సాక్షి, న్యూఢిల్లీ: అయోధ్య రామాలయంలో శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ట రోజు ప్రపంచ వ్యాప్తంగా వేడుకలు జరగనున్నాయి. అమెరికా, బ్రిటన్ సహా 50కిపైగా దేశాల్లో ‘రామోత్సవం’నిర్వహించనున్నారు. ఆయా దేశాల్లో నివసిస్తున్న రామభక్తులు ఇప్పటికే కొన్ని దేశాల్లో శోభాయాత్రలకు కూడా శ్రీకారం చుట్టారు.
విశ్వహిందూ పరిషత్ (విశ్వ విభాగం) ఆధ్వర్యంలో మరి కొన్ని దేశాల్లో భారీగా సన్నాహాలు జరుగుతున్నాయి. జనవరి 22న అమెరికాలో 300, జర్మనీలో 100, మారిషస్‌లో 100, కెనడా, ఆ్రస్టేలియాల్లో 30, బ్రిటన్‌లో 25 కార్యక్రమాలు నిర్వహించనున్నారు. హిందువులు తక్కువగా ఉన్న ఐర్లాండ్‌తో పాటు మరికొన్ని దేశాల్లో ఒక్కో కార్యక్రమం ఉంటుంది. ఇలా మొత్తం 50కి పైగా దేశాల్లో 500 పైగా ధారి్మక, వైదిక, సాంస్కృతిక పరమైన సామూహిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు విశ్వహిందూ పరిషత్ వర్గాలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment