఆవేశ్ ఖాన్ చేసిన పొరపాట్ల వల్ల శాంసన్‌కు స్ట్రయిక్ రాకపోవడంతో భారత్ ఓటమిపాలైంది. 40 ఓవర్ల పాటు సాగిన ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సఫారీ జట్టు 4 వికెట్ల నష్టానికి 249 పరుగుల భారీ స్కోర్ చేయగా.. ఛేదనలో టీమిండియా 40 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 240 పరుగులు చేయగలిగింది. -
Ind Vs Sa: ప్రొటిస్‌తో రెండో టీ20.. సూర్య మరో 24 పరుగులు సాధించాడంటే!
India vs South Africa, 2nd T20I Records Preview: అసోంలోని గువాహటి వేదికగా జరుగనున్న రెండో టీ20కి టీమిండియా, సౌతాఫ్రికా సిద్ధమయ్యాయి. ఇప్పటికే ప్రాక్టీసు పూర్తి చేసుకున్న ఇరు జట్లు బర్సాపారా స్టేడియంలో ముఖాముఖి తలపడేందుకు పూర్తిస్థాయిలో సన్నద్ధమయ్యాయి. ఇక ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్ సొంతం చేసుకుని చరిత్ర సృష్టించాలని టీమిండియా భావిస్తోంది. మరోవైపు.. మొదటి టీ20లో ఎదురైన పరాభవానికి బదులు తీర్చుకోవాలని ప్రొటిస్ జట్టు పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలో వర్షం ఆటంకం కలిగించకపోతే ఈ మ్యాచ్ మరింత రసవత్తరంగా మారే అవకాశం ఉంది. కాగా రాత్రి ఏడు గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో.. రెండో టీ20 సందర్భంగా ఇరు జట్ల ఆటగాళ్లను ఊరిస్తున్న కొన్ని రికార్డులపై ఓ లుక్కేద్దాం. మైలురాయికి చేరువలో డికాక్ దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ బ్యాటర్ క్వింటన్ డికాక్ అన్ని ఫార్మాట్లలో కలిపి ఇప్పటి వరకు అంతర్జాతీయ కెరీర్లో 10969 పరుగులు సాధించాడు. టీమిండియాతో రెండో టీ20లో మరో 31 పరుగులు చేస్తే తన కెరీర్లో 11 వేల పరుగుల మైలురాయిని చేరుకుంటాడు. అదే విధంగా మూడు బౌండరీలు బాదాడంటే అంతర్జాతీయ టీ20లలో 200 ఫోర్లు పూర్తి చేసుకుంటాడు. 56 పరుగుల దూరంలో అంతర్జాతీయ టీ20లలో 2 వేల పరుగుల మార్కుకు ప్రొటిస్ ప్లేయర్ డేవిడ్ మిల్లర్ 56 పరుగుల దూరంలో ఉన్నాడు. ఇప్పటి వరకు పొట్టిఫార్మాట్లో అతడు చేసిన రన్స్ 1944. సూర్య మరో 24 పరుగులు తీస్తే ప్రస్తుతం భీకర ఫామ్‌లో ఉన్న టీమిండియా బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ తన కెరీర్లో అరుదైన మైలురాయికి చేరువలో ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో సూర్య 24 పరుగులు సాధిస్తే అంతర్జాతీయ టీ20లలో 1000 పరుగుల మార్కును అందుకుంటాడు. కోహ్లి మూడు క్యాచ్‌లు పడితే! పంత్ ఏమో.. టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి ఈ మ్యాచ్ సందర్భంగా మూడు క్యాచ్‌లు పడితే అంతర్జాతీయ టీ20లలో 50 క్యాచ్‌లు అందుకున్న ఆటగాళ్లలో ఒకడిగా నిలుస్తాడు. ఇక రిషభ్ పంత్ తుది జట్టులో చోటు దక్కించుకుని 66 పరుగులు చేయగలిగితే పొట్టి ఫార్మాట్ ఇంటర్నేషనల్ కెరీర్లో 1000 రన్స్ పూర్తి చేసుకుంటాడు. 200 వికెట్ల క్లబ్లో ప్రొటిస్ ఆటగాడు కేశవ్ మహరాజ్ నాలుగు వికెట్లు పడగొట్టాడంటే అన్ని ఫార్మాట్లలో కలిపి 200 వికెట్లు తన ఖాతాలో పడతాయి. ఇక లుంగి ఎంగిడి ఒక వికెట్ తీస్తే అంతర్జాతీయ టీ20లలో 50 వికెట్ల మార్కు అందుకుంటాడు. చదవండి: T20 WC: అతడి స్థానాన్ని ప్రపంచంలో ఎవరూ భర్తీ చేయలేరు.. భారత్ గెలవడం కష్టమే: ఆసీస్ మాజీ ఆల్‌రౌండర్ Asia Cup 2022: తల్లి అంపైర్.. కూతురు ఆల్‌రౌండర్.. ఇద్దరూ ఒకేసారి! వీరికి వెనుక ఉన్నది ఎవరంటే! -
పద్మనాభస్వామి ఆలయంలో సందడి చేసిన దక్షిణాఫ్రికా స్టార్ స్పిన్నర్
టీమిండియాతో పరిమిత ఓవర్ల సిరీస్‌లో తలపడేందుకు దక్షిణాఫ్రికా జట్టు భారత్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా ప్రోటీస్ జట్టు మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. బుధవారం తిరువనంతపురం వేదికగా జరగనున్న తొలి టీ20తో ఈ పర్యటన ప్రారంభం కానుంది. ఇక ఇది ఇలా ఉండగా.. దక్షిణాఫ్రికా స్టార్ స్పిన్నర్ కేశవ్ మహరాజ్ తిరువనంతపురంలోని శ్రీ పద్మనాభస్వామి ఆలయాన్ని సోమవారం సందర్శించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను మహరాజ్ తన సోషల్ మీడియా ఖాతాలో షోర్ చేశాడు. అదే విధంగా తన అభిమానులకు నవరాత్రి శుభాకాంక్షలు తెలిపాడు. కాగా నవరాత్రి ఉత్సవాలు దేశవ్యాప్తంగా సోమవారం ప్రారంభమయ్యాయి. కాగా 32 ఏళ్ల కేశవ్ మహరాజ్ భారత మూలాలు కలిగి ఉన్నాడు. అతడి పూర్వీకులు ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్‌కు చెందినవారు. కాగా అతడి కుటంబం తన చిన్నతనంలోనే సౌతాఫ్రికాలో స్థిరపడింది. కాగా 2016లో ప్రోటీస్ జట్టు తరపున మహరాజ్ అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. అతడు ప్రస్తుతం దక్షిణాఫ్రికా జట్టులో కీలక సభ్యుడిగా ఉన్నాడు. భారత్‌తో టీ20, వన్డే సిరీస్‌లకు దక్షిణాఫ్రికా జట్టు: టీ20 జట్టు: తెంబా బవుమా(కెప్టెన్), క్వింటన్ డికాక్, రీజా హెండ్రిక్స్, హెన్రిచ్ క్లాసెన్, కేశవ్ మహరాజ్, జానేమన్ మలన్, ఎయిడెన్ మార్కరమ్, డేవిడ్ మిల్లర్, లుంగి ఎంగిడి, అన్రిచ్ నోర్జే, వానే పార్నెల్, పెహ్లుక్వాయో, డ్వేన్ ప్రిటోరియస్, కగిసో రబడ, తబ్రేజ్ షంసీ. వన్డే జట్టు: తెంబా బవుమా(కెప్టెన్), క్వింటన్ డికాక్, రీజా హెండ్రిక్స్, హెన్రిచ్ క్లాసెన్, కేశవ్ మహరాజ్, ఎయిడెన్ మార్కరమ్, డేవిడ్ మిల్లర్, లుంగి ఎంగిడి, అన్రిచ్ నోర్జే, వానే పార్నెల్, డ్వేన్ ప్రిటోరియస్, కగిసో రబడ, రీలీ రోసోవ్, తబ్రేజ్ షంసీ, జోర్న్ ఫార్చూన్, పెహ్లుక్వాయో, మార్కో జాన్సేన్, ట్రిస్టన్ స్టబ్స్. దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కు భారత జట్టు: రోహిత్ శర్మ(కెప్టెన్), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషభ్ పంత్, దినేశ్ కార్తిక్, రవిచంద్రన్ అశ్విన్, యజువేంద్ర చహల్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ షమీ, హర్షల్ పటేల్, దీపక్ చహర్, జస్ప్రీత్ బుమ్రా. IND vs SA: South African spinner Keshav Maharaj visits Sri Padmanabha Mandir in Trivandrum, dons traditional attire -Check Out Read more:https://t.co/aM0V43W0ON#INDvsSA #KeshavMaharaj — InsideSport (@InsideSportIND) September 27, 2022 చదవండి: T20 WC 2022: దినేశ్ కార్తిక్ లాగే అతడికి కూడా అండగా ఉండాలి.. అప్పుడే: శ్రీశాంత్ -
మూడు ఫార్మాట్లకు ముగ్గురు వేర్వేరు కెప్టెన్లు.. గుజరాత్ ప్లేయర్‌కు బంపర్ ఆఫర్
South Africa Tour Of England: జులై 19 నుంచి దాదాపు మూడు నెలల పాటు ఇంగ్లండ్, ఐర్లాండ్‌లలో పర్యటించనున్న దక్షిణాఫ్రికా జట్లను (మూడు ఫార్మాట్ల జట్లు) క్రికెట్ సౌతాఫ్రికా మంగళవారం ప్రకటించింది. వచ్చే నెల నుంచి సౌతాఫ్రికా ఈ రెండు దేశాలతో మూడు ఫార్మాట్లలో సిరీస్‌లు ఆడనుంది. జులై 19 నుంచి 31 వరకు ఇంగ్లండ్‌తో 3 వన్డేలు, 3 టీ20లు ఆడనున్న సపారీ టీమ్.. మధ్యలో ఆగస్ట్ 3, 5 తేదీల్లో ఐర్లాండ్‌తో రెండు టీ20లు, ఆతర్వాత ఆగస్ట్ 17-సెప్టెంబర్ 12 వరకు ఇంగ్లండ్‌తో మూడు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది. ఈ సుదీర్ఘ పర్యటనల కోసం క్రికెట్ సౌతాఫ్రికా మూడు ఫార్మాట్లకు మూడు వేర్వేరు జట్లతో పాటు ముగ్గురు వేర్వేరు కెప్టెన్లను ప్రకటించింది. ఇటీవల టీమిండియాతో ముగిసిన టీ20 సిరీస్‌లో గాయపడిన వైట్‌బాల్ కెప్టెన్ టెంబా బవుమా మూడు జట్లలో స్థానం కోల్పోగా.. గుజరాత్ టైటాన్స్ (ఐపీఎల్) ఆటగాడు డేవిడ్ మిల్లర్, భారత సంతతి ఆటగాడు కేశవ్ మహారాజ్‌లు బంపర్ ఆఫర్లు కొట్టేశారు. టెస్ట్‌ల్లో డీన్ ఎల్గర్‌ను కెప్టెన్‌గా కొనసాగించిన సీఎస్ఏ.. వన్డేల్లో కేశవ్ మహారాజ్‌ను, టీ20ల్లో డేవిడ్ మిల్లర్‌ను కెప్టెన్లుగా నియమించింది. South Africa announced Test, ODI, and T20I squads for the upcoming England tour.#SkyFair #ENGvsSA #SouthAfrica #England #DavidMiller #Cricket #T20I #TestCricket #ODI #CricketTwitter pic.twitter.com/CQrxXoOwVc — SkyFair (@officialskyfair) June 29, 2022 ఇంగ్లండ్, ఐర్లాండ్ దేశాల్లో సౌతాఫ్రికా పర్యటన వివరాలు.. జులై 19 : ఇంగ్లాండ్ తో తొలి వన్డే జులై 22 : రెండో వన్డే జులై 24 : మూడో వన్డే జులై 27 : తొలి టీ20 జులై 28 : రెండో టీ20 జులై 31 : మూడో టీ20 ఆగస్టు 3 : ఐర్లాండ్ తో తొలి టీ20 ఆగస్టు 5 : రెండో టీ20 ఆగస్టు 17-21 : ఇంగ్లాండ్ తో తొలి టెస్టు ఆగస్టు 25-29 : రెండో టెస్టు సెప్టెంబర్ 8-12 : మూడో టెస్టు చదవండి: విరాట్ కోహ్లి రికార్డు బద్దలు కొట్టిన బాబర్ ఆజమ్ -
ICC POTM: ‘ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్’ ఏప్రిల్ విజేత ఎవరంటే!
ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డులను ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ సోమవారం ప్రకటించింది. పురుషుల విభాగంలో ఏప్రిల్ నెలకు గానూ దక్షిణాఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహరాజ్ ఈ అవార్డును గెలుచుకున్నట్లు వెల్లడించింది. కాగా బంగ్లాదేశ్‌తో స్వదేశంలో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో కేశవ్ మహరాజ్ అదరగొట్టిన సంగతి తెలిసిందే. రెండు మ్యాచ్‌లలో కలిపి అతడు మొత్తంగా 16 వికెట్లు తీశాడు. తద్వారా దక్షిణాఫ్రికా సిరీస్ గెలవడంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు కూడా గెలుపొందాడు. ఇక ఇదే సిరీస్‌లో దక్షిణాఫ్రికా మరో ఆటగాడు సిమోన్ హార్మర్ కూడా ఆకట్టుకున్నాడు. రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి ఆరు వికెట్లు పడగొట్టాడు. దీంతో అతడు కూడా ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్‌కు నామినేట్ అయ్యాడు. మరోవైపు ఒమన్ ఓపెనర్ జతిందర్ సింగ్ కూడా ఏప్రిల్‌లో జరిగిన ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ లీగ్2లో నాలుగు మ్యాచ్‌లలో కలిపి 259 పరుగులు చేసి పోటీలో నిలిచాడు. అయితే, వీరందరినీ దాటుకుని కేశవ్ మహరాజ్ అవార్డు గెలుచుకున్నాడు. ఈ నేపథ్యంలో ప్రొటిస్ మాజీ బ్యాటర్, ప్రస్తుత వోటింగ్ పానెల్ సభ్యుడు జేపీ డుమిని కేశవ్‌పై ప్రశంసలు కురిపించాడు. అద్భుతంగా రాణించాడని కొనియాడాడు. చదవండి: Devon Conway: కాన్వే జోరు వెనుక ప్రధాన సూత్రధారి ఎవరంటే? 7️⃣ wickets at Keshav Maharaj's home ground💚 🇿🇦 #SAvBAN #BetwayTestSeries #BePartOfIt | @Betway_za pic.twitter.com/cIcqpKD50Q — Cricket South Africa (@OfficialCSA) April 4, 2022 -
ఐసీసీ ప్లేయర్ ఆఫ్ మంత్ అవార్డు రేసులో ఉన్న ఆటగాళ్లెవరంటే?
ఏప్రిల్ నెలకు గానూ ఐసీసీ ప్లేయర్ ఆఫ్ మంత్ అవార్డుకు నామినేట్ అయిన ఆటగాళ్లను ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ మంగళవారం ప్రకటించింది. పురుషుల విభాగంలో అవార్డుకు ముగ్గురు పోటీ పడుతుండగా.. అందులో సౌతాఫ్రికా నుంచి కేశవ్ మహారజ్, సిమోన్ హార్మలు ఉండగా.. ఓమన్ నుంచి జతింధర్ సింగ్ అవార్డుకు నామినేట్ అయ్యాడు. ఇక మహిళల విభాగం నుంచి ఆస్ట్రేలియా వికెట్ కీపర్ అలిసా హేలీ, ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ నటాలీ సివర్, ఉగాండా ఆల్‌రౌండర్ జానెట్ బబాచిలు ఐసీసీ ఉమెన్ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డుకు నామినేట్ అయ్యారు. ఇక బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో సౌతాఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహరాజ్ అద్బుత ప్రదర్శన కనబరిచాడు. రెండు టెస్టులు కలిపి 16 వికెట్లు పడగొట్టాడు. డర్బన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో కేశవ్ మహారాజ్ తొలి ఇన్నింగ్స్‌లో 37 ఓవర్లు బౌలింగ్ వేసి ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయాడు. అయితే రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం ఏడు వికెట్లతో చెలరేగాడు. 274 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాను 53 పరుగులకే కుప్పకూల్చడంలో మహరాజ్ పాత్ర మరువలేనిది. తన ప్రదర్శనతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఇక పోర్ట్ ఎలిజబెత్ వేదికగా జరిగిన రెండో టెస్టులో బ్యాటింగ్, బౌలింగ్‌లో చెలరేగాడు. తొలి ఇన్నింగ్స్‌లో 84 పరుగులు చేయడంతో పాటు.. బౌలింగ్‌లో రెండు వికెట్లు తీశాడు. ఇక రెండో ఇన్నింగ్స్‌లో మరోసారి ఏడు వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. ఫలితంగా సౌతాఫ్రికా 332 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి 2-0 సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది. తన ప్రదర్శనతో కేశవ్ మహరాజ్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌ను కూడా ఎగురేసుకపోయాడు. అదే బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో సిమోన్ హార్మర్ కూడా మంచి ప్రదర్శన కనబరిచాడు. తొలి టెస్టులో తొలి ఇన్నింగ్స్‌తో బ్యాటింగ్‌లో కీలకమైన 38 పరుగులు చేయడంతో పాటు బౌలింగ్‌లో 4 వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో కేశవ్ మహరాజ్‌కు సపోర్ట్ ఇచ్చిన సిమోన్ మూడు వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత రెండో టెస్టులో బ్యాటింగ్, బౌలింగ్‌లో మెరిసిన సిమోన్.. రెండు ఇన్నింగ్స్‌లు కలిపి ఆరు వికెట్లు పడగొట్టాడు. ఒమన్ ఓపెనర్‌గా జతింధర్ సింగ్ ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ లీగ్2లో భాగంగా స్కాట్లాండ్, పీఎన్‌జీలతో ఏప్రిల్‌లో జరిగిన ట్రై సిరీస్‌లో దుమ్మురేపాడు. నాలుగు మ్యాచ్‌లు కలిపి 259 పరుగులు చేసిన జతింధర్ ఖాతాలో ఒక సెంచరీతో పాటు, మూడు అర్థశతకాలు ఉన్నాయి. ఇక మహిళల విభాగంలో అవార్డుకు నామినేట్ అయిన ఆస్ట్రేలియా వికెట్ కీపర్ అలిసా హేలీ ఇటీవలే ముగిసిన మహిళల వన్డే ప్రపంచకప్ ఫైనల్లో అద్భుత ప్రదర్శన చేసింది. ఇంగ్లండ్‌తో జరిగిన ఫైనల్లో 138 బంతుల్లోనే 170 పరుగులు చేసి ఆసీసీ భారీ స్కోరు చేయడంలో కీలకపాత్ర పోషించింది. ఇక అదే ఫైనల్లో ఇంగ్లండ్‌కు చెందిన నటాలి సివర్ 121 బంతుల్లో 148 పరుగులు నాటౌట్‌గా నిలిచి తన ప్రదర్శనతో ఆకట్టుకుంది. -
SA Vs Ban: 332 పరుగులతో ఘనవిజయం.. టెస్టు సిరీస్ క్లీన్‌స్వీప్
Bangladesh tour of South Africa 2022- కెబెర్హా (దక్షిణాఫ్రికా): బంగ్లాదేశ్‌తో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌ను దక్షిణాఫ్రికా 2–0తో క్లీన్‌స్వీప్ చేసింది. సోమవారం ముగిసిన చివరిదైన రెండో టెస్టులో సఫారీ జట్టు 332 పరుగుల ఆధిక్యంతో ఘనవిజయం సాధించింది. ఆతిథ్య స్పిన్నర్లు కేశవ్ మహరాజ్ (7/40), సైమన్ హార్మర్ (3/34) రెండో ఇన్నింగ్స్‌లో మళ్లీ పది వికెట్లను పంచుకున్నారు. వీళ్లిద్దరు తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లోనూ కేశవ్ 7, హార్మెర్ 3 వికెట్లను పడగొట్టారు. 413 పరుగుల లక్ష్యఛేదన కోసం ఆఖరి రోజు ఓవర్‌నైట్ స్కోరు 27/3తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన బంగ్లాదేశ్ 23.3 ఓవర్లలో 80 పరుగులకే కుప్పకూలింది. లిటన్ దాస్ (27), మెహదీ (20) మినహా ఇంకెవరూ రెండంకెల స్కోరు చేయనేలేదు. కేశవ్ మహరాజ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’... ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు లభించాయి. కోవిడ్ ఎఫెక్ట్‌తో... అంతర్జాతీయ క్రికెట్లో తొలిసారి ‘కోవిడ్–19’ సబ్‌స్టిట్యూట్ ప్లేయర్ల నిబంధన అమలు చేశారు. సఫారీ ఆటగాళ్లు సారెల్ ఎర్వి, వియాన్ మల్డర్లకు సోమవారం టెస్టులో పాజిటివ్ రావడంతో ఖయా జొండో, గ్లెంటన్ స్టుర్మన్లను సబ్‌స్టిట్యూట్‌గా తీసుకున్నారు. 🏏 RESULT | #Proteas WIN BY 332 RUNS Keshav Maharaj claimed 7/40 in the second innings as the #Proteas romped to victory in the first hour of Day 4 to secure the #BetwayTestSeries over Bangladesh#SAvBAN #BePartOfIt | @Betway_za pic.twitter.com/47W7F5iNpe — Cricket South Africa (@OfficialCSA) April 11, 2022