హైదరాబాద్ : శ్రీరామ నవమి శోభాయాత్ర ప్రశాంతంగా కొనసాగుతోందని సీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా 12వేల మంది పోలీస్ సిబ్బందితో గట్టి భద్రత ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. నగరంలో 200లకు పైగా శోభాయాత్రలు కొనసాగుతున్నాయని, వందల సంఖ్యలో సీసీ కెమెరాలను అడుగడుగునా ఏర్పాటు చేశామన్నారు. టాస్క్‌ఫోర్స్, ఇంటెలిజెన్స్, షీ టీమ్స్, టీఎస్‌పీఎస్ బలగాలు, అన్ని శాఖల సమన్వయంతో ప్రశాంతమైన వాతావరణంలో కొనసాగుతున్నామని సీపీ పేర్కొన్నారు. రాత్రి ఏడు గంటల లోపు శోభాయాత్ర ముగుస్తుందని ఆయన తెలిపారు.
మరోవైపు భాగ్యనగర్ శ్రీరామనవమి సమితి ఆధ్వర్యంలో సీతారాంబాగ్ ఆలయం నుంచి శోభాయాత్ర ప్రారంభమైంది. బోయిగూడ కమాన్, పురానాపూల్, బేగంబజార్ మీదగా హనుమాన్ టెకిడీకి చేరుకుంటుంది. రాత్రి హనుమాన్ టెకిడీలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు.
ప్రశాంతంగా కొనసాగుతున్న శోభాయత్ర
Published Wed, Apr 5 2017 3:11 PM | Last Updated on Tue, Sep 5 2017 8:01 AM
Advertisement
Advertisement