సెంచూరియన్: పాకిస్తాన్‌తో జరుగుతున్న ‘బాక్సింగ్ డే’ తొలి టెస్టులో ఆతిథ్య దక్షిణాఫ్రికా గెలుపుబాటలో 121 పరుగుల దూరంలో ఉంది. అయితే కీలకమైన 3 వికెట్లు కోల్పోవడం వల్ల సఫారీకి నాలుగో రోజు ఛేజింగ్ అంత సులభంగా అయితే లేదు. అంతకుముందు శనివారం 88/3 ఓవర్‌నైట్ స్కోరుతో మూడోరోజు రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన పాకిస్తాన్ 59.4 ఓవర్లలో 237 పరుగుల వద్ద ఆలౌటైంది.
క్రితం రోజు బ్యాటర్లు బాబర్ ఆజమ్ (85 బంతుల్లో 50; 9 ఫోర్లు), సౌద్ షకీల్ (113 బంతుల్లో 84; 10 ఫోర్లు, 1 సిక్స్) ఇద్దరు అర్ధసెంచరీలతో ఆకట్టుకున్నారు. వీరి జోడి నిలబడినంతవరకు బాగానే ఉన్నా... బాబర్ ఫిఫ్టీ తర్వాత నిష్క్రమించడంతో కథ మొదటికొచ్చిoది. జట్టు స్కోరు 153 పరుగుల వద్ద బాబర్‌ను జాన్సెన్ అవుట్ చేశాడు. దీంతో నాలుగో వికెట్‌కు 79 పరుగుల భాగస్వామ్యం ముగియగా, తర్వాత వచ్చిన రిజ్వాన్ (3), సల్మాన్ ఆఘా (1)లను జాన్సెన్ పెవిలియన్ చేర్చడంతో 176 స్కోరు వద్ద ఆరో వికెట్ పడింది.
సఫారీ బౌలర్లు ఇదే జోరు సాగిచండంతో పాక్ ఇన్నింగ్స్‌కు తెరపడింది. మార్కో జాన్సెన్ 6 వికెట్లు పడగొట్టగా, రబడకు 2 వికెట్లు దక్కాయి. తొలిఇన్నింగ్స్‌లో సఫారీకి 90 పరుగుల ఆధిక్యం దక్కడం వల్ల 148 పరుగుల లక్ష్యమే ఎదురైంది. దీన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా ఆట నిలిచే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 9 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 27 పరుగులు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment