shobhayatra
-
ఆ రోజు ప్రపంచ వ్యాప్తంగా ‘రామోత్సవం’
సాక్షి, న్యూఢిల్లీ: అయోధ్య రామాలయంలో శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ట రోజు ప్రపంచ వ్యాప్తంగా వేడుకలు జరగనున్నాయి. అమెరికా, బ్రిటన్ సహా 50కిపైగా దేశాల్లో ‘రామోత్సవం’నిర్వహించనున్నారు. ఆయా దేశాల్లో నివసిస్తున్న రామభక్తులు ఇప్పటికే కొన్ని దేశాల్లో శోభాయాత్రలకు కూడా శ్రీకారం చుట్టారు. విశ్వహిందూ పరిషత్ (విశ్వ విభాగం) ఆధ్వర్యంలో మరి కొన్ని దేశాల్లో భారీగా సన్నాహాలు జరుగుతున్నాయి. జనవరి 22న అమెరికాలో 300, జర్మనీలో 100, మారిషస్‌లో 100, కెనడా, ఆ్రస్టేలియాల్లో 30, బ్రిటన్‌లో 25 కార్యక్రమాలు నిర్వహించనున్నారు. హిందువులు తక్కువగా ఉన్న ఐర్లాండ్‌తో పాటు మరికొన్ని దేశాల్లో ఒక్కో కార్యక్రమం ఉంటుంది. ఇలా మొత్తం 50కి పైగా దేశాల్లో 500 పైగా ధారి్మక, వైదిక, సాంస్కృతిక పరమైన సామూహిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు విశ్వహిందూ పరిషత్ వర్గాలు తెలిపాయి. -
ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం ఎన్ని గంటలకంటే..
సాక్షి, హైదరాబాద్: ఖైరతాబాద్ మహా గణపతి శోభాయాత్రకు ఉత్సవ సమితి ఏర్పాట్లు చేస్తోంది. ఈ రోజు అర్థరాత్రి చివరి పూజ అనంతరం నిమజ్జనానికి సిద్ధమయ్యారు. చివరి రోజు కావడంతో భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు. అటు.. రేపు జరగబోయే శోభాయాత్రలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొననున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లను ఉత్సవ సమితి చేసింది. ఖైరతాబాద్ వినాయకునికి ఎంతో ప్రాధాన్యత ఉంది. నలుమూలల నుంచి భక్తులు వస్తుంటారు. తొమ్మిది రోజులుగా పూజలు నిర్వహించిన ఉత్సవ సమితి నేడు అర్ధరాత్రి ఇక చివరి పూజను నిర్వహించనుంది. అర్ధరాత్రి 1 గంట తర్వాత మహాగణపతిని ఉత్సవ సమితీ కదిలించనుంది. రేపు మధ్యాహ్నం 2 గంటలలోపు మహాగణపతి నిమజ్జనం పూర్తి అయ్యేలా ఏర్పాట్లు చేశారు. శోభాయాత్ర సాగుతుంది ఇలా.. ►ఈ రోజు అర్థరాత్రి 12 గంటలకు మహా గణపతికి చివరి పూజ ►అర్దరాత్రి 1 గంట తర్వాత మహాగణపతిని కదిలించనున్న ఉత్సవ కమిటీ ►రాత్రి 2 నుంచి తెల్లవారుజామున 4 వరకు విగ్రహాలను భారీ టస్కర్ లోకి ఎక్కించనున్న కమిటీ ►ఉదయం 4 నుంచి 7 వరకు మహాగణపతిని భారీ వాహనంపై ఎక్కించి వెల్డింగ్ వర్క్ ►ఉదయం ఎనిమిది గంటల లోపు ప్రారంభం కానున్న మహా గణపతి శోభాయాత్ర ►టెలిఫోన్ భవన్, సెక్రటేరియట్ మీదుగా ఎన్టీఆర్ మార్గ్ చేరుకోనున్న మహా గణపతి ►ఉదయం 10 గంటల సమయంలో క్రేన్ నెంబర్ 4 వద్ద కు చేరుకునే అవకాశం ►తర్వాత భారీ వాహనంపై మహాగణపతి తొలగింపు కార్యక్రమం ►క్రేన్ నెంబర్ ఫోర్ వద్ద ఉదయం 11 నుంచి 12 గంటల లోపు పూజా కార్యక్రమం ►12 నుంచి హుస్సేన్ సాగర్ లో మహాగణపతి నిమజ్జన కార్యక్రమం షురూ ►మ. 2 గంటల లోపు మహా గణపతి నిమజ్జనం పూర్తి అయ్యేలా ఏర్పాట్లు నిమజ్జనానికి భారీ ఏర్పాట్లు.. మహాగణపతి నిమజ్జనానికి హైదరాబాద్ సిద్ధమైంది. హుస్సేన్‌సాగర్‌తోపాటు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో దాదాపు 100 చోట్ల నిమజ్జనాలు జరగనున్నాయి. ఇందుకోసం జీహెచ్ఎంసీ క్రేన్లు, జేసీబీలు, టిప్పర్లతోపాటు వేలాదిమంది సిబ్బందిని ఏర్పాటు చేసింది. నిమజ్జనం సందర్భంగా ప్రమాదవశాత్తు ఎవరైనా నీళ్లలో పడిపోతే రక్షించేందుకు 200 మంది గజ ఈతగాళ్లను కూడా సిద్ధం చేసింది. అలాగే, శోభాయాత్ర జరిగే రహదారులపై వైద్య శిబిరాలు, 79 అగ్నిమాపక వాహనాలను అందుబాటులో ఉంచింది. నిమజ్జనానికి తరలివచ్చే వారి కోసం జలమండలి 10 లక్షల నీళ్ల ప్యాకెట్లను రెడీ చేసింది. నిమజ్జనం రోజున ప్రజల సౌకర్యార్థం హుస్సేన్ సాగర్‌కు నగరం నలుమూలల నుంచి 535 బస్సులను నడపాలని ఆర్టీసీ నిర్ణయించింది. అలాగే 29 తెల్లవారుజాము వరకు ఎంఎంటీఎస్ ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. మెట్రో రైళ్లు కూడా రేపు అర్ధరాత్రి దాటాక 2 గంటల వరకు నడవనున్నాయి. ఇదీ చదవండి: ప్రతి గణేష్ విగ్రహానికీ క్యూఆర్ కోడ్ -
నూహ్‌లో ప్రశాంతంగా పూజలు
నూహ్(హరియాణా): సర్వజాతీయ హిందూ మహాపంచాయత్ సంస్థ సోమవారం నూహ్‌లో తలపెట్టిన శోభాయాత్రను అధికారులు అడ్డుకున్నారు. జూలై 31న నూహ్‌లో మత కలహాలు చెలరేగిన నేపథ్యంలో హరియాణా ప్రభుత్వం తాజాగా శోభాయాత్రకు అనుమతి నిరాకరించింది. మల్హర్, ఝిర్, శింగార్ శివాలయాల్లో పూజలు మాత్రం చేసుకోవచ్చని తెలిపింది. దీంతో, అధికారులు ఢిల్లీ–గురుగ్రామ్ సరిహద్దుల నుంచి నూహ్ వరకు అయిదు ప్రధాన చెక్ పాయింట్లను పోలీసులు ఏర్పాటు చేశారు. శోభాయాత్రలో పాల్గొనేందుకు అయోధ్య నుంచి బయలుదేరిన జగద్గురు పరమహంస ఆచార్య తదితరుల బృందాన్ని సోహ్నా వద్ద ఘమోర్జ్ టోల్ ప్లాజా వద్ద నిలిపివేశారు. అనంతరం అధికారులు నూహ్ జిల్లాలోకి అనుమతించిన 15 మంది సాధువులు, ఇతర హిందూ నేతలు సుమారు 100 మంది నల్హర్‌లోని శివాలయంలో జలాభిక పూజలు చేశారు. అక్కడ్నుంచి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సుల్లో ఫిరోజ్‌పూర్‌లోని ఝిర్కా ఆలయానికి వెళ్లి పూజలు చేశారు. శింగార్ ఆలయానికి కూడా వెళ్లారని అధికారులు తెలిపారు. ఎటువంటి అవాంఛ నీయ ఘటనలు జరగలేదని పోలీసులు వెల్లడించారు. ఇలా ఉండగా, సోమవారం సోహ్నా నుంచి నూహ్ వరకు పరిసరాలు నిర్మానుష్యంగా మారాయి. దుకాణాలేవీ తెరుచుకోలేదు. అధికారులు ముందు జాగ్రత్తగా విద్యాసంస్థలు, బ్యాంకులకు సెలవు ప్రకటించారు. మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. -
నూహ్‌లో మళ్లీ ఇంటర్నెట్ సేవలు బంద్
చండీగఢ్: శోభాయాత్ర పిలుపు నేపథ్యంలో నూహ్ జిల్లాలో ఈ నెల 28 వరకు మొబైల్ ఇంటర్నెట్ సేవలపై నిషేధం విధించడంతోపాటు నిషేధాజ్ఞలు అమలు చేయాలని హరియాణా ప్రభుత్వం నిర్ణయించింది. జూలై 31వ తేదీన జరిగిన మతపర ఘర్షణల నేపథ్యంలో ఈ మేరకు చర్యలు చర్యలు తీసుకున్నట్లు వివరించింది. నూహ్‌లో సోమవారం తలపెట్టిన శోభాయాత్రకు అనుమతులు నిరాకరించామని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. ఢిల్లీలో సెప్టెంబర్ 3 నుంచి 7వ తేదీ వరకు జరిగే జి–20 షెర్పా సమావేశాలను కూడా దృష్టిలో ఉంచుకుని ఈ మేరకు నిర్ణయించామన్నారు. మొబైల్ ఇంటర్నెట్తోపాటు ఎస్ఎంఎస్ సర్వీసులపైనా నిషేధం విధించామన్నారు. సంఘ విద్రోహ శక్తులు సామాజిక మాధ్యమాల ద్వారా వదంతుల వ్యాప్తి చేయకుండా అడ్డుకోవడమే లక్ష్యమని చెప్పారు. ఈ నెల 26–28 తేదీల మధ్య 144వ సెక్షన్ కింద నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయని డీజీపీ శత్రుజీత్ కపూర్ చెప్పారు. -
ప్రారంభమైన బాలాపూర్ గణేషుడి శోభాయాత్ర
-
శోభాయాత్రకు సిద్ధమైన ఖైరతాబాద్ మహా గణపతి
-
హైకోర్టు అనుమతిచ్చినా వీరహనుమాన్ విజయ యాత్రకు బ్రేక్
సాక్షి, హైదరాబాద్: హనుమజ్జయంతి సందర్భంగా హైదరాబాద్‌లో జరగాల్సిన వీరహనుమాన్ విజయ యాత్రకు అకస్మాత్తుగా బ్రేక్ పడింది. హైకోర్టు యాత్రకు అనుమతిచ్చినా కూడా యాత్ర ఆగిపోయింది. అయితే యాత్రను తామే స్వచ్ఛందంగా విరమించుకుంటున్నట్లు హిందూ సంఘాలు ప్రకటించాయి. వాస్తవంగా హైదరాబాద్‌లో మంగళవారం హనుమజ్జయంతి సందర్భంగా పాతబస్తీ నుంచి సికింద్రాబాద్‌లోని తాడ్‌బండ్ ఆంజనేయస్వామి ఆలయం వరకు శోభయాత్ర జరగాల్సి ఉంది. అయితే ప్రభుత్వం అనుమతి ఇవ్వడం లేదని హైకోర్టుకు వెళ్లి మరీ అనుమతి తెచ్చుకున్నారు. అయితే న్యాయస్థానాలు ఎన్నో ఆంక్షలతో వీరహనుమాన్ విజయ యాత్రకు అనుమతిచ్చింది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో పక్కాగా నిబంధనలు పాటించాలని సూచించింది. ఈ నేపథ్యంలో భజరంగ్‌దల్, విశ్వహిందూ పరిషత్ తదితర సంఘాలు యాత్రపై సమాలోచనలు చేశాయి. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో యాత్ర విరమించుకుంటే మంచిదనే అభిప్రాయానికి ఆయా సంస్థలు వచ్చాయి. చివరకు వీరహనుమాన్ విజయ యాత్రను స్వచ్ఛందంగా విరమించుకుంటున్నట్లు విశ్వహిందూ పరిషత్, భజరంగ్‌దళ్ ప్రతినిధులు బండారి రమేశ్, రామరాజు, సుభాశ్ చందర్ ఓ ప్రకటనలో తెలిపారు. తెలంగాణా ప్రభుత్వం కరోనా నియమాలు మత రాజకీయాలకు అతీతంగా అమలు చేయాలని ఈ సందర్భంగా ఆ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. చదవండి: ఈ హనుమాన్ జయంతికి ఓ ప్రత్యేకత ఉంది.. చిరంజీవి చదవండి: గుడ్‌న్యూస్.. 64 వేల బెడ్లతో రైల్వే శాఖ సిద్ధం -
నిఘా నేత్రం
సాక్షి, సిటీబ్యూరో: హనుమాన్ జయంతి సందర్భంగా శుక్రవారం నిర్వహించనున్న శోభాయాత్రకు నగర పోలీసులు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. పోలీస్ సిబ్బందితో పాటు సాయుధ బలగాలతో భారీ బందోబస్తును వినియోగించనున్నారు. మొత్తం 12వేల మంది విధులు నిర్వర్తించనున్నారు. బందోబస్తు, భద్రత ఏర్పాట్లపై నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ బుధ, గురువారాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి సమీక్ష నిర్వహించారు. ప్రధాన ఊరేగింపు మార్గాలను పరిశీలించడంతో పాటు యాత్ర ప్రారంభమయ్యే, ముగింపు జరిగే దేవాలయాలను సందర్శించారు. ప్రధాన ఊరేగింపు నగరంలోని మూడు జోన్లలో 27 కి.మీ మేర జరగనుంది. గౌలిగూడ రామ్‌మందిర్ దగ్గర ప్రారంభమై తాడ్‌బండ్ ఆంజనేయస్వామి దేశాలయం వద్ద ముగుస్తుంది. అదే విధంగా తూర్పు మండలంలోని ఐఎస్ సదన్ నుంచి మరో ఊరేగింపు 3 కి.మీ సాగి గౌలిగూడ రామ్‌మందిర్ వద్ద ప్రధాన ఊరేగింపులో కలుస్తుంది. మొత్తమ్మీద 15 ప్రాంతాల నుంచి వచ్చే ఊరేగింపులు ప్రధాన శోభాయాత్రలో కలుస్తాయి. సైబరాబాద్‌తో పాటు నగరంలోని తూర్పు, మధ్య, ఉత్తర మండలాల్లో మొత్తం 27 కి.మీ మేర జరిగే ఊరేగింపును కమ్యూనిటీ, ట్రాఫిక్ సీసీ కెమెరాల ద్వారా బషీర్‌బాగ్ కమిషనరేట్‌లోని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (సీసీసీ) నుంచి నిత్యం పర్యవేక్షించనున్నారు. అదనంగా 570 తాత్కాలిక, మూవింగ్, వెహికల్ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. బందోబస్తులో ఉండే పోలీసులకు మరో 300 హ్యాండీ క్యామ్స్ అందజేస్తున్నారు. ప్రతి ఘట్టాన్నీ చిత్రీకరించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఊరేగింపు జరిగే మార్గాల్లో ట్రాఫిక్ మళ్లింపులు విధించిన పోలీసులు... గురువారం రాత్రి నుంచే బారికేడ్లు ఏర్పాటు చేయడం ప్రారంభించారు. బందోబస్తును అధికారులు రెండు రకాలుగా విభజించారు. శోభాయాత్ర వెంట ఉండడానికి కొంతమంది, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో పర్యవేక్షించడానికి మరికొంత మందిని కేటాయిస్తున్నారు. ప్రతి జోన్‌కు ఆయా డీసీపీలు బాధ్యత వహిస్తారు. వీరికి తోడు ప్రాంతాల వారీగా సీనియర్ అధికారులను ఇన్‌చార్జ్‌లుగా నియమించారు. ఊరేగింపు ముందు, ముగింపులో అదనపు, సంయుక్త పోలీసు కమిషనర్లు బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ ఊరేగింపుల్లో మొత్తం 2లక్షల మంది భక్తులు పాల్గొంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. డేగకన్ను... హనుమాన్ జయంతి, శోభాయాత్ర నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కొత్వాల్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో శాంతిభద్రత విభాగం, టాస్క్‌ఫోర్స్ అధికారులు అప్రమత్తమయ్యారు. స్థానిక పోలీసులు మైత్రీ, పీస్ కమిటీలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. మరోవైపు టాస్క్‌ఫోర్స్, లా అండ్ ఆర్డర్ పోలీసులు రౌడీషీటర్లతో పాటు అనుమానిత వ్యక్తులు, గతంలో ఇబ్బందికరంగా మారిన వారిని తమ కార్యాలయాలకు పిలిపించి కౌన్సెలింగ్ ఇస్తున్నారు. అవసరాన్ని బట్టి కొందరిని బైండోవర్ సైతం చేస్తున్నారు. బందోబస్తు విధుల్లో ఉండే ప్రతి ఒక్క పోలీస్ తమ చుట్టూ ఉన్న 25 మీటర్ల మేర కన్నేసి ఉంచుతారు. అక్కడ ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తూ స్మార్ట్ ఫోన్లలో ఉన్న ‘టీఎస్ కాప్’ యాప్ ద్వారా వీడియోలు తీస్తూ అప్లోడ్ చేస్తుంటారు. ఎవరికైనా అనుమానిత వ్యక్తులు తారసపడితే వెంటనే వారి ఫొటోలతో పాటు వివరాలు పోలీసులకు తెలపాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ఉన్నతాధికారులు హామీ ఇచ్చారు. సర్వం సిద్ధం... సుల్తాన్‌బజార్: హనుమాన్ జయంతి సందర్భంగా విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ), బజరంగ్‌దళ్‌ల సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించనున్న వీర హనుమాన్ విజయ యాత్రకు సర్వం సిద్ధం చేశామని బజరంగ్దళ్ రాష్ట్ర కన్వీనర్ సుభాశ్‌చందర్ తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని శోభాయాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈసారి రెండు లక్షల బైకులతో ర్యాలీ నిర్వహించాలని బజరంగ్దళ్ నాయకులు నిర్ణయించారు. శుక్రవారం ఉదయం 11గంటలకు కోఠి ఆంధ్రాబ్యాంక్ చౌరస్తాలో వేలాది మంది సామూహిక హనుమాన్ జయంతి పారాయణం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వీహెచ్‌పీ అంతర్జాతీయ అధ్యక్షుడు అలోక్‌కుమార్, కేంద్రీయ సంఘటన ప్రధాన కార్యదర్శి వినాయక్‌రావు దేశ్‌పాండే హాజరు కానున్నారు. విజయ యాత్ర ఉదయం 10గంటలకు గౌలిగూడ రామ్‌మందిర్ నుంచి ప్రారంభమై తాడ్‌బండ్ హనుమాన్ ఆలయం వరకు కొనసాగుతుంది. ట్రాఫిక్ ఆంక్షలు ఇలా... హనుమాన్ జయంతి సందర్భంగా కొన్ని సంస్థలు, సంఘాలు శోభాయాత్ర నిర్వహించనున్నాయి. ఈ నేపథ్యంలో నగరంలోని కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ సీపీ ఉత్తర్వులు జారీ చేశారు. గౌలిగూడ రామ్‌మందిర్ నుంచి ప్రారంభమయ్యే శోభాయాత్ర పుత్లిబౌలి చౌరస్తా, ఆంధ్రాబ్యాంక్ చౌరస్తా, డీఎం అండ్ హెచ్ఎస్ సర్కిల్, రామ్‌కోఠి చౌరస్తా, కాచిగూడ జంక్షన్, వైఎంసీఏ నారాయణగూడ, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, గాంధీనగర్, కవాడీగూడ, బైబిల్ హౌస్, ఎంజీ రోడ్, బాలంరాయ్ మీదుగా తాడ్‌బండ్ హనుమాన్ టెంపుల్ వరకు సాగనుంది. ఈ మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ స్థితిగతుల నేపథ్యంలో వాహనచోదకులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని కమిషనర్ సూచించారు. మరోపక్క ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ నుంచి ముషీరాబాద్ చౌరస్తా వైపు ఎలాంటి వాహ నాలను అనుమతించరు. అవసరమైన పక్షంలో ఆర్టీసీ బస్సులను కూడా దారి మళ్లిస్తారు. ♦ అదనపు సీపీలు షికాగోయల్ (క్రైమ్), అనిల్‌కుమార్ (ట్రాఫిక్), డీఎస్ చౌహాన్ (శాంతిభద్రతలు)లు చార్మినార్, సిద్ధి అంబర్‌బజార్ మసీదు, సెంట్రల్‌జోన్ ప్రాంతాలతో పాటు కీలక అంశాలకు నేతృత్వం వహిస్తారు. ♦ శోభాయాత్ర ఊరేగింపు ప్రారంభంలో అదనపు సీపీ ఎం.శివప్రసాద్, ముగింపులో అదనపు సీపీ టి.మురళీకృష్ణ ఉండనున్నారు. ♦ ఐదు జోన్లకు చెందిన టాస్క్‌ఫోర్స్ టీమ్స్ ఊరేగింపు ఆద్యంతం బందోబస్తు నిర్వహించనున్నాయి. ♦ పోకిరీలకు చెక్ చెప్పడానికి షీ–టీమ్స్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ♦ శుక్రవారం ఉదయం 6గంటల నుంచి శనివారం ఉదయం 6గంటల వరకు నగరంలో మద్యం విక్రయాలపై ఆంక్షలు విధించారు. ♦ కమ్యూనికేషన్ పరికరాలు, బైనాక్యూలర్లతో ఎత్తైన భవనాలపై రూఫ్ టాప్ వాచ్ బృందాలు ఏర్పాటు చేస్తున్నారు. -
'శోభా'యమానం
అబిడ్స్/జియాగూడ: శ్రీరామ నవమి శోభాయాత్ర ఆదివారం వైభవంగా జరిగింది. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వీధుల్లో కాషాయ జెండాలు రెపరెపలాడాయి. యాత్రలో ప్రదర్శించిన వివిధ దేవతామూర్తుల విగ్రహాలు ఆకట్టుకున్నాయి. భాగ్యనగర్ శ్రీరామ నవమి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో సీతారాంబాగ్ ఆలయంలో ముందుగా పూజలు నిర్వహించి శోభాయాత్రను ప్రారంభించారు. సమితి నాయకుడు డాక్టర్ భగవంతరావు ఆధ్వర్యంలో శోభాయాత్రను కనుల పండువగానిర్వహించారు. మరోవైపు ఎమ్మెల్యే రాజాసింగ్ లోథా ఆధ్వర్యంలో ధూల్‌పేట గంగాబౌలిలో సీతారాముల దర్బార్‌కు పూజలు నిర్వహించి శోభాయాత్రను ప్రారంభించారు. ప్రత్యేక బ్యాండ్ మేళాలు, డీజేలు, యువత ఆటాపాటలతో శోభాయాత్ర ఆద్యంతం ఆకట్టుకుంది. సీతారాంబాగ్, గంగాబౌలి నుంచి ప్రారంభమైన ఈ శోభాయాత్రలు మంగళ్‌హాట్ ప్రధాన రోడ్డులో కలిశాయి. జాలిహనుమాన్, పురానాపూల్, జుమ్మెరాత్‌బజార్, చుడీబజార్, బేగంబజార్, ఛత్రి, సిద్ధిఅంబర్‌బజార్, గౌలిగూడ, కోఠి, సుల్తాన్‌బజార్ మీదుగా హనుమాన్ వ్యాయమశాల వరకు శోభాయత్ర కొనసాగింది. స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, స్థానిక నేతలు భక్తులకు మజ్జిగ, మంచినీళ్లు, అల్పాహారం పంపిణీ చేశారు. కార్పొరేటర్ శంకర్‌యాదవ్, బీజేపీ, సంఘ్ పరివార్ నేతలు బంగారు సుధీర్‌కుమార్, మహేందర్ వ్యాస్, యమన్‌సింగ్, టీఆర్ఎస్ నేత గోవింద్‌రాఠి, వీహెచ్‌పీ రాష్ట్ర అధ్యక్షుడు రామరాజు, బీజేపీ గ్రేటర్ మహిళా అధ్యక్షురాలు బండారి రాధిక తదితరులు పాల్గొన్నారు. భక్తుల రద్దీ.. భారీ బందోబస్తు శోభాయాత్ర మార్గంలో భక్తులు కిక్కిరిసిపోయారు. భక్తులు పెద్ద ఎత్తున తరలి రావడంతో బేగంబజార్, ధూల్‌పేట్, మంగళ్‌హాట్ ప్రాంతాల్లోని వీధుల్లో రద్దీ నెలకొంది. కాషాయ జెండాలు చేతబూని యువత సందడి చేశారు. శోభాయాత్రలో ప్రదర్శించిన వివిధ దేవతామూర్తుల విగ్రహాలు ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా భారతమాత, చత్రపతి శివాజీ మహరాజ్, వానరసేన, శ్రీరామ్ మహావిగ్రహం (కన్నులు మూస్తూ తెరుస్తూ ఉండడం విశేషం), సీతారాముల పల్లకి సేవ, రాధాకృష్ణులు, రాణి అవంతిబాయి, హనుమాన్‌పై శ్రీరామ్ రామబాణం తదితర విగ్రహాలు ఆకట్టుకున్నాయి. శోభాయాత్రకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో గోషామహల్ ఏసీపీ నరేందర్‌రెడ్డి, ఇన్స్పెక్టర్లు రణవీర్రెడ్డి, చాంద్‌పాషా, శంకర్ బందోబస్తును పర్యవేక్షించారు. జై అనాల్సిందే.. ఈ దేశంలో ఉండే ప్రతి ఒక్కరూ భారతమాతకు జై అనాలని, లేని పక్షంలో ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ లోథా అన్నారు. శోభాయాత్రలో భాగంగా బేగంబజార్‌లో ఆయన భక్తులను ఉద్దేశించి మాట్లాడారు. ‘భారత్‌మాతాకీ జై’ అంటూ యువత నినదించాలన్నారు. జాతీయ భావాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. హిందూ మనోభావాలను పెంపొందించేందుకు తన జీవితాంతం కృషి చేస్తానన్నారు. ఐక్యంగా మెలగాలి.. హిందువులు ఐక్యంగా ఉంటూ హిందూ ధర్మాన్ని దశదిశలా చాటాలని ప్రముఖ ఆధ్యాత్మిక గురువు జితేంద్రా ఆనంద్ సరస్వతి పిలుపునిచ్చారు. బేగంబజార్‌లో ఆయన మాట్లాడుతూ... హిందూ ధర్మ పరిరక్షణకు హిందువులు నడుం బిగించాల్సిన అవసరం ఉందన్నారు. హిందువుల పట్ల చూపుతున్న వివక్షను ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసే వారికి తగిన బుద్ధి చెప్పాలన్నారు. -
పాతబస్తీలో ప్రారంభమైన శోభాయాత్ర!
సాక్షి, హైదరాబాద్ : శ్రీరామనవమి సందర్భంగా సీతారామ్ బాగ్, రాణి అవంతీబాయ్ ఆలయం నుంచి శ్రీ సీతారాముల శోభయాత్ర ఆదివారం ఉదయం ప్రారంభమైంది. గౌలిగూడలోని హనుమాన్ వ్యాయామశాల వరకు సాగనున్న ఈ శోభయాత్రలో శ్రీరామ ఉత్సవ సమితి, భజరంగ్‌దళ్ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. పురాన్‌పూల్, గౌలీగూడ, సుల్తాన్ బజార్ మీదుగా సాగే ఈ యాత్రలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశారు. సున్నితమైన ప్రాంతాల్లో అదనపు బలగాలను వినియోగిస్తున్నారు. సుమారు ఐదువేల మంది పోలీసులు విధుల్లో పాల్గొంటున్నారు. శోభాయాత్రలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ అధికారులను ఆదేశించారు. మరోవైపు ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం ఆరు గంటల వరకూ మద్యం దుకాణాలను సైతం మూసివేయించారు. శోభాయాత్రలో సుమారు లక్షన్నర మంది భక్తులు పాల్గొంటారని అంచనా వేస్తున్నారు. ప్రముఖ ఆలయాలు, సమస్యాత్మక ప్రాంతాల్లో 24 గంటలు పనిచేసే కంట్రోల్‌రూంలను ఏర్పాటును చేశారు. అదనపు కమిషనర్ షిఖా గోయల్ ఆధ్వర్యంలో అదనపు డీసీపీలు-3, డీఎస్పీలు-4, ఇన్స్పెక్టర్లు-28, ఎస్సైలు-38, హెడ్‌కానిస్టేబుళ్లు-46, కానిస్టేబుళ్లు-86, అదనపు బలగాలు ప్లాటూన్-13, టీయర్‌గ్యాస్ స్క్వాడ్స్-2 బందోబస్తులో విధులు నిర్వహిస్తున్నారు. యాత్ర జరిగే ప్రాంతంలో సీసీటీవీ కెమెరాలతో నిఘా పెట్టారు. -
5.51 గంటల్లో ఖైరతాబాద్ మహా గణేశ్‌కు బైబై..
ఖెరతాబాద్: ఖైరతాబాద్ మహా గణపతికి అశేష భక్తజనం తుది వీడ్కోలు పలికింది. ఆదివారం ఉదయం వేలాది మంది భక్తులు వెంట రాగా ఉదయం 7.05 గంటలకు మండపం నుంచి బయలుదేరిన శ్రీ సప్తముఖ కాలసర్ప మహాగణపతి హుస్సేన్‌సాగర్ ఎన్టీఆర్ మార్గ్‌లో క్రేన్ నంబర్ 6 వద్ద మధ్యాహ్నం 12.56 గంటలకు గంగ ఒడికి చేరాడు. 5.51 గంటల పాటు సాగిన శోభాయత్రకు సందర్శకులు, ప్రముఖులు రాకతో సాగర్ ప్రాంగణం కిక్కిరిసింది. యాత్రలో ముందు వినాయకుడి విగ్రహం, వెనుక శ్రీనివాస కల్యాణం సాగాయి. దారిపొడవునా నృత్యాలు, భజనల సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. పోలీసుల ప్రత్యేక చొరవతో నిమజ్జనం గతేడాదితో పొలిస్తే గంట ముందుగానే ప్రశాంతంగా ముగిసింది. రెండున్నర గంటలపాటు బ్రేక్.. ఉదయం 10.20కు సాగర్‌లోని క్రేన్ నంబర్ 4 వద్దకు చేరుకున్న వినాయకుడిని 40 నిమిషాల పాటు అక్కడే నిలిపారు. అదే సమయంలో అన్ని క్రేన్ల వద్ద ఉన్న పోలీసు సిబ్బంది బడా గణేశ్డిని నిమజ్జనం చేసే క్రేన్ నంబర్ 6 వద్దకు రమ్మని పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ఆదేశాలు వెలువడ్డాయి. దీంతో మిగతా క్రేన్ల వద్ద నిమజ్జనాలను నిలిపివేశారు. భక్తుల సంఖ్య పెరగడంతో చంటిపిల్లలు ఇబ్బందులు పడ్డారు. మహాగణపతి నిమజ్జన యాత్ర ఇలా.. ⇔ శనివారం రాత్రి 11 గంటలకు భక్తుల దర్శనం నిలిపివేత ⇔ అర్ధరాత్రి 12 గంటలకు మహాగణపతికి వెల్డింగ్ పనులు ప్రారంభం ⇔ 12.50కు ప్రాంగణంలోకి చేరుకున్న క్రేన్ ⇔ 12.55కు ఉత్సవ కమిటీ కలశ పూజ ⇔ 1.46–2.05 గంటల మధ్య మహాగణపతి ప్రాంగణంలోని శ్రీనివాస కల్యాణం మండపాన్ని క్రేన్ సాయంతో వాహనంపై ఉంచారు. ⇔ 3.20కు భారీ విగ్రహాన్ని తాళ్ల సాయంతో పైకెత్తారు ⇔ 3.30కు శిల్పి చిన్నస్వామి రాజేంద్రన్ చివరి పూజ ⇔ 3.40కి ట్రాలర్‌పై మహాగణపతి విగ్రహ ⇔ ఆదివారం ఉదయం 7.05కు ఖైరతాబాద్ నుంచి శోభాయాత్ర ప్రారంభం ⇔ 8.15కు సెన్సేషన్ థియేటర్ వద్దకు ⇔ 8.35కు రాజ్‌దూత్ చౌరస్తా.. ⇔ 8.48కు టెలిఫోన్ భవన్, 9.05కు ఎక్బాల్ మినార్ చౌరస్తా ⇔ 9.24 సచివాలయం ఓల్డ్‌గేట్ ⇔ 10 గంటలకు తెలుగుతల్లి చౌరస్తాకు మహాగణపతి చేరుకోగానే భారీగా తరలివచ్చిన భక్తులు ⇔ 10.15కు లుంబినీ పార్కు వద్దకు యాత్ర ⇔ 10.20– 11.10 వరకు మహాగణపతి క్రేన్ నెం–4వద్దే దాదాపు 40 నిమిషాలు నిలిపివేశారు. ఈ సమయంలో భక్తుల తాకిడి పెరిగింది. ⇔ 11.25కి ఎన్టీఆర్ మార్గ్ క్రేన్ నెం–6 వద్దకు చేరుకున్న విగ్రహం ⇔ 11.42కు మహాగణపతికి తుది పూజలు ప్రారంభం. తాజా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిషోర్, సీపీ అంజనీకుమార్, మాజీ చింతల రామచంద్రారెడ్డి, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు భగవంతరావు, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు సింగరి సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు. ⇔ 12.35కు కలశ పూజ, భక్తులకు మంత్ర జలం.. ⇔ 12.56కు మహాగణపతి సాగర్ నిమజ్జనం. ట్రాలర్‌కు అందంగా అలంకరణ మహాగణపతి నిమజ్జనానికి తరలించే ఎస్టీసీ ట్రాలర్ వాహనాన్ని ఆదివారం తెల్లవారు జామున కొబ్బరాకులు, అరటి చెట్లు, మామిడి తోరణాలు, బంతిపూలతో అందంగా అలంకరించారు. ఉత్సవ కమిటీ సభ్యులు ఏకరూప దుస్తుల్లో నిమజ్జన ఊరేగింపులో పాల్గొన్నారు. హైడ్రాలిక్ క్రేన్ సాయంతో నిమజ్జనం ఖైరతాబాద్: శ్రీ సప్తముఖ కాలసర్ప మహాగణపతిని నిమజ్జనం చేసేందుకు ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఆధునిక జర్మన్ టెక్నాలజీతో తయారు చేసిన మోడ్రన్ క్రేన్‌ను వినియోగించారు. గతేడాది రవి క్రేన్స్‌కు చెందిన క్రేన్‌తో నిమజ్జనం చేశారు. అయితే నిమజ్జన సమయంలో పలు సాంకేతిక సమస్యలు తలెత్తాయి. ఈ ఏడాది రవి క్రేన్స్ రాకపోవడంతో హైడ్రాలిక్ ఆధునిక రిమోట్ కంట్రోల్ టెక్నాలజీ క్రేన్‌తో నిమజ్జనం చేశారు. హైడ్రాలిక్ మోడ్రన్ క్రేన్.. తడానో కంపెనీ తయారు చేసిన మోడ్రన్ క్రేన్ హైడ్రాలిక్ రిమోట్ కంట్రోల్ టెక్నాలజీతో పనిచేస్తుంది. ఇది 400 టన్నుల బరువును అవలీలగా పైకెత్తుతుంది. దీని జాక్ 60 మీటర్ల పైకి లేస్తుంది. 14 మీటర్ల పొడవు, 4 మీటర్ల వెడల్పు ఉండే క్రేన్‌కు 12 టైర్లు ఉంటాయి. ఒక్కో టైర్ టన్ను బరువుంది. 45 టన్నులున్న మహాగణపతిని సునాయాసంగా సాగర్‌లో నిమజ్జనం చేశారు. సంతోషంగా ఉంది.. దేశంలోనే ప్రఖ్యాతి గాంచిన ఖైరతాబాద్ మహాగణపతిని నిమజ్జనం చేసే భాగ్యం దక్కినందుకు ఆనందంగా ఉంది. తొలిసారి ఈ క్రతువులో పాలుపంచుకున్నా. క్రేన్ ఆపరేటింగ్‌లో పదేళ్ల అనుభవం ఉంది. ఈ హైడ్రాలిక్ క్రేన్‌ను రెండేళ్ల నుంచి ఆపరేట్ చేస్తున్నా. – దేవేందర్ సింగ్, పంజాబ్ -
వెళ్ళిరావయ్య బొజ్జగణపయ్య
-
రారండోయ్ వేడుక చూద్దాం!
సాక్షి, సిటీబ్యూరో: మహానగరంలో అతిపెద్ద సామూహిక వేడుక వినాయక శోభాయాత్రకు సర్వం సిద్ధమైంది. నిమజ్జనానికి అవసరమైన అన్ని ఏర్పాట్లను ప్రభుత్వ యంత్రాంగం పూర్తి చేసింది. ఆదివారం నగరం నలువైపుల నుంచి వైభవంగా ప్రారంభం కానున్న గణనాథుడి శోభాయాత్రలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో కార్యాచరణ చేపట్టాయి. పోలీసులు పటిష్టమైన భద్రత కల్పిస్తున్నారు. లక్షలాది మంది భక్తజనం వేడుకలకు తరలిరానున్న దృష్ట్యా అడుగడుగునా నిఘా కెమెరాలను ఏర్పాటు చేశారు. ట్యాంక్‌బండ్ చుట్టూ సుమారు 30 వేల మంది పోలీసు బలగాలతో భద్రతను కట్టుదిట్టం చేశారు. జీహెచ్ఎంసీ, జలమండలి, విద్యుత్, వైద్య, ఆరోగ్యశాఖలు రంగంలోకి దిగాయి. ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. ట్యాంక్‌బండ్, ఎన్టీఆర్ మార్గంలో నిమజ్జన వేడుకలు ముగిసి, భక్తులు తిరిగి ఇళ్లకు వెళ్లేవరకు ఈ బస్సులు అందుబాటులో ఉంటాయి. అలాగే నగరంలోని వివిధ మార్గాల్లో ప్రతిరోజు నడిచే 121 ఎంఎంటీఎస్ సర్వీసులతో పాటు, అదనపు సర్వీసులను దక్షిణమధ్య రైల్వే నడపనుంది. రద్దీకి అనుగుణంగా రైళ్ల సంఖ్యను పెంచనున్నట్లు హైదరాబాద్ మెట్రో రైల్ అధికారులు తెలిపారు. వేడుకలకు తరలివచ్చే భక్తుల కోసం జలమండలి 30 లక్షల మంచినీటి ప్యాకెట్లను సరఫరా చేయనుంది. ఆరోగ్య అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు వైద్య, ఆరోగ్యశాఖ ట్యాంక్‌బండ్, ఎన్టీఆర్‌మార్గ్‌లో, నగరంలోని ఇతర ప్రాంతాల్లో 27 వైద్య శిబిరాలను ఏర్పాటు చేసింది. అలాగే 108 అంబులెన్సులను 15 సిద్ధంగా ఉంచారు. విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా విద్యుత్‌శాఖ పటిష్టమైన చర్యలు చేపట్టింది. నిమజ్జనం సందర్భంగా ఎలాంటి పరిస్థితినయినా అయినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయా శాఖల అధికారులు తెలిపారు. మరోవైపు గతేడాది నిర్వహించినట్లుగానే ఈసారి కూడా ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జన యాత్ర ఆదివారం ఉదయం 7 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం ఒంటిగంట లోగా ముగియనుంది. ట్యాంక్‌బండ్‌తో పాటు నగరంలోని 35 చెరువుల్లో నిమజ్జనం ఏర్పాట్లకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేపట్టారు. 117 స్థిరమైన క్రేన్లు, మరో 96 మొబైల్ క్రేన్లను ఆయా ప్రాంతాల్లో ఉంచారు. పక్కాగా పారిశుధ్య నిర్వహణ నిమజ్జనం సందర్భంగా పేరుకుపోయే చెత్తను ఎప్పటికప్పుడు తొలగించేందుకు, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు జీహెచ్ఎంసీ ప్రత్యేక యాక్షన్ టీంలను రంగంలోకి దింపింది. రూ.16.86 కోట్ల వ్యయంతో అన్ని సౌకర్యాలు కల్పించినట్టు జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిశోర్ తెలిపారు. శోభాయాత్ర జరిగే 370 కిలోమీటర్ల మార్గంలో ప్రతి 3 కిలోమీటర్లకు ఓ యాక్షన్ టీమ్ ఉంటుంది. ఈ బృందంలో ఓ శానిటరీ సూపర్వైజర్ లేదా శానిటరీ జవాన్, ముగ్గురు ఎస్ఎఫ్ఏలు, 21 మంది పారిశుధ్య కార్మికులు మూడు షిఫ్ట్‌ల్లో పనిచేస్తారు. మొత్తం 178 గణేశ్ యాక్షన్ టీమ్‌లను రంగంలోకి దింపారు. పారిశుధ్య కార్యక్రమాలకు మొత్తం 481 మంది సూపర్వైజర్లు, 719 ఎస్ఎఫ్ఏలు, 8,597 కార్మికులు పనిచేస్తారు. ట్యాంక్‌బండ్‌తో పాటు, సరూర్‌నగర్, సఫిల్‌గూడ, మీరాలంట్యాంక్ తదితర అన్ని నిమజ్జన ప్రాంతాల వద్దా 27 ప్రత్యేక వైద్య శిబిరాలను, 92 మొబైల్ టాయిలెట్లను ఏర్పాటు చేశారు. ⇔ జీహెచ్ఎంసీ నిర్మించిన 20 గణేశ్ నిమజ్జన కొలనుల్లో శుభ్రమైన నీటిని నింపి సిద్ధంగా ఉంచారు. ⇔ విద్యుత్ విభాగం రూ.94. 21 లక్షల వ్యయంతో 34,926 తాత్కాలిక లైట్లు ఏర్పాటు చేశారు. హుస్సేన్‌సాగర్ చుట్టూ 48 విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను, సరూర్‌నగర్ చెరువు వద్ద 5 ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేశారు. నిరంతర విద్యుత్ సరఫరా కోసం నగరంలోని అన్ని నిమజ్జన ప్రాంతాల్లో మొత్తం 101 ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేశారు. 75 జనరేటర్లను అందుబాటులో ఉంచారు. ⇔ రోడ్లు భవనాల శాఖ ద్వారా 12 కిలోమీటర్ల మేర బారికేడింగ్ చేశారు. ⇔ శోభాయాత్ర మార్గంలో 15 కేంద్రాల్లో వాటర్ ప్రూఫ్ టెంట్లను వేశారు. 38 ఫైర్ ఇంజన్లను మోహరించారు. ⇔ సరూర్‌నగర్, కాప్రా, ప్రగతినగర్ చెరువుల వద్ద ప్రత్యేకంగా 3 బోట్లను అందుబాటులో ఉంచారు. ⇔ ట్యాంక్‌బండ్, సరూర్‌నగర్ చెరువుల వద్ద కేంద్ర విపత్తు నివారణ దళాలు మోహరించాయి. ⇔ పర్యాటక శాఖ హుసేన్ సాగర్ చెరువులో 7 బోట్లను సిద్ధం చేసింది. మరో 4 హైస్పీడ్ బోట్లు కూడా అందుబాటులో ఉంటాయి. 10 మంది గజ ఈతగాళ్లను రంగంలోకి దించారు. ఎంఎంటీఎస్ ప్రత్యేక రైళ్లు ఆదివారం రాత్రి 10.30 నుంచి సోమవారం ఉదయం 5 గంటల వరకు ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా 8 ఎంఎంటీఎస్ రైళ్లను అదనంగా నడిపేందుకు దక్షిణమధ్య రైల్వే చర్యలు చేపట్టింది. సికింద్రాబాద్–లింగంపల్లి, నాంపల్లి–లింగంపల్లి, ఫలక్‌నుమా–సికింద్రాబాద్, ఫలక్‌నుమా–లింగంపల్లి, తదితర మార్గాల్లో ఈ ప్రత్యేక రైళ్లు నడుస్తాయి. 550 ప్రత్యేక బస్సులు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ట్యాంక్‌బండ్ వద్దకు చేరుకునేందుకు 550 బస్సులను అదనంగా తిప్పనున్నారు. సికింద్రాబాద్, ఉప్పల్, కాచిగూడ, కూకట్పల్లి, లింగంపల్లి, బాలానగర్, జీడిమెట్ల, మెహదీపట్నం, తదితర ప్రాంతాల నుంచి ఇందిరాపార్కు, లక్డీకాపూల్, ఖైరతాబాద్, బషీర్‌బాగ్ వరకు ఈ బస్సులు రాకపోకలు సాగిస్తాయి. నిఘా నీడలో నిమజ్జనం గణేశ్ నిమజ్జనం ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఈ మూడు కమిషనరేట్లలోని కమాండ్ కంట్రోల్ సెంటర్లు డీజీపీ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానించారు. ముఖ్యంగా దాదాపు మూడువేలకు పైగా సీసీటీవీ కెమెరాలు అనుసంధానం చేసిన హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా ఉన్నతాధికారులు నిమజ్జనయాత్రను పరిశీలించనున్నారు. బాలాపూర్ నుంచి హుస్సేన్‌సాగర్ వరకు శోభాయాత్ర దృశ్యాలను 450 సీసీటీవీ కెమెరాలు బంధించనున్నాయి. హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం కోసం ఏర్పాటు చేసిన 38 క్రేన్లకు ప్రత్యేక కెమెరాలు అమర్చారు. ట్యాంక్‌బండ్, నెక్లెస్‌రోడ్డులో 90 సీసీటీవీ కెమెరాలు భక్తులు, గణనాథుల కదలికలను బంధించనున్నాయి. అలాగే నగరంలో గూగుల్ ద్వారా ట్రాఫిక్ అలర్ట్‌ను అందించనున్నారు. అలాగే ఏ సమయానికి ఏ విగ్రహం నిమజ్జనం చేస్తున్నారో కూడా పొందుపరచడంతో సమయనుగుణంగా నిమజ్జనం జరిగేలా పోలీసులు చూస్తున్నారు. ట్రాఫిక్ మళ్లింపు ఇలా.. 1.సౌత్ జోన్: కేశవగిరి, మొహబూబ్‌నగర్ ఎక్స్‌రోడ్స్, ఇంజిన్‌బౌలి, నాగుల్చింత, హిమ్మత్‌పురా, హరిబౌలి, ఆశ్ర హాస్పిటల్, మొఘల్‌పురా, లక్కడ్‌కోటి, మదీనా చౌరస్తా, ఎంజే బ్రిడ్జ్,దారుల్షిఫా చౌరస్తా, సిటీ కాలేజ్ 2.ఈస్ట్ జోన్: చంచల్‌గూడ జైల్ చౌరస్తా, ముసారాంబాగ్, చాదర్‌ఘాట్ బ్రిడ్జ్, సాలార్జంగ్ బ్రిడ్జ్, అఫ్జల్‌గంజ్, పుత్లిబౌలి చౌరస్తా, ట్రూప్‌బజార్, జాంబాగ్ చౌరస్తా, కోఠి ఆంధ్రాబ్యాంక్ 3.వెస్ట్ జోన్: టోపిఖానా మాస్క్, అలాస్కా హోటల్ చౌరస్తా, ఉస్మాన్ జంగ్, శంకర్‌బాగ్, శీనా హోటల్, అజంతాగేట్, ఆబ్కారీ లైన్, తాజ్ ఐలాండ్, బర్తన్ బజార్, ఏఆర్ పెట్రోల్ పంప్ 4.సెంట్రల్ జోన్: చాపెల్ రోడ్ ఎంట్రీ, జీపీఓ దగ్గరి గద్వాల్ సెంటర్, షాలిమార్ థియేటర్, గన్‌ఫౌండ్రీ, స్కైలైన్ రోడ్ ఎంట్రీ, హిమాయత్‌నగర్ ‘వై’ జంక్షన్, దోమల్‌గూడలోని భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ చౌరస్తా, కంట్రోల్‌రూమ్ దగ్గరి కళాంజలి, లిబర్టీ చౌరస్తా, ఎంసీహెచ్ ఆఫీస్‘వై’ జంక్షన్, బీఆర్కే భవన్, ఇక్బాల్ మినార్, రవీంద్రభారతి, ద్వారకా హోటల్ చౌరస్తా, వీవీ స్టాట్యూ చౌరస్తా, చిల్డ్రన్స్ పార్కు, వైశ్రాయ్ హోటల్ చౌరస్తా, కవాడిగూడ జంక్షన్, కట్టమైసమ్మ టెంపుల్, ఇందిరాపార్కు 5.నార్త్‌జోన్: కర్బాలా మైదాన్, బుద్ధభవన్, సెయిలింగ్ క్లబ్, నల్లగుట్ట చౌరస్తా వైపు నుంచి అప్పర్ ట్యాంక్‌బండ్, నెక్లెస్‌రోడ్‌లోకి ఎలాంటి ట్రాఫిక్‌ను అనుమతించరు. సీటీఓ, వైఎంసీఏ, ప్యారడైజ్ చౌరస్తా, ప్యాట్నీ జంక్షన్, బాటా ‘ఎక్స్’ రోడ్, ఆదివాసీ చౌరస్తా, ఘన్సీమండీ చౌరస్తా మధ్య ఆంక్షలు అమలులో ఉంటాయి. ⇔ మెట్రో రైల్ నిర్మాణ పనుల నేపథ్యంలో ఎస్సార్‌నగర్ వైపు నుంచి వచ్చే వాహనాలను ఎస్సార్‌నగర్ కమ్యూనిటీ హాల్, ఆర్ అండ్ బీ ఆఫీస్, బల్కంపేట, డీకే రోడ్ ఫుడ్ వరల్డ్, సత్యం థియేటర్ జంక్షన్, మాతా టెంపుల్, అమీర్‌పేట మీదుగా పంపిస్తారు. ఎన్టీఆర్ మార్గ్‌లో భారీ క్రేన్లు బంజారాహిల్స్: ఎన్టీఆర్ మార్గ్‌లో మొత్తం 12 క్రేన్లను అందుబాటులో ఉంచినట్టు ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ ముషారఫ్ ఫారుఖి, జీహెచ్ఎంసీ ఖైరతాబాద్ సర్కిల్–17డీఎంసీ సత్యనారాయణ తెలిపారు. శనివారం వారు ఆ ప్రాంతంలో ఏర్పాట్లును పరిశీలించి మాట్లాడారు. ఒక్కో క్రేన్ దగ్గర ఒక ఏఈ, మూడు క్రేన్లకు కలిపి ఒక డీఈ ఇన్చార్జిగా వ్యవహరిస్తారన్నారు. ఇద్దరు ఏఎంహెచ్ఓలు, జోనల్ కమిషనర్, ఇద్దరు డీఎంసీలు 12 మంది అధికారులు విధుల్లో ఉంటారన్నారు. వీరుగాక ఒక్కో క్రేన్ వద్ద షిఫ్ట్‌కు 21 మంది చొప్పున ఎంటమాలజీ, శానిటేషన్ వర్కర్లు వ్యర్థాలు తొలగించేందుకు సిద్ధంగా ఉన్నారు. వీరందరికీ ప్లాస్టిక్ కవర్లు అందజేశారు. చెత్తను తరలించడానికి 15 టిప్పర్లు రేయింబవళ్లు పని చేస్తున్నాయి. ఇక్కడ జీహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్, మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసింది. నాలుగు చోట్ల మొబైల్ టాయ్లెట్లు, రెండు షీ టాయ్లెట్లను అందుబాటులో ఉంచామన్నారు. కాగా, శుక్రవారం ఒక్క రోజే 140 మెట్రిక్ టన్నుల చెత్తను తరలించినట్టు అధికారులు తెలిపారు. -
ఆ క్షణాలను చూసి తట్టుకునే ధైర్యం లేదు
ఖైరతాబాద్: ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్రకుసర్వంసిద్ధమైంది. నిమజ్జన ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఆదివారం ఉదయం 7గంటలకు శోభాయాత్ర ప్రారంభమై... మధ్యాహ్నానికి ఎన్టీఆర్ మార్గ్‌లోని క్రేన్ నెంబర్.6కు చేరుకునేలా అధికారులుఏర్పాట్లు చేస్తున్నారు. ♦ శుక్రవారం రాత్రి 11గంటలకు మహాగణపతి షెడ్డు తొలగింపు పనులు ప్రారంభమయ్యాయి. ♦ ఎస్టీసీ ట్రాన్స్పోర్ట్కు చెందిన ట్రాయిలర్ వాహనం శుక్రవారం ఉదయమే మహాగణపతి ప్రాంగణానికి చేరుకుంది. ♦ మహాగణపతిని దర్శించుకునేందుకు శనివారం మధ్యాహ్నం వరకే భక్తులకు అనుమతిస్తారు. ఆ తర్వాత దూరం నుంచి మాత్రమే చూడాలి. ♦ శనివారం అర్ధరాత్రి 12గంటలకు కలశాన్ని కదిలించి.. మహాగణపతికి క్రేన్ సెట్టింగ్, వెల్డింగ్ పనులు ప్రారంభిస్తారు. ♦ ఆదివారం తెల్లవారుజాము 3–4 గంటల్లోపు వెల్డింగ్ పనులు పూర్తవుతాయి. ♦ ఉదయం 7గంటలకు శోభాయాత్ర ప్రారంభమవుతుంది. ఇదీ రూట్‌మ్యాప్ శోభాయాత్ర సెన్సేషన్ థియేటర్ మీదుగా రాజ్‌దూత్ చౌరస్తా, టెలిఫోన్ భవన్, హోంసైన్స్ కళాశాల, ఎక్బాల్ మినార్ చౌరస్తా, సచివాలయం పాతగేటు, తెలుగుతల్లి చౌరస్తా.. అక్కడి నుంచి ఎడమ వైపునకు మలుపు తిరిగి లుంబినీ పార్క్ మీదుగా ఎన్టీఆర్ మార్గ్‌లోని 6వ నెంబర్ క్రేన్ దగ్గరికి ఉదయం 11గంటల వరకు చేరుకుంటుంది. ఆ తర్వాత పూజలు నిర్వహించి మధ్యాహ్నం 12గంటల్లోపు నిమజ్జనం చేస్తారు. శివాలయానికి శివపార్వతులు... మహాగణపతికి కుడివైపున ఏర్పాటు చేసిన శ్రీనివాస కల్యాణం విగ్రహాన్ని మాత్రమే నిమజ్జనానికి తరలిస్తున్నట్లు ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. ఎడమవైపున ఏర్పాటు చేసిన శివపార్వతుల విగ్రహాన్ని శ్రావ్య గ్రాఫిక్స్‌కు చెందినవారు వరంగల్ ఆలేరులోని ఎనిమిది ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన శివ దేవాలయానికి తీసుకెళ్తున్నారు. ఆరేళ్లుగా ... మహాగణపతిని నిమజ్జనానికి తరలించే ట్రాయిలర్ వాహనం సారథిగా ఎస్టీసీ కంపెనీలో 20ఏళ్లుగా పనిచేస్తున్న భాస్కర్‌రెడ్డి బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. నాగర్‌కర్నూల్‌కు చెందిన భాస్కర్‌రెడ్డి ఆరేళ్లుగా ఖైరతాబాద్ నిమజ్జనానిని రథసారథిగా వ్యవహరిస్తున్నాడు. శోభాయాత్ర ప్రారంభమైన నాలుగు గంటల్లో గణపతిని సాగర తీరానికి చేరుస్తానని ఆయన తెలిపాడు. ఆపరేటర్ జమీల్.. రవి క్రేన్స్ ఆధ్వర్యంలో ప్రతిఏటా మహాగణపతిని ట్రాయిలర్ వాహనంలోకి ఎక్కిస్తున్నారు. తర్వాత తిరిగి అందులో నుంచి తీసి నిమజ్జనం చేస్తున్నారు. ఈ క్రేన్ ఆపరేటర్‌గా మహ్మద్ జమీల్ పనిచేస్తున్నాడు. మహాగణపతికి సేవ చేసే భాగ్యం లభించడం తనకెంతో సంతోషాన్నిస్తోందని ఆయన పేర్కొన్నాడు. హెవీ మొబైల్ క్రేన్... మహాగణపతి నిమజ్జనంలో భాగంగా గత 13ఏళ్లుగా రవిక్రేన్స్‌కు చెందిన హైడ్రాలిక్ టెలిస్కోప్ హెవీ మొబైల్ క్రేన్‌ను వినియోగిస్తున్నారు. జర్మనీకి చెందిన ఈ క్రేన్ బరువు 110 టన్నులు. 150 టన్నుల బరువును అవలీలగా పైకి లేపుతుంది. క్రేన్ జాక్ 50 మీటర్ల పైకి వెళ్తుంది. వెడల్పు 11 ఫీట్లు, పొడవు 60 ఫీట్లు ఉంటుంది. దీనికి 12 టైర్లు ఉంటాయి. ఒక్కో టైరు ఒక టన్ను బరువు 2 మీటర్ల ఎత్తు ఉంటుంది. దీనికి 4 హైడ్రాలిక్ జాక్‌లు ఉంటాయి. 40 టన్నుల బరువున్న ఖైరతాబాద్ వినాయకుడిని క్రేన్ అవలీలగా వాహనంలోకి ఎక్కిస్తుందని ఎండీ కేవీ రావు తెలిపారు. ట్రాయిలర్ వాహనం... గత ఏడేళ్లుగా మహాగణపతి శోభాయాత్రకు వినియోగిస్తున్న ట్రాయిలర్ వాహనం (ఏపీ16 టీడీ 4059) సామర్థ్యం 100 టన్నులు. 70 అడుగుల పొడవు, 12 అడుగుల వెడల్పు ఉండే ఈ వాహనానికి 26 టైర్లు ఉంటాయి. దాదాపు 40 టన్నుల బరువుండే మహాగణపతిని ఈ వాహనం నిమజ్జనానికి తరలిస్తుందని ఎస్టీసీ ట్రాన్స్పోర్ట్ ఇన్చార్జి శరత్‌కుమార్ తెలిపారు. దిశానిర్దేశం నాగరాజు... శోభాయాత్ర ముందు నడుస్తూ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కు చెందిన నాగరాజు డ్రైవర్‌కు దిశానిర్దేశం చేస్తాడు. ఇతని సూచనల మేరకు వాహనం ముందుకు సాగుతుంది. గత 15ఏళ్లుగా నాగరాజు సేవలందిస్తున్నాడు. ఆ క్షణంలో శిల్పి ఉండరు... 35 ఏళ్లుగా ఖైరతాబాద్ మహాగణపతిని అద్భుతంగా తయారు చేస్తున్న శిల్పి చిన్నస్వామి రాజేంద్రన్ నిమజ్జన యాత్రలో పాలుపంచుకోరు. తాను తీర్చిదిద్దన అద్భుత రూపం సాగరంలో కరిగిపోయే ఆ క్షణాలను చూసి తట్టుకునే ధైర్యం లేకే నిమజ్జనానికి ఉండనని చెప్పారు రాజేంద్రన్. -
12వేలమంది పోలీసులు, 500 సీసీ కెమెరాలతో నిఘా
హైదరాబాద్ : శ్రీరామ నవమి శోభాయాత్ర ప్రశాంతంగా కొనసాగుతోందని సీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా 12వేల మంది పోలీస్ సిబ్బందితో గట్టి భద్రత ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. నగరంలో 200లకు పైగా శోభాయాత్రలు కొనసాగుతున్నాయని, వందల సంఖ్యలో సీసీ కెమెరాలను అడుగడుగునా ఏర్పాటు చేశామన్నారు. టాస్క్‌ఫోర్స్, ఇంటెలిజెన్స్, షీ టీమ్స్, టీఎస్పీఎస్ బలగాలు, అన్ని శాఖల సమన్వయంతో ప్రశాంతమైన వాతావరణంలో కొనసాగుతున్నామని సీపీ పేర్కొన్నారు. రాత్రి ఏడు గంటల లోపు శోభాయాత్ర ముగుస్తుందని ఆయన తెలిపారు. మరోవైపు భాగ్యనగర్ శ్రీరామనవమి సమితి ఆధ్వర్యంలో సీతారాంబాగ్ ఆలయం నుంచి శోభాయాత్ర ప్రారంభమైంది. బోయిగూడ కమాన్, పురానాపూల్, బేగంబజార్ మీదగా హనుమాన్ టెకిడీకి చేరుకుంటుంది. రాత్రి హనుమాన్ టెకిడీలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. -
శ్రీరామనవమి శోభాయాత్రకి భారీ భద్రత