సూపర్ ముస్తాఫిజుర్ | Super mustafizur rahman | Sakshi
Sakshi News home page

సూపర్ ముస్తాఫిజుర్

Published Wed, Jul 22 2015 12:22 AM | Last Updated on Sun, Sep 3 2017 5:54 AM

సూపర్ ముస్తాఫిజుర్

సూపర్ ముస్తాఫిజుర్

- దక్షిణాఫ్రికా 248 ఆలౌట్
- బంగ్లాదేశ్‌తో తొలి టెస్టు
చిట్టగాంగ్:
వన్డేల్లో భారత్‌పై ఆరు వికెట్లతో సంచలన అరంగేట్రం చేసిన బంగ్లాదేశ్ యువ పేసర్ ముస్తాఫిజుర్ రహ్మాన్... టెస్టుల్లోనూ అరంగేట్రంలోనే అదరగొట్టాడు. దక్షిణాఫ్రికాతో మంగళవారం ప్రారంభమైన తొలి టెస్టులో నాలుగు వికెట్లతో ఆకట్టుకున్నాడు.  ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో సఫారీలు 83.4 ఓవర్లలో 248 పరుగులకు ఆలౌటయ్యారు. బావుమా (54) అర్ధసెంచరీ చేయగా... డు ప్లెసిస్ (48), ఎల్గర్ (47) రాణించారు. ముస్తాఫిజుర్ (4/37)కు జుబైర్ హొస్సేన్ మూడు వికెట్లతో అండగా నిలవడంతో సఫారీలు ఏ దశలోనూ నిలదొక్కుకోలేకపోయారు. ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్  2 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా ఏడు పరుగులు చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement