భవ్య రామమందిరంలో బాలరాముడి ప్రాణప్రతిష్ట కోసం అయోధ్య నగరం అందంగా ముస్తాబైంది. అయోధ్య గర్భగుడిలో రామ్‌లల్లా కొలువుదీరబోతున్నాడు. 500 ఏళ్ల నాటి హిందువుల కల కాసేపట్లో నెరవేరనుంది. అయోధ్యలోని రామమందిరం 'ప్రాణ ప్రతిష్ఠ' మహోత్సవం కోసం యావత్ భారతదేశం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. సోమవారం మధ్యాహ్నం 12: 20 గంటలకు ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది.
ఈ వేడుకను ప్రత్యేక్షంగా వీక్షించేందుకు రాజకీయ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, సెలబ్రెటీలు అయోధ్యకు చేరుకున్నారు. చాలా మంది క్రికెట్ దిగ్గజాలతో పాటు ప్రస్తుత తరం క్రికెటర్లకు సైతం రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ఆహ్వానాలను పంపించింది. రామమందిర ప్రాణప్రతిష్ఠ సందర్భంగా దక్షిణాఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహరాజ్ స్పందించాడు. భారత్‌కు తన శుభాకాంక్షలను తెలియజేశాడు.
అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
నమస్తే.. ఈ రోజు భారత దేశ చరిత్రలో ఎప్పటికీ చిరస్మరణీయంగా నిలిచిపోతుంది. దక్షిణాఫ్రికాలో ఉన్న భారత సంతతి ప్రజలకు నా శుభాకాంక్షలు చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను. అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం ఘనంగా జరగాలని కోరుకుంటున్నాను. అందరిలోనూ శాంతి, సామరస్యం, ఆధ్యాత్మిక జ్ఞానోదయం తీసుకురావాలి.
జై శ్రీరామ్’’ అని ఇన్‌స్ట్రాగ్రామ్‌లో కేశవ్ మహరాజ్ పేర్కొన్నాడు. కాగా కేశవ్ మహారాజ్ భారత సంతతికి చెందినవాడన్న విషయం తెలిసిందే. అంతేకాకుండా రామభక్తుడు కూడా. ఇటీవల కాలంలో అతడి బ్యాటింగ్‌కు వచ్చిన ప్రతీసారి ‘‘రామ్ సియా రామ్’’ అంటూ సాగే పాటను ప్లే చేస్తున్నారు.
చదవండి: BBL 2024: పాకిస్తాన్ బ్యాటర్‌కు ఊహించని షాకిచ్చిన బోర్డు.. ఎయిర్ పోర్ట్ నుంచే రిటర్న్!?
Keshav Maharaj wishes everyone ahead of the Pran Pratishtha of Lord Rama in Ram Temple. pic.twitter.com/zU00hr7DgJ
— Mufaddal Vohra (@mufaddal_vohra) January 21, 2024
Comments
Please login to add a commentAdd a comment