సెంచూరియన్: పాకిస్తాన్‌తో జరుగుతోన్న మూడు టెస్టుల సిరీస్‌లో దక్షిణాఫ్రికా శుభారంభం చేసింది. తొలి టెస్టును మూడు రోజుల్లోనే ముగించింది. సిరీస్‌లో 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. శుక్రవారం మూడో రోజు 148 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన సఫారీలు 50.4 ఓవర్లలో 4 వికెట్లకు 151 పరుగులు చేసి గెలుపొందారు.
గత రెండు రోజులుగా పేసర్లకు సహకరించిన పిచ్‌పై సీనియర్ బ్యాట్స్‌మెన్ ఆమ్లా (63 నాటౌట్, 11 ఫోర్లు), ఓపెనర్ ఎల్గర్ (50; 10 ఫోర్లు) చక్కటి షాట్లతో అలరించారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 118 పరుగులు జోడించారు. ఈ దశలో పాక్ బౌలర్లు 18 పరుగుల వ్యవధిలో మూడు వికెట్లు పడగొట్టి ఒత్తిడి పెంచే ప్రయత్నం చేసినా అప్పటికే మ్యాచ్ చేజారింది. 11 వికెట్లు తీసిన సఫారీ బౌలర్ ఒలివియర్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది.
మూడు రోజుల్లోనే...
Published Sat, Dec 29 2018 1:04 AM | Last Updated on Sat, Dec 29 2018 1:04 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment