డర్బన్: లెఫ్టార్మ్ స్పిన్నర్ కేశవ్ మహరాజ్ (7/32) తన అద్భుత బౌలింగ్‌తో దక్షిణాఫ్రికాకు భారీ విజయాన్ని అందించాడు. బంగ్లాదేశ్‌తో సోమవారం ముగిసిన తొలి టెస్టులో సఫారీ టీమ్ 220 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 274 పరుగుల లక్ష్యాన్ని అందుకునే క్రమంలో బంగ్లా తమ రెండో ఇన్నింగ్స్‌లో 19 ఓవర్లలో 53 పరుగులకే కుప్పకూలింది. నజ్ముల్ హొసేన్ (26) టాప్ స్కోరర్ కాగా...నలుగురు బ్యాటర్లు డకౌటయ్యారు.
ఓవర్‌నైట్ స్కోరు 11/3తో చివరి రోజు ఆట కొనసాగించిన బంగ్లాదేశ్ మరో 13 ఓవర్లు మాత్రమే ఆడి 42 పరుగులు జోడించగలిగింది. బంగ్లాదేశ్‌కు టెస్టుల్లో ఇది రెండో అత్యల్ప స్కోరు. రెండో ఇన్నింగ్స్‌లో 10 ఓవర్లు మాత్రమే వేసి 7 వికెట్లు తీసిన మహరాజ్‌కే ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కగా...ఇరు జట్ల మధ్య రెండో టెస్టు గురువారంనుంచి పోర్ట్ ఎలిజబెత్‌లో జరుగుతుంది.
7️⃣ wickets at Keshav Maharaj's home ground💚 🇿🇦 #SAvBAN #BetwayTestSeries #BePartOfIt | @Betway_za pic.twitter.com/cIcqpKD50Q
— Cricket South Africa (@OfficialCSA) April 4, 2022
Comments
Please login to add a commentAdd a comment