Ayodhya Ram temple
-
అయోధ్య: 10 రోజుల ముందుగానే వార్షికోత్సవాలు.. కారణమిదే..
అయోధ్య: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో వచ్చే ఏడాది(2025) జనవరిలో నూతన రామాలయ వార్షికోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఇందుకోసం ఇప్పుటినుంచే ఏర్పాట్లు ముమ్మరం చేశారు. 2024 జనవరి 22న అయోధ్యలో నూతన రామాలయాన్ని ప్రారంభించడంతో పాటు ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో బాలక్ రాముని ప్రాణప్రతిష్ఠ జరిగింది.అప్పటి నుంచి లక్షలాది మంది భక్తులు ప్రతినిత్యం అయోధ్య ఆలయాన్ని సందర్శించుకుంటూ వస్తున్నారు. తాజాగా శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో రామాలయ వార్షికోత్సవ వేడుల నిర్వహణపై నిర్ణయం తీసుకున్నారు. దీనిప్రకారం జనవరి 22న కాకుండా జనవరి 11నే వార్షికోత్సవ వేడుకలు జరగనున్నాయి. ఇలా 10రోజుల ముందుగా ఈ వేడుకలు నిర్వహించడం వెనుక ఒక కారణం ఉందని ట్రస్ట్ సభ్యులు తెలిపారు.అయోధ్యలోని మణిరామ్ దాస్ కంటోన్మెంట్లో శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పండితులతో సంప్రదింపులు జరిపారు. రాబోయే సంవత్సరంలో రామాలయంలో ఎప్పుడు ఏ ఉత్సవం నిర్వహించాలనేదీ నిర్ణయించారు. హిందూ క్యాలెండర్ ప్రకారం రామ్‌లల్లా ప్రాణప్రతిష్ట వార్షికోత్సవాన్ని జరుపుకోవాలని నిర్ణయించారు.ప్రతి సంవత్సరం పౌష్య శుక్ల ద్వాదశి అంటే కూర్మ ద్వాదశి నాడు ఈ ఉత్సవం జరుపుకోవాలని పండితులు తెలిపారు. 2025లో ఈ తిధి జనవరి 11న వచ్చింది. దీని ప్రకారం అయోధ్యలో నూతన రామాలయ, బాల రాముని ప్రాణప్రతిష్ఠ వార్షికోత్సవ కార్యక్రమాలు జనవరి 11న జరగనున్నాయి. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఈ సమావేశంలో వచ్చే ఏడాది నిర్వహించబోయే వార్షికోత్సవ వేడుకల ఏర్పాట్లకు సంబంధించిన పలు నిర్ణయాలు కూడా తీసుకుంది. ఇది కూడా చదవండి: World Oldest Man: ప్రపంచంలోనే అత్యంత వృద్ధుడు కన్నుమూత -
అయోధ్య గర్భాలయంలోకి వర్షపు నీరు
అయోధ్య: హోరు వర్షం ధాటికి అయోధ్య రామాలయం గర్భాలయ నిర్మాణంలో లోపాలు వెలుగుచూశాయని రామజన్మభూమి ఆలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ సోమవారం ఆగ్రహం వ్యక్తంచేశారు. శనివారం అర్ధరాత్రి అయోధ్యలో కురిసిన భారీ వర్షం కారణంగా గర్భగుడిలో బాలరాముడిని పూజించేందుకు పూజారులు కూర్చునే చోట, దర్శనార్థం వీఐపీ భక్తులు వచ్చే మార్గంలోనూ వర్షపు నీరు లీక్ అవుతోందని దాస్ ఆరోపించారు. వర్షపు నీరు బయటకు వెళ్లడానికి ఎలాంటి డ్రైనేజీ వ్యవస్థ గుడిలో లేదని తెలిపారు. దీనిని తీవ్రమైన సమస్యగా పరిగణించి తక్షణ చర్యలు చేపట్టాలని ఆలయ యాజమాన్యాన్ని ఆయన కోరారు. ‘‘ దేశవ్యాప్తంగా దిగ్గజ ఇంజనీర్లు అయోధ్య ఆలయ నిర్మాణంలో పాలుపంచుకున్నారు. జనవరి 22న ఆలయానికి ప్రాణప్రతిష్టచేశారు. ప్రపంచప్రఖ్యాత ఆలయం ప్రారంభమయ్యాక పడిన తొలి భారీ వర్షానికే నీరు లీక్ అవడం ఆశ్చర్యంగా ఉంది. ఎందుకిలా జరుగుతోంది? అనుభవజు్ఞలైన ఇంజనీర్లు కట్టినా ఇలాంటి ఘటన జరగడం పెద్ద తప్పే’ అని అన్నారు. దీంతో హుటాహుటిన ఆలయ నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా అక్కడికి చేరుకున్నారు. తక్షణం కప్పుకు మరమ్మతులు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. ‘‘ ఆలయం మొదటి అంతస్తులో ఇంకా పనులు పూర్తికాలేదు. జూలైకల్లా పూర్తిచేస్తాం. డిసెంబర్‌కల్లా మొత్తం ఆలయనిర్మాణం పూర్తిఅవుతుంది’ అని వివరణ ఇచ్చారు. -
Ayodhya Video: బాలరాముడికి సూర్య తిలకం
Live Updates ►బాల రాముడికి తిలకం దిద్దిన సూర్య కిరణాలు.. మధ్యాహ్నం 12 గంటలకు బాల రాముడి నుదిటిపై పడిన సూర్య కిరణాలు.. #WATCH | ‘Surya Tilak’ illuminates Ram Lalla’s forehead at the Ram Janmabhoomi Temple in Ayodhya, on the occasion of Ram Navami. (Source: DD) pic.twitter.com/rg8b9bpiqh — ANI (@ANI) April 17, 2024 ►భక్తజన సంద్రంగా మారిన అయోధ్య. ►బాలరాముడి దర్శనానికి పోటెత్తిన భక్తులు श्री राम जन्मभूमि मंदिर, अयोध्या से प्रभु श्री रामलला सरकार के मंगल जन्मोत्सव का सीधा प्रसारण LIVE webcast of Mangal Janmotsav of Prabhu Shri Ramlalla Sarkar, from Shri Ram Janmabhoomi Mandir, Ayodhya https://t.co/WQKw2u10pe — Shri Ram Janmbhoomi Teerth Kshetra (@ShriRamTeerth) April 17, 2024 ►ప్రాణప్రతిష్ట తరువాత తొలిసారి అయోధ్యలో శ్రీరామనవమి #WATCH | Uttar Pradesh: Devotees throng Ram temple in Ayodhya, on the occasion of #RamNavami pic.twitter.com/MTGzGvcbud — ANI (@ANI) April 17, 2024 ►భారీ ఏర్పాట్లు చేసిన రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ►ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు సూర్యతిలకం వేడుక ►అయోధ్యలో తొలిసారి శ్రీరామనవమి వేడుకలు. #WATCH | Pooja performed at the Ram Temple in Ayodhya, Uttar Pradesh on the occasion of #RamNavami Ram Navami is being celebrated for the first time in Ayodhya's Ram Temple after the Pran Pratishtha of Ram Lalla. (Source: Temple Priest) pic.twitter.com/3sgeuIdXBB — ANI (@ANI) April 17, 2024 ఇక, శ్రీరామ నవమి సందర్భంగా ప్రత్యేక అలంకరణలో దర్శనమిచ్చిన బాలరాముడు. పద్మపీఠంపై స్వర్ణాభరణాలతో బాల రాముడు మెరిసిపోతున్నాడు. కాసేపట్లో బాలరాముడికి సూర్యతిలకం దిద్దనున్న సూర్యభగవానుడు. ఈ సందర్భంగా నాలుగు నిమిషాలపాటు బాలరాముడి నుదుటిపై కిరణాలు పడతాయి. భక్తులు సూర్యతిలకం వీక్షించేందుకు ఆలయ సిబ్బంది ఏర్పాట్లు చేశారు. సూర్యకిరణాలు బాలరాముడి నుదుటిపై పడేలా ఆలయ నిర్మాణం చేసిన విషయం తెలిసిందే. This is the first #RamNavami after 496 years since 1528 when Lord Shri Ram is in his grand #AyodhyaRamTemple after 5 centuries of sacrifice, penance and struggle of his devotees..!! The Lord tests his devotees and it takes many generations for the collective power and strength… pic.twitter.com/6LFsPuPEPE — Megh Updates 🚨™ (@MeghUpdates) April 17, 2024 దర్శన వేళలు.. ఏప్రిల్ 17 శ్రీరామనవమి రోజున భక్తులకు శ్రీరాముడి దర్శనం కోసం 19 గంటల పాటు ఆలయం తలుపులు తెరిచి ఉంచుతారు. నాలుగు భోగ్ నైవేద్యాల సమయంలో కేవలం ఐదు నిమిషాలు మాత్రమే తెర మూసివేయనున్నారు. విశిష్ట అతిథులు ఏప్రిల్ 19 తర్వాత మాత్రమే దర్శనం కోసం సందర్శించాలని అయోధ్య రామ మందిర ట్రస్ట్ వెల్లడించింది. #WATCH | Uttar Pradesh: Devotees take holy dip in Saryu River as they arrive at Ram temple in Ayodhya, on the occasion of #RamNavami pic.twitter.com/ET582pvoT6 — ANI (@ANI) April 16, 2024 ఏకంగా లక్ష కేజీల లడ్డూలు.. శ్రీరామనవమి రోజు రాముల వారి కోసం 1,11,111 కేజీల లడ్డూలను అయోధ్య రామ మందిరానికి పంపించననుంది దేవర్హ హన్స్ బాబా ట్రస్ట్. ఆ ట్రస్ట్ ఈ లడ్డూలను ప్రసాదంగా రామ మందిరానికి పంపిస్తుంది. ఈ విషయాన్ని ట్రస్ట్ సభ్యుడు అతుల్ కుమార్ సక్సేనా వెల్లడించారు. అయోధ్య రామ మందిరాన్ని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులకు ఈ లడ్డూలు ప్రసాదంగా ఇవ్వనున్నారు. ఈ ట్రస్ట్ జనవరి 22న జరిగిన ప్రాణ ప్రతిష్ట వేడుకకు 40 వేల కేజీల లడ్డూలు ఇచ్చింది. రామనవమి సందర్భంగా అయోధ్య రామ మందిరాన్ని దర్శించుకోవడానికి సుమారు 25 నుంచి 35 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. -
అయోధ్యకు 1,11,111 కేజీల లడ్డూలు
లక్నో: అయోధ్యలో రామమందిర నిర్మాణం జరిగి బాల రాముడి ప్రాణప్రతిష్ఠ అనంతరం తొలి రామనవమి వేడుకలు జరుగుతున్నాయి. ఏప్రిల్ 17న జరిగే ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. రామ నవమి సందర్భంగా 1,11,111 కిలోల లడ్డూలను అయోధ్యలోని రామాలయానికి ప్రసాదంగా పంపి భక్తులకు పంపిణీ చేయనున్నట్లు దేవ్రహ హన్స్ బాబా ట్రస్ట్ ట్రస్టీ అతుల్ కుమార్ సక్సేనా తెలిపారు. కాశీ విశ్వనాథ ఆలయం సహా దేశంలోని పలు ఆలయాలకు ప్రతి వారం లడ్డూ ప్రసాదాన్ని పంపుతున్నట్లు ఆయన చెప్పారు. జనవరి 22న అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ రోజున కూడా దేవ్రహ హన్స్ బాబా ఆశ్రమం 40 వేల కిలోల లడ్డూను నైవేద్యంగా పంపినట్లు తెలిపారు. ప్రధాని మోదీ గత జనవరి 22న అయోధ్య రామాలయంలో రామ్‌లల్లా విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ కార్యక్రమం జరగుతుండగా ఆర్మీ హెలికాప్టర్లు ఆలయంపై పూలవర్షం కురిపించాయి. ఆరోజు మొదలుకొని అయోధ్యలో సందడి కొనసాగుతోంది. ఏప్రిల్ 17న రామ నవమి సందర్భంగా ఆలయ తలుపులు మూడు రోజుల పాటు 24 గంటలూ తెరచి ఉండనున్నాయి. నైవేద్యం సమర్పించేటప్పుడు, అలంకారం చేసేటప్పుడు మాత్రమే తలుపులు మూసివేయనున్నారు. శ్రీరాముని జన్మదినోత్సవ వేడుకలకు అయోధ్యకు వచ్చే రామభక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. -
అఖండ భారత్‌కు ప్రతీక
న్యూఢిల్లీ: అయోధ్య రామాలయాన్ని ‘ఏక్ భారత్, శ్రేష్ఠ్ భారత్’ స్ఫూర్తికి పరిపూర్ణ ప్రతీకగా పార్లమెంటు అభివర్ణించింది. శనివారం ఈ మేరకు ఉభయ సభలు తీర్మానాలను ఆమోదించాయి. ఆలయ నిర్మాణం, రామ్‌లల్లా ప్రాణప్రతిష్ట అంశంపై రాజ్యసభలో చైర్మన్ జగ్దీప్ ధన్‌ఖడ్, లోక్‌సభ లో స్పీకర్ ఓం బిర్లా తీర్మానాలు ప్రవేశపెట్టారు. ‘‘శతాబ్దాల ఎదురుచూపుల అనంతరం సుపరిపాలన, ప్రజా సంక్షేమ రంగాల్లో నూతన శకానికి రామాలయ నిర్మాణం నాంది పలికింది. అది కేవలం రాళ్లు, ఇటుకలతో కూడిన నిర్మాణం కాదు. నమ్మకం, విశ్వాసాలతో నిండిన జాతి ప్రతీక. ఈ చారిత్రక క్షణాన్ని సాకారం చేయడంలో న్యాయవ్యవస్థ, పౌర సమాజం కూడా కీలక పాత్ర పోషించాయి’’ అంటూ వారు కొనియాడారు. రామ మందిరంపై సుప్రీంకోర్టు తీర్పు దేశ లౌకికత్వ విలువలను ప్రతిఫలించిందని లోక్‌సభలో చర్చలో పాల్గొన్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా అభిప్రాయపడ్డారు. మందిర నిర్మాణంలో సమాజంలోని అన్ని వర్గాలనూ ప్రధాని మోదీ భాగస్వాములను చేశారన్నారు. ప్రపంచంలో మరే దేశంలోనూ మెజారిటీ సామాజిక వర్గం ఇలా తమ మత విశ్వాసాలకు సంబంధించిన అంశంపై ఇంతటి సుదీర్ఘకాలం ఎదురు చూడాల్సి రాలేదన్నారు. జనవరి 22న మందిర ప్రారంభంతో మహోన్నత భారత్ దిశగా గొప్ప ప్రయాణం మొదలైందని, మన దేశం విశ్వగురువుగా ఆవిర్భవించేందుకు దారులు పడ్డాయని అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో మళ్లీ ఘనవిజయం సాధించి ప్రజల ఆకాంక్షలను మోదీ సర్కారు నెరవేరుస్తుందని చెప్పారు. చరిత్రాత్మక రథయాత్ర ద్వారా ఆలయ నిర్మాణంలో బీజేపీ కురువృద్ధుడు ఎల్కే ఆడ్వాణీ కూడా కీలక పాత్ర పోషించారని అమిత్ షా గుర్తు చేసుకున్నారు. సుదీర్ఘ చర్చ అనంతరం తీర్మానాలు సభలు ఆమోదం పొందాయి. జన్మస్థలికి వందల మీటర్ల దూరంలో ఆలయ నిర్మాణం: కాంగ్రెస్ అయోధ్య రామాలయంపై కొత్త చర్చకు కాంగ్రెస్ తెర తీసింది. రామ మందిర నిర్మాణంపై రాజ్యసభ చేపట్టిన స్వల్ప వ్యవధి చర్చ ఇందుకు వేదికైంది. రాముని అసలు జన్మస్థలికి కొన్ని వందల మీటర్ల అవతల ఆలయాన్ని నిర్మించారని కాంగ్రెస్ ఎంపీ ప్రమోద్ తివారీ అన్నారు. కావాలంటే దీనిపై పరిశీలనకు ఎంపీలతో అఖిలపక్ష బృందాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఆలయ నిర్మాణం పూర్తవకుండానే ప్రారంభించడం పూర్తిగా శాస్త్రవిరుద్ధమన్నారు. అసంపూర్తి ఆలయంలో పూజలు చేస్తే దేశానికే అరిష్టమని వాదించారు. పైగా ఆలయ ప్రారంపోత్సవంలో అన్ని నిబంధనలనూ యథేచ్ఛగా ఉల్లంఘించారని ఆయన ఆరోపించారు. ఉభయసభలు నిరవధిక వాయిదా పార్లమెంటు ఉభయసభలూ శనివారం నిరవధికంగా వాయిదా పడ్డాయి. బడ్జెట్ సమావేశాలు ముగిసిన అనంతరం లోక్‌సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. 17వ లోక్‌సభకు ఇవే చివరి సమావేశాలు. ఈ ఐదేళ్లలో సభ 222 బిల్లులను ఆమోదించినట్టు స్పీకర్ తెలిపారు. ‘‘అధికార, విపక్ష సభ్యులను నేనెప్పుడూ సమానంగానే చూశా. కాకపోతే సభ హుందాతనాన్ని, గౌరవాన్ని కాపాడేందుకు కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది.’’ అని చెప్పుకొచ్చారు. మరోవైపు, రాజ్యసభ 263వ సమావేశాలు కూడా ముగిశాయని చైర్మన్ జగ్దీప్ ధన్‌ఖడ్ సభలో ప్రకటించారు. అనంతరం సభను నిరవధికంగా వాయిదా వేశారు. -
అయోధ్యకు క్యూ కట్టిన భక్తులు.. ఇప్పటి వరకు దర్శనాలు, హుండీ..
అయోధ్య: యూపీలోని అయోధ్య మందిరానికి భక్తులు క్యూ కడుతున్నారు. బాలరాముడిని చూసేందుకు దేశ నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా భక్తులు తరలివస్తున్నారు. ఇక, కేవలం 11 రోజుల్లోనే ఏకంగా 25 లక్షల మంది భక్తులు అయోధ్య రాముడిని దర్శించుకున్నారు. ఈ క్రమంలో రూ.11 కోట్ల మేర హుండీ ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. కాగా, అయోధ్యలోని బాలక్ రాముడి దర్శన మార్గంలో నాలుగు హుండీలను ఏర్పాటు చేశారు. ఇక, గత 11 రోజుల్లో 25లక్షల మంది భక్తులు బాలరాముడిని దర్శించుకోగా హుండీ ఆదాయం రూ.8 కోట్లు నగదు రూపంలో, రూ.3.5 కోట్లు చెక్కుల రూపంలో వచ్చాయి. ఇందులో ఆన్లైన్ విరాళాలు కూడా ఉన్నాయి. మొత్తం 14 మందితో కూడిన బృందం ఈ హుండీల్లోని విరాళాలను లెక్కించింది. ఇక, భక్తులు కానుకలు సమర్పించడం నుంచి వాటిని లెక్కింపు వరకూ అంతా సీసీటీవీ కెమెరాల నిఘా పర్యవేక్షణలోనే జరుగుతుందని ఆలయ ట్రస్టు ఆఫీస్ ఇన్‌ఛార్జి ప్రకాశ్ గుప్తా తెలిపారు. VIDEO | Devotees continue to throng Ayodhya's Ram Mandir for 'darshan' of Ram Lalla. (Full video available on PTI Videos - https://t.co/n147TvqRQz)#AyodhyaRamMandir pic.twitter.com/cweNluhV8U — Press Trust of India (@PTI_News) February 2, 2024 ఇదిలా ఉండగా.. భారీసంఖ్యలో వస్తున్న భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని అయోధ్యలోని బాలరాముడి మందిరంలో స్వామి దర్శన సమయాన్ని ఆలయ నిర్వాహకులు ఇటీవల పొడిగించారు. ప్రతిరోజు ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు భక్తులు ఆలయాన్ని సందర్శించుకోవచ్చని అధికారులు తెలిపారు. అంతకుముందు ఆలయ దర్శన వేళలు ఉదయం 7 నుంచి సాయంత్రం 6 వరకు మాత్రమే ఉండేవి. #WATCH | Uttar Pradesh: Devotees gather at Rampath for the darshan of Ram Lalla at Shri Ram Janmabhoomi Temple in Ayodhya. pic.twitter.com/tpmVFU2jH0 — ANI (@ANI) February 2, 2024 -
అయోధ్య చేరేదెలా?
సాక్షి, హైదరాబాద్: ప్రతి సంవత్సరం కేంద్రం ప్రవేశపెట్టే బడ్జెట్ ఒక ప్రహసనంగా మారింది. ఏటేటా బడ్జెట్లు వస్తూనే ఉన్నాయి. కానీ హైదరాబాద్ ప్లాట్‌ఫాంపైన ఆగడం లేదు. ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ పడడం లేదు. లక్షలాది మంది భక్తులు, యాత్రికులు సందర్శించుకొనే పుణ్యక్షేత్రాలకు రైళ్లు అందుబాటులో లేకపోవడం వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆబాల గోపాలాన్ని అలరించే అయోధ్య బాలరాముడు కొలువైన అయోధ్యకు చేరుకొనేందుకు హైదరాబాద్ నుంచి ఒక్క రైలు కూడా అందుబాటులో లేకపోవడం గమనార్హం. అలాగే షిరిడీ, వారణాసి తదితర ఏ పుణ్యక్షేత్రానికి వెళ్లాలనుకున్నా అరకొర రైళ్లు వెక్కిరిస్తున్నాయి. సుమారు 10 సంవత్సరాలుగా కొత్త రైళ్లు అందుబాటులోకి రాలేదు. అయోధ్యకు ప్రత్యేక రైళ్లా... అయోధ్యకు వెళ్లేందుకు రెగ్యులర్ రైళ్లు లేవు. ప్రయాణికులు దానాపూర్ ఎక్స్‌ప్రెస్‌లో వారణాసి లేదా, దానాపూర్ వరకు చేరుకొని అక్కడి నుంచి మరో ట్రైన్లో కానీ, రోడ్డు మార్గంలో కానీ అయోధ్యకు వెళ్లవలసి ఉంటుంది. అలాగే జంటనగరాల మీదుగా వెళ్లే రైళ్లలో గోరఖ్‌పూర్, లక్నో నగరాలకు చేరుకొని అక్కడి నుంచి అయోధ్యకు వెళ్లాలి. ఇంటిల్లిపాది కలిసి వెళ్లాలంటే ఇది ఎంతో ప్రయాసతో కూడిన ప్రయాణం. పైగా ఆర్ధికంగా కూడా భారమే. ప్రతి సంవత్సరం హైదరాబాద్ నుంచి లక్షలాది మంది భక్తులు అయోధ్యను సందర్శించే అవకాశం ఉంది. ఈ మేరకు ప్రయాణికులు ప్రతి రోజు రాకపోకలు సాగించే విధంగా సికింద్రాబాద్–అయోధ్య మధ్య కొత్తగా రైళ్లను ప్రవేశపెట్టాలని నగరవాసులు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం సికింద్రాబాద్ నుంచి దానాపూర్ వరకు ఒకే ఒక్క రెగ్యులర్ రైలు నడుస్తోంది. ఈ ట్రైన్లో యూపీ, బీహార్, తదితర రాష్ట్రాల నుంచి హైదరాబాద్‌కు రాకపోకలు సాగించే వలస కార్మికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. వారణాసి వరకు భక్తులు కూడా వెళ్తారు. కానీ ప్రయాణికుల డిమాండ్ కారణంగా రిజర్వేషన్ లభించడం కష్టం. అయోధ్యకు వెళ్లేందుకు అందుబాటులో ఉన్న ట్రైన్ కూడా ఇదొక్కటే. బాలరాముడి విగ్రహానికి ప్రాణప్రతిష్ట చేసినప్పటి నుంచి ఈ ట్రైన్‌కు ప్రయాణికుల రద్దీ బాగా పెరిగింది. భవిష్యత్తులో ప్రయాణికుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. మరోవైపు ప్రస్తుతం రైల్వేశాఖ నియోజకవర్గాల వారీగా ఐఆర్సీటీసీ ఆధ్వర్యంలో ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. ఈ రైళ్లలో వెళ్లాలంటే ఆధ్యాత్మిక సంస్థల్లో నమోదు చేసుకొన్న వాళ్లకు మాత్రమే అవకాశం లభిస్తుంది.పైగా ఫిబ్రవరి నెలాఖరు వరకే ఈ రైళ్లు పరిమితం.ఆ తరువాత అయోధ్య టూర్‌కు ఐఆర్సీటీసీ ప్యాకేజీలే శరణ్యం. ఈ పర్యాటక ప్యాకేజీలు వారం నుంచి 10 రోజుల వరకు ఉంటాయి.ఇది ఆర్ధికంగా భారమే కాకుండా కేవలం అయోధ్య వరకే వెళ్లి రావాలనుకొనేవాళ్లకు సాధ్యం కాదు. ఈ మేరకు హైదరాబాద్ నుంచి న్యూఢిల్లీకి నడిచే తెలంగాణ ఎక్స్‌ప్రెస్ తరహాలో అయోధ్య ఎక్స్‌ప్రెస్‌ను ప్రవేశపెట్టాలని నగరవాసులు కోరుతున్నారు. వారణాసికి ఉన్నది ఒక్కటే... కోట్లాదిమంది భక్తులు సందర్శించే మరో అద్భుతమైన ఆధ్యాత్మిక క్షేత్రం వారణాసి0. ప్రధాని మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసికి దేశవ్యాప్తంగా భక్తుల రద్దీ గణనీయంగా పెరిగింది. వారణాసికి వెళ్లాలన్నా ప్రస్తుతం సికింద్రాబాద్ నుంచి దానాపూర్‌కు వెళ్లే రైలే దిక్కు. ఈ రైల్లో ప్రతి రోజు 180 శాతం వరకు ఆక్యుపెన్సీ ఉంటుంది. షిరిడీకి ఉన్నది ఒక్కటే... లక్షలాది మంది భక్తులు సందర్శించే షిరిడీకి సైతం రైళ్ల కొరత వెంటాడుతోంది. అజంతా ఎక్స్‌ప్రెస్ ఒక్కటే ప్రస్తుతం అందుబాటులో ఉంది. కాకినాడ నుంచి సికింద్రాబాద్ మీదుగా సాయినగర్ వరకు మరో రైలు రాకపోకలు సాగిస్తుంది. కానీ ఈ ట్రైన్ కాకినాడలోనే 100 శాతం ఆక్యుపెన్సీతో బయలుదేరుతుంది. హైదరాబాద్‌లో హాల్టింగ్ సదుపాయం ఉన్నా రిజర్వేషన్లు లభించవు. దీంతో నగరవాసులు ఒక్క అజంతాపైన ఆధారపడవలసి వస్తోంది. -
రాజ్యాంగ నిర్మాతలకు శ్రీరాముడే స్ఫూర్తి
న్యూఢిల్లీ: అయోధ్య రామాలయంలో ప్రాణప్రతిష్ట కార్యక్రమం కోట్లాది మంది ప్రజలను ఏకం చేసిందని, ఆ మహత్తర సందర్భం దేశ సమష్టి బలాన్ని చాటిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ఈ ఏడాదిలో మొదటిసారిగా ఆదివారం ప్రసారమైన మన్‌కీ బాత్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాజ్యాంగ నిర్మాతలకు ఆ శ్రీరాముడే ప్రేరణగా నిలిచారని పేర్కొన్నారు. అందుకే జనవరి 22వ తేదీన అయోధ్యలో జరిగిన ఉత్సవాన్ని ‘దేవుడు దేశానికి, రాముడు రాజ్యానికి’వచ్చిన సందర్భంగా పేర్కొంటున్నట్లు చెప్పారు. ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం గురించి కోట్లాది మంది ప్రజలు కూడా ఇదేవిధంగా భావించారన్నారు. ‘ప్రతి ఒక్కరూ ఆ రోజు రామ భజన గీతాలు ఆలపించి ఆ రామునికే అంకితమిచ్చారు. రామ జ్యోతిని వెలిగించి దీపావళిని జరుపుకున్నారు. ప్రతి ఒక్కరి మాటల్లోనూ, ప్రతి ఒక్కరి గుండెల్లోనూ రాముడే నిండిపోయాడు’అని ప్రధాని అన్నారు. -
బాలరామున్ని దర్శించుకున్న హనుమాన్..! ఆలయంలో ఆసక్తికర ఘటన
లక్నో: అయోధ్య రామాలయ గుడిలో విచిత్రమైన ఘటన జరిగింది. బాలరాముడు కొలువై ఉన్న గర్భగుడిలోకి ఓ వానరం ప్రవేశించింది. మంగళవారం సాయంత్రం సమయంలో గుడి దక్షిణ ద్వారం గుండా ఓ కోతి ప్రవేశించింది. కొత్త ఆలయాన్ని నిర్మించడానికి ముందు గుడారంలో ఉంచిన బాలరాముని పాత విగ్రహాన్ని చేరుకుంది. ఈ విషయాన్ని అయోధ్య రామాలయ ట్రస్టు ట్విట్టర్ వేదికగా పంచుకుంది. విగ్రహం భద్రత గురించి భద్రతా సిబ్బంది ఆందోళన చెంది, కోతి వైపు పరుగెత్తారు. అయితే, కోతి ప్రశాంతంగా వెనక్కి తిరిగి ఉత్తర ద్వారం వైపు వెళ్లింది. అది మూసివేసి ఉండటంతో భక్తుల రద్దీని దాటి ఎలాంటి హాని చేయకుండా తూర్పు ద్వారం గుండా వెళ్లిపోయింది. బాలరామున్ని దర్శించేందుకు హనుమంతుడు స్వయంగా వచ్చాడని కోతి సందర్శనను దైవానుగ్రహంగా భక్తులు భావించారని ట్రస్ట్ తెలిపింది. आज श्री रामजन्मभूमि मंदिर में हुई एक सुंदर घटना का वर्णन: आज सायंकाल लगभग 5:50 बजे एक बंदर दक्षिणी द्वार से गूढ़ मंडप से होते हुए गर्भगृह में प्रवेश करके उत्सव मूर्ति के पास तक पहुंचा। बाहर तैनात सुरक्षाकर्मियों ने देखा, वे बन्दर की ओर यह सोच कर भागे कि कहीं यह बन्दर उत्सव… — Shri Ram Janmbhoomi Teerth Kshetra (@ShriRamTeerth) January 23, 2024 కోతిని హనుమంతుని రూపంగా భక్తులు భావిస్తారు. అయితే.. అక్టోబర్ 30, 1990న బాబ్రీ మసీదుపై కరసేవకులు జెండాలను ఎగురవేశారు. ఈ క్రమంలో కరసేవకులను భద్రతా బలగాలు చెదరగొట్టాయి. ఈ క్రమంలో మసీదు గోపురంపై కరసేవకులు అమర్చిన జెండాను తొలగించకుండా ఓ కోతి కాపాడింది. ఇదీ చదవండి: కేంద్ర మంత్రులు అయోధ్యకు వెళ్లకండి: మోదీ -
కేంద్ర మంత్రులు అయోధ్యకు వెళ్లకండి: మోదీ
లక్నో: ఫిబ్రవరిలో అయోధ్యను సందర్శించడం మానుకోవాలని కేబినెట్ మంత్రులను ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. జనవరి 22న ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరిగిన తర్వాత భక్తులు భారీ సంఖ్యలో రామమందిరానికి తరలి రావడంతో మోదీ ఈ మేరకు మంత్రులకు విజ్ఞప్తి చేసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. దీంతో కేంద్ర మంత్రులు మార్చి నెలలో అయోధ్యను సందర్శించనున్నట్లు తెలుస్తోంది. వీఐపీల సందర్శనలో ప్రోటోకాల్‌ల వల్ల భక్తులకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు అయోధ్యకు వెళ్లే ప్రణాళికను మంత్రులు వాయిదా వేసుకోవాలని ప్రధాని మోదీ కోరినట్లు తెలుస్తోంది. అయోధ్య రామమందిర నిర్మాణంపై ప్రజల అభిప్రాయాన్ని కూడా ప్రధాని మోదీ మంత్రులను అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. సోమవారం అయోధ్య ఆలయంలో బాలరాముని విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ నాయకత్వం వహించారు. ఈ వేడుకను దేశవ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారం చేశారు. అగ్రశ్రేణి రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, క్రీడాకారులు, సెలబ్రిటీలతో సహా అనేక వేల మందిని కార్యక్రమానికి ఆహ్వానించారు. సంప్రోక్షణ కార్యక్రమం ముగిసిన వెంటనే ఆహ్వానితులు దేవుడి దర్శనం చేసుకున్నారు. సాధారణ ప్రజల కోసం మంగళవారం ఉదయం ఆలయ తలుపులు తెరవబడ్డాయి. మొదటి రోజు దాదాపు ఐదు లక్షల మంది భక్తులు ఆలయాన్ని సందర్శించారు. మంగళవారం తెల్లవారుజామున 3 గంటల నుంచే భక్తులు బారులు తీరారు. భక్తులు భారీగా తరలిరావడంతో మంగళవారం దర్శనానికి కొద్దిసేపు విరామం ఇవ్వాల్సి వచ్చింది. ఇదీ చదవండి: Ayodhya Ram Mandir: తొలి రోజు రాములోరి నిద్ర 15 నిముషాలే! -
అయోధ్య ప్రసాదం.. వీఐపీ దర్శనం!
సాక్షి, హైదరాబాద్: అయోధ్య రామమందిరం పేరును సైబర్ నేరగాళ్లు కొత్త మోసాలకు ఉపయోగించుకుంటున్నట్లు తెలంగాణ స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీఎస్‌సీఎస్‌బీ) హెచ్చరించింది. అయోధ్య ప్రసాదం పంపిణీ పేరిట, విరాళాల సేకరణ పేరిట, వీఐపీ దర్శనం టికెట్ల విక్రయం పేరిట సైబర్ నేరగాళ్లు వాట్సాప్‌లలో సందేశాలు పంపుతున్నట్లు పేర్కొంది. అయోధ్య రామమందిరం పేరుతో సైబర్ నేరస్తులు పంపే క్యూఆర్ కోడ్లు, ఆండ్రాయిడ్ అప్లికేషన్ ప్యాకేజ్ (ఏపీకే) ఫైల్స్‌ను నమ్మి మోసపోవద్దని టీఎస్‌సీఎస్‌బీ డైరెక్టర్ షికా గోయల్ మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. రామమందిరం పేరిట సైబర్ నేరగాళ్లు నకిలీ వెబ్సైట్లు సృష్టించినట్లు తమ దృష్టికి వచ్చి నట్లు చెప్పారు. డబ్బు పంపాలంటూ వాట్సాప్ సందేశాల్లో నకిలీ లింక్‌లు పంపుతున్నారని, ఆ లింక్‌లు క్లిక్ చేసిన వారి నుంచి బ్యాంకుల వివరాలు, ఫోన్‌నంబర్లను సేకరిస్తున్నారని తెలిపారు. అలాగే వివిధ మొబైల్ యాప్‌లను డౌన్లోడ్ చేసి ఓటీపీలు చెప్పాలని కోరుతున్నారని, అలా చేస్తే ఫోన్ల పనితీరు సైబర్ నేరగాళ్ల అ«దీనంలోకి వెళ్తుందని హెచ్చరించారు. ఈ డిజిటల్ ముప్పును ఎదుర్కోవడానికి వాట్సాప్ లేదా ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలలో వచ్చే అనుమానాస్పద లింక్‌లపై క్లిక్ చేయవద్దని షికా గోయల్ సూచించారు. ఈ తరహా మెసేజ్‌లు వస్తే వెంటనే 1930 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా ఫిర్యాదు చేయాలని కోరారు. అదేవిధంగా www. cybercrime. gov. in ద్వారా లేదా వాట్సాప్‌లో సైబర్ ఫ్రాడ్ రిజిస్ట్రీ నంబర్ 87126 72222కు సమాచారం ఇవ్వాలని సూచించారు. పాత నాణేలిస్తే లక్షలిస్తామని బురిడీ పాత నాణేలు తమకు ఇస్తే బదులుగా రూ. లక్షలు చెల్లిస్తామంటూ సైబర్ నేరగాళ్లు మోసగిస్తున్నారని... ఇందిరా గాంధీ, భారతదేశ మ్యాప్ చిత్రాలున్న పాత రూ. 2 లేదా రూ. 5 నాణేలు పంపిస్తే రూ. లక్షల్లో ఆదాయం వస్తుందని మోసపూరిత ప్రకటనలు ఇస్తున్నట్లు తెలంగాణ స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ షికా గోయల్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. సైబర్ నేరగాళ్ల మాయలో చిక్కే అమాయకులకు డబ్బు చెల్లిస్తామని... అందుకోసం ముందుగా టీడీఎస్, సర్విస్ చార్జీలు చెల్లించాలంటూ కేటుగాళ్లు డబ్బు దండుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఇలాంటి మోసాలపట్ల కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. -
రామమందిరానికి రూ.1.30 కోట్ల విరాళం
బంజారాహిల్స్: జూబ్లీహిల్స్‌లోని జీవీపీఆర్ ఇంజనీర్స్ సంస్థ అయోధ్య రామ మందిర నిర్మాణానికి రూ.1.30 కోట్లు విరాళంగా అందజేసింది. ఈ మొత్తాన్ని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్రకు చెక్కుల రూపంలో రెండు విడతలుగా అందజేశారు. ఈ మేరకు జీవీపీఆర్ ఇంజనీర్స్ లిమిటెడ్ ఫౌండర్ చైర్మన్ వీరారెడ్డికి అయోధ్య శ్రీరామ ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవానికి రావలసిందిగా ప్రత్యేక ఆహ్వానం అందడంతో ఆ సంస్థ చైర్మన్ శివశంకర్‌రెడ్డి, తన కుటుంబంతో కలిసి ఆయన ఈ వేడుకలో సోమవారం పాల్గొన్నారు. శ్రీరాముడి పూజల్లో కూడా ఆయన పాలుపంచుకున్నారు. -
శ్రీరాముడి పల్లకీపై బూటు
హత్నూర (సంగారెడ్డి): అయోధ్యలో భవ్య రామ మందిరం నిర్మాణం సందర్భంగా శ్రీరాముని పల్లకీ ఊరేగింపు నిర్వహిస్తున్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు బూటు విసిరిన ఘటన ఉద్రిక్తతకు దారి తీసింది. సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం దౌల్తాబాద్‌లో సోమవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. పట్టణంలో శ్రీరాముని పల్లకీ సేవ నిర్వహిస్తుండగా ఓ ఇంటిపై నుంచి గుర్తుతెలియని వ్యక్తులు బూటు విసిరారు. దీంతో రామభక్తులు కోపోద్రిక్తులయ్యారు. బూటు పడిన ఇంటి ఎదుట ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న రామభక్తులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకోవడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో రాజీవ్ గాంధీ చౌరస్తాలోని పండ్ల దుకాణాన్ని దగ్ధం చేశారు. జైశ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తూ దౌల్తాబాద్ పట్టణమంతా అర్ధరాత్రి వరకు ర్యాలీలు చేపట్టారు. సమాచారం అందుకున్న ఎస్పీ రూపేష్ కుమార్, పటాన్చెరు డీఎస్పీ, జిన్నారం, సంగారెడ్డి పటాన్చెరు సీఐలు, ఎస్సైలు పోలీసు బలగాలతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. రామ భక్తులను సముదాయించే ప్రయత్నం చేశారు. వారి మాట వినకుండా ఆందోళనకారులు రోడ్డుపై బైఠాయించి.. చెప్పు విసిరిన వ్యక్తులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా బూటు విసిరిన ఇంటిపైన రాళ్లతో దాడికి దిగారు. నిందితుడిని గుర్తించి అరెస్టు చేస్తామని ఎస్పీ హామీ ఇచ్చారు. అయినా నిరసనకారులు వెనక్కు తగ్గకుండా అర్ధరాత్రి వరకు ఆందోళనను కొనసాగించారు. 108 అంబులెన్స్ రప్పించి భారీ పోలీస్ బందోబస్తు మధ్యలో బూటు విసిరిన కుటుంబ సభ్యులను భారీ బందోబస్తు మధ్య తరలించేందుకు ప్రయత్నం చేశారు. తహసీల్దార్ సంధ్య, ఆర్డీఓ రవీందర్‌రెడ్డి ఘటనా స్థలాన్ని సందర్శించి పరిస్థితిని పర్యవేక్షించారు. ఎంతటి వారైనా శిక్షిస్తాం : ఎస్పీ పల్లకీ సేవపై బూటు విసిరిన వారు ఎంతటి వారైనా శిక్షిస్తామని ఎస్పీ రూపేష్ తెలిపారు. నిందితులను వెంటనే అరెస్టు చేసి కేసులు నమోదు చేస్తామని రామ భక్తులకు హామీ ఇచ్చారు. దౌల్తాబాద్‌లో పికెటింగ్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. -
అయోధ్య రాముడికి అంబానీ దంపతుల కానుక.. 33 కేజీల బంగారం?
ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రామమందిర ప్రాణ ప్రతిష్ఠ ఎట్టకేలకు ముగిసింది. ఈ దివ్య ఘట్టాన్ని ప్రత్యక్షంగా తిలకించిన ప్రముఖలతోపాటు టీవీల్లో, ఇతర సాధనాల్లో వీక్షించిన కోట్లాదిమంది భక్తిపారవశ్యంతో పులకించిపోయారు. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతోపాటు ఆసియాలోనే అత్యంత సంపన్నుడైన ముఖేష్ అంబానీ కుటుంబం కూడా ఈ వేడుకలో పాల్గొంది. కాగా రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్, ఎండీ ముఖేష్ అంబానీ, నీతా అంబానీ దంపతులు అయోధ్యలోని రామమందిరానికి 33 కిలోల బంగారాన్ని విరాళంగా ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. రామమందిరం ప్రాణ ప్రతిష్ఠకు ముందు నుంచే ఈ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. 33 కేజీల బంగారంతో పాటు అంబానీలు ఆలయానికి మూడు బంగారు కిరీటాలను కూడా విరాళంగా ఇచ్చారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇదీ చదవండి: Ayodhya: అమ్మతో అయోధ్యలో.. సాఫ్ట్వేర్ కంపెనీ సీఈవో భక్తిపారవశ్యం! ఈ వార్తలు నిజమేనా? అయోధ్య రామమందిరానికి ముఖేష్ అంబానీ దంపతులు మూడు బంగారు కిరీటాలు, 33 కేజీల బంగారాన్ని విరాళంగా ఇచ్చినట్లు వచ్చిన ఈ వార్తల్లో నిజం లేదని తెలిసింది. డీఎన్ఏ వార్తా సంస్థ నివేదిక ప్రకారం.. విరాళాల విషయమై న్యూస్‌చెకర్ (Newschecker) వెబ్సైట్ శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యునితో మాట్లాడింది. ఇలాంటి విరాళాలేవీ తమకు అందించలేదని ట్రస్ట్ సభ్యులు ధ్రువీకరించినట్లుగా పేర్కొంది. అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
రామ్ లల్లా దర్శనం: సోనూ నిగమ్ భావోద్వేగం, బీ-టౌన్ సెల్ఫీ వైరల్
#AyodhyaRamMandir శతాబ్దాల సుధీర్ఘ నిరీక్షణ ఫలించిన వేళ... ఎంతో ఉత్కంఠగా ఎదురు చూసిన బాల రాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేతులు మీదుగా ఘనంగా జరిగింది. ఈ వైభవాన్నిప్రత్యక్షంగా, పరోక్షంగా కన్నులారా వీక్షించిన భక్తుల రామనామ స్మరణతో యావద్దేశం పులకించిపోయింది. ఈ సందర్బంగా కొన్ని విశేషాలు సోషల్ మీడియాలో విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ కార్యక్రమం అనంతరం అక్కడున్న వారినందరినీ ప్రధాని మోదీ పలకరించారు. ప్రముఖగా బాలీవుడ్ నటుడు బిగ్‌బీ, అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్లతోపాటు, రిలయన్స్ అధినేత అంబానీ దంపతులను పలకరించి అభివాదం చేశారు. బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కూడా ఆనంద పరవశంలో మునిగి జైశ్రీరామ్ అంటూ నినదించింది. రామ మందిరాన్ని చూసి, ఆనంద పరవశంలో నటి కంగనా రనౌత్. #AyodhaRamMandir pic.twitter.com/KsynLcVD92 — Actual India (@ActualIndia) January 22, 2024 అలాగే ప్రాణప్రతిష్ట కార్యక్రమాన్ని వీక్షించేందుకు అయోధ్య తరలివెళ్లిన బాలీవుడ్ నటులు దిగిన సెల్ఫీ కూడా విశేషంగా ఆకట్టుకుంటోంది. రామ మందిర ప్రాణ ప్రతిష్ట వేడుకలో బాలీవుడ్ సుభాష్ ఘాయ్ అంబానీ కోడలు శ్లోకా అంబానీతోపాటు బీ-టౌన్ ప్రముఖులతో కలిసి సెల్ఫీ తీసుకోవడం విశేషం. అలాగే బాలీవుడ్ సింగర్ సోనూ నిగమ్ భావోద్వేగానికి గురయ్యాడు. అభి కుచ్ బోల్నే కో హై నహీ, బస్ యాహీ (కన్నీళ్లు) బోల్నే కో హై. (ఇపుడిక మాట్లాడానికి ఏమీలేదు ఆనంద బాష్పాలు తప్ప అంటూ ఆయన పరవశించిపోయారు. ప్రాణ ప్రతిష్ట వేడుకకు ముందు అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి ఆలయంలో సోను నిగమ్ 'రామ్ సియారామ్' పాటను ఆలపించారు. #WATCH | Ayodhya, Uttar Pradesh | Singer Sonu Nigam gets emotional; says, "...Abhi kuch bolne ko hai nahi, bas yahi (tears) bolne ko hai."#RamTemplePranPratishtha pic.twitter.com/6yoZ4s8APy — ANI (@ANI) January 22, 2024 #WATCH | Singer Anuradha Paudwal sings Ram Bhajan at Shri Ram Janmaboomi Temple in Ayodhya ahead of the Pran Pratishtha ceremony. pic.twitter.com/ZuKe4w5FCm — ANI (@ANI) January 22, 2024 కాగా ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని తిలకించేందుకు అమితాబ్ బచ్చన్ నుండి సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ వరకు సెలబ్రిటీల ఫొటోలు, వీడియోలు వైరల్‌గా మారాయి. ఈ సందర్భంగా ప్రముఖ గాయకుల గాత్రంతో అయోధ్యనగరి రామభజనలతో ఉర్రూతలూగింది. ప్రాణప్రతిష్ట వేడుకకు ముందు ప్రముఖ గాయకులు రామ్ భజనలు ఆలపించారు. అనురాధ పౌడ్వాల్, శంకర్ మహదేవన్, సోనూ నిగమ్‌ల మధురమైన గాత్రాలకు రామ్ భక్తులు భక్తి పారవశ్యంలో మునిగి తేలారు. అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ప్రాణ ప్రతిష్ట వేళ సెలబ్రెటీలు ఎలాంటి కాస్ట్యూమ్స్ ధరించారంటే..!
అయోధ్యలో అపూర్వ ఘట్టం ఆవిష్కృతమైంది. దాదాపు 500 ఏళ్ల హిందువుల కల సాకారమైంది. రామజన్మభూమిలో నూతనంగా నిర్మించిన మందిరంలో శ్రీరామచంద్రుడు బాలరాముడిగా కొలువు దీరాడు. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా సోమవారం బాలరాముడికి ప్రాణ ప్రతిష్ట అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పలువులరు సెలబ్రెటీలకు, ప్రముఖులకు ఆహ్వానం అందింది. అయితే వారంతా ఈ ఈవెంట్‌కి వచ్చిన తీరు అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఎప్పుడూ టీవీల్లో ఫుల్ మేకప్‌తో ట్రెండీ దుస్తులతో కనపించేవారంతా ఒక్కసారిగా సంప్రదాయ దుస్తుల్లోకి మారిపోయారు. మనం రోజూ తెరపై చూసిన నటీ నటులేనే అన్నంతగా వారి ఆహార్యం మారిపోయింది. వారంతా ఎలాంటి కాస్ట్యూమ్స్ ధరించారంటే..! ఈ మహత్తర మహోత్సవ కార్యక్రమంలో పాలు పంచుకున్న బాలీవుడ్ నటి కత్రినా కైఫ్, ఆమె భర్తతో కలిసి వచ్చింది. కత్రినా బంగారు రంగు చీరలో సంప్రదాయ గృహిణిలా కనిపించగా, ఆమె భర్త చక్కటి తెల్లటి కుర్తా పైజామా, బోల్డ్ డిజైన్‌లో ఉన్న దుపట్టతో తళుకున్నమన్నాడు. ఇరువురిని చూస్తే రెండు కళ్లవు చాలవు అన్నంత అందంగా సంప్రదాయ బద్ధమైన దుస్తులతో అలరించారు. ఇక 'యానిమల్' హిరో సతీమణి అలియా భట్ సైతం గోల్డెన్ బోర్డర్‌తో ఉన్న లక్స్ గ్రీన్చీరలో వచ్చింది. పైగా భుజంపై మ్యాచింగ్ శాలువా ధరించి హుందాగా వచ్చింది. ఇక ఆమె భర్త రణబీర్ కపూర్ తెల్లటి ధోతీ కుర్తాలో అదిరిపోయే లుక్క్‌లో సందడి చేశాడు. అతను కూడా మంచి క్లాసిక్ శాలువా ధరించాడు. పైగా ఇరువురు ఎలాంటి మేకప్ లేకుండా నేచురల్ లుక్‌లో కనిపించారు. ఇక వారితో పాటు రోహిత్ శెట్టి తెల్లటి కుర్తా సెట్లో అదిరిపోయాడు. ఇక బిగ్‌బీ, బాలీవుడ్ లెజండరీ నటుడు అమితా బచ్చన్, ఆయన కుమారుడు అభిషేక్ బచ్ఛన్ కూడా తెల్లటి కుర్తా సెట్లో కనిపించారు. అలాగే కంనా రనౌత్ ఈ కార్యక్రమంలో చాలా ఉత్సాహంగా పాల్గొంది. ఆమె నిన్న అయోధ్యలో చీరకట్టులో చీపురు పట్టుకుని మరీ ఆలయాన్ని శుభ్రం చేసింది. ఇవాళ ఈ ప్రాణ ప్రతిష్ట వేడుకలో నారింజ రంగు చీర, విత్ మ్యాచింగ్ శాలువతో స్టన్నింగ్ లుక్‌తో కనిపంచింది. ఇక సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ మహా సంప్రోక్షణకు ఒక రోజు ముందు ఆయోధ్యకు చేరుకున్నారు. ఆయన ధనుష్‌తో కలిసి సందడి చేశారు. ఈ వేడుకలో ఆయన తెల్లటి కుర్తా పైజామా సెట్ తోపాటు శాలువా ధరించారు. మరో ప్రముఖ నటి మాదురి దీక్షిత్ గోల్డ్ అంచుతో కూడిన పసుపు రంగు చీర, ఫుల్ హ్యండ్స్ బ్లౌజ్‌తో తళుక్కుమనిపించింది. ఆమె భర్త తెల్లటి పైజామా, మెరూన్ రంగు కుర్తాను ధరించాడు. ఇక మెగాస్టార్ చిరంజీవి, రామ్‌చరణ్‌లు పారిశ్రామికవేత్త అనిల్ అంబానితో మాట్లాడుతూ కనిపించారు. రామ్ చరణ్ తెల్లటి పైజామా, ఐవరీ కుర్తా ధరించగా, చిరంజీవి ఐవరీ పట్టు ధోతీ, కుర్తా సెట్లో కనిపించారు. అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఇక ఆయుష్మాన్ ఖురాన్కూడా తెల్లటి కుర్తాలో అందంగా కనిపించారు. అయితే ఇతను నెహ్రు కోట్ డిజైన్ వేర్లో కనిపించారు. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి కూడా. ఏదీఏమైనా ఇలాంటి ప్రాణప్రతిష్ట క్రతువుల్లో సినీ తారలు సంప్రదాయ దుస్తులు ధరించి మన ఆచార వ్యవహారాల పట్ల తమకున్న గౌరవాన్ని, ఆసక్తిని చాటుకోవడమే అందరీ మనసులను గెలుచుకున్నారు. అంతేగాదు మనం వెళ్లున్న కార్యక్రమానికి తగ్గట్టు ఉండే ఆహార్యం ఆ మనిషి వ్యక్తిత్వం, వైఖరీ ఏంటన్నది చెప్పకనే చెబుతుంది సుమా!. (చదవండి: బాలరాముడి ప్రాణ ప్రతిష్ట వేడుకను ఓ కళాకారుడి ఆర్ట్‌లో ఇలా చూడండి!) -
అయోధ్యలో అద్భుత ఘట్టం.. సెలబ్రిటీల సంతోషం
భారతీయులు శతాబ్దాల కాలంగా ఎదురుచూసిన కల సాకారమైంది. ఆనాడు రాముడు 14 ఏళ్లు వనవాసం చేస్తే ఈనాడు.. 500 ఏళ్లకు తాను పుట్టిన అయోధ్యలో కొలువుదీరాడు. సోమవారం (జనవరి 22న) రామ్‌లల్లా విగ్రహ ప్రాణప్రతిష్ట అంగరంగ వైభవంగా జరిగింది. ఈ అద్భుతఘట్టంతో హిందువుల ఒళ్లు పులకరించిపోతోంది. బాలరాముడిని చూసి తన్మయత్వానికి లోనవుతున్నారు. సినీతారలు సైతం అయోధ్య రామమందిర ఆలయ ప్రారంభోత్సవ వేడుకపై సోషల్ మీడియా వేదికగా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయోధ్యలో రామమందిర ప్రారంభం.. ఐక్యత, ఆధ్యాత్మికతకు చిహ్నాన్ని తెలియజేస్తుంది. ఈ రామమందిర చరిత్రకు సాక్షిగా నిలిచినందుకు చాలా గర్వంగా ఉంది. - మహేశ్‌బాబు మనందరికీ ఎంత అద్భుతమైన రోజు ఇది.. జై శ్రీరామ్.. -విజయ్ దేవరకొండ Amidst the echoes of history and the sanctity of faith, the grand opening of the Ram Mandir in Ayodhya heralds a timeless symbol of unity and spirituality. Extremely proud to witness history unfold! #AyodhyaRamMandir #JaiShreeRam 🙏 — Mahesh Babu (@urstrulyMahesh) January 22, 2024 What a beautiful day for all of us ❤️ Jai Shree Ram! — Vijay Deverakonda (@TheDeverakonda) January 22, 2024 Congrats dearest honourable prime minister Modi Saab on another great achievement and another feather in your cap, Jai Shri Ram. Ram mandir will be remembered for years and generations to come and a tribute to all those who laid their lives and sacrificed themselves for this… — Vishal (@VishalKOfficial) January 22, 2024 Bharat has been waiting for this day for over 500 years 🙏 A heartfelt thanks to Sri @narendramodi ji for making this happen 🙏. Jai Sri Ram! #AyodhaRamMandir #PranaPratishta — Vishnu Manchu (@iVishnuManchu) January 22, 2024 #JaiShriRam 🙏🏼 https://t.co/ez0hwECLqs — Brahmaji (@actorbrahmaji) January 22, 2024 Today is truly historic. Euphoria has engulfed the entire world. Am a proud to be a voice amongst the billion chants as our Ram Lalla comes home to Ayodhya. Sare bolo #JaiShriRam !!! #RamMandirPranPrathistha pic.twitter.com/dNdHQdRlhm — Genelia Deshmukh (@geneliad) January 22, 2024 Can't believe I'm lucky enough to witness something as historic & auspicious as #RamMandirPranPrathistha in my lifetime. Proud to see how our entire nation has united to welcome our Ram Lalla back home in Ayodhya! यह दिन इतिहास में उस दिन के रूप में याद रखा जाएगा जब हमारे देश की… pic.twitter.com/GalftZD1Lq — Ajay Devgn (@ajaydevgn) January 22, 2024 From the sacred grounds of Ram Janmabhoomi to the majestic Ram Mandir, a journey woven with faith and resilience 💫 May today usher blessings and prosperity for all. जय भोलेनाथ, जय श्री राम 🙏🏻 pic.twitter.com/KSwE3v5kRo — Sanjay Dutt (@duttsanjay) January 22, 2024 చదవండి: టాలీవుడ్ టూ బాలీవుడ్.. అయోధ్యలో అగ్ర సినీ తారల సందడి -
Ayodhya Ram Mandir: 500 ఏళ్ల కల నెరవేరింది: యోగి ఆదిత్యనాథ్
అయోధ్య: 500 ఏళ్ల కల నెరవేరిందన్నారు ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. ఈ క్షణం కోసం 500 ఏళ్లుగా భారతీయులు ఎదురు చూశారన్నారు. దేశమంతా రామ నామమే మార్మోగుతోందని.. రాంనగరికి వచ్చిన వారందరికీ స్వాగతం చెప్పారు. అన్న్ని దారులూ రామ మందిరానికే దారి తీస్తున్నాయన్నారు. ప్రాణ ప్రతిష్టకు హాజరైన వారి జీవితం ధన్యమైందన్న యోగి.. మనమంతా త్రేతా యుగంలోకి వచ్చినట్లుందని తెలిపారు. బాలరాముడి రూపాన్ని చెక్కిన శిల్పి జీవితం ధన్యమైందని అన్నారు.. ఈ రోజు ప్రతి రామ భక్తుడు సంతోషం, గర్వం, సంతృప్తితో ఉన్నాడని అన్నారు యోగి ఆదిత్యనాథ్. తన ఆలయం కోసం సాక్ష్యాత్తూ శ్రీరాముడే పోరాడాల్సి వచ్చిందన్నారు. అనుకున్న చోటే రామాలయం నిర్మించామని తెలిపారు. కాగా అయోధ్య భవ్య మందిరంలో దివ్య రామయ్య విగ్రహం ఆవిష్కృతం. వైభవంగా బాలరాముడి ప్రాణ ప్రతిష్ట జరిగింది. అభిజిత్ ముహూర్తంలో రాముడు తొలి దర్శనం ఇచ్చారు. పసిడి కిరీటం, పట్టువస్త్రం, ముత్యాల కంఠాభరణంతో రాముడిని సుందరంగా అలంకరించారు. రమణీయంగా రామయ్య ప్రాణ ప్రతిష్ట మహోజ్వల ఘట్టం జరిగింది. అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి రామ్‌లల్లాలకు ప్రధాని మోదీ తొలి హారతి ఇచ్చారు. అయోధ్య రామాలయంపై హెలికాప్టర్‌తో పూల వర్షం కురిపించారు. సామాన్య భక్తులకు రేపటి నుంచి దర్శనం ఖరారైంది. ఉదయం 7 గంటల నుంచి 11.30 వరకు బాలరాముడి దర్శించుకోవచ్చు. మళ్లీ మధ్యాహ్నం 2 నుంచిరాత్రి 7 గంటల వరకు దర్శన అవకాశం కల్పించారు. చదవండి: అయోధ్య బాలరాముడి ప్రాణప్రతిష్ట వేడుక.. అప్డేట్స్ -
Prana Pratishtha: అసలేంటీ ప్రాణ ప్రతిష్ట?
అయోధ్యలో భవ్య రామమందిరం ప్రారంభోత్సవ కార్యక్రమాలు ఈ నెల 16 నుంచే ప్రారంభమయ్యాయి. అందులో భాగంగా రామ జన్మభూమి ట్రస్ట్ ప్రాయశ్చిత్తం, సరయూనది ఒడ్డున దశవిద్ స్నానం, విష్ణుపూజ, గోదాన్, రామ్ లల్లా విగ్రహంతో నగరమంతా ఊరేగింపు తదితార కార్యక్రమాలు కూడా జరిగాయి. ఇవాళే మరికొద్దిసేపటిలో ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రాణ ప్రతిష్ట మహోత్సవం జరగనుంది. పైగా కొన్ని రాష్ట్రాల్లో ఈ రోజు సెలవు రోజుగా ప్రకటించాయి కూడా. దేశమంతా ఈ వేడుక నేపథ్యంలో పండుగ వాతావరణం నెలకొంది. ఇక ఈ మహోత్సవ కార్యక్రమాలు చివరి దశకు చేరుకోనున్నాయి కూడా. ఈ సందర్భంగా అస్సలు ప్రాణ ప్రతిష్ట అంటే ఏమిటీ? ఎందుకని చేస్తారు? ఎలా చేస్తారు తదితరాల గురించి తెలుసుకుందాం! ప్రాణ ప్రతిష్ట అంటే.. ప్రాణ ప్రతిష్ట అంటే దేవాలంయలో పూజలు క్రతువు చేసేందుకు ముందుగా చేసే ఒక సంప్రదాయం. ప్రాణప్రతిష్ట అంటే అర్థం జీవం ఇవ్వడం. ప్రాణ్ అంటే ప్రాణ శక్తి, ప్రతిష్ట అంటే స్థాపన అని అర్థం. ఆ ఆచారంతో దైవాన్ని విగ్రహంలోకి ఆవాహనం చేయడం. ఈ క్రతువు దేవుని విగ్రహాన్ని సజీవంగా చేస్తుంది. ఏ దేవుడి విగ్రహ ప్రతిష్టాపన జరిగినా.. ఈ ఆచారం కచ్చితంగా నిర్వహిస్తారు. వేదాలు, పురాణాల ఆధారంగా చాలా శాస్త్రోక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఆ నేపథ్యంలోనే ఈ నెల 16 నుంచి అందుకు సంబంధించిన ప్రాయశ్చిత్తం దగ్గర నుంచి రామ్‌లాల్ విగ్రహాన్ని ఊరేగించడం వరకు అన్ని కార్యక్రమాలను రామ జన్మభూమి ట్రస్ట్ నిర్వహించింది. ఆ తరువాత ఆలయ గర్భగుడిని సరయు నది పవిత్ర జలంతో శుద్ధి చేస్తారు. ఆ తర్వాత రాముడి విగ్రహాన్ని ఆలయంలో ఉంచారు. ఈ పూజ ప్రధాన ఉద్దేశ్యం దేవుడిని విగ్రహంలోకి ఆవాహనం చేసి ప్రాణం పోయడం. ఈ తతంగాలతో విగ్రహం లోపల శాశ్వతంగా దేవుని ఉనికి ఉండేలా చేస్తారు. దీంతో ఆ తర్వాత ఆలయంలో జరిగే పూజలు, వ్రతాలు ఆ దేవుడు స్వీకరిస్తాడని నమ్ముతారు. అలాగే ఆయన తమ గోడు విని కోరికలు తీరుస్తాడని భక్తుల ప్రగాఢ నమ్మకం. అంతేగాదు ప్రజలు విగ్రహాన్ని కేవలం ఓ వస్తువు లేదా రాయిగా చూడరు సాక్షాత్తు ఆ జగదభి రాముడు తమ కోసం ఇక్కడ కొలువుదీరి తమ పూజలు, అర్చనలు స్వీకరిస్తాడని భక్తు ప్రగాఢంగా విశ్వసిస్తారు. అదీగాక ఇవాళ జరుగుతున్న ఈ వేడకను తిలకించేందుకు సెలబ్రెటీలు, ప్రముఖులే గాక దేశం నలుమూలల నుంచి అయోధ్యకు భక్తులు వేలాదిగా తరలివచ్చారు. అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఎలా జరుగుతుందంటే.. ముందుగా విగ్రహాన్ని కనీసం ఐదు పవిత్ర నదిజలాలతో స్నానం చేయిస్తారు. ఆ తర్వాత నీరు ధాన్యంతో నిమజ్జనం చేస్తారు. దీంతో విగ్రహంలో పవిత్రత వస్తుందని పురాణ వచనం. ఆ తర్వాత ఆవుపాలతో స్నానం చేసి శుభ్రమైన గుడ్డతో తుడుస్తారు. ఆ తర్వాత కొత్త బట్టలు ధరింపచేస్తారు. ఆచారంలో భాగంగా చందనం అద్దుతారు. ఇక విగ్రహాన్ని వాస్తు ప్రకారం సరైన దిశలో పెట్టడం జరగుతుంది. సాధారణంగా సూర్యుడు ఉదయించే తూర్పు దిక్కున పెట్టడం జరుగుతుంది. వేదాలు, పూర్ణాహుతి శ్లోకాలతో పుష్పాలు, ధూపం, నైవేధ్యం వంటివి దేవుడికి సమర్పించడం జరగుతుంది. అయితే ఈ వేడుక మాత్రం 84 సెకన్లు మాత్రమే ఉంటుంది. ఈ ఘట్టం మొత్తం ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా జరుగుతుంది. ముందుగా ఆయన విగ్రహం కళ్లకు గంతలు తొలగించి, చిన్న బంగారు కర్రతో కాజల్‌ని బాలారాముని పూయడం జరుగుతుంది. ఆ తర్వాత అద్దంలో రాముడికి ముఖాన్ని చూపుతారు. చివరిగా 108 దీపాలతో మహా ఆరతి ఇచ్చి ఈ పవిత్రోత్సవాన్ని ముగించడం జరగుతుంది. గుడ్డతో ఎందుకు కప్పి ఉంచుతారంటే.. ప్రాణ ప్రతిష్టకు ముందు విగ్రహ స్వచ్ఛతను కాపాడుకునేందుకు ముఖాన్ని కప్పి ఉంచడం జరుగుతుంది. శాస్త్రోక్తంగా ప్రాణ ప్రతిష్ట పూజ కార్యక్రమాలు జరిపేంత వరకు అలా గుడ్డతో కప్పి ఉంచుతారు. ఇలా దేవి నవరాత్రలప్పుడూ, గణపతి నవరాత్రుల్లో కూడా చేయడం మనం గమనించే ఉంటాం. అందులోనూ 500 నిరీక్షణ తర్వాత జరుగుతున్న ఈ కార్యక్రమంలో ఈ పవిత్రోత్సవాన్ని మరింత కట్టుదిట్టమైన ఆచార వ్యవహారాలతో వేదమంత్రాల నడుమ శాస్త్రోక్తంగా కన్నుల పండగగా జరుపుతోంది రామజన్మభూమి ట్రస్ట్. దీన్ని పురుస్కరించుకుని రాష్ట్రాలలోని ప్రతి రామాలయంలో ఘనంగా పూజలు, అన్నదానాలు నిర్వహిస్తున్నారు. దేశమంతటా ఎటూ చూసిన రామనామ స్మరణతో మారుమ్రోగిపోతోంది. (చదవండి: బాలరాముడి ప్రాణ ప్రతిష్ట వేడుకను ఓ కళాకారుడి ఆర్ట్‌లో ఇలా చూడండి!) -
అయోధ్య రాముడి దర్శన వేళలు ఇవే..
ఢిల్లీ: అయోధ్యలో అపూర్వఘట్టం ఆవిష్కృతమైంది. దాదాపు 500 ఏళ్ల హిందువుల కల సాకారమైంది. రామజన్మభూమిలో నూతనంగా నిర్మించిన మందిరంలో శ్రీరామచంద్రుడు బాలావతారంలో కొలువు దీరాడు. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా సోమవారం బాలరాముడికి ప్రాణ ప్రతిష్ట క్రతువు జరిగింది. మేషలగ్నం అభిజిత్ ముహూర్తంలో బాలరాముడి ప్రాణప్రతిష్ట జరిగింది. విగ్రహ ప్రతిష్టకు కర్తగా వ్యవహరించారు ప్రధాని మోదీ. ఈ కార్యక్రమంలో ఉత్తర ప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌లతో పాటు ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ కూడా పాల్గొన్నారు. ప్రాణప్రతిష్ట సమయంలో ఆలయం మీద నుంచి హెలికాఫ్టర్లతో పూల వర్షం కురిపించారు. #WATCH | First visuals of the Ram Lalla idol at the Shri Ram Janmaboomi Temple in Ayodhya pic.twitter.com/E0VIhkWu4g — ANI (@ANI) January 22, 2024 రామనామ స్మరణతో అయోధ్య మారుమోగిపోయింది. అదే సమయంలో జై శ్రీరామ్ నినాదంతో కోట్లాది హిందువులు పులకరించి పోయారు. సకలాభరణలతో అలంకరించిన బాలరాముడు.. కమలంపై కొలువుదీరాడు. కుడి చేతిలో బాణం.. ఎడమ చేతిలో విల్లు ఉంది. ఆ దివ్యరూపం సోషల్ మీడియాకు చేరగా.. తన్మయంతో భక్తులు పులకరించిపోతున్నారు. దర్శన వేళలు ఇవే అయోధ్య రామ మందిర సామాన్యుల దర్శనం కోసం స్లాట్లు కేటాయించారు. రేపటి నుంచి అంటే.. మంగళవారం ఉదయం 7గం. నుంచి 11.30 వరకు, అలాగే మధ్యాహ్నాం 2గం. నుంచి 7 వరకు భక్తులకు అనుమతిస్తారు. అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
అయోధ్యలో సచిన్, జడేజా, అనిల్ కుంబ్లే.. వీడియో వైరల్
భారత దేశ చరిత్రలో చిరస్మరణీయమైన ఘట్టానికి సమయం అసన్నమైంది. అయోధ్య నగరంలోని భవ్య రామమందిరంలో బాలరాముడి ప్రాణప్రతిష్టకు మరి కాసేపట్లో తెరలేవనుంది. సోమవారం మధ్యాహ్నం 12: 20 గంటలకు ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది. రామ జన్మభూమిలో జరిగే ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని కళ్లారా చూసేందుకు ప్రముఖులు ఆయోద్యకు క్యూ కడుతున్నారు. దీంతో అయోధ్య పురి మొత్తం భక్తులతో నిండిపోయింది. భారత క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, అనిల్ కుంబ్లే, వెంకటేశ్ ప్రసాద్ అయోధ్యకు చేరుకున్నారు. అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి Sachin Tendulkar reached Ayodhya#RamMandirPranPrathistha | #AyodhyaRamMandirpic.twitter.com/HuHQE9NxhR — Don Cricket 🏏 (@doncricket_) January 22, 2024 వీరితో పాటు టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి కూడా అయోధ్యకు చేరుకున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా భారత స్టార్ ఆల్‌రౌండర్ ,రవీంద్ర జడేజా కూడా అయోధ్య పుర వీధుల్లో కన్పించాడు.. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. Virat Kohli reaches Ayodhya for Ram Mandir Pran Pratishtha 🛕#ViratKohli #RamMandir #Ayodhya #CricketTwitter pic.twitter.com/k132x5UNv9 — InsideSport (@InsideSportIND) January 22, 2024 -
Tamil Nadu: అయోధ్య లైవ్ టెలికాస్ట్ అడ్డుకోవద్దు.. సుప్రీంకోర్టు ఆదేశాలు
సాక్షి, ఢిల్లీ: తమిళనాడులో అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ట లైవ్ టెలికాస్ట్‌పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. తమిళనాడు రాముడికి సంబంధించిన వేడుకల ప్రసారాలను తిరస్కరించవద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో, సుప్రీంకోర్టులో స్టాలిన్ సర్కార్‌కు ఎదురుదెబ్బ తగిలింది. వివరాల ప్రకారం.. అయోధ్యలో రామ్‌లల్లా ‘ప్రాణ ప్రతిష్ట’ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయాలనే అభ్యర్థనలను తిరస్కరించవద్దని తమిళనాడు ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇప్పటికే తిరస్కరించిన వాటికి సంబంధించి.. పక్కా కారణాలను చూపాలని, డేటాను సిద్ధం చేయాలని స్పష్టం చేసింది. సమాజంలో ఇతర వర్గాలు కూడా నివసిస్తున్నాయనే ఏకైక కారణంతో.. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి సంబంధించిన లైవ్ టెలికాస్ట్ అనుమతిని తిరస్కరించలేమని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. మరోవైపు, రామ మందిర ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు, భజనల నిర్వహణపై నిషేధం లేదని తమిళనాడు ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. On a plea in Supreme Court against Tamil Nadu govt’s oral order to ban the live telecast of the "Pran Prathishta" of Lord Ram at Ayodhya in the temples across Tamil Nadu, Solicitor General Tushar Mehta said nobody can be prevented from performing the religious rituals. Solicitor… pic.twitter.com/vqgbvmSkWh — ANI (@ANI) January 22, 2024 ఇదిలా ఉండగా.. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవాన్ని లైవ్ టెలికాస్ట్ చేసేందుకు.. వివిధ రాష్ట్రాలు ఏర్పాట్లు చేశాయి. అయితే.. తమిళనాడు ప్రభుత్వం మాత్రం.. హిందువులకు వ్యతిరేకంగా చర్యలు తీసుకుంటోందని ఆరోపణలు వెల్లువెత్తాయి. లైవ్ టెలికాస్ట్‌ను తమిళనాడు ప్రభుత్వం నిషేధించిందని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఆరోపించారు. తమిళనాడులోని రామాలయాల్లో పూజలు, భజనలను కూడా అడ్డుకుంటున్నారని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై ఆదివారం రాజకీయ దుమారం రేగింది. దీంతో, ఈ విషయంపై బీజేపీ నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. బీజేపీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వినోజ్ పీ సెల్వం తరఫున న్యాయవాది జి.బాలాజీ పిటిషన్ దాఖలు చేశారు. వాదనల అనంతరం, కోర్టు కీలక ఆదేశాలను జారీ చేసింది. #WATCH | Union Finance Minister Nirmala Sitharaman says, "...Tamil Nadu Police is being misused by the Government of Tamil Nadu...They are being misused by Hindu-hating DMK...Can any citizen be denied to watch the Prime Minister? The DMK is showing its personal hatred for the… https://t.co/xTgTHmLBED pic.twitter.com/K2s9eFUh1A — ANI (@ANI) January 22, 2024 -
ఆర్ట్‌లో..బాల ప్రాణ పత్రిష్ట వేడుక ఘట్టం మొత్తం ఇలా..!
బాల రాముడి ప్రాణ ప్రతిష్టకు అయోధ్య సుందరంగా ముస్తాబయ్యింది. ఇవాళే మరొకొద్దిపేపటిలో ఈ వేడుకు కన్నుల పండుగగా జరగనుంది. దీంతో దేశమంతా ఓ పండుగ వాతావరణంలా ఉంది. ఎక్కడ చూసినా, ఎటూ చూసిన జై శ్రామ్ అనే నినాదాలతో మారుమ్రోగిపోతోంది. అయితే ఈ వేడుకను మానస్ సాహు అనే కళాకారుడు తన ఇసుక ఆర్ట్‌తో చాలా చక్కగా చిత్రీకరించాడు. జస్ట్ కొద్ది నిమిషాల వ్యవధిలోని ఆ బాల రాముడి ఆలయ శంకుస్థాపన నుంచి ప్రాణ ప్రతిష్టకు వరకు జరిగే తతంగం అంతా చాలా చక్కగా రూపొందించాడు. చూస్తే మనం అయోధ్యలో ఉన్నామా! అనిపించేంత అందంగా తీర్చిదిద్దాడు. అయోధ్యలోని భవ్య రామమందిరం గర్భగుడిలోని బాల రాముడి విగ్రహాన్ని మన కళ్ల ముందు సాక్షాత్కారించేలా చేశాడా! అన్నంతగా కళాత్మక దృష్టితో సృష్టించాడు. ఇక సాహు గత రెండు దశాబ్దాలుగా ఈ శాండ్ ఆర్ట్‌తో పలు యానిమేషన్ ప్రయోగాలు చేస్తున్నాడు. అంతేగాదు ఈ ఇసుక కళను ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లిన ప్రముఖ కళాకారుడు కూడా ఆయనే. అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఆయన యూనిమేషన్తో కూడిన ఇసుక కళతో సహజత్వాన్ని ఉట్టిపడేలా చేస్తాడు. అందువల్లే ఈ ఆయన వేసిన ఆర్ట్ చూస్తే..ఈ బాల రాముడి ప్రాణ ప్రతిష్ట వేడుకలో నిజంగా ఆ పాల్గొన్నామా! అనే భావన కలుగుతుంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. కాగా, బాల రాముడి ప్రాణప్రతిష్ట మహోత్సవం ఇవాళ మధ్యాహ్నాం ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా జరగనుంది. ఈ వేడుకలో పాల్గొనేందుకు ఇప్పటికే అయోధ్యకు పెద్ద సంఖ్యలో ప్రముఖులు, సెలబ్రేటీలు చేరుకున్నారు. Sand Animation shows the Pran Pratishtha ceremony of Ram Lalla. #RamMandir #RamMandirPranPratishta #JaiShreeRam @PMOIndia @PakPMO @myogiadityanath @AmitShah @rajnathsingh @dpradhanbjp @sambitswaraj @SudhanshuTrived pic.twitter.com/M1ihrcHejZ — Manas sahoo (@SandArtistManas) January 21, 2024 (చదవండి: అయోధ్య రాముడుకి కాస్ట్యూమ్స్ డిజైన్ చేసేది వీరే!) -
అయోధ్యలో శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ట.. సౌతాఫ్రికా స్టార్ క్రికెటర్ స్పెషల్ విషెస్
భవ్య రామమందిరంలో బాలరాముడి ప్రాణప్రతిష్ట కోసం అయోధ్య నగరం అందంగా ముస్తాబైంది. అయోధ్య గర్భగుడిలో రామ్‌లల్లా కొలువుదీరబోతున్నాడు. 500 ఏళ్ల నాటి హిందువుల కల కాసేపట్లో నెరవేరనుంది. అయోధ్యలోని రామమందిరం 'ప్రాణ ప్రతిష్ఠ' మహోత్సవం కోసం యావత్ భారతదేశం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. సోమవారం మధ్యాహ్నం 12: 20 గంటలకు ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది. ఈ వేడుకను ప్రత్యేక్షంగా వీక్షించేందుకు రాజకీయ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, సెలబ్రెటీలు అయోధ్యకు చేరుకున్నారు. చాలా మంది క్రికెట్ దిగ్గజాలతో పాటు ప్రస్తుత తరం క్రికెటర్లకు సైతం రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ఆహ్వానాలను పంపించింది. రామమందిర ప్రాణప్రతిష్ఠ సందర్భంగా దక్షిణాఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహరాజ్ స్పందించాడు. భారత్‌కు తన శుభాకాంక్షలను తెలియజేశాడు. అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి నమస్తే.. ఈ రోజు భారత దేశ చరిత్రలో ఎప్పటికీ చిరస్మరణీయంగా నిలిచిపోతుంది. దక్షిణాఫ్రికాలో ఉన్న భారత సంతతి ప్రజలకు నా శుభాకాంక్షలు చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను. అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం ఘనంగా జరగాలని కోరుకుంటున్నాను. అందరిలోనూ శాంతి, సామరస్యం, ఆధ్యాత్మిక జ్ఞానోదయం తీసుకురావాలి. జై శ్రీరామ్’’ అని ఇన్‌స్ట్రాగ్రామ్‌లో కేశవ్ మహరాజ్ పేర్కొన్నాడు. కాగా కేశవ్ మహారాజ్ భారత సంతతికి చెందినవాడన్న విషయం తెలిసిందే. అంతేకాకుండా రామభక్తుడు కూడా. ఇటీవల కాలంలో అతడి బ్యాటింగ్‌కు వచ్చిన ప్రతీసారి ‘‘రామ్ సియా రామ్’’ అంటూ సాగే పాటను ప్లే చేస్తున్నారు. చదవండి: BBL 2024: పాకిస్తాన్ బ్యాటర్‌కు ఊహించని షాకిచ్చిన బోర్డు.. ఎయిర్ పోర్ట్ నుంచే రిటర్న్!? Keshav Maharaj wishes everyone ahead of the Pran Pratishtha of Lord Rama in Ram Temple. pic.twitter.com/zU00hr7DgJ — Mufaddal Vohra (@mufaddal_vohra) January 21, 2024 -
సుదృఢ నిర్మాణం... సుందర రూపం.. రామాలయం!
#ShriRamJanmabhoomiMandir అయోధ్య శ్రీరాముని ప్రాణప్రతిష్ట వైభవానికి సర్వం సిద్ధమైంది. ఈ అంగరంగ వైభవానికి అయోధ్య నగరం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఈ వేడుకను కనులారా తిలకించేందుకు అతిరథ మహారథులు, దిగ్గజ పారిశ్రామికవేత్తలు, క్రికెటర్లు, మూవీ రంగ ప్రముఖులు, ఇతర సెలబ్రిటీలు అంతా ఇప్పటికే అయోధ్యా నగరానికి చేరుకున్నారు. మరోవైపు శ్రీరామ జన్మభూమి మందిర్‌ను వెయ్యి సంవత్సరాలు చెక్కుచెదరకుండా ఉండేలా నిర్మించామని ప్రముఖ నిర్మాణ సంస్థ లార్సెన్ అండ్ టూబ్రో వెల్లడించింది. 70 ఎకరాల విస్తీర్ణంలో , 161.75 అడుగుల ఎత్తు, 380 అడుగుల పొడవు , 249.5 అడుగుల వెడల్పుతో విస్తరించి ఉన్న ఆ ఆలయ సముదాయం కలిగి ఉంది. డిజైన్ ఐదవ శతాబ్దంలో దాని మూలాలున్న నాగారా నిర్మాణ శైలిలో దీన్ని నిర్మించారు. ఈ ఆలయంలో ప్రధాన శిఖరంతో పాటు మూడు అంతస్తులు, నృత్య మండప్, రంగ్ మండప్, గూఢ్ మండప్, కీర్తన మండప్ , ప్రార్థనా మండప్ అనే ఐదు మండపాలు ఉన్నాయి. దీని తయారీకి రాజస్థాన్‌లోని భరత్పూర్ జిల్లా నుంచి గులాబీ రంగు బన్సీ పహార్పూర్ రాళ్లను కొనుగోలు చేశారు.అంతేకాదు భారీ భూకంపాలను (జోన్ 4) సైతం తట్టుకునేలా రూపొందించింది. ఆలయానికి ఇరువైపులా 390 స్తంభాలు, 6 మక్రానా పాలరాతి స్తంభాలు ఉన్నాయి. వాటిలో 10 వేలకు పైగా శిల్పాలు, ఇతివృత్తాలు భక్తులను అబ్బురపరుస్తాయి. అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి మే 2020 నుండి, దాదాపు మూడేళ్లలో కాంప్లెక్స్‌ను డిజైన్ చేసి నిర్మించిన శ్రీరామ జన్మభూమి ఆలయానికి 1000 సంవత్సరాల వరకు ఎలాంటి నష్టం జరగదని ఎల్ అండ్ టీ తెలిపింది. దాదాపు 1,500 మంది కళాకారుల బృందం రాళ్లపై క్లిష్టమైన శిల్పాలను తయారుచేశారని, QR కోడ్లతో 26,500 వ్యక్తిగత రాళ్లను పర్యవేక్షించడానికి స్టోన్ ట్రాకింగ్ అప్లికేషన్‌ను ఉపయోగించినట్లు కంపెనీ తెలిపింది. వెయ్యేళ్ల పాటు వెలుగొందేలా, ఓర్పుకు చిహ్నంగా ఈ ఇంజినీరింగ్ అద్భుతం నిలుస్తుందని కంపెనీ ఛైర్మన్ , ఎండీ సుబ్రహ్మణ్యన్ అన్నారు. దీని పునాదికి ఐఐటీ సంస్థల సహాయం కూడా తీసుకున్నామని చెప్పారు. ఈ ఆలయంలోని ప్రతి రాయిని ఎంతో శ్రద్ధగా, అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ప్రతిష్ఠించామని ఎల్అండ్ టీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఎంవీ సతీష్ వెల్లడించారు. దీన్ని ఒక దేవాలయంగా మాత్రమే కాకుండా, అద్భుత ఇంజనీరింగ్ కళాఖండమని, ఇది తమ నిబద్ధతకు నిదర్శనంగా నిలుస్తుందన్నారు. #WATCH | Actor Vivek Oberoi and singer Sonu Nigam arrive at Shri Ram Janmaboomi Temple in Ayodhya to attend the Pranpratishtha ceremony. Vivek Oberoi says, "It's magical, spectacular. I have seen so many images of it. But when you see it before your eyes, it seems that you are… pic.twitter.com/U7YAFATnct — ANI (@ANI) January 22, 2024 #WATCH | Actor Vivek Oberoi and singer Sonu Nigam arrive at Shri Ram Janmaboomi Temple in Ayodhya to attend the Pranpratishtha ceremony. Vivek Oberoi says, "It's magical, spectacular. I have seen so many images of it. But when you see it before your eyes, it seems that you are… pic.twitter.com/U7YAFATnct — ANI (@ANI) January 22, 2024 -
అయోధ్యకు వ్యాపారవేత్తల క్యూ..
అయోధ్య రామయ్య ప్రాణప్రతిష్ట కార్యక్రమం మరి కొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమానికి దేశ విదేశాల నుంచి సుమారు 7000 మంది అతిధులు హాజరయ్యే అవకాశం ఉంది. ఇందులో పారిశ్రామిక వేత్తలు, సినీ పరిశ్రమకు చెందిన సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, క్రీడాకారులు ఉన్నారు. బాలరాముని ప్రాణప్రతిష్టకు హాజరయ్యే పారిశ్రామిక వేత్తలు రతన్ టాటా ముఖేష్ అంబానీ నీతా అంబానీ కుమార్ మంగళం బిర్లా అజయ్ పిరమల్ ఆనంద్ మహీంద్రా అజయ్ శ్రీరామ్ కె కృతివాసన్ కె సతీష్ రెడ్డి పునీత్ గోయెంకా SN సుబ్రహ్మణ్యన్ మురళి దివి ఎన్ఆర్ నారాయణ మూర్తి నవీన్ జిందాల్ నరేష్ ట్రెహాన్ అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ప్రాణప్రతిష్ఠకు అద్వానీ, జోషి దూరం?
అయోధ్యలో నేడు జరిగే బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి బీజేపీ సీనియర్ నేతలు లాల్ కృష్ణ అద్వానీ, మురళీ మనోహర్ జోషి హాజరకావడంలేదంటూ పలు వార్తలు వినిపిస్తున్నాయి. తీవ్రమైన చలి వాతావరణం కారణంగా అద్వాని అయోధ్యకు వెళ్లడం లేదని సమాచారం. రామమందిర ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన లాల్ కృష్ణ అద్వానీతో పాటు బీజేపీ సీనియర్ నేత మురళీ మనోహర్ జోషి కూడా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరుకావడం లేదని తెలుస్తోంది. పెరుగుతున్న వయస్సు, ఆరోగ్య సంబంధిత సమస్యల దృష్ట్యా ఈ సీనియర్ నేతలిద్దరూ బాలరాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొనడం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి. అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి లాల్ కృష్ణ అద్వానీ 90వ దశకంలో రామమందిర ఉద్యమానికి నాయకత్వం వహించారు. ఆయన నేతృత్వంలో 1990లో గుజరాత్‌లోని సోమనాథ్ నుంచి బీజేపీ రథయాత్రను ప్రారంభించింది. ‘మందిర్ వహీ బనాయేంగే’ నినాదంతో లాల్ కృష్ణ అద్వానీ రామమందిర ఉద్యమాన్ని సామాన్య ప్రజలలోకి తీసుకెళ్లారు. విశ్వహిందూ పరిషత్ అధ్యక్షుడు అలోక్ కుమార్‌తో పాటు ఇతర ప్రముఖులు స్వయంగా ఎల్‌కె అద్వానీ ఇంటికివెళ్లి, శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి ఆహ్వానించారు. ఇది కూడా చదవండి: మారిషస్ నుంచి డెన్మార్క్ ... అంతా రామమయం! రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ ఇటీవల మీడియాతో మాట్లాడుతూ.. ‘96 ఏళ్ల వయస్సులో ఉన్న లాల్‌కృష్ణ అద్వానీ,90 ఏళ్ల వయస్సు కలిగిన మురళీ మనోహర్ జోషిలను ప్రాణప్రతిష్ఠకు ఆహ్వానించాం. అయితే వారు వయస్సు, అనారోగ్య కారణాల దృష్ట్యా ఈ కార్యక్రమానికి హాజరుకాలేని స్థితిలో ఉన్నారని’ తెలిపారు. -
తిరుమలలో నేడు రామాయణ పారాయణం
తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లో 9 కంపార్ట్మెంట్లు నిండాయి. నిన్న ఆదివారం 77,334 మంది స్వామివారిని దర్శించుకోగా 23,694 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.04 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతుండగా, దర్శన టికెట్లు లేని భక్తులకు 12 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. తిరుమలలో నేడు రామాయణ పారాయణం తిరుమలలోని ధర్మగిరి వేదపాఠశాలలో సోమవారం సంపూర్ణ రామాయణ పారాయణం కార్యక్రమాన్ని టీటీడీ నిర్వహించనుంది. అయోధ్యలో సోమవారం రామాలయంలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు రామాయణ పారాయణం నిర్వహించనున్నారు. అయోధ్యలో ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరిగే ప్రాణప్రతిష్ట కార్యక్రమాన్ని ఎస్వీబీసీ తమిళం, కన్నడ, హిందీ ఛానళ్లతో పాటు యూట్యూబ్ తెలుగు ఛానల్లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ఎస్వీబీసీ తెలుగు ఛానల్లో తిరుమలలోని కళ్యాణోత్సవం అనంతరం 12 గంటల నుంచి అయోధ్య కార్యక్రమాలు ప్రత్యక్షప్రసారం కానున్నాయి. భక్తులు ఈ విషయాలను గమనించి ఎంతో వైభవంగా, ఆగమోక్తంగా జరిగే అయోధ్య బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యక్రమాలను ఎస్వీబీసీ తెలుగు, తమిళం, కన్నడ, హిందీ ఛానళ్లలో వీక్షించి తరించాలని భక్తలోకానికి టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. -
ప్రతినోటా రామనామ స్మరణే
ఎన్నో ఏళ్లుగా యావత్ ప్రపంచం మహోద్వేగభరితంగా ఎదురు చూస్తున్న అపురూప క్షణాలు రానేవచ్చాయి. మరికొద్ది గంటల్లో అయోధ్యలో కొలువుదీరనున్న బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠాపన మహోత్సవాన్ని కనులారా వీక్షించేందుకు భాగ్యనగర వాసుల చూపంతా అయోధ్య వైపే నిలిపింది. మహా నగరం శ్రీరామ నామస్మరణతో తాదాత్మ్యత పొందనుంది. ఆలయాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. సోమవారం అయోధ్యలో జరగనున్న వేడుకలను దృష్టిలో ఉంచుకొని నగరవాసులు తమ ఇళ్లు, వాకిళ్లను అందంగా అలంకరిస్తున్నారు.ముంగిళ్లను రంగవల్లులతో తీర్చిదిద్దుతున్నారు. మరోవైపు కాలనీలు, బస్తీలు, అపార్ట్మెంట్ల సంక్షేమ సంఘాలు సైతం శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా వేడుకలను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశాయి. ముస్తాబైన ఆలయాలు.. నగరంలోని అన్ని ఆలయాలను అందంగా అలంకరించారు. చిలుకూరు బాలాజీ టెంపుల్ వద్ద ప్రత్యేక ప్రదర్శనల కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. తాడ్‌బండ్, కర్మన్‌ఘాట్, సీతాఫల్మండి తదితర ప్రాంతాల్లోని ఆంజనేయస్వామి ఆలయాలు, శ్రీరాముడి మందిరాలను, చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం, హిమాయత్‌నగర్ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణాలను అందంగా ముస్తాబు చేశారు. రంగురంగుల విద్యుద్దీపాలతో అలంకరించారు. నగరంలో అడుగడుగునా ఆధ్యాత్మికత, భక్తిభావం ఉట్టిపడేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వీధుల్లో, ప్రధాన కూడళ్లలో కాషాయ జెండాలతో తోరణాలు కట్టారు. మరోవైపు శ్రీరాముడి నిలువెత్తు భారీ కటౌట్లు ప్రత్యేక ఆకర్షణగా మారాయి. విశ్వహిందూపరిషత్, భజరంగదళ్ ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. భారీ స్క్రీన్ల ఏర్పాటు.. బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ క్షణాలను వీక్షించేందుకు నగరంలో భారీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరు ‘జై శ్రీరామ్’ అని నినదిస్తూ వేడుకల్లో పాల్గొనేలా ఇంటింటికీ కాషాయ జెండాల పంపిణీ చేపట్టారు. సాయంత్రం ఆలయాలు, కమ్యూనిటీహాళ్లు తదితర ప్రాంతాల్లో భక్తి కార్యక్రమాలను, భజనలను ఏర్పాటు చేయనున్నారు. ఇళ్లను అందంగా అలంకరించుకోవడంతో పాటు సాయంత్రం వేళ 5 ప్రమిదల్లో దీపాలను వెలిగించాలని సూచించారు. అయోధ్యలో వేడుకల సందర్భంగా నగర మార్కెట్లో శ్రీరాముడి చిత్రపటాల అమ్మకాలు భారీగా పెరిగాయి. ఉస్మాన్‌గంజ్, కోఠి, బేగంబజార్, సికింద్రాబాద్, తదితర ప్రాంతాల్లో చిత్రపటాలను విక్రయించే షాపుల వద్ద సందడి నెలకొంది. పూలు, పూజా ద్రవ్యాలకు సైతం డిమాండ్ ఏర్పడింది. వివిధ సంస్థల ఆధ్వర్యంలో ప్రదర్శనలు, భారీ ర్యాలీలను సైతం నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నారు. అపార్ట్మెంట్లలో రాముడి భారీ కటౌట్లు నివాసిత సంఘాలు, గేటెడ్ కమ్యూనిటీలు, లగ్జరీ అపార్ట్మెంట్ అసోసియేషన్లు శ్రీరామ నామాన్ని జపిస్తున్నాయి. అపార్ట్మెంట్లలో రాముడి భారీ కటౌట్లు, పూల దండలు, ప్రతిమలు, శ్రీ రామ్ జెండాలు, రంగురంగుల లైట్లతో అలంకరించారు. నల్లగడ్లంలోని అపర్ణా సైబర్ కమ్యూనిటీ, బంజారాహిల్స్ రోడ్ నంబరు–5లోని ట్రెండ్‌సెట్ సుమాంజలి, నానక్‌రాంగూడలోని మై హోమ్ విహంగ, కొండాపూర్‌లోని అపర్ణా టవర్స్‌లో శ్రీరామ విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ వేడుకలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. నేటి ఉదయం 11 గంటల నుంచి అయోధ్యలో జరిగే పూజా కార్యక్రమాల ప్రత్యక్ష ప్రసారాలను వీక్షించేందుకు భారీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. ఫెడరేషన్ ఆఫ్ గేటెడ్ కమ్యూనిటీస్ సైబరాబాద్ (ఎఫ్జీసీసీ)లో అయోధ్యలోని రామలీలా మందిరం నమూనాలను రూపొందిచారు. రథయాత్రలు, అన్నదానం, రామ భజనలు, విష్ణు సహస్రనామాలు వంటి ప్రత్యేక కార్యక్రమాలకు ఏర్పాట్లు చేసినట్లు సంఘం ప్రతినిధులు తెలిపారు. సుందరకాండ పారాయణం, ప్రత్యేక రంగోలీ, దీపోత్సవం వంటి ఏర్పాట్లు చేశారు. -
ప్రపంచ నగరిగా అయోధ్య
సాక్షి, హైదరాబాద్: అయోధ్య.. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఈ పేరు మారుమోగుతోంది. ప్రపంచంలో మూడో అతిపెద్ద హిందూ దేవాలయంగా రూపొందిన భవ్య రామమందిరంలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్టకు ఆ ఆధ్యాత్మిక నగరి ముస్తాబైంది. సోమవారం జరిగే ప్రాణప్రతిష్ట కార్యక్రమాన్ని పలు దేశాల్లో లైవ్ టెలికాస్ట్ చేస్తున్నారు కూడా. ప్రపంచవ్యాప్తంగా పేరున్న చారిత్రక కూడళ్లలో భారీ తెరలు ఏర్పాటు చేసి మరీ ప్రత్యక్ష ప్రసారం చేయబోతున్నారు. ఈ ఘనత ఇక్కడికే పరిమితం కాకుండా.. అయోధ్యను ప్రపంచస్థాయి ఆధ్యాత్మిక నగరంగా తీర్చిదిద్దేందుకు కేంద్ర, యూపీ రాష్ట్ర ప్రభుత్వాలు భారీ ప్రాజెక్టులు చేపడుతున్నాయి. రూ.85 వేల కోట్లతో అభివృద్ధి పనులు కొత్త రామాలయ నిర్మాణ ప్రారంభానికి ముందు అయోధ్యకు నిత్యం సగటున 2వేల మంది భక్తులు వచ్చేవారు. పనులు ప్రారంభమయ్యాక ఆ సంఖ్య 50 వేలకు చేరింది. జనవరి ఒకటిన 2 లక్షల మంది భక్తులు తరలివచ్చారు. ఆలయంలో దర్శనాలు మొదలయ్యాక నిత్యం లక్ష మంది వరకు వస్తారని.. క్రమంగా 3 లక్షల వరకు పెరగవచ్చని అంచనా. ఇప్పుడు ఇరుకుగా ఉన్న అయోధ్య అంత తాకిడిని తట్టుకోలేదని తేల్చిన ప్రభుత్వ యంత్రాంగం.. 2031 లక్ష్యంగా ప్రత్యేక మాస్టర్‌ప్లాన్ సిద్ధం చేసింది. ఆర్కిటెక్ట్, అర్బన్ ప్లానర్ దీక్షు కుక్రేజా ఆధ్వర్యంలో దీనిపై విజన్ డాక్యుమెంట్‌ను సిద్ధం చేశారు. ప్రపంచస్థాయి నగరంగా అయోధ్యను రూపొందించటమే తమ లక్ష్యమని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు కూడా. నగరాన్ని భారీగా విస్తరించి.. కొత్త మాస్టర్ ప్లాన్‌లో అయోధ్య పట్టణం, దానికి జంటగా ఉన్న ఫైజాబాద్‌తోపాటు సమీపంలోని దాదాపు 26 గ్రామాలను చేర్చి.. 875 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఆధునిక అయోధ్యను తీర్చిదిద్దబోతున్నారు. ఇందులో భాగంగా 1,200 ఎకరాల్లో రూ.2,200 కోట్ల వ్యయంతో న్యూఅయోధ్య పేరుతో భారీ టౌన్షిప్ పనులను ఇప్పటికే మొదలుపెట్టారు. ఇది సరయూ నది కేంద్రంగా రూపుదిద్దుకుంటోంది. అందులో ఇటీవల హోటల్ కోసం ఓ ప్లాట్‌ను వేలం వేయగా చదరపు మీటరుకు రూ.1,09,000 చొప్పున ధర పలకడం గమనార్హం. ఇలాంటి మరికొన్ని టౌన్‌షిప్‌లకూ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ► అయోధ్య పాత పట్టణంలో ఇప్పటికే భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు పనులు ప్రారంభించారు. ప్రధాన రోడ్లను వెడల్పు చేస్తున్నారు. రామాలయానికి దారితీసే మూడు ప్రధాన మార్గాలను ఇప్పటికే విస్తరించారు. రూ.33 కోట్లతో ఓ మల్టీలెవల్ పార్కింగ్‌ను అందుబాటులోకి తెచ్చారు. ► పట్టణంలో డీజిల్ ఆటోలకు బదులు 250 ఎలక్ట్రిక్ ఆటోలు తిప్పుతున్నారు. విమానాశ్రయం నుంచి పట్టణానికి, ఆలయం వద్దకు తిప్పేందుకు 250 ఎలక్ట్రిక్ బస్సులను సిద్ధం చేశారు. వాటి సంఖ్యను 500కు పెంచబోతున్నారు. ► అయోధ్య పట్టణం నుంచి వెలువడే మురికినీరు సరయూ నదిలోకి చేరుతోంది. దాన్ని పూర్తిగా నిరోధించి, మురికి నీటి శుద్ధికోసం ట్రీట్మెంట్ ప్లాంట్ల (ఎస్టీపీల)ను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే ఒక ఎస్టీపీ అందుబాటులోకి రాగా.. మరో రెండింటి పనులు జరుగుతున్నాయి. సోలార్ సిటీగా అయోధ్య అయోధ్యలో సౌర విద్యుత్ వి్రస్తృత వినియోగం కోసం ఐదేళ్ల కాలపరిమితితో ప్రత్యేక ప్రాజెక్టును చేపట్టారు. ఇళ్లు, వ్యాపార సముదాయాలు, పరిశ్రమల రూఫ్ టాప్‌పై సౌర ఫలకాలను అమరుస్తున్నారు. వీటితో 8.5 మెగావాట్ల విద్యుత్ సమకూరనుంది. ఇక సరయూ నది తీరంలో 40మెగావాట్ల సోలార్ ప్లాంట్‌ను ఎనీ్టపీసీ ఏర్పాటు చేస్తోంది. ఇందులో 10 మెగావాట్ల ప్లాంటు ఇప్పటికే అందుబాటులోకి వచ్చింది. ► అయోధ్య శివార్లలో సరయూ తీరం వెంట 12.90 కిలోమీటర్ల పొడవునా జాతీయ రహదారిపై సోలార్ లైట్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇంత నిడివిలో సోలార్ లైట్లు ఉండటం రికార్డు అని, దీనికి గిన్నిస్‌బుక్‌లో చోటు దక్కనుందని యూపీ ప్రభుత్వ యంత్రాంగం ప్రకటించింది. ► సౌర ఫలకాలతో కూడిన ‘సోలార్ ట్రీ’లను నగరవ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్నారు. 1 కేవీ సామర్థ్యం ఉన్నవి 40.. 2.5 కేవీ సామర్థ్యం ఉన్నవి 18 సిద్ధమవుతున్నాయి. తాగునీటి కియోస్‌్కలు, మొబైల్‌ఫోన్ చార్జింగ్ పాయింట్లు ఈ విద్యుత్‌తోనే పనిచేయనున్నాయి. ► సరయూ నదిలో సౌర విద్యుత్‌తో పనిచేసే పవర్ బోట్లను అందుబాటులోకి తెస్తున్నారు. ప్లాస్టిక్ నుంచి ఇంధనం అయోధ్యలో ప్లాస్టిక్ వ్యర్ధాలను వాహనాల ఇంధనంగా మార్చే రీసైక్లింగ్ యూనిట్ త్వరలో అందుబాటులోకి రానుంది. అయోధ్య మున్సిపల్ కార్పొరేషన్‌తో కుదిరిన ఒప్పందం మేరకు బెంగుళూరుకు చెందిన సంస్థ దీన్ని ఏర్పాటు చేస్తోంది. ఇది ఏటా 7,300 టన్నుల ప్లాస్టిక్ వ్యర్ధాలను ఇంధనంగా మార్చగలదు. ఉత్తర భారతంలో ఈ తరహా అతిపెద్ద ప్లాంటు ఇదే కానుంది. విస్తృతంగా వసతి సౌకర్యాలు అయోధ్యకు భారీ సంఖ్యలో భక్తులు వస్తున్నందున హోటల్ పరిశ్రమ కూడా విస్తృతమవుతోంది. దేశవ్యాప్తంగా ఫైవ్‌స్టార్ హోటళ్లను నిర్వహిస్తున్న ఓ పెద్ద సంస్థ 120 గదులతో ఒకటి, 100 గదులతో మరోటి చొప్పున రెండు స్టార్ హోటళ్ల నిర్మాణ పనులు ప్రారంభించింది. చిన్న, మధ్యస్థాయి హోటళ్లు, భోజన వసతి ఇళ్లను నిర్వహించే మరో కంపెనీ.. వెయ్యి గదులతో కూడిన 50 హోటళ్లను, భోజన నివాసాలను అందుబాటులోకి తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. మరికొన్ని సంస్థలు 1,100 గదులతో కూడిన హోటళ్లను నిర్మించనున్నాయి. దేశవ్యాప్తంగా ఆకాశహరŠామ్యలు నిర్మిస్తున్న బడా సంస్థ 51 ఎకరాల విస్తీర్ణంలో రూ.1,500 కోట్లతో లగ్జరీ విల్లాలు, సాధారణ ఇళ్లు, హోటళ్లను నిర్మించేందుకు ఒప్పందాలు చేసుకుంది. -
ఇల గోదారి పరవళ్లలోఅల రాములోరి ఆనవాళ్లు
సాక్షి అమలాపురం: ‘రామో విగ్రహవాన్ ధర్మః’ ఈ వాక్యం చాలు ధర్మం రాశీభూతమైతే రాముడిలా ఉంటుందని చెప్పడానికి. రాముడికి వాల్మీకి ఇచ్చిన నిర్వచనం ఇదే.లోకాభిరాముడు.. జగదేక రాముడు.. శ్రీరాముడు.. ఏకపత్నీవ్రతుడు.. పితృవాక్య పరిపాలకుడు.. ఒకే మాట.. ఒకే బాణం.. ఒకే సతి.. వినయశీలుడు ఇవన్నీ రామాయణాన్ని చదివిన, విన్నవారికి రాముని గురించి అనిపించిన గుణశీల సంపన్నములు. శ్రీకృష్ణుడు ‘ఏం చేసైనా ధర్మాన్ని నిలబెట్టాలి’ అని చెబితే.. ‘ఎన్ని కష్టాలు ఎదురైనా ధర్మం వైపు నిలబడి బతకాలని’ రాముడు దిశానిర్దేశం చేశాడు.. ఆచరించి చూపించాడు. ఏటా శ్రీరామ నవమికి ప్రతి రామాలయంలో, ప్రతి ఇంటా జరిగే పట్టాభిషేకాన్ని చూసి అక్షతలు శిరసున వేసుకున్నా.. నేడు అయోధ్యలో జరిగే విగ్రహ ప్రతిష్ఠాపన తదితర కార్యక్రమాలు ప్రసార మాధ్యమాల ద్వారా వీక్షించే ప్రతి భక్తునికీ రామాయణ బాలకాండలోని విశేషాలు సాక్షాత్కరిస్తాయనడంలో అతిశయోక్తి లేదు. అయోధ్యలో రూపుదిద్దుకున్న భవ్య రామ మందిరంలో బాలరాముని దివ్యరూపం కొలువుదీరుతున్న వేళ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పండగ వాతావరణం నెలకొంది. ఈ క్రతువు జరుగుతున్న శుభ గడియలు ఆసన్నమవుతున్న తరుణంలో వాల్మీకి అరణ్యకాండలో ప్రస్తావించిన గోదావరి జిల్లాలతో శ్రీరాముని అనుబంధనాన్ని భక్తులు గుర్తు చేసుకుని పుకలరించిపోతున్నారు. శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠకు అనుబంధంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ మురిిసిపోతున్నారు. తండ్రి మాట జవదాటని శ్రీరాముడు సీతా సమేతంగా వనవాసానికి వెళ్లిపోయాడు. ఈ సమయంలోనే రామయ్య సీతా సమేతంగా తమ్ముడు లక్ష్మణుడితో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో నడయాడారని భక్తుల విశ్వాసం. స్వయంగా శ్రీరాముడు ప్రతిష్ఠించిన పలు శివాలయాలు.. ఆలయాలు.. గోదావరి నదీతీరంలో పుణ్యస్నానాలు చేసిన ప్రాంతాలు.. వాటిని రామఘాట్ అంటూ పిలుచుకుంటూ భక్తులు రామునిపై తమ విశ్వాసాన్ని చాటుతున్నాయి. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో శ్రీరాముని వనవాసానికి సంబంధించి పలు పురాణ గాథలున్నాయి. అలాగే పురాణ ప్రసిద్ధి చెందిన ఆలయాలూ ఉన్నాయి. ► అల్లవరం మండలం ఎస్.పల్లిపాలెం శివారు నక్కా రామేశ్వరం తీర ప్రాంతంలోని పార్వతి సమేత శివాలయాన్ని త్రేతాయుగంలో శ్రీరాముడు నిర్మించడం వల్లే రామేశ్వరాలయంగా పిలుస్తారని భక్తుల విశ్వాసం. రావణాసుడిని అంతమొందించిన శ్రీరాముడు బ్రహ్మ హత్యా దోషానికి పరిహారంగా కాశీ నుంచి శివలింగాన్ని తెప్పించి సముద్రతీరంలో ప్రతిిష్ఠించాలని భావిస్తాడు. ఈ క్రమంలో లంక నుంచి అయోధ్యకు వెళుతున్న సమయంలో కాశీ నుంచి శివలింగాన్ని తీసుకురావలసిందిగా హనుమంతుడికి ప్రతిపాదిస్తాడు. సూర్యాస్తమయం కావస్తుండడం, శివలింగం రావడం ఆలస్యం కావడంతో రామేశ్వర క్షేత్రంలో ఇసుకతో సముద్రతీరంలో శివ లింగాన్ని తయారుచేసి ప్రతిష్ఠించి పూజలు చేసినట్లు ఈ క్షేత్రం పురాణ గాథ. ► ఇదే మండలం మొగళ్లమూరు శివారు లక్ష్మణేశ్వరంలో పార్వతీ సమేత లక్ష్మణేశ్వరస్వామి వారిని లక్ష్మణుడు ప్రతిష్ఠించినట్లు పురాణ గాథ. ఈ ఆలయాన్ని కూడా బ్రహ్మహత్యాదోష నివారణకు రాముని ఆజ్ఞ మేరకు లక్ష్మణుడు నిర్మించినట్టు చెప్తుంటారు. మకర సంక్రాంతి నుంచి జూన్ వరకు మేఘ వర్ణం, జూన్ నుంచి సంక్రాంతి వరకు ధూమ్ర (బూడిద) వర్ణంతో శివలింగం ప్రకాశిస్తుందని పురోహితులు చెబుతున్నారు. ► రాజమహేంద్రవరం రూరల్ ధవళేశ్వరం వద్ద అఖండ గోదావరిని ఆనుకుని రామపాదాల రేవు ఉంది. ఇక్కడ ఉన్న జనార్దన స్వామి ఆలయానికి పుర్వకాలంలో శ్రీరాముడు సీతా సమేతంగా లక్ష్మణ స్వామిని వెంటబెట్టుకుని వచ్చారని, ఇక్కడ పుణ్యస్నానాలు చేశారని నమ్మకం. ఇక్కడ రాముని పాదముద్రలు కూడా ఉంటాయి. పుష్కరాల సమయంలో ఇక్కడ స్నానాలు చేస్తే పుణ్యమని భక్తుల విశ్వాసం. ► వాల్మీకి రాసిన అరణ్యకాండలో గోదావరి తీరం ప్రస్తావన ఉంది. సీతారాములు వనవాసం చేశారని, సీతాదేవి అహరణకు గురైన తరువాత ఆమెకు గోదావరి తీరం అంటే ఇష్టమని అక్కడ వెదుకుదామని లక్ష్మణుడితో శ్రీరాముడు అన్నట్టు రాశారు. ► గుడిమెళ్ల రామేశ్వరంలో కృతకృత్య రామలింగేశ్వరస్వామి విగ్రహ ప్రతిష్ఠకు వెళ్లే ముందే శ్రీరాముడు, సీతాదేవి ఇప్పుడున్న సఖినేటిపల్లి వద్ద విశ్రాంతికని ఆగారంటారు. ఆ సమయంలో స్వామివారు ‘సఖీ’ ఇదే నేటిపల్లె (పల్లె నిద్ర చేయడం) అన్నారని, అప్పటి నుంచి ఈ ప్రాంతం సఖినేటిపల్లిగా గుర్తింపు పొందిందని చెబుతారు. ► అంబాజీపేట మండలం మాచవరం (నాటి మాసవరం)లో కౌశికానది తీరంలో పుణ్యస్నానాలు చేస్తే బ్రాహ్మణ హత్య మహాపాతకం పోతుందని చెప్పడంతో శ్రీరాముడు ఇక్కడ స్నానం చేసి శివాలయాన్ని ప్రతిష్ఠించారని పూర్వీకులు చెబుతున్నారు. నాటి నుంచి దీనిని శ్రీరామఘాట్గా పిలుస్తారు. ఇక్కడ పుష్కరాలకు పుణ్యస్నానాలు చేస్తారు. ► రత్నగిరి సత్యదేవుని ఆలయానికి క్షేత్రపాలకుడు శ్రీరాముడు కావడం మరో విశేషం. సత్యదేవునికి జరిగే ప్రతి వైదిక కార్యక్రమానికి, కల్యాణానికి శ్రీరాముడు పెళ్లిపెద్దగా వ్యవహరిస్తారు. ► గొల్లలమామిడాడ కోదండ రామస్వామి ఆలయం రాష్ట్రంలో కడప జిల్లా ఒంటిమిట్ట తరువాత అంతటి ప్రాముఖ్యం ఉన్న ఆలయం. ఈ ఆలయాన్ని విశిష్టమైన వాస్తు శాస్త్రంతో నిర్మించారు. రెండు భారీ గోపురాలు కలిగి ఉంటాయి. ఈ ఆలయాన్ని ‘చిన్న భద్రాది’ లేదా ‘చిన్న భద్రాచలం’ అని కూడా అంటారు. శ్రీరామ నవమి పండగకు ఉమ్మడి గోదావరి జిల్లాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి వస్తారు. ► రావణ వధ తరువాత శ్రీరాముడు సీతా సమేతంగా పుష్పక విమానంలో తిరిగి అయోధ్య వెళ్తుండగా శ్రమణి అనే రుషి భార్య శాపవశాత్తు కురూపిగా మారిపోతుంది. శాప విమోచనకు ఆమె తపస్సు చేస్తుంటుంది. ఆ ప్రదేశానికి వచ్చేసరికి పైన వెళ్తున్న పుష్పక విమానం ఆగిపోతుంది. అది గుర్తించిన రాముడు ఆమెకు క్షణ కాలంలోనే శాప విమోచనం కలిగించాడు. అనంతరం అక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించాడు. దీంతో ఆ ప్రదేశానికి క్షణ ముక్తేశ్వరం పేరు వచ్చిందని పురాణ గాధ. అలాగే యుద్ధంలో వినియోగించిన అస్త్రాలను ముక్తిగుండంలో వదిలిపెట్టారని భక్తుల విశ్వాసం. ఈ గుండంలోని నీటినే శివలింగానికి అభిషేకిస్తారు. అంతా రామమయం అయోధ్యలో సోమవారం బాలరాముని విగ్రహ ప్రతిష్ఠాపనను దేశ వ్యాప్తంగా హిందువులు పండగగా భావిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో ఎటుచూసినా రామనామమే వినిపిస్తోంది. శ్రీరాముని ఆలయాల వద్దనే కాదు.. ప్రతి ఆలయం వద్దా అయోధ్య రామాలయ ప్రతిష్ఠ సందడి నెలకొంది. ఆలయాలు, ఇళ్లు, వ్యాపార, వాణిజ్య కేంద్రాల వద్ద హనుమంతుని జెండాలను తగిలించి భక్తిని చాటుకుంటున్నారు. పలు దుకాణాల వద్ద ఈ జెండాల విక్రయం జోరుగా సాగుతోంది. ఆలయాల వద్దనే కాదు, చివరకు చాలా మంది సెల్‌ఫోన్ రింగ్ టోన్లు కూడా ‘జై శ్రీరామ్’ నినాదాన్నే పెట్టుకుంటున్నారు. వాట్స్అప్, ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగామ్‌ల డీపీలు రాముని చిత్రాలతో నిండిపోతున్నాయి. ఊరూవాడా ప్రత్యేక యాత్రలు, భజనలు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లా నుంచి పలువురు ఆయోధ్య వెళ్లారు. ఊరూవాడా శ్రీరామ మహా శోభాయాత్రలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. ‘జై శ్రీరామ్’ నినాదాలు హోరెత్తుతున్నాయి. -
అంతా రామమయం
కడప కల్చరల్: కడప నగరంలో శ్రీరామ శోభాయాత్ర దిగ్విజయంగా సాగింది. అయోధ్య ఐక్యతా వేదిక ఆధ్వర్యంలో 8 గంటలపాటు కొనసాగిన ఈ యాత్ర రాత్రి 10 గంటలకు ముగింపు వేదిక వద్దకు చేరుకుంది.ఆద్యంతం కళారూపాల ప్రదర్శనలతో అట్టహాసంగా సాగింది. ధార్మిక సంస్థలు అడుగడుగునా మంచినీరు, కూల్‌డ్రింక్స్, అల్పాహారం, భోజనాలు ఏర్పాటు చేశాయి. అయోధ్య ఆలయంలో సోమవారం శ్రీ బాలరాముని విగ్రహాన్ని ప్రతిష్టించనున్న సందర్భంగా ఆదివారం కడప నగరంలో శ్రీరామ శోభాయాత్ర పేరిట భారీ ర్యాలీ నిర్వహించారు. ఆర్ఎస్ఎస్, వీహెచ్‌పీ తదితర ధార్మిక సంఘాలతోపాటు పలు దేవాలయాల నిర్వాహక కమిటీ సభ్యులు, భక్తులు, భజన బృందాలు, అర్చక సంస్థలు, హిందూ సంఘాల ప్రతినిధులు దాదాపు 30 వేల మంది ర్యాలీలో పాల్గొన్నారు. ► ఉదయం 7.30 గంటలకు చిన్నచౌకులోని శ్రీ వీరాంజనేయస్వామి ఆలయం వద్ద నుంచి శ్రీరామ శోభాయాత్ర ప్రారంభమైంది. నగర మేయర్ సురేష్‌బాబు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. రోడ్లు భక్తులతో నిండిపోయాయి.18 అడుగుల భారీ శ్రీరాముని విగ్రహాన్ని ప్రత్యేక రథంలో ఏర్పాటు చేశారు. ర్యాలీలో ఇది ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బాహుబలి హనుమంతుడు, దేవతామూర్తుల వేషధారణలు కూడా అందరినీ ఆకట్టుకున్నాయి. డీజే సౌండ్ సిస్టమ్‌తో భక్తిగీతాలకు చిన్నారుల నుంచి వృద్ధుల వరకు నృత్యాలు చేయడం విశేషం. బాలరాముని చిత్రం ఆశారేఖ ఫౌండేషన్ చైర్మన్ నెమలిదిన్నె నాగవేణి బృందం స్థానిక హరిత టూరిజం హోటల్ ప్రాంగణంలో రూపొందించిన బాలరాముని రంగుల చిత్రం యాత్రలో పాల్గొన్న భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. వైవీయూలో చిత్రకళను అభ్యసించిన విద్యార్థి కల్యాణ్ ఈ చిత్రాన్ని గంటసేపట్లో తీర్చిదిద్దారు. నేటి కార్యక్రమాలు సోమవారం హౌసింగ్‌బోర్డు రామాలయం వద్ద ఉదయం 6 గంటలకు శ్రీరామ హోమం, శ్రీరామలక్ష్మణ సీతా ఆంజనేయుల విగ్రహాలకు అభిషేకాలు నిర్వహిస్తారు. అయోధ్యలో జరిగే రామప్రతిష్టను ఆలయంలో స్క్రీన్ ఏర్పాటు చేసి లైవ్‌లో భక్తులు చూసే అవకాశం కల్పిస్తున్నారు. అదేరోజు సాయంత్రం పాలకొండపై శ్రీరామ అఖండ దివ్యజ్యోతిని వెలిగించనున్నారు. -
Ayodhya Event: సెలవుపై వెనక్కి తగ్గిన ఢిల్లీ ఎయిమ్స్
ఢిల్లీ: అయోధ్య రామ మందిర వేడుకకు ఆఫ్ డే సెలవు ప్రకటనపై ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) వెనక్కి తగ్గింది. మహా సంప్రోక్షణ కార్యక్రమాన్ని దృష్టిలో ఉంచుకుని రేపు మధ్యాహ్నం 2.30 గంటల వరకు నాన్ క్రిటికల్ సర్వీస్‌లను మూసివేయాలన్న నిర్ణయాన్ని ఈరోజు వెనక్కి తీసుకుంది. నాన్-క్రిటికల్ సర్వీస్‌లలోని సిబ్బందికి రేపు సగం రోజు విరామం ప్రకటించడంపై నిరసన వ్యక్తమైన విషయం తెలిసిందే. ఎయిమ్స్-ఢిల్లీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ రాజేష్ కుమార్ రేపు ఆఫ్ డే సలవు అని పేర్కొంటూ మెమోరాండం జారీ చేశారు. రేపు ప్రభుత్వ సిబ్బందికి హాఫ్ డేగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయాన్ని ప్రస్తావించారు. "22.01.2024న 14.30 గంటల వరకు ఎయిమ్స్ హాఫ్ డే సెలవు ఉంటుందని ఉద్యోగులందరి సమాచారం" అని మెమోరాండం పేర్కొంది. అయినప్పటికీ, "అన్ని క్రిటికల్ క్లినికల్ సేవలు" నడుస్తాయని పేర్కొన్నారు. ఔట్ పేషెంట్ డిపార్ట్మెంట్ (OPD) సేవలు అందుబాటులో ఉంటాయో లేదో అధికారిక నోట్లో ప్రత్యేకంగా ప్రస్తావించలేదు. కానీ ఇలాంటి రోజుల్లో అవుట్డోర్ పేషెంట్లు వైద్యులను సంప్రదించలేమని భయపడ్డారు. దీంతో ఢిల్లీ ఎయిమ్స్ నిర్ణయంపై సర్వత్రా నిరసన వ్యక్తమైంది. రోగులు నెలల తరబడి వేచి ఉంటారని ఆందోళన వ్యక్తం చేశారు. ఓపీడీ సేవలు నిలిపివేస్తే రోగులకు తీవ్ర అసౌకర్యం కలుగుతుందని మండిపడ్డారు. దీంతో ఢిల్లీ ఎయిమ్స్ యాజమాన్యం తన నిర్ణయాన్ని మార్చుకుంది. ఇదీ చదవండి: అయోధ్య రామయ్య దర్శనం, ప్రసాదం ఉచితమే..! -
అయోధ్య రామయ్య దర్శనం ఉచితమే..!
లక్నో: రామ మందిరం దేశంలోనే ప్రముఖ దేవాలయాల జాబితాలో చేరబోతోంది. ఇలాంటి చోట దర్శనం, ప్రసాదాలకు రుసుము ఉండటం సహజం. కానీ, భక్తులు సమర్పించిన రూ.వేల కోట్ల విరాళాలతో రూపుదిద్దుకుంటున్న ఈ భవ్య మందిరంలో భక్తులపై దర్శన వేళ అదనంగా రుసుము భారం మోపొద్దని ట్రస్టు నిర్ణయించింది. ఎంతమంది భక్తులు వచ్చినా ఎలాంటి రుసుమూ లేకుండా దర్శనానికి అవకాశం కల్పించబోతున్నారు. పేద, ధనిక తారతమ్యం లేకుండా అందరికీ ఒకే తరహాలో దర్శన ఏర్పాట్లు చేస్తున్నారు. స్వామివారి దర్శన అనంతరం ఎంతో భక్తిశ్రద్ధలతో స్వీకరించే ప్రసాదం కూడా ఉచితంగా అందించాలని నిర్ణయించారు. అయోధ్య రామమందిర నిర్మాణం పూర్తి కాకముందే భక్తుల తాకిడి పెరిగింది. ఇక్కడ ఆలయ నిర్మాణం ప్రారంభం కాకమునుపు రోజుకు సగటున 1500 నుంచి 2000 మంది వరకు వచ్చేవారు. ఆలయ పనులు మొదలయ్యాక ఆ సంఖ్య ఒక్కసారిగా పది వేలకు పెరిగింది. ఇప్పుడు నిత్యం 40 వేల నుంచి 50 వేల మంది భక్తులు అయోధ్యకు వస్తున్నారు. జనవరి 22 ప్రాణ ప్రతిష్ఠ తర్వాత ఆ సంఖ్య లక్షకు చేరువవుతుందని అంచనా వేస్తున్నారు. వీరందరికీ ఉచితంగానే దర్శనం కల్పించాలని భావిస్తున్నారు. ఆలయ నిర్మాణానికి అటు కేంద్రం నుంచి ఇటు రాష్ట్రపభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోవటం లేదని రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ఇప్పటికే ప్రకటించింది. పూర్తిగా భక్తులు సమర్పించిన విరాళాలతోనే పనులు చేస్తున్నట్టు వెల్లడించింది. ఇప్పటి వరకు ఆలయానికి ప్రపంచవ్యాప్తంగా రామభక్తుల నుంచి రూ.3500 కోట్లకు పైగానే విరాళాలు అందినట్టు సమాచారం. వాటి ద్వారా వస్తున్న వడ్డీ మొత్తంతోనే ప్రస్తుతం పనులు జరుగుతున్నాయని చెబుతున్నారు. భక్తులు ఇప్పటికీ విరాళాలు సమర్పిస్తూనే ఉన్నారు. అయోధ్య ఆలయ సమీపంలో ఉన్న కౌంటర్లు, తాత్కాలిక మందిరం వద్ద ఉన్న కౌంటర్లతోపాటు ప్రపంచ వ్యాప్తంగా ఆన్ లైన్ ద్వారా భక్తులు విరాళాలు సమర్పిస్తూనే ఉన్నారు. ప్రతినెలా రూ.10 కోట్ల నుంచి రూ.15 కోట్ల వరకు అవి సమకూరుతున్నట్టు సమాచారం. ఇదీ చదవండి: అయోధ్య రామాలయం: భారీగా పెరిగిన స్టాక్‌లు ఇవే..! -
అయోధ్యలో హూటల్ రూం ధర లక్ష!
అయోధ్యలో నిర్మిస్తున్న రామమందిరం సర్వాంగసుందరంగా సిద్ధమైంది. మరికొన్ని గంటల్లో బాలరాముడు భక్తజనానికి దర్శనం ఇవ్వనున్నాడు. బాలరామచంద్రుడి విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవం జరగనుంది. ఈ వేడుకలకు ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రాష్ట్ర గవర్నర్ ఆనందిబెన్ పటేల్, ఆలయ ట్రస్ట్ అధ్యక్షుడు మహంత్ నృత్య గోపాల్ దాస్‌తో పాటు ప్రపంచం నలుమూలల నుంచి వివిధ రంగాలకు చెందిన 7,000 మంది ప్రముఖులు హాజరుకానున్నారు. హోటల్లో ఒక్క రూమ్ ధర లక్ష రాముడి సుగుణాలు అనేకం.. ప్రతిఒక్కోటి విలక్షణమే. అలాంటి రాముడు పుట్టిన చోట నిర్మిస్తున్న మందిర నిర్మాణంలో ప్రధాని మోదీ భూమి పూజ చేసిన నాటి నుంచి అయోధ్య రూపు రేకలు మారిపోయాయి. ముఖ్యంగా టూరిజం రంగం అనూహ్యంగా వృద్ది సాధిస్తున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఇక బాలరాముడు దర్శనం కోసం భక్తులు అయోధ్యకు భారీ ఎత్తున తరలివస్తున్నారు. ఈ తరుణంలో అయోధ్యలోని హోటల్ ధరలు రాత్రికి రూ. లక్షకు పెరిగాయంటూ పలు వీడియోలు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. ఐదు రెట్లు పెరిగిన అద్దెలు అద్దెలు సగటు కంటే ఐదు రెట్లు పెరిగాయి. అందుకు స్థానికంగా ఉన్న పార్క్ ఇన్ రాడిసన్ హోటల్ టాప్ రూమ్ ధర రూ.లక్ష మార్క్ దాటినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. స్థానికంగా ఉన్న హోటల్ రామాయణ ప్రతినిధులు మాట్లాడుతూ.. జనవరి 20-25 మధ్యలో హోటల్ గదులు పూర్తిగా బుక్ అయ్యాయి. పార్క్ ఇన్ హోటల్, డిసెంబర్ మధ్య నుండి బుకింగ్‌ల జోరందుకుంది. అందుబాటులోకి హోమ్ స్టేలు రామమందిరం కేవలం 6 కిలోమీటర్ల దూరంలో ఉన్నందున, రామమందిరం ప్రారంభమైన తర్వాత హోటల్ గదలు ధరలు రాత్రికి రూ. 7,000 నుండి రూ. 25,000 వరకు పెరిగాయని సిగ్నెట్ కలెక్షన్ హోటల్స్ ప్రతినిధులు చెబుతున్నారు. డిమాండ్‌కు అనుగుణంగా నగరంలో అనేక హోమ్‌స్టేలు కూడా వచ్చాయి. రూ.4 వేల నుంచి సరసమైన ధరకే గదులు అందిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. -
Ram Mandir: కేజీఎఫ్ టు అయోధ్య
కెజీఎఫ్: కోలారు జిల్లాలోని కేజీఎఫ్ పట్టణం బంగారు గనులకు, హిట్ సినిమా కథలకే కాదు, మరికొన్ని ఘనతలకు కూడా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ఉన్న కేంద్ర ప్రభుత్వ ఎన్ఐఆర్ఎం సంస్థనే అయోధ్యలోని ప్రఖ్యాత రామమందిరం నిర్మాణానికి ఉపయోగించిన బండరాళ్లు, శిలల నాణ్యతను పరిశీలించి విలువైన సూచనలు అందజేసింది. అయోధ్య ఆలయ శిలల నాణ్యతను తనిఖీ చేసే బాధ్యతను నేషనల్ ఇన్స్‌స్టిట్యూట్ ఆఫ్ రాక్ మెకానిక్స్ (ఎన్ఐఆర్ఎం) సంస్థకు ఇవ్వడం జరిగింది. ఈ కార్యాన్ని విజయవంతంగా పూర్తిచేయడం ద్వారా కేజీఎఫ్ సిగలో మరో కలికితురాయి చేరింది. 2021లో తనిఖీ బాధ్యతలు రామమందిరం ఎలాంటి లోహాలను, సిమెంటు వంటివి ఉపయోగించకుండా రాతితో నిర్మిస్తుండడం విశేషం. భూకంపాలు, ఉరుములు, మెరువులు వంటి ప్రకృతి వైపరీత్యాలకు తట్టుకునే విధంగా నిర్మాణం సాగుతోంది. ఇంత పెద్ద ఆలయ నిర్మాణానికి రాళ్లు చాలా ముఖ్యం. వాటి నాణ్యత కూడా బాగుండాలి. దశాబ్దాల తరబడి మన్నిక ఉండాలంటే శాసీ్త్రయంగా పరిశోధించి మంచి రాళ్లను ఎంపిక చేయాలి. అందుకోసం రామజన్మభూమి ట్రస్టు.. దేశంలోని పలు నిర్మాణ రంగ సంస్థలను సంప్రదించి చివరకు కేజీఎఫ్‌లోని ఎన్‌ఐఆర్‌ఎంకు 2021లో బాధ్యతను అప్పగించింది. మూడు రకాల రాళ్లు ఎన్ఐఆర్ఎం ప్రిన్సిపల్ సైంటిస్ట్– హెచ్ఓడి ఎ.రాజన్‌బాబు రాళ్ల పరీక్షలకు నేతృత్వం వహించారు. ఈయన స్వయంగా కేజీఎఫ్ వాస్తవ్యులే కావడం విశేషం. ఎన్ఐఆర్ఎం నిపుణులు రాయ్స్టన్ ఏంజలో విక్టర్, డి ప్రశాంత్ కుమార్‌లు, టెక్నీషియన్లు ఆర్. ప్రభు, బాబు.ఎస్‌లు ఈ బృందంలో ఉన్నారు. మందిరంలో ముఖ్యంగా మూడు రకాల రాళ్లను ఉపయోగించారు. పునాదికి గ్రానైట్ రకం రాళ్లు, సూపర్ స్ట్రైకర్ రాళ్లను నిలువు, అడ్డు స్తంభాలుగా, డెకోరేటివ్ రాళ్లు అలంకారానికి అని రాజన్‌బాబు తెలిపారు. లక్షకు పైగా రాళ్ల పరీక్ష ► ఎన్ఐఆర్ఎం ఎలాంటి రాళ్లనైనా పరిశీలించి నాణ్యతను నిర్ధారిస్తుంది. మందిర నిర్మాణానికి వివిధ రకాల సుమారు లక్షకు పైగా రాళ్లను పరీక్షించారు. ► ఇందుకోసం కేజీఎఫ్‌లోని సంస్థలోను, అలాగే అయోధ్య ఆలయంలో నిపుణులు నిరంతరం పనిచేశారు. ► అంతిమంగా ఎంపిక చేసిన రాళ్లనే ఇంజినీర్లు నిర్మాణంలో ఉపయోగించారు. ► వేయి సంవత్సరాలు నిలిచే నాణ్యత కలిగిన రాళ్లను రామమందిర నిర్మాణానికి సిఫారసు చేయడం జరిగింది. ► ఇందులో గ్రానైట్ రాళ్లను కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడుల నుంచి సేకరించారు. ► ఈ రాళ్ల పరీక్షల కోసం సుమారు రూ. 8.24 కోట్లను ఖర్చు చేశారు. ► కర్ణాటకలోని సాదహళ్లి, దేవనహళ్లి, చిక్కబళ్లాపురం, తుమకూరు, శిర ప్రాంతాలలోని రాళ్లను పరిశీలించి కట్టడానికి ఆమోదించారు. ► తెలంగాణలోని కరీంనగర్, వరంగల్, ఏపీలో ఒంగోలు ప్రాంతాలనుంచి రాళ్ల నమూనాలను కేజీఎఫ్‌కు తెప్పించుకుని వాటిని ఉపయోగించవచ్చని సిఫార్సు చేశారు మా అదృష్టం: రాజన్‌బాబు దేశం గర్వించదగిన ఆధునిక యుగంలో రామమందిర నిర్మాణం అనేది అద్భుత ఘట్టం. రాళ్లను పరీక్షించే మహత్తర కార్యంలో మేము పాల్గొనడం ఎంతో సంతోషం కలిగిస్తోంది. ఇది మాకు దక్కిన అదృష్టం. పరీక్షా కార్యంలో పాల్గొన్న అధికారుల నుంచి మొదలుకుని కూలి కార్మికుల వరకు అందరూ సిగరెట్, మద్యం వంటివాటికి దూరంగా ఉన్నారు. క్రమశిక్షణ, శ్రద్ధా భక్తులతో పనుల్లో పాల్గొన్నారు. -
బాల రాముడిని చూసొద్దాం
సాక్షిప్రతినిధి, కరీంనగర్: అయోధ్య రామాలయంలో రాముని ప్రాణప్రతిష్టను పురస్కరించుకుని దేశంలోని నలుమూలల నుంచి భక్తులు తరలివెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఈ తరుణంలో దక్షిణమధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడిపేందుకు సిద్ధమైంది. అందులో పలు రైళ్లను ఉమ్మడి జిల్లా భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. మూడు ప్రత్యేక రైళ్లు ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల మీదుగా అయోధ్య వెళ్లనున్నాయి. ఒకటి మహారాష్ట్ర నుంచి నిజామాబాద్–కరీంనగర్–పెద్దపల్లి ప్రాంతాల మీదుగా అయోధ్యకు వెళ్తుంది. మరో రెండు రైళ్లలో ఒకటి సికింద్రాబాద్, మరోటి ఖాజీపేట నుంచి బయలుదేరి పెద్దపల్లి, రామగుండం మీదుగా అయోధ్య నగరాన్ని చేరుకుంటాయి. ఈనెల 29 నుంచి బుకింగ్ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. ఆధ్యాత్మిక ప్రాంతాల పర్యటనకు ఉద్దేశించిన ఈ ప్రత్యేక రైళ్లను ఆస్తా రైళ్లుగా పిలుస్తారు. ఇందులో 22 కోచ్‌లు ఉండగా 20 స్లీపర్ బోగీలు(రిజర్వుడు) రెండు మాత్రం సాధారణ బోగీలు ఉంటాయి. జగిత్యాల–కరీంనగర్– పెద్దపల్లి మీదుగా రైలు నంబర్.. 07649 జాల్నా నుంచి ఫిబ్రవరి 4న(ఆదివారం) ఉదయం 9:30 గంటలకు జాల్నా రైల్వేస్టేషన్ నుంచి బయలుదేరి కోరుట్ల సాయంత్రం 5:18 గంటలకు, లింగంపేట్ జగిత్యాల సాయంత్రం 5:50, కరీంనగర్ రైల్వేస్టేషన్ సాయంత్రం 6:45, పెద్దపల్లి జంక్షన్‌కు రాత్రి 7:35, రామగుండంకు రాత్రి 8:00, అయోధ్య మంగళవారం తెల్లవారుజామున 3:35 గంటలకు చేరుకుంటుంది. ఇదే రైలు తిరుగుప్రయాణంలో నంబర్.. 07650 ఫిబ్రవరి 6న బుధవారం మధ్యాహ్నం 2:20 గంటలకు అయోధ్య ధామ్ జంక్షన్ నుంచి బయలుదేరి రామగుండానికి గురువారం సాయంత్రం 7:25 గంటలకు, పెద్దపల్లి జంక్షన్‌కు 7:55, కరీంనగర్ రైల్వేస్టేషన్‌కు రాత్రి 8:35, లింగంపేట జగిత్యాల రైల్వేస్టేషన్‌కు 9:20, కోరుట్ల రైల్వేస్టేషన్‌కు రాత్రి 9:50 గంటలకు చేరుకుంటుంది. సికింద్రాబాద్ నుంచి.. రైలు నంబర్.. 07221 సికింద్రాబాద్ నుంచి అయోధ్య ధాం జంక్షన్ రైల్వేస్టేషన్‌కు ఈనెల 29 నుంచి ఫిబ్రవరి 29 వరకు వారంలో మూడు రోజులు (మొత్తం 16 ట్రిప్పులు) ఈ రైళ్లు నడుస్తాయి, జనవరి 29, 31 తేదీలు, ఫిబ్రవరి 2, 5, 7, 9, 11, 13, 15, 17, 19, 21, 23, 25, 27, 29 తేదీలలో సాయంత్రం 4:45 గంటలకు సికింద్రాబాద్ జంక్షన్లో బయలుదేరుతుంది. కాజీపేట జంక్షన్‌కు సాయంత్రం 6:20 గంటలకు, పెద్దపల్లి జంక్షన్‌కు 7:38, రామగుండం 8 గంటలకు బయలుదేరి మరుసటి రోజు(ఒక రోజు ప్రయాణం తర్వాత) ఉదయం 3:30 గంటలకు అయోధ్య చేరుకుంటాయి. ఇదే రైలు తిరుగు ప్రయాణంలో నంబర్.. 07222తో ఫిబ్రవరి 1, 3, 5, 8, 10, 12, 14, 16, 18, 20, 22, 24, 26, 28 ఇంకా మార్చి 1, 3 తేదీల్లో ఈ ప్రత్యేక రైళ్లు నడుస్తాయి, ఈ రైలు అయోధ్య ధామ్ జంక్షన్ నుంచి మధ్యాహ్నం 2:20 గంటలకు బయలుదేరి మరుసటి రోజు రాత్రి 10:30 గంటలకు సికింద్రాబాద్ జంక్షన్ చేరుకుంటుంది. ఈ రైళ్లు రామగుండంకు సాయంత్రం 6:30, పెద్దపల్లి జంక్షన్‌కు 7:00, కాజీపేట జంక్షన్‌కు 8:08 గంటలకు చేరుకుంటాయి. కాజీపేట నుంచి.. రైలు నంబర్.. 07223 కాజీపేట జంక్షన్ నుంచి ఈనెల 30 నుంచి ఫిబ్రవరి 28 వరకు వారంలో మూడు రోజులు(మొత్తం 15 ట్రిప్పులు) నడుస్తాయి. జనవరి 30వ తేదీ, ఫిబ్రవరి 1, 3, 6, 8, 10, 12, 14, 16, 18, 20, 22, 24, 26, 28 తేదీలలో సాయంత్రం కాజీపేట జంక్షన్ నుంచి 06:20 నిమిషాలకు బయలుదేరుతుంది. పెద్దపల్లి జంక్షన్‌కు 7:38 గంటలకు, రామగుండం నుంచి 8:00 గంటలకు బయలుదేరి మరుసటి రోజు(ఒక రోజు ప్రయాణం తర్వాత) ఉదయం 3:35 గంటలకు అయోధ్య ధాం జంక్షన్‌కు చేరుకుంటుంది. ఇదే రైలు తిరుగు ప్రయాణంలో నంబర్.. 07224 ఫిబ్రవరి 2, 4, 6, 9, 11, 13, 15, 17, 19, 21, 23, 25, 27, 29, మార్చి 2వ తేదీన మొత్తం(15 ట్రిప్పులు) ఈ ప్రత్యేక రైళ్లు నడుస్తాయి. ఈ రైలు అయోధ్య ధాం జంక్షన్ నుంచి మధ్యాహ్నం 2:20 గంటలకు బయలుదేరి మరుసటి రోజు రాత్రి 9 గంటలకు కాజీపేట జంక్షన్‌కు చేరుకుంటుంది. ఈ రైళ్లు అయోధ్య ధాం జంక్షన్ నుంచి వచ్చేటప్పుడు రామగుండంకు సాయంత్రం 6:30 గంటలకు, పెద్దపల్లి జంక్షన్‌కు 7 గంటలకు చేరుకుంటాయి. -
అయ్యో.. నా రాముడికి ఎలాంటి పరిస్థితి? మనసు బరువెక్కింది
ఆధ్యాత్మిక పాత్రలను వెండితెరపైనే కాదు బుల్లితెరపైనా రక్తి కట్టించినవాళ్లున్నారు. వెండితెర కంటే అద్భుతంగా సీరియల్స్ ద్వారా జనాలకు చేరువైన కథలున్నాయి. అలా ఎన్నో భక్తి ప్రధాన సీరియల్స్ ప్రేక్షకులను మైమరపింపజేశాయి. అందులో రామాయణ్ సీరియల్ ఒకటి. ఈ సీరియల్లో రాముడు, లక్ష్మణుడు, సీతగా నటించిన ముగ్గురికీ అయోధ్య రామాలయ ప్రారంభం కోసం ఆహ్వానం అందింది. ఈ క్రమంలో రెండు రోజుల క్రితమే అయోధ్యను వీరు సందర్శించారు. రాములవారికి ఎలాంటి పరిస్థితి? శ్రీరాముని ఆలయాన్ని చూసి తన్మయత్వానికి లోనయ్యారు. రామాయణ్ సీరియల్లో లక్ష్మణుడిగా నటించిన సునీల్ లహ్రి అయితే తనను తాను మైమరిచిపోయాడు. తాజాగా అతడు తన మనసులోని మాటలను మీడియాతో పంచుకున్నాడు. సునీల్ లహ్రి మాట్లాడుతూ.. 'అయోధ్యకు వెళ్లినప్పుడు నేను భావోద్వేగానికి లోనయ్యాను. ఇక్కడే కదా రాములవారు పుట్టిపెరిగింది. కానీ ఆయనకు ఎలాంటి పరిస్థితి వచ్చింది. టెంట్ కింద విగ్రహాన్ని ఉంచారు. వారి త్యాగం ఊరికే పోలేదు అది చూసి నాకు ఎంతో బాధేసింది. మూడు దశాబ్దాల తర్వాత తిరిగి అదే ప్రదేశంలో ఆయనకు గుడి కట్టినందుకు మనసు సంతోషంతో ఉప్పొంగిపోయింది. 500 ఏళ్లుగా దీని కోసం పోరాడాం. ఎంతోమంది తమ ప్రాణాల్ని సైతం లెక్క చేయలేదు. వారి త్యాగం ఊరికే పోలేదు. శ్రీరాముని ప్రాణ ప్రతిష్ట జరిగే రోజు (జనవరి 22) భారతదేశ చరిత్రలో నిలిచిపోతుంది' అని చెప్పుకొచ్చాడు. చదవండి: ప్రియుడితో ప్రేమలో టాలీవుడ్ హీరోయిన్.. ఫిబ్రవరిలోనే పెళ్లి! -
Ayodhya: గర్భగుడిలో బాలరాముని మొదటి చిత్రం
లక్నో: అయోధ్య రామాలయంలో జనవరి 22న ప్రతిష్ఠ చేయనున్న బాలరాముని విగ్రహం ఫొటోలు బయటకు వచ్చాయి. విగ్రహం కళ్లపై గుడ్డతో కప్పబడి ఉంది. గర్భగుడిలో ప్రతిష్ఠించనున్న బాలరాముని విగ్రహాన్ని కర్ణాటక శిల్పి అరుణ్ యోగిరాజ్ రూపొందించిన విషయం తెలిసిందే. మందిరంలో విగ్రహ ప్రతిష్ఠాపనకు ముందు జరుపుతున్న ఆచారాల్లో భాగంగా బాలరామున్ని గర్భగుడికి తీసుకువచ్చారు. బాలరాముని ప్రాణప్రతిష్ఠ సందర్భంగా గర్భగుడిని శుద్ధి చేసేందుకు ప్రత్యేక పూజలు చేయనున్నారు. సరయూ నది నుండి తీసుకువచ్చిన నీటితో పాటు దేశంలోని వివిద పవిత్ర నదీ జలాలలను తీసుకువచ్చి గర్భగుడిని శుద్ధి చేయనున్నారు. అనంతరం గర్భగుడిలో పూజలను నిర్వహించి, బాలరాముని విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. బాలరాముని ప్రాణప్రతిష్ఠ సందర్భంగా గర్భగుడిని శుద్ధి చేసేందుకు ప్రత్యేక పూజలు చేయనున్నారు. సరయూ నది నుండి తీసుకువచ్చిన నీటితో పాటు దేశంలోని వివిద పవిత్ర నదీ జలాలలను తీసుకువచ్చి గర్భగుడిని శుద్ధి చేయనున్నారు. రామ మందిరంలో బాలరాముని ప్రాణప్రతిష్ఠకు ముందు జరిగే శుద్ధి కార్యక్రమాల కోసం రాముని పాదుకలను ఆలయానికి తీసుకువచ్చారు. అనంతరం గర్భగుడిలో పూజలను నిర్వహించి, బాలరాముని విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి నిర్విఘ్నంగా క్రతువులు ప్రత్యేక క్రతువులు నిరి్వఘ్నంగా కొనసాగుతున్నాయి. అయోధ్యలో మూడో రోజు గురువారం ఆచార్యులు ఆలయ ప్రాంగణంలో గణేశ్ పూజ, వరుణ పూజ, వాస్తు పూజ శాస్త్రోక్తంగా నిర్వహించారు. జలదివస్‌లో భాగంగా రామ్‌లల్లా విగ్రహాన్ని నీటితో శుభ్రం చేశారు. రాముడి విగ్రహాన్ని చెక్కిన మైసూరులో ప్రసిద్ధ శిల్పి అరుణ్ యోగిరాజ్ కుటుంబం స్వీట్లతో చేసిన రామమందిర ప్రతిరూపాన్ని తీసుకువచ్చింది. ఇదీ చదవండి: గర్భగుడిలోకి రామ్‌లల్లా -
అయోధ్య వాతావరణం.. ప్రత్యేక వెబ్‌పేజీ ప్రారంభించిన ఐఎండీ
అయోధ్య: శ్రీరాముని ప్రాణప్రతిష్ట జరిగే ఈ నెల 22న అయోధ్యలో వాతావరణ వివరాలు తెలియజేసేందుకు భారత వాతావరణ శాఖ(ఐఎండీ) ఏకంగా ఒక ప్రత్యేక వెబ్‌పేజీని ప్రారంభించింది. ప్రాణప్రతిష్ట వేడుక జరిగే 22న అయోధ్యలో అత్యల్ప ఉష్ణోగ్రత 10.7 డిగ్రీల సెల్సియస్, అత్యధిక ఉష్ణోగ్రత 22.2 డిగ్రీల సెల్సియస్‌గా ఉంటుందని ఐఎండీ తెలిపింది. అయోధ్యలో 22వ తేదీన ఉండే ఉష్ణోగ్రతలతో పాటు తేమ, గాలి వేగం తదితర వాతావరణ సంబంధిత అంశాలను కూడా ఐఎండీ ఏర్పాటు చేసిన వెబ్‌పేజీ తెలియజేస్తోంది. 17వ తేదీ నుంచి వారం రోజుల పాటు అయోధ్యలో ఉష్ణోగ్రతల ఫోర్క్యాస్ట్తో పాటు ఇక్కడ ఈ వారం రోజుల్లో ప్రతి రోజు ఏ సమయంలో సూర్యోదయ, సూర్యాస్తమయాలవుతాయనే వివరాలను కూడా ఐఎండీ పొందుపరిచింది. అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి IMD launched a dedicated page for Ayodhya weather forecast.#IMD #Ayodhya pic.twitter.com/wSEpUJr90K — Suresh Kumar (@journsuresh) January 18, 2024 ఈ వివరాలన్నింటని హిందీ, ఆంగ్లం, ఉర్దూ, చైనీస్, ఫ్రెంచ్, స్పానిష్ భాషల్లో ఐఎండీ అందుబాటులో ఉంచింది. కేవలం అయోధ్యనే కాకుండా ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్, వారణాసి, లక్నోలతో పాటు రాజధాని న్యూ ఢిల్లీ నగరాల వాతావరణ వివరాలను కూడా ఐఎండీ వెబ్‌పేజీలో ఎప్పటికప్పుడు తెలియజేస్తోంది. పర్యాటకుల సౌకర్యార్థమే ఐఎండీ ప్రత్యేక వెబ్‌పేజీని రూపొందించినట్లు సమాచారం. ఇదీచదవండి.. రామాలయం పోస్టల్స్టాంపు విడుదల -
రామాలయం పోస్టల్ స్టాంపు విడుదల
రామ్‌లల్లా ప్రాణప్రతిష్ఠకు ముందుగా నేడు (గురువారం) శ్రీరామ జన్మభూమి ఆలయంపై స్మారక పోస్టల్ స్టాంప్‌ను ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేశారు. దీనితో పాటు రాముని చిత్రంతో కూడిన స్టాంపుల పుస్తకాన్ని కూడా ప్రధాని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేశారు. ఈ 48 పేజీల పుస్తకంలో 20 దేశాల స్టాంపులు ఉన్నాయి. రామాలయ పోస్టల్ స్టాంపు విడుదల అనంతరం ప్రధాని మోదీ ఓ వీడియో సందేశాన్ని కూడా విడుదల చేశారు. ప్రధాని మోదీ మొత్తం 6 తపాలా స్టాంపులను విడుదల చేశారు. వీటిలో రామాలయం, గణేశుడు, హనుమంతుడు, జటాయువు, శబరి మొదలైనవి ఉన్నాయి. ఈ 48 పేజీల పుస్తకంలో అమెరికా, న్యూజిలాండ్, సింగపూర్, కెనడా, కంబోడియా, ఐక్యరాజ్యసమితి వంటి సంస్థలు సహా 20కి మించిన దేశాలు విడుదల చేసిన పోస్టల్ స్టాంపులు ఉన్నాయి. అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఇది కూడా చదవండి: పేరులో రాముడుంటే బంపర్ ఆఫర్! #WATCH | Prime Minister Narendra Modi releases Commemorative Postage Stamps on Shri Ram Janmbhoomi Mandir and a book of stamps issued on Lord Ram around the world. Components of the design include the Ram Mandir, Choupai 'Mangal Bhavan Amangal Hari', Sun, Sarayu River and… pic.twitter.com/X2eZXJzTKz — ANI (@ANI) January 18, 2024 -
అయోధ్యకు చేరుకున్న ‘హనుమంతుడు’..
అయోధ్య రామాలయంలో బాలరాముని విగ్రహప్రతిష్ఠాపన ఈ నెల 22న జరగనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ శరవేగంగా కొనసాగుతున్నాయి. ఈ నేపధ్యంలో అయోధ్యలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇదిలావుండగా హనుమంతుని జన్మస్థలమైన కిష్కింధ నుండి ప్రత్యేక రథం అయోధ్యకు చేరుకుంది అలాగే ప్రపంచం నలుమూలల నుండి అయోధ్యకు విలువైన కానుకలు చేరుతున్నాయి. ఈ రథం మూడేళ్లుగా దేశమంతటా తిరుగుతోంది. ఈ ప్రత్యేక రథం సీతామాత జన్మస్థలమైన బీహార్‌లోని సీతామర్హి గుండా అయోధ్యకు చేరుకుంది. ఈ రథంతోపాటు పర్యటనలు సాగిస్తున్న స్వామి గోవిందానంద సరస్వతి మాట్లాడుతూ అయోధ్యలో రామాలయం నిర్మిస్తున్న తరహాలోనే కిష్కింధలో కూడా హనుమంతుని ఆలయాన్ని నిర్మించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని తెలిపారు. శ్రీరాముని భక్తుడైన హనుమంతుని రాకకు చిహ్నంగా ఈ రథాన్ని అయోధ్యకు తీసుకువచ్చారు. ఈ రథం ద్వారా రామభక్తిని ఊరూవాడా ప్రచారం చేస్తున్నారు. ఈ రథాన్ని చూసేందుకు జనం తరలివస్తున్నారు. అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి కిష్కింధ ప్రాంతం కర్ణాటకలోని కొప్పల్ విజయనగర జిల్లాలో ఉంది. ఇది తుంగభద్ర నది ఉత్తర ఒడ్డున ఉన్న హంపి కంటే పురాతనమైన ప్రాంతం. ప్రస్తుతం ఈ ప్రాంతాన్ని ఆనెగుండి అని పిలుస్తున్నారు. కిష్కింధ రాజ్యాన్ని సుగ్రీవుడు తన సలహాదారు హనుమంతుని సహాయంతో పరిపాలించాడు. ఆనెగుండి గ్రామంలో రామాయణానికి సంబంధించిన పలు ఆనవాళ్లు లభించాయి. ఈ ప్రాంతమంతా రాళ్లు, పర్వతాలతో కూడి ఉంటుంది. రామాయణంలో ఈ ప్రదేశానికి సంబంధించిన ప్రస్తావన వినిపిస్తుంది. అనెగుండి గ్రామంలో పలు పురాతన గుహలు కూడా కనిపించాయి. ఇక్కడి రాళ్లపై కోతుల చిత్రాలను కనుగొన్నారు. ఇది కూడా చదవండి: రామ్‌లల్లా దర్శనానికి ఎలా వెళ్లాలి? -
రామ్‌లల్లా దర్శనానికి ఎలా వెళ్లాలి?
జనవరి 22న అయోధ్యలో రామమందిరాన్ని ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించిన సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి. బాలరాముని విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం పూర్తయ్యాక అయోధ్యను సందర్శించాలని చాలామంది ఉవ్విళ్లూరుతున్నారు. అయితే ఇందుకు ఎటువంటి విధివిధానాలు అనుసరించాలో ఇప్పుడు తెలుసుకుందాం. రామాలయంలో బాలరామునికి రోజుకు ఐదుసార్లు హారతులు ఇవ్వనున్నారు. అయితే భక్తులు మూడు హారతులను మాత్రమే దర్శించుకోగలుగుతారు. ఈ హారతులు ఉదయం 6:30 గంటలకు, మధ్యాహ్నం 12:00 గంటలకు, సాయంత్రం 7:30 గంటలకు నిర్వహిస్తారు. ఇక శ్రీరాముని దర్శనం విషయానికి వస్తే ఉదయం 6 నుండి 11.30 వరకు, తిరిగి మధ్యాహ్నం 2 నుండి రాత్రి 7 గంటల వరకు దర్శనం చేసుకోవచ్చు. అయోధ్యలో బాలరాముని దర్శనం కోసం ముందుగా రిజిస్టేషన్ చేసుకోవాలి. ఇందుకోసం శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్రం (https://online.srjbtkshetra.org) అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లి, మొబైల్ నంబర్‌ను నమోదు చేయడం ద్వారా లాగిన్ కావాలి. ఓటీపీ నమోదు చేశాక పేజీ ఓపెన్ అవుతుంది. దానిలో ‘దర్శన్’ ఎంపికపై క్లిక్ చేశాక, ఓపెన్ అయిన పేజీలో మీరు శ్రీరాముని దర్శనం చేసుకోవాలనుకుంటున్న తేదీ, సమయం, మీతోపాటు వచ్చేవారి సంఖ్య, దేశం, రాష్ట్రం, మొబైల్ నంబర్‌తో పాటు మీ ఫోటోను అప్లోడ్ చేయాలి. ఈ ప్రక్రియ పూర్తయ్యాక దర్శనానికి సంబంధించిన బుకింగ్ పూర్తవుతుంది. శ్రీరాముని హారతులను చూడాలనుకుంటే ఇందుకోసం ప్రత్యేకంగా బుక్ చేసుకోవాలి. అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఆఫ్‌లైన్‌లో టిక్కెట్లు పొందాలనుకుంటే ఆలయం సమీపంలోని కౌంటర్ వద్దకు వెళ్లి, ప్రభుత్వం ధృవీకరించిన గుర్తింపు కార్డును చూపించి, టికెట్ పొందవచ్చు. కాగా పదేళ్లకన్నా తక్కువ వయసుగల పిల్లలకు దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేయవలసిన అవసరం లేదు. దర్శనం కోసం టిక్కెట్‌తో పాటు ఐడీప్రూప్ ప్రూఫ్‌ను ఖచ్చితంగా వెంట తీసుకువెళ్లాలి. ఎవరైనా భక్తుడు తన టిక్కెట్‌ను రద్దు చేసుకుంటే, ఆ స్లాట్ మరో భక్తుడికి అందుబాటులోకి వస్తుంది. దర్శనం కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నాక, దర్శనానికి 24 గంటల ముందు సంబంధిత భక్తునికి మెసేజ్ లేదా మెయిల్ వస్తుంది. దర్శనానికి 24 గంటల ముందు భక్తుడు తన టిక్కెట్‌ను రద్దు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. కాగా స్త్రీలు, పురుషులు సంప్రదాయ దుస్తులలో మాత్రమే దర్శనానికి రావాలి. పురుషులు ధోతీ-కుర్తా లేదా కుర్తా, పైజామా.. మహిళలు చీర, దుపట్టాతో కూడిన పంజాబీ దుస్తులు లేదా దుపట్టాతో చుడీదార్ సూట్ ధరించి శ్రీరాముని దర్శనానికి రావచ్చు. ఇది కూడా చదవండి: అయోధ్యలో త్రేతాయగం... అంతా రామమయం! -
అయోధ్యలో త్రేతాయగం... అంతా రామమయం!
అయోధ్యలోని రామమందిరంలోకి శ్రీరామ్‌లల్లా అడుగుపెట్టారు. శ్రీరామ్‌లల్లా ప్రాణ ప్రతిష్ఠ జనవరి 22న జరగనుంది. జనవరి 16 నుంచి ప్రాణప్రతిష్ఠ పూజలు ప్రారంభమయ్యాయి. ఈ నేపధ్యంలో అయోధ్య నగరమంతా రామమయంగా మారిపోయింది. ప్రతిచోటా ‘జై శ్రీరామ్’ నినాదాలు వినిపిస్తున్నాయి. దీనిని చూస్తుంటే అయోధ్యకు నాటి త్రేతాయుగం వచ్చినట్టున్నదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుతం అయోధ్యలోని ప్రతి ఇంట్లో, ప్రతి దుకాణంలో ప్రతి చౌరస్తాలో రామనామం తాండవమాడుతోంది. జనవరి 16న నిర్మోహి అఖారాకు చెందిన మహంత్ దినేంద్ర దాస్, పండితులు సునీల్ దాస్ అయోధ్య రామమందిరంలోని గర్భాలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం మహిళలు కలశ యాత్ర చేపట్టారు. జనవరి 17న శ్రీరామ్‌లల్లా నూతన విగ్రహాన్ని మొదటిసారిగా ఆలయంలోనికి తీసుకువచ్చారు. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ మార్గదర్శకత్వంలో అయోధ్యలో ‘త్రేతా యుగం’నాటి రోజులు కనిపిస్తున్నాయి. అయోధ్యలోని అన్ని దుకాణాలపై రాములవారి జెండాలు రెపరెపలాడుతున్నాయి. రామ్‌ఘాట్ నుండి అయోధ్యలోకి ప్రవేశిస్తున్నప్పుడు అక్కడ ఏర్పాటు చేసిన ఒక హోర్డింగ్ దీపావళి వేడుకలను గుర్తు చేసేలా ఉంది. రామభజన, రామాయణానికి సంబంధించిన పాటలు వాడవాడలా ప్రతిధ్వనిస్తుండంతో అవి రామభక్తులకు మరింత ఉత్సాహాన్ని అందిస్తున్నాయి. శ్రీరామ్‌లల్లాకు జరిగే పట్టాభిషేకం కోసం అయోధ్యవాసులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బుధవారం నుంచి అయోధ్యకు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌కు చెందిన రెండు విమానాల రాకపోకలు ప్రారంభమయ్యాయి. ఈ విమానం అయోధ్యతో కోల్‌కతా, బెంగళూరులను కలుపుతుంది. పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ విమానాలను ప్రారంభించారు. అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి రామ జన్మభూమి మార్గంలోని ఎంట్రీ పాయింట్ దగ్గర రెండు పెద్ద స్తంభాలు నిర్మితమయ్యాయి. అవి త్రేతాయుగాన్ని తలపిస్తున్నాయి. ఇక్కడి గోడలపై రామ్‌లల్లా జీవితానికి సంబంధించిన పలు దృశ్యాలు కనిపిస్తాయి. నూతన రామాలయం రాకతో ప్రముఖ స్టార్ హోటళ్లు అయోధ్యలో అడుగిడేందుకు సిద్ధమవుతున్నాయి. దీనికితోడు ప్రధాన రహదారిపై గృహాలు కలిగినవారు తమ ఇళ్లను హోటళ్లుగా మారుస్తున్నారు. ప్రస్తుతం అయోధ్యలో రూ.30,923 కోట్ల విలువైన 200కు పైగా అభివృద్ధి ప్రాజెక్టులు కొనసాగుతున్నాయి. 37 శాఖలు ఈ ప్రాజెక్టులను పూర్తి చేసే పనిలో నిమగ్నమయ్యాయి. యూపీ హౌసింగ్ అండ్ డెవలప్మెంట్ బోర్డ్ 1200 ఎకరాల్లో న్యూ అయోధ్య టౌన్‌షిప్‌ను అభివృద్ధి చేయడానికి ప్రణాళిక రూపొందించింది. ఇది కూడా చదవండి: ఇనుమూ లేదు.. సిమెంటూ లేదు.. రామాలయం ఎలా నిర్మించారు? -
Ayodhya: బాల రాముడి దర్శనం.. పులకించిన భక్తులు
అయోధ్య: అయోధ్యలో అపూర్వ ఘట్టం సాక్షాత్కరించింది. మరో అయిదు రోజుల్లో శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరగనుండగా బుధవారం తొలిసారిగా బాలరాముడు భక్తులకు అయోధ్యలో దర్శనమిచ్చాడు. భారీ ఊరేగింపుతో బాలరాముడు అయోధ్య గుడిలోకి ప్రవేశించాడు. Uttar Pradesh | Ramlalla's representative idol was carried across the Ram Temple premises in Ayodhya earlier today. (Pics: VHP spokesperson Sharad Sharma) pic.twitter.com/4M07BjV1yc — ANI (@ANI) January 17, 2024 గురువారం గర్భగుడిలో బాలరాముని విగ్రహాన్ని ప్రతిష్టించనున్నారు. 5 ఏళ్ల బాలుని రూపంలో బాలరాముడి విగ్రహాన్ని తయారు చేశారు. బాలరాముడిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. బాలరాముడి దర్శనంతో భక్తులు పరవశించి పోయారు. ఇదీచదవండి.. ప్రధాని మోదీ రామ ప్రతిజ్ఞ నెరవేరింది -
అయోధ్య: ఆ రెండు విగ్రహాలను ఏం చేయనున్నారు?
అయోధ్యలో రామమందిర ప్రతిష్ఠ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో రామ్‌లల్లా నేడు(బుధవారం) ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించనున్నారు. ముందుగా రామ్‌లల్లా విగ్రహాన్ని రామజన్మభూమి కాంప్లెక్స్‌కు తీసుకువెళతారు. అనంతరం గర్భగుడిని శుద్ధి చేసి, గురువారం శ్రీరాముని విగ్రహాన్ని గర్భగుడిలోనికి తీసుకువస్తారు. రామాలయంలో ప్రతిష్ఠించేందుకు తొలుత మూడు బాలరాముని విగ్రహాలను రూపొందించగా, అరుణ్ యోగిరాజ్ తీర్చిదిద్దిన రామ్‌లల్లా విగ్రహాన్ని ప్రతిష్ఠాపనకు ఎంపిక చేశారు. దీంతో మిగిలిన రెండు విగ్రహాలను ఏమిచేయనున్నారనే ప్రశ్న అందరి మదిలో మెదలాడింది. దీనికి సమాధానాన్ని శ్రీ రామ జన్మభూమి తీర్ధ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ మీడియాకు వెల్లడించారు. అయోధ్య ఆలయంలో ప్రతిష్ఠించేందుకు మూడు విగ్రహాలు తయారు చేయించామని, దానిలో ఒక విగ్రహాన్ని గర్భగుడిలో ప్రతిష్ఠించేందుకు ఎంపిక చేశామని, మిగిలిన రెండు విగ్రహాలను ఆలయంలోని మొదటి, రెండో అంతస్తుల్లో ఏర్పాటు చేస్తామని చంపత్ రాయ్ తెలిపారు. రామ మందిరం మొదటి అంతస్తు సిద్ధమైన వెంటనే రెండు రామ్‌లల్లా విగ్రహాలలో ఒకదానిని వైదిక ఆచారాలతో అక్కడ ప్రతిష్ఠించనున్నట్లు ఆయన తెలిపారు. డిసెంబర్ 2025 నాటికి ఆలయ నిర్మాణ పనులు పూర్తయిన తర్వాత, మిగిలిన రెండవ విగ్రహాన్ని రెండవ లేదా చివరి అంతస్తులో ప్రతిష్ఠించనున్నామన్నారు. అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి రామాలయం గర్భగుడిలో ఏర్పాటు చేసేందుకు కర్ణాటక శిల్పి అరుణ్ యోగిరాజ్ తీర్చిదిద్దిన నల్లరాతి విగ్రహాన్ని ఆలయ ట్రస్ట్ ఎంపిక చేసింది. మిగిలిన రెండు విగ్రహాలలో ఒకటి కర్నాటకకు చెందిన గణేష్ భట్ నల్లరాతితో తీర్చిదిద్దారు. ఇంకొక విగ్రహాన్ని రాజస్థాన్‌కు చెందిన సత్య నారాయణ పాండే తెల్లని మక్రానా పాలరాతితో రూపొందించారు. ఈ మూడు విగ్రహాలూ 51 అంగుళాల ఎత్తులో ఉన్నాయి. ఇది కూడా చదవండి: 2,100 కిలోల గంట.. 108 అడుగుల అగరుబత్తి -
Ayodhya Ram Mandir: అయోధ్యలో సంప్రదాయ క్రతువులు ఆరంభం
అయోధ్య: చారిత్రక నగరం అయోధ్యలోని భవ్య రామమందిరంలో రామ్‌లల్లా ప్రాణప్రతిష్టకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఈ నెల 22న జరిగే ఈ మహా వేడుకకు దేశ విదేశాల నుంచి వేలాది మంది విశిష్ట అతిథులు హాజరు కాబోతున్నారు. బాలరాముడి ప్రతిష్టాపనకు సంబంధించిన సంప్రదాయ క్రతువులు మంగళవారం లాంఛనంగా ప్రారంభమయ్యాయి. ప్రాణప్రతిష్ట దాకా నిరంతరాయంగా కొనసాగుతాయని అయోధ్య తీర్థ క్షేత్ర ట్రస్టు వెల్లడించింది. శ్రీరామజన్మభూమి ఆలయం గర్భగుడి ద్వారం క్రతువులకు ట్రస్టు సభ్యుడు అనిల్ మిశ్రా, ఆయన భార్య ఉషా మిశ్రా ‘యజమానులుగా’ వ్యవహరిస్తున్నారు. ఆలయ ప్రారం¿ోత్సవం దాకా ప్రతినిత్యం వారే యజమానులుగా ఉంటారు. అయోధ్యలో అనుష్ఠానానికి శ్రీకారం చుట్టామని, ఆలయ ప్రాణప్రతిష్టకు దేవుళ్లందరి అనుగ్రహాన్ని అరి్థస్తూ మొత్తం 11 మంది పూజారులు క్రతువులు ప్రారంభించారని ప్రధాన పూజారి సత్యేంద్ర దాస్ తెలిపారు. ఆలయంలో ప్రాణప్రతిష్ట ముగిశాక ప్ర«దానమంత్రి నరేంద్రమోదీ ప్రసంగిస్తారు. అయోధ్యలోని గోడలపై చిత్రించిన రామాయణంలోని అపురూప ఘట్టాల దృశ్యాలు... ఆసక్తిగా తిలకిస్తున్న స్థానికులు ఈ కార్యక్రమానికి 8 వేల మంది అతిథులు హాజరవుతారని అంచనా. వీరిలో కొద్ది మందిని మాత్రమే గర్భాలయంలోకి అనుమతిస్తారు. గణేశ్వర్ శాస్త్రి ద్రవిడ్ ఆధ్వర్యంలో 121 మంది అచార్యులు ప్రాణప్రతిష్ట కార్యక్రమం నిర్వహిస్తారు. ప్రధాన ఆచార్యుడిగా కాశీకి చెందిన లక్ష్మీకాంత్ దీక్షిత్ వ్యవహరించబోతున్నారు. అయోధ్యలో సోమవారం ప్రాయశి్చత్త, కర్మకుటీ పూజ నిర్వహించారు. 56 రకాల ఆగ్రా పేఠాలు ఆగ్రా పేఠ.. ఉత్తర భారతీయులకు చాలా ఇష్టమైన మిఠాయి. బూడిద గుమ్మడికాయ, చక్కెర పాకంతో ఈ పేఠాలు తయారు చేస్తారు. అయోధ్యలో ప్రాణప్రతిష్ట జరుపుకోనున్న బాలరాముడికి ఆగ్రా పేఠాలను నివేదించబోతున్నారు. ఇందుకోసం ఏకంగా 56 రకాల పేఠాలను సిద్ధం చేశారు. ఇవి మంగళవారం అయోధ్యకు చేరుకున్నాయని అధికార వర్గాలు వెల్లడించాయి. ఆగ్రాకు చెందిన పంచీపేఠ అనే మిఠాయిల దుకాణం వీటిని తయారు చేసి పంపించింది. అలాగే అదనంగా 560 కిలోల పేఠాలను సైతం ఆగ్రా ట్రేడ్ బోర్డు ద్వారా పంపింది. వీటిని భక్తులకు ప్రసాదంగా పంచిపెట్టే అవకాశం ఉంది. అలాగే రత్నాలు కూర్చిన పట్టు వ్రస్తాలు, వెండి పళ్లేలు, ఇతర పూజా సామగ్రి సైతం వేర్వేరు ప్రాంతాల నుంచి అయోధ్యకు చేరుకున్నాయి. అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 108 అడుగుల అగరు బత్తి వెలిగించారు గుజరాత్ నుంచి అయోధ్యకు పంపించిన 108 అడుగుల పొడవైన అగరు బత్తిని శ్రీరామ్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు మహంత్ నృత్యగోపాల్ దాస్ మంగళవారం వెలిగించారు. గుజరాత్ నుంచి తెచి్చన 108 అడుగుల అగరొత్తికి మొక్కుతున్న భక్తులు ఈ సందర్భంగా భక్తులు జైశ్రీరామ్ అంటూ జపించారు. దాదాపు 40 రోజుల దాకా ఈ అగరు బత్తి వెలుగుతూనే ఉంటుంది. 3,610 కిలోల బరువు, మూడున్నర అడుగుల వెడల్పు ఉన్న ఈ అగరు బత్తి సువాసన 50 కిలోమీటర్ల వరకు వ్యాపిస్తుందని తయారీదారులు చెప్పారు. భారీ అగరు బత్తిని ఆవు పేడ, నెయ్యి, సుగంధ తైలాలు, పూల రెక్కలు, ఔషధ మూలికలతో తయారు చేశారు. భారీ అగరొత్తిని వెలిగిస్తున్న మహంత్ నృత్య గోపాల్ దాస్ ప్రాణప్రతిష్టలో సంప్రదాయ సంగీత మధురిమలు రామ్‌లల్లా ప్రాణప్రతిష్ట సందర్భంగా అయోధ్యలో భారతీయ సంప్రదాయ సంగీతం అతిథులను అలరించబోతోంది. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి సంప్రదాయ సంగీత కళాకారులను రప్పిస్తున్నారు. ఉత్తరప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, పంజాబ్, ఒడిశా, మధ్యప్రదేశ్, మణిపూర్, అస్సాం, ఛత్తీస్‌గఢ్, బిహార్, ఢిల్లీ, రాజస్తాన్, పశి్చమ బెంగాల్, జార్ఖండ్, తమిళనాడు, ఉత్తరాఖండ్ తదితర రాష్ట్రాల నుంచి నుంచి కళాకారులు రాబోతున్నారు. ఇప్పటికే వారిని తీర్థ క్షేత్ర ట్రస్టు ఎంపిక చేసింది. ఆంధ్రప్రదేశ్ నుంచి ఘటము వాయిద్యానికి స్థానం కల్పించారు. ఈ నెల 22న జరిగే అపూర్వ వేడుకలో కళాకారులు తమ సంగీత ప్రావీణ్యాన్ని ప్రదర్శిస్తారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన పఖవాజ్, తమిళనాడుకు చెందిన మృదంగం వంటి వాయిద్యాలు ప్రదర్శన ఉంటుంది. అయోధ్యలో రామమందిర ప్రారం¿ోత్సవంలో భిన్నరకాల వాయిద్యాలను ఒకేచోట తిలకించవచ్చు. భారతీయ సంప్రదాయ సంగీత మధురిమలను మనసారా ఆస్వాదించవచ్చు. ఇదిలా ఉండగా, ప్రాణప్రతిష్ట ముగిసిన తర్వాత ఈ నెల 23 నుంచి సామాన్య ప్రజలకు బాలరాముడి దర్శనభాగ్యం కలి్పస్తారు. ఈ నెల 26 తర్వాత ఆర్ఎస్ఎస్, వీహెచ్‌పీ కార్యకర్తలు విడతలవారీగా దర్శించుకొనేలా షెడ్యూల్ రూపొందించారు. వారి దర్శనాలు ఫిబ్రవరి ఆఖరు దాకా కొనసాగుతాయి. అతిథుల కోసం బస ఏర్పాట్లు చేస్తున్నారు. సరయూ నదిలో సౌర విద్యుత్ పడవ అయోధ్య నగరాన్ని మోడల్ సోలార్ సిటీకి అభివృద్ధి చేయాలని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం సంకలి్పంచింది. ఇందులోభాగంగా సౌర విద్యుత్‌కు పెద్ద పీట వేయబోతోంది. అయోధ్యలో సరయూ నదిలో సౌరవిద్యుత్‌తో నడిచే పడవలను ప్రవేశపెట్టేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. తొలి పడవను ఈ నెల 22న యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రారంభించబోతున్నారు. ఇండియాలో ఇదే తొలి సౌరవిద్యుత్ పడవ కావడం గమనార్హం. అయోధ్య పర్యాటకులు సరయూ నదిలో ఇలాంటి పడవల్లో విహరించవచ్చు. నయా ఘాట్ నుంచి ఈ పడవలు రాకపోకలు సాగిస్తాయి. ఒక్కో బోట్లో ఒకేసారి 30 మంది ప్రయాణించవచ్చు. ఫైబర్గ్లాస్తో తయారు చేయడంతో తేలిగ్గా ఉంటాయి. శబ్దం రాదు. పూర్తిగా పర్యావరణ హితం. ఇది కూడా చదవండి: రామ మందిర ప్రతిష్టాపన.. ఆ మూడు రాష్ట్రాల్లో 'డ్రై డే' -
ప్రాయశ్చిత్త పూజ ఏమిటి? అయోధ్యలో ఎందుకు చేస్తున్నారు?
ఈనెల 22న అయోధ్యలో శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించనున్నారు. దీనికి ముందుగా నేడు (మంగళవారం)ప్రాయశ్చిత్త పూజలు చేస్తున్నారు. ఇంతకీ ప్రాయశ్చిత్త పూజ అంటే ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. జీవితంలో ప్రతీఒక్కరూ తెలిసో, తెలియకో తప్పులు చేస్తుంటారు. చేసిన తప్పులకు ఆ తరువాత పశ్చాత్తాప పడుతుంటారు. హిందూ ధర్మంలో వైదిక సంప్రదాయం ప్రకారం భగవంతుని పూజించడానికి ప్రత్యేక నియమాలు, విధానాలు ఉన్నాయి. ఏదైనా మతపరమైన ఆచారాన్ని నిర్వహించే ముందు వాటిని పాటించడం తప్పనిసరి అని భావిస్తారు. అయితే పూజా విధానంలో పొరపాటున ఏవైనా నియమాలను తప్పితే, తప్పు జరిగిందని బాధపడుతుంటారు. అందుకే దోష పరిహారం కోసం ముందుగా ప్రాయశ్చిత్త పూజలు చేస్తారు. అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఈ తరహా పూజలతో భౌతిక, మానసిక, అంతర్గత ప్రాయశ్చిత్తం జరుగుతుందని పండితులు చెబుతారు. ప్రాయశ్చిత్త పూజలో భాగంగా 10సార్లు పుణ్య స్నానాలు చేస్తారు. బూడిదతో సహా వివిధ వస్తువులతో స్నానం చేస్తారు. ఈ పూజలో గోవును దానం చేసే సంప్రదాయం కూడా ఉంది. బంగారం, వెండి, నగలు మొదలైనవి కూడా దానం చేస్తారు. ప్రాయశ్చిత్త పూజలు చేయడం వలన ఎటువంటి దోషాలు అంటుకోవని చెబుతారు. అందుకే దేవాలయాలు నిర్మించినప్పుడు లేదా విగ్రహాలను ప్రతిష్ఠించినప్పుడు తప్పనిసరిగా ప్రాయశ్చిత్త పూజలు చేస్తారు. ఫలితంగా పూజల నిర్వహణలో ఎటువంటి పొరపాటు జరిగినా దోషం తగలదని అంటారు. ఇది కూడా చదవండి: అయోధ్యకు వెళ్లలేరా? ప్రాణప్రతిష్ఠను ఇలా ప్రత్యక్షంగా చూడండి! -
Ayodhya Ram Mandir: అలనాడు అయోధ్య రామమందిర కోసం.. నేడు ప్రాణప్రతిష్ట కోసం (అరుదైన చిత్రాలు)
-
శిల్పి అరుణ్ యోగిరాజ్ గురించి శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ ఏమన్నది?
అయోధ్యలో ఈనెల 22న నూతన రామాలయ ప్రారంభోత్సవం జరగనుంది. అదేరోజు ఆలయంలో బాలరాముని విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేయనున్నారు. సుప్రసిద్ధ మైసూర్ శిల్పి అరుణ్ యోగిరాజ్ అయోధ్యలో కొలువుదీరే బాలరాముని విగ్రహాన్ని తీర్చిదిద్దారు. ఈ నేపధ్యంలో శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ శిల్పి అరుణ్ యోగిరాజ్‌ను ప్రశంసలతో ముంచెత్తారు. ఆరు నెలల మౌనదీక్ష అరుణ్ యోగిరాజ్ బాలరాముని విగ్రహాన్ని తీర్చిదిద్దే సమయంలో నెలల తరబడి తన కుటుంబంలోని ఎవరితోనూ మాట్లాడకుండా, ఎంతో దీక్షతో ఈ కార్యాన్ని నెరవేర్చారని ట్రస్ట్ ఒక అధికారిక ప్రకటనలో పేర్కొంది. విగ్రహ తయారీలో అరుణ్ యోగిరాజ్ పూర్తి అంకితభావాన్ని ప్రదర్శించారని తెలిపింది. కుటుంబానికి దూరంగా.. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ మీడియాకు విడుదల చేసిన ఒక ప్రకటనలో విగ్రహ నిర్మాణ సమయంలో అరుణ్ యోగిరాజ్ చూపిన ఏకాగ్రత, కనబరిచిన త్యాగం అమోఘమని అన్నారు. విగ్రహం తయారు చేసే సమయంలో ఈ పనులకు ఆటంకం కలగకుండా ఉండేందుకు కుటుంబ సభ్యులకు కూడా ఆయన దూరంగా ఉన్నారని చంపత్ రాయ్ తెలిపారు. చివరికి తన పిల్లల ముఖాలు కూడా చూడలేదని, మొబైల్ ఫోన్ కూడా ఉపయోగించలేదని పేర్కొన్నారు. శంకరాచార్యుల విగ్రహం కూడా.. అరుణ్ యోగిరాజ్‌కు విగ్రహాల తయారీతో అమితమైన అనుబంధం ఉందన్నారు. వారి పూర్వీకులు కూడా శిల్పకళా నైపుణ్యం కలిగినవారేనన్నారు. కాగా కేదార్‌నాథ్‌లోని శంకరాచార్యుల విగ్రహం, ఢిల్లీలోని ఇండియా గేట్ దగ్గరున్న సుభాష్ చంద్రబోస్ విగ్రహాలను అరుణ్ యోగిరాజ్ రూపొందించారు. ఇంటిలో సంక్రాంతి సంబరాలు అరుణ్ యోగిరాజ్ తీర్చిదిద్దిన బాలరాముని విగ్రహాన్ని అయోధ్యలో ప్రతిష్ఠించనున్న నేపధ్యంలో అతని కుటుంబ సభ్యులంతా ఆనందంలో మునిగితేలుతున్నారు. ఈ నేపధ్యంలోనే వారంతా మకర సంక్రాంతిని అత్యంత వేడుకగా చేసుకున్నారు. ఈ సందర్భంగా శిల్పి అరుణ్ యోగిరాజ్ తల్లి సరస్వతి, భార్య విజేత యోగిరాజ్ మీడియాతో తమ ఆనందాన్ని పంచుకున్నారు. అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి ట్రస్ట్ ప్రకటన ఆనందదాయకం అరుణ్ యోగిరాజ్ తల్లి సరస్వతి మాట్లాడుతూ, సంక్రాంతి పండుగ రోజున శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తమ కుమారుని గురించి చేసిన ప్రకటన తమకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు. రామ్‌లల్లా విగ్రహాన్ని చెక్కడానికి మైసూర్‌లోని హెగ్గదేవన్కోట్లోని కృష్ణ శిలను తమ కుమారుడు ఎంచుకున్నాడన్నారు. ఆ రాయిని శిల్పంగా మలిచేముందు తాను ఆ కృష్ణ శిలను పూజించానని తెలిపారు. ‘జీవితం సార్థకమైంది’ అరుణ్ యోగిరాజ్ భార్య విజేత మాట్లాడుతూ తన భర్త చెక్కిన విగ్రహాన్ని ఎంపిక చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. తమ జీవితం సార్థకమైందన్నారు. తన భర్త అరుణ్ ఆరు నెలలపాటు అయోధ్యలో ఉన్న సమయంలో పిల్లలను చూసుకోవడం కొంచెం కష్టంగా మారిందన్నారు. అయితే ఇప్పుడు తన భర్త రూపొందించిన విగ్రహం ఎంపిక కావడం, శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తన భర్తను అభినందించడం ఆనందంగా ఉందన్నారు. ఇది కూడా చదవండి: అయోధ్యకు వెళితే ఎంత ఖర్చవుతుంది? ఎక్కడ బస చేయాలి? -
అయోధ్యకు వెళితే ఎంత ఖర్చవుతుంది? ఎక్కడ బస చేయాలి?
అయోధ్యలో రామాలయ ప్రారంభోత్సవం, శ్రీరాముని ప్రాణప్రతిష్ట వేడుక జనవరి 22న ఘనంగా జరగనుంది. ఈ వేడుకకు పలువురు ప్రముఖులను ఆహ్వానిస్తూ వారికి లేఖలు పంపారు. అయితే జనవరి 22 నాటికి అయోధ్యకు చేరుకోవాలంటే ఎంత ఖర్చు అవుతుంది? విమాన టిక్కెట్లు, హోటల్ గదుల ఛార్జీలు ఎలా ఉంటాయి? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈజ్ మై ట్రిప్, థామస్ కుక్, ఎస్ఓటీసీ తదితర ట్రావెల్ సంస్థలు.. అయోధ్యలో జరిగే వేడుకకు హాజరయ్యేందుకు చాలామంది ఎంత ఖర్చయినా భరించేందుకు సిద్ధంగా ఉన్నారని చెబుతున్నాయి. అయోధ్య రామాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఏడు వేల మందికి ఆహ్వానాలు పంపించారు. వీరిలో పలువురు రాజకీయ నాయకులు, ప్రముఖులు కూడా ఉన్నారు. ‘థామస్ కుక్’, ‘ఎస్ఓటీసీ’ సంస్థలు తెలిపిన వివరాల ప్రకారం ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్, చెన్నైల నుండి అయోధ్యకు విమాన టిక్కెట్ల ధరలు రూ. 20 వేల నుంచి రూ. 30 వేల వరకూ చేరుకున్నాయి. ఇతర సమయాల కంటే ప్రస్తుతం విమాన ఛార్జీలు చాలా అధికంగా ఉన్నాయి. సోమవారం మేక్ మై ట్రిప్‌లో జనవరి 20న ముంబై నుంచి అయోధ్యకు వెళ్లేందుకు వన్‌వే ఫ్లైట్ టికెట్ రూ.17,900 నుంచి రూ.24,600 వరకూ ఉంది. అదే సమయంలో జనవరి 21 నాన్‌స్టాప్ విమానానికి రూ.20,699గా ఉంది. జనవరి 20న కోల్‌కతా నుంచి అయోధ్యకు విమాన టిక్కెట్ల ధర రూ.19,456 నుంచి రూ.25,761గా ఉంది. బెంగళూరు నుండి అయోధ్యకు వెళ్లాలనుకుంటే జనవరి 20కి రూ. 23,152 నుండి రూ. 32,855 వరకు విమాన టిక్కెట్ల ధర ఉంది. అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఈజ్ మై ట్రిప్ పేర్కొన్న వివరాల ప్రకారం అయోధ్య రామాలయ ప్రారంబోత్సవానికి దాదాపు ఏడువేల మంది అతిథులు హాజరుకానున్నారు. ఈనెల 22 తరువాత ప్రతిరోజూ మూడు నుండి ఐదు లక్షల మంది భక్తులు అయోధ్యకు చేరుకునే అవకాశం ఉంది. నూతన రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అయోధ్యలోని హోటళ్లన్నీ ఇప్పటికే పూర్తిగా బుక్ అయిపోయాయి. హోటళ్లలో గదుల ఆక్యుపెన్సీ రేటు 80 నుండి 100 శాతానికి చేరుకుంది. ఫలితంగా కొన్ని హోటళ్లలో రాత్రిపూట గది అద్దె ధర రూ.70 వేలు వరకూ చెబుతున్నారు. అందుకే అయోధ్యకు వచ్చే చాలామంది భక్తులు పగటిపూట అయోధ్యలో ఉంటూ, రాత్రి పూట లక్నో లేదా ప్రయాగ్‌రాజ్‌లో బస చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇది కూడా చదవండి: అయోధ్యలో భూములు కొన్న అమితాబ్.. రేట్లు ఎలా ఉన్నాయి? -
అయోధ్య రాముడికి 2.5 కిలోల విల్లు
లక్నో: శ్రీరాముడు అనగానే గుర్తొచ్చే రూపం విల్లు బాణం ధరించిన నిండైన విగ్రహం. ఈ నెల 22న అయోధ్యలోని భవ్య మందిరంలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ట జరుగనుంది. ఆలయంలో కొలువుదీరే రామయ్యకు బహూకరించడానికి తమిళనాడు రాజధాని చెన్నైలో విల్లు, బాణాలు సిద్ధమవుతున్నాయి. ప్రధాన విగ్రహానికి ఈ విల్లు, బాణాలు అలంకరిస్తారు. 2.5 కిలోల బరువైన ఈ విల్లు తయారీకి ఇతర లోహాలతోపాటు దాదాపు 700 గ్రాముల 23 క్యారెట్ బంగారం ఉపయోగిస్తున్నట్లు అయోధ్యలోని అమావా రామ మందిర్ ట్రస్టీ శయన్ కునాల్ చెప్పారు. వాల్మీకి రామాయణంలో వర్ణించినట్లుగానే విల్లుతోపాటు బాణాలు తయారు చేయిస్తున్నట్లు తెలిపారు. రాముడు ఉపయోగించిన వేర్వేరు బాణాల వర్ణన వాల్మీకి రామాయణంలో ఉందన్నారు. చెన్నైలో సిద్ధమవుతున్న విల్లు, బాణాలు త్వరలో అయోధ్యకు చేరుకుంటున్నాయని వెల్లడించారు. ఈ నెల 19న శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టుకు వీటిని అందజేస్తామని చెప్పారు. అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ఏటా అయోధ్యకు దక్షిణ కొరియన్ల రాక! కారణం ఏంటంటే..
అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమాలు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఈ అద్భుతమైన ఘట్టాన్ని తిలకించడానికి దేశవిదేశాలను నుంచి రామ భక్తులు వస్తున్నట్లు తెలుస్తోంది. అయితే అయోధ్యకు ప్రతి ఏడాది వందల సంఖ్యలో దక్షిణ కొరియా దేశపు సందర్శకులు వస్తుంటారు. అయితే వారంతా వచ్చేది.. రామ జన్మభూమిని దర్శించుకోవడానికి వచ్చినవారు అయితే కాదు? మరి వారంతా అయోధ్యకు ఎందుకు వచ్చారో తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే... దక్షిణ కొరియాకు ఉత్తరప్రదేశ్‌లోని రాముడు పుట్టిన అయోధ్యకు ప్రత్యేకమైన సంబంధం ఉంది. అయితే ఈ సంబంధం రాముడితో కాదు. ప్రతి ఏటా వందల మంది దక్షిణ కొరియన్లు రాణి హు హ్వాంగ్ ఓకేకు నివాళులు అర్పించడానికి అయోధ్య నగరాన్ని సందర్శిస్తారు. అయోధ్యతో తమకు పూర్వకాలపు సంబంధాలు ఉన్నట్లు దక్షిణ కొరియన్లు నమ్ముతున్నారు. దక్షిణ కొరియా ఇతిహాసాల ప్రకారం.. రాణి సూరిరత్న అని పిలువబడే క్వీన్ హు హ్వాంగ్ ఓకే దక్షిణ కొరియాకు వెళ్లక ముందు అయోధ్య యువరాణి. క్రీ.శ 48లో కరక్ వంశానికి చెందిన రాజు కిమ్ సురోను వివాహం చేసుకున్నారని దక్షిణ కొరియన్లు నమ్ముతారు. డాక్టర్ ఉదయ్ డోక్రాస్ పరిశోధనా ప్రకారం సుంగుక్ యుసా రాజు అయిన సురో అయుత రాజ్యానికి చెందినవారని తెలుపుతోంది. అప్పటి ‘అయుత’నే ప్రస్తుత అయోధ్య అని వివరించబడింది. అయితే దక్షిణ కొరియా రాణి స్మరకం 2001లో అయోధ్యలో ప్రారంభించారు. 2015లో దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే-ఇన్ భారత్‌లో పర్యటించారు. ఆ సమయంలో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే ఇన్ రాణి స్మారకం విస్తరణ కోసం ఒప్పందం కుదుర్చుకున్నారు. అనంతరం రాణి హు హ్వాంగ్ ఓకే స్మారకాన్ని సుందరంగా తీర్చిదిద్ది 2022లో ప్రారంభించారు. ఇక రాణి హు హ్వాంగ్ ఓకే స్మారకంగా 2019లో భారత్ ప్రభుత్వం రూ. 25, రూ.5 పోస్టల్ స్టాంపులు విడుదల చేసింది. ఉత్తరప్రదేశ్ టూరిజం అధికారిక వెబ్సైట్ ప్రకారం.. కరక్ వంశానికి చెందిన 60 లక్షల మంది ప్రజలు అయోధ్యను తమ మాతృభూమిగా భావిస్తారని తెలుస్తోంది. చిన్న వయసులో రాణి సూరిరత్న పడవలో కొరియాకు చేరుకుందని, ఆమెకు 16 ఏళ్ల వయసులో వివాహం అయినట్లు కొరియా ప్రజలు నమ్ముతారని తెలుపుతోంది. మరోవైపు చైనా గ్రంథాల ప్రకారం.. అయోధ్యను పరిపాలించే రాజు తన 16 ఏళ్ల కూతురును దక్షిణ కొరియాకు చెందిన రాజు కిమ్ సూరోతో వివాహం జరిపించడానికి ఆమెను దక్షిణ కొరియాకు పంపాలని అతనికి కల వచ్చినట్లు ప్రచారంలో ఉంది. వారికి 10 మంది పిల్లలు పుట్టారని, వీరు 150 ఏళ్లు జీవించి ఉన్నారని చైనా గ్రంథాల్లో ప్రస్తావించినట్లు తెలుస్తోంది. అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2020లో దక్షిణ కొరియా రాయబారి బాంగ్ కిల్.. అయోధ్యకు కొరియాతో ప్రత్యేకమైన సంబంధాలు ఉన్నాయని అన్నారు. కొరియా పురాతన చరిత్ర గ్రంథాల్లో అయోధ్యకు చెందిన యువరాణి కొరియన్ రాజును వివాహం చేసుకున్నట్లు రాసి ఉందని తెలిపారు. రాజు కిమ్ సురో సమాధికి సంబంధించిన పురావస్తు పరిశోధనల్లో అయోధ్యకు చెందిన కళాఖండాలు బయటపడ్డాయనిపేర్కొన్నారు. View this post on Instagram A post shared by Uttar Pradesh Tourism (@uttarpradeshtourism) రాణి సూరిరత్న పార్క్ ప్రత్యేకతలు.. ►అయోధ్యలోని క్వీన్ హు హ్వాంగ్ ఓకే స్మారక పార్క్.. అయోధ్య నుంచి కొరియా వరకు యువరాణి సూరిరత్న ప్రయాణాన్ని కళ్లకుకట్టినట్లు ప్రతిబింబిస్తుంది. ►దక్షిణ కొరియా నుంచి రవాణా చేయబడిన రాతి నిర్మాణంపై పురాతన విషయాలు చెక్కారు. ►రూ. 21 కోట్ల రూపాయల బడ్జెట్‌తో సరయు నది ఒడ్డున ఈ పార్క్ నిర్మించారు. ►స్మారక చిహ్నం యొక్క ఆగ్నేయ దిశలో క్వీన్ హు హ్వాంగ్ ఓక్ విగ్రహం ఉంది. ►ఈశాన్య దిశలో రాజు కిమ్ సురో విగ్రహం ఏర్పాటు చేశారు. ►పార్కులో గ్రానైట్‌తో చేసిన గుడ్డు ఆకారం ఉంటుంది. యువరాణి సూరిరత్న కొరియాకు తన ప్రయాణంలో బంగారు గుడ్డును తీసుకువెళ్లిందని కొరియన్లు నమ్ముతారు. -
రామ మందిర ప్రతిష్టాపన.. ఆ మూడు రాష్ట్రాల్లో 'డ్రై డే'
లక్నో: అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం జనవరి 22న జరగనుంది. ఈ కార్యక్రమంలో రాముని విగ్రహాన్ని గర్భగుడిలో ప్రతిష్టించనున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో జరిగే ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానున్నారు. ఈ సందర్భంగా పవిత్రతను కాపాడే ప్రయత్నంలో ఛత్తీస్‌గఢ్, అసోం, ఉత్తరప్రదేశ్‌లో జనవరి 22న "డ్రై డే"గా ప్రకటించాయి. "డ్రై డే" అంటే మద్య పానీయాల అమ్మకాలు అనుమతించబడని రోజు. మద్యం దుకాణాలు మినహా, పబ్బులు, రెస్టారెంట్లు కూడా మద్య పానీయాలను విక్రయించబోరు. జనవరి 22ను జాతీయ పండుగలా జరుపుకుంటామని సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇప్పటికే స్పష్టం చేశారు. రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకు జనవరి 22న ఇప్పటికే సెలవు ప్రకటించారు. న్యూయార్క్‌లోని ఐకానిక్ టైమ్స్ స్క్వేర్ నుండి రామమందిరం ప్రారంభోత్సవం ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ఈ కార్యక్రమం భారతదేశంలోని వేలాది దేవాలయాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ భారతీయ రాయబార కార్యాలయాలు, కాన్సులేట్లలో ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది. అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి రామ మందిర ప్రారంభోత్సవానికి కాంగ్రెస్ దూరంగా ఉండనున్నట్లు చెప్పడంపై రాజకీయంగా దుమారం రేగుతోంది. రామాలయాన్ని బీజేపీ ఎన్నికల లబ్ది కోసం చేపడుతోందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. బీజేపీ రాజకీయ కార్యక్రమంగా నిర్వహిస్తోందని విమర్శిస్తోంది. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ దూరంగా ఉండటంపై బీజేపీ మండిపడింది. రాముని అస్తిత్వాన్నే నిరాకరిస్తున్నామని కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన కాంగ్రెస్ నుంచి ఇంకేం ఆశించగలమని దుయ్యబట్టింది. ఇదీ చదవండి: Ram Mandir: రాములోరికి 44 క్వింటాళ్ల లడ్డూల భోగం -
Ayodhya: 2,100 కిలోల గంట.. 108 అడుగుల అగరుబత్తి
న్యూఢిల్లీ: అయోధ్యలో నిర్మించిన భవ్యమందిరంలో కొలువుదీరబోతున్న బాల రాముడికి దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి అరుదైన కానుకలు వెల్లువెత్తుతున్నాయి. 108 అడుగుల పొడవైన అగరుబత్తి, 2,100 కిలోల బరువైన గంట, 1,100 కిలోల బరువైన భారీ ప్రమిద, బంగారు పాదుకలు, 10 అడుగుల ఎత్తయిన తాళం, తాళంచెవి, ఒకేసారి ఎనిమిది దేశాల సమయాన్ని సూచించే గడియారం తదితర ప్రత్యేక కానుకలను అయోధ్య రాముడికి సమరి్పంచేందుకు భక్తులు ఇప్పటికే సిద్ధమయ్యారు. ఈ నెల 22వ తేదీన రామ మందిరంలో రాముడి విగ్రహాన్ని ప్రతిష్టించబోతున్నారు. ఇందుకోసం ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. దేశ విదేశాల నుంచి బహుమతులు అందుతున్నాయి. సీతమ్మ పుట్టిన ఊరు జనక్‌పూర్ ప్రస్తుతం నేపాల్‌లో ఉంది. నేపాల్ నుంచి అయోధ్యకు వెండి చెప్పులు, బంగారు ఆభరణాల వంటి 3,000కుపైగా బహుమతులు వచ్చాయి. ఇక శ్రీలంకలోని అశోక్ వాటిక నుంచి తీసుకొచ్చిన ఒక అరుదైన రాయిని అక్కడి ప్రతినిధులు అయోధ్యలో అందజేశారు. అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7,000 కిలోల ‘రామ్ హల్వా’ అయోధ్యలో ప్రాణప్రతిష్ట కోసం గుజరాత్ భక్తులు 44 అడుగుల పొడవైన ఇత్తడి జెండా స్తంభాన్ని పంపిస్తున్నారు. మహారాష్ట్రకు విష్ణు మనోహర్ అనే వంట మాస్టర్ 7,000 కిలోల ‘రామ్ హల్వా’ తయారు చేసి అయోధ్యలో భక్తులకు పంపిణీ చేస్తారు. శ్రీకృష్ణ జన్మస్థాన్ సేవా సంస్థాన్ 200 కిలోల భారీ లడ్డూ తయారీలో నిమగ్నమైంది. అయోధ్యకు లక్ష లడ్డూలు పంపిస్తామని తిరుమతి తిరుపతి దేవస్థానం(టీటీడీ) ప్రకటించడం తెలిసిందే. సీతమ్మ కోసం సూరత్‌లో ప్రత్యేకంగా చీర తయారు చేస్తున్నారు. సూరత్‌కు చెందిన ఓ వజ్రాల వ్యాపారి 2 కిలోల వెండి, 5,000 అమెరికన్ వజ్రాలతో కూడిన నెక్లెస్ రాముడికి బహూకరించబోతున్నారు. ఇది కూడా చదవండి: అయోధ్యాపురిలో నూతన రామాలయ వైభవమిదే.. -
రామాలయ ప్రారంభోత్సవానికి... ఖర్గే, సోనియా దూరం
సాక్షి, న్యూఢిల్లీ: అయోధ్యలో జనవరి 22న జరిగే రామాలయ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి దూరంగా ఉండాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్ర నేత సోనియాగాం«దీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత అ«దీర్ రంజన్ చౌదరి నిర్ణయించుకున్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ బుధవారం ఈ మేరకు వెల్లడించారు. కేవలం లోక్‌సభ ఎన్నికల్లో లబ్ధి కోసం బీజేపీ, ఆరెసెŠస్స్ కలిసి రామ మందిరాన్ని రాజకీయ ప్రాజెక్టుగా మార్చాయని విమర్శించారు. అందుకే అసంపూర్తి ఆలయాన్ని హడావుడిగా ప్రారంభిస్తున్నారని ఆరోపించారు. ఖర్గే, సోనియా, అ«దీర్‌లను రామ మంది ట్రస్టు, వీహెచ్‌పీ నేతలు డిసెంబర్లో కలిసి రామ మందిర ప్రారం¿ోత్సవానికి రావాలంటూ వ్యక్తిగతంగా ఆహా్వన లేఖలు అందించారు. కానీ అది ఫక్తు ఆరెస్సెస్, బీజేపీ రాజకీయ సంరంభమని జైరాం విమర్శించారు. ‘‘కోట్లాది మంది భారతీయులు రాముడిని పూజిస్తారు. మతం మనిషి వ్యక్తిగత విషయం. అందుకే రామున్ని పూజించే కోట్లాది మంది సెంటిమెంట్లను గౌరవిస్తూనే ఆహా్వనాన్ని నేతలు సున్నితంగా తిరస్కరించారు’’ అన్నారు. వారిని ప్రజలు బాయ్‌కాట్ చేస్తారు కాంగ్రెస్ నిర్ణయాన్ని బీజేపీ దుయ్యబట్టింది. రాముని అస్తిత్వాన్నే నిరాకరిస్తున్నామంటూ సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన పార్టీ నుంచి ఇంకేం ఆశించగలమని ఎద్దేవా చేసింది. హిందూ మతాన్ని, హిందువులను అవమానించడం కాంగ్రెస్‌కు, విపక్ష ఇండియా కూటమి పక్షాలకు కొత్తేమీ కాదంటూ మండిపడింది. రామునిపై నమ్మకం లేదని సోనియా మరోసారి నిరూపించుకున్నారని కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ విమర్శించారు. వారిని దేశ ప్రజలు బాయ్‌కాట్ చేస్తారని మరో మంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు. -
ఇనుమూ లేదు.. సిమెంటూ లేదు.. రామాలయం ఎలా నిర్మించారు?
దశాబ్దాలుగా గుడారంలో నివసించిన రామ్‌లల్లా నూతన రామాలయంలో జనవరి 22న ప్రతిష్ఠితుడు కానున్నాడు. ఈ నూతన రామాలయాన్ని అత్యంత సుందరంగా, అంతకుమించిన వైభవోపేతంగా నిర్మించారు. అయితే ఈ రామాలయ నిర్మాణంలో ఇనుము, సిమెంట్ అస్సలు ఉపయోగించేలేదంటే మీరు నమ్ముతారా? అవి లేకుండా ఇంత భారీ ఆలయం ఎలా రూపుదిద్దుకుందనే ప్రశ్న మీలో తలెత్తే ఉంటుంది. దానికి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. అయోధ్యలోని రామాలయం ప్రత్యేకమైన రాళ్లతో నిర్మితమయ్యింది. దీని నిర్మాణంలో ఉపయోగించే ప్రతి రాయికి ఒక గాడిని తయారు చేసి.. అదే చోట మరో రాయి అమరిపోయేలా ఆ గాడిలో అమర్చారు. ఈ విధంగా రామ మందిరంలో ఉపయోగించే రాళ్లన్నీ సిమెంట్ లేకుండా ఒకదానితో ఒకటి అనుసంధానమయ్యాయి. ఆలయ ప్రధాన నిర్మాణం రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లోని బన్సీ పహర్‌పూర్ నుండి తెచ్చిన గులాబీ రాయితో నిర్మితమయ్యింది. ఈ గులాబీ రాయి బలంగా ఉండటమే కాకుండా దీర్ఘకాలం మన్నిక కలిగి ఉంటుంది. ఈ రాళ్లతో ఆలయం అంతటినీ నిర్మించారు. ఎక్కడా కూడా ఇనుము, సిమెంటు ఉపయోగించలేదు. ఆలయ నిర్మాణ పునాదిలో కూడా ఇనుము, సిమెంట్ లేదా ఉక్కు ఉపయోగించలేదు. ఆలయ నిర్మాణం గురించి శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ మాట్లాడుతూ ఆలయ పునాదుల కోసం భూసార పరీక్షలు ప్రారంభించినప్పుడు, ఆ ప్రదేశంలో వదులుగా ఉన్న ఇసుక మాత్రమే ఉందని, అది పునాదికి ఏమాత్రం అనువైనది కాదని తేలిందన్నారు. దీంతో ఆలయ నిర్మాణ పనులు చేపట్టిన లార్సెన్ అండ్ టూబ్రో (ఎల్ అండ్ టీ)కంపెనీ, ఐఐటీ ఢిల్లీ, గౌహతి, చెన్నై, రూర్కీ, బాంబే, సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (సీబీఆర్ఐ) నిపుణులు సంయుక్తంగా నేషనల్ జియోఫిజికల్ సర్వే పరిశోధనా సంస్థల (ఎన్జీఆర్ఐ)టాప్ డైరెక్టర్లు సహాయం కోరారు. 2020లో ఈ అంశంపై నిపుణుల మధ్య చర్చ జరిగింది. దీని తర్వాత అయోధ్యలోని ఆరు ఎకరాల ఆలయ భూమిలో 14 మీటర్ల లోతు వరకు ఇసుకను తొలగించారు. దీని తరువాత పునాది కోసం రాళ్లను సిద్ధం చేయడానికి, ఖాళీ స్థలంలో ‘రోల్డ్ కాంపాక్ట్ కాంక్రీట్’ అనే ప్రత్యేక రకమైన కాంక్రీట్ మిశ్రమాన్ని 56 పొరలతో నింపారు. ఈ కాంక్రీటు ఆ తరువాత రాయిగా మారుతుంది. ఇనుమును ఉపయోగించకుండా ఈ ప్రత్యేక కాంక్రీటును పునాది కోసం వినియోగించారు. ఈ విధంగా ఆలయ పునాది ఇనుము, సిమెంట్ లేకుండా నిర్మితమయ్యింది. అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి మిగిలిన ఆలయం నిర్మాణమంతా రాజస్థాన్‌లోని భరత్పూర్ నుండి తీసుకువచ్చిన గులాబీ ఇసుకరాయితో కొనసాగింది. అయితే 21 అడుగుల ఎత్తయిన ప్లాట్‌ఫారమ్‌ను నిర్మించడానికి కర్ణాటక, తెలంగాణ నుండి తెచ్చిన గ్రానైట్ ఉపయోగించారు. నిర్మాణంలో ఉన్న రామ మందిరంలో ఒక్క గ్రాము ఇనుము కూడా ఉపయోగించలేదు. దీనికి కారణం రామ మందిరాన్ని నాగర్ సాంప్రదాయ పద్ధతిలో నిర్మించడమే. ఈ శైలిలో ఇనుమును వినియోగించనవసరం లేదు. ఉత్తర భారత హిందూ వాస్తుశిల్పంలోని మూడు శైలులలో నాగర్ శైలి ఒకటి. ఖజురహో, సోమనాథ్, కోణార్క్ సూర్య దేవాలయాలు నాగర్ శైలిలోనే నిర్మితమయ్యాయి. ఇప్పటికి అయోధ్యలో రామాలయం మొదటి అంతస్తు నిర్మాణం పూర్తయ్యింది. జనవరి 22న ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఆలయాన్ని ప్రారంభించనున్నారు. అదే సమయంలో రామ్‌లల్లా విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. రామమందిర ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు రామమందిర ట్రస్టుతోపాటు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. ప్రపంచంలోని పలు దేశాల్లోని ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఇది కూడా చదవండి: రామాలయం కోసం 30 ఏళ్లుగా మౌనవత్రం! -
ఆ రోజు ప్రపంచ వ్యాప్తంగా ‘రామోత్సవం’
సాక్షి, న్యూఢిల్లీ: అయోధ్య రామాలయంలో శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ట రోజు ప్రపంచ వ్యాప్తంగా వేడుకలు జరగనున్నాయి. అమెరికా, బ్రిటన్ సహా 50కిపైగా దేశాల్లో ‘రామోత్సవం’నిర్వహించనున్నారు. ఆయా దేశాల్లో నివసిస్తున్న రామభక్తులు ఇప్పటికే కొన్ని దేశాల్లో శోభాయాత్రలకు కూడా శ్రీకారం చుట్టారు. విశ్వహిందూ పరిషత్ (విశ్వ విభాగం) ఆధ్వర్యంలో మరి కొన్ని దేశాల్లో భారీగా సన్నాహాలు జరుగుతున్నాయి. జనవరి 22న అమెరికాలో 300, జర్మనీలో 100, మారిషస్‌లో 100, కెనడా, ఆ్రస్టేలియాల్లో 30, బ్రిటన్‌లో 25 కార్యక్రమాలు నిర్వహించనున్నారు. హిందువులు తక్కువగా ఉన్న ఐర్లాండ్‌తో పాటు మరికొన్ని దేశాల్లో ఒక్కో కార్యక్రమం ఉంటుంది. ఇలా మొత్తం 50కి పైగా దేశాల్లో 500 పైగా ధారి్మక, వైదిక, సాంస్కృతిక పరమైన సామూహిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు విశ్వహిందూ పరిషత్ వర్గాలు తెలిపాయి. -
రామ మందిర ప్రతిష్టాపన వేళ.. సిజేరియన్లకు తల్లుల అభ్యర్థనలు
కాన్పూర్: అయోధ్యలోని రామ మందిరం పవిత్రోత్సవం సందర్భంగా జనవరి 22న సిజేరియన్ ప్రసవాలు చేయాలని పలువురు గర్భిణులు వైద్యులను అభ్యర్థిస్తున్నారు. అదే రోజు శిశువులకు జన్మనిచ్చేలా సిజేరియన్ చేయాలని 14 వ్రాతపూర్వక అభ్యర్థనలు అందాయని గణేష్ శంకర్ మెమోరియల్ మెడికల్ కాలేజీలో గైనకాలజీ విభాగానికి ఇన్‌చార్జీగా వ్యవహరిస్తున్న సీమా ద్వివేది తెలిపారు. తమ ఆస్పత్రిలో జనవరి 22న 35 సిజేరియన్ ఆపరేషన్లకు ఏర్పాట్లు జరుగుతున్నాయని పేర్కొన్నారు. తమ డెలివరీ తేదీలు కొన్ని రోజుల ముందు లేదా జనవరి 22 తర్వాత అయినప్పటికీ గర్భిణులు శుభ దినంగా పరిగణించి వైద్యులకు అభ్యర్థనలు చేశారని సీమా తెలిపారు. పూజారులు ఇచ్చిన ముహూర్తంలో డెలివరీ చేయాలని తల్లులు, కుటుంబ సభ్యులు ఒత్తిడి చేయడంతో తాను నిర్ణీత సమయంలో ఆపరేషన్ చేసిన వివిధ అనుభవాలను ఆమె వివరించారు. అలా చేయడం ద్వారా తల్లి, బిడ్డకు తలెత్తే సమస్యలను కుటుంబ సభ్యులు పట్టించుకోకపోవడంపై ఆందోళన కలిగిస్తోందని అన్నారు. రాముడు వీరత్వానికి, చిత్తశుద్ధికి, విధేయతకు ప్రతీక అని ప్రజలు నమ్ముతారు. అందుకే ఆలయంలో జరిగే ప్రాణ ప్రతిష్ఠ రోజున జన్మించిన శిశువులు కూడా అదే లక్షణాలను కలిగి ఉంటారని వారు నమ్ముతున్నట్లు సీమా ద్వివేది తెలిపారు. ఇదీ చదవండి: అయోధ్య రామునిపై పాట.. సింగర్‌ని అభినందించిన ప్రధాని మోదీ -
ప్రాణ ప్రతిష్ఠ అంటే ఏమిటి? ఎందుకంత విశిష్టత?
సనాతన ధర్మాన్ని విశ్వసించే హిందువులకు ఈ జనవరి చాలా ప్రత్యేకమైనది. ఈ నెల చారిత్రాత్మకం కానుంది. ఈ నెలలో అయోధ్యలోని నూతన రామాలయంలో బాలరాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది. హిందూధర్మంలోని ఆచారాల ప్రకారం ఏదైనా దేవాలయంలో దేవుని విగ్రహ ప్రతిష్ఠకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఆలయంలో విగ్రహాన్ని ప్రతిష్టించకుంటే దేవుని ఆరాధన అసంపూర్ణమవుతుందని అంటారు. అయోధ్యలోని నూతన రామాలయంలో జనవరి 22న రామ్‌లల్లా విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ జరగనుంది. అందుకే ప్రాణ ప్రతిష్ఠ అంటే ఏమిటి? ఇందులోని విశిష్టత ఏమిటనేది ఇప్పుడు తెలుసుకుందాం. సనాతన ధర్మంలో ప్రాణ ప్రతిష్టకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. విగ్రహ ప్రతిష్ఠాపన సమయంలో ప్రాణ ప్రతిష్ఠ తప్పనిసరిగా జరుగుతుంది. ఏదైనా విగ్రహ ప్రతిష్ఠాపన సమయంలో ఆ విగ్రహానికి జీవం పోసే విధానాన్నే ప్రాణ ప్రతిష్ఠ అంటారు. ‘ప్రాణ్’ అనే పదానికి ప్రాణశక్తి అని, ‘ప్రతిష్ఠ’ అంటే స్థాపన అని అర్థం. మొత్తంగా చూసుకుంటే ప్రాణ ప్రతిష్ఠ అంటే విగ్రహంలో ప్రాణశక్తిని స్థాపించడం లేదా దేవతను విగ్రహంలోకి ఆహ్వానించడం అని అర్థం. ప్రాణ ప్రతిష్టకు ముందు ఏ విగ్రహం కూడా పూజకు అర్హమైనదిగా పరిగణించరు. ప్రాణప్రతిష్ఠ ద్వారా విగ్రహంలోనికి ప్రాణశక్తిని ప్రవేశపెట్టి, దానిని ఆరాధనీయ దేవతా స్వరూపంగా మారుస్తారు. అప్పుడే ఆ విగ్రహం పూజకు అర్హమైనదవుతుంది. ప్రాణ ప్రతిష్ఠ అనంతరం విగ్రహ రూపంలో ఉన్న దేవతామూర్తులను ఆచార వ్యవహారాలతో మంత్రాలు జపిస్తూ పూజలు చేస్తారు. అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి ప్రతిష్ఠాపన తర్వాత భగవంతుడే ఆ విగ్రహంలో కొలువయ్యాడని చెబుతారు. అయితే ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి శుభ సమయం అనేది నిర్ణయిస్తారు. శుభ ముహూర్తాలు లేకుండా మొక్కుబడిగా ప్రాణ ప్రతిష్ఠ చేయడం తగదని పండితులు చెబుతుంటారు. ప్రాణప్రతిష్ఠ చేయడానికి ముందు ఆ విగ్రహానికి గంగాజలం లేదా వివిధ పవిత్ర నదుల నీటితో స్నానం చేయిస్తారు. ఆ తర్వాత విగ్రహాన్ని శుభ్రమైన వస్త్రంతో తుడిచి, నూతన వస్త్రాలు ధరింపజేస్తారు. అనంతరం ఆ విగ్రహాన్ని స్వచ్ఛమైన, శుభ్రమైన ప్రదేశంలో ఉంచి గంధంపూస్తారు. తరువాత బీజాక్షర మంత్రాలు పఠిస్తూ ఆ విగ్రహానికి ప్రాణప్రతిష్ఠగావిస్తారు. ఈ సమయంలో పంచోపచారాలు నిర్వహిస్తూ, పూజలు చేస్తారు. చివరిగా ఆ దేవతా స్వరూపానికి హారతి ఇస్తారు. ఇదే సమయంలో భగవంతునికి నైవేద్యం సమర్పిస్తారు. ఈ కార్యక్రమం పూర్తయ్యాక భక్తులకు ప్రసాదం పంపిణీ చేస్తారు. ఇది కూడా చదవండి: రామాలయం.. 1528 నుంచి నేటి వరకూ.. -
అయోధ్యాపురిలో నూతన రామాలయ వైభవమిదే..
శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అయోధ్యలోని నూతన రామాలయ విశేషాలను మీడియాకు వివరించింది. ఆలయ సముదాయంలోని అన్ని విశేషాలు మొదలు కొని శ్రీరాముని గర్భగుడి వరకు గల ఆలయ వైభవాన్ని ట్రస్ట్ సవివరంగా తెలియజేసింది. నూతన రామాలయం మూడు అంతస్తులతో నాగర్ శైలిలో నిర్మితమయ్యింది. ప్రధాన గర్భగుడిలో రామ్‌లల్లా విగ్రహం కొలువుదీరుతుంది. మొదటి అంతస్తులో శ్రీరామ దర్బారు ఉంటుంది. నూతన రామాలయంలో ఐదు మండపాలు (హాళ్లు) ఉంటాయి. అవి నృత్య మండపం, రంగ మండపం, సభా మండపం, ప్రార్థన, కీర్తనల మండపం. దేవతా మూర్తుల శిల్పాలను ఆలయ స్తంభాలు, గోడలపై తీర్చిదిద్దారు. సింహద్వారం నుండి ప్రవేశించే భక్తులు 32 మెట్ల ద్వారా ఆలయం లోనికి చేరుకుంటారు. ఆలయం చుట్టూ దీర్ఘచతురస్రాకార ప్రహరీగోడ ఉంటుంది. ఆలయంలో దివ్యాంగులు, వృద్ధ యాత్రికుల కోసం ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఆలయంలో ర్యాంప్‌లు, లిఫ్టులు ఏర్పాటు చేశారు. అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఆలయానికి సమీపంలో పురాతన కాలం నాటి చారిత్రక బావి (సీతా కూప) ఉంది. 25 వేల మంది యాత్రికులకు సరిపడేలా సౌకర్యాల కేంద్రం (పీఎఫ్సీ)నిర్మిస్తున్నారు. యాత్రికులకు వైద్య సదుపాయాలు, లాకర్ సౌకర్యాలు కల్పించనున్నామని ట్రస్ట్ తెలిపింది. ఇది కూడా చదవండి: Pran Pratishtha: ప్రాణ ప్రతిష్ఠ అంటే ఏమిటి? ఎందుకంత విశిష్టత? -
22న అయోధ్యలో డమరూ బృందం ప్రదర్శన
అయోధ్యలోని నూతన రామాలయంలో ఈనెల 22న బాలరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం వైభవంగా జరగనుంది. ఈ ఉత్సవంలో మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు చెందిన డమరూ బృందం పాల్గొననుంది. 108 మంది సభ్యుల డమరూ బృందం జనవరి 22న అయోధ్యలో ప్రదర్శన ఇవ్వనుంది. దేశంలో రామ భజన, రామ స్తుతి, శివ తాండవ స్తోత్రాన్ని పఠించే ఏకైక బృందంగా భోపాల్ డమరూ బృందం పేరుగాంచింది. జనవరి 22న అయోధ్యలో దేశ నలుమూలలకు చెందిన పలువురు కళాకారులు తమ ప్రదర్శనలు ఇవ్వనున్నారు. ఈ నేపధ్యంలోనే భోపాల్‌కు చెందిన డమరూ బృందం కూడా తమ ప్రదర్శనతో ఉర్రూతలూగించనుంది. భోపాల్‌లోని శ్రీ బాబా బటేశ్వర్ కీర్తన సమితికి అయోధ్య నుండి ఆహ్వానం అందింది. దీంతో జనవరి 22న రామభక్తులు ఆలయానికి వెళ్లే మార్గంలో శ్రీ బాబా బటేశ్వర్ కీర్తన సమితికి చెందిన డమరూ బృందం ప్రదర్శన ఇవ్వనుంది. అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి జనవరి 20న ఈ డమరూ బృందానికి చెందిన 108 మంది సభ్యులు అయోధ్యకు చేరుకుంటారు. అక్కడ వారు 21న రిహార్సల్ చేస్తారు. జనవరి 22న ప్రధాని నరేంద్ర మోదీ, ఇతర వీవీఐపీల సమక్షంలో వీరి ప్రదర్శన సాగనుంది. ఇది కూడా చదవండి: అయోధ్యాపురిలో నూతన రామాలయ వైభవమిదే.. -
యోగి ఆదిత్యనాథ్‌కు బాంబు బెదిరింపులు .. ఇద్దరి అరెస్టు
లక్నో: యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, అయోధ్య రామాలయంలపై బాంబు బెదిరింపులకు పాల్పడిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. బాంబులు వేసి యోగి ఆదిత్యనాథ్, అయోధ్యలోని రామాలయాన్ని పేల్చివేస్తామని బెదిరిస్తూ సోషల్ మీడియాలో నిందితులు పోస్ట్ చేశారని అధికారులు తెలిపారు. నిందితులను తాహర్ సింగ్, ఓంప్రకాష్ మిశ్రాలుగా యూపీ స్పెషల్ టాస్క్ ఫోర్స్(ఎస్టీఎఫ్) బృందం గుర్తించింది. నిందితులు లక్నోలో విభూతి ఖండ్ ప్రాంతానికి చెందినవారని వెల్లడించారు. ఆదిత్యనాథ్, ఎస్టీఎఫ్ చీఫ్ అమితాబ్ యాష్, అయోధ్యలోని రామమందిరాన్ని పేల్చేస్తామని బెదిరించారని పోలీసులు గుర్తించారు. బెదిరింపు పోస్టుల్లో నిందితులకు సంబంధించిన ఈమెయిల్ ఐడీలు ఉన్నట్లు తేలింది. ఈమెయిల్ ఐడీల సాంకేతిక విశ్లేషణ తర్వాత తాహర్ సింగ్ ఈమెయిల్ ఖాతాలను సృష్టించారని, ఓంప్రకాశ్ మిశ్రా బెదిరింపు సందేశాలు పంపారని తేలింది. నిందితులు ఇద్దరూ గోండా నివాసితులు. పారామెడికల్ ఇన్స్టిట్యూట్లో పనిచేస్తున్నారని అధికారులు తెలిపారు. ఈ కేసును ఎస్టీఎఫ్ మరింత లోతుగా విచారిస్తోంది. నిందితులే ఈ చర్యకు పాల్పడ్డారా? లేక దీని వెనక ఎవరైనా ఉన్నారా? అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు చెప్పారు. ఇదీ చదవండి: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్? ఆప్ నేతలు అలర్ట్! -
22న అయోధ్యలో వెలగనున్న భారీదీపం
అయోధ్యలోని నూతన రామాలయంలో జనవరి 22న బాలరాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది. ఇక అదే రోజున ఇక్కడి రామ్‌ఘాట్‌లోని తులసిబారి వద్ద అత్యంత భారీ దీపాన్ని వెలిగించనున్నారు. 28 మీటర్ల వ్యాసం కలిగిన ఈ దీపాన్ని వెలిగించడానికి 21 క్వింటాళ్ల నూనె పడుతుంది. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో ఈ దీపం ఘనతను నమోదు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. తులసిబారి దగ్గర వెలిగించనున్న ఈ దీపం పేరు దశరథ్ దీప్. ఈ దీపం తయారీలో చార్ధామ్తో పాటు పలు పుణ్యక్షేత్రాలలోని మట్టి, నదులు, సముద్ర జలాలను వినియోగిస్తున్నారు. తపస్వి కంటోన్మెంట్‌కు చెందిన స్వామి పరమహంస పలు గ్రంథాలు, పురాణాలను అధ్యయనం చేసి, త్రేతాయుగంనాటి దీపం ఆకారాన్ని సిద్ధం చేస్తున్నారు. అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఈ దీపం తయారీకి 108 మందితో కూడిన బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ దీపం తయారీకి ఏడున్నర కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారు. 1.25 క్వింటాళ్ల పత్తితో ఈ దీపానికి వినియోగించే వత్తిని సిద్ధం చేస్తున్నారు. ఇది కూడా చదవండి: 22న అయోధ్యలో డమరూ బృందం ప్రదర్శన -
430 నగరాల నుంచి అయోధ్యకు నేరుగా 72 రైళ్లు..
అయోధ్యలో జనవరి 22న శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠాపన జరగనుంది. అనంతరం అయోధ్యను సందర్శించేవారి సంఖ్య పెరిగే అవకాశాలున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని అయోధ్యకు వచ్చే భక్తులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించనున్నట్లు రైల్వేశాఖ తెలిపింది. అయోధ్య సందర్శనకు వచ్చే ప్రయాణికుల కోసం భారతీయ రైల్వే ప్రత్యేక ప్రణాళికను రూపొందించింది. ఏసీ మొదలుకొని స్లీపర్ క్లాస్, జనరల్ సౌకర్యాలతో కూడిన అన్ని రకాల రైళ్లు నడిపేందుకు సిద్ధమవుతోంది. అయోధ్య వైపు వెళ్లే రైళ్ల షెడ్యూల్ త్వరలో విడుదల కానున్నదని సమాచారం. ప్రస్తుతం అయోధ్యకు 35 రైళ్లు నడుస్తున్నాయి. రోజువారీ రైళ్లతో పాటు, వీక్లీ రైళ్లు కూడా ఇందులో ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న రైళ్లతో పాటు జనవరి 22 నుంచి 37 అదనపు రైళ్లను నడపనున్నారు. దీంతో దేశంలోని 430 నగరాల నుంచి మొత్తం 72 రైళ్లు అయోధ్యకు నడవనున్నాయి. దీని గురించి రైల్వే మంత్రిత్వ శాఖ సమాచార, ప్రచురణ డైరెక్టర్ శివాజీ మారుతీ సుతార్ మాట్లాడుతూ భక్తుల రాకను దృష్టిలో ఉంచుకుని అయోధ్యకు అదనపు రైళ్లను నడపనున్నట్లు తెలిపారు. మరిన్ని నగరాలను నేరుగా అయోధ్యకు అనుసంధానం చేసేందుకు రైల్వేశాఖ ప్రయత్నిస్తోందని అన్నారు. ఇది కూడా చదవండి: బాలరామునికి బొమ్మల బహుమానం -
రామాలయ ప్రాంగణంలో ప్రత్యేక ఆలయాలివే..
శ్రీరామ జన్మభూమి అయోధ్యలోని నూతన రామాలయంలో బాలరాముడు జనవరి 22న కొలువుదీరనున్నాడు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఆహ్వానపత్రికలను ప్రముఖులకు అందజేస్తున్నారు. అయితే సామాన్యులు జనవరి 22 తరువాత ఆలయాన్ని సందర్శించుకోవాలని రామజన్మభూమి ఆలయట్రస్ట్ కోరింది. జనం రద్దీని నివారించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. నూతన రామాలయం ప్రాంగణంలో పలు ఇతర ఆలయాలు కూడా ఉండనున్నాయని రామాలయ ట్రస్టు తెలిపింది. వీటిలో మహర్షులు వాల్మీకి, వశిష్ఠుడు, విశ్వామిత్ర,అగస్త్యుడు, శబరి, అహల్య ఆలయాలు ముఖ్యమైనవి. దీంతో పాటు నైరుతి భాగంలో నవరత్న కుబేరుడు కొలువుదీరనున్నాడు. గుట్టపై ఉన్న శివాలయాన్ని పునరుద్ధరించి అక్కడ రామభక్తుడు జటాయురాజు విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయనున్నారు. అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి అయోధ్యలో ఉన్న రామ మందిర సముదాయాన్ని ఉత్తరప్రదేశ్ పోలీసు ఎస్టీఎఫ్ పర్యవేక్షించనుంది . 70 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ఆలయాన్ని జనవరి 22న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ఇది కూడా చదవండి: 22న అయోధ్యలో వెలగనున్న భారీ దీపం -
శ్రీరాముని సేవలో ట్రిపుల్ తలాక్ బాధితులు
శ్రీరాముని సేవకు మతం అడ్డుకాదని నిరూపిస్తున్నారు ట్రిపుల్ తలాక్ బాధితులు. వీరంతా జనవరి 26 తర్వాత రామ్‌లల్లాను దర్శించుకునేందుకు అయోధ్యకు తరలివస్తున్నారు. వీరు తమ చేతులతో నేసిన దుస్తులను శ్రీరామునికి అందించనున్నారు. ట్రిపుల్ తలాక్‌కు వ్యతిరేకంగా గళం విప్పిన యూపీకి చెందిన మేరా హక్ ఫౌండేషన్ ప్రెసిడెంట్ ఫర్హత్ నఖ్వీ నేతృత్వంలో ముస్లిం మహిళలు రామాలయ నిర్మాణానికి సహకరించాలని ప్రచారం చేస్తూ నిధులు సేకరిస్తున్నారు. బరేలీ, బదౌన్, రాంపూర్, మొరాదాబాద్, మీరట్, ప్రయాగ్‌రాజ్ సహా 30 జిల్లాల నుంచి మహిళలు విరాళాలు సేకరిస్తున్నారు. ఈ నిధులను రామమందిరం ట్రస్టుకు అప్పగిస్తానని ఫర్హత్ తెలిపారు. ట్రస్టు నుంచి అనుమతి లభిస్తే ఏటా తమ చేతులతో శ్రీరామునికి దుస్తులు సిద్ధం చేస్తామని ఆ ముస్లిం మహిళలు చెబుతున్నారు. వీరంతా తమ స్వహస్తాలతో జరీ జర్దోసీ వర్క్ చేస్తుంటారు. కాగా ఇటీవల యూపీలోని 27 జిల్లాలకు చెందిన వేల మంది ముస్లింలు నూతన రామాలయానికి విరాళాలు అందించారు. -
రాముణ్ణి చెక్కిన చేతులు
ఎంబిఏ చేసిన అరుణ్ యోగిరాజ్ కొన్నాళ్లు కార్పొరేట్ సంస్థలో ఉద్యోగం చేశాడు.కాని అనువంశికంగా వస్తున్న కళ అతనిలో ఉంది.నా చేతులున్నది శిల్పాలు చెక్కడానికిగాని కీబోర్డు నొక్కడానికి కాదని ఉద్యోగం మానేశాడు.2008 నుంచి అతను చేస్తున్న సాధన ఇవాళ దేశంలోనే గొప్ప శిల్పిగా మార్చింది. అంతే కాదు ‘బాల రాముడి’ విగ్రహాన్ని చెక్కి అయోధ్య ప్రతిష్ఠాపన వరకూ తీసుకెళ్లింది.తమలో ఏ ప్రతిభ ఉందో యువతా, తమ పిల్లల్లో ఏ నైపుణ్యం ఉందో తల్లిదండ్రులు తెలుసుకోవాలనడానికి ఉదాహరణ అరుణ్. జనవరి 22న అయోధ్యలో అంగరంగ వైభవంగా జరగనున్న రామమందిర ప్రారంభోత్సవంలో ఒక్కో విశేషం తెలుస్తూ వస్తోంది.ప్రాణప్రతిష్ఠ జరగనున్న విగ్రహాల్లో ‘బాల రాముడి’ విగ్రహం సమర్పించే గొప్ప అవకాశం మైసూరుకు చెందిన 40 ఏళ్ల శిల్పి అరుణ్ యోగిరాజ్‌కు దక్కింది. కర్ణాటకకు చెందిన బీజేపీ పెద్దలు ఈ విషయాన్ని తెలియచేసి హర్షం వ్యక్తం చేశారు. అయితే ఇంకా అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది. అయోధ్య రామమందిరంలో ‘బాల రాముడి’ విగ్రహం ప్రతిష్ట కోసం శిల్పం తయారు చేయమని దేశంలో ముగ్గురు శిల్పులకు శ్రీ రామజన్మభూమి తీర్థ్‌క్షేత్ర ట్రస్ట్ బాధ్యత అప్పజెప్పింది. వారిలో ఒకరు అరుణ్ యోగిరాజ్. ఇతని కుటుంబం ఐదు తరాలుగా శిల్ప కళలో పేరు గడించింది. అరుణ్ తండ్రి యోగిరాజ్, తాత బసవణ్ణ శిల్పులుగా కర్ణాటకలో పేరు గడించారు. అయితే అరుణ్ ఈ కళను నేర్చుకున్నా అందరిలాగే కార్పొరేట్ ఉద్యోగం వైపు దృష్టి నిలిపాడు. కాని రక్తంలో ఉన్న శిల్పకళే మళ్లీ అతణ్ణి తనవైపు లాక్కుంది. 2008 నుంచి శిల్పాలు తయారు చేస్తున్న అరుణ్ ఇప్పటికే అనేకచోట్ల శిల్పాలు స్థాపించి తన ప్రతిభ నిరూపించుకున్నాడు. అరుణ్ తయారు చేసిన శిల్పాల్లో కేదార్‌నాథ్‌లోని ఆది శంకరాచార్య విగ్రహంతో మొదలు మైసూరులోని ఆర్.కె.లక్ష్మణ్ విగ్రహం వరకూ ఉన్నాయి. మైసూర్ రైల్వే స్టేషన్లో ‘లైఫ్ ఈజ్ ఏ జర్నీ’ పేరుతో ఒక కుటుంబం లగేజ్‌తో ఉన్న శిల్పాలు ప్రతిష్టించి అందరి దృష్టినీ ఆకర్షించాడు అరుణ్. అలా రాముడి విగ్రహం చెక్కే అవకాశం ΄÷ందే వరకూ ఎదిగాడు. 51 అంగుళాల విగ్రహం అరుణ్ చెక్కిన బాల రాముడి విగ్రహం శిరస్సు నుంచి పాదాల వరకు 51 అంగుళాల ఎత్తు ఉంటుంది. అరుణ్ భార్య విజేత వివరాలు తెలియచేస్తూ ‘అరుణ్‌కి ఈ బాధ్యత అప్పజెప్పాక శిల్ప ఆకృతి గురించి అతడు ఎంతో పరిశోధించాల్సి వచ్చింది. దానికి కారణం బాల రాముడి విగ్రహం ఇలా ఉంటుందనడానికి ఎలాంటి రిఫరెన్స్ లేక΄ోవడమే. అందుకని అరుణ్ పురాణాల అధ్యయనంతో పాటు రాముడి వేషం కట్టిన దాదాపు 2000 మంది బాలల ఫొటోలు పరిశీలించాడు’ అని తెలిపింది. ఈ విగ్రహం కోసం ట్రస్ట్ శిలను అందించింది అరుణ్‌కు. ‘మామూలు గ్రానైట్ కంటే ఈ శిల దృఢంగా ఉంది. చెక్కడం సవాలుగా మారింది. అయినప్పటికీ తనకు వచ్చిన అవకాశం ఎంత విలువైనదో గ్రహించిన అరుణ్ రేయింబవళ్లు శిల్పాన్ని చెక్కి తన బాధ్యత నిర్వర్తించాడు’ అని తెలిపింది విజేత. అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి తల్లి ఆనందం కుమారుడు చెక్కిన శిల్పం రామ మందిరంలోప్రాణప్రతిష్ఠ చేసుకోనుందన్న వార్త విన్న అరుణ్ తల్లి ఆనందంతో తబ్బిబ్బవుతోంది. మరణించిన భర్తను తలచుకొని ఉద్వేగపడుతోంది. ‘అరుణ్ వాళ్ల నాన్న దగ్గరే శిల్పం చెక్కడం నేర్చుకున్నాడు. వాళ్ల నాన్న పేరు నిలబెడుతున్నాడు’ అంది. తల్లిదండ్రులు తెలుసుకోవాలి తల్లిదండ్రులు పిల్లల బాగు కోరుతారు. అయితే అన్నీ తాము ఆదేశించినట్టుగా పిల్లలు నడుచుకోవాలన్న «ధోరణి కూడా సరి కాదు. పిల్లలు తమకు ఇష్టమైన చదువులు చదవాలనుకుంటే ఎందుకు ఆ కోరిక కోరుతున్నారో పరిశీలించాలి. కళాత్మక నైపుణ్యాలుండి ఆ వైపు శిక్షణ తీసుకుంటామంటే వాటి బాగోగుల గురించి కనీసం ఆలోచించాలి. కఠినమైన చదువులకు అందరు పిల్లలూ పనికి రారు. రాని చదువును తప్పక చదవాల్సిందేనని హాస్టళ్లల్లో వేసి బాధించి ఇవాళ చూస్తున్న కొన్ని దుర్ఘటనలకు కారణం కారాదు. ఐశ్వర్యంతో జీవించడానికి కొన్నే మార్గాలు ఉండొచ్చు. కాని ఆనందంగా జీవించడానికి లక్షమార్గాలు. పిల్లల ఆనందమయ జీవితం కోసం చిన్నారుల ఆలోచనలను కూడా వినక తప్పదు. ఇది కూడా చదవండి: రామాలయ ప్రాంగణంలో ప్రత్యేక ఆలయాలివే.. -
రామ మందిర ప్రతిష్టాపనా ఆహ్వానం: మాజీ క్రికెటర్ భావోద్వేగం
"India's Greatest Moment...": టీమిండియా మాజీ పేసర్ వెంకటేశ్ ప్రసాద్ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు. దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఘట్టంలో తాను భాగం కాబోతున్నానంటూ హర్షం వ్యక్తం చేశాడు. జీవితకాలంలో తనకు దక్కిన గొప్ప అదృష్టం ఇదేనంటూ మురిసిపోతున్నాడు. ఇందుకు గల కారణం ఏమిటంటే.. దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న అపూర్వ ఘట్టానికి జనవరి 22న ముహూర్తం ఖరారైన విషయం తెలిసిందే. ఉత్తరప్రదేశ్‌లో గల ఆధ్యాత్మిక నగరి అయోధ్యలో నిర్మించిన ఆలయంలో మర్యాద పురుషోత్తముడు శ్రీరాముడి విగ్రహ ప్రతిష్టాపన ఆరోజే జరుగనుంది. మధ్యాహ్నం 12.20 నిమిషాలకు భవ్య రామ మందిరంలో శ్రీరాముడు కొలువుదీరనున్నాడు. ఇంటింటా రామజ్యోతి.. ఈ నేపథ్యంలో జనవరి 22న ఇంటింటా శ్రీరామజ్యోతి వెలిగించాలని ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే పిలుపునిచ్చారు. అదే విధంగా.. ఆలయ ట్రస్టు అక్షతల పంపిణీకి ఏర్పాట్లు చేయడంతో పాటు.. ప్రతిష్టాపన కార్యక్రమ ఆహ్వానితులకు పిలుపులు అందజేస్తోంది. ఆహ్వానం అందింది ఆ ఆహ్వానితుల జాబితాలో వెంకటేశ్ ప్రసాద్ పేరు కూడా ఉంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తూ ఉద్వేగానికి లోనయ్యాడు ఈ మాజీ ఫాస్ట్ బౌలర్. ‘‘రామ మందిర ప్రతిష్టాపన చూడాలనేది నా జీవితాశయం. ఆ అద్భుతమైన క్షణం రానే వచ్చింది. జనవరి 22న కేవలం ప్రతిష్టాపనను చూడటం మాత్రమే కాదు.. అక్కడికి వెళ్లి ఆ దేవుడి ఆశీసులు తీసుకునే గొప్ప అవకాశం దక్కింది. భారతదేశ చరిత్రలోని గొప్ప క్షణంలో భాగమయ్యే వరం. ఆహ్వానం అందించినందుకు ధన్యవాదాలు. జై శ్రీరాం’’ అని వెంకటేశ్ ప్రసాద్ ఎక్స్ వేదికగా తన ఆనందాన్ని పంచుకున్నాడు. అదే విధంగా.. రామ మందిరంలో శ్రీరాముడి ప్రతిష్టాపన సందర్భంగా.. తాను ఆహ్వానం అందుకుంటున్న ఫొటోను ఇందుకు జతచేశాడు. కాగా టీమిండియా తరఫున 33 టెస్టులు, 161 వన్డేలు ఆడిన కర్ణాటక బౌలర్ వెంకటేశ్ ప్రసాద్ ఆయా ఫార్మాట్లలో వరుసగా 96, 196 వికెట్లు పడగొట్టాడు. చదవండి: కెప్టెన్‌గా అజింక్య రహానే.. పృథ్వీ షాకు నో ఛాన్స్.. కారణమిదే It was a hope and a desire, that in my lifetime Ram Mandir consecration happens. And what a moment, not only is the consecration happening on 22nd January, but have the great fortune and blessings to be able to attend India’s greatest moment in my lifetime. Thank you for the… pic.twitter.com/Sq1bjEZUxE — Venkatesh Prasad (@venkateshprasad) January 2, 2024 -
అయోధ్యలో కొలువుదీరే శ్రీరాముని విగ్రహం ఇదే!
అయోధ్యలోని నూతన రామాలయంలో జనవరి 22న కొలువుదీరనున్న రాముని విగ్రహం ఖరారయ్యింది. కర్ణాటకకు చెందిన శిల్పి అరుణ్ యోగిరాజ్ తీర్చిదిద్దిన విగ్రహాన్ని ఎంపిక చేశారు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి సోషల్ మీడియా ప్లాట్ఫారం ఎక్స్‌లో ఇలా రాశారు.. ‘రాముడు ఎక్కడ ఉంటాడో, అక్కడ హనుమంతుడు ఉంటాడు. అయోధ్యలో శ్రీరాముని ప్రతిష్ఠాపన కోసం విగ్రహాన్ని ఎంపిక చేశారు. మన దేశపు ప్రఖ్యాత శిల్పి అరుణ్ యోగిరాజ్ తయారు చేసిన రాముని విగ్రహాన్ని అయోధ్యలో ప్రతిష్ఠించనున్నారు. రాముడు, హనుమంతునికి మధ్యనున్న అవినాభావ సంబంధానికి ఇది మరొక ఉదాహరణ. హనుమంతుని జన్మభూమి అయిన కర్ణాటక నుంచే శ్రీరామునికి సేవా కార్యం జరిగినదనడంలో సందేహం లేదు’ అని పేర్కొన్నారు. అయోధ్య రామాలయ ట్రస్ట్ నేపాల్‌లోని గండకీ నదితో పాటు కర్ణాటక, రాజస్థాన్, ఒరిస్సా నుండి శ్రీరాముని విగ్రహ రూపకల్పనకు మొత్తం 12 నాణ్యమైన రాళ్లను సేకరించింది. ఈ రాళ్లన్నింటినీ పరీక్షించగా కేవలం రాజస్థాన్, కర్ణాటక రాళ్లే విగ్రహాల తయారీకి అనువుగా ఉన్నట్లు గుర్తించారు. కర్ణాటకలో లభించిన శ్యామ శిల, రాజస్థాన్‌లోని మక్రానాకు చెందిన మార్బుల్ రాక్లను ఎంపిక చేశారు. మక్రానా రాయి ఎంతో విశిష్టమైనది. అలాగే కర్నాటకలోని శ్యామ శిల.. శిల్పాలు చెక్కేందుకు అనువుగా ఉంటుంది. ఈ రాళ్ళు నీటి నిరోధకతను కలిగి ఉంటాయి. సుదీర్ఘ జీవితకాలాన్ని కూడా కలిగి ఉంటాయి. ప్రఖ్యాత శిల్పి యోగిరాజ్ శిల్పి కుమారుడు అరుణ్ యోగిరాజ్(37) ఎంబీఏ పూర్తిచేశారు. ఇతను యోగిరాజ్ కుటుంబంలో ఐదో తరం శిల్పి. అరుణ్ యోగిరాజ్ 2008లో ఉద్యోగం మానేసి, పూర్తిస్థాయి శిల్పకారునిగా మారారు. అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి అరుణ్ యోగిరాజ్.. మహారాజా జయచామరాజేంద్ర వడయార్‌తో సహా అనేక ప్రముఖుల విగ్రహాలను తయారు చేశారు. కేదార్‌నాథ్‌లో స్థాపించిన ఆదిశంకరాచార్య విగ్రహాన్ని రూపొందించారు. అలాగే మైసూరులో మహారాజా శ్రీకృష్ణరాజ వడయార్-IV, స్వామి రామకృష్ణ పరమహంస పాలరాతి విగ్రహం మొదలైనవి తీర్చిదిద్దారు. ఇండియా గేట్ దగ్గర కనిపించే నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహం కూడా అరుణ్ యోగిరాజ్ రూపొందించినదే! "ಎಲ್ಲಿ ರಾಮನೋ ಅಲ್ಲಿ ಹನುಮನು" ಅಯೋಧ್ಯೆಯಲ್ಲಿ ಶ್ರೀರಾಮನ ಪ್ರಾಣ ಪ್ರತಿಷ್ಠಾಪನಾ ಕಾರ್ಯಕ್ಕೆ ವಿಗ್ರಹ ಆಯ್ಕೆ ಅಂತಿಮಗೊಂಡಿದೆ. ನಮ್ಮ ನಾಡಿನ ಹೆಸರಾಂತ ಶಿಲ್ಪಿ ನಮ್ಮ ಹೆಮ್ಮೆಯ ಶ್ರೀ @yogiraj_arun ಅವರು ಕೆತ್ತಿರುವ ಶ್ರೀರಾಮನ ವಿಗ್ರಹ ಪುಣ್ಯಭೂಮಿ ಅಯೋಧ್ಯೆಯಲ್ಲಿ ಪ್ರತಿಷ್ಠಾಪನೆಗೊಳ್ಳಲಿದೆ. ರಾಮ ಹನುಮರ ಅವಿನಾಭಾವ ಸಂಬಂಧಕ್ಕೆ ಇದು… pic.twitter.com/VQdxAbQw3Q — Pralhad Joshi (@JoshiPralhad) January 1, 2024 -
మీ పేరులోనే ‘సీతారాం’ ఉందని పిలుస్తారేమో కామ్రేడ్!
మీ పేరులోనే ‘సీతారాం’ ఉందని పిలుస్తారేమో కామ్రేడ్! -
భాగ్య నగరి నుంచి... ఆయోధ్యా పురికి!
హైదరాబాద్: అయోధ్యలో రామాలయ నిర్మాణం ప్రతిష్టాత్మకంగా జరుగుతోంది. యావత్ దేశం ఇందులో పాలు పంచుకుంటోంది. అయోధ్య రాముని ఆలయానికి తలుపులు హైదరాబాద్‌లోనే తయారవుతున్నాయి. హైదరాబాద్‌కు చెందిన సంస్థే ఈ పనిని చేపట్టింది. గర్భగుడి తలుపులతో పాటు ప్రధాన ఆలయం చుట్టూ ఉన్న అన్ని తలుపులను రూపొందిస్తోంది. హైదరాబాద్‌కు చెందిన అనురాధ టింబర్ డిపో ఆలయ తలుపులను సిద్ధం చేస్తోంది. గత ఏడాది జూన్ నుంచి ఈ పనులను ప్రారంభించారు. ప్రస్తుతం చివరి దశలో ఉన్నాయి. సంస్థ డైరెక్టర్ శరత్ బాబు మాట్లాడుతూ.. గర్భగుడి తలుపు 5 ఏళ్ల రాముడి విగ్రహాన్ని కలిగి ఉంటుందని తెలిపారు. తలుపులు 8 అడుగుల పొడవు,12 అడుగుల వెడల్పు, ఆరు అంగుళాల మందంతో బలంగా ఉంటాయని పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఆలయం చుట్టూ 100 ఫ్రేమ్‌లను ఏర్పాటు చేశామని వెల్లడించారు. 118 తలుపులు పూర్తి చేశామని స్పష్టం చేశారు. ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని ఆయన చెప్పారు. అయోధ్య రామాలయ తలుపులు తమిళనాడుకు చెందిన హస్తకళాకారులు నిర్మించారు. తామర, నెమళ్లు సంప్రదాయ భారతీయ సాంస్కృతిక చిహ్నాలతో నగారా శైలిలో తయారు చేశారు. నగారా అనేది ఉత్తర భారతీయ ఆలయ నిర్మాణ శైలి. ఇది గుప్తుల కాలంలో మూడవ శతాబ్దంలో ప్రారంభమై ముస్లింల ఆగమనం వరకు కొనసాగింది. తలుపులకు మహారాష్ట్రకు చెందిన బలార్షా టేకు చెక్కను ఉపయోగించారు. ఈ చెక్క భాగం బంగారు రేకుతో కప్పబడి ఉంటుంది. రామాలయ తలుపులు నిర్మించడానికి దేశంలో ప్రధాన సంస్థలకు ఆలయ కమిటీ ఆహ్వానించింది. ఇందులో హైదరాబాద్‌కు చెందిన సంస్థకే ఈ పనిని అప్పగించారు. జనవరి 22న ఆలయ ప్రారంభోత్సవం జరగనుంది. ఆలయ మొదటి అంతస్తు వరకు నిర్మాణం పూర్తైంది. ప్రస్తుతం అలంకరణల పని జరుగుతోంది. ఇదీ చదవండి: 'రామాలయ ప్రారంభోత్సవానికి ఆహ్వానం అందలేదు' -
Ayodhya Ram Mandi Photos: 2500 ఏళ్లు చెక్కుచెదరకుండా అయోధ్య రామాలయం.. (తాజా ఫొటోలు)
-
రామాలయంలోకి ఇలా వెళ్లి... అలా రావాలి!
సనాతన సంప్రదాయంలో శ్రీరాముడు ఆదర్శ పురుషునిగా కనిపిస్తాడు. అయోధ్యలో నిర్మితమవుతున్న శ్రీరాముని ఆలయం సనాతన విలువలకు ప్రతిబింబంగా నిలుస్తుంది. నాగర్ శైలిలో నిర్మితమవుతున్న రామాలయ ప్రాంగణంలో దక్షిణ ద్రావిడ శైలి ప్రభావం కూడా కనిపిస్తుంది. పంచాయతన సంప్రదాయమూ దర్శనమిస్తుంది. నూతన రామాలయంలోకి తూర్పు ద్వారం నుంచి ప్రవేశం ఉంటుంది. 33 మెట్లు ఎక్కిన తర్వాత భక్తులు ఆలయంలోకి ప్రవేశించవచ్చు. ఆలయ ప్రదక్షిణ, దర్శనం తరువాత భక్తులు దక్షిణ దిశ నుండి నిష్క్రమణ కావాలని ఉంటుంది. శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ నూతన రామాలయ విశేషాల గురించి తెలియజేసింది. మొత్తం ఆలయ సముదాయం 70 ఎకరాలు. ఇందులో 25 నుంచి 30శాతం స్థలంలో మాత్రమే ఆలయం నిర్మితమవుతోంది. మిగిలిన ప్రాంతం పచ్చదనంతో కూడి ఉంటుంది. 2024 జనవరి 22న ప్రధాని మోదీ.. ఆలయంలోని బాలరాముని విగ్రహానికి ప్రతిష్ఠాపన చేసే సమయానికి గ్రౌండ్ ఫ్లోర్, తూర్పు ప్రధాన ద్వారాలు సిద్ధం కానున్నాయి. మొదటి అంతస్తులో శ్రీరామ దర్బార్ ఉంటుంది. పూజలు, ప్రార్థన, భజనలకు ఐదు మంటపాలు నిర్మిస్తున్నారు. ఆలయ సముదాయంలో మొత్తం 44 ద్వారాలు ఉండనున్నాయి. ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ మీడియాతో మాట్లాడుతూ ఆలయ సముదాయంలో మౌలిక సదుపాయాలు విరివిగా ఉంటాయన్నారు. నీటి శుద్ధి కేంద్రం, అగ్నిమాపక కేంద్రం కూడా ఉంటాయన్నారు. భక్తుల కోసం సుమారు 25 వేల లాకర్లు ఏర్పాటు చేస్తున్నమని, ఇక్కడ సామాను ఉచితంగా ఉంచుకోవచ్చన్నారు. అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి నూతన ఆలయం నాగర్ శైలిలో ఉంటుందని, ఇది ఉత్తర భారత దేవాలయాల ప్రత్యేకశైలి అని చెప్పారు. అలయం చుట్టూ దీర్ఘచతురస్రాకార గోడ నిర్మించారని, ఇది దక్షిణ దేవాలయాల నిర్మాణ శైలికి ఉదారహణ అని తెలిపారు. ఆలయ నలుమూలల్లో సూర్య భగవానుడు, గణపతి, శివుడు, భగవతి అలయాలు ఉంటాయని, మధ్యలో బాలరాముడు కొలువుదీరుతాడన్నారు. ఇది కూడా చదవండి: అయోధ్యలో కొలువుదీరే శ్రీరాముని విగ్రహం ఇదే! -
అయోధ్య రామాలయానికి యాచకుల విరాళం
ఉత్తరప్రదేశ్‌లోని కాశీలో జీవనం సాగిస్తున్న బిచ్చగాళ్లు అయోధ్య రామాలయానికి తమవంతు విరాళాలు అందించారు. సాధారణంగా ఇతరుల ముందు చేతులు చాచే వీరు రామ మందిర నిర్మాణంలో భాగస్వాములయ్యారు. కాశీకి చెందిన యాచకుల సంఘం రామాలయానికి రూ.4.5 లక్షలు విరాళంగా అందించింది. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)సమర్పణ్ నిధి ప్రచారంలో కాశీకి చెందిన 300 మందికి పైగా యాచకులు పాల్గొన్నారు. గత నవంబర్‌లో కాశీలో భిక్షాటన చేస్తున్న కొందరు వ్యక్తులు ఆర్ఎస్ఎస్ కార్యాలయానికి చేరుకుని ఈ ప్రచారంలో తమను కూడా భాగస్వాములను చేయాలని కోరారు. ఈ నేపధ్యంలో యూపీలోని 27 జిల్లాలకు చెందిన యాచకులు అయోధ్య రామ మందిర్ నిర్మాణం కోసం విరాళాలు అందించారు. ఈ సందర్భంగా కాశీలో భిక్షాటన సాగించే బైద్యనాథ్ మాట్లాడుతూ 30 ఏళ్ల క్రితం అనారోగ్యం కారణంగా ఏ పనీ చేయలేని స్థితికి చేరుకున్నాని చెప్పాడు. అప్పటి నుంచి భిక్షాటనతో జీవనం సాగిస్తున్నానన్నారు. అయోధ్య రామాలయ నిర్మాణం కోసం నిధుల సేకరణ జరుగున్నదని తెలుసుకుని యాచకులమంతా విరాళాలు సేకరించి అందించాలని నిర్ణయించుకున్నామన్నారు. తాను జనవరి 22న అయోధ్యలో జరిగే రామాలయ ప్రారంభోత్సవానికి వెళ్లాలనుకుంటున్నానని తెలిపారు. అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఇదిలా ఉండగా నాలుగు వేల మందికి పైగా చెప్పులు కుట్టేవారు, చాకలివారు, స్వీపర్లు కూడా తమ కష్టార్జితంలోని కొంత భాగాన్ని నూతన రామాలయం కోసం విరాళంగా అందించారు. కాశీ పరిధిలో ఉంటున్న 300 మందికి పైగా యాచకులు రామాలయానికి విరాళాలు అందించారు. ఇది కూడా చదవండి: రామాలయంలోకి ఇలా వెళ్లి... అలా రావాలి! -
Ayodhya: అద్వానీకి అందని ఆహ్వానం.. ట్రస్ట్ వివరణ
ఢిల్లీ: అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి ఏర్పాట్లన్నీ చకచకా జరిగిపోతున్నాయి. ఇప్పటికే పలువురు ప్రముఖులకు ఆలయ ట్రస్ట్ తరఫున ముగ్గురు సభ్యుల బృందం అధికారికంగా ఆహ్వానాలు అందిస్తోంది కూడా. అయితే బీజేపీ కురువృద్ధులు లాల్ కృష్ణ అద్వానీ, మురళీమనోహర్ జోషిలకు మాత్రం ఆహ్వానం అందలేదని ప్రచారం జరిగింది. అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం ఉద్యమించిన వాళ్లలో ఈ ఇద్దరూ ముందు వరుసలో ఉన్నారు. అలాంటిది ఈ ఇద్దరికీ ఆహ్వానాలు వెళ్లకపోవడం ఏంటనే అసంతృప్తి వ్యక్తం చేశారు కొందరు. మరోవైపు రాజకీయంగా బీజేపీపై ఈ విషయంలో విమర్శలు వినిపించాయి. దీంతో రామ టెంపుల్ ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్ స్పందించారు. Shri Ram Janmabhoomi Mandir first floor - Construction Progress. श्री राम जन्मभूमि मंदिर प्रथम तल - निर्माण की वर्तमान स्थिति pic.twitter.com/Cz9zUS5pLe — Shri Ram Janmbhoomi Teerth Kshetra (@ShriRamTeerth) December 15, 2023 రామ మందిర ప్రారంభోత్సవ విషయం వాళ్లకు తెలియజేశామని.. అయితే వృద్ధాప్యం, వాళ్లకు ఉన్న ఆరోగ్య సమస్యల రిత్యా ఇబ్బంది పెట్టడం ఇష్టంలేక రావొద్దని చెప్పామని అన్నారాయన. అందుకు వాళ్లిద్దరూ, వాళ్ల కుటుంబ సభ్యులు అంగీకరించినట్లు చంపత్ రాయ్ మీడియాకు తెలియజేశారు. అద్వానీ వయసు 96 ఏళ్లుకాగా, జోషి వయసు 90. జనవరి 22వ తేదీన రామ మందిర ఆలయ ప్రారంభోత్సవం జరగనుంది. ప్రధాని మోదీ ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. ఇప్పటికే ఆయనకు ఆహ్వానం అందజేశారు. श्री राम जन्मभूमि मंदिर में भगवान श्री रामलला सरकार के श्री विग्रह की प्राण प्रतिष्ठा दिनांक 22 जनवरी 2024 को माननीय प्रधानमंत्री श्री नरेन्द्र मोदी जी के कर कमलों द्वारा की जाएगी। Hon'ble Prime Minister Shri @narendramodi ji will perform Prana Pratishtha of Shri Vigraha of… pic.twitter.com/AMBUcYjtoS — Shri Ram Janmbhoomi Teerth Kshetra (@ShriRamTeerth) October 25, 2023 జనవరి 15వ తేదీలోపు ఏర్పాట్లన్నీ పూర్తి చేస్తామని, ఆ మరుసటిరోజు ప్రాణ ప్రతిష్ట పూజ మొదలై.. జనవరి 22వ తేదీదాకా కొనసాగుతుందని చంపత్ రాయ్ తెలియజేశారు. దేశవ్యాప్తంగా హిందూ సంఘాల ప్రతినిధులు, ఆలయ పూజారులు, మఠాధిపతులు, రాజకీయ-సినీ ఇతర రంగాల ప్రముఖులకు సైతం అయోధ్య రామ మందరి ప్రారంభోత్సవానికి ఆహ్వానాలు వెళ్తున్నాయి. श्री राम जय राम जय जय राम! Shri Ram Jai Ram Jai Jai Ram! pic.twitter.com/SZQlSwZl5X — Shri Ram Janmbhoomi Teerth Kshetra (@ShriRamTeerth) December 8, 2023 -
అయోధ్య రామ మందిరం గర్భగుడి ఫోటో విడుదల
ఢిల్లీ: అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవానికి సిద్ధమవుతోంది. ఆలయ గర్భగుడి ఫోటోలను రామ్ మందిర్ ట్రస్ట్ సెక్రటరీ చంపత్ రాయ్ ట్విట్టర్(ఎక్స్)లో ఫొటోలు పోస్ట్ చేశారు. రామాలయ ప్రారంభోత్సవ వేడుక జనవరి 22న అంగరంగ వైభవంగా జరగనుంది. ప్రాణప్రతిష్ఠాపన కార్యక్రమానికి అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేస్తున్నారు. దశాబ్దాల సమస్య తీరిపోయి అయోధ్యలో దివ్యమైన రామ మందిర నిర్మాణం శరవేగంగా నిర్మాణం జరిగింది. దీంతో ప్రారంభోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని యూపీ ప్రభుత్వం భారీ సన్నాహాలు చేస్తోంది. प्रभु श्री रामलला का गर्भ गृह स्थान लगभग तैयार है। हाल ही में लाइटिंग-फिटिंग का कार्य भी पूर्ण कर लिया गया है। आपके साथ कुछ छायाचित्र साझा कर रहा हूँ। pic.twitter.com/yX56Z2uCyx — Champat Rai (@ChampatRaiVHP) December 9, 2023 వేద మంత్రాల నడుమ కన్నుల పండువగా జరిగే శ్రీరాముడి ప్రాణప్రతిష్టకు దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక అతిథిగా హాజరవుతున్నారు. అంతేకాదు ఈ కార్యక్రమానికి దేశంలోని 8వేల మంది ప్రముఖులను కూడా ఆహ్వానిస్తున్నారు. ఇదీ చదవండి: అయోధ్య రామాలయం రెడీ -
అయోధ్య రామాలయం రెడీ
దేవతలు నిర్మించిన పవిత్ర నగరం. సాక్షాత్తు రాముడు నడిచిన పవిత్ర నేల. త్రేతాయుగం నాటి రామరాజ్యానికి నిలువెత్తు నిదర్శనం. ఎట్టకేలకు దశాబ్దాల నాటి హిందువుల కల నెరవేరబోతోంది. రామమందిర నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. కింది అంతస్తు పనులు దాదాపు పూర్తికావచ్చాయి. ఇందులోనే రాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. వచ్చే ఏడాది జనవరి 22న జరిగే ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. వేద మంత్రాల నడుమ కన్నుల పండువగా జరిగే శ్రీరాముడి ప్రాణప్రతిష్టకు దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక అతిథిగా హాజరవుతున్నారు. అంతేకాదు ఈ కార్యక్రమానికి దేశంలోని 8వేల మంది ప్రముఖులను కూడా ఆహ్వానిస్తన్నారు. ఇంతకీ ప్రస్తుతం అయోధ్య రామమందిర నిర్మాణం ఎక్కడి వరకు వచ్చింది ? జనవరి 22న జరిగే కార్యక్రమానికి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు ? 2024, జనవరి 22.. దేశప్రజలకు ప్రత్యేకమైన రోజుగా మారనుంది. అయోధ్య రామ మందిర్ దర్శనం కోసం ఎదురు చూస్తున్న కోట్లాది మంది హిందువులకు శుభవార్త అందింది. రామాలయ ప్రారంభోత్సవ వేడుక జనవరి 22న అంగరంగ వైభవంగా జరగనుంది. ప్రాణప్రతిష్ఠాపన కార్యక్రమానికి అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేస్తున్నారు. దశాబ్దాల సమస్య తీరిపోయి అయోధ్యలో దివ్యమైన రామ మందిర నిర్మాణం శరవేగంగా నిర్మాణం జరిగింది. దీంతో ప్రారంభోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని యూపీ ప్రభుత్వం భారీ సన్నాహాలు చేస్తోంది. అయోధ్యలో నిర్మిస్తున్న రామమందిరాన్ని సందర్శించే భక్తులు 70 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న జన్మభూమి కాంప్లెక్స్‌లో మరో 7 ఆలయాలను దర్శించుకోవచ్చు. ఇక ఈ కార్యక్రమంలో పాల్గోవాలని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ పోస్టు ద్వారా అందరికీ ఆహ్వానాలు పంపుతున్నారు. దీనికి ముఖ్య అతిథిగా ప్రధాని మోదీ వస్తున్నారు. ఆయనతో పాటు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. వీరితో పాటు.. పలువురు ప్రముఖులకు ఆహ్వానాలు పంపుతున్నారు. ఆ జాబితాలో సినీరంగం నుంచి అమితాబ్ బచ్చన్, అక్షయ్ కుమార్ తో పాటు ఇతర ప్రముఖులు.. అలాగే పారిశ్రామిక రంగం నుంచి రతన్ టాటా, ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ లాంటి ప్రముఖులు, భారత్ క్రికెట్ రూపురేఖలు మార్చిన దిగ్గజ క్రికెటర్లలో సచిన్, విరాట్ కోహ్లి లాంటి ప్రముఖులకు ఆహ్వానాలు అందినట్లు తెలుస్తోంది. అలాగే పూజారులు, దాతలు సహా దేశంలోని పలువురు రాజకీయ నాయకులు సహా దాదాపుగా 8వేల మందికి ఈ ఆహ్వానాలు అందినట్టు తెలుస్తోంది. ఆహ్వానం అందుకున్న వారిలో పలువురు జర్నలిస్టులు, మాజీ ఆర్మీ అధికారులు, రిటైర్డ్ సివిల్ సర్వెంట్లు, పద్మ అవార్డు గ్రహీతలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.ఇందులో 50 మంది కరసేవకుల కుటుంబాలకు కూడా ఆహ్వానం పంపించారు. అయితే రామ్ లల్లాను ఐదేళ్ల బాలుడి రూపంలో ఆలయంలో కూర్చోబెడతారు.. ఇందుకోసం కర్ణాటక, రాజస్థాన్ల నుంచి తీసుకొచ్చిన శిలలతో మూడు విగ్రహాలను తయారుచేశారు.. ఈ విగ్రహాలు దాదాపుగా సిద్ధమయ్యాయి. మరోవైపు రామ మందిర ప్రారంభోత్సవం సందర్భంగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం జనవరి 2024లో రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాల్లో అఖండ రామాయణం, హనుమాన్ చాలీసా పారాయణాలను నిర్వహించనున్నారు. అయోధ్యలోని రామాలయం కోసం వినియోగించే ధ్వజ స్తంభాల నిర్మాణ పనులను అహ్మదాబాద్‌లోని అంబికా ఇంజినీరింగ్ వర్క్స్ కంపెనీ తయారు చేసింది. ఏడు ధ్వజ స్తంభాల బరువు సుమారు 5,500 కిలోలు. రామమందిరం చుట్టూ 800 మీటర్ల పొడవున నిర్మిస్తున్న రింగ్ రోడ్డు చివరి దశలో ఉంది. మరోవైపు ప్రకారం ప్రాకారాలలో నుంచే కాకుండా రింగ్‌రోడ్డు మార్గం నుంచి కూడా ఆలయాన్ని సందర్శించవచ్చు. ఆలయంలోని నేలను పాలరాతితో తీర్చిదిద్దుతున్నారు. 60 శాతం మేరకు ఫ్లోర్లో మార్బుల్‌ను అమర్చారు. అలాగే ఆలయ నృత్య మండపంతోపాటు రంగ మండపానికి సంబంధించిన శిఖరం సిద్ధమైంది. కాగా అయోధ్య రామమందిరాన్ని 8.64 ఎకరాల్లో యూపీ ప్రభుత్వం నిర్మించింది. ఈ ఆలయంలో గర్భగుడితో పాటు ఐదు మండపాలు ఉంటాయి. గుధ్ మండపం, రంగ మండపం, నిత్య మండపం, ప్రధాన మండపం, కీర్తన మండపం ఉంటాయి. ఇక జనవరి 22న అయోధ్యలోని నూతన రామాలయంలో శ్రీరాముడు కొలువుదీరనున్న సందర్భంగా.. ఆరోజు నుంచి 20 మంది కొత్త అర్చకులు ఆలయంలో రోజువారీ పూజలను నిర్వహించనున్నారు. ఈ నేపధ్యంలో తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రస్తుతం 20 మంది కొత్త అర్చకులకు శిక్షణ ఇస్తోంది. శ్రీరామ జన్మభూమి ఆలయంలో శ్రీరామునికి సేవ చేసే భాగ్యం కలగనుందని వారంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఇక చరిత్ర విషయానికొస్తే.. దశాబ్దాలుగా కొనసాగిన బాబ్రీ మసీదు - రామ మందిరం వివాదం 2019 లో సుప్రీంకోర్టు ఇచ్చిన చరిత్రాత్మక తీర్పుతో ముగిసింది.సుప్రీంకోర్టు తీర్పుతో రామ మందిర నిర్మాణానికి ఉన్న అన్ని అడ్డంకులు తొలిగాయి. సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి, ఆలయ నిర్మాణంపై అన్ని నిర్ణయాలు తీసుకోవడానికి కేంద్రం శ్రీరామ జన్మ భూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ను ఏర్పాటు చేసింది. ఆలయ నిర్మాణానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేయడంతో నిర్మాణ పనులు 2020 ఆగస్ట్ 5వ తేదీ నుంచి ప్రారంభమయ్యాయి. 1998లో అహ్మదాబాద్‌లోని సోంపురా కుటుంబం రూపొందించిన డిజైన్ ఆధారంగా రామమందిర నిర్మాణం చేపట్టారు. ఆ తరువాత ఆ డిజైన్ కు 2020లో కొన్ని మార్పులు చేశారు. జనవరి 22న వచ్చే భారీగా తరలివచ్చే భక్తుల కోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు వసతి ఏర్పాటు చేసేందుకు అయోధ్యలో టెంట్ సిటీలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి దేశ విదేశాల నుంచి పెద్దఎత్తున భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ఆ భక్తులకు ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు కల్పించే విషయంలో ప్రణాళికలు రచిస్తున్నారు. మాజా గుప్తర్ ఘాట్ వద్ద 20 ఎకరాల్లో 25 వేల మందికి వసతి కల్పించేలా నిర్మాణం చేస్తున్నారు. బ్రహ్మకుండ్ వద్ద 30 వేల మందికి.. బాగ్ బిజేసీ వద్ద 25 వేల మందికి వసతి సౌకర్యాలు కల్పిస్తున్నారు. కార్‌సేవక్ పురం, మణిరాం దాస్ కంటోన్మెంట్ వంటి ప్రాంతాల్లో కూడా ఇలాంటి వసతి ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తంగా ఆ అయోధ్య రామయ్య సేవా భాగ్యాన్ని నోచుకునేందుకు భక్తి పారవశ్యంతో కోట్లాది మంది భక్తులు వేచి చూస్తున్నారు. ఇదీ చదవండి: అయోధ్య రామాలయానికి యాచకుల విరాళం -
అందుకే కడుతున్నారు.. రామ మందిరంపై ఛత్తీస్‌గఢ్ సీఎం వ్యాఖ్యలు
రాయపూర్: అయోధ్యలో నిర్మిస్తున్న రామ మందిరంపై ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ బఘేల్ (Bhupesh Baghel) కీలక వ్యాఖ్యలు చేశారు. రామ మందిర నిర్మాణాన్ని బీజేపీ రాజకీయాల కోసం వాడుకుంటోందని ఆరోపించారు. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని సీఎం బఘేల్ ఆదివారం ఉదయం ఇక్కడి మహాదేవ్ఘాట్ వద్ద ఖరున్ నదిలో పవిత్ర స్నానం చేసి పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కార్తీక మాసమంతా సూర్యోదయానికి ముందు స్నానం చేయడం ఛత్తీస్‌గఢ్‌లో ఆచారంగా వస్తోందన్నారు. ఇందులో భాగంగా తాను కూడా మహదేవ్ఘాట్లో దిగి ఖరున్ నదిలో స్నానం చేసినట్లు చెప్పారు. సూర్యోదయానికి ముందు స్నానం చేయడం ఆరోగ్యానికి కూడా మంచిదని ఆయన పేర్కొన్నారు. సుప్రీం నిర్దేశంతోనే.. అయోధ్యలో రామ మందిర నిర్మాణం తుది దశలో ఉంది. వచ్చే జనవరి 22న ప్రతిష్ఠాపన జరగనున్న ఈ రామ మందిరం వచ్చే ఏడాది జరిగే లోక్‌సభ ఎన్నికలకు ప్రధాన అంశంగా మారింది. దీనిపై ఛత్తీస్‌గఢ్ సీఎం మాట్లాడుతూ “సుప్రీం కోర్టు నిర్దేశంతోనే అక్కడ రామ మందిరాన్ని నిర్మిస్తున్నారు. కానీ బీజేపీ దాని మీద రాజకీయం చేస్తోంది. ఛత్తీస్‌గఢ్‌లో చాలా చోట్ల మేమూ అనేక రామ మందిరాలు నిర్మించాం. కానీ మేము వాటి పేరు మీద ఓట్లు అడగడం లేదు’ అన్నారు. తెలంగాణలో ప్రచారం మరోవైపు తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో తాను పాల్గొంటున్నానని, ఇందు కోసం రెండు రోజుల పాటు తెలంగాణలో పర్యటిస్తానని బఘేల్ తెలియజేశారు. తెలంగాణలో నవంబర్ 30న ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి. శనివారం రాజస్థాన్‌లో జరిగిన పోలింగ్‌లో అత్యధిక ఓటింగ్ శాతం నమోదవడం వెనుక అశోక్ గెహ్లాట్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వ విజయాలు ఉన్నాయన్నారు. కాగా నవంబర్ 7, 17 తేదీల్లో రెండు దశల్లో ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికలు (Chhattisgarh Assembly Elections) పూర్తయ్యాయి. ఓట్ల లెక్కింపు డిసెంబర్ 3న జరగనుంది. -
10 కోట్ల కుటంబాలకు ఆహ్వానం..5లక్షలకు పైగా దేవాలయాల్లో వేడుకలు..
ఢిల్లీ: వచ్చే ఏడాది జనవరి 22వ తేదీన జరిగే అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవ వేడుకలకు ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీకి ఆహ్వానం అందగా, దేశ విదేశాల్లో ఉన్న 10 కోట్ల కుటుంబాలకు ఆహ్వానం పలకాలని వీహెచ్‌పీ నిర్ణయించింది. జనవరి 1వ తేదీ నుంచి ఈ ఆహ్వాన కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నట్లు వీహెచ్‌పీ ప్రతినిధులు తెలిపారు. అదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా 5 లక్షలకు పైగా దేవాలయాల్లో అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవ వేడుకలు నిర్వహించడానికి సమాయత్తమవుతున్నారు. రామమందిరం ప్రారంభోత్సవంలో భాగంగా అయోధ్యలో నిర్వహించే మహాభిషేక కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. దీనికి శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రత్యేక ఏర్పాట్లు చేయనుంది. దేశవ్యాప్తంగా ప్రజలకు అక్షతలు పంపిణీ ఇటీవలే అయోధ్యలో శ్రీరామ మందిరంలో ప్రతిష్టాపన పూజలు సంప్రదాయం ప్రకారం అక్షత పూజతో మొదలయ్యాయి. ఆలయంలోని రామదర్బార్, శ్రీరాముని ఆస్థానంలో పసుపు, దేశవాళీ నెయ్యి కలిపిన 100 క్వింటాళ్ల బియ్యంతో అక్షత పూజ నిర్వహిస్తున్నట్లు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తెలిపింది. దేశంలోని 45 ప్రాంతాల నుంచి ఇక్కడకు వచ్చిన విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ)కు చెందిన 90 మంది ముఖ్యులకు 5 కిలోల మేర అక్షతలను పంపిణీ చేస్తారు. వీరు వీటిని జిల్లాలు, బ్లాకులు, తహసీల్లు, గ్రామాల ప్రతినిధులకు అందజేస్తారని ట్రస్ట్ కార్యదర్శి చంపత్‌రాయ్ చెప్పారు. మిగతా అక్షతలను ఆలయంలోని శ్రీరాముని విగ్రహం ఎదురుగా కలశంలో ఉంచుతారు. వీరు ఈ అక్షతలను వీరు వచ్చే జనవరి 22వ తేదీన అయోధ్యలో శ్రీరాముని ప్రతిష్టాపన జరిగేలోగా దేశవ్యాప్తంగా ప్రజలకు పంపిణీ చేయనున్నారని ట్రస్ట్ తెలిపింది. రామమందిరం కోసం అరుదైన కానుక అయోధ్యలో రామమందిరం కోసం అలీగఢ్‌కు చెందిన ఒక కళాకారుడు అరుదైన కానుకను రూపొందించాడు. చేతితో తాళాలు తయారు చేయడంలో సిద్ధహస్తుడైన సత్యప్రకాశ్ శర్మ రాముడి మందిరం కోసం ప్రత్యేకంగా 400 కేజీల తాళం తయారు చేశాడు. శ్రీరాముడికి వీరభక్తుడైన సత్యప్రకాశ్ ప్రపంచంలో చేత్తో తయారు చేసిన అతి పెద్ద తాళమని చెప్పారు. ఈ తాళం 10 అడుగుల ఎత్తు, 4.5 అడుగుల వెడల్పు, 9.5 అంగుళాల మందంతో ఉంది. తాళం చెవి నాలుగడుగుల పొడవుంది. సత్యప్రకాశ్ శర్మ కుటుంబం తరాలుగా ఈ తాళాల తయారీ వృత్తిలోనే ఉంది.ఈ ఏడాది మొదట్లో అలీగఢ్ ఎగ్జిబిషన్లో ఈ తాళాన్ని ఉంచారు. తాళం తయారు చేయడంలో తన భార్య రుక్మిణి కూడా సాయం చేశారని చెప్పారు. ఈ తాళం తయారీకి ఆయనకి రూ.2 లక్షల ఖర్చయింది. ఈ ఏడాది చివర్లో ఆయన ఈ తాళాన్ని శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌కి సమర్పిస్తారు. చదవండి: ఆయోధ్య రాముడికి మర్చిపోలేని కానుక..