సెంచూరియన్: ఇరు జట్ల పేసర్ల విజృంభణతో... దక్షిణాఫ్రికా–పాకిస్తాన్ తొలి టెస్టు మొదటి రోజే 15 వికెట్లు నేలకూలాయి. బుధవారం ఇక్కడ ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన పాక్... సఫారీ ఫాస్ట్ బౌలర్లు ఒలివియర్ (6/37), రబడ (3/59) ధాటికి 181 పరుగులకే ఆలౌటైంది. బాబర్ ఆజమ్ (78 బంతుల్లో 71 నాటౌట్; 15 ఫోర్లు) అజేయంగా నిలిచాడు. స్టెయిన్ (1/66) అత్యధిక వికెట్లు (422) తీసిన దక్షిణాఫ్రికా బౌలర్‌గా రికార్డులకెక్కాడు. షాన్ పొలాక్ (421) పేరిట ఉన్న రికార్డును స్టెయిన్ అధిగమించాడు.
అనంతరం ఆతిథ్య జట్టును పాక్ పేసర్లు షహీన్ షా ఆఫ్రిది (2/36), ఆమిర్ (2/26) దెబ్బకొట్టారు. దీంతో ఆట ముగిసే సమయానికి సఫారీలు 127/5తో నిలిచారు. ఓపెనర్లు మార్క్‌రమ్ (12), ఎల్గర్ (22), డిబ్రుయన్ (29) తక్కువ స్కోరుకే ఔటయ్యారు. కెప్టెన్ డుప్లెసిస్ (0) ఖాతా తెరవలేదు. ఆమ్లా (8) విఫలమయ్యాడు. బవుమా (38 బ్యాటింగ్), స్టెయిన్ (13 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.
పాక్ 181; దక్షిణాఫ్రికా 127/5
Published Thu, Dec 27 2018 12:35 AM | Last Updated on Thu, Dec 27 2018 12:35 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment